Badminton tournment
-
భారత్ పోరాటం ముగిసె...
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్ల పోరాటం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ లక్ష్యసేన్, మహిళల సింగిల్స్‌లో వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్ పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ గాయంతో వైదొలగగా... కృష్ణ ప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్ జోడీ ఓడిపోయింది. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంట కూడా నిరాశపరిచింది. గురువారం జరిగిన పోటీల్లో ప్రపంచ 12వ ర్యాంకర్, ఏడో సీడ్ లక్ష్యసేన్ 21–16, 15–21, 18–21తో ప్రపంచ 20వ ర్యాంకర్ రస్మస్ గెమ్కే (డెన్మార్క్) చేతిలో కంగుతిన్నాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సైనా 9–21, 12–21తో ఒలింపిక్ చాంపియన్ చెన్ యు ఫె (చైనా) ధాటికి నిలువలేకపోయింది. మహిళల డబుల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ జంట 9–21, 16–21తో ఆరో సీడ్ జాంగ్ షు జియాన్–జెంగ్ యు (చైనా) ద్వయం చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్‌లో గరగ కృష్ణప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్ జోడీ 14–21, 10–21తో లియాంగ్ వి కెంగ్– వాంగ్ చాంగ్ (చైనా) ద్వయం చేతిలో ఇంటిదారి పట్టింది. సాత్విక్ సాయిరాజ్ తుంటిగాయం వల్ల చిరాగ్ షెట్టితో కలిసి బరిలోకి దిగలేకపోయాడు. దీంతో చైనాకే చెందిన లియు చెన్–జువాన్ యి జంట వాకోవర్‌తో ముందంజ వేసింది. -
తొలి రౌండ్లోనే సైనా నెహ్వాల్ ఓటమి
హైలో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్‌కు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. జర్మనీలో బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సైనా 15–21, 8–21తో బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 19–21, 21–19, 21–16తో లీ యాంగ్–లు చెన్ (చైనీస్ తైపీ) ద్వయంపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. చదవండి: Ind Vs Ban: కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ ఆరోపణలు.. లేదంటే విజయం తమదేనన్న బంగ్లా క్రికెటర్ -
శ్రీవేద్య జోడీకి డబుల్స్ టైటిల్
కామెరూన్ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి గురజాడ శ్రీవేద్య మహిళల డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఫైనల్లో శ్రీవేద్య–పూర్వీషా రామ్ (భారత్) ద్వయం 21–12, 21–14తో టాప్ సీడ్ కస్తూరి–వినోషా (మలేసియా) జోడీపై గెలిచింది. ‘అర్జున అవార్డీ’ చేతన్ ఆనంద్‌కు చెందిన అకాడమీలో శ్రీవేద్య శిక్షణ తీసుకుంటోంది. ఇదే టోర్నీలో పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత ప్లేయర్ సతీశ్ 21–13, 21–13తో చువా కిమ్ షెంగ్ (మలేసియా)పై నెగ్గి టైటిల్ సాధించాడు. చదవండి: దక్షిణాసియా ఫుట్‌బాల్ టోర్నీకి సౌమ్య -
‘వరల్డ్ టూర్ ఫైనల్స్’కు సాత్విక్ జోడీ అర్హత
బాలి (ఇండోనేసియా): బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు భారత పురుషుల డబుల్స్ స్టార్‌జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి అర్హత సాధించింది. తద్వారా ఈ మెగా టోర్నీకి అర్హత పొందిన తొలి భారత పురుషుల జంటగా నిలిచింది. గతవారం ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీలో సాత్విక్–చిరాగ్ ద్వయం సెమీఫైనల్ చేరింది. వీరికి పోటీగా ఉన్న జపాన్ జోడీ అకిరా కొగా–తైచి సయితో కూడా సెమీస్‌లోనే ఓడింది. ఆ సెమీస్‌లో తప్పక గెలిస్తేనే క్వాలిఫై కావాల్సి ఉండగా, జపాన్ జంట కూడా ఓడిపోవడంతో సాత్విక్–చిరాగ్ ద్వయానికి మార్గం సుగమమైంది. బుధవారం బాలిలో మొదలయ్యే ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, లక్ష్య సేన్, మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప బరిలో ఉన్నారు. -
నిరీక్షణ ముగిసేనా?
బర్మింగ్హమ్: బ్యాడ్మింటన్లోని అతి పురాతన టోర్నమెంట్లలో ఒకటైన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ పోటీలకు నేడు తెరలేవనుంది. 2001లో పుల్లెల గోపీచంద్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన తర్వాత మళ్లీ ఈ మెగా ఈవెంట్లో భారత క్రీడాకారులకు టైటిల్ లభించలేదు. 2015లో సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. గతేడాది పీవీ సింధు పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. అయితే కొంతకాలంగా అంతర్జాతీయస్థాయిలో భారత క్రీడాకారుల ప్రదర్శనను లెక్కలోకి తీసుకుంటే... ఈసారి కూడా మనోళ్లు టైటిల్ రేసులో ఉన్నారు. ముఖ్యంగా మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్లపై భారీ అంచనాలు ఉన్నాయి. మాజీ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) గాయంతో ఈ టోర్నీకి దూరం కావడం... ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) ఫామ్‌లో లేకపోవడం.. జపాన్ క్రీడాకారిణులు నొజోమి ఒకుహారా, అకానె యామగుచిలపై మంచి రికార్డు ఉండటంతో... సింధు, సైనాలు తమ స్థాయికి తగ్గట్టు ఆడితే వారికి ఈసారి విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బుధవారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో పదో ర్యాంకర్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)తో ఐదో ర్యాంకర్ పీవీ సింధు... కిర్స్టీ గిల్మోర్ (స్కాట్లాండ్)తో సైనా నెహ్వాల్ తలపడతారు. ముఖాముఖి రికార్డులో సింధు 8–6తో సుంగ్ జీ హున్‌పై... సైనా 6–0తో గిల్మోర్‌పై ఆధిక్యంలో ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి అత్యధికంగా నలుగురు బరిలో ఉన్నారు. మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి రౌండ్లో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)తో శ్రీకాంత్; ప్రణయ్‌తో సాయిప్రణీత్; అక్సెల్సన్ (డెన్మార్క్)తో సమీర్ వర్మ పోటీపడనున్నారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ఒయు జువాని–రెన్ జియాంగ్యు (చైనా) జోడీతో సుమీత్ రెడ్డి–మను అత్రి జంట... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో షిమో తనాకా–కొహారు యోనెమోటో (జపాన్) ద్వయంతో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీ తలపడతాయి. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో చాంగ్ తక్ చింగ్–ఎన్జీ వింగ్ యుంగ్ (హాంకాంగ్)లతో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా ఆడతారు. -
రుత్వికకు టైటిల్
టాటా ఓపెన్ బ్యాడ్మింటన్ ముంబై: టాటా ఓపెన్ అంతర్జాతీయ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి గద్దె రుత్వికా శివాని మహిళల టైటిల్‌ను గెలుచుకుంది. ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో రుత్విక 19-21, 21-18, 21-14తో అరుంధతి పంతవానేపై గెలిచింది. పురుషుల సింగిల్స్ టైటిల్ పోరులో గురుసాయిదత్ 16-21, 22-20, 17-21తో హెచ్.ఎస్.ప్రణయ్ చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్ ఫైనల్లో అపర్ణా బాలన్-ప్రజక్తా సావంత్ 21-13, 10-21, 21-13తో మేఘన-మనీషాపై; మిక్స్‌డ్‌లో సిక్కి రెడ్డి-మనూ అత్రి జంట 21-19, 19-21, 21-10తో అక్షయ్ దివాల్కర్-ప్రద్న్యా గాద్రెపై నెగ్గారు. పురుషుల డబుల్స్‌లో సుమిత్ రెడ్డి-మనూ అత్రి 21-15, 21-15తో శ్లోక్ రామచంద్రన్-సంయమ్ శుక్లాపై నెగ్గారు. -
సింగిల్స్ చాంప్ వైష్ణవి
గాయత్రితో కలిసి డబుల్స్‌లో రన్నరప్ ఆలిండియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి వైష్ణవి రెడ్డి సత్తాచాటింది. కర్ణాటకలోని ఉడిపిలో జరిగిన ఈ టోర్నీలో ఆమె బాలికల అండర్-13 సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. డబుల్స్‌లో పుల్లెల గాయత్రితో కలిసి బరిలోకి దిగిన వైష్ణవి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. బాలుర ఈవెంట్లో మూడో సీడ్ తోకల పవన్‌కృష్ణ రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో వైష్ణవి రెడ్డి... టాప్ సీడ్ సిమ్రాన్ సింగ్‌కు షాకిచ్చింది. 46 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో ఆమె 13-21, 21-16, 21-13తో సిమ్రాన్‌పై విజయం సాధించింది. డబుల్స్‌లో ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన వైష్ణవి-గాయత్రి జంట 22-20, 17-21, 19-21తో టాప్ సీడ్ రిచా ముక్తిబోధ్-సిమ్రాన్ సింగ్ చేతిలో పోరాడి ఓడింది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో ఓడినప్పటికీ... తెలుగమ్మాయిలు చక్కని పోరాట పటిమ కనబరిచారు. బాలుర అండర్-13 ఫైనల్లో మూడో సీడ్ పవన్‌కృష్ణ 18-21, 16-21తో మైస్నమ్ మీరబ (మణిపూర్) చేతిలో పరాజయం చవిచూశాడు. బాలుర అండర్-13 డబుల్స్ టైటిల్ పోరులో శ్రీకర్ మడిన (ఏపీ)-మైస్నమ్ మీరబ (మణిపూర్) జోడి 13-21, 21-14, 21-14తో రెండో సీడ్ రితిన్- తోకల పవన్‌కృష్ణ (ఏపీ) ద్వయంపై గెలుపొందింది. బాలుర అండర్-15 డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ కృష్ణప్రసాద్-సాత్విక్ సాయిరాజ్ (ఏపీ) జంట 21-14, 21-16తో రెండో సీడ్ ప్రజ్ఞాన్ జ్యోతి గగోయ్-లక్ష్యాసేన్ జోడిపై విజయం సాధించింది. -
క్వార్టర్స్‌లో పోరాడి ఓడిన సాయిప్రణీత్
రష్యా గ్రాండ్ ప్రి న్యూఢిల్లీ: తెలుగుతేజం భమిడిపాటి సాయిప్రణీత్ రష్యా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో ఓడినా... స్ఫూర్తిదాయక పోరాటంతో ఆకట్టుకున్నాడు. వ్లాదివొస్తోక్‌లో శుక్రవారం జరిగిన రష్యా ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువ ఆటగాడు, ఆరో సీడ్ సాయిప్రణీత్ 21-23, 17-21తో రెండో సీడ్ వ్లాదిమిర్ మల్కొవ్ (రష్యా) చేతిలో పోరాడి ఓడాడు. ఒక దశలో హైదరాబాద్ ఆటగాడు... మల్కొవ్కు ముచ్చెమటలు పట్టించాడు. రెండు గేముల్లోనూ నువ్వానేనా అన్నట్లు తలపడ్డాడు. అంతకుముందు తొలి రెండు రౌండ్లలో బై లభించడంతో ముందంజ వేసిన ప్రణీత్ ప్రిక్వార్టర్స్‌లో 21-13, 21-4తో స్టానిస్లావ్ పుఖోవ్ (రష్యా)పై అలవోక విజయం సాధించాడు. -
చాంప్స్ రుత్విక, వృశాలి, రాహుల్
డబుల్స్‌లో మెరిసిన కృష్ణ ప్రసాద్-సాత్విక్ సాయిరాజ్ జోడి జాతీయ జూ॥ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: గౌతమ్ ఠక్కర్ స్మారక అఖిల భారత జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారులు అదరగొట్టారు. మొత్తం ఐదు విభాగాల్లో టైటిల్స్ సాధించారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న గద్దె రుత్విక శివాని, గుమ్మడి వృశాలి, రాహుల్ యాదవ్ సింగిల్స్ విభాగాల్లో విజేతలుగా అవతరించారు. డబుల్స్‌లో కృష్ణ ప్రసాద్-సాత్విక్ సాయిరాజ్ జోడి రెండు టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ముంబైలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో అండర్-19 బాలికల సింగిల్స్ ఫైనల్లో రుత్విక శివాని 21-15, 21-8తో నాలుగో సీడ్ శిఖా గౌతమ్ (కర్ణాటక)ను బోల్తా కొట్టించింది. సెమీఫైనల్లో టాప్ సీడ్ రేష్మా కార్తీక్‌ను ఓడించిన రుత్విక ఫైనల్లోనూ తన జోరు కొనసాగించింది. తొలి గేమ్‌లో కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్నా... రెండో గేమ్‌లో రుత్విక స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. అండర్-17 బాలికల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ వృశాలి 21-18, 21-17తో టాప్ సీడ్ శ్రేయాన్షి పరదేశి (ఎయిరిండియా)పై సంచలన విజయం సాధించింది. 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వృశాలి కీలకదశలో పాయింట్లు నెగ్గి మ్యాచ్ ఫలితాన్ని శాసించింది. అండర్-17 బాలుర సింగిల్స్ ఫైనల్లో రాహుల్ యాదవ్ 21-13, 21-6తో హైదరాబాద్‌కే చెందిన ఎం.కనిష్క్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. తొలి గేమ్‌లో కాస్త పోటీనిచ్చిన కనిష్క్... రెండో గేమ్‌లో మాత్రం రాహుల్ ధాటికి ఎదురునిలువలేదు. అండర్-17 బాలుర డబుల్స్ ఫైనల్లో కృష్ణ ప్రసాద్-సాత్విక్ సాయిరాజ్ ద్వయం 21-18, 13-21, 21-16తో కార్తికేయ్ గుల్షన్ కుమార్ (ఢిల్లీ)-బోధిత్ జోషి (ఉత్తరాఖాండ్) జంటను ఓడించింది. అండర్-19 డబుల్స్ ఫైనల్లో కృష్ణ ప్రసాద్-సాత్విక్ జోడి 22-20, 22-20తో విఘ్నేశ్ (మహారాష్ట్ర)-గంగాధర రావు (ఆంధ్రప్రదేశ్) జంటపై గెలిచింది. అండర్-19 మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్ (హైదరాబాద్)-అహల్య హర్జానీ (మహారాష్ట్ర) ద్వయం 18-21, 29-27, 19-21తో విఘ్నేశ్-వైష్ణవి అయ్యర్ (మహారాష్ట్ర) జోడి చేతిలో ఓడిపోయింది. అండర్-19 బాలికల డబుల్స్ ఫైనల్లో సుధా కల్యాణి-రియా ముఖర్జీ జంట 19-21, 18-21తో మహిమ అగర్వాల్-శిఖా గౌతమ్ (కర్ణాటక) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. -
రుత్విక, వృశాలి సంచలనం
క్వార్టర్స్‌లో రాహుల్, సిరిల్ వర్మ ఆలిండియా జూ॥బ్యాడ్మింటన్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: గౌతమ్ ఠక్కర్ స్మారక అఖిల భారత జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారిణులు జి.రుత్విక శివాని, జి.వృశాలి సంచలన విజయాలు సాధించారు. శుక్రవారం జరిగిన అండర్-19 బాలికల ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అన్‌సీడెడ్ రుత్విక 21-6, 21-16 తేడాతో మూడో సీడ్ శ్రీయాన్షి పర్దేశి (ఎయిరిండియా)పై... అన్‌సీడెడ్ వృశాలి 21-13, 17-21, 21-12తో ఆరో సీడ్ కరిష్మా వాడ్కర్ (మహారాష్ట్ర)పై గెలిచారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో క్రీడాకారిణి సంతోషి హాసిని 18-21, 15-21 తేడాతో రేష్మా కార్తీక్ (ఎయిరిండియా) చేతిలో ఓటమి పాలైంది. ఇక బాలికల అండర్-17 ప్రిక్వార్టర్స్‌లో సాయి ఉత్తేజితరావు 21-18, 20-22, 21-14 తేడాతో అశ్మితా చలీహ (అసోం)పై, జి.వృశాలి 21-16, 21-18 తేడాతో రియా ముఖర్జీ (ఉత్తరప్రదేశ్)పై గెలుపొందగా, కె.వైష్ణవి 21-15, 21-18 తేడాతో అనురా ప్రభుదేశాయ్ (గోవా)పై నెగ్గి క్వార్టర్స్‌కు చేరింది.అయితే బి.అర్చన 6-21, 6-21 తేడాతో శిఖా గౌతమ్ (కర్ణాటక) చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. బాలుర అండర్-17లో ఏపీ క్రీడాకారులు ఎం.కనిష్క్, రాహుల్ యాదవ్, సిరిల్ వర్మలు క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ కనిష్క్ 21-17, 21-12 తేడాతో కార్తీక్ జిందాల్ (హర్యానా)పై గెలుపొందగా, మూడో సీడ్ రాహుల్ యాదవ్ 21-11, 19-21, 21-18తో సిద్ధార్థ్ ప్రతాప్‌సింగ్ (చత్తీస్‌గఢ్)పై చెమటోడ్చి నెగ్గాడు. ఇక సిరిల్ వర్మ 21-12, 21-14తో నిశ్చయ్ జైస్వాల్ (మధ్యప్రదేశ్)పై గెలవగా, కె.జగదీశ్ 10-21, 17-21 తేడాతో రాహుల్ భరద్వాజ్ (కర్ణాటక) చేతిలో ఓటమిపాలయ్యాడు. -
భారత్ పోరాటం ముగిసింది
జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్ల పోరు రెండో రౌండ్లోనే ముగిసింది. సింగిల్స్‌లో తాన్వి లాడ్, సౌరభ్‌వర్మ వెనుదిరగ్గా...డబుల్స్ జోడీలు ప్రభావం చూపలేకపోయాయి. తొలి రౌండ్లో సంచలనం సృష్టించిన తాన్వి తర్వాతి మ్యాచ్‌లో అదే ఆటతీరును పునరావృతం చేయలేకపోయింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి జిన్ ల్యూ 21-18, 21-12 తేడాతో తాన్విని సునాయాసంగా ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సౌరభ్ వర్మ 9-21, 6-21 స్కోరుతో నాలుగో సీడ్ కెనిచి టగో (జపాన్) చేతిలో చిత్తుగా ఓడాడు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల- అశ్విని పొన్నప్ప జోడి పరాజయం పాలైంది. యున్ జంగ్-న కిమ్ (కొరియా) జంట 21-12, 21-23, 21-12తో భారత ద్వయంపై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్‌లో కూడా ఇండియాకు కలిసి రాలేదు. అశ్విని-తరుణ్ కోన 17-21, 11-21 తేడాతో మిసాకి మట్సుటొమొ-కెనిచి హయకవ (జపాన్) జంట చేతిలో ఓడిపోయారు. -
కశ్యప్, శ్రీకాంత్ ఓటమి
టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారిణి తాన్వి లాడ్ సంచలనం సృష్టించింది. ఈ టోర్నీ బరిలోకి దిగిన ఏకైక భారత మహిళా షట్లర్ అయిన తాన్వి తన తొలి రౌండ్ మ్యాచ్‌లో 13-21, 21-11, 21-17 స్కోరుతో ప్రపంచ 18వ ర్యాంకర్ కిర్స్టీ గిల్మర్ (స్కాట్లాండ్)పై విజయం సాధించింది. భారత స్టార్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు ఈ టోర్నీలో పాల్గొనడం లేదు. సౌరభ్ వర్మ ముందంజ... పురుషుల విభాగంలో తెలుగు తేజాలు పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్‌లకు నిరాశే ఎదురైంది. సింగిల్స్‌లో 116వ ర్యాంక్‌లో ఉన్న రికి తకెషితా (జపాన్) చేతిలో కశ్యప్ 21-15, 23-25, 18-21 తేడాతో ఓటమిపాలయ్యాడు. మరో మ్యాచ్‌లో మార్క్ వెబ్లర్ (జర్మనీ) 18-21, 21-13, 21-8తో శ్రీకాంత్‌ను చిత్తు చేశాడు. మరో ఆటగాడు గురుసాయి దత్ కూడా తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. టకుమా యుదా (జపాన్) 21-10, 15-21, 21-13 తేడాతో సాయిదత్‌ను ఓడించాడు. అయితే మరో భారత ఆటగాడు సౌరభ్ వర్మ మాత్రం ముందంజ వేశాడు. తొలి రౌండ్లో అతను 19-21, 21-14, 22-20తో నాన్ వీ (హాంకాంగ్)పై గెలుపొంది రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మహిళల డబుల్స్‌లో జ్వాల-అశ్విని జోడి 21-18, 21-16తో అయానే కురిహర-నారు షినోయా (జపాన్)పై, మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విన్-తరుణ్ కోన జంట 18-21, 21-18, 21-17తో పీటర్ కస్బర్-ఇసాబెల్ హెట్రిచ్ (జర్మనీ)పై విజయం సాధించి ముందంజ వేశారు. -
అండర్-13 బ్యాడ్మింటన్ చాంప్ అనురాగ్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రైజ్‌మనీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో అండర్-13 బాలుర సింగిల్స్ టైటిల్‌ను కె.అనురాగ్ కైవసం చేసుకున్నాడు. మెదక్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చందానగర్‌లోని జీహెచ్ఎంసీ పీజేఆర్ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన అండర్-13 బాలుర సింగిల్స్ ఫైనల్లో కె.అనురాగ్ 3-1తో కె.సాయి చరణ్‌పై విజయం సాధించాడు. విజేతలకు సంగారెడ్డి కోర్టు మెజిస్ట్రేట్ డి.దుర్గాప్రసాద్, సంగారెడ్డి ఎమ్మెల్యే జి.మహిపాల్ రెడ్డి ట్రోఫీలను అందజేశారు. అండర్-10 బాలుర సింగిల్స్: 1.జి.ప్రణవ్ రావు, 2.స్వాతిక్ రెడ్డి. డబుల్స్: 1.జి.ప్రణవ్ రావు, ఎ.పి.రవితేజ జోడి, 2.వి.ఎస్.ఎస్.సందేష్, స్వాతిక్‌రెడ్డి జోడి. అండర్-15 బాలుర సింగిల్స్: 1.నవనీత్(మెదక్), 2.కె.ప్రశాంత్(ఖమ్మం).అండర్-15 బాలికల సింగిల్స్: 1.కె.ప్రీతి, 2.కె.భార్గవి. డబుల్స్: 1.కె.ప్రీతి, బి.సుప్రియ జోడి. 2.కె.భార్గవి, ఎ.అభిలాష జోడి. -
రెండో రౌండ్లో సింధు
కశ్యప్, పవార్ ముందంజ స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ బాసెల్: ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు... స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడోసీడ్ సింధు 21-18, 21-15తో సాంటాష్ సానిర్ (మలేసియా)పై విజయం సాధించి రెండోరౌండ్లోకి ప్రవేశించింది. 32 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ అమ్మాయి తొలి గేమ్‌లో చకచకా పాయింట్లు గెలుస్తూ 10-3కు దూసుకుపోయింది. ఈ దశలో పుంజుకున్న మలేసియా ప్లేయర్.. సింధు ఆధిక్యాన్ని 15-16కు తగ్గించి... 17-17, 18-18తో స్కోరును సమం చేసింది. అయితే సింధు భిన్నమైన షాట్లతో వరుసగా మూడు పాయింట్లు గెలిచి గేమ్‌ను సొంతం చేసుకుంది. స్కోరు 7-7 వరకు రెండో గేమ్ హోరాహోరీగా సాగింది. అదే దూకుడును ప్రదర్శించిన సానిర్ 13-9 ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ పట్టు విడవకుండా పోరాడిన సింధు 14-14తో స్కోరు సమం చేసింది. ఆ తర్వాత ఇక వెనుదిరిగి చూడలేదు. వరుస పాయింట్లతో హోరెత్తించి గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో సింగిల్స్ మ్యాచ్‌లో సయాలీ రాణే (భారత్) 8-21, 9-21తో మూడోసీడ్ షిజియాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్‌లో జ్వాల-అశ్విని జోడికి చుక్కెదురైంది. తొలి రౌండ్లో జ్వాల-అశ్విని 19-21, 21-13, 18-21తో ఇస్బెల్ హెట్రిచ్-కార్లా నెల్టీ (జర్మనీ) చేతిలో ఓటమిపాలైంది. కశ్యప్ హవా మంగళవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఏపీ కుర్రాడు, మూడోసీడ్ పారుపల్లి కశ్యప్ 21-17, 21-15తో ఎరిక్ మిజిస్ (నెదర్లాండ్స్)పై గెలిచి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. 34 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది. మరో మ్యాచ్‌లో ఆనంద్ పవార్ 21-17, 21-10తో కోక్ పోంగ్ లోక్ (మలేసియా)ను ఓడించాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో తరుణ్ కోనా-అశ్విని జోడి 10-21, 21-16, 13-21తో రాబర్ట్ మట్సుయాక్-ఆగ్నేస్కా వొజ్కోవాస్కా (ఇండోనేసియా) చేతిలో ఓడింది. -
విజేత మధురానగర్ షాట్స్
ఇంటర్ క్లబ్ బ్మాడ్మింటన్ టోర్నీ జింఖానా, న్యూస్‌లైన్: ఏపీ అంతర్ జిల్లా ఇంటర్ క్లబ్ బ్యాడ్మింటన్ టోర్నీలో మధురానగర్ షాట్స్ జట్టు విజేతగా నిలిచింది. మధురానగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో 5 జిల్లాలకు చెందిన 13 క్లబ్‌లు పాల్గొన్నాయి. శనివారం జరిగిన ఈ పోటీల ఫైనల్లో మధురానగర్ షాట్స్ 3-0తో మధురానగర్-సీపై విజయం సాధించింది. వివేక్ (షాట్స్) 15-10, 15-9తో నవనీత్‌పై నెగ్గగా... సృష్టి (షాట్స్) 15-8, 15-10తో కేయూరపై గెలుపొందింది. అన ంతరం డబుల్స్ విభాగంలో ఏవీ రాజు-అనిల్ రెడ్డి జోడి (షాట్స్) 15-7, 15-6తో శేషాద్రి-రవి జంటను ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో మధురానగర్-సి 3-1తో మధురానగర్-ఎపై, మధురానగర్ షాట్స్ 3-0తో సరూర్‌నగర్-బిపై గెలుపొందాయి. విజేతలకు హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు సోమరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. -
అండర్-19 విజేత సిరిల్ వర్మ
చండీగఢ్: కృష్ణ ఖేతాన్ ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అండర్-19 విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సిరిల్ వర్మ విజేతగా నిలిచాడు. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీ ఫైనల్లో 12వ సీడ్ సిరిల్ వర్మ 21-10, 21-13 స్కోరుతో అరింతప్ దాస్ గుప్తాపై ఘన విజయం సాధించాడు. బాలికల అండర్-19 విభాగంలో ఏపీ అమ్మాయి డి. పూజకు చుక్కెదురైంది. ఫైనల్లో టాప్ సీడ్ రేవతి దేవస్థలే 21-16, 21-15తో పూజను ఓడించింది. అండర్-17 విభాగంలో రాష్ట్ర షట్లర్లు రెండు కేటగిరీల్లోనూ విజేతలుగా నిలిచారు. హోరాహోరీగా సాగిన బాలుర విభాగం ఫైనల్లో రాహుల్ యాదవ్ 18-21, 21-8, 21-16 తేడాతో ఏపీకే చెందిన రెండో సీడ్ ఎం. కనిష్క్పై గెలుపొంది టైటిల్ నెగ్గాడు. బాలికల ఫైనల్లో ఐదో సీడ్ వృషాలి 16-21, 21-14, 21-17 స్కోరుతో నాలుగో సీడ్ మహిమా అగర్వాల్‌పై విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. డబుల్స్ ఫలితాలు... అండర్-17 బాలుర డబుల్స్‌లో జి.కృష్ణ ప్రసాద్-సాత్విక్...బాలికల డబుల్స్‌లో కె.వైష్ణవి-సోనికా సాయి విజేతలుగా నిలిచారు. అండర్-19 బాలుర డబుల్స్‌లో విఘ్నేశ్ -గంగాధర రావు...బాలికల డబుల్స్‌లో పూజ-నింగ్షీ బ్లోక్ టైటిల్ నెగ్గారు. అండర్-19 మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్-డి. పూజ జోడి విజేతగా నిలిచింది. -
ఫైనల్లో షణ్ముఖ అంజన్
జింఖానా, న్యూస్‌లైన్: అఖిల భారత సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ అండర్-13 బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు సాయి షణ్ముఖ అంజన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కడపలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన సెమీఫైనల్లో రెండో సీడ్ అంజన్ 21-16, 21-9తో మన రాష్ట్రానికే చెందిన రితిన్పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో టాప్ సీడ్ మైస్నమ్ మియరబా (మణిపూర్) 21-12, 21-12తో మూడో సీడ్ వరుణ్ దేవ్ (మహారాష్ట్ర)పై గెలుపొందాడు. మరో వైపు బాలికల డబుల్స్ విభాగం సెమీఫైనల్లో వైష్ణవి రెడ్డి- పుల్లెల గాయత్రి జోడి 17-21, 21-16, 22-24తో రిచా ముక్తిబోద్ (కర్ణాటక) -సిమ్రాన్ (మహారాష్ట్ర) జోడి చేతిలో ఓటమి చవిచూసింది. మరో సెమీఫైనల్లో దీత్య జగదీశ్- మేధ శశిధరణ్ (కర్ణాటక) జోడి 23-21, 21-13తో జోషి దివ్యాన్షి-షిఫాలి గౌతమ్ (ఉత్తరప్రదేశ్) జోడిపై నెగ్గింది. ఇతర ఫలితాలు: అండర్-15 బాలుర విభాగం: లక్ష్యసేన్ (ఉత్తరప్రదేశ్) 21-10, 21-14తో కార్తికేయ గుల్షన్ కుమార్ (ఢిల్లీ)పై, రాహుల్ భరద్వాజ్(కర్ణాటక) 13-21, 21-11, 21-16తో ఓరిజిత్ చాలిహపై గెలిచారు. బాలికల విభాగం: పూర్వ బార్వె (మహారాష్ట్ర) 21-16, 22-20తో పూజ దేవ్లేకర్ (మహారాష్ట్ర)పై, అశ్విన్ భట్ (కర్ణాటక) 21-18, 21-19తో రియా ఆరోల్కర్ (మహారాష్ట్ర)పై విజయం సాధించారు. బాలికల డబుల్స్: అశ్విన్ భట్-మిథుల జంట (కర్ణాటక ) 21-19, 23-21తో రియా అరోల్కర్-పూర్వ బార్వె (మహారాష్ట్ర) ద్వయంపై నెగ్గింది. -
సిక్కి రెడ్డి జోడికి టైటిల్
బెంగళూరు: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సిక్కిరెడ్డి-మేఘన జోడీ డబుల్స్ టైటిల్ గెలిచింది. ఫైనల్లో 21-19, 21-19తో టాప్‌సీడ్ ప్రజక్తా-ఆరతి జోడీపై నెగ్గారు. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సిక్కిరెడ్డి-నందగోపాల్ ద్వయం 14-21, 14-21తో టాప్ సీడ్ తరుణ్ కొన (ఆంధ్రప్రదేశ్)- అశ్విని పొన్నప్ప జోడి చేతిలో పరాజయం చవిచూసింది. పురుషుల డబుల్స్ టైటిల్ పోరులో నందగోపాల్-హేమ నాగేంద్రబాబు (ఏపీ) ఓడిపోయారు. కాగా మహిళల సింగిల్స్ టైటిల్‌ను తాన్వీ లాడ్, పురుషుల టైటిల్‌ను అనూప్ శ్రీధర్ చేజిక్కించుకున్నారు. -
క్వార్టర్స్‌లో కార్తికేయ్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆలిండియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో అండర్-15 బాలుర సింగిల్స్‌లో ఏపీ కుర్రాడు డి.జస్వం త్, టాప్ సీడ్ కార్తికేయ్ (ఢిల్లీ) క్వార్టర్ ఫైనల్స్‌కు చేరారు. సాత్విక్ సాయిరాజ్(ఏపీ) ఓడిపోయాడు. శనివారం కడపలోని వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియం లో జరిగిన బాలుర సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సి.జస్వంత్ (ఏపీ) 10-21, 22-20, 21-10తో మైస్నమ్ మేరాబా (మణిపూర్)పై విజయం సాధించాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ కార్తికేయ్ (ఢిల్లీ) 21-16, 21-8తో ప్రాకార్ (మధ్యప్రదేశ్)పై గెలిచాడు. ఇతర మ్యాచ్‌ల్లో కిరణ్ (కేరళ) 12-21, 21-18, 21-17తో నాలుగో సీడ్ సాత్విక్ సాయిరాజ్(ఏపీ)పై, రాహుల్ 21-19, 21-11తో ఆకాశ్ యాదవ్ (ఢిల్లీ)పై, ఒరిజీత్ (అస్సాం) 21-16, 21-15తో శ్రీదత్తాత్రేయ రెడ్డి(ఏపీ)పై, ధృవ్ కపిలా (పంజాబ్) 17-21, 21-10, 21-14తో కె.ఆర్.కె.చరిత్ (ఏపీ)పై, లక్ష సేన్ (ఉత్తరాంచల్) 21-13, 21-12తో కె.జగదీష్ (ఏపీ)పై నెగ్గారు. -
రెండో రౌండ్లో సాత్విక్
జింఖానా, న్యూస్‌లైన్: అఖిల భారత సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ అండర్-15 బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాత్విక్ సాయి రాజ్ మెయిన్ డ్రా రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. కడపలో జరుగుతున్న ఈ పోటీల్లో శుక్రవారం జరిగిన మొదటి రౌండ్లో నాలుగో సీడ్ సాత్విక్ సాయి రాజ్ 21-9, 21-11తో కరణ్ నేగి (హిమాచల్‌ప్రదేశ్)పై విజయం సాధించాడు. శ్రీదత్తాత్రేయ రెడ్డి 21-12, 21-11తో అఫ్రాజ్ మహ్మద్ (ఢిల్లీ)పై గెలుపొందాడు. అయితే మరో వైపు హర్ష 4-21, 2-21తో ప్రాకార్ (మధ్యప్రదేశ్) చేతిలో, ఖదీర్ మొయినుద్దీన్ మహ్మద్ 15-21, 8-21తో ఆకాశ్ ఠాకూర్ (బీహార్) చేతిలో పరాజయం పాలయ్యారు. బాలికల విభాగంలో అక్షిత 21-18, 17-21, 21-18తో మణిదీప (పశ్చిమబెంగాల్)పై, తనిష్క్ 21-13, 21-13తో సిమ్రాన్ సింగ్ (మహారాష్ట్ర)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ఇతర ఫలితాలు అండర్-13 బాలుర విభాగం: సాయి చరణ్ 21-14, 21-18తో తుషార్ భండారి (ఉత్తరప్రదేశ్)పై, పవన్ కృష్ణ 22-20, 21-14తో తుహిన్ చేతియా (అస్సాం)పై, రితిన్ 20-22, 21-17, 21-7తో వికాస్ యాదవ్ (ఢిల్లీ)పై, శ్రీకర్ 21-11,21-4తో హ్రిశవ్ బారువా (అస్సాం)పై, సాయి షణ్ముఖ అంజన్ 21-8, 21-7తో ఇషాన్ మిట్టల్ (మధ్యప్రదేశ్)పై విజయం సాధించారు. బాలికల విభాగం: వైష్ణవి రెడ్డి 21-14, 21-17తో జోషి దివ్యాన్షు (ఉత్తరప్రదే శ్)పై, వెన్నెలశ్రీ 14-21, 21-19, 21-16తో అనుప్రభ (తమిళనాడు)పై, గాయత్రి 21-7, 21-14తో రోషిణి వెంకట్ (కర్ణాటక)పై, మేఘ 21-13, 15-21, 21-13తో తన్వి ఇక్బాల్ (మేఘాలయ)పై, నిషిత వర్మ 21-7, 21-12తో అదితి వర్మ (మధ్యప్రదేశ్)పై గెలుపొందారు. -
ఫైనల్లో నందగోపాల్, సిక్కి రెడ్డి జోడిలు
బెంగళూరు: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నందగోపాల్, సిక్కి రెడ్డి తమ భాగస్వాములతో కలిసి డబుల్స్ విభాగాల్లో టైటిల్ పోరుకు అర్హత సాధించారు. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో నందగోపాల్-హేమనాగేంద్ర బాబు (ఆంధ్రప్రదేశ్) జంట 21-10, 21-11తో ఆంటోనీ బెన్నెట్-సూరజ్ జోడిపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో నందగోపాల్-సిక్కి రెడ్డి ద్వయం 21-14, 21-16తో హేమనాగేంద్ర బాబు-పూర్వీషా రామ్ జోడిని ఓడించింది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సిక్కి రెడ్డి-మేఘన జంట 21-14, 21-17తో ధన్యా నాయర్-మోహితా సచ్దేవ్ ద్వయంపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో క్వాలిఫయర్ సిరిల్ వర్మ (ఆంధ్రప్రదేశ్) 15-21, 21-18, 13-21తో అనూప్ శ్రీధర్ (కర్ణాటక) చేతిలో ఓడిపోయాడు. -
మెయిన్ ‘డ్రా’కు సిరిల్, పూజ
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సిరిల్ వర్మ, ఎం.కనిష్క్, డి.పూజ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. బెంగళూరులో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన పురుషుల క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో సిరిల్ వర్మ 15-9, 15-7తో కబీర్ కంజార్కర్ (మహారాష్ట్ర)పై, కనిష్క్ 15-8, 15-5తో మిథున్ (కర్ణాటక)పై గెలిచారు. మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో డి.పూజ 18-16, 15-11తో స్వాతి శర్మ (ఉత్తరాఖండ్)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో రాష్ట్రానికే చెందిన కె.వైష్ణవి 15-9, 11-15, 12-15తో జూహీ దేవాంగన్ (చత్తీస్‌గఢ్) చేతిలో ఓడిపోయి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయింది. అన్ని విభాగాల్లో మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు గురువారం మొదలవుతాయి. -
చాంప్ సింధు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్టార్ షట్లర్ పి.వి.సింధు అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచింది. కొచ్చిలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో టాప్ సీడ్ సింధు 21-11, 21-11తో మూడో సీడ్ పి.సి.తులసి (కేరళ)పై ఘనవిజయం సాధించింది. ఇక మహిళల డబుల్స్‌లోనూ రాష్ట్రానికి చెందిన సిక్కిరెడ్డి జోడి టైటిల్ సాధించింది. ఫైనల్లో అపర్ణ బాలన్ జతగా మూడో సీడ్ సిక్కి రెడ్డి 21-16, 21-13తో టాప్ సీడ్ ప్రజక్తా సావంత్-ఆరతి సారా జంటను కంగు తినిపించింది. కాగా, పురుషుల సింగిల్స్ టైటిల్‌ను హెచ్.ఎస్.ప్రణయ్ గెలుచుకోగా... డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ ద్వయం చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో ప్రణయ్ 21-13, 21-2తో అనూప్ శ్రీధర్‌పై ఏకపక్ష విజయం నమోదు చేశాడు. డబుల్స్‌లో టాప్ సీడ్ ప్రణవ్-దివాల్కర్ జోడి 21-9, 23-25, 21-19 తో రెండో సీడ్ ఆల్విన్ ఫ్రాన్సిస్-అరుణ్ విష్ణు జంటపై గెలుపొందింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో అరుణ్ విష్ణు-అపర్ణ బాలన్ ద్వయం విజేతగా నిలిచింది. -
మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు
కొచ్చి: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ స్టార్ పి.వి. సింధు టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. మహిళల డబుల్స్‌లో రాష్ట్రానికి చెందిన సిక్కి రెడ్డి జోడి కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సింధు 19-21, 21-19, 21-9తో ఆరో సీడ్ సయాలీ గోఖలేపై విజయం సాధించింది. మరో సెమీస్‌లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన 8వ సీడ్ రుత్విక శివాని 19-21, 19-21తో మూడో సీడ్ పి.సి.తులసి (కేరళ) చేతిలో ఓడింది. ఆదివారం జరిగే ఫైనల్లో తులసీతో సింధు అమీతుమీ తేల్చుకోనుంది. మహిళల డబుల్స్ ఈవెంట్లో మూడో సీడ్ సిక్కిరెడ్డి (ఏపీ) -అపర్ణా బాలన్ జంట 21-12, 21-14తో రెండో సీడ్ మనీషా (ఏపీ)-సంయోగిత గోర్పడే జోడికి షాకిచ్చింది. మరో సెమీస్‌లో మేఘన-రీతుపర్ణా దాస్ (ఆంధ్రప్రదేశ్) జోడి 12-21, 21-18, 15-21తో టాప్ సీడ్ ప్రజక్తా సావంత్- ఆరతి సారా జంట చేతిలో పరాజయం చవిచూసింది. ఫైనల్లో సిక్కిరెడ్డి జోడి... ప్రజక్తా జంటతో తలపడుతుంది. పురుషుల డబుల్స్‌లో హేమ నాగేంద్రబాబు-నందగోపాల్ (ఏపీ) 15-21, 14-21తో అల్విన్ ఫ్రాన్సిస్- అరుణ్ విష్ణు జంట చేతిలో, మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-నందగోపాల్ (ఏపీ) జోడి 18-21, 19-21తో ప్రజక్తా- సనావే థామస్ జంట చేతిలో పరాజయం చవిచూశారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ ప్రణయ్ 21-18, 13-21, 16-21తో ఏపీ యువ సంచలనం, టాప్ సీడ్ కిడాంబి శ్రీకాంత్‌కు షాకిచ్చాడు. -
క్వార్టర్స్‌లో సింధు, రుత్విక
కొచ్చి: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పి.వి.సింధు, రుత్విక శివాని క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ సింధు 21-7, 21-6తో మొహితా సచ్‌దేవ్‌పై, రుత్విక శివాని 21-13, 21-12తో రసిక రాజే (మహారాష్ట్ర)పై గెలిచారు. మరో మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన శ్రీ కృష్ణప్రియ 18-21, 19-21తో శైలి రాణే (ఎయిరిండియా) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ (ఆంధ్రప్రదేశ్) క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టగా... సిరిల్ వర్మ, రోహిత్ యాదవ్ నిష్ర్కమించారు. రెండో రౌండ్లో శ్రీకాంత్ 21-17, 21-11తో ప్రకాశ్ (కర్ణాటక)పై నెగ్గగా... సిరిల్ వర్మ 13-21, 16-21తో సౌరభ్ వర్మ (మధ్యప్రదేశ్) చేతిలో; రోహిత్ యాదవ్ 18-21, 14-21తో అనూప్ శ్రీధర్ (కర్ణాటక) చేతిలో ఓటమి పాలయ్యారు.