t20 womens world cup
-
భారత కెప్టెన్ ప్రపంచ రికార్డు.. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాలేదు!
టీ20 క్రికెట్లో భారత మహిళల జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ సరి కొత్త చరిత్ర సృష్టించింది. 150 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్ రికార్డులకెక్కింది. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఐర్లాండ్‌తో తలపడేందుకు మైదానంలో అడుగుపెట్టిన హర్మన్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు పురుషుల, మహిళల క్రికెట్లో మరెవరెకీ ఈ రికార్డు సాధ్యం కాలేదు. అంతకుముందు అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ(148) రికార్డును కూడా హర్మన్ బ్రేక్ చేసింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఫిబ్రవరి 18(శనివారం) ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్మన్ ఈ ఘనత సాధించింది. ఇక మహిళల క్రికెట్ లో హర్మన్ తర్వాత న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్ 143 మ్యాచ్‌లతో రెండోస్థానంలో ఉంది. ఆమె తర్వాతి స్థానంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానా 115 మ్యాచ్‌లతో ఉంది. అదేవ విధంగా టీ20లలో రోహిత్, విరాట్ కోహ్లిల తర్వాత 3 వేల పరుగులు చేసిన మూడో భారత క్రికెటర్‌గా హర్మన్‌ప్రీత్ నిలిచింది. ఇక ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో కేవలం ఆమె 13 పరుగులు చేసింది. సెమీస్‌లో భారత్ ఇక ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై విజయం సాధించిన భారత్..సెమీస్‌కు అర్హత సాధించింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 5 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.అయితే ఐర్లాండ్ ఇన్నింగ్స్ 54/2 వద్ద మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ నేపథ్యంలో వర్షం ఎప్పటికీ తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో.. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో భారత్‌ను విజేతగా నిర్ణయించారు. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో మూడో టెస్టు.. టీమిండియా వైస్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా! 🚨 Milestone Alert 🚨 First woman cricketer to play 1⃣5⃣0⃣ T20Is 🙌 🔝 Congratulations to #TeamIndia captain @ImHarmanpreet on a special landmark 👏 👏#INDvIRE | #T20WorldCup pic.twitter.com/X1DyIqhlZI — BCCI Women (@BCCIWomen) February 20, 2023 -
T20 World Cup: పాక్‌తో పోరు.. టీమిండియా ఎలా ఉండబోతుదంటే
మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్-బిలో ఇవాళ చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. పురుషుల క్రికెట్ లాగే మహిళల క్రికెట్లోనూ దాయాదుల సమరం కేవలం మెగాటోర్నీల వరకే పరిమితమైంది. అందుకే భారత్, పాక్ మ్యాచ్ అంటే ఎప్పుడైనా క్రేజ్ అలాగే ఉంటుంది. ఇక టీమిండియా వుమెన్స్‌కు రెండు వార్మప్ మ్యాచ్‌లతో మంచి ప్రాక్టీస్ లభించినట్లయింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో ఓడిన భారత్.. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో మాత్రం 52 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. మరోవైపు పాకిస్తాన్ కూడా తాను ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో గెలిచి మరొకటి ఓడిపోయింది. బంగ్లాదేశ్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన పాకిస్తాన్.. సౌతాఫ్రికాతో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో మాత్రం ఓటమిపాలైంది. పాక్‌తో పోరుకు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన వేలిగాయంతో దూరమవడం టీమిండియాను కలవరపెడుతోంది. అయితే స్మృతి మంధాన దూరమైనప్పటికి బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే కనిపిస్తుండడం సానుకూలాంశం. ఈ నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. ఓపెనర్లుగా యస్తికా బాటియా, షఫాలీ వర్మలు ఖాయం. వన్‌డౌన్‌లో జెమిమా రోడ్రిగ్స్, నాలుగో స్థానంలో హర్లిన్ డియోల్‌లు రానున్నారు. ఐదో స్థానంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. ఆరో స్థానంలో రిచా ఘోష్ రానుంది. ఇక ఆల్రౌండర్లుగా పూజా వస్త్రాకర్, దీప్తి శర్మలు ఉన్నారు. రేణుకా సింగ్, రాధా యాదవ్, శిఖా పాండేలు పేస్ బౌలింగ్ మారాన్ని మోయనున్నారు. టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్: హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), యస్తికా బాటియా, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్లిన్ డియోల్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, రేణుకా సింగ్, రాధా యాదవ్, శిఖా పాండే -
T20 World Cup: పాక్‌తో కీలకపోరు.. భారత స్టార్ ఓపెనర్ దూరం
సౌతాఫ్రికా వేదికగా మహిళల టి20 వరల్డ్‌కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం గ్రూప్-బిలో బిగ్‌ఫైట్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్‌లు తలపడనున్నాయి. మెగాటోర్నీలో మ్యాచ్ కావడంతో ఇరుజట్లు మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే మ్యాచ్‌కు ముందే భారత్‌కు బిగ్‌షాక్ తగిలింది. వేలికి గాయంతో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మ్యాచ్ ఆడడం లేదని సమాచారం. ''ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా మంధాన గాయపడింది. అయితే.. ఆమె మొత్తానికే వరల్డ్ కప్ టోర్నీకి దూరం కానుందా? అనేది ఇప్పుడే చెప్పలేం. అయితే.. పాకిస్థాన్ మ్యాచ్‌కు మాత్రం తాను అందుబాటులో ఉండదు'' అని బీసీసీఐ తెలిపింది. గ్రూప్ – బిలో ఉన్న పాకిస్థాన్, భారత్ ఆదివారం (ఫిబ్రవరి 12న) వరల్డ్ కప్ తొలి పోరులో తలపడనున్నాయి. ఓపెనర్‌గా శుభారంభం అందించే మంధాన తొలి మ్యాచ్ ఆడకపోవడం భారత్‌ను కలవర పెడుతోంది. అయితే వెస్టిండీస్‌తో ఫిబ్రవరి 15న జరిగే మ్యాచ్‌కు మంధాన అందుబాటులో ఉండనుందని తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన వామప్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా మంధాన గాయపడింది. ఆమె ఎడమచేతి మధ్య వేలికి గాయం అయింది. దాంతో, బంగ్గాదేశ్‌తో బుధవారం జరిగిన రెండో వామప్ మ్యాచ్‌కు మంధాన దూరమైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఫిట్నెస్ సమస్య ఎదుర్కొంటోంది. ఈమధ్యే దక్షిణాఫ్రికాలో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో హర్మన్‌ప్రీత్ భుజానికి గాయం అయింది. అయితే.. ''నా శరీరం ఇప్పుడు బాగానే ఉంది. విశ్రాంతి తీసుకోవడం వల్ల ఇబ్బందిగా అనిపించడం''లేదు అని హర్మన్ తెలిపింది. చదవండి: క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ -
అండర్–19 ప్రపంచకప్ విజేతకు ఘనంగా సన్మానం
ఐసీసీ తొలిసారి నిర్వహించిన అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సౌతాఫ్రికా గడ్డపై చరిత్ర సృష్టించిన మన అమ్మాయిలను బీసీసీఐ గౌరవించుకుంది. బుధవారం టీమిండియా, న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో టి20 అందుకు వేదికైంది. తొలి అండర్-19 టి20 వరల్డ్‌కప్‌ను సాధించిన టీమిండియా సభ్యులను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఘనంగా సన్మానించింది. న్యూజిలాండ్‌తో ఆఖరి టి20 పోరుకు ముందు జరిగిన ఈ వేడుకలో బోర్డు ప్రకటించిన రూ. 5 కోట్ల నజరానాను భారత దిగ్గజం సచిన్ చేతుల మీదుగా అండర్–19 జట్టు కెప్టెన్ షఫాలీ వర్మ అందుకుంది. అమ్మాయిలు అద్భుతంగా రాణించారని కితాబిచ్చిన ‘మాస్టర్’... ఈ ఘనతతో మరెంతో మంది మహిళా క్రికెటర్ల కలలకు ఊపిరి పోశారని అన్నారు. Honouring under19 Indian women team for becoming world champion at Ahmedabad @BCCI @sachin_rt @JayShah #INDvsNZ pic.twitter.com/L08NALkWYC — Rajeev Shukla (@ShuklaRajiv) February 1, 2023 This World Cup win has given birth to many dreams. Girls in India & across the world will aspire to be like you. You are role models to an entire generation and beyond. Heartiest congratulations on this stupendous #U19T20WorldCup win.@BCCIWomen @BCCI pic.twitter.com/VJvR0Ls60Z — Sachin Tendulkar (@sachin_rt) February 1, 2023 చదవండి: ఒహో.. చివరికి పృథ్వీని ఇలా కూల్ చేశారా -
సచిన్ చేతుల మీదుగా సన్మానం
దక్షిణాఫ్రికాలో ఆదివారం ముగిసిన తొలి అండర్–19 మహిళల ప్రపంచకప్ టి20 క్రికెట్ టోరీ్నలో విజేతగా నిలిచిన భారత జట్టుకు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సన్మానించనున్నాడు. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టి20 మ్యాచ్ ప్రారంభానికి ముందు షఫాలీ వర్మ జట్టుకు బీసీసీఐ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. సచిన్ ముఖ్య అతిథిగా హాజరై భారత యువ జట్టును సత్కరిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. -
Savitri Devi: నిందలు పడి కూతుర్ని విజేతను చేసింది
‘కూతుర్ని ఎవరికో అమ్మేసింది. ఏ తప్పుడు పనుల్లోనో పెట్టింది’... భర్త చనిపోయిన సావిత్రి తన కూతుర్ని పొరుగూరి స్కూల్లో చేర్చాక ఊరి ఆడవాళ్ల నుంచి ఎదుర్కొన్న నింద అది. ‘ఏమైనా సరే నా కూతురు క్రికెట్ ఆడాలి’ అనుకుంది సావిత్రి. అందుకే ఘోరమైన పేదరికంలో కూడా కూతురి కలలకు అండగా నిలబడింది. ఇవాళ ఆ కూతురు– అర్చనా దేవి ప్రపంచ విజేతగా నిలిచింది. ‘అండర్– 19’ క్రికెట్ జట్టులో బౌలర్‌గా, ఫీల్డర్‌గా రాణించి ఫైనల్స్ గెలవడంలో కీలకంగా మారింది. ఆడపిల్లల ఆకాంక్షలకు ఎన్ని అవరోధాలు ఉన్నా తల్లి గట్టిగా నిలబడితే కొండంత బలం అని తల్లులకు ఈ స్ఫూర్తిగాథ సందేశం ఇస్తోంది. సౌత్ ఆఫ్రికాలో అండర్ 19 టి 20 మహిళా ప్రపంచకప్. 16 దేశాలు తలపడ్డాయి. మన అమ్మాయిలు కప్ సాధించారు. మొత్తం 16 మంది టీమ్. ఒక్కొక్కరు శివంగిలా మారి అన్ని జట్లతో తలపడ్డారు. ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ను అతి తక్కువ స్కోర్ (68) వద్ద కట్టడి చేసి 14 ఓవర్లకే మూడు వికెట్ల నష్టానికి విజయం సాధించారు. ఇంగ్లాండ్ జట్టును బౌలర్లు హడలగొట్టారు. వారిలో టిటాస్ సాధు, పార్శవి కాకుండా మూడో బౌలర్ ఉంది. అర్చనా దేవి. కీలకమైన రెండు వికెట్లు పడగొట్టడమే కాకుండా ఒక అద్భుతమైన క్యాచ్ పట్టి మూడవ వికెట్ పడేందుకు కారణమైంది. వరల్డ్ కప్‌లో ప్రతి ఒక్కరిదీ ఒక విజయగాథే అయినా అర్చనా దేవిది భిన్నమైనది. కష్టాలను తట్టుకుని అర్చనా దేవి (18) సొంత ఊరు ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలోని రతై పూర్వ. గంగానది ఒడ్డునే వీరి పొలం. ఊరు. వరదలతో ఆ పొలం సంవత్సరంలో సగం రోజులు మునకలో ఉండేది. మిగిలిన సగం రోజుల్లో తండ్రి శివరామ్ వ్యవసాయం సాగించేవాడు. కాని ఆయనను 2008లో కేన్సర్ కబళించింది. దాంతో ఊళ్లో ఆడవాళ్లందరూ అర్చనా తల్లి సావిత్రిదేవిని నష్ట జాతకురాలిగా పరిగణించసాగారు. సావిత్రి వెరవలేదు. ఇద్దరు కొడుకులను, కూతురైన అర్చనను రెక్కల కింద పెట్టుకుని సాకసాగింది. దురదృష్టం... ఆఖరు కొడుకు బుద్ధిమాన్ కూడా మరణించాడు. దాంతో సావిత్రిని చూస్తే చాలు ఊరు దడుచుకునేది. ‘ఇదో మంత్రగత్తె. మొదట భర్తను మింగింది. తర్వాత కొడుకును’ అని... ఎదురుపడితే పక్కకు తప్పుకునేవారు. సావిత్రి దేవి ఇంకా రాటు దేలింది. పిల్లల కోసం ఎలాగైనా బతకాలనుకుంది. కూతురి క్రికెట్ అర్చనకు క్రికెట్ పై ఆసక్తి, పట్టు కూడా సోదరుడు బుద్ధిమాన్ వల్ల వచ్చినవే. అతను అర్చనను వెంటబెట్టుకుని పొలాల్లో క్రికెట్ ఆడేవాడు. తోడుగా అర్చన బ్యాటు ఝళిపించేది. అర్చన టాలెంట్‌ను బుద్ధిమాన్ వెంటనే గమనించాడు. ‘నువ్వు క్రికెటర్‌వి కావాలి’ అనేవాడు. అర్చన ఆశలు పెట్టుకుంది కాని తల్లి పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు బుద్ధిమాన్ బాల్ని కొడితే అది దూరంగా చెత్తలో పడింది. వెళ్లి చేతులతో చెత్తను కదిలిస్తూ ఉంటే పాము కరిచింది. తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఆటోలో ఆస్పత్రికి తీసుకెళుతుంటే కొన ఊపిరితో ఉన్న బుద్ధిమాన్ ‘అర్చనను క్రికెట్ మాన్పించవద్దు’ అని చెప్పి మరణించాడు. ఆ రోజు సావిత్రి సంకల్పించుకుంది ఎలాగైనా అర్చనను క్రికెటర్ చేయాలని. స్కూల్లో చేర్చి అర్చన క్రికెట్ కొనసాగాలంటే చదువును, ఆటలను నేర్పించే స్కూల్లో చేర్పించాలని సావిత్రి నిశ్చయించుకుంది. తమ పల్లెకు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే గంజ్ మొరాదాబాద్‌లోని గర్ల్స్ బోర్డింగ్ స్కూల్లో చేర్పించింది. వాళ్లుండే పల్లె నుంచి అలా మరో ఊరి బోర్డింగ్ స్కూల్లో ఏ ఆడపిల్లా చేరలేదు. అందుకని ఊరి ఆడవాళ్లు సావిత్రిని అనుమానించారు. కూతుర్ని ఎవరికో మంచి బేరానికి అమ్మేసి ఉంటుందని అనేవారు. చెడ్డ పనుల కోసం ఊరు దాటించింది అనేవారు. అవన్నీ సావిత్రీదేవి నిశ్శబ్దంగా భరించింది. కొడుకును ఢిల్లీలో బట్టల ఫ్యాక్టరీలో పనికి పెట్టి తమకున్న ఒక ఆవు, ఒక బర్రె పాల మీద ఆధారపడి కూతురి ఖర్చులను అతి కష్టం మీద చూసేది. ‘నేను ఉన్నాను’ అని అర్చనకు ధైర్యం చెప్పేది. దశ తిరిగింది బోర్డింగ్ స్కూల్లోని ఒక టీచరు అర్చన ప్రతిభను గమనించి కాన్పూరులో ఉండే కోచ్ కపిల్ పాండే దృష్టికి తీసుకెళ్లింది. ఆ టీచరు తీసిన అర్చన బౌలింగ్ వీడియోలు చూసిన కపిల్ పాండే వెంటనే కాన్పూరుకు పిలిపించి అక్కడి క్రికెట్ అసోసియేషన్‌లో జాయిన్ చేసి తన శిష్యురాలిగా తీసుకున్నాడు. కపిల్ పాండే క్రికెటర్ కుల్దీప్ యాదవ్‌కు కూడా కోచ్ కావడంతో కుల్దీప్ యాదవ్ అర్చనను ప్రోత్సహించాడు. ఆమె శిక్షణకు సాయం అందించాడు. అతిథులయ్యారు ‘ఒకప్పుడు మా ఇంట నీళ్లు కూడా ఎవరూ తాగలేదు. ఇవాళ అందరూ అతిథులుగా వచ్చి మీ దశ తిరిగింది అని భోజనం చేస్తున్నారు’ అంది అర్చన తల్లి సావిత్రి. వాళ్ల ఊరిలో ఆ కుటుంబం ఇప్పుడు సగర్వంగా నిలబడింది. తల్లి తన కూతురి ద్వారా అలా నిలబెట్టుకుంది. ఆ తల్లీకూతుళ్లను చూసి ఊరు మురిసిపోతోందిగాని అది ఎన్నో ఎదురీతల ఫలితం. ఎవరో అన్నట్టు... అపజయాల ఆవల విజయ తీరం ఉంటుంది. అర్చన విజయానికి తెడ్డు వేసిన నావ– ఆ తల్లి సావిత్రీ దేవి. అందుకే అర్చన విజయంలో సగం ఆ తల్లిదే. ఇంగ్లాండ్‌తో ఫైనల్స్‌లో అర్చన క్యాచ్ ప్రపంచ విజేత మన జట్టు -
వరల్డ్‌కప్ ఫైనల్.. బిడ్డ ఆట చూడడం కోసం ఇన్వర్టర్ కొన్న తల్లి కథ
బిడ్డ దేశం కోసం ఆడుతుందంటే ఆ తల్లిదండ్రులకు ఎంత సంతోషం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి బిడ్డ ఆటను కళ్లారా చూడాలని స్మార్ట్‌ఫోన్‌ను కూడా కాదని ఇన్వర్టర్ కొన్న ఒక తల్లి కథ తప్పక చదవాల్సిందే. విషయంలోకి వెళితే.. షఫాలీ వర్మ నేతృత్వంలోని టీమిండియా అండర్-19 మహిళల టి20 వరల్డ్‌కప్‌లో సూపర్ ఆటతీరుతో అదరగొట్టి టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఇదే టీమ్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌కు చెందిన అర్చనా దేవి బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించింది. టోర్నీలో ఆమె మంచి ప్రదర్శననే కనబరిచింది. ఆదివారం భారత్, ఇంగ్లండ్ మహిళల మధ్య అండర్-19 టి20 ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది. -సాక్షి, వెబ్‌డెస్క్ ఉత్తర్‌ప్రదేశ్‌లో కూగ్రామంగా ఉన్న ఉన్నావ్‌లో 24 గంటలు కరెంటు ఉండడం అనేది గగనం. కేవలం ఎనిమిది గంటల కరెంటు మాత్రమే ఉంటుందట. అండర్-19 టి20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ఫైనల్ చేరిందన్న సంగతి సావిత్రి తన కూతురు అర్చన ద్వారా తెలుసుకొని తెగ సంతోషపడింది. ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో బిడ్డ ఆటను కళ్లారా చూడాలని భావించింది. కానీ కరెంటు సమస్య ఉండడంతో మ్యాచ్ చూడడం కాస్త కష్టమే. కూతురు కొనిచ్చిన స్మార్ట్‌ఫోన్‌పై ఆమెకు నమ్మకం లేదు. ఎందుకంటే ఫోన్లో బ్యాటరీ ఎంతసేపు ఉంటుందో తెలియని పరిస్థితి. అందుకే సావిత్రి ఒక ఆలోచన చేసింది. ఊర్లో ఉన్న ప్రతీ ఇంటికి వెళ్లి తన బిడ్డ అర్చనా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుందని.. ఆ మ్యాచ్‌ను చూడాలనుకుంటున్నానని.. తలా ఇంత డబ్బులేసుకొని ఒక ఇన్వర్టర్ కొందామని చెప్పింది. తమ గ్రామానికి చెందిన ఒక ఆడబిడ్డ దేశానికి ఆడుతుందంటే అది మాకు గర్వకారణమే అని భావించిన ఊరివాళ్లు కూడా సావిత్రికి అండగా నిలబడ్డారు. ప్రతీ ఇంటి నుంచి వచ్చిన రూపాయితో సావిత్రి మొత్తానికి ఇన్వర్టర్ కొనేసింది. ఇక ఆదివారం ఊరి సమక్షంలో తన కూతురు మ్యాచ్‌ను చూడడానికి సావిత్రి అంతా సిద్ధం చేసుకుంది. ''మా ఊళ్లో కరెంటు 24 గంటలు ఉంటుందనే దానిపై నమ్మకం లేదు. మొబైల్ ఫోన్లో మ్యాచ్ చూద్దామన్నా బ్యాటరీ ఎంతసేపు ఉంటుందో తెలియదు. నా కూతురు ఆడనున్న వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌ను ఒక్క క్షణం కూడా మిస్ కాకూడాదని అనుకుంటున్నా. అందుకే ఊరివాళ్లతో మాట్లాడి డబ్బు పోగు చేసి ఇన్వర్టర్ కొనుక్కున్నా. ఇప్పుడు నా కూతురు ఆటను చూడడానికి ఎలాంటి అడ్డంకులు లేవు'' అంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్వూలో పేర్కొంది. ఇక క్రికెటర్ అర్చనా దేవి తల్లి సావిత్రి జీవితంలో చాలా ఎదగాలని కోరుకుంది. కానీ ఆమె కల నెరవేరకపోయినా కూతురు రూపంలో దానిని అందుకోవడానికి ప్రయత్నిస్తోంది. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించిన సావిత్రి.. అర్చనను మాత్రం కష్టపడి పెంచింది. ''ఒక ఎకరం భూమి కౌలుకు తీసుకొని పంట పండించడంతో పాటు రెండు ఆవుల నుంచి వచ్చిన పాలను అమ్మి కూతురును పెంచి పెద్ద చేశాను. అయితే అర్చనను చిన్నప్పుడే హాస్టల్‌కు పంపించిన సావిత్రి గంజిలోని మురదాబాద్‌లో కస్తుర్బా గాంధీ బాలికల పాఠశాలలో చదివించింది. కూతురును దూరం పెట్టిందని ఊరి వాళ్లంతా సూటిపోటి మాటలు అనేవారు. నాలాగా నా కూతురు పెరగకూడదనే ఎంత కష్టమైనా తనను చదివించుకున్నాను. ఇప్పుడు తను ఉన్నత స్థాయికి ఎదగడంతో తిట్టినోళ్ల నోటి నుంచే పొగడ్తలు రావడం సంతోషంగా అనిపిస్తుంది'' అంటూ చెప్పుకొచ్చింది. ఇక అండర్-19 టి20 ప్రపంచకప్ ఫైనల్ జరగడానికి ముందు టీమిండియా మహిళల జట్టును ఒలింపియన్.. భారత్ స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా కలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో వారితో సరదాగా గడిపిన నీరజ్ చోప్రా అమ్మాయిలకు తన విలువైన సూచనలు ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసుకుంది. It's down to two 👀 Who will get their hands on the inaugural ICC Women's #U19T20WorldCup? 🏆 pic.twitter.com/CDh5IGnAaa — T20 World Cup (@T20WorldCup) January 28, 2023 A Gold-standard meeting! 👏👏 Javelin thrower & Olympic Gold medallist @Neeraj_chopra1 interacted with #TeamIndia ahead of the #U19T20WorldCup Final! 👍 👍 pic.twitter.com/TxL5afL2FT — BCCI (@BCCI) January 28, 2023 చదవండి: 'స్లమ్‌డాగ్ మిలియనీర్' పాటతో స్కేటింగ్‌లో గోల్డ్ మెడల్ -
రూల్స్ భ్రష్టు పట్టించారు.. క్రీడాస్పూర్తికి విరుద్ధం
ఐసీసీ అండర్-19 టి20 వుమెన్స్ వరల్డ్‌కప్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక మహిళా క్రికెటర్ ఐసీసీ రూల్స్‌ను తుంగలోకి తొక్కి క్రీడాస్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించింది. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ను క్రీజులోకి రానీయకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడమే గాక రనౌట్‌కు కారణమైంది సదరు లంక క్రికెటర్. విషయంలోకి వెళితే.. టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా వుమెన్స్, శ్రీలంక వుమెన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియా వుమెన్స్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 19వ ఓవర్ నేత్రాంజలి వేసింది. ఆ ఓవర్ చివరి బంతిని అమీ స్మిత్ లాంగాఫ్ దిశగా ఆడింది. రెండు పరుగులు వచ్చే అవకాశం ఉండడంతో అమీ స్మిత్ పరిగెత్తింది. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న హామిల్టన్ రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో దిశానాయకే బంతి అందుకొని నాన్‌స్టైక్ర్ ఎండ్ వైపు విసిరింది. అయితే ఇదే సమయంలో అక్కడే ఉన్న నేత్రాంజలి హామిల్టన్‌కు క్రీజులోకి రాకుండా కావాలనే ఆమెకు అడ్డుగా వెళ్లింది. ఇదంతా రిప్లేలో స్పష్టంగా కనిపించింది. అప్పటికే బంతి నేరుగా వికెట్లను గిరాటేయడం.. అంపైర్ రనౌట్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఒకవేళ లంక బౌలర్ అడ్డుకోకపోయుంటే హామిల్టన్ సకాలంలో క్రీజులోకి చేరేదే. ఈ పరిణామంతో షాక్ తిన్న ఆసీస్ బ్యాటర్లు ఇదేం చర్య అన్నట్లుగా చూశారు. కానీ అంపైర్ ఔట్ ఇవ్వడంతో చేసేదేం లేక హామిల్టన్ నిరాశగా పెవిలియన్ చేరింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''అంత క్లియర్‌గా చీటింగ్ అని తెలుస్తుంది.. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధం'' అంటూ కామెంట్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా వుమెన్స్ 108 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఎల్లా హేవార్డ్ 36, సియాన్నా జింజర్ 30 పరుగులు, కేట్ పిల్లే 27 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన లంక మహిళల జట్టు 51 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటర్లలో ఒక్కరు మాత్రమే డబుల్ డిజిట్ మార్క్ అందుకోగా.. మిగతా పది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో మ్యాగీ క్లార్క్ , లూసీ హామిల్టన్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: 43 ఏళ్లలో తొలిసారి.. ముంబై జట్టుకు ఘోర అవమానం స్లో ఓవర్ రేట్.. టీమిండియాకు పడింది దెబ్బ -
టీ20 ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా
-
టీ20 ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా
సాక్షి, ఆంటిగ్వా : మహిళల టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా మరోసారి ఆస్ట్రేలియా మహిళల జట్టు అవతరించింది. కరేబియన్ దీవి ఆంటిగ్వాలో జరిగిన ఫైనల్ పోరులో విజయం ఆసీస్‌ను వరించింది. చివరి అంకంలో ఇంగ్లాండ్‌ను ఆసీస్ చిత్తుచిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ జట్టు 19.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ ఓపెనర్ డానియెల్ వైట్(45), కెప్టెన్ నైట్(25) ఇద్దరే రెండంకెల స్కోరు సాధించారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో గార్డెనర్ 3, వారెహమ్ 2, మెఘాన్ 2 వికెట్లు దక్కాయి. అనంతరం 106 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ మహిళల జట్టు సునాయాసంగా పరుగులను చేధించింది. 15.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. ఆస్ట్రేలియా తరపున గార్డెనర్(33), లానింగ్(28), హీలీ(22) రాణించారు. పైనల్లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణించిన గార్డెనర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ ఆసాంతం రాణించిన అలీసా హీలీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. మహిళల టీ20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలవడం ఇది నాలుగోసారి. -
‘ప్రపంచకప్ సాధించడమే మా అంతిమ లక్ష్యం’
సాక్షి, స్పోర్ట్స్ : ప్రపంచకప్ సాధించడమే అంతిమ లక్ష్యమని భారత మహిళా పేసర్ జులన్ గోస్వామి అభిప్రాయపడ్డారు. కాలి మడమ గాయంతో ఆమె దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధాంతరంగా తిరుగొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మహిళల జట్టు ప్రపంచకప్ గెలువలేదు. గతేడాది అడుగుదూరంలో కప్‌ను చేజార్చుకున్న భారత అమ్మాయిలకు ఈ ఏడాది నవంబర్‌లో టీ20 ప్రపంచకప్ రూపంలో మరో అవకాశం రానుంది. ఈ నేపథ్యంలో గోస్వామి మాట్లాడుతూ.. ‘ టీ20 ప్రపంచకప్ కసరత్తు దక్షిణాఫ్రికా పర్యటనతోనే మొదలైంది. ఇంకా సుమారు ఏడాది సమయం ఉండగా కసరత్తు మొదలు పెట్టడం మంచి పరిణామం. ఈ వ్యవధిలో భారత మహిళలు బీజీ షెడ్యూలతో రాటు దేలుతారు. భారత్‌లో ఆస్ట్రేలియాతో, ఇంగ్లండ్‌లో ట్రై టీ20 సిరీస్ ప్రపంచకప్ సన్నహాకానికి ఉపయోగపడుతాయి. ఒక వేళ ప్రపంచకప్ గెలిస్తే మా కల నెరవేరినట్లే. నా కెరీర్ ప్రారంభించినప్పుడే ప్రపంచకప్ గెలవాలనే కోరిక నా మెదడులో నాటుకుపోయింది. నాలుగేళ్ల కోసారి వచ్చే ఈ టోర్నీ గెలుపు ఒలింపిక్ బంగారు పతకంతో సమానం. టీ20 ప్రపంచకప్ టోర్నీ సెమీస్‌కు వెళ్లడమే మా లక్ష్యమైనప్పటికీ, అంతిమ లక్ష్యం మాత్రం ప్రపంచకప్ సాధించడమే.’ అని 16 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్న గోస్వామి తెలిపారు. దక్షిణాఫ్రికా పర్యటనపై స్పందిస్తూ.. దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ గెలవడంపై స్పందిస్తూ.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కలిగించిన స్పూర్తే విజయానికి కారణమని గోస్వామి అభిప్రాయపడ్డారు. అక్కడికి వెళ్లే ముందు సచిన్ మహిళా క్రికెటర్లతో మాట్లాడాడని తెలిపారు. అక్కడి పిచ్‌లపై అనుసరించాల్సిన వ్యూహాలు, పరిస్థితులపై అవగాహన కల్పించారని, జట్టులోని ప్రతి ఒక్కరిలో స్పూర్తిని నింపారని గోస్వామి చెప్పుకొచ్చారు. బీజీ షెడ్యూల్ ఏర్పాటు చేయడంలో బీసీసీఐ కృషి కూడా ఎంతో ఉందని ఆమె తెలిపారు. డిఫెండింగ్ చాంపియన్ అయిన వెస్టిండీస్‌లో ఈ ఏడాది నవంబర్ 9 నుంచి 24 వరుకు మహిళల టీ20 ప్రపంచకప్ జరగనుంది. గోస్వామి 200 వికెట్లు పడగొట్టిన తొలి మహిళ బౌలర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆమె గాయంతో దక్షిణాఫ్రికా పర్యటన టీ20 సిరీస్ నుంచి దూరమయ్యారు. రెండు మూడు వారాల విశ్రాంతి తర్వాత మార్చిలో ఆస్ట్రేలియాతో బరిలోకి దిగనున్నారు. -
హైదరాబాద్ టి20 జట్టు కెప్టెన్‌గా స్రవంతి
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సీనియర్ మహిళల టి–20 చాంపియన్‌షిప్‌లో పాల్గొనే హైదరాబాద్ జట్టును హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా ఎస్కే స్రవంతి నాయుడు, వైస్ కెప్టెన్‌గా అనన్య ఉపేంద్రన్‌లకు బాధ్యతలను కట్టబెట్టింది. ముంబైలో జనవరి 13 నుంచి 17 వరకు ఆలిండియా టి20 టోర్నీ జరుగుతుంది. హైదరాబాద్ టి20 జట్టు: ఎస్కే స్రవంతి నాయుడు (కెప్టెన్), అనన్య (వైస్ కెప్టెన్), గౌహర్ సుల్తానా, ప్రణతి రెడ్డి, డి. రమ్య, హిమాని యాదవ్, రచన కుమార్, వంకా పూజ, నిషత్ ఫత్మా (వికెట్ కీపర్), జీకే శ్రావ్య (వికెట్ కీపర్), స్నేహా మోరే, వీఎం కావ్య, జి. త్రిష, కె. అనిత, మమత, శ్రీనిధి, అనురాధ (మేనేజర్), మహేందర్ కుమార్, సవిత నిరాల (కోచ్‌లు). స్టాండ్ బైస్: లక్ష్మీ ప్రసన్న, చిత్ర మహేశ్వరి, పి.మోనిక. -
వరుసగా మూడో సారి...
టి20 మహిళల ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా సెమీస్‌లో వెస్టిండీస్‌పై విజయం ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా వరుసగా మూడోసారి మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. గత రెండు టోర్నీల్లోనూ ఆస్ట్రేలియానే టైటిల్ గెలిచింది. షేరే బంగ్లా స్టేడియంలో గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 8 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 140 పరుగులు చేసింది. విలాని (35), లానింగ్ (29) రాణించారు. అలిసా హీలీ (21 బంతుల్లో 30 నాటౌట్;4 ఫోర్లు) మెరుపులతో ఆసీస్‌కు గౌరవప్రదమైన స్కోరు లభించింది. వెస్టిండీస్ మహిళల జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. డాటిన్ (40), స్టాసీ (36 నాటౌట్) చివరి వరకూ పోరాడినా ఫలితం దక్కలేదు. -
కివీస్ శుభారంభం
టి20 మహిళల ప్రపంచ కప్ సిల్హెట్: టి20 మహిళల ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు బోణీ చేసింది. సోమవారం సిల్హెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ మహిళల జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 128 పరుగులు చేసింది. పెర్కిన్స్ (36 బంతుల్లో 31; 3 ఫోర్లు), బ్రోన్ (19 బంతుల్లో 29; 3 ఫోర్లు; 1 సిక్స్) ఆకట్టుకున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 19.3 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ అలిస్సా హీలీ (41 బంతుల్లో 41; 4 ఫోర్లు)తో పాటు బ్లాక్వెల్ (28 బంతుల్లో 31; 3 ఫోర్లు) రాణించారు. గ్రూప్ ‘ఎ’ రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 44 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. సోమవారం జరిగే మ్యాచ్‌లో మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత జట్టు శ్రీలంకను ఢీకొంటుంది. ఈ ఏడాది ఆరంభంలో లంకతో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసినప్పటికీ టి20 మ్యాచ్‌ల్లో మాత్రం 1-2తో సిరీస్ ఓడింది. నేటి మ్యాచ్‌లో ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది.