రాణించిన మిథాలీ, స్రవంతి | India beat Bangladesh in women's T20 | Sakshi
Sakshi News home page

రాణించిన మిథాలీ, స్రవంతి

Published Mon, Mar 10 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM

రాణించిన మిథాలీ, స్రవంతి

రాణించిన మిథాలీ, స్రవంతి

భారత మహిళల జట్టు గెలుపు
 బంగ్లాదేశ్‌తో టి20 మ్యాచ్
 
 కాక్స్ బజార్: టి20 ప్రపంచకప్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టు తమ సన్నాహాలను ఘనంగా ఆరంభించింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ మిథాలీ రాజ్ (64 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు)... బౌలింగ్‌లో స్రవంతి నాయుడు (4/9) రాణించడంతో ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత్ 16 పరుగుల తేడాతో నెగ్గింది. మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా 1-0 ఆధిక్యాన్ని సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది.
 
  పూనమ్ రౌత్ (46 బంతుల్లో 42; 2 ఫోర్లు) అండతో రెండో వికెట్‌కు అజేయంగా మిథాలీ 98 పరుగులను జోడించింది. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన బంగ్లా 20 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్రవంతి నాయుడు 3 ఓవర్లలో 9 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా... హైదరాబాద్ బౌలర్ గౌహర్ సుల్తానా (2/11)... బెంగాల్ పేసర్ జులన్ గోస్వామి (2/14) రెండేసి వికెట్లు పడగొట్టారు. స్రవంతి నాయుడుకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం దక్కింది. రెండో వన్డే ఇదే వేదికపై 11న జరుగుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement