ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ చిన్న కొడుకు రాకీ ఫ్లింటాఫ్ తండ్రికి తగ్గ తనయుడనిపించుకుంటున్నాడు. రాకీ.. తండ్రి తరహాలోనే భారీ సిక్సర్లు కొడుతూ శభాష్ అనిపించుకుంటున్నాడు. లాంకాషైర్ రెండో జట్టుకు ఆడుతూ డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాకీ కొట్టిన సిక్సర్లు తండ్రి ఆండ్రూను గుర్తు చేశాయి. రాకీ కొట్టిన సిక్సర్లకు సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తుంది.
రాకీ సిక్సర్లు కొట్టిన విధానం తండ్రిని పోలి ఉందని నెటిజన్లు కితాబునిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో రాకీ మూడు సిక్సర్లు బాదగా.. అందులోని ఓ సిక్సర్ ఆండ్రూ ట్రేడ్ మార్క్ సిక్సర్‌కు (పుల్‌షాట్) మక్కీ టు మక్కీగా ఉందని అభిమానులు అనుకుంటున్నారు. రాకీ మెరుపు షాట్లు ఆడుతూ తండ్రి బాటలోనే నడుస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
Rocky Flintoff with 3️⃣ sixes on his way to an unbeaten half-century for the 2nd XI! 💥👏
— Lancashire Cricket (@lancscricket) April 18, 2024
Our 2nd XI clash with Durham ends in a draw as the rain interrupts once again.
Scorecard 📋➡ https://t.co/WieghotbNI
🌹 #RedRoseTogether pic.twitter.com/Rrc2SWUB9t
డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో తండ్రి తరహాలోనే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రాకీ రెండు బౌండరీలు, మూడు సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో వర్షం మొదలుకావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ సమయానికి లాంకాషైర్ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆండ్రూ ఫ్లింటాఫ్ పెద్ద కొడుకు కోరె ఫ్లింటాఫ్ కూడా లాంకాషైర్‌కే ఆడటం మరో విశేషం. ఆండ్రూ అలియాస్ ఫ్రెడ్డీ ఇద్దరు కొడుకులు క్రికెట్‌లో రాణిస్తుండటంతో ఇంగ్లండ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఫ్రెడ్డీ 20వ శతాబ్దం చివరి నుంచి దాదాపు పదేళ్ల పాటు ఇంగ్లండ్ క్రికెట్‌కు మకుటం లేని మహారాజుగా వెలిగిన విషయం తెలిసిందే. 2005 యాషెస్ సిరీస్‌లో ఫ్రెడ్డీ ఆల్‌రౌండర్‌గా విశేషంగా రాణించాడు. 2009లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం ప్రొఫెషనల్ బాక్సర్‌గా, ఫ్యాషన్ ప్రమోటర్‌గా, కార్ రేసర్‌గా, టీవీ ప్రజెంటర్‌గా పలు రంగాల్లో కాలు మోపిన ఫ్రెడ్డీ ప్రతి రంగంపై తనదైన ముద్ర వేశాడు.
2022లో కారు ప్రమాదానికి గురైన ఫ్రెడ్డీ.. ఇటీవలే క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. 46 ఏళ్ల ఫ్రెడ్డీ ఇంగ్లండ్ వన్డే జట్టుకు జీతం లేకుండా కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. గతేడాది నవంబర్‌లో ఫ్రెడ్డీ హండ్రెడ్ లీగ్‌లోని నార్త్రన్ సూపర్ చార్జర్స్ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గత హండ్రెడ్ ఎడిషన్‌లో ఫ్రెడ్డీ సూపర్ చార్జర్స్ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు.
Comments
Please login to add a commentAdd a comment