first league match
-
Junior Hockey World Cup 2023: టైటిల్ లక్ష్యంగా బరిలోకి...
కౌలాలంపూర్: మూడోసారి విశ్వవిజేతగా నిలవాలనే లక్ష్యంతో... నేటి నుంచి మొదలయ్యే జూనియర్ పురుషుల అండర్–21 హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు బరిలోకి దిగనుంది. పూల్ ‘సి’లో భాగంగా నేడు జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో ఉత్తమ్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు గురువారం స్పెయిన్‌తో రెండో మ్యాచ్‌ను... శనివారం కెనడాతో మూడో మ్యాచ్‌ను ఆడుతుంది. ఈనెల 16 వరకు జరిగే ఈ టోరీ్నలో మొత్తం 16 జట్లు పోటీపడుతున్నాయి. జట్లను నాలుగు పూల్స్‌గా విభజించారు. పూల్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా, ఆ్రస్టేలియా, చిలీ, మలేసియా... పూల్ ‘బి’లో ఈజిప్‌్ట, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణాఫ్రికా... పూల్ ‘డి’లో బెల్జియం, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లున్నాయి. ఈనెల 9న లీగ్ మ్యాచ్‌లు ముగిశాక ఆయా పూల్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. క్వార్టర్ ఫైనల్స్ 12న, సెమీఫైనల్స్ 14న, ఫైనల్ 16న జరుగుతాయి. ఈ టోర్నీ మ్యాచ్‌లను స్పోర్ట్స్ 18 చానెల్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 44 ఏళ్ల చరిత్ర కలిగిన జూనియర్ ప్రపంచకప్‌లో భారత జట్టు రెండుసార్లు (2001, 2016) టైటిల్స్ సాధించి, ఒకసారి రన్నరప్‌గా (1997) నిలిచింది. భారత జట్టు: ఉత్తమ్ సింగ్ (కెప్టెన్), అరైజిత్ సింగ్ (వైస్ కెప్టెన్), ఆదిత్య, సౌరభ్, సుదీప్, బాబీ సింగ్, మోహిత్, రణ్విజయ్, శార్దానంద్, అమన్‌దీప్ లాక్రా, రోహిత్, సునీల్, అమీర్ అలీ, విష్ణుకాంత్, పూవణ్ణ, రాజిందర్ సింగ్, అమన్‌దీప్, ఆదిత్య సింగ్. -
T20 World Cup: ప్రపంచకప్ ‘ప్రతీకార’ పోరు
క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఎప్పుడు, ఎన్నిసార్లు మ్యాచ్ జరిగినా అది కొత్తగానే ఉంటుంది. సుదీర్ఘ విరామం తర్వాతేమీ ఆడటం లేదు, ఇరు జట్ల మధ్య పోరు జరిగి సరిగ్గా 50 రోజులే అయింది. అయినా సరే ఇప్పుడు వరల్డ్‌కప్ వచ్చేసరికి మళ్లీ అభిమానుల్లో అదే ఉత్సాహం, అదే ఉద్వేగం... ఆటగాళ్లపై అదే తరహాలో తప్పని ఒత్తిడి కూడా! ఆసియా కప్‌ను పక్కన పెడితే గత ఏడాది టి20 ప్రపంచకప్‌లో పాక్ చేతిలో ఎదురైన పరాజయం కోణంలోనే భారత్‌కు ఈ మ్యాచ్ మరింత కీలకం. ‘ప్రతీకారం’ అనే మాటను వాడదల్చుకోలేదని ఎవరు చెప్పినా ఆ పదం విలువ, అర్థమేమిటో భారత అభిమానులకు బాగా తెలుసు! మెల్బోర్న్: ఎప్పుడో 37 ఏళ్ల క్రితం... భారత్, పాకిస్తాన్ జట్లు ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో తలపడ్డాయి. ఇరు జట్ల మధ్య పోరును ఎవరూ పట్టించుకోని ఆ రోజుల్లో 30 వేల మంది కూడా మ్యాచ్‌కు రాలేదు. కానీ ఇప్పుడు... ఈ మ్యాచ్ రాబట్టే ఆదాయం ఏమిటో బాగా తెలిసిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఎంసీజీని వేదికగా మార్చింది. 90 వేల సామర్థ్యం గల మైదానంలో చాలా కాలం క్రితమే అన్ని టికెట్లు నిమిషాల వ్యవధిలో అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల అభిమానుల హోరు మధ్య నేడు భారత్, పాకిస్తాన్ తమ తొలి లీగ్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. దీంతో అభిమానులందరికీ ఆదివారం మధ్యాహ్నం నుంచి వినోదానికి ఫుల్ గ్యారంటీ. రెండో స్పిన్నర్ ఎవరు? భారత జట్టుకు బ్యాటింగ్‌కు సంబంధించి కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇటీవల ఆసియా కప్‌తో పాటు ఆ తర్వాత స్వదేశంలో జరిగిన సిరీస్‌లను బట్టి చూస్తే చాలా వరకు తుది జట్టు ఏమిటో స్పష్టమవుతుంది. టాపార్డర్‌లో రోహిత్, రాహుల్, కోహ్లిలు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. గత వరల్డ్ కప్‌లో ఈ ముగ్గురి వికెట్లు తీసి షాహిన్ అఫ్రిది ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఈసారి అతని బౌలింగ్‌పై చెలరేగితే ప్రత్యర్థి ఆత్మరక్షణలో పడిపోతుంది. ప్రస్తుతం టి20 క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్ మిడిలార్డర్లో దూకుడుగా ఆడగల సమర్థుడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ ఫినిషింగ్ బాధ్యతలు చేపడతారు. ఎడంచేతి వాటం ప్రయోజనం ఉన్నా, ప్రస్తుత ఫామ్ ప్రకారం కార్తీక్కే తుది జట్టులో స్థానం దక్కే అవకాశం ఎక్కువ. పేస్ బౌలింగ్‌లో షమీ, భువనేశ్వర్, అర్‡్షదీప్లు ఖాయం కాగా... రెండో స్పిన్నర్ విషయంలో అశ్విన్, చహల్‌లలో ఒకరే ఆడే అవకాశముంది. రవూఫ్ కీలకం! పాకిస్తాన్ బ్యాటింగ్‌లో కూడా తడబాటు ఉంది. అంకెలపరంగా చూస్తే మొహమ్మద్ రిజ్వాన్, కెప్టెన్ బాబర్ ఆజమ్ పెద్ద సంఖ్యలో పరుగులు చేస్తున్నట్లు కనిపిస్తున్నా, వారి స్ట్రయిక్‌రేట్ పేలవం. షాన్ మసూద్ పేలవ ఫామ్‌లో ఉండగా, గాయంతో ఫఖర్ జమాన్ దూరమయ్యాడు. మిడిలార్డర్లో హైదర్ అలీ, ఆసిఫ్ అలీ, ఇఫ్తికార్‌లు అంతంత మాత్రం బ్యాటర్లే! ఆసియా కప్‌లోనే వీరి వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఆసీస్ గడ్డపై వీరు ఏమాత్రం ఆడతారనేది చెప్పలేం. దాంతో పాకిస్తాన్ తమ బౌలింగ్‌నే ప్రధానంగా నమ్ముకుంటోంది. గాయం నుంచి కోలుకొని తిరిగొచ్చిన షాహిన్ తమ రాత మార్చగలడని పాక్ భావిస్తోంది. షాహిన్ బౌలింగ్‌లో శుభారంభం అందిస్తే ఆ జట్టుపై ఒత్తిడి తగ్గుతుంది. మరో పేసర్‌గా నసీమ్ షా ఉంటాడు. అయితే వాస్తవానికి అఫ్రిదికంటే కూడా హారిస్ రవూఫ్ కీలకం కానున్నాడు. బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్ తరఫున చెలరేగిన అతనికి ఒక రకంగా ఇది సొంత మైదానంలాంటిది. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, కోహ్లి, సూర్యకుమార్, హార్దిక్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, షమీ, చహల్/అశ్విన్, భువనేశ్వర్, అర్‡్షదీప్ సింగ్. పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), రిజ్వాన్, షాన్ మసూద్, హైదర్ అలీ, ఇఫ్తికార్, ఆసిఫ్ అలీ, నవాజ్, షాదాబ్, నసీమ్ షా, షాహిన్ అఫ్రిది, హారిస్ రవూఫ్. -
Womens Asia Cup 2022: ఫేవరెట్‌గా భారత్
సిల్హెట్ (బంగ్లాదేశ్): మహిళల ఆసియా కప్ టోర్నీని 2004 నుంచి 2018 వరకు ఏడు సార్లు నిర్వహించారు. ఇందులో ఆరు సార్లు భారతే విజేత. ఈ టోర్నీలో మన ఆధిక్యం ఎలా సాగిందో చెప్పేందుకు ఇది చాలు. వన్డే ఫార్మాట్లో నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన మన అమ్మాయిలు టి20 ఫార్మాట్లో రెండు సార్లు టైటిల్ నెగ్గారు. గత టోర్నీలో మాత్రం అనూహ్యంగా ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయి మన జట్టు రన్నరప్‌తో సంతృప్తి చెందింది. ఇప్పుడు మరోసారి తమ సత్తా చాటి ట్రోఫీ గెలుచుకునేందుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సేన సిద్ధమైంది. జట్టు తాజా ఫామ్, ఇటీవలి కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం, ఇంగ్లండ్‌పై వన్డేల్లో సాధించిన విజయాలు సహజంగానే భారత్‌ను ఫేవరెట్‌గా చూపిస్తున్నాయి. నేడు జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ ఆడుతుంది. ఆ తర్వాత టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌ల్లో వరుసగా మలేసియా (3న), యూఏఈ (4న), పాకిస్తాన్ (7న), బంగ్లాదేశ్ (8న), థాయ్‌లాండ్ (10న) జట్లతో తలపడుతుంది. మొత్తం 7 జట్లు బరిలోకి దిగుతుండగా, భారత్‌తో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, యూఏఈ, మలేసియా, థాయ్‌లాండ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. యూఏఈ తొలిసారి ఆసియా కప్‌లో ఆడనుండగా, పురుషుల ఆసియా కప్‌లో రాణించిన అఫ్గానిస్తాన్‌కు మహిళల టీమ్ లేదు. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో ప్రతీ జట్టు ఆరుగురు ప్రత్యర్థులతో ఒక్కో మ్యాచ్‌లో తలపడుతుంది. టాప్–4 టీమ్‌లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 15న ఫైనల్ నిర్వహిస్తారు. జోరు మీదున్న టీమ్... ఆసియా కప్ చరిత్రలో వన్డేలు, టి20లు కలిపి భారత్ 32 మ్యాచ్‌లు ఆడగా 30 మ్యాచ్‌లు గెలిచింది. ప్రస్తుత టీమ్ అదే తరహాలో పూర్తి స్థాయిలో పటిష్టంగా ఉంది. హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అద్భుత ఫామ్‌లో ఉండగా ఇప్పుడు జెమీమా రోడ్రిగ్స్ చేరికతో బ్యాటింగ్ మరింత పటిష్టంగా మారింది. హేమలత, కీపర్ రిచా ఘోష్, దీప్తి శర్మ కూడా ధాటిగా ఆడగలరు. అయితే కొన్నాళ్ల క్రితం వరకు మెరుపు ఆరంభాలతో ఆకట్టుకున్న షఫాలీ వర్మ ఇటీవలి పేలవ ప్రదర్శనే జట్టును కాస్త ఆందోళనపరుస్తోంది. అయితే ఆమెలో సామర్థ్యానికి కొదవ లేదని, ఒక్క ఇన్నింగ్స్ తో పరిస్థితి మారుతుందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అండగా నిలిచింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి సబ్బినేని మేఘనకు ఎన్ని అవకాశాలు లభిస్తాయో చూడాలి. బౌలింగ్‌లో కూడా భారత్ చక్కటి ఫామ్‌లో ఉంది. పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ నిలకడగా రాణించడం జట్టుకు ప్రధాన బలంగా మారింది. మరో పేసర్ పూజ వస్త్రకర్ ఆమెకు అండగా నిలుస్తోంది. బంగ్లా గడ్డపై ప్రభావం చూపించగల స్పిన్ విభాగంలో మన బృందం మరింత పటిష్టంగా కనిపిస్తోంది. దీప్తి శర్మ, రాధా యాదవ్, ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా సమష్టిగా జట్టును గెలిపించగలరు. గత ఆసియా కప్ ఫైనల్ ప్రదర్శనను పక్కన పెడితే మరోసారి భారత్‌కే టైటిల్ దక్కే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. -
సైనా, శ్రీకాంత్‌లకు నిరాశ
తొలి లీగ్ మ్యాచ్‌లో పరాజయం సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ దుబాయ్: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో భారత స్టార్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లకు తొలి రోజు నిరాశ ఎదురైంది. వీరిద్దరూ తొలి లీగ్ మ్యాచ్‌ల్లో జపాన్ ఆటగాళ్ల చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ శ్రీకాంత్ 13-21, 13-21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ కెంటో మొమొటా (జపాన్) చేతిలో... మహిళల గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ సైనా 14-21, 6-21తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో ఓటమి చవిచూశారు. గురువారం జరిగే రెండో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో శ్రీకాంత్, కరోలినా మారిన్ (స్పెయిన్)తో సైనా తలపడతారు. ఒకుహారాతో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన సైనా ఈసారి మాత్రం తేలిపోయింది. చీలమండ గాయంతో బాధపడుతున్న సైనా కోర్టులో చురుకుగా కదల్లేకపోయింది. ఇక మొమొటాతో జరిగిన మ్యాచ్‌లోనూ శ్రీకాంత్ తన సహజశైలి ఆటతీరును కనబర్చలేకపోయాడు. ఐఓసీ అథ్లెట్స్ కమిషన్ ఎన్నికల్లో సైనా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లోని అథ్లెట్స్ కమిషన్ కమిటీ ఎన్నికల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పోటీపడనుంది. వచ్చే ఏడాది ఆగస్టులో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్ సందర్భంగా ఈ ఎన్నికలను నిర్వహిస్తారు. నాలుగు స్థానాల కోసం మొత్తం 24 మంది స్టార్ క్రీడాకారులు పోటీపడనున్నారు.