midfielder
-
ప్రపంచకప్‌లో భారత్‌కు బిగ్ షాక్.. హార్దిక్ దూరం!
పురుషుల హాకీ ప్రపంచ కప్‌లో భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. మిడ్‌ఫీల్డర్ హార్దిక్ సింగ్ గాయం కారణంగా మిగిలిన టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 ఏళ్ల హార్దిక్ సింగ్ తొడ కండరాల గాయంతో బాధపడినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్ అనంతరం హర్దిక్‌ను స్కానింగ్ తరిలించగా.. అతడి గాయం తీవ్రమైనది తేలినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే అతడు దూరం కానున్నాడు. అదే విధంగా హార్దిక్ స్థానం భర్తీపై ఇంకా మేనేజ్మెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకోపోయినట్టు సమాచారం. కాగా హార్దిక్ భారత జట్టులో కీలక సభ్యునిగా ఉన్నాడు. స్పెయిన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హార్దిక్ అద్భుతమైన గోల్‌తో మెరిశాడు. అదే విధంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కూడా గోల్ సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఇక భారత తమ తదుపరి మ్యాచ్‌లో జనవరి19 వేల్స్‌తో తలపడనుంది. కాగా గ్రూపు-డి నుంచి భారత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. సెహ్వాగ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి -
దిగ్గజం పీలే సరసన స్పెయిన్ మిడ్ ఫీల్డర్
ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా బుధవారం స్పెయిన్, కోస్టారికా మధ్య జరిగిన మ్యాచ్‌లో గోల్స్ వర్షం కురిసింది. మ్యాచ్‌లో అన్ని గోల్స్ చేసింది స్పెయిన్ ఆటగాళ్లే కావడం విశేషం. మ్యాచ్‌లో స్పెయిన్ 7-0 తేడాతో కోస్టారికాపై విజయం సాధించింది. స్పెయిన్ తరఫునఫెర్రాన్ టోరెస్ రెండు గోల్స్ చేయగా, ఓల్మో, అసెన్సియో, గవి, సోలెర్, మోరాటా తలో ఒక్క గోల్ చేశారు. ఈ మ్యాచ్ ద్వారా స్పెయిన్ మిడ్ ఫీల్డర్ గవి కొత్త రికార్డ్‌ను క్రియేట్ చేశాడు. వరల్డ్ కప్‌లో గోల్ కొట్టిన మూడో పిన్న వయస్కుడిగా నిలిచాడు. వరల్డ్ కప్‌లో గోల్ కొట్టిన అతి పిన్నవయస్కుల జాబితాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే మొదటి స్థానంలో ఉన్నాడు. 1958 వరల్డ్ కప్‌లో పీలే స్వీడన్‌పై 17 సంవత్సరాల 249 రోజుల్లో గోల్ కొట్టాడు. ఆ తర్వాత 1930 ఆరంభ ఫిఫా వరల్డ్‌కప్‌లో మెక్సికన్ ప్లేయర్ రోసెస్(18 సంవత్సరాల 93 రోజులు) రెండో స్థానంలో నిలిచాడు . బుధవారం కోస్టారికాతో జరిగిన మ్యాచ్‌లో గోల్ కొట్టిన గవి (18 సంవత్సరాల 110 రోజులు) పిన్న వయస్కుల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇక వరల్డ్ కప్‌ల పరంగా కోస్టారికాపై గెలుపు స్పెయిన్‌కు అతి పెద్ద విజయం. 2010 వరల్డ్‌కప్‌లో విజేతగా నిలిచిన స్పెయిన్ .. 2018లో రౌండ్ 16లో వెనుదిరిగింది. ఆ వరల్డ్‌కప్‌లో స్పెయిన్ పదో స్థానంలో నిలిచింది. చదవండి: అంతర్యుద్ధంతో కుటుంబం విచ్చిన్నం; అన్న ఘనాకు.. తమ్ముడు స్పెయిన్‌కు -
మ్యాచ్ మధ్యలోనే కుప్పకూలిపోయాడు
బుకారెస్ట్: ఆటలో మరో విషాదం చోటుచేసుకుంది. స్టేడియంలో మ్యాచ్ ఆడుతూ ఓ ప్లేయర్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. గత రెండేళ్లలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఫుట్ బాల్ ప్లేయర్ మృతిచెందడంతో అ దేశ అధికారులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కామెరున్ కు చెందిన ఫుట్ బాల్ ప్లేయర్ పాట్రిక్ ఎకింగ్ రొమేనియా క్లబ్ డినామో తరఫున విటోరల్ కాంటాంటా జట్టుపై శుక్రవారం మ్యాచ్ ఆడుతున్నాడు. అయితే మ్యాచ్ మధ్యలో అకస్మాత్తుగా మైదానంలోనే కుప్పకూలిపోయాడు. 26 ఏళ్ల మిడ్ ఫీల్డర్ కుప్పకూలిపోవడంతో సహచరులు వచ్చి చూడగా అతడిలో కదలిక లేదు. దీంతో సిబ్బంది అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎకెంగ్ ప్లేస్ లో సబ్‌స్టిట్యూట్ ఆటగాడిని తీసుకుని మ్యాచ్ కొనసాగించారు. సుమారు గంటపాటు డాక్టర్లు అతడ్ని బతికించేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదని డినామో క్లబ్ డాక్టర్ లివియు పాల్టినియన్ మీడియాకు తెలిపారు. ఈ జనవరిలోనే పాట్రిక్ ఎకింగ్ రొమేనియా క్లబ్ లో జాయిన్ అయ్యాడు. పాట్రిక్ మృతిపట్ల ఫుట్ బాల్ క్లబ్ సంతాపం ప్రకటించింది.