జింఖానా, న్యూస్‌లైన్: అఖిల భారత సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ అండర్-15 బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాత్విక్ సాయి రాజ్ మెయిన్ డ్రా రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. కడపలో జరుగుతున్న ఈ పోటీల్లో శుక్రవారం జరిగిన మొదటి రౌండ్‌లో నాలుగో సీడ్ సాత్విక్ సాయి రాజ్ 21-9, 21-11తో కరణ్ నేగి (హిమాచల్‌ప్రదేశ్)పై విజయం సాధించాడు.
శ్రీదత్తాత్రేయ రెడ్డి 21-12, 21-11తో అఫ్రాజ్ మహ్మద్ (ఢిల్లీ)పై గెలుపొందాడు. అయితే మరో వైపు హర్ష 4-21, 2-21తో ప్రాకార్ (మధ్యప్రదేశ్) చేతిలో, ఖదీర్ మొయినుద్దీన్ మహ్మద్ 15-21, 8-21తో ఆకాశ్ ఠాకూర్ (బీహార్) చేతిలో పరాజయం పాలయ్యారు. బాలికల విభాగంలో అక్షిత 21-18, 17-21, 21-18తో మణిదీప (పశ్చిమబెంగాల్)పై, తనిష్క్ 21-13, 21-13తో సిమ్రాన్ సింగ్ (మహారాష్ట్ర)పై గెలిచి రెండో రౌండ్‌కు
చేరుకున్నారు.
ఇతర ఫలితాలు
అండర్-13 బాలుర విభాగం: సాయి చరణ్ 21-14, 21-18తో తుషార్ భండారి (ఉత్తరప్రదేశ్)పై, పవన్ కృష్ణ 22-20, 21-14తో తుహిన్ చేతియా (అస్సాం)పై, రితిన్ 20-22, 21-17, 21-7తో వికాస్ యాదవ్ (ఢిల్లీ)పై, శ్రీకర్ 21-11,21-4తో హ్రిశవ్ బారువా (అస్సాం)పై, సాయి షణ్ముఖ అంజన్ 21-8, 21-7తో ఇషాన్ మిట్టల్ (మధ్యప్రదేశ్)పై విజయం సాధించారు.
బాలికల విభాగం: వైష్ణవి రెడ్డి 21-14, 21-17తో జోషి దివ్యాన్షు (ఉత్తరప్రదే శ్)పై, వెన్నెలశ్రీ 14-21, 21-19, 21-16తో అనుప్రభ (తమిళనాడు)పై, గాయత్రి 21-7, 21-14తో రోషిణి వెంకట్ (కర్ణాటక)పై, మేఘ 21-13, 15-21, 21-13తో తన్వి ఇక్బాల్ (మేఘాలయ)పై, నిషిత వర్మ 21-7, 21-12తో అదితి వర్మ (మధ్యప్రదేశ్)పై గెలుపొందారు.
రెండో రౌండ్‌లో సాత్విక్
Published Sat, Feb 8 2014 12:19 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM
Advertisement
Advertisement