మెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెటర్ 'ఫిలిప్ హ్యూస్ విషాద మరణం' ఆ జట్టును వెంటాడుతోంది. ఆసీస్ ఆల్రౌండర్ షేన్ వాట్సన్కు పెద్ద ప్రమాదం తప్పింది. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా ఆసీస్ పేసర్ జేమ్స్ ప్యాటిన్సన్ వేసిన బౌన్సర్ వాట్సన్ హెల్మెట్కు బలంగా తాకింది. ఈ దెబ్బకు విలవిలలాడిపోయిన వాట్సన్ మోకాళ్లపై కూలబడ్డాడు. హెల్మెట్ పక్కనపడేసి తలను రెండు చేతులతో పట్టుకుని కొన్ని నిమిషాల పాటు అలాగే ఉండిపోయాడు. వెంటనే డాక్టర్ వచ్చి వాట్సన్కు చికిత్స చేశాడు.
వాట్సన్ ప్రాక్టీస్ మానేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనతో బిత్తరపోయిన ప్యాటిన్సన్ విచారవదనంతో కనిపించాడు. అతనూ నెట్స్ నుంచి వెళ్లిపోగా, ఇతర ఆసీస్ క్రికెటర్లు, అధికారులు అదే బాటపట్టారు. మంగళవారం మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఈ సంఘటన జరిగింది. వాట్సన్కు పెద్ద ప్రమాదం తప్పిందని జట్టు సభ్యులు చెప్పారు. దేశవాళీ మ్యాచ్లో బౌన్సర్ తగిలి హ్యూస్ మరణించిన సంగతి తెలిసిందే. వాట్సన్ గాయపడిన సందర్భంగా ఆసీస్ క్రికెటర్లకు మరోసారి ఈ పీడకల గుర్తుకువచ్చింది.
వాట్సన్కు తప్పిన ప్రమాదం
Published Tue, Dec 23 2014 12:02 PM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM
Advertisement
Advertisement