జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌.. ‘బిగ్‌ ఎనౌన్స్‌మెంట్‌’! | Men Junior Hockey World Cup 2021: Odisha To Host Event | Sakshi
Sakshi News home page

Men Junior Hockey World Cup 2021: ఒడిశా వేదికగా జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌ 

Published Fri, Sep 24 2021 8:44 AM | Last Updated on Fri, Sep 24 2021 10:07 AM

Men Junior Hockey World Cup 2021: Odisha To Host Event - Sakshi

భువనేశ్వర్‌: భారత హాకీ జట్టు ప్రధాన స్పాన్సర్‌ గా ఉన్న ఒడిశా రాష్ట్రం మరో ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు వేదిక కానుంది. ఈ ఏడాది నవంబర్‌ 24 నుంచి డిసెంబర్‌ 5 వరకు జరిగే పురుషుల జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌ ఒడిశాలోని కళింగ స్టేడియంలో జరగనుంది.

ఈ మేరకు ఆతిథ్య హక్కులను ఒడిశాకు కట్టబెడుతూ అంతర్జాతీయ హాకీ సమాఖ్య నిర్ణయం తీసుకుంది. ఈ ఈవెంట్‌ కోసం ఉత్తరప్రదేశ్‌ కూడా రేసులో ఉన్నా... 2016 ప్రపంచకప్‌ అక్కడే జరగడంతో ఈసారి ఒడిశాకు అవకాశం దక్కింది. ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌తో పాటు మరో 15 దేశాలు పాల్గొంటున్నాయి.  

చదవండి: IPL 2021: కోహ్లికి షాకివ్వనున్న ఆర్సీబీ యాజమాన్యం.. నిజమేనా?!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement