జింఖానా, న్యూస్‌లైన్: స్రవంతి నాయుడు (49 నాటౌట్), సింధుజా రెడ్డి (23 నాటౌట్) రాణించడంతో ఆలిండియా సీనియర్ మహిళల టి20 టోర్నీలో హైదరాబాద్ జట్టు 43 పరుగుల తేడాతో మహారాష్ట్రపై గెలిచింది. బుధవారం జింఖానాలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 123 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర 19.2 ఓవర్లలో 77 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ బౌలర్లు అనన్య ఉపేంద్ర, కావ్య చెరో మూడు వికెట్లు తీసి జట్టు విజయానికి దోహదం చేశారు. ఈ గెలుపుతో హైదరాబాద్‌కు 4 పాయింట్లు లభించాయి.
ఆకట్టుకున్న మిథాలీ
మరో మ్యాచ్‌లో రైల్వేస్ జట్టు 9 వికెట్ల తేడాతో హర్యానాపై నెగ్గింది. మొదట హర్యానా 20 ఓవర్లలో 5 వికెట్లకు 50 పరుగులు చేసింది. ఎఎన్ తోమర్ (22) మినహా మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత రైల్వేస్ 10.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 51 పరుగులు చేసి గెలిచింది. మిథాలీ రాజ్ (39 నాటౌట్) ఆకట్టుకుంది. రైల్వేస్‌కు 4 పాయింట్లు దక్కాయి.
చెలరేగిన స్రవంతి నాయుడు
Published Thu, Feb 6 2014 12:14 AM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM
Advertisement
Advertisement