
భువనేశ్వర్: జూనియర్ హాకీ ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించింది. గ్రూప్ ‘డి’లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 3–4 గోల్స్ తేడాతో అర్జెంటీనా చేతిలో ఓడింది. దాంతో గ్రూప్ ‘డి’లో ఒక విజయం, రెండు ఓటములతో 3 పాయింట్లు సాధించిన పాక్ మూడో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు (క్వార్టర్ ఫైనల్స్) అర్హత సాధించలేకపోయింది.
అర్జెంటీనా తరఫున బాటిస్టా (10వ ని.లో), నార్డోలిలో (20వ ని.లో), ఫ్రాన్సిస్కో (30వ ని.లో), ఇబార (47వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. పాక్ ఆటగాళ్లు రాణా అబ్దుల్ (17వ నిమిషంలో), రిజ్వాన్ అలీ (28వ నిమిషంలో), అహ్మద్ (53వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు.
చదవండి: BAN Vs PAK: పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన బంగ్లాదేశ్ బౌలర్.. ఏకంగా 7 వికెట్లు...
Comments
Please login to add a commentAdd a comment