క్వార్టర్స్‌లో సైనా, సింధు | Saina Nehwal, PV Sindhu in pre-quarterfinals of Syed Modi badminton tourney | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సైనా, సింధు

Published Fri, Jan 24 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM

క్వార్టర్స్‌లో సైనా, సింధు

క్వార్టర్స్‌లో సైనా, సింధు

లక్నో: డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ పారుపల్లి కశ్యప్ సయ్యద్ మోడి గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి నిష్ర్కమించాడు. అయితే శ్రీకాంత్, సాయిప్రణీత్ మాత్రం క్వార్టర్స్‌కు చేరారు. అటు మహిళల విభాగంలో ఫేవరెట్ క్రీడాకారిణులు సైనా, సింధు కూడా క్వార్టర్స్‌కు అర్హత సాధించారు.
 
 అలవోకగా ముందంజ
 మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సైనా నెహ్వాల్ 21-5, 21-10తో నటాలియా పెర్మినోవా (రష్యా)ను కేవలం 28 నిమిషాల్లోనే ఓడించింది. రెండో సీడ్ సింధు 21-19, 21-5తో స్విట్జర్లాండ్‌కు చెందిన సబ్రినా జాక్వెట్‌పై గెలుపొందింది. డిఫెండింగ్ చాంపియన్‌కు షాక్
 టాప్ సీడ్ డిఫెండింగ్ చాంపియన్ కశ్యప్‌కు పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 19-21, 17-21తో 12వ సీడ్ జుల్ఫాద్‌లీ జుల్కీఫ్లీ (మలేసియా) షాకిచ్చాడు. 11వ సీడ్ ఏపీ కుర్రాడు సాయిప్రణీత్ 15-21, 21-9, 21-16తో  గురుసాయిదత్‌ను ఓడించాడు. ఆరో సీడ్ యువ సంచలనం కిడాంబి శ్రీకాంత్ 19-21, 23-21, 24-22తో 14వ సీడ్ అరవింద్ భట్‌పై చెమటోడ్చి గెలిచాడు.
 
 క్వార్టర్ ఫైనల్లో జ్వాల జోడి
 మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జంట క్వార్టర్స్‌లో ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌లో ఈ జోడి 21-19, 15-21, 21-19తో మూడో సీడ్ అలిసియా-ఫిచో సూంగ్ (మలేసియా) ద్వయంపై నెగ్గింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement