gymkhana grounds
-
విజయవాడ జింఖానా గ్రౌండ్స్ లో భారీ అగ్నిప్రమాదం
-
విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, విజయవాడ: నగరంలోని జింఖానా గ్రౌండ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం జింఖానా గ్రౌండ్స్‌లోని బాణాసంచా స్టాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మొత్తం 18 టపాసుల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. తొలుత మూడు స్టాల్స్‌లో ప్రమాదం చోటు చేసుకోవడంతో దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఇద్దరు అగ్నికి ఆహుతయ్యారు. వారిని దుకాణంలో పని చేసే వారిగా గుర్తించారు. -
2న జింఖానా మైదానంలో ప్రపంచ శాంతి సభ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ జింఖానా మైదానంలో అక్టోబర్ 2వ తేదీన ప్రపంచ శాంతి సభను నిర్వహించనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ వెల్లడించారు. 2న సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు సభ జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. సికింద్రాబాద్‌లోని హరిహరకళా భవన్లో శాంతి సభ పోస్టర్‌ను ప్రజా గాయకుడు గద్దర్, ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ... శాంతి సభలకు 25 పార్టీల్లో 19 పార్టీలు మద్దతు ప్రకటించి రానున్నారని ఆయన వెల్లడించారు. ఆర్థిక అసమానతలను రూపు మాపేందుకు, ప్రపంచ శాంతి కోసం ఈ సభలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఈ సభలకు ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నామని... ఆయన వస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని రాకపోతే ప్రజలు, దేవుడి తీర్పుకు అంగీకరించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. మునుగోడు ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీలో ఉందని ప్రజా గాయకులు గద్దర్‌తో పాటు మరికొంత మంది పేర్లు పరిశీలిస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్ 25న తన పుట్టిన రోజు సందర్భంగా 59 మంది మునుగోడు నియోజకవర్గ నిరుద్యోగులకు, అక్టోబర్ 2వ తేదీన సభకు వచ్చిన నిరుద్యోగుల్లో లాటరీ ద్వారా అమెరికాలో ఉద్యోగాల కోసం పాస్ పోర్టుతో పాటు వీసాను కూడా అందిస్తామని చెప్పారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ... ప్రజలందరూ సమానంగా, సమాన హక్కులు పొందడం అనేది ప్రజాస్వామ్య దేశం లక్ష్యమన్నారు. ప్రజాస్వామ్యం బతికి ఉండాలంటే లౌకికవాదాన్ని పదికాలాలపాటు సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాము ఈ శాంతి సభలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ క్రిష్టియన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రవికుమార్, కన్వీనర్ జీ శ్యాం అబ్రహాం, వివిధ ప్రాంతాలకు చెందిన పాస్టర్లు, సంఘ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, బిషప్‌లు పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: ఉప ఎన్నిక కోసమే ‘గిరిజన బంధు’) -
IND VS AUS 3rd T20 Tickets: జింఖానా గ్రౌండ్ వద్ద తొక్కిసలాట.. ఏడుగురికి గాయాలు
సాక్షి, హైదరాబాద్/ రాంగోపాల్‌పేట్: గురువారం ఉదయం 11.30 గంటల ప్రాంతం. ఒక్కసారిగా వర్షం. జింఖానా గ్రౌండ్స్ వద్ద అప్పటివరకు కిలోమీటర్ పొడవు క్యూ లైన్లలో ఉన్నవారు, చుట్టుపక్కల ఉన్నవారు ఒకేసారి మైదానం ప్రధాన గేటు వైపు దూసుకువచ్చారు. లోపలకు వెళ్లడానికి ప్రయత్నించారు. ఫలితం.. తీవ్రమైన తొక్కిసలాట. ఊపిరే అందని పరిస్థితి. కొందరు కింద పడిపోయారు. కాళ్ల కింద నలిగిపోయారు. గుమిగూడిన వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఈ క్రమంలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు గాయపడ్డారు. మరికొందరికి స్వల్పగాయాలయ్యాయి. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగే భారత్–ఆ్రస్టేలియా టీ20 క్రికెట్ మ్యాచ్ కోసం జింఖానా మైదానంలో నేరుగా (ఆఫ్‌లైన్) టికెట్లు విక్రయించాలని నిర్ణయించిన హెచ్‌సీఏ ఆ మేరకు సరైన ఏర్పాట్లు, బందోబస్తు చేయలేదని, అభిమానులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మూడేళ్ల తర్వాత మ్యాచ్‌తో.. మూడేళ్ల విరామం తర్వాత హైదరాబాద్‌లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. బుధవారం వరకు ఆన్లైన్లోనే టికెట్ల అమ్మకాలు అంటూ చెప్పిన హెచ్‌సీఏ.. గురువారం మాత్రం కౌంటర్ ద్వారా టికెట్లు అమ్మాలని నిర్ణయించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మకాలు జరుగుతాయని ప్రకటించింది. మైదానంలోని హెచ్‌సీఏ కార్యాలయానికి దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్న ప్రధాన గేట్ వద్ద కుడివైపు పురుషులు, ఎడమవైపు మహిళలకు లైన్లు కేటాయించారు. గేటు దాటి లోపలకు వచ్చిన తర్వాత మాత్రం ఒకే లైన్లో టిక్కెట్ కౌంటర్ వరకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టికెట్ల కోసం బుధవారం రాత్రి నుంచే అభిమానులు గ్రౌండ్స్ వద్దకు చేరుకోవడం ప్రారంభించారు. గురువారం తెల్లవారుజాముకే వీరి సంఖ్య పది వేలు దాటింది. ఒక్కోటి దాదాపు కి.మీ. మేర క్యూలైన్లు ఏర్పడ్డాయి. ప్రధాన గేట్‌ను మూసి ఉంచిన పోలీసులు విడతల వారీగా కొందరి చొప్పున లోపలి క్యూ లైన్లోకి పంపిస్తున్నారు. వర్షంతో పరుగులు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో వర్షం కురిసింది. దీంతో తలదాచుకునేందుకు మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో ప్రధాన గేటు వద్దకు చేరుకున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్లకు ఇదే గేటు కావడంతో లోపల నుంచి వచ్చే వారి కోసం పోలీసులు కొద్దిగా దాన్ని తెరిచారు. అదే సమయంలో బయట ఉన్న దాదాపు 1,000 మంది ఒకేసారి లోపలకు దూసుకురావడానికి ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. పోలీసులు అదుపు చేయలేకపోవడంతో ముందు వరుసల్లో ఉన్న వాళ్లు కింద పడిపోయారు. అదే అదనుగా కొందరు పోకిరీలు.. మహిళలు, యువతులపై పడుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జీకి దిగారు. తొక్కిసలాట, లాఠీచార్జిలో ఒక కానిస్టేబుల్, ఒక అగ్నిమాపక సిబ్బందితో పాటు ఏడుగురికి గాయాలయ్యాయి. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఉదంతంతో గ్రౌండ్స్ వద్దకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. టిక్కెట్ల విక్రయానికి మరో కౌంటర్ ఏర్పాటు చేయించారు. సాయంత్రం టిక్కెట్ల విక్రయం పూర్తయ్యే వరకు భారీ బందోబçస్తు ఏర్పాటు చేశారు. లాఠీచార్జీ తర్వాత బయట ఉన్నవారిని పోలీసులు పంపేయగా.. సాయంత్రం వరకు ఉండి టిక్కెట్ల దొరకని వారు నిరసనకు ప్రయత్నించడంతో అధికారులు నచ్చజెప్పి పంపేశారు. యశోద ఆస్పత్రిలో చికిత్స తొక్కిసలాటలో గాయపడిన ఏడుగురిని సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో జింఖానా మైదానంలో స్వీపర్‌గా పనిచేసే బోరబండకు చెందిన రంజిత, బేగంపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ శ్రీకాంత్, కవాడీగూడకు చెందిన విద్యార్థి ఆదిత్యనాథ్, తిరుమలగిరి ఇందిరానగర్‌కు చెందిన విద్యారి్థని సయ్యదా ఆలియా, కొంపల్లి బహుదూర్‌పల్లికి చెందిన సాయి కిశోర్, సికింద్రాబాద్ కంట్రోల్ రూమ్‌కు చెందిన అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్ శ్రీనాథ్ యాదవ్, కేపీహెచ్‌బీ (జేఎన్టీయూ)కి చెందిన సుజాత ఉన్నారు. వీరిలో సాయి కిశోర్, సుజాతలను ప్రా£ýథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశామని, చికిత్స పొందుతున్న వారు కోలుకుంటున్నారని ఆస్పత్రి వైద్యులు చెప్పారు. బాధితుల ఫిర్యాదుతో మూడు కేసులు హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌తో పాటు నిర్వాహకులపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. జింఖానా వద్ద జరిగిన తొక్కిసలాటకు హెచ్‌సీఏ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని చికిత్స పొందుతున్న వారు ఫిర్యాదు చేయడంతో, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌తో పాటు నిర్వాహకులపై బేగంపేట పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ యాక్ట్, 420, 21,22/76 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. టికెట్లు బ్లాక్‌లో అమ్ముకున్నట్లు ఫిర్యాదులందాయి. హెచ్‌సీఏ నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని, వారిపై చర్యలు ఉంటాయని, నోటీసులు జారీ చేస్తామని అదనపు సీపీ (శాంతిభద్రతలు) డీఎస్ చౌహాన్ చెప్పారు. కనీస ఏర్పాట్లు లేకపోవడం వల్లే.. ఉప్పల్ స్టేడియం సామర్థ్యం సుమారు 39,800లో అన్నిరకాల పాస్‌ల సంఖ్య 20 శాతానికి మించదు. మిగిలిన వాటిని ప్రేక్షకులకు అందుబాటులో ఉంచే విషయంలో హెచ్‌సీఏలో నెలకొన్న గందరగోళం తాజా పరిస్థితికి దారి తీసినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లోనా లేక ఆఫ్‌లైన్‌లోనా అనే విషయంలో బుధవారం వరకు స్పష్టత లేకుండా పోయింది. హెచ్‌సీఏలో చాలా కాలంగా ఉన్న విభేదాల కారణంగా గతంలో టికెట్ల విషయంలో కీలకంగా, చురుగ్గా వ్యవహరించినవారు అధ్యక్షుడు అజారుద్దీన్‌కు సహకరించలేదని సమాచారం. దీంతో ఆయన పూర్తిగా దిగువ స్థాయి ఉద్యోగులపై ఆధారపడ్డారు. బుధవారం జింఖానా మైదానం వద్దకు ఫ్యాన్స్ పెద్దసంఖ్యలో వచ్చి హడావుడి చేసిన నేపథ్యంలో.. ఆఫ్‌లైన్‌లో టికెట్లు అమ్ముదామని అజహర్ చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద కనీస ఏర్పాట్లు, బందోబస్తు లేకపోవడం, వర్షం నేపథ్యంలో తొక్కిసలాట జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మ్యాచ్ నిర్వహణ సులువు కాదు: అజారుద్దీన్ గురువారం చోటు చేసుకున్న ఘటనలో తన తప్పేమీ లేదని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ చెప్పారు. క్రికెట్ మ్యాచ్ నిర్వహణ అంత సులువు కాదని పేర్కొన్నారు. పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అనుకోని ఘటనలు జరిగినప్పుడు ఎవరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. ఘటనపై ప్రభుత్వానికి నివేదిక సమరి్పస్తామని, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మ్యాచ్‌ల నిర్వహణ ఉంటుందని చెప్పారు. అందరం క్రికెట్ అభివృద్ధి కోసమే కష్టపడుతున్నామని అన్నారు. మ్యాచ్ టికెట్లు అన్నీ అమ్ముడుబోయినట్లు తెలిపారు. తెలంగాణ ప్రతిష్టకు భంగం కలిగితే సహించం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల విక్రయం సందర్భంగా జింఖానా గ్రౌండ్స్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో టీ20 క్రికెట్ మ్యాచ్ ఏర్పాట్లపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర పేరు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. దళారులు టికెట్లు అమ్మే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హెచ్‌సీఏ పాలకమండలి ఏకపక్షంగా వ్యవహరించకుండా ప్రభుత్వ సహకారాన్ని కోరిఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావని మంత్రి చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. 25న జరిగే మ్యాచ్‌ను విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేసి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని విజ్ఞప్తి చేశారు. జింఖానా వద్ద గాయపడిన వారికి హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్యసేవలు అందజేస్తామన్నారు. సమావేశంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, టీఎస్పీడీసీఎల్ ఎండీ రఘుమా రెడ్డి, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు పాల్గొన్నారు. ఒక కౌంటర్ నుంచే టికెట్లు అమ్మారు నాలుగు కౌంటర్లు అని చెప్పినా డిజిటల్ పేమెంట్లు పని చేయలేదు. మధ్యాహ్నం వరకు ఒక కౌంటర్ నుంచే టికెట్లు అమ్మారు. మరో కౌంటర్ కేవలం పోలీసుల కోసమే కేటాయించినట్టుంది. చాలామంది అడ్డదారిలో అక్కడకు వెళ్లి కొనుక్కున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి వేచి చూసినా నాకు టికెట్ దొరకలేదు. – సాయి ప్రవీణ్, గాజులరామారం -
జింఖానా గ్రౌండ్ ‘తొక్కిసలాట’దృశ్యాలు
-
జింఖానా గ్రౌండ్స్ వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జ్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 25వ తేదీన భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం నగరంలోని జింఖానా మైదానంలో టికెట్ విక్రయాలు జరుగుతున్నాయి. కాగా, మ్యాచ్ వీక్షేందుకు టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు అర్ధర్రాతి నుంచే క్యూ లైన్లలో బారులుతీరారు. పెద్ద సంఖ్యలో అభిమానులు జింఖానా మైదానం వద్దకు తరలివచ్చారు. ఈ క్రమంలో టికెట్స్ కోసం ఒక్కసారిగా ఎగబడటంతో గ్రౌండ్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో నలుగురు త్రీవంగా గాయపడ్డారు. పలువురు స్పృహ తప్పపడిపోయారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పోలీసులు సైతం గాయపడ్డారు. పరిస్థితి అదుపుతప్పి ఉద్రికత్త చోటుచేసుకుంది. దీంతో, పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇదిలా ఉండగా.. టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. మ్యాచ్ టికెట్స్ విషయంలో బ్లాక్ టికెట్స్‌పై సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. టికెట్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని సేల్ చేశారు? ఎవరికి ఎన్ని టికెట్స్ కేటాయిస్తున్నారో చెప్పాలన్నారు. బ్లాక్ దందా కోసం మ్యాచ్ టికెట్స్ ఇవ్వలేదన్నారు. క్రికెట్ మ్యాచ్ టికెట్స్ విషయంలో తెలంగాణ రాష్ట్ర పరువు తీయొద్దన్నారు. బ్లాక్ దందా జరిగినట్లు తెలిస్తే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హెచ్‌సీఏ వివాదం: జింఖానా వద్ద హైటెన్షన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ (హెచ్‌సీఏ)లో వివాదం ముదురుతోంది. సికింద్రాబాద్ జింఖానా వద్ద హెటెన్షన్ నెలకొంది. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ ప్రెస్‌మీట్‌కు పోలీసుల అనుమతి నిరాకరించారు. జింఖానా బయట భారీగా పోలీసుల మోహరించారు. ఈ క్రమంలో ఎలాగైనా ప్రెస్‌మీట్ నిర్వహిస్తామని అపెక్స్ కౌన్సిల్ అంటోంది. అంబుడ్స్‌మెన్ ప్రకటనపై అపెక్స్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అజార్ విజ్ఞప్తి మేరకు జింఖానా వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు అడ్డొస్తే ఎవరినీ ఉపేక్షించమని పోలీసులు తెలిపారు. జింఖానా నుంచి అజార్‌ను కూడా బయటకు పంపేందుకు పోలీసులు యత్నించారు. అజార్ గ్రూప్, జాన్ మనోజ్ గ్రూప్‌లను పోలీసులు అడ్డుకుంటున్నారు. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు అంబుడ్స్‌మన్ మధ్య పంచాయతీ తీవ్రమవుతోంది. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో అజార్‌కు అపెక్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. అపెక్స్ కౌన్సిల్ జాన్ మనోజ్‌ను హెచ్‌సీఏ అధ్యక్షుడిగా నియమించింది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ ఫిర్యాదు మేరకు అంబుడ్స్‌మన్ దీపక్ వర్మ అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేశారు. తదుపరి విచారణ జరిపేంత వరకు అపెక్స్ కౌన్సిల్ రద్దు కొనసాగనుంది. ఈ క్రమంలో అంబుడ్స్‌మన్ నిర్ణయాన్ని అపెక్స్ కౌన్సిల్ తప్పుపట్టింది. అంబుడ్స్‌మన్‌గా దీపక్ వర్మను ఏజీఎం వ్యతిరేకించింది. అపెక్స్ కౌన్సిల్ రద్దు చేసే అధికారం దీపక్‌వర్మకు లేదని పేర్కొంది. దీపక్‌వర్మ నియామకమే చెల్లదని అపెక్స్ కౌన్సిల్ అంటోంది. -
చెలరేగిన మిలింద్, త్యాగి
సాక్షి, హైదరాబాద్: ఎ1-డివిజన్ మూడు రోజు లీగ్‌లో మంగళవారం మొదలైన అన్ని మ్యాచ్‌ల్లోనూ బౌలర్ల ప్రతాపమే కనబడింది. జింఖానా గ్రౌండ్స్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో డెక్కన్ క్రానికల్ బౌలర్లు సీవీ మిలింద్ (5/49), సుదీప్ త్యాగి (5/45)లు ఎన్స్‌కాన్స్ బ్యాట్స్‌మెన్‌పై జూలు విదిల్చారు. ఏ దశలోనూ అవకాశమివ్వకుండా చెలరేగారు. దీంతో ఎన్స్‌కాన్స్ తొలి ఇన్నింగ్స్‌లో 37.5 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. తర్వాత తొలి ఇన్నింగ్ ఆరంభించిన డెక్కన్ క్రానికల్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 41 పరుగులు చేసింది. వర్షం వల్ల మైదానం చిత్తడిగా మారడంతో మొదటి రోజు పూర్తిస్థాయి ఆట సాధ్యపడలేదు. ఏఓసీ మైదానంలో ఎంపీ కోల్ట్స్- ఏఓసీ జట్ల మధ్య, రైల్వే గ్రౌండ్స్‌లో ఆర్.దయానంద్-దక్షిణమధ్య రైల్వే జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ల్లో తొలి రోజు ఆట పూర్తిగా రద్దయింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 142 (అనిరుధ్ 6/56, అన్వర్ అహ్మద్ 2/61, పాండే 2/20), హైదరాబాద్ బాట్లింగ్ తొలి ఇన్నింగ్స్: 91/1 (సరేందర్ సింగ్ 37 బ్యాటింగ్, వినయ్ గౌడ్ 34) ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 82 (సూర్యప్రకాశ్ 5/31, చందన్సహాని 5/46), కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్: 229/3 (అన్షుల్ లాల్ 67, చైతన్యకృష్ణ 64 బ్యాటింగ్, శాండిల్య 41; కృష్ణచరిత్ 3/53) రాణించిన విశాల్: ఎస్బీహెచ్ 216/7 తొలి రోజు బ్యాటింగ్‌కు దిగిన అన్ని జట్లు ఆలౌటైతే ఒక్క ఎస్బీహెచ్ మాత్రమే విశాల్ శర్మ (94 బంతుల్లో 50 బ్యాటింగ్, 8 ఫోర్లు) రాణించడంతో నిలబడింది. ఆంధ్రాబ్యాంక్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మొదటి రోజు ఆటలో ఎస్బీహెచ్ తొలి ఇన్నింగ్స్‌లో 71 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. డాని డెరెక్ ప్రిన్స్ (38), శ్రీహరిరావు (37) ఫర్వాలేదనిపించారు. ఆంధ్రాబ్యాంక్ బౌలర్ ఎం.ఎ.ఖాదర్ 4 వికెట్లు తీశాడు. -
50 మీ. విజేత వైష్ణవి
డీఎస్ఏ సమ్మర్ అథ్లెటిక్స్ మీట్ ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హెచ్‌డీఎస్‌ఏ సమ్మర్ అథ్లెటిక్స్ మీట్లో 50 మీటర్ల పరుగు పందెంలో వైష్ణవి స్వర్ణం గెలుచుకుంది. హైదరాబాద్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ (హెచ్‌డీఎస్‌ఏ) ఆధ్వర్యంలో ఈ మీట్ జింఖానా మైదానంలో శుక్రవారం జరిగింది. ఈ పోటీల విజేతలకు హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ప్రొఫెసర్ రాజేష్ కుమార్, డీఎస్ఏ అధికారి అలీమ్ ఖాన్ పతకాలను అందజేశారు. ఫైనల్స్ ఫలితాలు: అండర్-10 బాలికల విభాగం: 50 మీ:1. కె.వైష్ణవి, 2.కవిత, 3.మోనిక, శ్రుతి. అండర్-10 బాలుర విభాగం: 50 మీ: 1.హర్షవర్ధన్, 2.హర్ష వర్మ, 3.యశ్వంత్. లాంగ్‌జంప్: 1.యశ్వంత్, 2.అరుణ్ కుమార్, 3.హర్షవర్ధన్. 100 మీ: 1.పి.కేశవ్, 2.సి.వంశీకృష్ణ, 3.ఆదిత్య. పురుషుల: 100 మీ: 1.ప్రతీక్, 2.శేఖర్, 3.దినేష్. 800 మీ: 1.శేఖర్, 2.బాలాజీ, 3.కేశవ్. లాంగ్‌జంప్: 1.లవుడు, 2.అజిత్, 3.అజిత్. -
చెస్ విజేత గౌతమ్
జింఖానా, న్యూస్‌లై న్: డిస్ట్రిక్ట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో బాలుర అండర్-16 విభాగంలో గౌతమ్ టైటిల్ సాధించాడు. మదర్ చెస్ అకాడమీ నిర్వహించిన ఈ పోటీల్లో గౌతమ్ ప్రథమ స్థానంలో నిలువగా, భార్గవ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అండర్-12 విభాగంలో సాయి సూరజ్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. రెండో స్థానంలో శ్రీరామ్ నిలిచాడు. బాలికల విభాగంలో నాగప్రసన్న విజేతగా నిలువగా, వినీత రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. బాలుర అండర్-10 విభాగంలో కార్తికేయ మొదటి స్థానంలో, అరవింద్ రెండో స్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో అమూల్య టైటిల్ దక్కించుకుంది. శ్రీశుభ ద్వితీయ స్థానంలో నిలిచింది. బాలుర అండర్-8 విభాగంలో శ్రీఅనిల్ అగ్రస్థానంలో నిలువగా... రెండో స్థానాన్ని అవినాష్ సొంతం చేసుకున్నాడు. బాలికల విభాగంలో రిషిత టైటిల్ గెలుచుకోగా, వర్షిత రెండో స్థానంలో నిలిచింది. -
స్నేహిత్‌కు పతకం ఖాయం
ఇండియా ఓపెన్ టీటీ జింఖానా, న్యూస్‌లైన్: ఇండియా జూనియర్ అండ్ క్యాడెట్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ క్యాడెట్ డబుల్స్ విభాగంలో స్నేహిత్ జోడి పతకం ఖాయం చేసుకుంది. భారత్ ‘బి’ జట్టుగా బరిలోకి దిగిన స్నేహిత్, హరికృష్ణ జోడి సెమీస్‌కు చేరింది. గోవాలో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ ‘బి’ 3-2తో భారత్ ‘సి’పై విజయం సాధించింది. తొలి సెట్లో 13-15 పరాజయం పాలైన భారత్ ‘బి’ 11-8తో రెండో సెట్‌ను దక్కించుకుంది. మూడో సెట్లో 9-11 వెనుకబడినప్పట్టికీ మిగతా సెట్లలో 11-7, 11-8 తేడాతో నెగ్గి మ్యాచ్‌ను గెలుచుకుంది. మరోవైపు వ్యక్తిగత విభాగంలో హరికృష్ణ మెయిన్ డ్రాలోకి ప్రవేశించాడు. గ్రూప్-3లో ఆడుతున్న హరికృష్ణ తొలుత 3-0తో సిద్ధాంత్ సునీల్‌పై, రెండో మ్యాచ్‌లో 3-0తో రొసారియో వెస్లీపై నెగ్గాడు. అయితే మూడో మ్యాచ్‌లో 2-3తో స్వీడన్‌కు చెందిన కార్ల్సన్ ఫిలిప్ చేతిలో ఓడాడు. ప్రస్తుతం హరికృష్ణ గ్రూపులో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. -
స్నేహిత్‌కు కాంస్యం
ఇండియా ఓపెన్ టీటీ జింఖానా, న్యూస్‌లైన్: గ్లోబల్ జూనియర్ అండ్ క్యాడెట్ ఇండియా ఓపెన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో స్నేహిత్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో తొలి పతకాన్ని అందుకున్నాడు. భారత్-బి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్నేహిత్ డబుల్స్‌లో జీత్ చంద్రతో కలిసి బరిలోకి దిగాడు. గోవాలో బుధవారం జరిగిన ఫైనల్లో భారత్-బి 0-3తో సింగపూర్ చేతిలో ఓటమిపాలైంది. అంతకుముందు జరిగిన తొలి రౌండ్లో భారత్ 3-2తో స్వీడన్‌పై నెగ్గగా; రెండో మ్యాచ్‌లో 1-3తో భారత్-ఏ చేతిలో పరాజయం చవిచూసింది. మూడో మ్యాచ్‌లో భారత్-బి 2-3తో భారత్-సిపై గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. -
బీడీఎల్, డీసీ మ్యాచ్ డ్రా
చెలరేగిన ఆకాశ్ భండారి, రాజన్ ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్ జింఖానా, న్యూస్‌లైన్: ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో భాగంగా బీడీఎల్, డెక్కన్ క్రానికల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. గురువారం మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 317/4తో మూడో రోజు ఆటను ప్రారంభించిన డెక్కన్ క్రానికల్ ఆకాశ్ భండారి (99) సెంచరీ అవకాశం కోల్పోగా... సందీప్ రాజన్ (72 నాటౌట్) అర్ధ సెంచరీతో రాణించాడు. ఫలితంగా డీసీ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. అంతకుముందు బీడీఎల్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 389 పరుగులకు ఆలౌటైంది. దీంతో డెక్కన్ క్రానికల్‌కు 22 పరుగుల తొలిఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఈ మ్యాచ్‌తో డెక్కన్ క్రానికల్ 8 పాయింట్లు సాధించగా, బీడీఎల్ 4 పాయింట్లతో సరిపెట్టుకుంది. ఎన్స్కాన్స్తో ఆంధ్రా బ్యాంక్ మ్యాచ్ డ్రా ఎన్స్‌కాన్స్, ఆంధ్రా బ్యాంక్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది. మ్యాచ్ మూడో రోజు గురువారం రెండో ఇన్నింగ్స్ప్రారంభించిన ఎన్స్‌కాన్స్ 6 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. అరుణ్ దేవా (92), హిమాలయ్ అగర్వాల్ (55), హబీబ్ అహ్మద్ (51) అర్ధ సెంచరీలతో చెలరేగారు. దీంతో ఆంధ్రా బ్యాంక్ జట్టుకు రెండో ఇన్నింగ్స్ ఆడేందుకు అవకాశం లభించలేదు. అంతకుముందు ఆంధ్రా బ్యాంక్ తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నిలిచిన ఆంధ్రా బ్యాంక్‌కు 10 పాయింట్లు దక్కగా, ఎన్స్‌కాన్స్ 5 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. -
చెలరేగిన విహారి
ఆంధ్రా బ్యాంక్ 337 ఎన్స్‌కాన్స్ 295 ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్ జింఖానా, న్యూస్‌లైన్: ఆంధ్రా బ్యాంక్ బ్యాట్స్‌మన్ విహారి (168 బంతుల్లో 111; 15 ఫోర్లు) సెంచరీతో చెలరేగాడు. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో భాగంగా ఎన్స్‌కాన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో బుధవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆంధ్రా బ్యాంక్ 337 పరుగులు చేసి ఆలౌటైంది. నవీన్ రెడ్డి (88) అర్ధ సెంచరీతో రాణించగా, అమోల్ షిండే (40) ఫర్వాలేదనిపించాడు. అంతకుముందు ఎన్స్‌కాన్స్ జట్టు తొలిఇన్నింగ్స్‌లో 295 పరుగులు చేసి ఆలౌటైంది. హిమాలయ్ అగర్వాల్ (86), తన్మయ్ అగర్వాల్ (56), మెహదీ హసన్ (50) అర్ధసెంచరీలు చేశారు. అబ్దుల్ ఖాదర్ 25 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆంధ్రా బ్యాంక్ జట్టుకు 42 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రాహుల్ సింగ్ మెరుపు సెంచరీ బీడీఎల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డెక్కన్ క్రానికల్ బ్యాట్స్‌మన్ రాహుల్ సింగ్ ( 66 బంతుల్లో 101; 23 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపు సెంచరీతో విజృంభించాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి డెక్కన్ క్రానికల్ 4 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ఆకాశ్ బండారి (54 నాటౌట్) అర్ధ సెంచరీతో అజేయంగా నిలవగా... రవీందర్ (49) మెరుగ్గా ఆడాడు. అంతకుముందు తొలిరోజు బ్యాటింగ్ చేసిన బీడీఎల్ 332 పరుగుల వద్ద ఆలౌటైంది. సుమంత్ (135), వెంకట్ (105) సెంచరీలతో కదంతొక్కారు. -
చెలరేగిన రవితేజ, నవీన్
జింఖానా, న్యూస్‌లైన్: ఆంధ్రా బ్యాంక్ బ్యాట్స్‌మెన్ రవితేజ (118 బంతుల్లో 172; 22 ఫోర్లు, 5 సిక్సర్లు), నవీన్ రెడ్డి (188 బంతుల్లో 150; 21 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు. అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇద్దరూ పరుగుల వరద పారించారు. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బుధవారం రెండో రోజు ఓవర్‌నైట్ స్కోరు 330/8తో బరిలోకి దిగిన ఈఎంసీసీ మరో పరుగు చేయకుండానే మిగతా రెండు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. అనంతర ం లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఆంధ్రా బ్యాంక్ బ్యాట్స్‌మెన్ రవితేజ, నవీన్ రెడ్డిలు బ్యాట్లు ఝుళిపించడంతో జట్టు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 424 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో ఆంధ్రా బ్యాంక్ 94 పరుగుల ఆధిక్యంలో ఉంది. విహారి (45), అర్జున్ యాదవ్ (30 నాటౌట్) మెరుగ్గా ఆడారు. రాణించిన పవన్, కుషాల్ డెక్కన్ క్రానికల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పవన్ కుమార్ (86 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), కుషాల్ జిల్లా (119 బంతుల్లో 59 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఎస్బీహెచ్ జట్టు భారీ స్కోరు చేసింది. రెండో రోజు ఓవర్‌నైట్ స్కోరు 159/6తో ఆట కొనసాగించిన ఎస్బీహెచ్ 321 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఎస్‌బీహెచ్‌కు 155 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. డెక్కన్ క్రానికల్ బౌలర్ సందీప్ 4 వికెట్లు పడగొట్టాడు. తర్వాత తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన డెక్కన్ క్రానికల్ ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. ఆకాశ్ భండారి (59), సందీప్ రాజన్ (53 నాటౌట్) అర్ధ సెంచరీలతో చెలరేగగా... షాదాబ్ తుంబి 42 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. -
రాణించిన భార్గవానంద్, వెల్‌ఫ్రెడ్
జింఖానా, న్యూస్‌లైన్: పోస్టల్ జట్టు బౌలర్లు భార్గవానంద్ (5/17), లెస్లీ వెల్‌ఫ్రెడ్ (4/18) చక్కని బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించారు. దీంతో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఎఫ్‌సీఐ జట్టుపై గెలుపొందింది. ఎ-ఇన్స్టిట్యూషన్ వన్డే లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎఫ్‌సీఐ 68 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బరిలోకి దిగిన పోస్టల్ రెండే వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. చంద్రకాంత్ 30 పరుగులు చేశాడు. మరో మ్యాచ్‌లో ఇండియన్ ఎయిర్‌లై న్స్ జట్టు 5 వికెట్ల తేడాతో నేషనల్ ఇన్సూరెన్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బరిలోకి దిగిన నేషనల్ ఇన్సూరెన్స్ 101 పరుగులకే చేతులెత్తేసింది. ఇండియన్ ఎయిర్‌లైన్స్ బౌలర్లు సత్యనారాయణ 4 వికెట్లు తీసుకోగా... ప్రభు కిరణ్, సతీష్ కుమార్ తలా మూడు వికెట్లు చేజిక్కించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన నేషనల్ ఇన్సూరెన్స్ 5 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. దీపక్ (37 నాటౌట్), జతిన్ మెహతా (34) మెరుగ్గా ఆడారు. నేషనల్ ఇన్సూరెన్స్ బౌలర్ సిద్ధు 3 వికెట్లు తీసుకున్నాడు. మరో మ్యాచ్‌లో వీఎస్టీ జట్టు 3 వికెట్ల తేడాతో ఏపీ హైకోర్ట్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. మొదట వీఎస్టీ 8 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. పాల్ సింగ్ 33 పరుగులు చేశాడు. ఏపీ హైకోర్ట్ బౌలర్ విజయ్ 3 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఏపీ హైకోర్ట్ 7 వికెట్లకు 108 పరుగులు చేసింది. పండరీనాథ్ (43) ఫర్వాలేదనిపించాడు. వీఎస్టీ బౌలర్ అనీసుద్దీన్ 3 వికెట్లు పడ గొట్టాడు. -
ఫైనల్లో సంస్కృతి, సంజన
ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ జింఖానా, న్యూస్‌లైన్: ఆస్టర్ మైండ్స్ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ అండర్-12 బాలికల విభాగంలో సంస్కృతి, సంజన ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన ఈ టోర్నీ సెమీఫైనల్లో సంస్కృతి 8-0తో ప్రాచిపై గెలుపొందగా, సంజన 8-2తో శ్రీహర్షితపై నెగ్గి తుది పోరుకు సిద్ధమైంది. అండర్-14 బాలికల విభాగంలో సంస్కృతి 6-2తో సృజనపై నెగ్గి సెమీస్‌కు చేరుకుంది. మరో మ్యాచ్‌లో లాస్య 6-1తో అవంతికా రెడ్డిపై, సంజన 6-1తో అర్చిత రెడ్డిపై గెలుపొందారు. బాలుర విభాగం క్వార్టర్ఫైనల్లో శశిప్రీతమ్ 7-6 (7/5)తో వరుణ్ కుమార్‌పై గెలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు. తనతో పాటు చెన్నాడి సాహిల్ 7-4తో అర్జున్ రెడ్డిపై, తనిష్క్ 7-6తో సుహిత్ రెడ్డిపై నెగ్గి సెమీస్‌కు చేరుకున్నారు. అండర్-12 బాలుర విభాగం క్వార్టర్ఫైనల్లో అన్నే ఆకాశ్ 7-5తో శశిధర్‌పై, కార్తీక్ నీల్ 7-2తో అనికేత్‌పై, తన్మయ్ 7-6తో కౌషిక్ కుమార్ రెడ్డిపై గెలిచారు. అండర్-10 విభాగంలో కార్తీక్ నీల్ 7-2తో ముకుంద్ రెడ్డిని ఓడించగా, సిద్ధార్థ్ రెడ్డి 7-0తో జయ్ కృష్ణపాల్‌పై గెలిచాడు. రుషికేశ్ 7-0తో యశ్వంత్ చౌదరిని, వర్షిత్ కుమార్ 7-6తో ప్రతినవ్ను ఓడించారు. -
చెస్ చాంపియన్ షణ్ముఖ తేజ
జింఖానా, న్యూస్‌లైన్: హైదరాబాద్ చాలెంజర్స్ చెస్ సెల క్షన్ టోర్నీలో షణ్ముఖ తేజ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. చిక్కడపల్లిలోని హైదరాబాద్ జిల్లా చెస్ సంఘం కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఈ టోర్నీలో బిపిన్ రాజ్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. మిధుష్ మూడో స్థానంలో, పూజాంజలి నాలుగో స్థానంలో నిలిచారు. వీరు మేలో జరగనున్న ఏపీ స్టేట్ చాంలెంజర్స్ పోటీల్లో హైదరాబాద్ జిల్లా తర ఫున పాల్గొంటారు. విజేతలకు ఆంధ్రప్రదేశ్ చెస్ సంఘం (ఏపీసీఏ) జనరల్ సెక్రటరీ కన్నా రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీసీఏ నిర్వాహక కార్యదర్శి శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ కుర్రాడి సత్తా
మాంచెస్టర్‌లో శిక్షణకు ఎంపిక జింఖానా, న్యూస్‌లైన్: ఎయిర్టెల్ రైజింగ్ స్టార్స్ అండర్-16 ఫుట్‌బాల్ ప్రతిభాన్వేషణలో భాగంగా మాంచెస్టర్ యునెటైడ్ సాకర్ స్కూల్లో శిక్షణ పొందేందుకు హైదరాబాద్‌కు చెందిన కె.రాకేశ్ అర్హత సాధించాడు. గోవాలో రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల ఫైనల్ ట్రయల్స్‌లో 23 మంది క్రీడాకారులు పోటీ పడ్డారు. ఆరు నెలల పాటు జరిగిన ఈ పోటీల్లో కోల్‌కత, ఢిల్లీ, ముంబై, గోవా, బెంగుళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల నుంచి గోల్‌కీపర్‌తో కలుపుకుని మొత్తం 11 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. ఆటగాళ్ల శారీరక, మానసిక స్థితి, వారి క్రమశిక్షణ, ఆటతీరు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని మాంచెస్టర్ యునెటైడ్ కోచ్‌లు లామి సొనోల, కెవిన్ కొనెల్, డేవ్ చాప్మాన్, ఆడమ్ హిల్టన్ ఆధ్వర్యంలో ఈ ఎంపిక జరిగింది. ఈ 11 మంది ఆటగాళ్లు వారం రోజుల పాటు ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ సాకర్ స్కూల్లో అక్కడి అకాడమీ జట్టుతో పాటు శిక్షణ పొందుతారు. -
ఫైనల్లో లయోలా, భవాన్స్
జింఖానా, న్యూస్‌లైన్: బీఎఫ్ఐ-ఐఎంజీ రిలయన్స్ ఇంటర్ కాలేజి బాస్కెట్‌బాల్ లీగ్ బాలుర విభాగంలో లయోలా అకాడమీ, భవాన్స్ జట్లు ఫైనల్లోకి చేరుకున్నాయి. సికింద్రాబాద్‌లోని వైఎంసీఏలో గురువారం జరిగిన సెమీఫైనల్లో లయోలా అకాడమీ 72-41తో ఏవీ కాలేజిపై విజయం సాధించింది. ఆట ప్రారంభం నుంచి లయోలా ఆటగాళ్లు ఆధిక్యమే లక్ష్యంగా దూసుకెళ్లారు. ఒక దశలో లయోలా 26-11తో ముందంజలో ఉంది. అయితే ఏవీ కాలేజి ఆటగాళ్లు చాకచక్యంగా వ్యవహరించి లయోలా జట్టును కొంత మేరకు ప్రతిఘటించగలిగారు. అయినప్పటికీ మ్యాచ్ మొదటి అర్ధ భాగం ముగిసే సమయానికి లయోలా 40-32తో ఆధిక్యంలో నిలిచింది. అనంతరం రెండో అర్ధ భాగంలో లయోలా క్రీడాకారులు గణేశ్ (17), ఉదయ్ (17), చంద్రహాస్ (12), బాషా (11) విజృంభించడంతో జట్టుకు విజయం చేకూరింది. ఏవీ కాలేజి జట్టులో శ్యామ్సన్ (13), బాలాజీ (12), కిరణ్ (10) రాణించారు. మరో సెమీఫైనల్లో భవాన్స్ జట్టు 59-52తో సెయింట్ మార్టిన్స్‌పై గెలుపొందింది. ప్రారంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మ్యాచ్ ప్రథమార్ధం ముగిసే సమయానికి 25-20తో భవాన్స్ కాలేజి ముందంజలో ఉంది. ముందు నుంచి దూకుడుగా ఆడుతున్న భవాన్స్ చివరి వరకు అదే తీరును కొన సాగించింది. సెయింట్ మార్టిన్స్ ఆటగాళ్లు జోనా (17), సంతోష్ (12), విశాల్ (10) ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. భవాన్స్ క్రీడాకారులు రోహన్ (23), విష్ణు (13), హేమంత్ (8) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇతర ఫలితాలు బాలికల విభాగం సెమీఫైనల్స్ లయోలా అకాడమీ : 44 ( అక్షిత 14, స్నేహ 11, రమా 10); సెయింట్ మార్టిన్స్: 26 (మనీష 10, ఐశ్వర్య 14). ప్రభుత్య వ్యాయామ విద్య కళాశాల: 48 (ప్రీతి 18, భవ్య 14, అమిత 14); సీవీఎస్ఆర్ సీఓఈ: 27 ( సుమలత 10, సౌమ్య 8, ప్రత్యూష 7). -
ఎండీ ఎలెవన్ జట్టు గెలుపు
జింఖానా, న్యూస్‌లైన్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) నిర్వహించిన టాప్ ఎగ్జిక్యూటివ్స్ క్రి కెట్ మ్యాచ్‌లో మేనేజింగ్ డెరైక్టర్స్ (ఎండీ) ఎలెవన్ జట్టు విజేతగా నిలిచింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఎండీ ఎలెవన్ జట్టు 16 పరుగుల తేడాతో చీఫ్ జనరల్ మేనేజర్స్ (సీఎంజీ) ఎలెవన్ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఎండీ ఎలెవన్ 131 పరుగులు చేసి ఆలౌటైంది. వెంకటేశ్ రెడ్డి (38), మురళి (15) ఫర్వాలేదనిపించారు. సీఎంజీ ఎలెవన్ బౌలర్ జ్యోత్ ఘోష్ 3 వికెట్లు చేజిక్కించుకున్నాడు. తర్వాత బరిలోకి దిగిన సీఎంజీ ఎలెవన్ 115 పరుగులకే కుప్పకూలింది. నిగమ్ (48), శామ్సన్ (15) చక్కని ఆట తీరు కనబరిచారు. ఎండీ ఎలెవన్ బౌలర్ వాసుకి 3 వికెట్లు పడగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ టైటిల్‌ని దక్కించుకోగా... వెంకటేశ్ రెడ్డి ‘బెస్ట్ ఫీల్డర్’ టైటిల్‌ని సొంతం చేసుకున్నాడు. సీఎంజీ ఎలెవన్ క్రీడాకారుడు నిగమ్ ‘బెస్ట్ బ్యాట్స్‌మన్’ టైటిల్‌ని గెలుచుకోగా... జ్యోత్ ఘోష్ ‘బెస్ట్ బౌలర్’ టైటిల్‌ని కైవసం చేసుకున్నాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజింగ్ డెరైక్టర్ ఎం. భగవంత రావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. -
ఫైనల్లో మిష్గాన్, అవంతిక
జింఖానా, న్యూస్‌లైన్: ఏపీఎల్టీఏ ఆస్టర్ మైండ్స్ ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ అండర్-14 బాలికల సింగిల్స్ విభాగంలో మిష్గాన్ ఒమర్, అవంతిక రెడ్డి ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీఫైనల్లో మిష్గాన్ 7-1తో స్మృతి బాసిన్‌పై, అవంతిక రెడ్డి 7-4తో రాయల సంజనపై విజయం సాధించారు. అండర్-12 బాలుర విభాగంలో రాహుల్ చందన ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మొయినాబాద్‌లోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన సెమీఫైనల్లో రాహుల్ 7-2తో కౌశిక్ కుమార్ రెడ్డిపై విజయం సాధించాడు. మరో సెమీఫైనల్లో అన్నే ఆకాశ్ 7-0తో భాస్కర్ మోహన్ రాయ్‌పై నెగ్గి తుది పోరుకు సిద్ధమయ్యాడు. మరోవైపు బాలికల విభాగం క్వార్టర్ఫైనల్లో రాయల సంజన 7-2తో సుమనను ఓడించి సెమీస్‌కు చేరుకుంది. స్మృతి బాసిన్ 7-6 (7/4 )తో ఇషికా అగర్వాల్‌పై గెలవగా... అవంతిక రెడ్డి 7-4తో రాయల సృజనపై గెలుపొందింది. అయితే సంజన సిరిమల్లతో జరిగిన మ్యాచ్‌లో వేద వర్షిత వాకోవర్ ఇచ్చింది. ఇతర ఫలితాలు బాలుర అండర్-10 సెమీఫైనల్స్: ఆయుష్ భట్ 7-1తో యశ్వంత్‌పై, దాసరి అభిరామ్ 7-6 (7/2)తో సిద్ధార్థ్ రెడ్డిపై గెలిచారు. అండర్-14 సెమీఫైనల్స్: సాహి 7-5తో అఖి ల్ని, శశి ప్రీతమ్ 7-4తో నిషాద్‌ను ఓడించారు. బాలికల అండర్-10 సెమీఫైనల్స్: తనుషితా రెడ్డి 7-4తో వేద వర్షితపై, సంజన సిరిమల్ల 7-2తో నేహపై నెగ్గారు. -
ఫైనల్లో మెదక్, నిజామాబాద్
జింఖానా, న్యూస్‌లైన్: అంతర్ జిల్లా అండర్-14 వన్డే క్రికెట్ టోర్నీలో మెదక్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో మెదక్ 64 పరుగుల తేడాతో కరీంనగర్ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన మెదక్ 221 పరుగులు చేసి ఆలౌటైంది. అబ్దుల్ గఫూర్ (45), ఉదయ్ కిరణ్ (37) ముఖేశ్ (37) ఫర్వాలేదనిపించారు. అనంతరం బరిలోకి దిగిన కరీంనగర్ 157 పరుగులకే కుప్పకూలింది. సాయి వినయ్ (34) మినహా మిగిలిన వారు రాణించలేకపోయారు. మరో సెమీఫైనల్లో నిజామాబాద్ జట్టు 81 పరుగుల తేడాతో ఆదిలాబాద్ జట్టుపై నెగ్గి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట నిజామాబాద్ 8 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. హర్షవర్ధన్ (89), అఫ్రోజ్ ఖాన్ (66) అర్ధ సెంచరీలతో రాణించారు. తర్వాత బరిలోకి దిగిన ఆదిలాబాద్ 180 పరుగుల వద్ద ఆలౌటైంది. హిమతే జ్ (51 నాటౌట్) అర్ధ సెంచరీతో అజేయంగా నిలిచాడు. నిజామాబాద్ బౌలర్ అనిరుధ్ రెడ్డి 3 వికెట్లు తీసుకున్నాడు. రాణించిన త్రిశాంక్, అజీమ్ ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ వాండరర్స్ బౌలర్లు త్రిశాంక్ గుప్తా (5/32), అజీమ్ (5/32) చెరో 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టుకు చుక్కలుచూపించారు. దీంతో ఆ జట్టు 156 పరుగుల భారీ తేడాతో మహబూబ్ కాలేజి జట్టుపై ఘనవిజయం సాధించింది. మొదట హైదరాబాద్ వాండరర్స్ 240 పరుగులు చేసి ఆలౌటైంది. భవేశ్ (58) అర్ధ సెంచరీతో చెలరేగగా... ఓవైసీ (43) మెరుగ్గా ఆడాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మహబూబ్ కాలేజి 84 పరుగులకే చేతులెత్తేసింది. -
రన్నరప్ హైదరాబాద్
జింఖానా,న్యూస్‌లైన్: సీనియర్ మహిళల ఎలైట్ సూపర్ లీగ్ ట్వంటీ 20 టోర్నీలో హైదరాబాద్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. పంజాబ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. వాణి 36 పరుగులు చేసింది.హైదరాబాద్ బౌలర్లలో డయానా డేవిడ్ రెండు వికెట్లు పడగొట్టగా... మమత, కావ్య తలా ఓ వికెట్ తీశారు. అనంతరం బరిలోకి దిగిన హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. షాలిని (22 నాటౌట్), మమత (20 నాటౌట్), సింధుజ (18), స్నేహ (17) ఫర్వాలేదనిపించారు. ఈ విజయంతో మొత్తం 8 పాయింట్లతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలువగా... మరోవైపు 12 పాయింట్లు సాధించిన రైల్వేస్ జట్టు విజేతగా నిలిచింది. -
సెయింట్ మార్టిన్స్ గెలుపు
జింఖానా, న్యూస్‌లై న్: బీఎఫ్ఐ-ఐఎంజీ రిలయన్స్ బాస్కెట్‌బాల్ లీగ్‌లో సెయింట్ మార్టిన్స్ జట్టు 38-31తో బిట్స్ పిలాని జట్టుపై నెగ్గింది. సికింద్రాబాద్ వైఎంసీఏలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే మ్యాచ్ మొదటి అర్ధ భాగం ముగిసే సమయానికి 12-7తో సెయింట్ మార్టిన్స్ ముందంజలో ఉంది. అనంతరం రెండో అర్ధ భాగంలో బిట్స్ పిలాని ప్లేయర్లు... ప్రత్యర్థిని ఎదుర్కునేందుకు ఎంతగానో ప్రయత్నించారు. అయినప్పటికీ సెయింట్ మార్టిన్స్ క్రీడాకారిణులు మనీషా (17), దివ్యవాణి (10), ఐశ్వర్య (8)ల జోరును మాత్రం అడ్డుకోలేకపోయారు. బిట్స్ పిలాని జట్టులో మేహ (14), అపూర్వ (10) రాణించారు. మరో మ్యాచ్‌లో సీవీఎస్ఆర్ కాలేజి 40-28తో గోకరాజు రంగరాజు కాలేజిపై విజయం సాధించింది. ఆట ప్రారంభం నుంచి సీవీఎస్ఆర్ క్రీడాకారిణులు ప్రత్యూష (18), శ్రేష్ఠ (15) దూకుడును ప్రదర్శించారు. గోకరాజు రంగరాజు జట్టు సభ్యులు సీవీఎస్ఆర్ను ప్రతిఘటించేందుకు తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ చివరి వరకు సీవీఎస్ఆర్ అమ్మాయిలు అదే ఆటతీరును కొనసాగించి విజయాన్ని దక్కించుకున్నారు. గోకరాజు రంగరాజు జట్టులో మృణాళిని (18) చక్కని ప్రతిభ కనబరిచింది. ఇతర ఫలితాలు పురుషుల విభాగం: బిట్స్ పిలాని: 30 (ఇషాన్ 16, కాకా 10); సీవీఎస్ఆర్ కాలేజి: 20 (జెన్ని 6, ఫైజల్ 6). ఏవీ కాలేజి: 51 (శామ్సన్ 20, బాలాజి 14, సాయి 13); అవంతి డిగ్రీ కాలేజి: 37 (జశ్వంత్ 17, అక్రమ్ 11).