ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తనయుడు రాకీ ఫ్లింటాఫ్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ లయన్స్ (అండర్-19 జట్టు) తరఫున సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. రాకీ 16 ఏళ్ల 291 రోజుల వయసులో లయన్స్ తరఫున సెంచరీ చేశాడు.
16 YEARS OLD ROCKY FLINTOFF SMASHED A BRILLIANT HUNDRED..!!!!! ⭐
Andrew Flintoff's son Rocky Flintoff is 16 years old and he smashed a magnificent Hundred for England Lions vs Cricket Australia XI.
- ROCKY, A STAR IS BORN..!!!! pic.twitter.com/UB0STrNET8— Tanuj Singh (@ImTanujSingh) January 23, 2025
ఇక్కడ మరో విశేషమేమిటంటే.. రాకీ స్వయానా తన తండ్రి రికార్డునే బద్దలు కొట్టాడు. రాకీకి ముందు లయన్స్ తరఫున అతి చిన్న వయసులో సెంచరీ చేసిన రికార్డు ఆండ్రూ ఫ్లింటాఫ్ పేరిట ఉండేది. ఆండ్రూ ఫ్లింటాఫ్ 20 ఏళ్ల 28 రోజుల వయసులో లయన్స్ తరఫున సెంచరీ చేశాడు.
క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాకీ సెంచరీ చేశాడు. రాకీకి లయన్స్ తరఫున ఇదే తొలి సెంచరీ. ఈ మ్యాచ్‌లో రాకీ తొమ్మిదో స్థానంలో బరిలోకి దిగి కష్టాల్లో ఉన్న తన జట్టును (161/7) గట్టెక్కించాడు. ఈ మ్యాచ్‌లో (తొలి ఇన్నింగ్స్‌లో) రాకీ 127 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేశాడు.
🚨 ANDREW FLINTOFF SON ROCKY FLINTOFF CREATED HISTORY 🚨
- Rocky Flintoff becomes the youngest player to score a Maiden for England Lions (16 Year age). 🤯pic.twitter.com/1oL1QpoGO8— Tanuj Singh (@ImTanujSingh) January 23, 2025
రాకీ సెంచరీతో సత్తా చాటడంతో లయన్స్ తొలి ఇన్నింగ్స్‌లో 316 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు ఆస్ట్రేలియా ఎలెవెన్ 214 పరుగులకే చాపచుట్టేసింది. రాకీ హీరోయిక్ ఇన్నింగ్స్ కారణంగా లయన్స్‌కు 102 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
కాగా, ఆస్ట్రేలియా ఎలెవెన్‌తో మూడు నాలుగు రోజుల మ్యాచ్‌ల సిరీస్ కోసం లయన్స్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో లయన్స్ 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఆ మ్యాచ్‌లో రాకీ తొలి ఇన్నింగ్స్‌లో 19, రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో లయన్స్‌కు రాకీ తండ్రి ఆండ్రూ ఫ్లింటాఫ్ హెడ్ కోచ్ కావడం గమనార్హం. ఈ సిరీస్‌లో లయన్స్ తరఫున ఐదుగురు ఇంగ్లండ్ సీనియర్ జట్టు ఆటగాళ్లు (షోయబ్ బషీర్, పాట్ బ్రౌన్, టామ్ హార్ట్లీ, జోష్ టంగ్, జాన్ టర్నర్ ఆడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment