ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యక్తిగత సిబ్బంది ఒకరు వీరంగం సృష్టించాడు. ఏడో విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా తేజ్ ప్రతాప్ ఆదివారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ సందర్భంగా తేజ్ ప్రతాప్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఓ ఫోటోగ్రాఫర్... కారు అద్దాలు ధ్వంసం చేశాడంటూ తేజ్‌ప్రతాప్ బౌన్సర్ దౌర్జన్యం చేసి, అతడిపై చేయి చేసుకుంటూ కెమెరాను ధ్వంసం చేశాడు.పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే ఇంత జరిగినా తేజ్ ప్రతాప్ ఏమాత్రం జోక్యం చేసుకోలేదు. అంతేకాకుండా తమ బౌన‍్సర్ల తప్పేమీ లేదంటూ ఆ చర్యను ఆయన సమర్థించుకున్నారు. తాను ఓటు వేసి వెళుతున్న సందర్భంగా తన కారు అద్దాలను ఓ ఫోటోగ్రాఫర్ ధ్వంసం చేశాడని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తేజ్ ప్రతాప్ తెలిపారు. ఇదంతా చూస్తుంటే తనను హతమార్చేందుకు కుట్ర జరిగినట్లు ఉందని ఆయన ఆరోపణలు చేశారు
తేజ్ ప్రతాప్ బౌన్సర్ వీరంగం
Published Sun, May 19 2019 1:26 PM | Last Updated on Thu, Mar 21 2024 11:09 AM
Advertisement
Advertisement
Advertisement