Junior Hockey World Cup
-
Junior Hockey World Cup 2023: టైటిల్ లక్ష్యంగా బరిలోకి...
కౌలాలంపూర్: మూడోసారి విశ్వవిజేతగా నిలవాలనే లక్ష్యంతో... నేటి నుంచి మొదలయ్యే జూనియర్ పురుషుల అండర్–21 హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు బరిలోకి దిగనుంది. పూల్ ‘సి’లో భాగంగా నేడు జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో ఉత్తమ్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు గురువారం స్పెయిన్‌తో రెండో మ్యాచ్‌ను... శనివారం కెనడాతో మూడో మ్యాచ్‌ను ఆడుతుంది. ఈనెల 16 వరకు జరిగే ఈ టోరీ్నలో మొత్తం 16 జట్లు పోటీపడుతున్నాయి. జట్లను నాలుగు పూల్స్‌గా విభజించారు. పూల్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా, ఆ్రస్టేలియా, చిలీ, మలేసియా... పూల్ ‘బి’లో ఈజిప్‌్ట, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణాఫ్రికా... పూల్ ‘డి’లో బెల్జియం, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లున్నాయి. ఈనెల 9న లీగ్ మ్యాచ్‌లు ముగిశాక ఆయా పూల్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. క్వార్టర్ ఫైనల్స్ 12న, సెమీఫైనల్స్ 14న, ఫైనల్ 16న జరుగుతాయి. ఈ టోర్నీ మ్యాచ్‌లను స్పోర్ట్స్ 18 చానెల్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 44 ఏళ్ల చరిత్ర కలిగిన జూనియర్ ప్రపంచకప్‌లో భారత జట్టు రెండుసార్లు (2001, 2016) టైటిల్స్ సాధించి, ఒకసారి రన్నరప్‌గా (1997) నిలిచింది. భారత జట్టు: ఉత్తమ్ సింగ్ (కెప్టెన్), అరైజిత్ సింగ్ (వైస్ కెప్టెన్), ఆదిత్య, సౌరభ్, సుదీప్, బాబీ సింగ్, మోహిత్, రణ్విజయ్, శార్దానంద్, అమన్‌దీప్ లాక్రా, రోహిత్, సునీల్, అమీర్ అలీ, విష్ణుకాంత్, పూవణ్ణ, రాజిందర్ సింగ్, అమన్‌దీప్, ఆదిత్య సింగ్. -
హాకీ ప్రపంచకప్ చాంపియన్ అర్జెంటీనా.. కాంస్య పతక పోరులో భారత హాకీ జట్టుకు నిరాశ..
భువనేశ్వర్: సొంతగడ్డపై జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో కనీసం కాంస్య పతకమైనా సాధించాలని ఆశించిన భారత్‌కు నిరాశ ఎదురైంది. మూడో స్థానం కోసం ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 1–3 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ చేతిలో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఫ్రాన్స్ ఆటగాడు క్లెమెంట్ టిమోతి హ్యాట్రిక్ గోల్స్ (26, 34, 47వ నిమిషాల్లో)తో భారత్‌కు చెక్ పెట్టాడు. టీమిండియా తరఫున నమోదైన ఏకైక గోల్‌ను సుదీప్ (42వ నిమిషంలో) సాధించాడు. చాంపియన్ అర్జెంటీనా టైటిల్ పోరులో ఆరుసార్లు చాంపియన్ జర్మనీకి అర్జెంటీనా షాక్ ఇచ్చింది. ఫైనల్లో అర్జెంటీనా 4–2 తో జర్మనీపై గెలిచింది. జూనియర్ ప్రపంచకప్‌ను అర్జెంటీనా గెలవడం ఇది రెండోసారి. 2005లో తొలిసారి అర్జెంటీనా విజేతగా నిలిచింది. చదవండి: ముత్తయ్య మురళీధరన్ రికార్డును బద్దలు కొట్టేది అతడే.. -
వరల్డ్‌కప్ నుంచి పాకిస్తాన్ ఔట్..
భువనేశ్వర్: జూనియర్ హాకీ ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించింది. గ్రూప్ ‘డి’లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 3–4 గోల్స్ తేడాతో అర్జెంటీనా చేతిలో ఓడింది. దాంతో గ్రూప్ ‘డి’లో ఒక విజయం, రెండు ఓటములతో 3 పాయింట్లు సాధించిన పాక్ మూడో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు (క్వార్టర్ ఫైనల్స్) అర్హత సాధించలేకపోయింది. అర్జెంటీనా తరఫున బాటిస్టా (10వ ని.లో), నార్డోలిలో (20వ ని.లో), ఫ్రాన్సిస్కో (30వ ని.లో), ఇబార (47వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. పాక్ ఆటగాళ్లు రాణా అబ్దుల్ (17వ నిమిషంలో), రిజ్వాన్ అలీ (28వ నిమిషంలో), అహ్మద్ (53వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. చదవండి: BAN Vs PAK: పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన బంగ్లాదేశ్ బౌలర్.. ఏకంగా 7 వికెట్లు... -
క్వార్టర్స్‌లో యువ భారత్..
భువనేశ్వర్: జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. శనివారం గ్రూప్ ‘బి’లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8–2తో పోలాండ్‌పై ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున సంజయ్ (4, 58వ నిమిషాల్లో), అరైజీత్ సింగ్ (8, 60వ నిమిషాల్లో), సుదీప్ (24, 40వ నిమిషాల్లో) తలా రెండు గోల్స్ చేశారు. ఉత్తమ్ సింగ్ (34వ నిమిషంలో), శర్దానంద్ తివారి (38వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. ఈ విజయంతో భారత్ గ్రూప్ ‘బి’లో రెండో స్థానంలో నిలిచింది. డిసెంబర్ 1న జరిగే క్వార్టర్ ఫైనల్లో బెల్జియంతో భారత్ ఆడనుంది. చదవండి: Ind Vs Nz 1st Test 2021: గిల్ ఓపెనర్‌గా కాకుండా ఆ స్ధానంలో బ్యాటింగ్‌కు రావాలి -
Hockey Mens Junior World Cup 2021: కెనడాపై భారత్ విజృంభణ..
భువనేశ్వర్: జూనియర్ హాకీ ప్రపంచ కప్‌లో ఫ్రాన్స్ చేతిలో ఎదురైన ఓటమి నుంచి భారత జూనియర్ హాకీ జట్టు తేరుకుంది. 24 గంటల వ్యవధిలో జరిగిన మరో మ్యాచ్‌లో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగి ఘన విజయంతో టోర్నీలో బోణీ కొట్టింది. గ్రూప్ ‘బి’లో భాగంగా గురువారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 13–1 గోల్స్ తేడాతో కెనడాను చిత్తు చేసింది. భారత్ ఆటగాళ్లలో సంజయ్ (17, 32, 59వ నిమిషాల్లో), అరైజీత్ సింగ్ (40, 50, 51వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్ సాధించారు. ఉత్తమ్ సింగ్ (16, 47వ నిమిషాల్లో), శర్దానంద్ (35, 53వ నిమిషాల్లో)లు రెండు గోల్స్ చొప్పున చేయ గా... కెప్టెన్ వివేక్ సాగర్ ప్రసాద్ (8వ నిమిషంలో), మణీందర్ సింగ్ (27వ నిమిషం లో), అభిషేక్ లాక్రా (55వ నిమిషంలో) తలా ఓ గోల్ చేసి భారత్‌కు తిరుగులేని విజయాన్ని అందించారు. కెనడా తరఫున నమోదైన ఏకైక గోల్ (30వ నిమిషంలో)ను క్రిస్టోఫర్ చేశాడు. చదవండి: James Neesham: 'అన్నిసార్లు టీమిండియానే గెలుస్తుంది.. నాకేదో అనుమానంగా ఉంది' -
తొలి పోరులో ఫ్రాన్స్ చేతిలో భారత్ పరాజయం..
భువనేశ్వర్: ప్రతిష్టాత్మక జూనియర్ హాకీ ప్రపంచ కప్ మొదటి పోరులో భారత్ తడబడింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాతో టోర్నీలో అడుగుపెట్టిన భారత జూనియర్ జట్టు... ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయింది. బుధవారం గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 4–5 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ చేతిలో ఓడింది. భారత్ తరఫున సంజయ్ మూడు గోల్స్ (15, 57, 58వ నిమిషాల్లో) చేయగా... ఉత్తమ్ సింగ్ ఒక గోల్ (10వ నిమిషంలో) సాధించాడు. ఫ్రాన్స్ ప్లేయర్ క్లెమెంట్ టిమోతీ మూడు గోల్స్ (1, 23, 32వ నిమిషాల్లో), బెంజమిన్ (7వ నిమిషంలో), కొరెంటిన్ (48వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. రెండు నిమిషాల్లో రెండు గోల్స్ చేసినా... మ్యాచ్ తొలి నిమిషంలోనే భారత రక్షణ శ్రేణిని ఛేదించిన ఫ్రాన్స్ ఆటగాడు టిమోతీ ఫీల్డ్ గోల్ సాధించాడు. మరో ఆరు నిమిషాల తర్వాత బెంజమిన్ మరో ఫీల్డ్ గోల్ చేసి ఫ్రాన్స్‌కు 2–0 ఆధిక్యాన్నిచ్చాడు. ఫ్రాన్స్ అటాకింగ్ నుంచి తేరుకున్న భారత్ వెంట వెంటనే రెండు గోల్స్ చేసి స్కోరును 2–2తో సమం చేసింది. ఆ వెంటనే ఫ్రాన్స్ మరో మూడు గోల్స్ చేసి తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఆట ఆఖరి నిమిషాల్లో వేగం పెంచిన భారత్ గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై పదే పదే దాడులు చేసింది. ఈ క్రమంలో భారత్ రెండు నిమిషాల్లో రెండు గోల్స్ చేసి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించేలా కనిపించింది. 57, 58వ నిమిషాల్లో లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా గోల్స్‌గా మలిచిన సంజయ్ ఫ్రాన్స్ ఆధిక్యాన్ని 5–4కు తగ్గించాడు. అనంతరం మరో గోల్ సాధించడంలో విఫలమైన భారత్ ఓటమిని ఆహ్వానించింది. మ్యాచ్‌లో భారత్‌కు మొత్తం ఏడు పెనాల్టీ కార్నర్స్ లభించగా వాటిలో మూడింటిని మాత్ర మే గోల్స్‌గా మలిచి మూల్యం చెల్లించుకుంది. చదవండి: WI Vs SL: పరాజయం దిశగా విండీస్... విజయానికి నాలుగు వికెట్ల దూరంలో శ్రీలంక.. -
FIH Hockey Junior World Cup: హాకీలో జూనియర్ల సమరం
భువనేశ్వర్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు కాంస్యం సాధించడంతో హాకీ ఆటకు కొత్త కళ వచ్చింది. ఈ నేపథ్యంలో సీనియర్ల బాటలో మరో పెద్ద విజయాన్ని అందుకునేందుకు జూనియర్లు సన్నద్ధమవుతున్నారు. నేటినుంచి జరిగే జూనియర్ ప్రపంచ కప్ హాకీలో భారత జట్టు ఫేవరెట్‌గా దిగుతోంది. డిఫెండింగ్ చాంపియన్ కూడా అయిన మన టీమ్‌తో పాటు మరో 15 జట్లు టోర్నీ బరిలో ఉన్నాయి. 2016 ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచిన భారత్...టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు అస్త్ర శస్త్రాలతో రెడీ అయింది. గ్రూప్ ‘బి’లో నేడు తమ తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌తో భారత్ తలపడుతుంది. ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన భారత సీనియర్ జట్టులో సభ్యుడిగా ఉన్న వివేక్ సాగర్ ప్రసాద్ టీమిండియాకు సారథిగా వ్యవహరించనున్నాడు. గ్రూప్ ‘బి’లో భారత్, ఫ్రాన్స్‌లతో పాటు కెనడా, పోలాండ్ జట్లు ఉన్నాయి. 25న కెనడాతో... 27న పోలాండ్‌తో భారత్∙తన తదుపరి మ్యాచ్‌లను ఆడనుంది. గ్రూప్‌లో టాప్–2గా నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఫైనల్ డిసెంబర్ 5న జరగనుంది. కరోనా వల్ల స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించడం లేదు. మూడో టైటిల్‌పై గురి... ఇప్పటికే రెండు సార్లు (2001, 2016లలో) చాంపియన్‌గా నిలిచిన భారత్ టోర్నీలో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. మ్యాచ్‌లన్నీ భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరగనుండటం భారత్‌కు కలిసొచ్చే అవకాశం. కోవిడ్–19 దృష్ట్యా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు ఈ టోర్నీకి దూరంగా ఉన్నాయి. అయితే టైటిల్ వేటలో జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్ నుంచి మన జట్టుకు పోటీ తప్పకపోవచ్చు. జూనియర్ హాకీ ప్రపంచ కప్‌ను జర్మనీ అత్యధికంగా ఆరు సార్లు గెల్చుకోవడం విశేషం. ఈ టోర్నీ కోసం టీమిండియా గత కొన్ని నెలలుగా తీవ్రంగా శ్రమిస్తోంది. వెటరన్ ఆటగాడు కరియప్ప టీమ్‌కు కోచ్‌గా ఉన్నప్పటికీ... సీనియర్ టీమ్ కోచ్ గ్రాహమ్ రీడ్ యువ టీమిండియాపై ప్రత్యేకంగా దృష్టి సారించాడు. సీనియర్ జట్టుతో మ్యాచ్‌లను ఆడిస్తూ యువ భారత్‌ను ప్రపంచ కప్ కోసం సిద్ధం చేశాడు. -
జూనియర్ హాకీ ప్రపంచకప్.. ‘బిగ్ ఎనౌన్స్మెంట్’!
భువనేశ్వర్: భారత హాకీ జట్టు ప్రధాన స్పాన్సర్ గా ఉన్న ఒడిశా రాష్ట్రం మరో ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు వేదిక కానుంది. ఈ ఏడాది నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు జరిగే పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్ ఒడిశాలోని కళింగ స్టేడియంలో జరగనుంది. ఈ మేరకు ఆతిథ్య హక్కులను ఒడిశాకు కట్టబెడుతూ అంతర్జాతీయ హాకీ సమాఖ్య నిర్ణయం తీసుకుంది. ఈ ఈవెంట్ కోసం ఉత్తరప్రదేశ్ కూడా రేసులో ఉన్నా... 2016 ప్రపంచకప్ అక్కడే జరగడంతో ఈసారి ఒడిశాకు అవకాశం దక్కింది. ఈ మెగా ఈవెంట్లో భారత్‌తో పాటు మరో 15 దేశాలు పాల్గొంటున్నాయి. చదవండి: IPL 2021: కోహ్లికి షాకివ్వనున్న ఆర్సీబీ యాజమాన్యం.. నిజమేనా?! 📢 𝗔𝗡𝗡𝗢𝗨𝗡𝗖𝗘𝗠𝗘𝗡𝗧 The hockey fever is going to be back in town! 🤩 The showpiece event 𝗙𝗜𝗛 𝗢𝗗𝗜𝗦𝗛𝗔 𝗛𝗢𝗖𝗞𝗘𝗬 𝗠𝗘𝗡'𝗦 𝗝𝗨𝗡𝗜𝗢𝗥 𝗪𝗢𝗥𝗟𝗗 𝗖𝗨𝗣 𝗕𝗛𝗨𝗕𝗔𝗡𝗘𝗦𝗪𝗔𝗥 2021 comes to #Odisha. 🗓️: 24 Nov to 05 Dec, 2021 pic.twitter.com/Zg0hFQylLJ — Odisha Sports (@sports_odisha) September 23, 2021 -
ఫైనల్‌కు చేరిన భారత్
-
ఫైనల్‌కు చేరిన భారత్
న్యూఢిల్లీ: జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం సాయంత్రం ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠ పోరులో పెనాల్టీ షూటౌట్లో భారత్ విజయం సాధించింది. లక్నోలోని మేజర్ ద్యాన్‌చంద్ హాకీ స్టేడియంలో నువ్వా నేనా అన్నట్లు తలపడ్డ ఇరుజట్లు.. నిర్ణీత సమయంలో 2-2 స్కోరుతో సమంగా నిలవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. పెనాల్టీ షూటౌట్లో అనూహ్యంగా రాణించిన భారత్ 4-2 గోల్స్ తేడా ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీని ఓడించిన బెల్జియంతో భారత్ తలపడనుంది. -
భారత్‌కు అసలు పరీక్ష!
లక్నో: లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత్ అదే జోరును నాకౌట్లోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. సొంతగడ్డపై జరుగుతున్న జూనియర్ పురుషుల హాకీ ప్రపంచకప్‌లో గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. తొలి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో కెనడాపై 4–0తో, ఇంగ్లండ్‌పై 5–3తో నెగ్గిన భారత్‌కు మూడో లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నుంచి గట్టిపోటీ ఎదురైంది. చివరకు 2–1తో గట్టెక్కిన భారత్ నాకౌట్ మ్యాచ్‌ను మాత్రం తేలిగ్గా తీసుకోవడంలేదు. ఈ మ్యాచ్‌లో ఎలాంటి ప్రయోగాలు చేయకుండా ప్రణాళిక ప్రకారం ఆడతామని భారత కోచ్ హరేంద్ర సింగ్ తెలిపారు. ‘దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తొలి 15 నిమిషాల్లో మా ఆటగాళ్లు స్థాయికి తగ్గట్టు ఆడలేదు. ప్రత్యర్థి జట్టు గురించి ఎక్కువ ఆలోచించకుండా సహజశైలిలో ఆడటం మంచి ఫలితాలు ఇస్తుందని నేను నమ్ముతాను’ అని హరేంద్ర చెప్పారు. -
కుర్రాళ్ల పంతం... చేసుకోవాలి కప్ సొంతం
నేటి నుంచి జూనియర్ ప్రపంచ కప్ హాకీ ఫేవరెట్‌గా భారత్ బరిలో 16 జట్లు లక్నో: దశాబ్దంన్నర నిరీక్షణకు తెర దించాలని... సొంతగడ్డపై విశ్వవిజేతగా అవతరించాలని... జాతీయ క్రీడకు పునరుత్తేజం కలిగించాలనే లక్ష్యంతో... భారత యువ హాకీ జట్టు సర్వసన్నద్ధమైంది. గురువారం ఇక్కడ మొదలయ్యే జూనియర్ ప్రపంచ కప్ హాకీ టోర్నమెంట్లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. గ్రూప్ ‘డి’లో ఉన్న భారత్ నేడు తమ తొలి మ్యాచ్‌లో కెనడాతో తలపడుతుంది. ఆ తర్వాత 10న ఇంగ్లండ్‌తో; 12న దక్షిణాఫ్రికాతో భారత్ తమ మ్యాచ్‌లను ఆడుతుంది. 2001లో ఆస్ట్రేలియాలోని హోబర్ట్‌లో జరిగిన జూనియర్ ప్రపంచ కప్‌లో ఏకై క, చివరిసారి టైటిల్ నెగ్గిన భారత్ ఆ తర్వాత ఒక్కసారి కూడా టాప్-3లో నిలువలేకపోయింది. 2013లోనూ ఈ మెగా ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యమిచ్చింది. అయితే ఈసారి మాత్రం భారత్ పకడ్బందీగా ఈ టోర్నీకి సన్నాహాలు చేసింది. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు కెప్టెన్ హర్జీత్ సింగ్, మన్దీప్ సింగ్, డ్రాగ్ ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్, గోల్‌కీపర్ వికాస్ దహియాలతో భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. కోచ్ హరేంద్ర సింగ్ పర్యవేక్షణలో రాటుదేలిన భారత యువ జట్టు ఇటీవలే స్పెయిన్‌లో జరిగిన నాలుగు దేశాల టోర్నీలో విజేతగా నిలిచి ప్రపంచకప్‌కు ముందు కావాల్సినంత విశ్వాసాన్ని కూడగట్టుకుంది. మొత్తం 16 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్లో నాలుగు గ్రూప్‌ల్లో నాలుగేసి జట్లకు చోటు కల్పించారు. లీగ్ దశ పోటీలు ముగిశాక ఆయా గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తారుు. గ్రూప్‌ల వివరాలు గ్రూప్ ‘ఎ’: అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, కొరియా; గ్రూప్ ‘బి’: నెదర్లాండ్స, మలేసియా, బెల్జియం, ఈజిప్టు; గ్రూప్ ‘సి’: జర్మనీ, స్పెయిన్, న్యూజిలాండ్, జపాన్; గ్రూప్ ‘డి’: భారత్, ఇంగ్లండ్, కెనడా, దక్షిణాఫ్రికా. భారత జట్టు: హర్జీత్ సింగ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ సింగ్, విక్రమ్‌జిత్ సింగ్, వరుణ్ కుమార్, సిమ్రన్‌జిత్ సింగ్, క్రిషన్ పాఠక్, అర్మాన్ ఖురేషీ, మన్దీప్ సింగ్, దిప్సాన్ టిర్కీ, పర్విందర్ సింగ్, మన్‌ప్రీత్ జూనియర్, గుర్జంత్ సింగ్, సుమిత్, సంతా సింగ్, వికాస్ దహియా, గురిందర్ సింగ్, నీలకంఠ శర్మ, అజిత్ పాండే. -
గెలిచి నిలిచిన భారత్
న్యూఢిల్లీ: రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు సత్తాచాటారు. ఆట ఆరంభంలో కాస్త తడబడినప్పటికీ తర్వాత చెమటోడ్చి గెలిచారు. జూనియర్ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్ పూల్ ‘సి’లో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించిన టీమిండియా 3-2తో కెనడాపై విజయం సాధించింది. తాజా విజయంతో యువ భారత్ ఈ పూల్‌లో క్వార్టర్ ఫైనల్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. దీంతో మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు విజయం కోసం తీవ్రంగా శ్రమించాయి. ఆట మొదలైన మూడో నిమిషంలోనే కెప్టెన్ సుకి పనేసర్ ఫీల్డ్ గోల్‌తో కెనడాకు శుభారంభమిచ్చాడు. దీంతో భారత్ స్కోరు సమం చేసేందుకు తమ దాడులకు పదునుపెట్టింది. ఎట్టకేలకు ఆట 30వ నిమిషంలో మన్దీప్ సింగ్ తమకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి స్కోరును 1-1తో సమం చేశాడు. అనంతరం ద్వితీయార్ధంలో ఇరు జట్లు మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు చెమటోడ్చాయి. ఈ క్రమంలో గోర్డాన్ జాన్స్టన్ ఆట 51వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి 2-1తో మళ్లీ జట్టును ఆధిక్యంలో నిలిపాడు. దీనికి ఆరు నిమిషాల వ్యవధిలోనే ఆకాశ్‌దీప్ సింగ్ (57వ ని.) చక్కని ఫీల్డ్ గోల్‌తో స్కోరును సమం చేశాడు. 2-2తో ఆట డ్రాగా ముగుస్తుందనుకుంటున్న తరుణంలో... 69వ నిమిషంలో భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. దీన్ని గుర్జిందర్ సింగ్ గోల్‌గా మలచి జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. ఈ నెల 10న దక్షిణ కొరియాతో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిస్తేనే నాకౌట్‌కు అర్హత సంపాదిస్తుంది. మెరుగైన గోల్స్ తేడాతో ఉన్న కొరియా కనీసం డ్రా చేసుకున్నా క్వార్టర్స్‌కు చేరుతుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కొరియా 2-3తో ఓడింది. దీంతో ఈ పూల్‌లో నెదర్లాండ్స్ క్వార్టర్స్ బెర్తు సాధించింది. జర్మనీ చేతిలో పాక్ చిత్తు డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ బోణీ చేయగా, యూరోపియన్ చాంపియన్ బెల్జియం వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. పూల్-ఎలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో జర్మనీ 6-1తో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. జర్మనీ తరఫున క్రిస్టోఫర్ రుహుర్ (2, 18, 26వ ని.) మూడు గోల్స్ చేయగా, లుకాస్ విండ్‌ఫెడర్ (10వ ని.), అలెగ్జాండర్ స్కాలకొఫ్ (59వ ని.), నిక్లాస్ బ్రూన్స్ (69వ ని.) తలా ఓ గోల్ చేశారు. పాక్ తరఫున నమోదైన ఒకే ఒక్క గోల్‌ను సాకిల్ అమ్మద్ సాధించాడు. ఇదే పూల్‌లో బెల్జియం 5-0తో ఈజిప్టుపై నెగ్గి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.