
భువనేశ్వర్: పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీలో ఆ్రస్టేలియా జట్టు వరుసగా 12వసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. స్పెయిన్ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆ్రస్టేలియా 4–3 తో గెలిచింది. ఆసీస్ తరఫున హేవార్డ్ (33వ, 37వ ని.లో) రెండు గోల్స్ చేయగా... జెలెవ్‌స్కీ (32వ ని.లో), ఫ్లిన్ ఒగిల్వీ (30వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఒకదశలో ఆ్రస్టేలియా 0–2తో వెనుకబడినా ఏడు నిమిషాల వ్యవధిలో నాలుగు గోల్స్ సాధించింది. మరో క్వార్టర్ ఫైనల్లో బెల్జియం 2–0తో న్యూజిలాండ్‌ను ఓడించి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment