కామెరూన్ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి గురజాడ శ్రీవేద్య మహిళల డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఫైనల్లో శ్రీవేద్య–పూర్వీషా రామ్ (భారత్) ద్వయం 21–12, 21–14తో టాప్ సీడ్ కస్తూరి–వినోషా (మలేసియా) జోడీపై గెలిచింది.
‘అర్జున అవార్డీ’ చేతన్ ఆనంద్‌కు చెందిన అకాడమీలో శ్రీవేద్య శిక్షణ తీసుకుంటోంది. ఇదే టోర్నీలో పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత ప్లేయర్ సతీశ్ 21–13, 21–13తో చువా కిమ్ షెంగ్ (మలేసియా)పై నెగ్గి టైటిల్ సాధించాడు.
చదవండి: దక్షిణాసియా ఫుట్‌బాల్ టోర్నీకి సౌమ్య
Comments
Please login to add a commentAdd a comment