రాణించిన ఖలీద్ | Abdul Khalid Qureshi sucessful | Sakshi
Sakshi News home page

రాణించిన ఖలీద్

Published Sat, Jan 11 2014 11:56 PM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM

Abdul Khalid Qureshi sucessful

జింఖానా, న్యూస్‌లైన్: బాయ్స్‌టౌన్ జట్టు బ్యాట్స్‌మన్ అబ్దుల్ ఖలీద్ ఖురేషి (156) సెంచరీతో విజృంభించడంతో ఆ జట్టు 86 పరుగుల తేడాతో సటన్ జట్టుపై విజయం సాధించింది. హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ లీగ్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బాయ్స్‌టౌన్ 7 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.
 
 అబ్దుల్ సిద్దిఖీ (33) ఫర్వాలేదనిపించాడు. సటన్ బౌలర్లు నీలేష్ , జనార్ధన్ రెడ్డి చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన సటన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. జనార్ధన్ రెడ్డి (65) అర్ధ సెంచరీతో రాణించాడు. బాయ్స్‌టౌన్ బౌలర్లు అఫ్సర్ 3, సైఫ్ ఉల్ హసన్ రెండు వికెట్లు చేజిక్కించుకున్నారు.
 
 ఎ-ఇన్‌స్టిట్యూషన్ వన్డే లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఏపీ సివిల్ సర్వీసెస్ జట్టు బౌలర్ భాను కిరణ్ (5/17) చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో ఆ జట్టు 117 పరుగుల భారీ తేడాతో పరిశ్రమ్ భవన్ జట్టుపై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఏపీ సివిల్ సర్వీసెస్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చే సింది. వెంకటేశ్ (64) అర్ధ సెంచరీతో చెలరేగగా... సుబ్రమణ్యం (33), అనిల్ కుమార్ (36), రంజిత్ (31) చక్కటి ఆటతీరు కనబరిచారు. అజమ్ 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన పరిశ్రమ్ భవన్ 125 పరుగులకే చేతులెత్తేసింది. ఏపీ సివిల్ సర్వీసెస్ బౌలర్ శ్రీరామ్ రెండు వికెట్లు తీశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement