Hockey World Cup 2023
-
Junior Hockey World Cup 2023: టైటిల్ లక్ష్యంగా బరిలోకి...
కౌలాలంపూర్: మూడోసారి విశ్వవిజేతగా నిలవాలనే లక్ష్యంతో... నేటి నుంచి మొదలయ్యే జూనియర్ పురుషుల అండర్–21 హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు బరిలోకి దిగనుంది. పూల్ ‘సి’లో భాగంగా నేడు జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో ఉత్తమ్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు గురువారం స్పెయిన్‌తో రెండో మ్యాచ్‌ను... శనివారం కెనడాతో మూడో మ్యాచ్‌ను ఆడుతుంది. ఈనెల 16 వరకు జరిగే ఈ టోరీ్నలో మొత్తం 16 జట్లు పోటీపడుతున్నాయి. జట్లను నాలుగు పూల్స్‌గా విభజించారు. పూల్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా, ఆ్రస్టేలియా, చిలీ, మలేసియా... పూల్ ‘బి’లో ఈజిప్‌్ట, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణాఫ్రికా... పూల్ ‘డి’లో బెల్జియం, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లున్నాయి. ఈనెల 9న లీగ్ మ్యాచ్‌లు ముగిశాక ఆయా పూల్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. క్వార్టర్ ఫైనల్స్ 12న, సెమీఫైనల్స్ 14న, ఫైనల్ 16న జరుగుతాయి. ఈ టోర్నీ మ్యాచ్‌లను స్పోర్ట్స్ 18 చానెల్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 44 ఏళ్ల చరిత్ర కలిగిన జూనియర్ ప్రపంచకప్‌లో భారత జట్టు రెండుసార్లు (2001, 2016) టైటిల్స్ సాధించి, ఒకసారి రన్నరప్‌గా (1997) నిలిచింది. భారత జట్టు: ఉత్తమ్ సింగ్ (కెప్టెన్), అరైజిత్ సింగ్ (వైస్ కెప్టెన్), ఆదిత్య, సౌరభ్, సుదీప్, బాబీ సింగ్, మోహిత్, రణ్విజయ్, శార్దానంద్, అమన్‌దీప్ లాక్రా, రోహిత్, సునీల్, అమీర్ అలీ, విష్ణుకాంత్, పూవణ్ణ, రాజిందర్ సింగ్, అమన్‌దీప్, ఆదిత్య సింగ్. -
Hockey World Cup 2023: భారత్ 9వ స్థానంతో ముగింపు
భువనేశ్వర్: సొంతగడ్డపై జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రపంచకప్ హాకీలో క్వార్టర్ ఫైనల్ కూడా చేరలేక నిరాశపరిచిన భారత జట్టు చివరకు విజయంతో మెగా టోర్నీని ముగించింది. శనివారం 9 నుంచి 12వ స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 5–2తో దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. అయితే మరో మ్యాచ్‌లో అర్జెంటీనా 6–0 స్కోరు తేడాతో వేల్స్‌ను చిత్తు చేయడంతో భారత్, అర్జెంటీనాలు సంయుక్తంగా 9వ స్థానంలో నిలిచాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున అభిషేక్ (4వ ని.), హర్మన్‌ప్రీత్ సింగ్ (11వ ని.), షంషేర్ సింగ్ (44వ ని.), ఆకాశ్‌దీప్ సింగ్ (48వ ని.), సుఖ్జీత్ సింగ్ (58వ ని.) తలా ఒక గోల్ చేశారు. సఫారీ జట్టులో సంకెలొ ఎంవింబి (48వ ని.), ముస్తఫా కాసిమ్ (59వ ని.) చెరో గోల్ చేశారు. ఆట ఆరంభమైన నాలుగో నిమిషంలోనే అభిషేక్ ఫీల్డ్‌గోల్‌తో భారత్‌కు శుభారంభమిచ్చాడు. ఈ క్వార్టర్‌లోనే హర్మన్‌ప్రీత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి 2–0తో ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. ఇదే స్కోరుతో తొలి అర్ధభాగాన్ని (రెండు క్వార్టర్లు) ముగించిన భారత్ ఆఖరి క్వార్టర్లో మరో రెండు ఫీల్డ్ గోల్స్‌ను ఆకాశ్‌దీప్, సుఖ్జీత్ సాధించడంతో విజయం సులువైంది. ► నేడు ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల ఫైనల్ ► జొకోవిచ్ ( సెర్బియా) X సిట్సిపాస్ ( గ్రీస్) ► మ.గం. 2 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం -
WC 2023: జపాన్ను చిత్తు చేసి.. 100వ మ్యాచ్‌లో భారత్ అతిపెద్ద విజయం
India Vs Japan Highlights- రూర్కెలా: న్యూజిలాండ్ చేతిలో ఓడి క్వార్టర్ ఫైనల్ అవకాశాలు కోల్పోయిన భారత హాకీ జట్టు ప్రపంచకప్ తర్వాతి మ్యాచ్‌లో భారీ విజయాన్ని నమోదు చేసింది. 9–16 స్థానాల కోసం నిర్వహిస్తున్న వర్గీకరణ పోరులో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 8–0 గోల్స్ తేడాతో జపాన్ను చిత్తు చేసింది. రెండో క్వార్టర్లో అద్భుతం తొలి రెండు క్వార్టర్లలో ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయిన భారత్... తర్వాతి రెండు క్వార్టర్లలో చెరో 4 గోల్స్‌తో చెలరేగింది. భారత్ తరఫున అభిషేక్ (35వ, 43వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (45వ, 58వ ని.లో)రెండు గోల్స్ చొప్పున చేయగా... మన్దీప్ సింగ్ (32వ ని.లో), వివేక్ సాగర్ (39వ ని.లో), మన్‌ప్రీత్ సింగ్ (58వ ని.లో), సుఖ్జీత్ సింగ్ (59వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. వీటిలో 3 ఫీల్డ్ గోల్స్ కాగా, 5 గోల్స్ పెనాల్టీ కార్నర్ల ద్వారా వచ్చాయి. తొలి నాలుగు పెనాల్టీ కార్నర్లను గోల్‌గా మలచలేకపోయిన భారత్ ఎట్టకేలకు మూడో క్వార్టర్లో పెనాల్టీ ద్వారా ఖాతా తెరిచింది. మరో మూడు నిమిషాల తర్వాత వివేక్ ఇచ్చిన పాస్‌ను అభిషేక్ గోల్‌గా మలిచాడు. ఇక హర్మన్‌ప్రీత్ సహకారంతో ప్రసాద్ ప్రపంచకప్‌లో తన తొలి గోల్ నమోదు చేయగా, రివర్స్ షాట్‌తో గోల్ సాధించి అభిషేక్ జట్టును 4–0తో ఆధిక్యంలో నిలిపాడు. చివరి క్వార్టర్ ఆరంభంలోనే హర్మన్‌ప్రీత్ గోల్ చేయగా... ఆఖర్లో రెండు నిమిషాల వ్యవధిలో భారత్ మరో మూడు గోల్స్ సాధించింది. 9–12 స్థానాల కోసం శనివారం జరిగే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడుతుంది. మీకు తెలుసా? హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు ఇది 100వ మ్యాచ్. ఇక వరల్డ్‌కప్‌లో భారత్‌కు ఇదే పెద్ద విజయం. 1975లో ఘనాపై 7–0తో గెలిచింది. చదవండి: Ind Vs NZ: రాంచిలో మ్యాచ్ అంటే అంతే! టాస్ గెలిస్తే... Babar Azam: బాబర్ ఆజమ్‌కు డబుల్ ధమాకా.. వన్డే క్రికెటర్ అవార్డుతో పాటు ఐసీసీ అత్యున్నత ట్రోఫీ -
Hockey WC 2023: 13 ఏళ్ల తర్వాత సెమీస్‌లోకి జర్మనీ
పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో జర్మనీ జట్టు 13 ఏళ్ల తర్వాత మళ్లీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. భువనేశ్వర్‌లో బుధవారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో జర్మనీ ‘షూటౌట్’ లో 4–3తో ఇంగ్లండ్‌ను ఓడించింది. నిరీ్ణత సమయం వరకు రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. 2010 తర్వాత ఈ మెగా టోరీ్నలో జర్మనీ సెమీఫైనల్ చేరింది. మరో క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ 5–1తో కొరియాను ఓడించి సెమీస్ చేరింది. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో ఆ్రస్టేలియాతో జర్మనీ; బెల్జియంతో నెదర్లాండ్స్ ఆడతాయి. -
వరుసగా 12వసారి సెమీస్‌లో ఆస్ట్రేలియా
భువనేశ్వర్: పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీలో ఆ్రస్టేలియా జట్టు వరుసగా 12వసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. స్పెయిన్ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆ్రస్టేలియా 4–3 తో గెలిచింది. ఆసీస్ తరఫున హేవార్డ్ (33వ, 37వ ని.లో) రెండు గోల్స్ చేయగా... జెలెవ్స్కీ (32వ ని.లో), ఫ్లిన్ ఒగిల్వీ (30వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఒకదశలో ఆ్రస్టేలియా 0–2తో వెనుకబడినా ఏడు నిమిషాల వ్యవధిలో నాలుగు గోల్స్ సాధించింది. మరో క్వార్టర్ ఫైనల్లో బెల్జియం 2–0తో న్యూజిలాండ్‌ను ఓడించి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. -
‘షూటౌట్’లో సౌత్ కొరియా చేతిలో అర్జెంటీనాకు పరాభవం..
Men's Hockey World Cup 2023: ప్రపంచకప్ హాకీ టోర్నీలో దక్షిణ కొరియా జట్టు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. భువనేశ్వర్‌లో సోమవారం జరిగిన ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో కొరియా ‘షూటౌట్’లో 3–2తో 2016 రియో ఒలింపిక్స్ విజేత అర్జెంటీనా జట్టును ఓడించింది. నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 5–5తో సమంగా నిలిచాయి. మరో ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో జర్మనీ 5–1తో ఫ్రాన్స్‌పై నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరింది. ఇదిలా ఉంటే.. ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో భారత్ బోల్తా పడిన విషయం తెలిసిందే. క్వార్టర్ ఫైనల్ బెర్త్ కోసం న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లో విఫలమై ఇంటిబాట పట్టింది. దీంతో ఈ మెగా టోర్నీ చరిత్రలో టీమిండియా పతక నిరీక్షణ మరో నాలుగేళ్లు కొనసాగనుంది. చదవండి: KL Rahul- Athiya Shetty: చూడచక్కని జంట.. దిష్టి తగలకూడదు! కోహ్లి, సూర్య విషెస్! రిసెప్షన్ ఎప్పుడంటే.. Ind Vs NZ: పరుగుల వరద గ్యారంటీ! మిగిలింది కోహ్లి క్లాసిక్సే! అప్పుడు సెహ్వాగ్ డబుల్ సెంచరీ.. ఇప్పుడు కింగ్? -
Hockey World Cup 2023: హతవిధి!.. ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో భారత్ బోల్తా
మన హాకీ ఘనం... కానీ ఇది గతం! మరిప్పుడు... సొంతగడ్డపై ఆడుతున్నా... వేలాదిమంది ప్రేక్షకులు మైదానంలోకి వచ్చి మద్దతిస్తున్నా... భారత జట్టు పేలవమైన ప్రదర్శనతో మళ్లీ నిరాశపరిచింది. 2018 ప్రపంచకప్ హాకీలో నేరుగా క్వార్టర్ ఫైనల్ చేరిన టీమిండియా... ఈసారి ‘క్రాస్ ఓవర్’తోనే సరిపెట్టుకుంది. క్వార్టర్ ఫైనల్లో బెర్త్ కోసం న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో భారత్ అన్ని రంగాల్లో విఫలమై ఓడిపోయింది. దాంతో ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత పతక నిరీక్షణ మరో నాలుగేళ్లు కొనసాగనుంది. 1975 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత్ ఆ తర్వాత ఏనాడూ సెమీఫైనల్ దశకు చేరుకోలేకపోయింది. భువనేశ్వర్: ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత పతకం కథ కంచికి చేరింది. కళింగ స్టేడియంలో ఆదివారం జరిగిన ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో భారత్ ‘షూటౌట్’లో 4–5తో న్యూజిలాండ్ చేతిలో పరాజయం చవిచూసింది. దీంతో పతకం బరిలో లేని భారత్ ఇప్పుడు 9 నుంచి 16 స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్‌లు ఆడనుంది. ఈనెల 26న జపాన్‌తో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే 9 నుంచి 12 స్థానాల కోసం 28న రెండో మ్యాచ్ ఆడుతుంది. జపాన్ చేతిలో భారత్ ఓడిపోతే 13 నుంచి 16 స్థానాల కోసం ఆడుతుంది. న్యూజిలాండ్‌తో కీలకమైన సమయంలో రక్షణ శ్రేణి నిర్లక్ష్యం భారత జట్టు కొంపముంచింది. మూడో క్వార్టర్ వరకు 3–2తో ఆధిక్యంలో ఉన్న భారత్ నాలుగో క్వార్టర్లో పెనాల్టీ కార్నర్ అవకాశాలు ఎన్నో వచ్చినా... ఒక గోల్ చేయకపోగా... ప్రత్యర్థి గోల్‌నూ అడ్డుకోలేకపోయింది. దీంతో నిర్ణీత సమయం (నాలుగు క్వార్టర్లు) ముగిసే సమయానికి 3–3తో మ్యాచ్ ‘డ్రా’ అయ్యింది. టీమిండియా జట్టులో లలిత్ కుమార్ ఉపాధ్యాయ్ (17వ ని.లో), సుఖ్జీత్ సింగ్ (25వ ని.లో), వరుణ్ కుమార్ (41వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. న్యూజిలాండ్ తరఫున సామ్ లేన్ (29వ ని.లో), కేన్ రసెల్ (44వ ని.లో), సీన్ ఫిండ్లే (50వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. మ్యాచ్ మొత్తంలో భారత్‌కు 10 పెనాల్టీ కార్నర్లు రాగా రెండింటిని సద్వి నియోగం చేసుకొని మిగితా ఎనిమిదింటిని వృథా చేసుకుంది. న్యూజిలాండ్ జట్టుకు లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచింది. ఆట 54వ నిమిషంలో న్యూజిలాండ్ ప్లేయర్ నిక్ రాస్కు ఎల్లో కార్డు లభించడంతో ఆ జట్టు చివరి ఆరు నిమిషాలు పది మంది ఆటగాళ్లతోనే ఆడింది. ఈ అవకాశాన్నీ భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. హోరాహోరీ షూటౌట్... నిర్ణీత సమయంలో రెండు జట్లు సమంగా నిలువడంతో ఫలితం తేలడానికి ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో తొలి ఐదు షాట్ల తర్వాత రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. దాంతో ‘సడెన్ డెత్’ అనివార్యమైంది. ‘సడెన్ డెత్’ నిబంధనల ప్రకారం ఒక జట్టు ప్లేయర్ గోల్ చేసి.. ఆ వెంటనే మరో జట్టు ప్లేయర్ విఫలమైనా... ఒక జట్టు ప్లేయర్ విఫలమై... ఆ వెంటనే మరో జట్టు ప్లేయర్ సఫలమైనా మ్యాచ్ ముగుస్తుంది. ‘సడెన్ డెత్’ తొలి షాట్లో న్యూజిలాండ్ ప్లేయర్ నిక్ వుడ్స్ విఫలమయ్యాడు. ఫలితంగా తదుపరి షాట్లో గోల్ చేస్తే భారత్‌కు విజయం దక్కేది. కానీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ తడబడ్డాడు. రెండో షాట్లో రెండు జట్ల ఆటగాళ్లు సఫలమయ్యారు. మూడో షాట్లో కివీస్ ప్లేయర్ హేడెన్ ఫిలిప్స్ విఫలం కావడంతో గెలిచేందుకు భారత్‌కు రెండో అవకాశం దక్కింది. అయితే మూడో షాట్లో భారత ప్లేయర్ సుఖ్జీత్ విఫలమయ్యాడు. నాలుగో షాట్లో కివీస్ ఆటగాడు సామ్ లేన్ గోల్ చేయగా... భారత ప్లేయర్ షంషేర్ సింగ్ గోల్ చేయకపోవడంతో న్యూజిలాండ్ విజయం ఖరారైంది. అంతకుముందు మరో ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో స్పెయిన్ ‘షూటౌట్’లో 4–3తో మలేసియాను ఓడించింది. ఈనెల 24న జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాతో స్పెయిన్; బెల్జియంతో న్యూజిలాండ్ ఆడతాయి. -
WC 2023: నెదర్లాండ్స్ సంచలన విజయం.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి
FIH Men’s Hockey World Cup- భువనేశ్వర్: ప్రపంచ కప్ హకీ టోర్నీలో నెదర్లాండ్స్ జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మెగా టోర్నీలో ప్రత్యర్థి జట్టును అత్యధిక గోల్స్ తేడాతో ఓడించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఒడిశా వేదికగా గురవారం నాటి పూల్ సి మ్యాచ్‌లో భాగంగా చిలీని 14-0తో చిత్తు చేయడం ద్వారా ఈ ఘనత సాధించింది. తద్వారా ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును డచ్ జట్టు బద్దలు కొట్టింది. 2010 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను 12-0తో ఓడించింది. కాగా భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో.. నెదర్లాండ్స్ ఆటగాళ్లు హ్యాట్రిక్ వీరడు జిప్ జాన్సెస్, డెర్క్ డి విల్డర్, తిజ్స్ వాన్ డ్యామ్, కెప్టెన్ తెర్రీ బ్రింక్‌మన్, టెరెన్స్ పీటర్స్, కొయెన్ బీజెన్, జస్టెన్ బ్లాక్, ట్యూన్ బీన్స్ గోల్స్ సాధించారు. ఇక చిలీపై విజయంతో ఈ ఎడిషన్‌లో క్వార్టర్స్ చేరిన తొలి జట్టుగా నెదర్లాండ్స్ నిలిచింది. The Netherlands are the first team to be qualified for the quarterfinals of the FIH Odisha Hockey Men's World Cup 2023 in Bhubaneswar-Rourkela. Here are some moments from the game. 🇳🇱NED 14-0 CHI🇨🇱 pic.twitter.com/WISn5Vnhqh — Hockey India (@TheHockeyIndia) January 19, 2023 క్రాస్ ఓవర్’కు భారత్.. ఇక ప్రపంచ కప్ హాకీ టోర్నీలో నేరుగా క్వార్టర్ ఫైనల్ చేరుకునే లక్ష్యంతో గురువారం వేల్స్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగిన భారత్... కనీసం 8 గోల్స్ తేడాతో గెలిస్తే ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్ అవసరం లేకుండా నేరుగా క్వార్టర్స్‌లో అడుగుపెట్టే అవకాశం. కానీ భారత జట్టు అంతటి అత్యుత్తమ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయింది. బలహీన జట్టే అయినా వేల్స్ బాగా పోటీ ఇచ్చింది. భారత హాకీ జట్టు PC: Hockeyindia Twitter చివరకు 4–2తో గోల్స్ తేడాతో భారత్ విజయం సాధించింది. భారత్ తరఫున షంషేర్ సింగ్ (21వ నిమిషం), ఆకాశ్‌దీప్ సింగ్ (32వ నిమిషం, 45వ నిమిషం), హర్మన్‌ప్రీత్ సింగ్ (59వ నిమిషం) గోల్స్ సాధించగా...వేల్స్ ఆటగాళ్లలో ఫర్లాంగ్ గ్యారెత్ (42వ నిమిషం), డ్రేపర్ జాకబ్ (44వ నిమిషం) గోల్స్ నమోదు చేశారు. గ్రూప్ ‘డి’లో ఇంగ్లండ్‌తో సమానంగా 7 పాయింట్లతో నిలిచినా...ఆడిన 2 మ్యాచ్‌లలో కలిపి మెరుగైన గోల్స్ ప్రదర్శన ఆధారంగా (ఇంగ్లండ్ 9, భారత్ 6) మన జట్టు రెండో స్థానంలో నిలిచింది. క్వార్టర్ ఫైనల్ చేరాలంటే.. నిజానికి బలమైన ప్రత్యర్థి కాకపోయినా వేల్స్ ఒక దశలో భారత్‌ను బెంబేలెత్తించింది. మన టీమ్ కూడా అంది వచ్చిన అవకాశాలను గోల్స్‌గా మలచడంలో విఫలమైంది. 7 పెనాల్టీ కార్నర్లతో పాటు ఆరు సార్లు గోల్ చేసే అవకాశం వచ్చినా మనవాళ్లు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. తొలి క్వార్టర్లో గోల్స్ నమోదు కాకపోగా, రెండో క్వార్టర్లో ఒక గోల్‌తో భారత్ ముందంజ వేసింది. మూడో క్వార్టర్లో రెండు నిమిషాల వ్యవధిలో పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచి వేల్స్ స్కోరు సమం చేసింది. రెండో క్వార్టర్ తొలి నిమిషంలోనే భారత్‌కు పెనాల్టీ లభించగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ దానిని ఉపయోగించుకోలేకపోయాడు. అనంతరం హర్మన్‌ప్రీత్ డ్రాగ్ ఫ్లిక్ డిఫెండర్ స్టిక్కు తగిలి రీబౌండ్ అయి రాగా, ఈ సారి షంషేర్ దానిని గోల్ పోస్ట్‌లోకి పంపించగలిగాడు. మేం సంతృప్తిగా లేము అమిత్ రోహిదాస్ కూడా సరైన సమయంలో స్పందించడంలో విఫలమయ్యాడు. మూడో క్వార్టర్ 11వ నిమిషంలో లభించిన పెనాల్టీని అత ను కూడా విఫలం చేశాడు. చివర్లో కాస్త దూకుడు పెంచిన భారత్ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా ఊపిరి పీల్చుకుంది. ‘ఈ విజయంతో మేం సంతృప్తిగా లేము. ఇది మా అత్యుత్తమ ప్రదర్శన కాదు. మరింత బాగా ఆడాల్సింది’ అని మ్యాచ్ అనంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ వ్యాఖ్యానించాడు. ఇక ఆదివారం జరిగే ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడే భారత్ ఆ మ్యాచ్‌లో గెలిస్తే క్వార్టర్స్ చేరుకుంటుంది. ఇతర మ్యాచ్‌లలో మలేసియా 3–2తో న్యూజిలాండ్‌పై, ఇంగ్లండ్ 4–0తో స్పెయిన్‌పై విజయం సాధించాయి. చదవండి: Michael Bracewell: కుటుంబంలో అంతా క్రికెటర్లే! లేట్ అయినా సంచలనాలు సృష్టిస్తూ! కానీ ‘ఈరోజు’ నీది కాదంతే! సెలక్టర్లకు తలనొప్పి! పాపం గిల్! కిషన్‌తో రోజూ గొడవే.. అందుకే తనని బాగా తిడతా.. అయినా కూడా.. It’s time to celebrate the victory. 🤩🕺🏻#IndiaKaGame #HockeyIndia #HWC2023 #StarsBecomeLegends #HockeyWorldCup #INDvsWAL @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/c1ZqtXbR0Q — Hockey India (@TheHockeyIndia) January 19, 2023 -
బెల్జియం, జర్మనీ మ్యాచ్ డ్రా
భువనేశ్వర్: డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం,మాజీ విజేత జర్మనీ జట్ల మధ్య మంగళవారం జరిగిన ప్రపంచకప్ హాకీ టోర్నీ లీగ్ మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. పూల్ ‘బి’లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెల్జియం ఓటమి అంచున నిలిచింది. అయితే ఆఖరి క్వార్టర్లో వెగ్నేజ్ (54వ ని.లో) చేసిన గోల్‌తో ‘డ్రా’తో బయటపడింది. అంతకుముందు జర్మనీ జట్టులో వెలెన్ నిక్లస్ (22వ ని.లో), టామ్ గ్రామ్‌బుష్ (52వ ని.లో) చెరో గోల్ చేయగా, సెడ్రిక్ చార్లియర్ 9వ నిమిషంలోనే బెల్జియంకు తొలి గోల్ అందించాడు. ఈ నెల 20న జరిగే ఆఖరి లీగ్‌తో క్వార్టర్స్ బెర్త్‌లు ఖరారవుతాయి. చివరి లీగ్ మ్యాచ్‌ల్లో జపాన్‌తో బెల్జియం, దక్షిణ కొరియాతో జర్మనీ తలపడతాయి. ఈ పూల్ లో జరిగిన మొదటి మ్యాచ్‌లో దక్షిణ కొరియా 2–1తో జపాన్‌పై గెలిచింది. కొరియా తరఫున లీ జంగ్ జన్ (8వ, 23వ ని.లో) రెండు గోల్స్ చేశాడు. జపాన్ జట్టులో నగయొషి (1వ ని.లో) గోల్ సాధించాడు. అయితే జపాన్ 11 మందితో కాకుండా 12 మందితో ఆడటం వివాదం రేపింది. -
ప్రపంచకప్‌లో భారత్‌కు బిగ్ షాక్.. హార్దిక్ దూరం!
పురుషుల హాకీ ప్రపంచ కప్‌లో భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. మిడ్‌ఫీల్డర్ హార్దిక్ సింగ్ గాయం కారణంగా మిగిలిన టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 ఏళ్ల హార్దిక్ సింగ్ తొడ కండరాల గాయంతో బాధపడినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్ అనంతరం హర్దిక్‌ను స్కానింగ్ తరిలించగా.. అతడి గాయం తీవ్రమైనది తేలినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే అతడు దూరం కానున్నాడు. అదే విధంగా హార్దిక్ స్థానం భర్తీపై ఇంకా మేనేజ్మెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకోపోయినట్టు సమాచారం. కాగా హార్దిక్ భారత జట్టులో కీలక సభ్యునిగా ఉన్నాడు. స్పెయిన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హార్దిక్ అద్భుతమైన గోల్‌తో మెరిశాడు. అదే విధంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కూడా గోల్ సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఇక భారత తమ తదుపరి మ్యాచ్‌లో జనవరి19 వేల్స్‌తో తలపడనుంది. కాగా గ్రూపు-డి నుంచి భారత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. సెహ్వాగ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి -
ఆఖరి వరకు ఉత్కంఠ.. డ్రాగా ముగిసిన భారత్- ఇంగ్లండ్ మ్యాచ్
పురుషుల హాకీ ప్రపంచకప్ గ్రూపు డిలో భాగంగా ఆదివారం భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో వరుసగా రెండో విజయం సాధించి టెబుల్ టాపర్‌గా నిలవాలన్న భారత్ కలనెరవేరలేదు. 60 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఆఖరి వరకు ఇరు జట్లు హోరాహోరీగా పోరాడనప్పటికీ ఒక్క గోల్ కూడా సాధించలేకపోయాయి. తొలి అర్థ భాగంలో భారత ఆటగాడు హార్ధిక్ సింగ్ గోల్ కోసం గట్టిగా ప్రయత్నించి విఫలమయ్యాడు. రెండో అర్థభాగంలో భారత్ పెనాల్టీ గోల్ వేసే అవకాశాలను కూడా చేజార్చుకుంది. మరోవైపు ఇంగ్లండ్ జట్టు కూడా పలు అవకాశాలు వచ్చినప్పటికీ సద్వినియోగపరుచుకోలేకపోయింది. అదే విధంగా మ్యాచ్ ఆఖరి నిమిషంలో కూడా ఇంగ్లండ్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. దీంతో స్టేడియం మొత్తం తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ ఆటగాడు పెనాల్టీ కార్నర్ ను గురి చూసి భారత్ పోస్ట్ పైకి కొట్టాడు. వెంటనే భారత గోల్‌కీపర్ పాఠక్ అడ్డుకోవడంతో అభిమానలంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. తద్వారా ఇరు జట్లకు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఇక భారత్, ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్‌లలో విజయం సాధించడంతో ప్రస్తుతం ఇరు జట్ల ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. అయితే గోల్స్ పరంగా ముందంజలో ఉన్న ఇంగ్లండ్ గ్రూపు-డి నుంచి టెబుల్ టాపర్‌గా నిలిచింది. చదవండి: Steffi Graf: ఒకే ఏడాది 4 గ్రాండ్‌స్లామ్‌లతో పాటు ఒలింపిక్ స్వర్ణం నెగ్గిన ఆల్‌టైమ్ గ్రేట్ 𝐅𝐮𝐥𝐥-𝐓𝐢𝐦𝐞: 𝐄𝐧𝐠𝐥𝐚𝐧𝐝 𝟎-𝟎 𝐈𝐧𝐝𝐢𝐚 There is no separating England and India as the two long-time rivals play out a hugely entertaining draw in the second game of the day in Pool D. #HWC2023 📱- Download the @watchdothockey app to follow all the updates. pic.twitter.com/wARP6Bv22w — International Hockey Federation (@FIH_Hockey) January 15, 2023 Goosebumps ❤️ #HockeyWorldCup2023 #OdishaForHockey #INDvsENG pic.twitter.com/Umh3CvmOWo — Arjit Sharma (@Oblivion_Arjit) January 15, 2023