బౌన్సర్లపై నిషేధం వద్దు: డొనాల్డ్
జొహన్నెస్‌బర్గ్: క్రికెట్‌లో బౌన్సర్లను నిషేధించొద్దని దక్షిణాఫ్రికా మాజీ పేసర్ అలెన్ డొనాల్డ్ అన్నారు. ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి నేపథ్యంలో బౌన్సర్లపై వస్తున్న సూచనలను పరిగణనలోకి తీసుకోవద్దని క్రికెట్ పెద్దలకు విజ్ఞప్తి చేశాడు. జరిగిన సంఘటన చాలా అరుదైందని, అది విపరీతమైన చర్యలకు దారి తీయకుండా చూడాలన్నాడు. ‘బౌన్సర్లను నిషేధిస్తే ఆటలో పోటీ ఉండదు. బౌన్సర్ చట్ట విరుద్ధం కూడా కాదు.
ఓ ఫాస్ట్ బౌలర్‌గా బ్యాట్స్‌మన్‌ను భయపెట్టడానికే బౌన్సర్ వేస్తాం. ఆటగాళ్లలో నైపుణ్యాన్ని పరీక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది. క్రికెట్‌కు దూరంగా ఉండే వ్యక్తులు చాలా మంది భద్రత గురించి ప్రశ్నిస్తారు. దీన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ వాళ్లు అడిగే అంశాలపై ఎక్కువగా స్పందించాల్సిన అవసరం లేదు’ అని డొనాల్డ్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం మైదానంలో ఉపయోగిస్తున్న హెల్మెట్లు బాగానే ఉన్నాయన్నాడు. వీటిని మరింత మెరుగుపర్చాల్సిన అవసరం లేదన్నాడు.