cameroon
-
సెర్బియాకు చుక్కలు చూపించిన ఆఫ్రికా జట్టు.. మ్యాచ్ 'డ్రా'
ఫిపా ప్రపంచకప్-2022 గ్రూప్ జిలో భాగంగా కామెరూన్, సెర్బియా మధ్య జరిగిన మ్యాచ్‌లో గోల్స్ వర్షం కురిసింది. ఇరు జట్లు చెరో మూడు గోల్స్ సాధించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఇరు జట్ల ఖాతాలో చెరో పాయింట్ వచ్చి చేరింది. మ్యాచ్ 28వ నిమిషంలో చార్లెస్ కాస్టెల్లెట్ కామెరూన్‌కు తొలి గోల్‌ను అందించాడు. తొలి భాగంలో గోల్ సాధించడానికి తీవ్రంగా ప్రయత్నించిన సెర్బియా.. కామెరూన్ డిఫెన్స్ ముందు తలవంచింది. అయితే ఫస్ట్ హాఫ్‌లో మ్యాచ్ రిఫరీ 6 నిమిషాల అదనపు సమయం కేటాయించాడు. ఈ సమయంలో సెర్బియా ఆనూహ్యంగా పుంజుకుంది. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే వరుసగా రెండు గోల్స్‌ను సాధించి ఒక్క సారిగా సెర్బియా ఆధిక్యంలో వచ్చింది. (45+1వ నిమిషంలో) పావ్లోవిచ్ సెర్బీయా తరపున తొలి గోల్ సాధించగా.. మిలిన్కోవిచ్ (45+3వ నిమిషంలో) మరో గోల్‌ను సాధించాడు. దీంతో మ్యాచ్ తొలి భాగం ముగిసే సరికి 2-1తో దిక్యంలో సెర్బియా నిలిచింది. రెండో భాగంలో సెర్బియా తన జోరును కోనసాగించింది. 53వ నిమిషంలో మిత్రోవిచ్ సెర్బియాకు మరో గోల్‌ను అందించి తిరుగులేని అధిక్యంలో నిలిపాడు. ఇక అంతా సెర్బియాదే విజయం అని భావించారు. ఈ సమయంలో కామెరూన్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. వరుసగా రెండు గోల్స్‌ను సాధించి సెర్బియాకు కోలుకోలేని దెబ్బ కొట్టింది. కాగా సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన విన్సెంట్ అబుబకర్ (63 నిమిషంలో), చౌపో మోటింగ్ (66వ నిమిషంలో) గోల్స్ సాధించి కామెరూన్ హీరోలుగా నిలిచారు. చదవండి: Christiano Ronaldo: రొనాల్డోకు బంపరాఫర్ .. ఏడాదికి రూ.612 కోట్లు! -
FIFA WC: పాపం.. గోల్ కొట్టినా సెలబ్రేట్ చేసుకోలేక
ఫిఫా వరల్డ్‌కప్‌లో ఒక ఆటగాడు గోల్ కొట్టాడంటే దానిని గొప్పగా చూస్తారు. మాములు మ్యాచ్‌ల్లో గోల్ కొడితే పెద్దగా కిక్ రాదు. కానీ ఫిఫా వరల్డ్‌కప్ మ్యాచ్‌లు అలా కాదు. ఎందుకంటే నాలుగేళ్లకోసారి జరిగే సాకర్ సమరంలో గోల్స్ కొట్టిన ఆటగాడు హీరో అయితే కొట్టనివాడు జీరో అవుతాడు. ఇది మొదటినుంచి వస్తున్న సంప్రదాయమే. ఒక ఆటగాడు గోల్ కొడితే అది చూసిన అభిమానులు కేరింతలు, ఈలలు, గోలతో రెచ్చిపోతారు. మరి గోల్ కొట్టిన ఆటగాడి సెలబ్రేషన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే తాజాగా గురువారం స్విట్జర్లాండ్, కామెరున్ మ్యాచ్‌లో గోల్ కొట్టిన ఒక ఆటగాడు మాత్రం దానిని సెలబ్రేట్ చేసుకోలేకపోయాడు. అతనే స్విట్జర్లాండ్ స్రైకర్ బ్రీల్ ఎంబోలో. ఈ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ 1-0 తేడాతో కామెరున్‌పై విజయం సాధించింది. మ్యాచ్‌లో నమోదైన ఒక్క గోల్ కూడా బ్రీల్ ఎంబోలో చేసిందే. అతని గోల్ పుణ్యానే ఇవాళ స్విట్జర్లాండ్ మ్యాచ్‌ను గెలిచింది. మరి ఇంత చేసిన బ్రీల్ ఎంబోలో ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేదా అనే డౌట్ వస్తుంది. కారణం అతను గోల్ కొట్టింది తన స్వంత దేశమైన కామెరున్‌పై కావడమే. బ్రీల్ ఎంబోలో స్వస్థలం కామెరున్.. ఇప్పటికి అతని తల్లిదండ్రులు కామెరున్ వెళ్లి వస్తుంటారు. ఎంబోలో కూడా అక్కడే పుట్టి పెరిగాడు. అయితే పరిస్థితుల ప్రభావం వల్ల స్విట్జర్లాండ్‌కు రావాల్సి వచ్చింది. ఇక్కడే ఫుట్‌బాల్ కెరీర్‌ను ఆరంభించి ఇప్పుడు స్విట్జర్లాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అందుకే జట్టుకు గోల్ అందించినప్పటికి సొంత దేశంపై ఆ గోల్ రావడంతో సెలబ్రేషన్ చేసుకోలేకపోయాడు. Breel Embolo with the opener to give the Swiss the opener against Cameroon The man wouldn’t celebrate against the country of his birth. Respect🤝#Qatar2022 pic.twitter.com/zqonADSKcx — OLT👑 (@CHAMPIONOLT) November 24, 2022 🇨🇲 Born in Cameroon 🇨🇭 Represents Switzerland ⚽️ Scores in #SUICMR Respect, Breel Embolo 🤝#FIFAWorldCup | #Qatar2022 pic.twitter.com/UCpZhx0TCY — FIFA World Cup (@FIFAWorldCup) November 24, 2022 చదవండి: FIFA WC: స్విట్జర్లాండ్ శుభారంభం.. కామెరున్‌పై విజయం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA WC: స్విట్జర్లాండ్ శుభారంభం.. కామెరున్‌పై విజయం
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో స్విట్జర్లాండ్ శుభారంభం చేసింది. గ్రూప్-జిలో భాగంగా గురువారం కామెరున్తో జరిగిన మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ 1-0 తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో తొలి అర్థభాగం ఎలాంటి గోల్ లేకుండానే ముగిసింది. అయితే రెండో అర్థభాగం మొదలైన కాసేపటికే ఆట 47వ నిమిషంలో స్విట్జర్లాండ్ ఆటగాడు బ్రీల్ ఎంబోలో తన సహచర ఆటగాడి నుంచి వచ్చిన సూపర్ పాస్‌ను చక్కగా వినియోగించుకొని గోల్‌గా మలిచాడు. దీంతో స్విట్జర్లాండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత పలుమార్లు ఇరుజట్లు అటాకింగ్ గేమ్ ఆడినప్పటికి మరో గోల్ రాలేదు. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత ఇచ్చిన అదనపు సమయంలోనూ స్విట్జర్లాండ్‌కు గోల్ చేసే అవకాశమొచ్చినప్పటికి మిస్ అయింది. ఈలోగా సమయం పూర్తవడంతో మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ విజేతగా నిలిచింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
శ్రీవేద్య జోడీకి డబుల్స్ టైటిల్
కామెరూన్ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి గురజాడ శ్రీవేద్య మహిళల డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఫైనల్లో శ్రీవేద్య–పూర్వీషా రామ్ (భారత్) ద్వయం 21–12, 21–14తో టాప్ సీడ్ కస్తూరి–వినోషా (మలేసియా) జోడీపై గెలిచింది. ‘అర్జున అవార్డీ’ చేతన్ ఆనంద్‌కు చెందిన అకాడమీలో శ్రీవేద్య శిక్షణ తీసుకుంటోంది. ఇదే టోర్నీలో పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత ప్లేయర్ సతీశ్ 21–13, 21–13తో చువా కిమ్ షెంగ్ (మలేసియా)పై నెగ్గి టైటిల్ సాధించాడు. చదవండి: దక్షిణాసియా ఫుట్‌బాల్ టోర్నీకి సౌమ్య -
ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. 8 మంది మృతి
కెమారూన్‌లోని ఒలెంబే ఫుట్‌బాల్ మైదానంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన 8 మంది మృత్యువాత పడగా, మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ సందర్భంగా స్టేడియం వద్ద జరిగిన తొక్కసలాటలో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. సామర్ధ్యానికి మించి ప్రేక్షకులను అనుమతించడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ సంఘటనపై ఆఫ్రికన్ ఫుట్‌బాల్ సమాఖ్య దర్యాప్తునకు ఆదేశించింది. చదవండి: PSL 2022: పాకిస్థాన్ సూపర్ లీగ్‌పై కరోనా పంజా.. -
రాత్రికి రాత్రే శ్మశానాలుగా మారిపోయాయి.. అసలేం జరిగింది?
టెక్నాలజీ ఎంత పెరిగినా.. ఎన్ని వసతులొచ్చినా.. నేటికీ ఏదో ఒక నదినో, సరస్సునో, వాగునో ఆధారంగా చేసుకుంటేనే మానవ మనుగడ సాధ్యం. సస్యశ్యామలమైన, అహ్లాదకరమైన వాతావరణం కోసం తాపత్రయపడే మనుషులు సాధారణంగా నీరు పుష్కలంగా లభించే పరిసరప్రాంతాలనే ఇష్టపడుతుంటారు. అక్కడే ఇళ్లు కట్టుకుని స్థిరపడాలని కోరుకుంటారు. ఆ కోరికే మధ్య ఆఫ్రికాలోని కామెరూన్ వాసుల పాలిట శాపం అయ్యింది. మధ్య ఆఫ్రికాలోని వాయువ్య కామెరూన్లో న్యోస్ సరస్సు చుట్టూ పల్లెలు పచ్చగా అల్లుకున్నాయి. కుటుంబాలకు కుటుంబాలు, సమూహాలకు సమూహాలు గుమిగూడి గ్రామాలుగా మారాయి. కానీ ఏమైందో ఏమో.. రాత్రికి రాత్రి ఊహించని విధంగా శ్మశానాలైపోయాయి. సరస్సు పొంగి ఊళ్ల మీదకు వరదై రాలేదు.. ఎండిపోయి కరువు ఎద్దడులూ తేలేదు. కానీ.. 5,246 ప్రాణాలను బలిగొంది. అసలు ఏం జరిగింది? ఈ వారం మిస్టరీలో.. ‘న్యోస్ సరస్సు’.. ఉనికిలో లేని అగ్నిపర్వత ముఖద్వారంలో ఏర్పడింది. ఆవాసానికి అనువుగా ఉండటంతో.. చా, న్యోస్, సుబుమ్ అనే గ్రామాలు సరసు చుట్టూ ఏర్పడ్డాయి. నీరు పుష్కలంగా ఉండటంతో అక్కడ జనం వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. 1986లో ఆగస్టు 21న గాఢ నిద్రలో ఉన్న ఆ మూడు గ్రామాల ప్రజలు.. ఇక నిద్రలేవలేదు. మరునాడు ఎక్కడ చూసినా శవాలే. మంచం మీద ఉన్నవారు మంచం మీదే.. బయట ఉన్నవారు బయటే నిర్జీవంగా మారిపోయారు. పశుపక్ష్యాదులు సైతం ప్రాణాలు కోల్పోయాయి. విపత్తు నుంచి ప్రాణాలతో బయటపడినవారు మాత్రం.. ‘ఆ రాత్రి తొమ్మిది గంటలకు అకస్మాత్తుగా గాలి స్తంభించింది. ఏదో ఘాటైన వాసన వచ్చింది. ఆ తర్వాత స్పృహ లేదు’ అని చెప్పుకొచ్చారు. చనిపోయినవారి నోటి నుంచి, ముక్కు నుంచి రక్తం కారిన ఆనవాళ్లు కథను మిస్టరీగా మార్చాయి. ఈ విపత్తులో 1,746 మంది ప్రజలతో పాటు.. 3,500 జంతువులు, పక్షులు చనిపోయాయని, రాత్రికి రాత్రి ప్రాణాలు తీసేసిన ఆ గాలి అగ్నిపర్వత బిలంలో ఉన్న న్యోస్ సరస్సు నుంచే వచ్చిందని తేల్చారు. అసలేం జరిగింది? ఉనికిలో లేని అగ్నిపర్వత బిలం వర్షాల కారణంగా నిండి సరస్సుగా మారింది. నీరు చేరినా బిలంలో జరిగే రసాయనిక చర్య ఆగలేదు. ఆ రాత్రి 9 గంటలకు.. రసాయనిక చర్యల్లో భారీ మార్పులు జరిగి.. ఆ బిలం నుంచి వందల వేల టన్నుల విషపూరిత కార్బన్ డై ఆక్సైడ్ సుమారు 100 కిలోమీటర్ల మేర విస్తరించింది. కొన్ని క్షణాల్లోనే అది గ్రామాలకు చుట్టుముట్టింది. 25 కిలోమీటర్లుకు పైగా గాలిలో ఆక్సిజన్ శాతం పూర్తిగా తగ్గిపోయింది. కార్బన్ డై ఆక్సైడ్ పీల్చిన వారంతా అక్కడికక్కడే చనిపోయారు. దీనిపై క్షుణ్ణంగా పరిశోధనలు జరిపిన పరిశోధకుడు డెవిడ్ బ్రెస్సెన్ నాటి పరిస్థితిని వివరిస్తూ.. ‘నీటి అడుగున ఉన్న అగ్నిపర్వత వాయువులు వాటంతట అవే పైకి వచ్చే అవకాశం చాలా తక్కువ. న్యోస్ బిలంలో చిన్నపాటి భూకంపం సంభవించి ఉంటుంది. కదలిక చోటుచేసుకోవడంవల్లే ఇంత పెద్ద విపత్తు ఏర్పడింది’ అన్నారు. అయితే ఇలాంటì ఘటనే 1984లో కూడా జరిగింది. ఇదే ప్రాంతానికి కొన్ని మైళ్ల దూరంలో గల మొనౌన్ సరస్సు కార్బన్ డై ఆక్సైడ్ విడుదలై 37 మంది మరణించారని చరిత్ర చెబుతోంది. అధికారులు అప్పుడే స్పందించి ఉంటే.. న్యోస్ ఘటన జరిగుండేది కాదనే విమర్శలూ వెల్లువెత్తాయి. మరోసారి ఇలాంటి విపత్తు తలెత్తకుండా 2001లో ఇంజనీర్లు ప్రత్యేకమైన పైపులు ఏర్పాటు చేశారు. మొత్తానికి న్యోస్ సరస్సు ఓ విషాదంగా మిగిలిపోయింది. -సంహిత నిమ్మన చదవండి: బస్ నెంబర్ 375.. వణుకుపుట్టించే మిస్టరీ.. నిజమా? అబద్ధమా? -
ఘోర రోడ్డు ప్రమాదం: 53 మంది మృతి
యాండే : కామెరూన్‌లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న శాంక్చు గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సును అక్రమంగా ఆయిల్ తరలిస్తున్న ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 53 మంది మరణించారని, మరో 21 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ట్రక్కులోని ఆయిల్ బస్సుపై పడగా, ప్రమాదం కారణంగా పుట్టిన నిప్పు బస్సును దహించివేసింది. బస్సు డ్రైవర్ ప్రమాదం నుంచి బయటపడగా అతన్ని అరెస్టు చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రమాదంలో మరణించిన వారి శరీరాలు తీవ్రంగా కాలి పోయాయని, గుర్తించడం కూడా కష్టంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చదవండి : అన్న ప్రియురాలిపై కన్ను.. వీడియోలతో.. -
ఆత్మాహుతి దాడిలో 14మంది మృత్యువాత
యవోండే(కామెరూన్): ఆఫ్రికా దేశం కామెరూన్లో తీవ్ర వాద సంస్థ బోకోహరామ్ దాడులకు తెగబడింది. నైజీరియా సరిహద్దు పట్టణమైన వజాలోని రద్దీ ప్రాంతంలో బుధవారం సాయంత్రం జరిగిన రెండు ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 14 మంది చనిపోగా మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో పట్టణాన్ని పోలీసులు దిగ్బంధించారు. తీవ్రవాద సంస్థ బోకోహరామ్ మూలాలు ప్రధానంగా నైజీరియాలోనే ఉన్నప్పటికీ సరిహద్దుల్లో ఉన్న చాడ్, కామెరూన్, నైగర్ దేశాల్లో కూడా ఇటీవల ఇటువంటి ఘటనలకు పాల్పడుతోంది. ఈ ఘటనలకు భీతిల్లిన కామెరూన్ వాసులు దాదాపు రెండు లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు వలసవెళ్లారు. -
కెమరూన్ దేశస్తుల ‘బ్లాక్’ వ్యూహం
- విద్యార్థుల ముసుగులో ఘరానా మోసం - నోట్లను డాలర్లుగా మారుస్తామని బురిడీ - పాస్‌పోర్టు లేకుండా తిరుగుతున్న నల్లజాతీయుడు - పక్కా సమాచారంతో అదుపులోకి.. నంద్యాల: విద్యార్థుల ముసుగులో దొంగ నోట్ల తయారీ పేరిట ఘరానా మోసం చేస్తున్న ఆఫ్రికాలోని కెమరూన్ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులను కర్నూలు జిల్లా నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ హరినాథరెడ్డి స్థానిక పోలీస్ అతిథి గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కెమరూన్ దేశానికి చెందిన 37 ఏళ్ల రోబర్ట్ విద్యార్థి వీసా సంపాదించి ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరు చేరుకున్నాడు. ఇక జాన్సన్ దవే ఎలాంటి పాస్‌పోర్టు లేకుండానే ఇండియాలోకి ప్రవేశించి బెంగళూరులోని కెంపెగౌడ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇండియన్ అకాడమీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నట్లు గుర్తింపు కార్డును సృష్టించుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరూ దొంగనోట్ల తయారీ పేరిట అమాయకులకు ఎరవేసి డబ్బు లాగడం ప్రారంభించారు. ఆళ్లగడ్డకు చెందిన ఫైనాన్షియర్ లక్ష్మీనారాయణ, బెంగళూరులో బీటెక్ కంప్యూటర్స్ పూర్తి చేసిన మహేష్ స్నేహితులు. మహేష్‌కు కెమరూన్ గ్యాంగ్‌తో పరిచయం ఉంది. వీరిని లక్ష్మీనారాయణకు పరిచయం చేశాడు. ఆర్బీఐ జారీ చేసిన రూ.2వేల నోట్లను తయారు చేసిస్తామని కెమరూన్ గ్యాంగ్ ఆయనను మభ్యపెట్టింది. నంద్యాల కేంద్రంగా... నంద్యాల కేంద్రంగా కెమరూన్ గ్యాంగ్ నోట్ల తయారీ మోసానికి సిద్ధమైంది. స్థానిక శ్రీనివాస సెంటర్లోని ఓ లాడ్జిలో కెమరూన్ గ్యాంగ్, మహేష్ మకాం వేశారు. లక్ష్మీనారాయణ రూ.8లక్షల రూ.2వేల నోట్ల కట్టలను ఆళ్లగడ్డకు చెందిన రాజీవ్ ద్వారా పంపారు. ఈ గ్యాంగ్ నోట్ల కట్టలను తయారు చేస్తామని మభ్యపెడుతుండగా పోలీసులకు సమాచారం అందింది. సీఐ ప్రవీన్‌కుమార్, ఎస్ఐ నవీన్ లాడ్జిపై దాడి చేసి కెమరూన్ దేశస్తులు జాన్సన్, రోబర్ట్లను అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబ్ క్లిప్పింగ్ ఆధారంగా వ్యూహం యూట్యూబ్‌లో వచ్చిన వీడియో ఆధారంగా కెమరూన్ గ్యాంగ్ నకిలీ నోట్ల తయారీ పేరిట ఘరానా మోసానికి వ్యూహం పన్నింది. రూ.లక్ష ఇస్తే, తమ వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రూ.3లక్షల అమెరికన్ డాలర్లను తయారు చేసి ఇస్తామని మభ్యపెట్టారు. రూ.2వేల నోట్ల కట్టలకు విదేశాల నుంచి తెచ్చిన పౌడర్‌ను కలిపి, వాటిపై బరువు పెట్టి 30 గంటలు గాలి సోకకుండా భద్రపరుస్తామని, తర్వాత ఈ పౌడర్‌కు రసాయనాలను కలిపి బ్లాక్ నోట్లపై పూస్తే అమెరికా డాలర్లు తయారు అవుతాయని మభ్యపెట్టారు. చేతికి డబ్బు అందగానే పరారు కావాలనేది వీరి వ్యూహం. ఇందులో భాగంగా లక్ష్మీనారాయణ రూ.8లక్షలు అందజేయడం.. ఇంతలో పోలీసులకు సమాచారం అందడంతో వ్యవహారం బట్టబయలయింది. లాడ్జిపై దాడి చేసిన పోలీసులు 20 కట్టల బ్లాక్ కోటెడ్ కరెన్సీ బండిళ్లు, ఐదు సెల్ఫోన్లు, కెమికల్ బాటిళ్లతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కర్నూలు మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చగా రిమాండ్‌కు ఆదేశించారు. మూలాలకై ఆరా.. కెమరూన్ దేశానికి చెందిన నల్లజాతీయులు సరైన పాస్‌పోర్టులు లేకుండా ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల్లో నిర్భయంగా తిరగడంపై ఏపీ పోలీసులు దృష్టి సారించారు. ప్రస్తుతం సబ్‌జైలులో ఉన్న వీరిని రెండు మూడు రోజుల్లో జ్యుడీషియల్ కస్టడీకి తీసుకొని విచారించాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. గతంలో హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో నైజీరియా, కెమరూన్ ప్రాంతానికి చెందిన నల్లజాతీయులు డ్రగ్స్, మారణాధాయాల అమ్మకాలకు పాల్పడినట్లు కేసులు ఉన్నాయి. దీంతో రోబర్ట్, జాన్సన్‌ల వెనుక నేర చరిత్ర ఉందేమోననే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. ప్రస్తుతం రోబర్ట్ వద్ద మాత్రమే 2020 వరకు గడువున్నా పాస్‌పోర్టు ఉంది. ఇది అసలైనదా.. నకిలీదా అనే విషయమై విచారిస్తున్నారు. ఇందుకోసం పాస్‌పోర్టును సీజ్ చేశారు. -
ఘోర రైలు ప్రమాదం: 53 మంది దుర్మరణం
-
ఘోర రైలు ప్రమాదం: 53 మంది దుర్మరణం
ఎసెకా: ప్రదాన రోడ్డు మార్గంలోని ఓ బ్రిడ్జి కూలిపోవడంతో వారంతా రైలును ఆశ్రయించారు. అసలు సామర్థ్యానికి రెండింతలు ప్రయాణికులతో బయలుదేరిన ప్యాసింజర్ రైలు మార్గం మధ్యలో ఘోర ప్రమాదానికి గురైంది. పట్టాలు తప్పడంతో బోగీలు ఒకదానిపై ఒకటి కుప్పలా పేరుకుపోయాయి. పశ్చిమ ఆఫ్రికా దేశం కామెరూన్ లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 53 మంది దుర్మరణం చెందారు. మరో 300 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. యాండీ నుంచి దౌలా నగరానికి 1300 మంది ప్రయాణికులతో వెళుతున్న రైలు.. మార్గం మధ్యలో ఎసెకా పట్టణం వద్ద ప్టటాలు తప్పిందని, స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని కామెరూన్ రవాణ శాఖ మంత్రి ఎడ్గార్ అలియాన్ మెబే మీడియాకు వెల్లడించారు. సహాయక బృందాలే ఘటనాస్థలానికి చేరుకున్నాయని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని ఆయన చెప్పారు. ఓవర్ లోడ్ వల్ల రైలు పడిపోతుందా? కామెరూన్ పశ్చిమ ప్రాంతంలోని యాండీ పట్టణం నుంచి ఆ దేశ ఆర్థిక రాజధానిగా పరిగణించే దౌలా నగరానికి పెద్ద ఎత్తున రాకపోకలు జరుగుతుంటాయి. కాగా ఆ పట్టణాలకు కలుపుతూ నూతనంగా భారీ హైవేను నిర్మిస్తున్నారు. గురువారం హైవేపై నిర్మాణంలో ఉన్న వంతెన ఒకటి కూలిపోవడంతో ప్రజలు రైలు మార్గాన్ని ఆశ్రయించారు. ప్రమాదానికి గురైన రైలులో.. సాధారణ రోజుల్లో తొమ్మిది బోగీలతో గరిష్టంగా 600 మంది ప్రయాణించేవారు. అయితే శుక్రవారం రద్దీ ఎక్కువ ఉండటంతో తొమ్మిది బోగీలకు మరో ఎనిమిది అదనపు బోగీలను కలిపి మొత్తం 17 బోగీల ద్వార 1300 మంది ప్రయాణికులతో రైలును నడిపారు. ఒవర్ లోడ్ వల్లే రైలు పట్టాలు తప్పిఉంటుందని ప్రకటించలేదు. కానీ అలా జరిగే అవకాశం లేకపోలేదని స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది. -
మ్యాచ్ మధ్యలోనే కుప్పకూలిపోయాడు
బుకారెస్ట్: ఆటలో మరో విషాదం చోటుచేసుకుంది. స్టేడియంలో మ్యాచ్ ఆడుతూ ఓ ప్లేయర్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. గత రెండేళ్లలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఫుట్ బాల్ ప్లేయర్ మృతిచెందడంతో అ దేశ అధికారులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కామెరున్ కు చెందిన ఫుట్ బాల్ ప్లేయర్ పాట్రిక్ ఎకింగ్ రొమేనియా క్లబ్ డినామో తరఫున విటోరల్ కాంటాంటా జట్టుపై శుక్రవారం మ్యాచ్ ఆడుతున్నాడు. అయితే మ్యాచ్ మధ్యలో అకస్మాత్తుగా మైదానంలోనే కుప్పకూలిపోయాడు. 26 ఏళ్ల మిడ్ ఫీల్డర్ కుప్పకూలిపోవడంతో సహచరులు వచ్చి చూడగా అతడిలో కదలిక లేదు. దీంతో సిబ్బంది అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎకెంగ్ ప్లేస్ లో సబ్‌స్టిట్యూట్ ఆటగాడిని తీసుకుని మ్యాచ్ కొనసాగించారు. సుమారు గంటపాటు డాక్టర్లు అతడ్ని బతికించేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదని డినామో క్లబ్ డాక్టర్ లివియు పాల్టినియన్ మీడియాకు తెలిపారు. ఈ జనవరిలోనే పాట్రిక్ ఎకింగ్ రొమేనియా క్లబ్ లో జాయిన్ అయ్యాడు. పాట్రిక్ మృతిపట్ల ఫుట్ బాల్ క్లబ్ సంతాపం ప్రకటించింది. -
నాలుగో అవతారం
ఇలాంటి సినిమాలు కూడా వస్తాయా? ఇలా కూడా తీస్తారా? అని ప్రపంచవ్యాప్తంగా అందరూ చర్చించుకునేలా చేసిన చిత్రం ‘అవతార్’. ‘టెర్మినేటర్, ఏలియన్స్, టైటానిక్’లను అద్భుతంగా తెరపై సృష్టించిన దర్శకుడు జేమ్స్ కామెరూన్ తీసిన ఈ ‘అవతార్’ అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ప్రసుతం కామెరూన్ ఈ చిత్రం సీక్వెల్స్‌ని వర్కవుట్ చేస్తున్నారు. ముందుగా మూడు భాగాలు తీస్తామని చెప్పిన కామెరూన్ ఇప్పుడు నాలుగో భాగాన్ని కూడా ప్రకటించారు. ఈ నాలుగు భాగాల్లో మొదటిదాన్ని 2018లో, రెండో చిత్రాన్ని 2020లో, మూడో సీక్వెల్‌ని 2022లో, నాలుగో భాగాన్ని 2023లో విడుదల చేయాలనుకుంటున్నారు. ‘అవతార్’ 2009లో విడుదలైన విషయం తెలిసిందే. గత ఏడేళ్లుగా సీక్వెల్స్ పని మీదే ఉన్నారు జేమ్స్ కామెరూన్. హాలీవుడ్‌కి చెందిన నలుగురు ప్రముఖ రచయితలతో ‘అవతార్’ ప్రపంచం ఎలా ఉండాలనే విషయంపై చర్చలు జరుపుతున్నానని ఆయన వెల్లడించారు. ఈ సీక్వెల్స్ అసలు సిసలైన వెండితెర అద్భుతాలుగా నిలుస్తాయని కూడా ఆయన అన్నారు. ముందు మూడు భాగాలే అనుకున్నప్పటికీ ఈ కథ పరిధి ఎక్కువ కావడం వల్ల నాలుగో భాగం కూడా చేయాలనుకున్నామని కామెరూన్ చెప్పారు. అసలు ‘అవతార్’ లాంటి సాంకేతిక అద్భుతాలను ఒకసారి తీయడమే పెద్ద విషయం. అలాంటిది నాలుగు భాగాలు తీస్తున్నారంటే సినిమా పట్ల ఎంతో ప్యాషన్, టెక్నాలజీ మీద బాగా అవగాహన... అన్నింటికీ మించి ఓర్పు కావాలి. ఇవన్నీ ఉన్నవాళ్లని ‘కామెరూన్’ అంటారేమో. -
బార్లో ఆత్మాహుతి దాడి: 12 మంది మృతి
కెమరూన్ : సెంట్రల్ ఆఫ్రికా దేశం కెమరూన్లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. కెమరూన్లోని మరౌవ ప్రాంతంలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. ఈ ఘటనలో 12 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారని మీడియా ఆదివారం వెల్లడించింది. మహిళ తన నడుమకు బాంబు అమర్చుకుని బార్లోకి ప్రవేశించిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని తెలిపింది. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. అయితే ఇదే ప్రాంతంలో గత బుధవారం జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 20 మంది మరణించిన సంగతి తెలిసిందే. -
ఉపప్రధాని భార్యను అపహరించిన ఉగ్రవాదులు
బోకో హరామ్ ఉగ్రవాదులు తెగ రెచ్చిపోతున్నారు. సొంత దేశం నైజీరియాలోనే కాదు, పొరుగున ఉన్న కామెరూన్ లోనూ అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. సరిహద్దు దాటి వచ్చి మరీ కామెరూన్ లోని కోలోఫాటా నగరంపై దాడి చేశారు. చేయడమే కాదు ఏకంగా ఆ దేశ ఉప ప్రధాని అమదౌ అలీ భార్యను, నగర మేయర్ ను, మరి కొంత మందిని అపహరించుకుపోయారు. ఉగ్రవాదులు తమ దేశంలోని తమ రహస్య స్థావరాలకు వీరిని తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. కామెరూన్ ప్రస్తుతం తన సైన్యాలను సరిహద్దు వెంబడి మొహరించింది. ఇప్పటికే నైజీరియాకు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులు పొరుగు దేశాల్లో బీభత్సాన్ని సృష్టిస్తున్నారు. బోకో హరామ్ ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోంది. దీనికి అల్ కాయిదాతో సంబంధాలున్నాయి. పాశ్చత్య విద్యా విధానానికి వ్యతిరేకంగా కూడా బోకో హరామ్ పోరాడుతోంది. ఇప్పటికే నైజీరియాలోని 200 మందికి పైగా విద్యార్థినులను బోకో హరాం ఉగ్రవాదులు అపహరించుకుపోయి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించారు.