
హైలో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్‌కు తొలి రౌండ్‌లోనే ఓటమి ఎదురైంది.
జర్మనీలో బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సైనా 15–21, 8–21తో బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 19–21, 21–19, 21–16తో లీ యాంగ్–లు చెన్ (చైనీస్ తైపీ) ద్వయంపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది.
చదవండి: Ind Vs Ban: కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ ఆరోపణలు.. లేదంటే విజయం తమదేనన్న బంగ్లా క్రికెటర్