కౌలాలంపూర్: మూడోసారి విశ్వవిజేతగా నిలవాలనే లక్ష్యంతో... నేటి నుంచి మొదలయ్యే జూనియర్ పురుషుల అండర్–21 హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు బరిలోకి దిగనుంది. పూల్ ‘సి’లో భాగంగా నేడు జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో ఉత్తమ్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు గురువారం స్పెయిన్‌తో రెండో మ్యాచ్‌ను... శనివారం కెనడాతో మూడో మ్యాచ్‌ను ఆడుతుంది.
ఈనెల 16 వరకు జరిగే ఈ టోరీ్నలో మొత్తం 16 జట్లు పోటీపడుతున్నాయి. జట్లను నాలుగు పూల్స్‌గా విభజించారు. పూల్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా, ఆ్రస్టేలియా, చిలీ, మలేసియా... పూల్ ‘బి’లో ఈజిప్‌్ట, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణాఫ్రికా... పూల్ ‘డి’లో బెల్జియం, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లున్నాయి.
ఈనెల 9న లీగ్ మ్యాచ్‌లు ముగిశాక ఆయా పూల్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. క్వార్టర్ ఫైనల్స్ 12న, సెమీఫైనల్స్ 14న, ఫైనల్ 16న జరుగుతాయి. ఈ టోర్నీ మ్యాచ్‌లను స్పోర్ట్స్ 18 చానెల్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 44 ఏళ్ల చరిత్ర కలిగిన జూనియర్ ప్రపంచకప్‌లో భారత జట్టు రెండుసార్లు (2001, 2016) టైటిల్స్ సాధించి, ఒకసారి రన్నరప్‌గా (1997) నిలిచింది.
భారత జట్టు: ఉత్తమ్ సింగ్ (కెప్టెన్), అరైజిత్ సింగ్ (వైస్ కెప్టెన్), ఆదిత్య, సౌరభ్, సుదీప్, బాబీ సింగ్, మోహిత్, రణ్‌విజయ్, శార్దానంద్, అమన్‌దీప్ లాక్రా, రోహిత్, సునీల్, అమీర్ అలీ, విష్ణుకాంత్, పూవణ్ణ, రాజిందర్ సింగ్, అమన్‌దీప్, ఆదిత్య సింగ్.
Comments
Please login to add a commentAdd a comment