sravanthi naidu
-
కోహ్లి పెద్ద మనసు.. మాజీ క్రికెటర్ తల్లికి సాయం
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన పెద్ద మనసును చాటుకున్నాడు. మాజీ మహిళా క్రికెటర్ తల్లి కరోనా ట్రీట్మెంట్ కోసం తన వంతు సాయం అందిచాడు. విషయంలోకి వెళితే.. టీమిండియా మాజీ మహిళ క్రికెటర్.. హైదరాబాద్ ప్లేయర్ స్రవంతి నాయుడు తల్లి కరోనా ఎస్కే సుమన్ ఇటీవలే కరోనా బారీన పడ్డారు. ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో ఆసుపత్రిలో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. తన తల్లి చికిత్సకు సంబంధించి సాయం చేయాలంటూ స్రవంతి బీసీసీఐతో పాటు హెచ్‌సీఏ, ఇతర క్రీడా సంస్థలకు అప్పీల్ చేసింది. అదే సమయంలో తన తల్లి క్లిష్ట పరిస్థితిని వివరిస్తూ స్రవంతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చిన వార్త చాలా మందిని కదిలించింది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ మాజీ సౌత్‌జోన్ కన్వీనర్ ఎన్ విజయా యాదవ్ స్రవంతి పోస్టును షేర్ చేస్తూ కోహ్లికి ట్యాగ్ చేసింది. స్రవంతి తల్లికి కోవిడ్ ట్రీట్మెంట్ పేరిట ఇప్పటికే రూ. 16 లక్షలు ఖర్చు అయిందని.. తనకు తెలిసిన వారిని సాయం అడుగుతుందని పోస్టులో పేర్కొంది. విజయా యాదవ్ పోస్టుకు స్పందించిన కోహ్లి స్రవంతి తల్లికి సాయంగా రూ. 6.77 లక్షలు సాయంగా అందిస్తున్నట్లు తెలిపాడు. అటు హెచ్‌సీఏ కూడా స్రవంతి అభ్యర్థన మేరకు ఆమె తల్లి చికిత్సకు రూ. 5 లక్షలు సాయం అందించినట్లు విజయా యాదవ్ తెలిపింది. అలాగే స్రవంతి తన ఇన్‌స్టాలో షేర్ చేసిన స్టోరీతో చాలా మంది ఆమెకు అండగా నిలుస్తున్నారు. కాగా స్రవంతి నాయుడు టీమిండియా తరపున 1 టెస్టు, 4 వన్డేలు, 6 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఇక కరోనాపై పోరులో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని భార్య అనుష్క శర్మ తమ వంతుగా ఇద్దరి తరఫున రూ. 2 కోట్లు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ‘కెట్టో’ ద్వారా కనీసం రూ. 7 కోట్ల విరాళాన్ని ఇతరుల నుంచి సేకరించాలని వీరిద్దరు నిర్ణయించారు. ‘విరుష్క’ విజ్ఞప్తికి అద్భుత స్పందన వచ్చింది. గడువు ముగిసేందుకు మరో రెండు రోజుల సమయం ఉందనగా ఇప్పటికి ‘విరుష్క’ విరాళాల సేకరణ మొత్తం రూ. 11 కోట్లకు చేరువగా వచ్చింది. ఇందులో ఎంపీఎల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ విరాళం రూ. 5 కోట్లు ఉండటం విశేషం. వసూలైన మొత్తాన్ని విరుష్క ‘ఏసీటీ గ్రాంట్స్’ అనే సంస్థకు అందిస్తారు. చదవండి: బ్లైండ్ డేట్.. ఐదు నిమిషాల్లోనే పారిపోయాను: కోహ్లి -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గొప్ప మనసు
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గొప్ప మనసు చాటుకుంది. భారత మహిళల క్రికెట్ టీమ్ మాజీ ఆల్‌రౌండర్, హైదరాబాద్ ప్లేయర్ స్రవంతి నాయుడుకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. స్రవంతి తల్లిదండ్రలు ఇద్దరూ కరోనా బారిన పడ్డారు. ఇద్దరు వేర్వేరు హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు.తన తల్లి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, తండ్రి కూడా ఐసీయూలో ప్రాణాల కోసం పోరాడుతున్నాడని స్రవంతి చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న హెచ్‌సీఏ ఆమెకు తక్షణ సాయంగా రూ.3 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. సాయం చేసేందుకు ముందుకొచ్చిన హెచ్‌సీఏకు ఆమె థ్యాంక్స్ చెప్పింది. తల్లిదండ్రుల చికిత్స కోసం స్రవంతి ఇప్పటికే రూ.16 లక్షలు ఖర్చు చేసిందని, ఆమెకు ఆర్థిక సాయం అవసరమని షట్లర్ గుత్తా జ్వాలా ట్వీట్ చేసింది. ఆమెను ఆదుకోవాలని మంత్రి కేటీఆర్‌ను కోరింది. తెలుగు రాష్ట్రాల్లోని కరోనా పేషెంట్స్‌కు సాయం చేస్తున్న క్రికెటర్ హనుమ విహారి.. స్రవంతి కోసం తమవంతు సాయం చేస్తామని ట్వీట్ చేశాడు. (చదవండి:టీమిండియా మహిళా క్రికెటర్ ఇంట్లో విషాదం) -
హైదరాబాద్ టి20 జట్టు కెప్టెన్‌గా స్రవంతి
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సీనియర్ మహిళల టి–20 చాంపియన్‌షిప్‌లో పాల్గొనే హైదరాబాద్ జట్టును హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా ఎస్కే స్రవంతి నాయుడు, వైస్ కెప్టెన్‌గా అనన్య ఉపేంద్రన్‌లకు బాధ్యతలను కట్టబెట్టింది. ముంబైలో జనవరి 13 నుంచి 17 వరకు ఆలిండియా టి20 టోర్నీ జరుగుతుంది. హైదరాబాద్ టి20 జట్టు: ఎస్కే స్రవంతి నాయుడు (కెప్టెన్), అనన్య (వైస్ కెప్టెన్), గౌహర్ సుల్తానా, ప్రణతి రెడ్డి, డి. రమ్య, హిమాని యాదవ్, రచన కుమార్, వంకా పూజ, నిషత్ ఫత్మా (వికెట్ కీపర్), జీకే శ్రావ్య (వికెట్ కీపర్), స్నేహా మోరే, వీఎం కావ్య, జి. త్రిష, కె. అనిత, మమత, శ్రీనిధి, అనురాధ (మేనేజర్), మహేందర్ కుమార్, సవిత నిరాల (కోచ్‌లు). స్టాండ్ బైస్: లక్ష్మీ ప్రసన్న, చిత్ర మహేశ్వరి, పి.మోనిక. -
రాణించిన మిథాలీ, స్రవంతి
భారత మహిళల జట్టు గెలుపు బంగ్లాదేశ్‌తో టి20 మ్యాచ్ కాక్స్ బజార్: టి20 ప్రపంచకప్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టు తమ సన్నాహాలను ఘనంగా ఆరంభించింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ మిథాలీ రాజ్ (64 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు)... బౌలింగ్‌లో స్రవంతి నాయుడు (4/9) రాణించడంతో ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత్ 16 పరుగుల తేడాతో నెగ్గింది. మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా 1-0 ఆధిక్యాన్ని సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. పూనమ్ రౌత్ (46 బంతుల్లో 42; 2 ఫోర్లు) అండతో రెండో వికెట్‌కు అజేయంగా మిథాలీ 98 పరుగులను జోడించింది. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన బంగ్లా 20 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్రవంతి నాయుడు 3 ఓవర్లలో 9 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా... హైదరాబాద్ బౌలర్ గౌహర్ సుల్తానా (2/11)... బెంగాల్ పేసర్ జులన్ గోస్వామి (2/14) రెండేసి వికెట్లు పడగొట్టారు. స్రవంతి నాయుడుకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం దక్కింది. రెండో వన్డే ఇదే వేదికపై 11న జరుగుతుంది. -
చెలరేగిన స్రవంతి నాయుడు
జింఖానా, న్యూస్‌లైన్: స్రవంతి నాయుడు (49 నాటౌట్), సింధుజా రెడ్డి (23 నాటౌట్) రాణించడంతో ఆలిండియా సీనియర్ మహిళల టి20 టోర్నీలో హైదరాబాద్ జట్టు 43 పరుగుల తేడాతో మహారాష్ట్రపై గెలిచింది. బుధవారం జింఖానాలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 123 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర 19.2 ఓవర్లలో 77 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ బౌలర్లు అనన్య ఉపేంద్ర, కావ్య చెరో మూడు వికెట్లు తీసి జట్టు విజయానికి దోహదం చేశారు. ఈ గెలుపుతో హైదరాబాద్‌కు 4 పాయింట్లు లభించాయి. ఆకట్టుకున్న మిథాలీ మరో మ్యాచ్‌లో రైల్వేస్ జట్టు 9 వికెట్ల తేడాతో హర్యానాపై నెగ్గింది. మొదట హర్యానా 20 ఓవర్లలో 5 వికెట్లకు 50 పరుగులు చేసింది. ఎఎన్ తోమర్ (22) మినహా మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత రైల్వేస్ 10.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 51 పరుగులు చేసి గెలిచింది. మిథాలీ రాజ్ (39 నాటౌట్) ఆకట్టుకుంది. రైల్వేస్‌కు 4 పాయింట్లు దక్కాయి.