
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సీనియర్ మహిళల టి–20 చాంపియన్‌షిప్‌లో పాల్గొనే హైదరాబాద్ జట్టును హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా ఎస్‌కే స్రవంతి నాయుడు, వైస్ కెప్టెన్‌గా అనన్య ఉపేంద్రన్‌లకు బాధ్యతలను కట్టబెట్టింది. ముంబైలో జనవరి 13 నుంచి 17 వరకు ఆలిండియా టి20 టోర్నీ జరుగుతుంది.
హైదరాబాద్ టి20 జట్టు: ఎస్‌కే స్రవంతి నాయుడు (కెప్టెన్), అనన్య (వైస్ కెప్టెన్), గౌహర్ సుల్తానా, ప్రణతి రెడ్డి, డి. రమ్య, హిమాని యాదవ్, రచన కుమార్, వంకా పూజ, నిషత్ ఫత్మా (వికెట్ కీపర్), జీకే శ్రావ్య (వికెట్ కీపర్), స్నేహా మోరే, వీఎం కావ్య, జి. త్రిష, కె. అనిత, మమత, శ్రీనిధి, అనురాధ (మేనేజర్), మహేందర్ కుమార్, సవిత నిరాల (కోచ్‌లు). స్టాండ్ బైస్: లక్ష్మీ ప్రసన్న, చిత్ర మహేశ్వరి, పి.మోనిక.
Comments
Please login to add a commentAdd a comment