సౌతాఫ్రికా వేదికగా మహిళల టి20 వరల్డ్‌కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం గ్రూప్-బిలో బిగ్‌ఫైట్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్‌లు తలపడనున్నాయి. మెగాటోర్నీలో మ్యాచ్ కావడంతో ఇరుజట్లు మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే మ్యాచ్‌కు ముందే భారత్‌కు బిగ్‌షాక్ తగిలింది. వేలికి గాయంతో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మ్యాచ్ ఆడడం లేదని సమాచారం.
''ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా మంధాన గాయపడింది. అయితే.. ఆమె మొత్తానికే వరల్డ్ కప్ టోర్నీకి దూరం కానుందా? అనేది ఇప్పుడే చెప్పలేం. అయితే.. పాకిస్థాన్ మ్యాచ్‌కు మాత్రం తాను అందుబాటులో ఉండదు'' అని బీసీసీఐ తెలిపింది. గ్రూప్ – బిలో ఉన్న పాకిస్థాన్, భారత్ ఆదివారం (ఫిబ్రవరి 12న) వరల్డ్ కప్ తొలి పోరులో తలపడనున్నాయి. ఓపెనర్‌గా శుభారంభం అందించే మంధాన తొలి మ్యాచ్ ఆడకపోవడం భారత్‌ను కలవర పెడుతోంది. అయితే వెస్టిండీస్‌తో ఫిబ్రవరి 15న జరిగే మ్యాచ్‌కు మంధాన అందుబాటులో ఉండనుందని తెలుస్తోంది.
ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన వామప్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా మంధాన గాయపడింది. ఆమె ఎడమచేతి మధ్య వేలికి గాయం అయింది. దాంతో, బంగ్గాదేశ్‌తో బుధవారం జరిగిన రెండో వామప్ మ్యాచ్‌కు మంధాన దూరమైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఫిట్‌నెస్ సమస్య ఎదుర్కొంటోంది. ఈమధ్యే దక్షిణాఫ్రికాలో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో హర్మన్‌ప్రీత్ భుజానికి గాయం అయింది. అయితే.. ''నా శరీరం ఇప్పుడు బాగానే ఉంది. విశ్రాంతి తీసుకోవడం వల్ల ఇబ్బందిగా అనిపించడం''లేదు అని హర్మన్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment