
సాక్షి, ఆంటిగ్వా : మహిళల టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా మరోసారి ఆస్ట్రేలియా మహిళల జట్టు అవతరించింది. కరేబియన్ దీవి ఆంటిగ్వాలో జరిగిన ఫైనల్ పోరులో విజయం ఆసీస్‌ను వరించింది. చివరి అంకంలో ఇంగ్లాండ్‌ను ఆసీస్ చిత్తుచిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ జట్టు 19.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ ఓపెనర్ డానియెల్ వైట్(45), కెప్టెన్ నైట్(25) ఇద్దరే రెండంకెల స్కోరు సాధించారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
ఆసీస్ బౌలర్లలో గార్డెనర్ 3, వారెహమ్ 2, మెఘాన్ 2 వికెట్లు దక్కాయి. అనంతరం 106 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ మహిళల జట్టు సునాయాసంగా పరుగులను చేధించింది. 15.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. ఆస్ట్రేలియా తరపున గార్డెనర్(33), లానింగ్(28), హీలీ(22) రాణించారు. పైనల్‌లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణించిన గార్డెనర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ ఆసాంతం రాణించిన అలీసా హీలీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. మహిళల టీ20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలవడం ఇది నాలుగోసారి.
Comments
Please login to add a commentAdd a comment