భువనేశ్వర్: జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. శనివారం గ్రూప్ ‘బి’లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8–2తో పోలాండ్‌పై ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున సంజయ్ (4, 58వ నిమిషాల్లో), అరైజీత్ సింగ్ (8, 60వ నిమిషాల్లో), సుదీప్ (24, 40వ నిమిషాల్లో) తలా రెండు గోల్స్ చేశారు.
ఉత్తమ్ సింగ్ (34వ నిమిషంలో), శర్దానంద్ తివారి (38వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. ఈ విజయంతో భారత్ గ్రూప్ ‘బి’లో రెండో స్థానంలో నిలిచింది. డిసెంబర్ 1న జరిగే క్వార్టర్ ఫైనల్లో బెల్జియంతో భారత్ ఆడనుంది.
చదవండి: Ind Vs Nz 1st Test 2021: గిల్ ఓపెనర్‌గా కాకుండా ఆ స్ధానంలో బ్యాటింగ్‌కు రావాలి
Comments
Please login to add a commentAdd a comment