Bouncer
-
రాజధానిలో పెరిగిపోయిన బౌన్సర్ల సంస్కృతి
ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 115 (2), లాఠీలు, కర్రలు వినియోగించి దాడి చేస్తే 118 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామంటున్నారు. సాక్షి, హైదరాబాద్: పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న జల్పల్లిలోని ‘మంచు టౌన్’ కేంద్రంగా ఇటీవల జరిగిన భారీ హంగామాకు ఓ రకంగా బౌన్సర్లే కారణమయ్యారు. కేవలం ఈ ఒక్క ఉదంతంలోనే కాదు... దాదాపు ప్రతి చోటా ‘పెద్దల’ వెనక బౌన్సర్లు కామన్ అయ్యారు. ఇటీవల కాలంలో కొందరు లేడీ బౌన్సర్లు కూడా తెరపైకి వస్తున్నారు. తమ వారి రక్షణ పేరుతో వీళ్లు చేసే హడావుడి, దౌర్జన్యాలు వీధి రౌడీలకు తీసిపోకుండా ఉంటున్నాయి. అత్యధిక బౌన్సర్లు జిమ్‌ల ద్వారా రిక్రూట్ అవుతుండటంతో 2005 నాటి ది ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ (రెగ్యులరేషన్) యాక్ట్‌లోని (పస్రా) నిబంధనలు వీరికి పట్టట్లేదు. తమకు అనుకూలంగా మార్చుకుని.. ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ప్రీమియర్ షోలు, ప్రారం¿ోత్సవాలతో సహా సినీ తారలతో ముడిపడి ఉన్న కార్యక్రమాలు, సభలు, సమావేశాలతో పాటు భారీ సంస్థల ఈవెంట్లకు నిర్వాహకులు పోలీసుల నుంచి అనుమతి తీసుకుంటూ ఉంటారు. ఎలాంటి టికెట్లు లేకుండా చేసే కార్యక్రమాలను పోలీసు విభాగమే భద్రత ఏర్పాటు చేస్తుంది. టికెట్లు విక్రయించే కార్యక్రమాలతో పాటు మరికొన్నింటికి నిరీ్ణత మొత్తం వసూలు చేస్తుంది. దీనికి తోడు పోలీసు విభాగంలో ఉన్న సిబ్బంది కొరత నేపథ్యంలో ఆయా సందర్భాల్లో అధికారులు అవసమైన స్థాయిలో ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలంటూ షరతు విధిస్తుంది. ఈ మాటను అడ్డం పెట్టుకుని బౌన్సర్లు, సెక్యూరిటీ గార్డులు, వ్యక్తిగత అంగరక్షకుల పేరుతో వీళ్లు చేసే జులుం అంతా ఇంతా కాదు. భద్రత పేరుతో ఈ గార్డులు బలప్రయోగం చేస్తుంటారు. చట్టప్రకారం ఇది నేరమే అంటున్న పోలీసులు బాధితులు ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.ఫిర్యాదు చేస్తే కేసులు.. భద్రత కల్పించడానికి, ప్రజలకు అదుపులో పెట్టడానికి బౌన్సర్లు, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను యాజమాన్యాలు, వ్యక్తులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా విధుల్లోకి వస్తున్న గార్డులు అనేక సందర్భాల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కార్యక్రమాలకు హాజరైన, తమ యజమాని ఆదేశాల మేరకు ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఒక్కోసారి ఏకంగా లాఠీలు చేతపట్టుకుని ఆహూతులపై విరుచుకుపడుతున్నారు. వీఐపీలకు ఉండే పలుకుబడిని దృష్టిలో పెట్టుకునే సామాన్యులు వీటన్నింటినీ మౌనంగా భరిస్తున్నారు. కేవలం అక్కడక్కడ మాత్రమే నిరసన గళం విప్పుతున్నారు. కాగా.. దురుసుగా ప్రవర్తించే అధికారం ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు లేదని పోలీసులు అంటున్నా... ఫిర్యాదు చేస్తే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేస్తున్నారు. బార్లతో మొదలై..బౌన్సర్... ఈ పేరు పబ్స్, బార్స్‌కు తరచు వెళ్లే వారికి సుపరిచితమే. ఈ సంస్కృతి సైతం ముంబైలోని డాన్స్ బార్లలో ప్రారంభమైంది. మితిమీరి ప్రవర్తించే వారిని, హద్దు మీరి మద్యం తాగి గొడవలు చేసేవారిని కట్టడి చేయడానికి శాశ్వత ప్రాతిపదికన యాజమాన్యాలు వీరిని నియమించుకుంటాయి. కండలు తిరిగిన శరీరం, కళ్లల్లో చురుకుతనం, చిరునవ్వు కూడా కనిపించని ముఖం, నల్లటి యూనిఫాం (సాధారణంగా షర్టు, టీషర్టు మాత్రమే నల్లవి ధరిస్తారు)లతో వీరు దర్శనం ఇస్తుంటారు. ఆపై వీరిని రెస్టారెంట్లు, మాల్స్ యాజమాన్యాలు సైతం ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించాయి. ఆపై సెక్యూరిటీ గార్డులుగా మారిన ఈ బౌన్సర్లు ప్రముఖుల రాక, భారీ స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు తదితర సందర్భాల్లో రక్షణ కోసం రంగంలోకి దిగడం ప్రారంభించారు. ఇప్పుడైతే అనేక మంది వీఐపీల వెంటే ఉండటం ప్రారంభమైంది. దేహ దారుఢ్యంతో పాటు కాస్త చురుకుదనం, సమయస్ఫూర్తి మాత్రమే ప్రధాన అర్హతలు కావడంతో జిమ్స్తో టచ్‌లో ఉండే అనేక మంది యువకులు తాత్కాలిక బౌన్సర్లుగా ఉండటానికి ఆసక్తి చూపిస్తున్నారు. వీరిలోనే కొందరు శాశ్వత ప్రాతిపదికన సెక్యూరిటీ గార్డులుగానూ పని చేస్తున్నారు. -
మార్క్ వుడ్ రాకాసి బౌన్సర్.. పాక్ బ్యాటర్ వణికిపోయాడు..!
ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20 సందర్భంగా పాక్ బ్యాటర్ ఆజమ్ ఖాన్‌కు ఓ భయానక అనుభవం ఎదురైంది. మార్క్ వుడ్ సంధించిన ఓ రాకాసి బౌన్సర్‌ను ఎదుర్కొనే క్రమంలో ఆజమ్‌కు దిమ్మతిరిగిపోయి మైండ్ బ్లాంక్ అయ్యింది. నిప్పులు చెరిగే వేగంతో ముఖంపైకి దూసుకొచ్చిన బౌన్సర్‌ను ఎదుర్కొలేక ఆజమ్ వికెట్ సమర్పించుకున్నాడు.ఆజమ్ అదృష్టం కొద్ది బంతి గ్లవ్స్‌కు తాకి వికెట్‌కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఒకవేళ బంతి ఆజమ్ ఖాన్ శరీరం లేదా తలకు తాకుంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఆజమ్ ఔటయ్యాక కాసేపు షాక్‌లో ఉండిపోయాడు. అంతలా రాకాసి బౌన్సర్ అతన్ని బయపెట్టింది. పాక్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ రెండో బంతిని ఎదుర్కొనే క్రమంలో ఆజమ్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. వుడ్ రాకాసి బౌన్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.WHAT A BALL BY MARK WOOD.🤯- This is Brutal from Wood...!!!!! 🔥 pic.twitter.com/9kTgDdrxpi— Tanuj Singh (@ImTanujSingh) May 30, 2024మ్యాచ్ విషయానికొస్తే.. ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. ఆదిల్ రషీద్ (4-0-27-2), లివింగ్‌స్టోన్ (3-1-17-2), మార్క్ వుడ్ (4-0-35-2) పాక్‌ను దెబ్బకొట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (36), ఉస్మాన్ ఖాన్ (38) ఓ మోస్తరుగా రాణించగా.. మొహమ్మద్ రిజ్వాన్ (23), ఇఫ్తికార్ అహ్మద్ (21), నసీం షా (16) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (45), జోస్ బట్లర్ (39) దూకుడుగా ఆడటంతో 15.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. విల్ జాక్స్ (20), జానీ బెయిర్‌స్టో (28 నాటౌట్), హ్యారీ బ్రూక్ (17 నాటౌట్) ఇంగ్లండ్ గెలుపుకు తమవంతు సహకారాన్నందించారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్‌కు మూడు వికెట్లు దక్కాయి. -
అదృష్టం బాగుంది.. బతికిపోయిన బట్లర్
రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జాస్ బట్లర్ కొద్దిలో గాయం నుంచి తప్పించుకున్నాడు.ఐపీఎల్ 2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్ 6వ ఓవర్ రిలే మెరిడిత్ వేశాడు ఓవర్ ఐదో బంతిని మెరిడిత్ షార్ట్ బౌన్సర్ వేశాడు. బట్లర్ పుల్‌షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి వేగంగా వచ్చి హెల్మెట్‌ను బలంగా తాకింది.దీంతో ఆటకు కాసేపు అంతరాయం కలిగింది. స్లోమోషన్ రిప్లేలో బంతి బట్లర్ హెల్మెట్ గ్రిల్స్‌కు తాకినట్లు కనిపించింది. బంతి వేగానికి బట్లర్ తల అదిమినట్లయింది. ఫిజియో వచ్చి పరీశీలించగా.. బట్లర్ తాను బానే ఉన్నట్లు పేర్కొన్నాడు. దీంతో రాజస్తాన్ ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇది చూసిన అభిమానులు అదృష్టం బాగుండి బట్లర్ బతికిపోయాడు అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: IPL 2022: జడేజా సంచలన నిర్ణయం.. సీఎస్కే కొత్త కెప్టెన్ ఎవరంటే? #RileyMeredith bouncer hits #JosButtler on helmet pic.twitter.com/fUpk9ZvUPp — Raj (@Raj93465898) April 30, 2022 -
క్రికెట్లో బౌన్సర్లను నిషేధించాలి..
లండన్: జూనియర్ స్థాయి క్రికెట్లో బౌన్సర్లను నిషేదించేందుకు క్రికెట్ వర్గాలు కృషి చేయాలని ప్రముఖ కంకషన్ వైద్యుడు మైఖేల్ టర్నర్ పిలుపునిచ్చాడు. బౌన్సర్లు సంధించే క్రమంలో బంతి తలకు బలంగా తగిలితే యువ క్రికెటర్లు కంకషన్‌కు(అపస్మారక స్థితి) గురయ్యే ప్రమాదముందని ఆయన అభిప్రాయపడ్డారు. యుక్త వయసు క్రికెటర్లను బౌన్సర్ల బారి నుంచి కాపాడే బాధ్యత క్రికెట్ చట్టాల రూపకర్తలపై ఉందని, అందుకు వారు సానుకూలంగా స్పందించి సరైన నిర్ణయాన్ని వెల్లడిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఫ్లాట్ పిచ్‌లపై నుంచి నిప్పులు చెరుగుతూ దూసుకొచ్చే బంతులు యువ క్రికెటర్ల భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. బౌన్సర్ల బారి నుండి కాపాడేందుకు అత్యాధునిక హెల్మెట్లు అందుబాటులో ఉన్నా, బంతి వేగం ధాటికి అవి తునాతునకలు కావడం చాలా సందర్భాల్లో గమనించామని ఆయన పేర్కొన్నారు. క్రికెటర్లను.. అందులోనూ జూనియర్ స్థాయి క్రికెటర్లను కంకషన్ బారి నుండి కాపాడాలంటే బౌన్సర్లను నిషేదించడం ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. కాగా, ప్రమాదకర బౌన్సర్ కారణంగా ఆసీస్ మాజీ ఆటగాడు ఫిలిప్ హ్యూస్ మృతి చెందిన నాటి నుండి క్రికెట్లో బౌన్సర్లపై నిషేదం అన్న అంశంపై చర్చ కొనసాగుతూనే ఉంది.. ఆతరువాత కూడా చాలా సందర్భల్లో బంతి తలకు తాకడం వల్ల క్రికెటర్లు అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటనలు చాలా చూశాం.. ఇది చాలా ప్రమాదకర హెచ్చరిక అని టర్నర్ ఆందోళన వ్యక్తం చేశాడు. -
త్యాగి బౌన్సర్.. ఆసీస్‌కే ఎందుకిలా?
సిడ్నీ : ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూజ్ మీకందరికి గుర్తుండే ఉంటాడు. 2014లో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా సీన్ అబాట్ వేసిన బౌన్సర్ హ్యూజ్ మెడకు బలంగా తగిలింది. దీంతో అతను మైదానంలోనే కుప్పకూలి కోమాలోకి వెళ్లిపోయాడు. అలా మూడు రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు. హ్యూజ్ మరణవార్త ఆసీస్ క్రికెట్ చరిత్రలో పెను విషాదంగా నిలిచిపోయింది. అప్పటినుంచి ఎక్కడో ఒక చోట ఇలా బౌన్సర్లు బ్యాట్స్మన్ల పాలిట శాపంగా మారుతున్నాయి. ఎవరైనా ఒక బ్యాట్స్‌మెన్ బంతి వల్ల గాయపడితే అదే భయం వెంటాడుతుంది. (చదవండి : టీ20 ప్రపంచకప్‌లో అతను కీలకం కానున్నాడు) తాజాగా సిడ్నీ వేదికగా ఇండియా-ఏ, ఆస్ట్రేలియా-ఏ జట్ల మధ్య మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. కాగా బుధవారం ఆటలో చివరి రోజులో భాగంగా ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ఆడుతుంది. ఓపెనర్ విన్ పుకోవిస్కి 23 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్‌ను ఇండియా- ఏ బౌలర్ కార్తిక్ త్యాగి వేశాడు. త్యాగి వేసిన తొలి బంతి బౌన్స్ అయి పుకోవిస్కి హెల్మెట్ బాగాన్ని బలంగా తాకింది. బంతి హెల్మెట్‌కు బలంగా తాకడంతో ఒక్కసారిగా ఒత్తిడికి లోనైన పుకోవిస్కి క్రీజులోనే కుప్పకూలాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన తోటి ఆటగాళ్లు అతన్ని దగ్గరికి వచ్చి లేపడానికి ప్రయత్నించారు. (చదవండి : 'తన కెరీర్‌ను తానే నాశనం చేసుకున్నాడు') వెంటనే ఫిజియో వచ్చి పుకోవిస్కిని పరిశీలించి పరీక్ష చేస్తే గాయం పరిస్థితి ఎంటనేది తెలుస్తుందని పేర్కొన్నాడు.దీంతో పుకోవిస్కి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.అయితే పుకోవిస్కి గాయం తీవ్రత ఎక్కువగానే ఉండడంతో భారత్‌తో జరిగే తొలి టెస్టుకు అతను ఆడేది అనుమానంగానే ఉంది. దేశవాలి క్రికెట్లో యంగ్ టాలెంటెడ్ క్రికెటర్‌గా గుర్తింపు పొందిన విన్ పుకోవిస్కి టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. (చదవండి : ఆకట్టుకున్న కోహ్లి.. పోరాడి ఓడిన టీమిండియా) Fingers crossed for Will Pucovksi, who's retired hurt after this nasty blow to the helmet. Live scores from #AUSAvIND: https://t.co/MfBZAvzAkr pic.twitter.com/pzEBTfipF2 — cricket.com.au (@cricketcomau) December 8, 2020 -
వలేసి పట్టుకుని.. తాళ్లతో చేతులు కట్టేసి
మొరదాబాద్: బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ మాజీ బాడీగార్డ్ ఒకరు పిచ్చాసుపత్రి పాలయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్ నగరంలో రద్దీ రోడ్లపై బీభత్సం సృష్టించడంతో అతడిని గురువారం మెంటల్ ఆస్పత్రికి తరలించారు. అనాస్ ఖురేషి గతంలో ఏడాదిన్నర పాటు సల్మాన్‌ఖాన్ దగ్గర బాడీగార్డ్‌గా పనిచేశాడు. బుధవారం సాయంత్రం జిమ్‌కు వెళ్లేముందు పెద్ద మొత్తంలో అతడు మెడిసిన్స్ తీసుకున్నాడు. ఎక్కువ బరువులు ఎత్తేందుకు, శారీరక సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడే ఔషధాలను ఎక్కువగా తీసుకోవడంతో వాటి ప్రభావం కారణంగా రోడ్డుపై హల్చల్ చేశాడు. గురువారం ఉదయం అతడి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పాదచారులపై అకారణంగా దాడులకు దిగాడు. ఇనుప కడ్డీ తీసుకుని కార్ల అద్దాలు పగలగొట్టాడు. అతడిని కంట్రోల్ చేసేందుకు ప్రత్యక్ష సాక్షి ఒకరు పోలీసులకు సమాచారం అందించాడు. స్థానికుల సహాయంతో అనాస్‌ను పోలీసులు అడ్డుకున్నారు. చేపల వల సాయంతో అతడిని బంధించి తాళ్లతో కట్టేసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మోతాదుకు మించి ఔషధాలు సేవించడం వల్ల అనాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంటూ బరేలీలోని మెంటల్ ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని మంత్రి వద్ద అంగ రక్షకుడిగా పనిచేస్తున్న అనాస్ గత పది రోజులుగా తన సొంతూరు మొరదాబాద్‌లో ఉన్నాడు. ఇటీవల నిర్వహించిన మిస్టర్ మొరదాబాద్ చాంపియన్‌షిప్‌లో రెండో స్థానంలో నిలిచాడు. -
తేజ్ ప్రతాప్ బౌన్సర్ వీరంగం
-
తేజ్ ప్రతాప్ బౌన్సర్ వీరంగం
పట్నా : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యక్తిగత సిబ్బంది ఒకరు వీరంగం సృష్టించాడు. ఏడో విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా తేజ్ ప్రతాప్ ఆదివారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ సందర్భంగా తేజ్ ప్రతాప్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఓ ఫోటోగ్రాఫర్... కారు అద్దాలు ధ్వంసం చేశాడంటూ తేజ్‌ప్రతాప్ బౌన్సర్ దౌర్జన్యం చేసి, అతడిపై చేయి చేసుకుంటూ కెమెరాను ధ్వంసం చేశాడు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే ఇంత జరిగినా తేజ్ ప్రతాప్ ఏమాత్రం జోక్యం చేసుకోలేదు. అంతేకాకుండా తమ బౌన్సర్ల తప్పేమీ లేదంటూ ఆ చర్యను ఆయన సమర్థించుకున్నారు. తాను ఓటు వేసి వెళుతున్న సందర్భంగా తన కారు అద్దాలను ఓ ఫోటోగ్రాఫర్ ధ్వంసం చేశాడని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తేజ్ ప్రతాప్ తెలిపారు. ఇదంతా చూస్తుంటే తనను హతమార్చేందుకు కుట్ర జరిగినట్లు ఉందని ఆయన ఆరోపణలు చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రబడకు కోహ్లి గుణపాఠం
సెంచూరియన్: ‘కసి’కి ఫ్యాంటు, షర్టు తొడిగితే అది అచ్చుగుద్దినట్టు విరాట్ కోహ్లిలా ఉంటుంది. మైదానంలో అగ్రెసివ్‌గా ఉండటమే కాదు ఆటతోనూ సత్తా చాటుతున్నాడు టీమిండియా కెప్టెన్. అతడిని రెచ్చగొడితే కొదమ సింహంలా విరుచుకుపడతాడు. దీనికి తాజా రుజువు దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో కనిపించింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి టీమిండియాను కట్టడి చేసేందుకు సఫారీ బౌలర్లు పదేపదే బౌన్సర్లు సంధించారు. ఓపెనర్ రోహిత్ శర్మను అవుట్ చేసిన దక్షిణాఫ్రికా బౌలర్ కాజిసొ రబడ.. కోహ్లిపైనా కూడా అదే తరహాలో పెవిలియన్‌కు పంపాలని తెగ ప్రయత్నించాడు. విరాట్ బాడీని టార్గెట్ చేసి బంతులు విసిరాడు. ఈ క్రమంలో ఓ బంతి నేరుగా కోహ్లికి తగిలింది. దీంతో ‘మిస్టర్ ఫైర్’ కాసేపు బాధతో విలవిల్లాడు. నొప్పి తగ్గిన తర్వాత మళ్లీ బ్యాట్ పట్టి అతడికి తగిన గుణపాఠం చెప్పాడు. రబడ మళ్లీ తన స్టైల్లో బంతి వేయగా కోహ్లి అంతకుముందు బాల్‌ను ఆడినట్టుగానే ఆడి సిక్సర్ బాదాడు. అంతే మైదానం ఒక్కసారిగా చప్పట్లతో మారుమ్రోగింది. అతడు కొట్టిన ఒకే ఒక సిక్సర్ రబడ బౌలింగ్‌లో బాదిందే కావడం విశేషం. రెండో వన్డేలో 9 వికెట్లతో దక్షిణాఫ్రికాను భారత్ చిత్తుగా ఓడించింది. -
హెల్మెట్ లేకుంటే ఈ బ్యాట్స్‌మన్ పరిస్థితేంటీ .!
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా క్రికెటర్ జాన్ హేస్టింగ్స్ తృటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా మెల్ బోర్న్ స్టార్స్‌కి బ్రిస్బెన్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మెల్ బోర్న్ స్టార్స్‌కి కెప్టెన్ అయిన హేస్టింగ్స్ బ్యాటింగ్ చేస్తుండగా ఆస్ట్రేలియా పేస్ బౌలర్ బెన్ కటింగ్ వేసిన ఓ షార్ట్ బాల్ బంతి వేగంగా దూసుకొచ్చి ఆయన తల కుడివైపు బలంగా తాకింది. బాల్ దాటికి హేస్టింగ్స్ హెల్మెట్ ఎగిరి పడింది. హేస్టింగ్స్‌కు ఎలాంటి గాయం కాకపోవడంతో మైదానంలోని ఆటగాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో సంభ్రమాశ్చర్యానికి లోనైన హేస్టింగ్స్ మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. మూడేళ్ల క్రితం ఫిలిప్ హ్యూస్ మరణ ఘటనను గుర్తు చేసిన ఈ ఘటన ఆటగాళ్లను కొంత సేపు కలవరపెట్టింది. హెల్మెట్ లేకుంటే హేస్టింగ్స్ పరిస్థితేంటీ అని ప్లేయర్లంతా భయాందోళనలకు గురయ్యారు. 2014లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో సౌత్ ఆస్ట్రేలియా-న్యూసౌత్‌వేల్స్ జట్ల మధ్య షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో సీన్ అబాట్ వేసిన బౌన్సర్ తలకు తగలడంతో ఫిలిప్ హ్యూస్ గాయపడి మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన క్రికెట్ చరిత్రలోనే ఓ విషాద ఘటనగా మిగిలిపోయింది. -
సన్నీలియోన్ రాఖీ కట్టింది.. ఎవరికంటే..
ముంబై: మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి సన్నీ లియోన్ మన సాంప్రదాయాలకు మెల్లిగా అలవాటు పడిపోయింది. మొన్ననే రక్షాబంధన్ ను జరుపుకొంది. అయితే అది ఆమె సోదరుడు సందీప్ వోహ్రాతో మాత్రం కాదు. అతను అమెరికాలో ఉండటంతో ఈసారి మరో వ్యక్తికి రాఖీ కట్టి సెలబ్రేట్ చేసుకుంది. ఇంతకీ అతనెవరంటారా? సన్నీలియోన్ వ్యక్తిగత సంరక్షకుడు(బౌన్సర్) యూసఫ్ కు రాఖీ కట్టి అతనితో తన అనుబంధం చాటుకుంది. అందుకు సంబంధించిన ఓ వీడియోను ఆమె తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మరోవైపు దీపికా పదుకొనే, మరికొందరు తారలు కూడా తమ బ్రదర్స్ కు రాఖీ కట్టిన ఫోటోలను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం బాద్షాహో, సంజయ్‌దత్ భూమి చిత్రాల కోసం ఐటెం గర్ల్ గా మారిన ఈ సెక్సీ క్వీన్ త్వరలో సన్నీసిటీ మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. -
వాట్సన్‌కు తప్పిన ప్రమాదం
మెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెటర్ 'ఫిలిప్ హ్యూస్ విషాద మరణం' ఆ జట్టును వెంటాడుతోంది. ఆసీస్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా ఆసీస్ పేసర్ జేమ్స్ ప్యాటిన్సన్ వేసిన బౌన్సర్ వాట్సన్ హెల్మెట్‌కు బలంగా తాకింది. ఈ దెబ్బకు విలవిలలాడిపోయిన వాట్సన్ మోకాళ్లపై కూలబడ్డాడు. హెల్మెట్ పక్కనపడేసి తలను రెండు చేతులతో పట్టుకుని కొన్ని నిమిషాల పాటు అలాగే ఉండిపోయాడు. వెంటనే డాక్టర్ వచ్చి వాట్సన్‌కు చికిత్స చేశాడు. వాట్సన్ ప్రాక్టీస్ మానేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనతో బిత్తరపోయిన ప్యాటిన్సన్ విచారవదనంతో కనిపించాడు. అతనూ నెట్స్ నుంచి వెళ్లిపోగా, ఇతర ఆసీస్ క్రికెటర్లు, అధికారులు అదే బాటపట్టారు. మంగళవారం మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఈ సంఘటన జరిగింది. వాట్సన్‌కు పెద్ద ప్రమాదం తప్పిందని జట్టు సభ్యులు చెప్పారు. దేశవాళీ మ్యాచ్‌లో బౌన్సర్ తగిలి హ్యూస్ మరణించిన సంగతి తెలిసిందే. వాట్సన్ గాయపడిన సందర్భంగా ఆసీస్ క్రికెటర్లకు మరోసారి ఈ పీడకల గుర్తుకువచ్చింది. -
బౌన్సర్లపై నిషేధం వద్దు: డొనాల్డ్
జొహన్నెస్‌బర్గ్: క్రికెట్లో బౌన్సర్లను నిషేధించొద్దని దక్షిణాఫ్రికా మాజీ పేసర్ అలెన్ డొనాల్డ్ అన్నారు. ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి నేపథ్యంలో బౌన్సర్లపై వస్తున్న సూచనలను పరిగణనలోకి తీసుకోవద్దని క్రికెట్ పెద్దలకు విజ్ఞప్తి చేశాడు. జరిగిన సంఘటన చాలా అరుదైందని, అది విపరీతమైన చర్యలకు దారి తీయకుండా చూడాలన్నాడు. ‘బౌన్సర్లను నిషేధిస్తే ఆటలో పోటీ ఉండదు. బౌన్సర్ చట్ట విరుద్ధం కూడా కాదు. ఓ ఫాస్ట్ బౌలర్‌గా బ్యాట్స్‌మన్‌ను భయపెట్టడానికే బౌన్సర్ వేస్తాం. ఆటగాళ్లలో నైపుణ్యాన్ని పరీక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది. క్రికెట్‌కు దూరంగా ఉండే వ్యక్తులు చాలా మంది భద్రత గురించి ప్రశ్నిస్తారు. దీన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ వాళ్లు అడిగే అంశాలపై ఎక్కువగా స్పందించాల్సిన అవసరం లేదు’ అని డొనాల్డ్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం మైదానంలో ఉపయోగిస్తున్న హెల్మెట్లు బాగానే ఉన్నాయన్నాడు. వీటిని మరింత మెరుగుపర్చాల్సిన అవసరం లేదన్నాడు. -
'పబ్‌లో బౌన్సర్లు మాతో అసభ్యంగా ప్రవర్తించారు'