మ్యాచ్ మధ్యలోనే కుప్పకూలిపోయాడు | Cameroon mid fielder Ekeng dies during league game | Sakshi
Sakshi News home page

మ్యాచ్ మధ్యలోనే కుప్పకూలిపోయాడు

Published Sat, May 7 2016 8:28 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

మ్యాచ్ మధ్యలోనే కుప్పకూలిపోయాడు - Sakshi

మ్యాచ్ మధ్యలోనే కుప్పకూలిపోయాడు

బుకారెస్ట్: ఆటలో మరో విషాదం చోటుచేసుకుంది. స్టేడియంలో మ్యాచ్ ఆడుతూ ఓ ప్లేయర్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. గత రెండేళ్లలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఫుట్ బాల్ ప్లేయర్ మృతిచెందడంతో అ దేశ అధికారులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కామెరున్ కు చెందిన ఫుట్ బాల్ ప్లేయర్ పాట్రిక్ ఎకింగ్ రొమేనియా క్లబ్ డినామో తరఫున విటోరల్ కాంటాంటా జట్టుపై శుక్రవారం మ్యాచ్ ఆడుతున్నాడు. అయితే మ్యాచ్ మధ్యలో అకస్మాత్తుగా మైదానంలోనే కుప్పకూలిపోయాడు.

26 ఏళ్ల మిడ్ ఫీల్డర్ కుప్పకూలిపోవడంతో సహచరులు వచ్చి చూడగా అతడిలో కదలిక లేదు. దీంతో సిబ్బంది అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎకెంగ్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ ఆటగాడిని తీసుకుని మ్యాచ్ కొనసాగించారు. సుమారు గంటపాటు డాక్టర్లు అతడ్ని బతికించేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదని డినామో క్లబ్ డాక్టర్ లివియు పాల్టినియన్ మీడియాకు తెలిపారు. ఈ జనవరిలోనే పాట్రిక్ ఎకింగ్ రొమేనియా క్లబ్ లో జాయిన్ అయ్యాడు. పాట్రిక్ మృతిపట్ల ఫుట్ బాల్ క్లబ్ సంతాపం ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement