పురుషుల హాకీ ప్రపంచ కప్‌లో భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. మిడ్‌ఫీల్డర్ హార్దిక్ సింగ్ గాయం కారణంగా మిగిలిన టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 ఏళ్ల హార్దిక్ సింగ్ తొడ కండరాల గాయంతో బాధపడినట్లు తెలుస్తోంది.
ఇంగ్లండ్‌తో మ్యాచ్ అనంతరం హర్దిక్‌ను స్కానింగ్ తరిలించగా.. అతడి గాయం తీవ్రమైనది తేలినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే అతడు దూరం కానున్నాడు. అదే విధంగా హార్దిక్ స్థానం భర్తీపై ఇంకా మేనేజ్‌మెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకోపోయినట్టు సమాచారం.
కాగా హార్దిక్ భారత జట్టులో కీలక సభ్యునిగా ఉన్నాడు. స్పెయిన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హార్దిక్ అద్భుతమైన గోల్‌తో మెరిశాడు. అదే విధంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కూడా గోల్ సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఇక భారత తమ తదుపరి మ్యాచ్‌లో జనవరి19 వేల్స్‌తో తలపడనుంది. కాగా గ్రూపు-డి నుంచి భారత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. సెహ్వాగ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment