quarter final
-
మెరిసిన షమ్స్, తనుశ్
కోల్‌కతా: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు చక్కటి పోరాట పటిమ కనబర్చింది. ఒక దశలో 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును ఆల్‌రౌండర్లు షమ్స్ ములానీ (178 బంతుల్లో 91; 10 ఫోర్లు), తనుశ్ కొటియాన్ (154 బంతుల్లో 85 బ్యాటింగ్) ఆదుకున్నారు. శనివారం హరియాణాతో ప్రారంభమైన క్వార్టర్ ఫైనల్ పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై జట్టు... తొలి రోజు ఆట ముగిసే సమయానికి 81 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్ (9), శివమ్ దూబే (28) భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంలో విఫలమయ్యారు. ఆయుశ్ మాత్రే (0), ఆకాశ్ ఆనంద్ (10), సిద్ధేశ్ లాడ్ (4) ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్ (15) ఒకరి వెంట ఒకరు పెవలియన్కుచేరారు. కెప్టెన్ అజింక్య రహానే (31) మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయారు. అయితే చివర్లో షమ్స్ ములానీ, తనుశ్ కొటియాన్ జంట ఎనిమిదో వికెట్‌కు 165 పరుగులు జోడించి ముంబై జట్టును తిరిగి పోటీలోకి తెచ్చింది. హరియాణా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న వీరిద్దరూ ఇన్నింగ్స్‌కు స్థిరత్వం తీసుకొచ్చారు. మరికాసేపట్లో ఆట ముగుస్తుందనగా... షమ్స్ ములానీ అవుట్ కాగా... తనుశ్తోపాటు మోహిత్ అవస్థి (0 బ్యాటింగ్) క్రీజులోఉన్నాడు. హరియాణా బౌలర్లలో అన్షుల్ కంబోజ్ 3, సుమిత్ కుమార్ 2 వికెట్లు పడగొట్టారు. కరుణ్ నాయర్ మరో సెంచరీ నాగ్‌పూర్: సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (180 బంతుల్లో 100 బ్యాటింగ్; 14 ఫోర్లు, 1 సిక్స్) మరో సెంచరీతో ఆకట్టుకున్నాడు. తాజా సీజన్లో ఫుల్ ఫామ్‌లో ఉన్న కరుణ్ నాయర్ అజేయ శతకంతో విజృంభించడంతో తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో విదర్భ జట్టు మెరుగైన స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన విదర్భ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 89 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అథర్వ తైడె (0), ధ్రువ్ షోరె (26), ఆదిత్య ఠాక్రే (5) విఫలమవడంతో ఒక దశలో 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన విదర్భ జట్టును దానిశ్ మాలేవార్ (75; 13 ఫోర్లు)తో కలిసి కరుణ్ నాయర్ ఆదుకున్నాడు. ఇటీవల దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా నాలుగు శతకాలు బాది రికార్డు సృష్టించిన 33 ఏళ్ల కరుణ్ నాయర్... ఈ సెంచరీ ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 22వ శతకం తన పేరిట లిఖించుకున్నాడు. యశ్ రాథోడ్ (13), కెపె్టన్ ఆకాశ్ వాడ్కర్ (24) ఎక్కువసేపు నిలవలేకపోయారు. ఆట ముగిసే సమయానికి కరుణ్ నాయర్‌తో పాటు హర్‡్ష దూబే (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. తమిళనాడు బౌలర్లలో విజయ్ శంకర్ రెండు వికెట్లు పడగొట్టాడు. సౌరాష్ట్ర 216 ఆలౌట్ రాజ్‌కోట్: భారత సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా (26) విఫలమవడంతో గుజరాత్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 72.1 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. చిరాగ్ జానీ (148 బంతుల్లో 69; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో రాణించగా, అర్పిత్ (39 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. పుజారా, హార్విక్ దేశాయ్ (22), షెల్డన్ జాక్సన్ (14), ప్రేరక్ మన్కడ్ (0), సమర్ గజ్జర్ (4) కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్ (14), ధర్మేంద్ర జడేజా (22) విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో కెపె్టన్ చింతన్ గాజా 4 వికెట్లు పడగొట్టగా... జైమీత్ పటేల్, సిద్ధార్థ్ దేశాయ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన గుజరాత్... ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. చేతిలో 10 వికెట్లు ఉన్న గుజరాత్ జట్టు ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 195 పరుగులు వెనుకబడి ఉంది. జమ్ము కశ్మీర్ 228/8 పుణే: కేరళతో జరుగుతున్న మరో క్వార్టర్స్‌లో జమ్ము కశ్మీర్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన జమ్ము కశ్మీర్ బ్యాటర్లు మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. గ్రూప్ దశలో చక్కటి ప్రదర్శన కనబర్చిన జమ్ము కశ్మీర్ టాపార్డర్... నాకౌట్లో దాన్ని కొనసాగించడంలో విఫలమైంది. నసీర్ (44), సాహిల్ (35), కన్హయ్య (48) కాస్త పోరాడారు. కేరళ బౌలర్లలో నిదీశ్ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. -
క్వార్టర్ ఫైనల్లో రిత్విక్ జోడీ
మెట్జ్ (ఫ్రాన్స్): మోజెల్లి ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ రాకెట్ పట్టకుండానే క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. తొలి రౌండ్లో రిత్విక్ (భారత్)–ఫ్రాన్సిస్కో కబ్రాల్ (పోర్చుగల్) జోడీతో తలపడాల్సిన ఆర్థర్ కజాక్స్–హరోల్డ్ మయోట్ (ఫ్రాన్స్) జంట గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో రిత్విక్–కబ్రాల్ ద్వయానికి తొలి రౌండ్లో ‘వాకోవర్’ లభించింది. వాస్తవానికి ఈ టోర్నీలో భారత్‌కే చెందిన అర్జున్ ఖడేతో రిత్విక్ జతగా పోటీపడాల్సింది. అయితే గతవారం బ్రాటిస్లావాలో జరిగిన స్లొవాక్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ సందర్భంగా అర్జున్‌కు గాయమైంది. దాంతో అర్జున్ మోజెల్లి ఓపెన్ నుంచి వైదొలగగా... పోర్చుగల్ ప్లేయర్ కబ్రాల్తో కలిపి రిత్విక్ పోటీపడుతున్నాడు. కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో... స్లొవాక్ ఓపెన్‌లో రిత్విక్ సెమీస్‌కు చేరడంతో అతని ఏటీపీ డబుల్స్ ర్యాంక్ కూడా మెరుగైంది. గతవారం 85వ ర్యాంక్‌లో నిలిచిన రిత్విక్ సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు ఎగబాకి 80వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. రిత్విక్ భాగస్వామి అర్జున్ ఖడే 76వ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... శ్రీరామ్ బాలాజీ నాలుగు స్థానాలు పడిపోయి 65వ ర్యాంక్‌లో ఉన్నాడు. యూకీ బాంబ్రీ 48వ ర్యాంక్‌లో మార్పు లేదు. టాప్–10లో చోటు కోల్పోయిన బోపన్న గత ఏడాది ఆగస్టు నుంచి టాప్–10లో ఉన్న భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న తాజా ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు పడిపోయాడు. పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో బోపన్న–ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ రెండో రౌండ్లో నిష్క్రమించడం బోపన్న ర్యాంక్‌పై ప్రభావం చూపింది. బోపన్న ప్రస్తుతం 12వ ర్యాంక్‌లో ఉన్నాడు. గతవారం సియోల్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో విజేతగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ (తమిళనాడు) ర్యాంక్‌లు కూడా మెరుగయ్యాయి. రామ్‌కుమార్ 18 స్థానాలు ఎగబాకి 125వ ర్యాంక్‌లో, సాకేత్ 25 స్థానాలు పురోగతి సాధించి 203వ స్థానంలో నిలిచారు. -
క్వార్టర్ ఫైనల్లో మనిక బత్రా
న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా టేబుల్‌టెన్నిస్ ప్లేయర్ మనిక బత్రా ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తెలుగమ్మాయి ఆకుల శ్రీజకు మాత్రం నిరాశ ఎదురైంది. ఆమె తొలి రౌండ్లోనే పరాజయం పాలైంది. ఫ్రాన్స్‌లోని మాంట్పిలియెర్లో జరుగుతున్న ఈ ఈవెంట్లో మనిక తనకన్నా ఎంతో మెరుగైన స్థానంలో ఉన్న రొమేనియా స్టార్ బెర్నాడెట్ సాక్స్‌కు షాకిచ్చింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి ముగిసిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 30వ ర్యాంకర్ మనిక 3–1 (11–9, 6–11, 13–11, 11–9)తో టోర్నీ ఎనిమిదో సీడ్ ప్రపంచ 14వ ర్యాంకర్ బెర్నాడెట్‌ను కంగుతినిపించింది. ఇద్దరు చెరో గేమ్ గెలిచి పోటాపోటీగా దూసుకెళ్తున్న తరుణంలో మూడో గేమ్‌లో మనిక పోరాటపటిమ మ్యాచ్‌లో గెలిచేందుకు దోహదం చేసింది. రెండు గేమ్ పాయింట్లను కాపాడుకున్న ఆమె ప్రత్యర్థిని ఓడించి 2–1తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగో గేమ్‌లోనూ ఇదే ఆటతీరును కొనసాగించి మ్యాచ్‌లో గెలిచింది. మెరుగైన రొమేనియన్ క్రీడాకారిణిని 29 నిమిషాల్లోనే ఓడించింది. ఈ మ్యాచ్‌కు ముందు ముఖాముఖీ పోటీల్లో 5–5తో సమంగా నిలువగా తాజా విజయంతో భారత ప్లేయర్ 6–5తో పైచేయి సాధించింది. పారిస్ ఒలింపిక్స్‌లోనూ భారత స్టార్ 3–2తో బెర్నాడెట్ సాక్స్‌ను ఓడించింది. తొలి రౌండ్ పోరులో శ్రీజ 2–3 (11–6, 7–11, 1–11, 11–8, 8–11)తో ప్రపంచ 13వ ర్యాంకర్ అడ్రియాన డియాజ్ (ప్యూర్టోరికో) చేతిలో ఓడిపోయింది. క్వార్టర్ ఫైనల్లో మనిక.. చైనాకు చెందిన ప్రపంచ 21వ ర్యాంకర్ క్వియన్తో తలపడనుంది. మరో ప్రిక్వార్టర్స్‌లో ఆమె 3–0తో చైనాకే చెందిన టాప్‌సీడ్ వాంగ్ యిదిని ఓడించింది. -
క్వార్టర్ ఫైనల్లో శ్రీవల్లి రష్మిక
అడిలైడ్ (ఆ్రస్టేలియా): ప్లేఫోర్డ్ ఓపెన్ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో భారత రెండో ర్యాంకర్, తెలంగాణ అమ్మాయ భమిడిపాటి శ్రీవల్లి రషి్మక క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 303వ ర్యాంకర్ రష్మిక 6–4, 6–1తో గాబ్రియేలా (ఆ్రస్టేలియా)పై గెలిచింది. 81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. డబుల్స్ విభాగంలో రష్మిక–వైదేహి (భారత్) జోడీ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో రషి్మక–వైదేహి ద్వయం 4–6, 6–7 (5/7)తో యుకీ నైటో–నహో సాటో (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. -
సింధు పరాజయం
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత కథ ముగిసింది. బరిలో మిగిలిన స్టార్ ప్లేయర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోయింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు 13–21, 21–16, 9–21తో ప్రపంచ 8వ ర్యాంకర్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గ్రెగోరియా మరిస్కా టున్‌జుంగ్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయింది. 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను కోల్పోయినా వెంటనే తేరుకొని రెండో గేమ్‌ను దక్కించుకుంది.అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో గ్రెగోరియా ధాటికి సింధు చేతులెత్తేసింది. గతంలో గ్రెగోరియాపై 10 సార్లు గెలిచిన సింధు మూడుసార్లు ఓటమిని మూటగట్టుకుంది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధుకు 4,675 డాలర్ల (రూ. 3 లక్షల 92 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 6,050 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
క్వార్టర్ ఫైనల్లో సింధు
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు 18–21, 21–12, 21–16తో ప్రపంచ 7వ ర్యాంకర్ హాన్ యువె (చైనా)పై గెలిచింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను కోల్పోయినా నెమ్మదిగా తేరుకొని ఆ తర్వాతి రెండు గేముల్లో గెలిచి ముందంజ వేసింది. హాన్ యువెపై సింధుకిది ఏడో విజయం కావడం విశేషం. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 8వ ర్యాంకర్ గ్రెగోరియా మరిస్కా టున్‌జుంగ్ (ఇండోనేసియా)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 10–2తో గ్రెగోరియాపై ఆధిక్యంలో ఉంది. -
క్వార్టర్ ఫైనల్లో హుమేరా జోడీ
మైసూర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారిణి హుమేరా బహార్మస్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో హుమేరా–పూజా ఇంగాలె (భారత్) జోడీ 7–6 (10/8), 6–4తో యశస్విని పన్వర్–వన్షిత పథానియా (భారత్) జంటపై గెలుపొందింది. తెలంగాణకే చెందిన స్మృతి భాసిన్ కూడా డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. తొలి రౌండ్ మ్యాచ్‌లో స్మతి భాసిన్ (భారత్)–ఎలీనా జంషీది (డెన్మార్క్) ద్వయం 6–4, 6–4తో సోనల్ పాటిల్ (భారత్)–ప్రిషా వ్యాస్ (అమెరికా) జోడీపై విజయం సాధించింది. మహిళల సింగిల్స్‌లో అభయ వేమూరి, అపూర్వ వేమూరి తొలి రౌండ్లోనే ని్రష్కమించారు. అభయ 4–6, 3–6తో పూజా ఇంగాలె చేతిలో, అపూర్వ 5–7, 2–6తో యశస్విని చేతిలో ఓడిపోయారు. -
చైనా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో మాళవిక పరాజయం
చాంగ్జౌ: చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో భారత్ పోరాటం ముగిసింది. మహిళల విభాగంలో ముందంజ వేసిన ఏకైక భారత ఆశాకిరణం మాళవిక బన్సోద్‌కు క్వార్టర్ ఫైనల్లో చుక్కెదురైంది. జపాన్ స్టార్, నాలుగో సీడ్ అకానె యామగుచి ధాటికి మాళవిక నిలువలేకపోయింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మాళవిక 10–21, 16–21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ యామగుచి జోరుకు వరుస గేమ్‌లలో ఓడిపోయింది. బన్సోద్‌పై యామగుచికి వరుసగా ఇది మూడో విజయం కావడం గమనార్హం.ఈ టో ర్నీలో మిగతా భారత షట్లర్లు ఇదివరకే నిష్క్రమించారు. పురుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జ్, ప్రియాన్షు రజావత్, మహిళల ఈవెంట్లో ఆకర్శి కశ్యప్, సామియా ఇమాద్లు తొలి రౌండ్ పోటీల్లోనే ఇంటిదారి పట్టారు. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–సుమిత్ జోడీలు కూడా తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోయాయి. -
క్వార్టర్ ఫైనల్లో మాళవిక బన్సోద్
చాంగ్జౌ: భారత యువ షట్లర్ మాళవిక బన్సోద్ చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టో ర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో తనకన్నా ఎక్కువ ర్యాంక్‌లో ఉన్న ప్లేయర్‌ను ఓడించి సత్తా చాటింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 43వ ర్యాంకర్ మాళవిక 21–17, 19–21, 21–16తో రెండుసార్లు కామన్వెల్త్ క్రీడల చాంపియన్ క్రిస్టీ గిల్మోర్ (స్కాట్లాండ్)ను కంగు తినిపించింది. ప్రపంచ 25వ ర్యాంకర్‌తో జరిగిన ఈ పోరులో ప్రతి గేమ్‌లోనూ ఒక్కో పాయింట్ గెలించేందుకు 22 ఏళ్ల మాళవిక చెమటోడ్చాల్సి వచ్చింది. రెండో గేమ్‌లో ఆఖరిదాకా పోరాడినా... గేమ్‌ను 2 పాయింట్ల తేడాతో కోల్పోయిన భారత షట్లర్ నిర్ణాయక మూడో గేమ్‌లో పుంజుకొని ఆడింది. ప్రత్యర్థిపై ఆధిక్యాన్ని పెంచుకుంటూ 21–16తో గేమ్‌ను, మ్యాచ్‌ను గెలిచింది. క్వార్టర్ ఫైనల్లో భారత ప్లేయర్‌కు మరింత క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురవుతోంది. శుక్రవారం జపాన్‌కు చెందిన నాలుగో సీడ్ అకానె యామగుచితో మాళవిక తలపడుతుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం మాళవిక మాట్లాడుతూ ‘బీడబ్ల్యూఎఫ్ సూపర్–1000 టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. ఓ పెద్దస్థాయి టో ర్నీలో ముందంజ వేయాలన్న నా కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. టోర్నీకి ముందే క్వార్టర్స్ చేరితే బాగుండేదనిపించింది. ఇప్పుడు టాప్–8కు అర్హత సంపాదించడం గొప్ప అనుభూతినిస్తోంది’ అని తెలిపింది. -
సురేశ్ జోడీ సంచలనం
నార్త్ కరోలినా: విన్స్టన్–సాలెమ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీ డబుల్స్ విభాగంలో భారత టెన్నిస్ ప్లేయర్ దక్షిణేశ్వర్ సురేశ్ సంచలనం సృష్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి రౌండ్లో సురేశ్ (భారత్)–లుకా పౌ (బ్రిటన్) ద్వయం 6–4, 5–7, 10–8తో ఆరో సీడ్ బెహర్ (ఉరుగ్వే)–మొల్టెని (అర్జెంటీనా) జోడీని బోల్తా కొట్టించింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ లో సురేశ్ జోడీ తొమ్మిది ఏస్‌లు సంధించింది. తమ సర్విస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. ‘సూపర్ టైబ్రేక్’లో సురేశ్–లుకా పౌ ద్వయం కీలకదశలో పాయింట్లు గెలిచిసంచలన విజయాన్ని ఖరారు చేసుకుంది. -
Olympics: స్కోర్లు సమం.. అయినా భారత రెజ్లర్ ఓటమి! కారణం?
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత రెజ్లర్ రితికా హుడాకు చేదు అనుభవం ఎదురైంది. అద్భుత ప్రదర్శనతో ప్రిక్వార్టర్స్‌లో విజయం సాధించిన ఆమె.. క్వార్టర్ ఫైనల్లో ఓటమిని మూటగట్టుకుంది. అయితే, కాంస్య పతక రేసు ఆశలు మాత్రం ఇంకా సజీవంగానే ఉన్నాయి.కాగా హర్యానాకు చెందిన రితికా హుడా.. మహిళల 76 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్ తరఫున ప్యారిస్ బరిలో దిగింది. హంగేరీ రెజ్లర్ బెర్నాడెట్ న్యాగీతో శనివారం మధ్యాహ్నం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో 12-2తో రితికా పైచేయి సాధించింది. తద్వారా ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో రితికా హుడా విజేతగా నిలిచింది. ఫలితంగా క్వార్టర్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. అయితే, అక్కడ మాత్రం రితికకు కఠినసవాలు ఎదురైంది.కిర్గిస్తాన్‌కు చెందిన టాప్ సీడ్ ఐపెరి మెడిట్ కిజీతో రితికా క్వార్టర్స్‌లో తలపడింది. అయినప్పటికీ తన శక్తినంతటినీ ధారపోసి.. కిజీని నిలువరించేందుకు రితికా ప్రయత్నించింది. ఆఖరి వరకు పట్టుదలగా పోరాడి 1-1తో స్కోరు సమం చేసింది. అయితే, కౌంట్‌బ్యాక్ రూల్ ప్రకారం.. కిజీ చివరి పాయింట్ గెలిచింది.దీంతో ఐపెరి మెడిట్ కిజీని రిఫరీ విజేతగా ప్రకటించారు. అయితే, కిజీ గనుక ఫైనల్ చేరితే రితికాకు రెపిచెజ్లో పోటీపడే అవకాశం ఉంటుంది. ఇందులో గెలిస్తే రితికాకు కాంస్యమైనా ఖాయమవుతుంది.కౌంట్‌బ్యాక్ రూల్ అంటే ఏమిటి?యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(UWW) నిబంధనల ప్రకారం.. బౌట్ ముగిసేసరికి ఇద్దరు రెజ్లర్లు సమానంగా పాయింట్లు సాధిస్తే.. ‘టై’ బ్రేక్ చేయడానికి కౌంట్‌బ్యాక్ రూల్‌ను వాడతారు. ఈ క్రమంలో తమకు ఇచ్చిన మూడు అవకాశాల్లో ఎవరైతే.. ప్రత్యర్థిని ఎక్కువ సేపు హోల్డ్ చేసి.. తక్కువ తప్పులు చేస్తారో.. అదే విధంగా చివరగా ఎవరు టెక్నికల్ పాయింట్ సాధిస్తారో వారినే విజేతగా ప్రకటిస్తారు.రితికా- కిజీ మ్యాచ్‌లో.. కిజీ తప్పు కారణంగా రితికకు తొలి పాయింట్ వచ్చింది. అయితే, తర్వాతి బౌట్లో కిజీ పాయింట్ స్కోరు చేసి పైచేయి సాధించింది. ఫలితంగా రిఫరీ ఆమెను విజేతగా ప్రకటించారు. -
Olympics 2024: వరల్డ్ నంబర్ వన్‌కు షాకిచ్చిన వినేశ్
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో ఊహించని పరిణామం!!!.. వరల్డ్ నంబర్ 65 ర్యాంకర్.. వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్‌ను మట్టికరిపించిన వైనం!!!. ఊహించని రీతిలో ప్రత్యర్థిని దెబ్బకొట్టి పతక రేసులో నిలిచిన అపూర్వ తరుణం. ఈ సంచలనం సృష్టించింది మరెవరో కాదు.. మన రెజ్లర్ వినేశ్ ఫొగట్.అవును... భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ చారిత్రాత్మక విజయం సాధించింది. వుమెన్స్ 50 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో ప్రి క్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్ వన్, టోక్యో ఒలింపిక్స్ పసిడి పతక విజేత యీ సుసాకీని 3-2తో ఓడించింది.జపాన్ రెజ్లర్‌పై పైచేయి సాధించి సగర్వంగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. తదుపరి క్వార్టర్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన ఎనిమిదో సీడ్ ఒక్సానా లివాచ్‌తో వినేశ్ తలపడనుంది. WHAT HAVE YOU DONE VINESH!!!Vinesh Phogat has defeated the Tokyo Olympics GOLD medalisthttps://t.co/IPYAM2ifqx#OlympicsonJioCinema #OlympicsonSports18 #JioCinemaSports #Wrestling #Olympics pic.twitter.com/RcnydCE3mk— JioCinema (@JioCinema) August 6, 2024 -
Paris Olympics 2024: ఫైనల్ వేటలో...
పారిస్: ఒలింపిక్స్‌లో భారత హాకీకి పూర్వ వైభవం తీసుకొచ్చే క్రమంలో పురుషుల జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో బ్రిటన్ను ‘షూటౌట్’లో ఓడించిన భారత్... మంగళవారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ జర్మనీతో అమీతుమీ తేల్చుకోనుంది. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన టీమిండియా... ఇప్పుడు పతకం రంగు మార్చాలని కృతనిశ్చయంతో ఉంది. 1980కి ముందు ఒలింపిక్స్‌లో ఎనిమిది స్వర్ణాలతో తిరుగులేని ఆధిపత్యం కనబర్చిన భారత్.. తిరిగి ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. స్వర్ణ పతకమే లక్ష్యంగా పారిస్‌లో అడుగు పెట్టిన హర్మన్‌ప్రీత్ సింగ్ బృందం.. క్వార్టర్స్‌లో బ్రిటన్‌పై అసమాన ప్రదర్శన కనబర్చింది. స్టార్ డిఫెండర్ అమిత్ రోహిదాస్ రెడ్ కార్డుతో మైదానాన్ని వీడగా.. మిగిలిన 10 మందితోనే అద్భుతం చేసింది. ఇక ‘షూటౌట్’లో గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ అడ్డుగోడలా నిలవడంతో 1972 తర్వాత భారత్ వరుసగా రెండోసారి ఒలింపిక్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. అదే జోరులో జర్మనీని కూడా చిత్తుచేస్తే.. 44 ఏళ్ల తర్వాత టీమిండియా విశ్వక్రీడల తుదిపోరుకు అర్హత సాధించనుంది. చివరిసారి భారత జట్టు 1980 మాస్కో ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరి విజేతగా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్ అనంతరం కెరీర్‌కు వీడ్కోలు పలకనున్న శ్రీజేశ్ మరోసారి కీలకం కానుండగా.. పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. రోహిదాస్‌పై ఓ మ్యాచ్ నిషేధం పడటంతో అతడు జర్మనీతో సెమీస్ పోరుకు అందుబాటులో లేడు. అయితే ఇలాంటివి తమ చేతిలో లేవని... మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంపైనే దృష్టి పెడతామని ఈ టోరీ్నలో ఏడు గోల్స్ చేసిన భారత సారథి హర్మన్‌ప్రీత్ పేర్కొన్నాడు. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో జర్మనీపై విజయంతోనే పతకం దక్కించుకున్న టీమిండియా... మరోసారి జర్మనీని చిత్తు చేసి ముందంజ వేయాలని ఆశిద్దాం. మరో సెమీఫైనల్లో నెదర్లాండ్స్‌తో స్పెయిన్ తలపడనుంది. రోహిదాస్‌పై ఒక మ్యాచ్ నిషేధం భారత డిఫెండర్ అమిత్ రోహిదాస్‌పై ఓ మ్యాచ్ నిషేధం పడింది. బ్రిటన్‌తో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా.. రోహిదాస్ హాకీ స్టిక్ బ్రిటన్ ప్లేయర్ తలకు తగిలింది. ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా.. మ్యాచ్ రిఫరీ అతడికి రెడ్ కార్డు చూపి మైదానం నుంచి తప్పించాడు. దీనిపై భారత జట్టు అప్పీల్ చేయగా.. వాదనలు విన్న అనంతరం అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఒక మ్యాచ్ నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో అతడు నేడు జరిగే సెమీఫైనల్‌కు అందుబాటులో లేకుండా పోయాడు.‘నియమావళిని అతిక్రమించినందుకు అమిత్ రోహిదాస్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధించాం’అని ఎఫ్ఐహెచ్ పేర్కొంది. -
ఈసారీ గెలిచేద్దాం
పారిస్: టోక్యో ఒలింపిక్స్‌లో తాము సాధించిన కాంస్య పతకాన్ని నిలబెట్టుకోవాలంటే భారత జట్టు ముందుగా క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటాలి. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్లో ఎదురైన ప్రత్యర్థి బ్రిటన్ జట్టుతోనే పారిస్ ఒలింపిక్స్‌లోనూ భారత్ క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. నేడు జరిగే ఈ నాకౌట్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ బృందం విజయం సాధిస్తేనే సెమీఫైనల్‌కు చేరుకొని పతకం రేసులో నిలుస్తుంది. ఓడిపోతే మాత్రం టీమిండియా ఇంటిదారి పడుతుంది. ‘టోక్యో’ క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–1 గోల్స్ తేడాతో బ్రిటన్ జట్టును ఓడించింది. ‘పారిస్’ గేమ్స్‌లో భారత హాకీ జట్టు నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. గ్రూప్ ‘బి’లో ఉన్న భారత జట్టు తొలి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 3–2తో గెలిచింది. రెండో లీగ్ మ్యాచ్‌లో మాజీ ఒలింపిక్ విజేత అర్జెంటీనాతో 1–1తో ‘డ్రా’ చేసుకుంది. మూడో లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 2–0తో గెలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. నాలుగో లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్ బెల్జియం జట్టు చేతిలో 1–2తో ఓడిన టీమిండియా చివరి లీగ్ మ్యాచ్‌లో పటిష్ట ఆస్ట్రేలియా జట్టును 3–2తో ఓడించి సంచలనం సృష్టించింది. ఒలింపిక్స్ క్రీడల్లో ఆ్రస్టేలియా జట్టుపై 52 ఏళ్ల తర్వాత భారత జట్టు విజయాన్ని అందుకుంది. లీగ్ దశ మ్యాచ్‌ల ఫలితాలు, ప్రదర్శన ప్రస్తుతం గతంతో సమానం. నాకౌట్ మ్యాచ్ కావడంతో తప్పనిసరిగా గెలిస్తేనే జట్లు ముందుకు సాగుతాయి. 1988 సియోల్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం నెగ్గిన తర్వాత బ్రిటన్ జట్టు మళ్లీ ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయింది. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న బ్రిటన్ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా భారత జట్టు ఆద్యంతం నిలకడగా ఆడాల్సి ఉంటుంది. గోల్ చేసేందుకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. దక్కిన పెనాల్టీ కార్నర్లను లక్ష్యానికి చేర్చాలి. అందుబాటులో ఉన్న ముఖాముఖి రికార్డు ప్రకారం భారత్, బ్రిటన్ జట్లు ఇప్పటి వరకు 23 సార్లు తలపడ్డాయి. 13 సార్లు బ్రిటన్ నెగ్గగా... 9 సార్లు భారత్ గెలిచింది. ఒక మ్యాచ్ ‘డ్రా’ అయింది. ఒలింపిక్స్‌లో మాత్రం బ్రిటన్‌పై భారత్‌దే పైచేయిగా ఉంది. విశ్వ క్రీడల్లో ఈ రెండు జట్లు తొమ్మిదిసార్లు తలపడగా... ఆరుసార్లు భారత్, మూడుసార్లు బ్రిటన్ గెలుపొందాయి. నేడు జరిగే ఇతర మూడు క్వార్టర్ ఫైనల్స్‌లో స్పెయిన్‌తో బెల్జియం; నెదర్లాండ్స్‌తో శ్రీఆ్రస్టేలియా; జర్మనీతో అర్జెంటీనా తలపడతాయి. యాదృచ్చికంగా ‘పారిస్’ గేమ్స్‌లోనూ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగు క్వార్టర్ ఫైనల్స్‌లో ఎదురెదురుగా తలపడిన జట్లే ఈసారి పోటీపడుతున్నాయి. -
మన గురి అదిరింది!
పారిస్: శుభారంభం లభిస్తే సగం లక్ష్యం నెరవేరినట్లే...! ఒలింపిక్స్‌లో ఎన్నో ఏళ్లుగా భారత్‌ను ఊరిస్తున్న ఆర్చరీ పతకం అందుకునేందుకు మన ఆర్చర్లు సరైన దిశగా అడుగులు వేశారు. గురువారం జరిగిన రికర్వ్ విభాగం ర్యాంకింగ్ రౌండ్లో భారత పురుషుల, మహిళల జట్లు అదరగొట్టాయి. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాధవ్‌లతో కూడిన భారత పురుషుల జట్టు 2013 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది.ఫలితంగా తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడే అవకాశాన్ని సంపాదించింది. కొలంబియా, టర్కీ జట్ల మధ్య మ్యాచ్ విజేతతో క్వార్టర్ ఫైనల్లో భారత్ తలపడుతుంది. క్వార్టర్ ఫైనల్లో నెగ్గితే భారత్ సెమీఫైనల్లో ఫ్రాన్స్, ఇటలీ, కజకిస్తాన్ జట్లలో ఒక జట్టుతో ఆడుతుంది. మరో పార్శ్వంలో దక్షిణ కొరియా, చైనా, జపాన్, మెక్సికో ఉన్నాయి. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ 681 పాయింట్లతో నాలుగో స్థానాన్ని పొందగా... 674 పాయింట్లతో తరుణ్‌దీప్ రాయ్ 14వ స్థానంలో, 658 పాయింట్లతో ప్రవీణ్ జాధవ్ 39వ స్థానంలో నిలిచారు. అంకిత భకత్, దీపిక కుమారి, భజన్ కౌర్‌లతో కూడిన భారత మహిళల జట్టు ర్యాంకింగ్ రౌండ్లో 1983 పాయింట్లతో నాలుగో స్థానం దక్కించుకుంది. తద్వారా తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫ్రాన్స్, నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ విజేతతో క్వార్టర్ ఫైనల్లో భారత్ ఆడుతుంది. ఈ అడ్డంకిని భారత్ అధిగమిస్తే సెమీఫైనల్లో దక్షిణ కొరియా, అమెరికా, చైనీస్ తైపీ జట్లలో ఒక జట్టుతో తలపడుతుంది. ఆదివారం మహిళల మెడల్ టీమ్ ఈవెంట్, సోమవారం పురుషుల మెడల్ టీమ్ ఈవెంట్ జరుగుతాయి. -
అదరగొట్టిన ధీరజ్.. క్వార్టర్స్‌లో భారత ఆర్చరీ టీమ్
ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషల ఆర్చరీ జట్టు కూడా శుభారంభం చేసింది. గురువారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో భారత అర్చర్లు అదరగొట్టారు. టీమ్ ఈవెంట్లో ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌తో కూడిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. క్వాలిఫికేషన్ రౌండ్లో 2,013 పాయింట్లతో మూడో స్ధానంలో నిలిచిన భారత జట్టు.. నేరుగా క్వార్టర్స్‌కు ఆర్హత సాధించింది. భారత బృందంలో ధీరజ్ బొమ్మదేవర 681 పాయింట్లతో 4వ స్ధానంలో నిలవగా.. తరుణ్‌దీప్ రాయ్(674), ప్రవీణ్ జాదవ్(658)లు వరుసగా 14, 39వ స్ధానాల్లో నిలిచారు. మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంటాయి. 5 నుంచి 12 స్థానాల్లో నిలిచిన టీమ్‌లు రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లు ఆడతాయి. కాగా ఇప్పటికే అంకితా భకత్, భజన్ కౌర్, దీపికా కుమారి త్రయంతో కూడిన భారత మహిళ ఆర్చరీ జట్టు క్వార్టర్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. -
క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
క్రొయేషియా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోరీ్నలో పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఉమగ్ నగరంలో బుధవారం జరిగిన తొలి రౌండ్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 6–2తో కొవాలిక్ (స్లొవేకియా)–కారాబెల్లి (అర్జెంటీనా) జంటపై గెలిచింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్–అర్జున్ ఖడే (భారత్) జోడీ 2–6, 2–6తో గిడో ఆండ్రెజి (అర్జెంటీనా)–వరేలా (మెక్సికో) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
క్వార్టర్ ఫైనల్లో సహజ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య డబ్ల్యూ75 టోర్నీ లో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. అమెరికాలో శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 318వ ర్యాంకర్ సహజ 6–3, 7–6 (7/5)తో ప్రపంచ 177వ ర్యాంకర్, రెండో సీడ్ ఎలిజబెత్ మాండ్లిక్ (అమెరికా)పై గెలిచింది. డబుల్స్‌లో సహజ (భారత్)–హిరోకో కువాటా (జపాన్) జోడీ సెమీఫైనల్లోకి చేరింది. -
వింబుల్డన్ మ్యాచ్‌లో సందడి చేసిన గేమ్ ఛేంజర్ భామ.. ఫోటోలు
-
క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్), ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ) క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ అల్కరాజ్ 6–3, 6–4, 1–6, 7–5తో ఉగో హంబెర్ట్ (ఫ్రాన్స్)పై, టాప్ సీడ్ సినెర్ 6–2, 6–4, 7–6 (11/9)తో బెన్ షెల్టన్ (అమెరికా)పై గెలుపొందారు. మరోవైపు ఏడుసార్లు చాంపియన్, రెండో ర్యాంకర్ జొకోవిచ్ (సెర్బియా) ఈ టోరీ్నలో 16వసారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మూడో రౌండ్ మ్యాచ్‌లో జొకోవిచ్ 4–6, 6–3, 6–4, 7–6 (7/3)తో పాపిరిన్ (ఆస్ట్రేలియా)పై నెగ్గాడు. -
క్వార్టర్ ఫైనల్లో గాయత్రి – ట్రెసా జోడి
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నీ కెనడా ఓపెన్‌లో పుల్లెల గాయత్రి గోపీచంద్ – ట్రెసా జాలీ జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మూడో సీడ్ గాయత్రి – ట్రెసా 17–21, 21–7, 21–8 స్కోరుతో నటాషా ఆంథోనిసెన్ (డెన్మార్క్) – అలీసా టిర్‌టొసెన్‌టొనొ (నెదర్లాండ్స్)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్ కూడా క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాడు. ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో ప్రపంచ 39వ ర్యాంకర్ ప్రియాన్షు 21–19, 21–11తో టకూమా ఒబయాషీ (జపాన్)పై గెలుపొందాడు. అయితే ఇతర భారత షట్లర్లకు రెండో రౌండ్లో నిరాశే ఎదురైంది. పురుషుల డబుల్స్‌లో గారగ కృష్ణప్రసాద్ – కె.సాయిప్రతీక్ 21–19, 18–21, 17–21తో బింగ్ వీ – చింగ్ హెంగ్ (చైనీస్ తైపీ) చేతిలో...మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్ – గద్దె రుత్విక శివాని 15–21, 21–19, 9–21తో చెంగ్ కువాన్ – యిన్ హుయి (చైనీస్ తైపీ)చేతిలో పరాజయంపాలయ్యారు. -
బ్రెజిల్ ముందుకు...
సాంటాక్లారా (అమెరికా): కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో మాజీ విజేత బ్రెజిల్ జట్టు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. కొలంబియా జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్‌ను బ్రెజిల్ 1–1తో ‘డ్రా’గా ముగించింది. బ్రెజిల్ తరఫున రాఫినా (12వ ని.లో), కొలంబియా తరఫున డేనియల్ మునోజ్ (45+2వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఏడు పాయింట్లతో కొలంబియా గ్రూప్ ‘టాపర్’గా నిలువగా... ఐదు పాయింట్లతో బ్రెజిల్ రెండో స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో ఈక్వెడార్‌తో అర్జెంటీనా; వెనిజులాతో కెనడా; పనామాతో కొలంబియా; ఉరుగ్వేతో బ్రెజిల్ తలపడతాయి. -
క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్
ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ): యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో మాజీ చాంపియన్ పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. అయితే టాప్ టీమ్‌లలో ఒకటైన పోర్చుగల్‌కు విజయం అంత సులువుగా దక్కలేదు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 57వ స్థానంలో ఉన్న స్లొవేనియా గట్టి పోటీనిచ్చింది. ఒక దశలో స్లొవేనియా దూకుడు చూస్తే విజయం సాధించేలా అనిపించింది. కానీ చివరకు పెనాల్టీ షూటౌట్లో విజయం పోర్చుగల్ సొంతమైంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్ లేకుండా 0–0తో సమంగా నిలవగా...షూటౌట్లో పోర్చుగల్ 3–0తో గెలుపొందింది. దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకు నిర్ణీత సమయంలో మ్యాచ్ గెలిపించే అవకాశం వచ్చినా అది సాధ్యం కాలేదు. ఈ మ్యాచ్‌లో అతను పలు అవకాశాలు వృథా చేశాడు. ఎట్టకేలకు 105వ నిమిషంలో పోర్చుగల్‌కు పెనాల్టీ కిక్ లభించింది. అయితే రొనాల్డో కొట్టిన ఈ కిక్‌ను స్లొవేనియా గోల్ కీపర్ జాన్ ఆబ్లక్ సమర్థంగా అడ్డుకున్నాడు. దాంతో రొనాల్డో కన్నీళ్లపర్యంతం కావడంతో సహచరులు సముదాయించాల్సి వచ్చింది. అయితే ఎట్టకేలకు షూటౌట్లో గెలిచి పోర్చుగల్ ఊపిరి పీల్చుకుంది. పోర్చుగల్ తరఫున రొనాల్డో, బ్రూనో ఫెర్నాండెజ్, బెర్నార్డో సిల్వ గోల్స్ సాధించగా... స్లొవేనియా ఆటగాళ్లు ఎల్లిసిక్, బల్కోవెక్, వెర్బిక్ కొట్టిన షాట్లను పోర్చుగల్ కీపర్ డియాగో కోస్టా నిలువరించగలిగాడు. క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్‌తో పోర్చుగల్ తలపడుతుంది. 2016లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఫైనల్లో పోర్చుగల్ గెలిచి చాంపియన్‌గా నిలిచింది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 3–0తో రొమేనియాను ఓడించి క్వార్టర్స్ చేరింది. -
డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ జోడీ
టెక్సాస్: యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 16–21, 21–11, 21–19తో సెయి పె షాన్–హంగ్ ఎన్ జు (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్, మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ప్రియాన్షు 21–18, 21–16తో హువాంగ్ యు కాయ్ (చైనీస్ తైపీ)పై, మాళవిక 15–21, 21–19, 21–14తో తెరెజా స్వబికోవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందారు. -
పురుషుల జట్టుకూ నిరాశ
అంటల్యా (టర్కీ): పారిస్ ఒలింపిక్స్ ఆర్చరీ ఆఖరి క్వాలిఫయర్ ఈవెంట్లో భారత పురుషుల జట్టు కూడా మహిళల టీమ్ బాటలోనే పయనించింది. భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైంది. దాంతో పారిస్ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించాలంటే జట్టు ర్యాంకింగ్‌పైనే ఆధారపడి ఉంటుంది. ఈ టోర్నీలో టాప్–3లో నిలిచే జట్లకు నేరుగా ఒలింపిక్స్ అవకాశం దక్కేది. క్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్ 2 భారత పురుషుల జట్టు 4–5 (57–56, 57–53, 55–56, 55–58), (26–26) స్కోరుతో మెక్సికో చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. తొలి రెండు సెట్లను గెలిచి ఆధిక్యంలో నిలిచిన భారత్ మూడో సెట్లో సమంగా నిలిచినా సెమీస్ చేరేది. కానీ ఒక పాయింట్ తేడాతో సెట్‌ను కోల్పోయిన జట్టు తర్వాతి సెట్‌ను కూడా మెక్సికోకు అప్పగించింది. అయితే షూటౌట్లో భారత్ మ్యాచ్ కోల్పోయింది. మెక్సికో ఆర్చర్లు ల„ ్యానికి అతి సమీపంగా బాణాలను సంధించి పైచేయి సాధించారు. -
క్వార్టర్ ఫైనల్లో సిక్కి–సుమీత్ జోడీ
సిడ్నీ: ఆ్రస్టేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ వరుసగా రెండో విజయం సాధించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలంగాణకు చెందిన సిక్కి–సుమీత్ ద్వయం 21–11, 21–11తో కాయ్ చెన్ తియో–కాయ్ కి తియో (ఆ్రస్టేలియా) జంటను ఓడించింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంక్ జోడీ జియాంగ్ జెన్ బాంగ్–వె యా జిన్ (చైనా)తో సిక్కి–సుమీత్ జంట తలపడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత నంబర్‌వన్ ప్రణయ్, సమీర్ వర్మ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... కిరణ్ జార్జి ఓడిపోయాడు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సమీర్ 21–14, 14–21, 21–19తో 2021 ప్రపంచ చాంపియన్ లో కీన్ యె (సింగపూర్)ను బోల్తా కొట్టించగా... ప్రణయ్ 21–17, 21–15తో మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్)పై గెలిచాడు. కిరణ్ జార్జి 20–22, 6–21తో కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్ క్వార్టర్ ఫైనల్ చేరగా... మాళవిక, అనుపమ నిష్క్రమించారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఆకర్షి 21–16, 21–13తో కాయ్ కి తియో (ఆస్ట్రేలియా)పై గెలిచింది. మాళవిక 17–21, 21–23తో ఎస్తెర్ నురిమి (ఇండోనేసియా) చేతిలో, అనుపమ 11–21, 18–21తో పుత్రి కుసుమ వర్ధిని (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. -
క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–9, 21–15తో ప్రపంచ 12వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్)పై విజయం సాధించాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో లక్ష్య సేన్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో లక్ష్య సేన్ 2–3తో వెనుకంజలో ఉన్నాడు. మరోవైపు భారత్‌కే చెందిన ప్రియాన్షు రజావత్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రియాన్షు 10–21, 17–21తో ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. గాయత్రి జోడీ నిష్క్రమణ డబుల్స్ విభాగాల్లో భారత జోడీల కథ ముగిసింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 21–19, 19–21, 19–21తో మయు మత్సుమోటో–వకానా నాగహార (జపాన్) జంట చేతిలో... అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీ 13–21, 21–19, 13–21తో హ నా బేక్–సో హీ లీ (దక్షిణ కొరియా) ద్వయం చేతిలో ఓడిపోయాయి. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి జోడీ 9–21, 11–21తో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ ద్వయం సి వె జెంగ్–యా కియాంగ్ హువాంగ్ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. -
French Open 2024: క్వార్టర్ ఫైనల్లో సబలెంకా, రిబాకినా
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్), ప్రపంచ నాలుగో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సబలెంకా 6–2, 6–3తో ఎమా నవారో (అమెరికా)పై, రిబాకినా 6–4, 6–3తో స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలుపొందారు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జాస్మిన్ పావోలిని (ఇటలీ) 4–6, 6–0, 6–1తో ఎలీనా అవానెస్యాన్ (రష్యా)పై, మిరా ఆంద్రీవా 7–5, 6–2తో వర్వారా గ్రచెవా (ఫ్రాన్స్)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మెద్వెదెవ్కు చుక్కెదురు పురుషుల సింగిల్స్‌లో ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగాడు. అలెక్స్ డి మినార్ (ఆ్రస్టేలియా) 4–6, 6–2, 6–1, 6–3తో మెద్వెదెవ్‌ను ఓడించి ఎనిమిదో ప్రయత్నంలో ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్) –ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం 6–7 (2/7), 6–3, 7–6 (10/8)తో శ్రీరామ్ బాలాజీ (భారత్)–మిగెల్ వరేలా (మెక్సికో) జోడీని ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. -
క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబు ల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం మరో విజయం నమోదు చేసింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ జోడీ 21–16, 21–11తో జి సావో నాన్–జెంగ్ వె హాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్ మైస్నం మిరాబా లువాంగ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ మణిపూర్ ఆటగాడు 21–14, 22–20తో మాడ్స్ క్రిస్టోఫెర్సన్ (డెన్మార్క్)పై గెలుపొందాడు. మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ కూడా క్వార్టర్ ఫైనల్ చేరింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన అశ్విని–తనీషా ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–19, 21–17తో హంగ్ ఎన్ జు–లిన్ యు పె (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అష్మిత (భారత్) 15–21, 21–12, 12–21తో హాన్ యువె (చైనా) చేతిలో ఓడిపోయింది. -
క్వార్టర్ ఫైనల్లో మనిక ఓటమి
సౌదీ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ మనిక బత్రా పోరాటం ముగిసింది. బుధవారం జెద్దాలో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 39వ ర్యాంకర్ మనిక 11–7, 6–11, 4–11, 11–13, 2–11తో ప్రపంచ ఐదో ర్యాంకర్ హినా హయాటా (జపాన్) చేతిలో ఓడిపోయింది. మనిక బత్రాకు 17,000 డాలర్ల (రూ. 14 లక్షల 18 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
చైనాతో భారత్ ‘ఢీ’
చెంగ్డూ (చైనా): ప్రతిష్టాత్మక థామస్ కప్ పురుషుల టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు సెమీఫైనల్ బెర్త్ కోసం 10 సార్లు చాంపియన్ చైనాతో క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. బుధవారం జరిగిన గ్రూప్ ‘సి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–4తో 14 సార్లు చాంపియన్ ఇండోనేసియా చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ ప్రణయ్ 61 నిమిషాల్లో 13–21, 21–12, 21–12తో ప్రపంచ ఏడో ర్యాంకర్ ఆంథోనీ సినిసుక జిన్‌టింగ్‌ను ఓడించాడు. రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 77 నిమిషాల్లో 22–24, 24–22, 19–21తో షోహిబుల్ ఫిక్రి–మౌలానా బగస్ జంట చేతిలో ఓడిపోయింది. మూడో మ్యాచ్‌లో లక్ష్య సేన్ 65 నిమిషాల్లో 18–21, 21–16, 17–21తో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ జొనాథన్ క్రిస్టీ చేతిలో ఓటమి పాలయ్యాడు. నాలుగో మ్యాచ్‌లో ధ్రువ్ కపిల–సాయిప్రతీక్ జోడీ 20–22, 11–21తో లియో కార్నాండో–డేనియల్ మార్టిన్ జంట చేతిలో పరాజయం పాలైంది. చివరిదైన ఐదో మ్యాచ్‌లో శ్రీకాంత్ 21–19, 22–24, 14–21తో ద్వి వర్దాయో చేతిలో ఓడిపోయాడు. గ్రూప్ ‘సి’లో ఇండోనేసియా ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ నెగ్గి అగ్రస్థానంలో నిలువగా... భారత్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. క్వార్టర్ ఫైనల్స్‌లో చైనాతో భారత్; మలేసియాతో జపాన్; కొరియాతో ఇండోనేసియా; చైనీస్ తైపీతో డెన్మార్క్ తలపడతాయి. మరోవైపు మహిళల టీమ్ టోర్నీ ఉబెర్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో నేడు జపాన్‌తో భారత్; డెన్మార్క్‌తో చైనా... శుక్రవారం ఇండోనేసియాతో థాయ్‌లాండ్; చైనీస్ తైపీతో కొరియా పోటీపడతాయి. -
క్వార్టర్ ఫైనల్లో అనిరుధ్ జోడీ
జీఎన్‌పీ సెగురోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ శుభారంభం చేశాడు. మెక్సికోలో జరుగుతున్న ఈ టోర్నీ తొలి రౌండ్లో అనిరుధ్ (భారత్)–హాన్స్ హచ్ వెర్డొగో (మెక్సికో) ద్వయం 4–6, 6–4, 11–9తో చార్లెస్ బ్రూమ్ (బ్రిటన్)–ఆడమ్ వాల్టన్ (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 88 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అనిరుధ్ జంట తమ సర్విస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో అనిరుధ్ జోడీ పైచేయి సాధించింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ జీవన్ నెడున్‌జెళియన్–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 3–6, 6–3, 7–10తో ఆంటోని బెలిర్ (స్విట్జర్లాండ్)–లుకా సాంచెజ్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
క్వార్టర్ ఫైనల్లో రుత్విక జోడీ
అస్తానా: కజకిస్తాన్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రుత్విక–రోహన్ కపూర్ (భారత్) జోడీ 22–20, 21–17తో కెన్నెత్–గ్రోన్యా సోమర్విల్లె (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ ఆటగాడు తరుణ్ మన్నెపల్లి 22–24, 21–18, 21–13తో భారత్‌కే చెందిన శంకర్ ముత్తుస్వామిపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్ లో జాతీయ చాంపియన్ అన్మోల్ 21–11, 21–7తో నూరానీ అజారా (యూఏఈ)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
క్వార్టర్ ఫైనల్లో అనిరుద్–విజయ్ జోడీ
యూఎస్ క్లే కోర్టు చాంపియన్íÙప్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన అనిరుధ్ చంద్రశేఖర్ డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. హ్యూస్టన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో అనిరుధ్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) ద్వయం 6–3, 6–4తో మైకేల్ మో–ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా) జంటను ఓడించింది. 79 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అనిరుధ్ జోడీ మూడు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. -
క్వార్టర్ ఫైనల్లో సింధు
మాడ్రిడ్: స్పెయిన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నిలో రెండో సీడ్, భారత స్టార్ పీవీ సింధు జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో విజయంతో ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–14, 21–12తో హువాంగ్ యు సున్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. 36 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధుకు తొలి గేమ్ ఆరంభంలో కాస్త పోటీ ఎదురైంది. స్కోరు 11–12 వద్ద సింధు ఒక్కసారిగా చెలరేగి వరుసగా తొమ్మిది పాయింట్లు గెలిచి 20–12తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు దూకుడు కొనసాగింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో థాయ్‌లాండ్ ప్లేయర్ సుపనిదతో సింధు ఆడుతుంది. ముఖా ముఖి రికార్డులో సింధు 5–3తో ఆధిక్యంలో ఉంది. మిక్స్డ్ డబుల్స్‌లో తెలంగాణకు చెందిన సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి–సుమీత్ ద్వయం 22–20, 21–18తో ప్రెస్లీ స్మిత్–అలీసన్ లీ (అమెరికా) జంటపై గెలిచింది. అశ్విని–తనీషా జోడీ గెలుపు మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అశ్విని–తనీషా జంట 21–14, 21–8తో టిఫానీ హో–గ్రోన్యా సోమర్విల్లె (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ధ్రువ్ కపిల–అర్జున్ (భారత్) ద్వయం 21–17, 21–19తో క్రిస్టోఫర్–మాథ్యూ గ్రిమ్లె (స్కాట్లాండ్) జంటపై నెగ్గగా... గరగ కృష్ణప్రసాద్–సాయిప్రతీక్ (భారత్) జోడీ 16–21, 21–15, 16–21తో క్రిస్టో పొపోవ్–తొమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది. -
క్వార్టర్ ఫైనల్లో బోపన్న జోడీ
మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోరీ్నలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 7–5, 7–6 (7/3)తో హుగో నిస్ (మొనాకో)–జాన్ జిలెన్స్కీ (పోలాండ్) జోడీపై గెలిచింది. 99 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్విస్‌ను ఒకసారి బ్రేక్ చేశారు. -
నిశాంత్‌కు నిరాశ
బుస్టో అర్సిజియో (ఇటలీ): పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ వరల్డ్ క్వాలిఫయింగ్ తొలి టోర్నమెంట్ నుంచి తొమ్మిది మంది భారత బాక్సర్లు రిక్తహస్తాలతో వెనుదిరిగారు. బరిలో మిగిలిన చివరి బాక్సర్ నిశాంత్ దేవ్ (71 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. అమెరికా బాక్సర్ ఒమారి జోన్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో నిశాంత్ 1–4తో ఓటమి చవిచూశాడు. మహిళల విభాగంలో భారత్ నుంచి ఇప్పటి వరకు నలుగురు బాక్సర్లు (నిఖత్ జరీన్, ప్రీతి పవార్, పర్విన్ హుడా, లవ్లీనా) పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. మిగిలిన భారత బాక్సర్లకు ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందు రెండో అవ కాశం ఉంది. మే 23 నుంచి జూన్ 3 వరకు థాయ్‌లాండ్‌లో జరిగే చివరిదైన రెండో క్వాలిఫయింగ్ టోర్నిలో సెమీఫైనల్ చేరితే భారత బాక్సర్లకు ఒలింపిక్ బెర్త్‌లు లభిస్తాయి. -
సింధు పరాజయం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లకు క్వార్టర్ ఫైనల్లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచ నంబర్‌వన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లగా, రెండు వరుస ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధుకు క్వార్టర్ ఫైనల్లో చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 24–22, 17–21, 18–21తో ఒలింపిక్ చాంపియన్ చెన్ యూ ఫె (చైనా) చేతిలో పోరాడి ఓడింది. గంటా 32 నిమిషాల పాటు భారత స్టార్ తుదికంటా పోరాడినా ఫలితం దక్కలేదు. ప్రపంచ రెండో ర్యాంకర్ చెన్ యూ ఫెకు దీటుగా కోర్టులో శ్రమించడంతో ర్యాలీలు సుదీర్ఘంగా సాగాయి. దీంతో తొలిగేమ్ హోరాహోరీగా సాగింది. 22–22 వద్ద సింధు క్రాస్‌కోర్టు షాట్లతో విరుచుకుపడి తొలిగేమ్ నెగ్గింది. తర్వాత రెండో గేమ్‌లో సరీ్వస్ వైఫల్యంతో వెనుకబడిన సింధు గేమ్‌ను కోల్పోయింది. నిర్ణాయక మూడో గేమ్‌లోనూ ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. కానీ చైనా ప్రత్యర్థి పైచేయి సాధించడంతో మ్యాచ్‌లో ఓటమి తప్పలేదు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్‌సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 21–19, 21–13తో థాయ్‌లాండ్‌కు చెందిన సుపక్ జొమ్కొ–కిటినుపాంగ్ కెడ్రెన్ జోడీపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ కూడా సెమీస్ చేరుకున్నాడు. క్వార్టర్స్ మ్యాచ్‌లో లక్ష్య 19–21, 21–15, 21–13 స్కోరుతో లో కీన్ యూ (సింగపూర్)ను ఓడించాడు. -
రష్మిక జోడీ శుభారంభం
నాగ్‌పూర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మిక డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్ చేరింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో రష్మిక–వైదేహి (భారత్) ద్వయం 6–2, 6–1తో సౌజన్య బవిశెట్టి (భారత్)–మె హసెగావా (జపాన్) జంటను ఓడించింది. సింగిల్స్ విభాగంలో హైదరాబాద్‌కే చెందిన సౌజన్య బవిశెట్టి, హుమేరా బహార్మస్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. -
పోరాడి ఓడిన సహజ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి, భారత రెండో ర్యాంకర్ సహజ యామలపల్లి పోరాటం ముగిసింది. గురుగ్రామ్‌లో శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సహజ 5–7, 6–3, 0–6తో టాప్ సీడ్ దలీలా జకుపోవిచ్ (స్లొవేనియా) చేతిలో ఓడిపోయింది. మరోవైపు భారత నంబర్‌వన్ అంకిత రైనా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో అంకిత 4–6, 6–2, 6–4తో జాక్వెలిన్ (స్వీడన్)పై గెలిచింది. -
బోపన్న జోడీకి షాక్
దుబాయ్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీకి నిరాశ ఎదురైంది. దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో ఈ జోడీ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–3, 3–6, 8–10తో బెహర్ (ఉరుగ్వే)–పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) జంట చేతిలో ఓడిపోయింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట ఆరు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. యూకీ–హాస్ జంట సంచలనం మరోవైపు ఇదే టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జంట సంచలన విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో యూకీ–హాస్ జోడీ 6–4, 7–6 (7/1)తో మూడో సీడ్ జేమీ ముర్రే (బ్రిటన్)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంటను బోల్తా కొట్టించింది. -
ఆంధ్ర 172 ఆలౌట్
ఇండోర్: మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కోల్పోయింది. మ్యాచ్ రెండో రోజు శనివారం ఆంధ్ర తమ మొదటి ఇన్నింగ్స్‌లో 68.3 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా మధ్యప్రదేశ్‌కు 62 పరుగుల ఆధిక్యం దక్కింది. ఆంధ్ర బ్యాటర్లలో కరణ్ షిండే (38), కెప్టెన్ రికీ భుయ్ (32) మాత్రమే కొద్దిగా పోరాడగలిగారు. ఎంపీ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తికేయ చెరో 3 వికెట్లు తీయగా...అవేశ్ ఖాన్, కుల్వంత్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం మధ్యప్రదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసి తమ ఓవరాల్ ఆధిక్యాన్ని 83 పరుగులకు పెంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ 234 పరుగులకు ఆలౌటైంది. 893 రంజీ ట్రోఫీలో ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి ఆంధ్ర బ్యాటర్ రికీ భుయ్ చేసిన పరుగులు. ప్రస్తుతం ఈ సీజన్లో అత్యధిక పరుగుల జాబితాలో అతను అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో ఒకే సీజన్లో ఆంధ్ర తరఫున అత్యధిక పరుగులు (868) చేసిన అమోల్ మజుందార్ (2012–13) రికార్డును భుయ్ సవరించాడు. -
బంతితో మెరిసిన శశికాంత్, నితీశ్
ఇండోర్: భారీ స్కోరు దిశగా సాగుతోన్న మధ్యప్రదేశ్ జట్టును తమ మీడియం పేస్ బౌలింగ్‌తో ఆంధ్ర బౌలర్లు శశికాంత్ (4/37), నితీశ్ కుమార్ రెడ్డి (3/50) కట్టడి చేశారు. శుక్రవారం మొదలైన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మధ్యప్రదేశ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 234 పరుగులు సాధించింది. పచ్చికతో కూడిన పిచ్‌పై ఓపెనర్లు యశ్ దూబే (133 బంతుల్లో 64; 7 ఫోర్లు, 1 సిక్స్), హిమాన్షు మంత్రి (97 బంతుల్లో 49; 4 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 123 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అయితే ఇన్నింగ్స్ 37వ ఓవర్లో హిమాన్షును శశికాంత్ అవుట్ చేయడంతో మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ పతనం మొదలైంది. 36 పరుగుల తేడాలో మధ్యప్రదేశ్ 7 వికెట్లు కోల్పోయింది. దాంతో 123/0తో పటిష్టంగా కనిపించిన మధ్యప్రదేశ్ 159/7తో కష్టాల్లో పడింది. ఈ దశలో సారాంశ్ జైన్ (108 బంతుల్లో 41 బ్యాటింగ్; 3 ఫోర్లు, 1 సిక్స్), కుమార్ కార్తికేయ (79 బంతుల్లో 29; 2 ఫోర్లు) ఎనిమిదో వికెట్‌కు 51 పరుగులు జోడించి మధ్యప్రదేశ్ స్కోరును 200 దాటించారు. కార్తికేయను అవుట్ చేసి శశికాంత్ ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టగా... అవేశ్ ఖాన్‌ను గిరినాథ్ రెడ్డి రనౌట్ చేయడంతో మధ్యప్రదేశ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. -
రంజీ క్వార్టర్ ఫైనల్స్.. రెచ్చిపోయిన ఆంధ్ర బౌలర్లు
రంజీ ట్రోఫీ 2024 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఇవాళ (ఫిబ్రవరి 23) మొదలయ్యాయి. తొలి క్వార్టర్ ఫైనల్లో విదర్భ-కర్ణాటక.. రెండో క్వార్టర్ ఫైనల్లో ముంబై-బరోడా.. మూడో క్వార్టర్స్‌లో సౌరాష్ట్ర-తమిళనాడు.. నాలుగో క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్-ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడుతున్నాయి. చెలరేగిన ఆంధ్ర బౌలర్లు.. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న నాలుగో క్వార్టర్ ఫైనల్లో తొలి రోజు ఆంధ్ర బౌలర్ల హవా కొనసాగింది. ఆంధ్ర పేసర్లు ఎంపీ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. శశికాంత్ (4/37), నితీశ్ రెడ్డి (3/50), గిరినాథ్ రెడ్డి (1/40) ధాటికి ఎంపీ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఎంపీ బ్యాటర్లలో యశ్ దూబే (64) అర్దసెంచరీతో రాణించగా.. హిమాన్షు మంత్రి (49), సరాన్ష్ జైన్ (41 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సరాన్ష్ జైన్‌కు జతగా కుల్వంత్ కేజ్రోలియా (1) క్రీజ్‌లో ఉన్నాడు. సెంచరీతో కదంతొక్కిన అథర్వ తైడే.. కర్ణాటకతో జరుగుతున్న తొలి క్వార్టర్స్‌లో విదర్భ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. అథర్వ తైడే (109) సెంచరీతో కదంతొక్కగా.. యశ్ రాథోడ్ (93) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. కరుణ్ నాయర్ (30), అక్షయ్ వాద్కర్ (2) క్రీజ్‌లో ఉన్నారు. కర్ణాటక బౌలర్లలో కావేరప్ప, కౌశిక్, హార్దిక్ రాజ్ తలో వికెట్ పడగొట్టారు. ముషీర్ ఖాన్ అద్భుత శతకం.. బరోడాతో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో ముంబై తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ (128 నాటౌట్) అద్భుత శతకంతో మెరిశాడు. అతనికి జతగా హార్దిక్ తామోర్ (30) క్రీజ్‌లో ఉన్నాడు. పృథ్వీ షా 33, ఆజింక్య రహానే 3 పరుగులు చేసి ఔటయ్యారు. బరోడా బౌలర్లలో భార్గవ్ భట్ 4, నినాద్ రత్వ ఓ వికెట్ పడగొట్టారు. ఐదేసిన సాయికిషోర్.. తమిళనాడుతో జరుగుతున్న మూడో క్వార్టర్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 183 పరుగులకే ఆలౌటైంది. సాయికిషోర్ (5/33) తన స్పిన్ మాయాజాలంతో సౌరాష్ట్ర పతనాన్ని శాశించాడు. అజిత్ రామ్ 3, సందీప్ వారియర్ 2 వికెట్లు పడగొట్టారు. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో హార్వక్ దేశాయ్ (83) ఒక్కడే రాణించాడు. సీనియర్ బ్యాటర్ పుజారా (2) విఫలమయ్యాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన తమిళనాడు.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. విమల్ కుమార్ (5) ఔట్ కాగా.. జగదీశన్ (12), సాయికిషోర్ (6) క్రీజ్‌లో ఉన్నారు. -
చరిత్ర సృష్టించిన సింధు బృందం
ఆలమ్ (మలేసియా): అంచనాలకు మించి రాణించిన భారత మహిళల జట్టు ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి పతకాన్ని ఖాయం చేసుకుంది. హాంకాంగ్‌తో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు బృందం 3–0తో గెలిచి సెమీఫైనల్‌కు చేరుకుంది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో జపాన్‌తో భారత్ ఆడుతుంది. హాంకాంగ్‌తో జరిగిన పోరులో తొలి మ్యాచ్‌లో పీవీ సింధు 21–7, 16–21, 21–12తో లో సిన్ యాన్పై నెగ్గి భారత్‌కు 1–0తో ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ద్వయం 21–10, 21–14తో యెంగ్ టింగ్–యెంగ్ పుయ్ లామ్ జోడీని ఓడించింది. మూడో మ్యాచ్‌లో అషి్మత 21–12, 21–13తో యెంగ్ సమ్ యీపై గెలిచి భారత్‌కు చిరస్మరణీయం విజయాన్ని అందించింది. గెలుపు వాకిట శ్రీకాంత్ బోల్తా భారత పురుషుల జట్టు మాత్రం క్వార్టర్ ఫైనల్లో 2–3తో జపాన్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. స్కోరు 2–2తో సమమయ్యాక నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్ 21–17, 9–21, 20–22తో ప్రపంచ మాజీ చాంపియన్ కెంటో మొమోటా చేతిలో ఓడిపోయాడు. మూడో గేమ్‌లో శ్రీకాంత్ 19–12తో ఆధిక్యంలో నిలిచి విజయానికి రెండు పాయింట్ల దూరంలో నిలిచాడు. అయితే ఇప్పటి వరకు శ్రీకాంత్‌ను 15 సార్లు ఓడించిన మొమోటా ఏమాత్రం ఆందోళన చెందకుండా ఆడి వరుసగా 8 పాయింట్లు గెలిచి 20–19తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత శ్రీకాంత్ 20–20తో స్కోరును సమం చేశాడు. అయితే వెంటనే మొమోటా వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌ను 22– 20తోపాటు మ్యాచ్‌ను 3–2తో జపాన్‌కు అందించి భారత శిబిరాన్ని నిరాశలో ముంచాడు. అంతకకుముందు తొలి మ్యాచ్‌లో ప్రణయ్ ఓడిపోగా... రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ గెలిచింది. మూడో మ్యాచ్‌లో లక్ష సేన్ నెగ్గగా... నాలుగో మ్యాచ్‌లో ధ్రువ్ కపిల–అర్జున్ జంట ఓటమి పాలైంది. -
క్వార్టర్ ఫైనల్లో నిఖత్ జరీన్
సోఫియా (బల్గేరియా): రెండు సార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల 50 కేజీల విభాగంలో సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆమె 3–2తో ఒయుత్సెసెగ్ యెసుగెన్ (మంగోలియా)పై నెగ్గింది. ఈ బౌట్లో ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. ప్రతీ రౌండ్లోనూ పంచ్‌లతో ఒకరిపై ఒకరు పైచేయి సాధించారు. చివరకు విజయం నిఖత్నే వరించింది. అయితే మరో భారత స్టార్ బాక్సర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ బౌట్లో ఊహించని రీతిలో అనర్హతకు గురై వెనుదిరిగింది. 75 కేజీల విభాగంలో ఓ రూర్కే ఆయిఫే (ఐర్లాండ్)తో తలపడుతుండగా లవ్లీనా రిఫరీ మూడో హెచ్చరికకు గురైంది. దీంతో మూడో రౌండ్ పూర్తవకముందే డిస్క్వాలిఫైతో బౌట్ నుంచి నిరాశగా ని్రష్కమించింది. 57 కేజీల కేటగిరీలో సాక్షి చౌదరి 5–0తో సెల్మౌని చాహిర (అల్జీరియా)పై ఏకపక్ష విజయం సాధించింది. ఆసియా క్రీడల కాంస్య పతక విజేత ప్రీతి పవార్ (54 కేజీలు)కు ప్రిక్వార్టర్స్‌లో 2–3తో ఫే నియ (ఐర్లాండ్) చేతిలో చుక్కెదురైంది. -
క్వార్టర్ ఫైనల్లో శ్రీజ పరాజయం
వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన జాతీయ మాజీ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. గోవాలో శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీజ 5–11, 11–7, 6–11, 4–11తో చెంగ్ ఐ చింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. శ్రీజకు 2,500 డాలర్ల (రూ. 2 లక్షలు) ప్రైజ్‌మనీ, 105 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
క్వార్టర్ ఫైనల్లో భారత్
మహిళల హాకీ ఫైవ్స్ ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మస్కట్‌లో నమీబియాతో జరిగిన గ్రూప్ ‘సి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 7–2తో గెలిచింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రజని భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తోంది. -
అల్కరాజ్ అలవోకగా...
మెల్బోర్న్: గత ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్‌కు దూరంగా ఉన్న ప్రపంచ రెండో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ ఈ ఏడాది మాత్రం జోరు మీదున్నాడు. మరో అలవోక విజయంతో ఈ స్పెయిన్ స్టార్ తొలిసారి ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 20 ఏళ్ల అల్కరాజ్ 6–4, 6–4, 6–0తో మియోమిర్ కెచ్‌మనోవిచ్ (సెర్బియా)పై గెలిచాడు. గంటా 49 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ ఐదు ఏస్‌లు సంధించాడు. 43 విన్నర్స్ కొట్టిన ఈ మాజీ నంబర్‌వన్ 19 అనవసర తప్పిదాలు చేశాడు. ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన అల్కరాజ్ తన సర్విస్‌లో మాత్రం ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో అల్కరాజ్ తలపడతాడు. హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జ్వెరెవ్ 4 గంటల 5 నిమిషాల్లో 7–5, 3–6, 6–3, 4–6, 7–6 (10/3)తో 19వ సీడ్ కామెరాన్ నోరీ (బ్రిటన్)ను ఓడించి ఊపిరి పీల్చుకున్నాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6–3, 7–6 (7/4), 5–7, 6–1తో నునో బోర్జెస్ (పోర్చుగల్)పై, తొమ్మిదో సీడ్ హుర్కాజ్ (పోలాండ్) 7–6 (8/6), 7–6 (7/3), 6–4తో ఆర్థర్ కాజుక్స్ (ఫ్రాన్స్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లో అమీతుమీకి సిద్ధమయ్యారు. డయానా సంచలనం మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 93వ ర్యాంకర్, క్వాలిఫయర్ డయానా యాస్ట్రెమ్స్కా సంచలన విజయంతో తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. కెరీర్లో 16వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న ఈ ఉక్రెయిన్ క్రీడాకారిణి ప్రిక్వార్టర్ ఫైనల్లో 7–6 (8/6), 6–4తో రెండుసార్లు ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్‌వన్, 18వ సీడ్ అజరెంకా (బెలారస్)ను బోల్తా కొట్టించింది. లిండా నొస్కోవా (చెక్ రిపబ్లిక్), అనా కలిన్స్కాయ (రష్యా) కూడా తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరగా... చైనా అమ్మాయి, 12వ సీడ్ కిన్వెన్ జెంగ్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో తొలిసారి క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. నొస్కోవా 3–0తో ఆధిక్యంలో ఉన్నపుడు ఆమె ప్రత్యర్థి స్వితోలినా (ఉక్రెయిన్) గాయంతో వైదొలిగింది. కిన్వెన్ జెంగ్ 6–0, 6–3తో ఒసీన్ డోడిన్ (ఫ్రాన్స్)పై, కలిన్స్కాయ 6–4, 6–2తో జాస్మిన్ పావోలిని (ఇటలీ)పై విజయం సాధించారు. -
టాప్ సీడ్ జోడీకి రష్మిక ద్వయం షాక్
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టో ర్నీలో హైదరాబాద్ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. నవీ ముంబైలో జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్లో రష్మిక –వైదేహి (భారత్) ద్వయం 7–6 (7/5), 6–2తో టాప్ సీడ్ జిబెక్ కులమ్బయేవా (కజకిస్తాన్)–జస్టినా మికుల్స్కయిట్ (లిథువేనియా) జోడీని బోల్తా కొట్టించింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో సహజ యామలపల్లి–వైష్ణవి (భారత్) జంట 1–6, 6–2, 12–14తో అకీకో ఒమాయి (జపాన్)–బీట్రయిస్ గుమల్యా (ఇండోనేసియా) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది. -
భారత్ అదరహో
కౌలాలంపూర్: ఆద్యంతం అద్భుతమైన పోరాట పటిమ కనబరిచిన భారత జట్టు జూనియర్ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఉత్తమ్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 4–3 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ జట్టును ఓడించింది. భారత్ తరఫున ఆదిత్య అర్జున్ లలాగే (34వ ని.లో), అరిజిత్ సింగ్ హుందల్ (35వ ని.లో), సౌరభ్ ఆనంద్ కుష్వా (52వ ని.లో), ఉత్తమ్ సింగ్ (57వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. నెదర్లాండ్స్ జట్టుకు టిమో బోర్స్ (5వ ని.లో), వాన్ డెర్ హెజ్డెన్ (16వ ని.లో), ఒలివియర్ హోర్టెన్సియస్ (44వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. మిగతా క్వార్టర్ ఫైనల్స్‌లో జర్మనీ 2–1తో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాపై, ఫ్రాన్స్ 3–2తో ఆ్రస్టేలియాపై, స్పెయిన్ 4–2తో పాకిస్తాన్‌పై విజయం సాధించాయి. గురువారం జరిగే సెమీఫైనల్స్‌లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ జర్మనీతో భారత్; స్పెయిన్‌తో ఫ్రాన్స్ తలపడతాయి. జూనియర్ స్థాయిలో చివరిసారి 2005లో నెదర్లాండ్స్‌పై గెలిచిన భారత జట్టుకు ఈసారీ గట్టిపోటీ ఎదురైంది. అయితే మ్యాచ్‌లో మూడుసార్లు వెనుకబడ్డ భారత్ ఏమాత్రం ఆందోళన చెందకుండా పోరాడింది. రెండు క్వార్టర్లు ముగిసేసరికి 0–2తో వెనుకబడిన భారత్ ఆ తర్వాత నిమిషం వ్యవధిలో రెండు గోల్స్ చేసి స్కోరును సమం చేసింది. మూడో క్వార్టర్లో నెదర్లాండ్స్ మూడో గోల్ చేసి మరోసారి ఆధిక్యంలోకి వచ్చింది. మ్యాచ్ ముగిసేందుకు ఎనిమిది నిమిషాలు ఉన్నాయనగా భారత్ మళ్లీ స్కోరును సమం చేసింది. అదే జోరులో మ్యాచ్ ముగియడానికి మూడు నిమిషాలముందు నాలుగో గోల్‌తో తొలిసారి ఆధిక్యంలోకి వచ్చింది. చివర్లో నెదర్లాండ్స్ జట్టు స్కోరును సమం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. నెదర్లాండ్స్ ఏకంగా ఆరు పెనాల్టీ కార్నర్లు సంపాదించినా... భారత జట్టు గోల్‌కీపర్ మోహిత్‌తోపాటు రక్షణపంక్తి ఆటగాళ్లు అప్రమత్తంగా ఉండి నెదర్లాండ్స్‌కు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. చివరి పది సెకన్లలోనూ నెదర్లాండ్స్‌కు పెనాల్టీ కార్నర్ లభించినా భారత ఆటగాళ్లు దానిని నిర్వీర్యం చేసి చిరస్మరణీయ విజయం అందుకున్నారు. మ్యాచ్ మొత్తంలో నెదర్లాండ్స్‌కు 12 పెనాల్టీ కార్నర్లు రాగా వాటిలో మూడింటిని గోల్స్‌గా మలిచింది. భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్లు లభించగా... ఒక దానిని భారత్ లక్ష్యానికి చేర్చింది. 6 జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత్ సెమీఫైనల్ చేరడం ఇది ఆరోసారి. గతంలో భారత జట్టు 2001, 2016లలో విజేతగా, 1997లో రన్నరప్‌గా నిలిచింది. 2005, 2021లలో సెమీఫైనల్‌తోపాటు మూడో స్థానం కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయింది. -
క్వార్టర్ ఫైనల్లో భారత్
జూనియర్ పురుషుల హాకీ ప్రపంచకప్‌లో భారత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. కౌలాలంపూర్‌లో పూల్ ‘సి’లో శనివారం జరిగిన పోరులో యువ భారత్ జట్టు 10–1తో కెనడాను చిత్తు చేసింది. ఈ విజయంతో తమ పూల్‌లో రెండో స్థానంలో నిలిచిన భారత్ నాకౌట్‌కు అర్హత సంపాదించింది. భారత జట్టులో ఆదిత్య అర్జున్ (8వ, 43వ నిమిషాల్లో), రోహిత్ (12వ, 55వ ని.), అమన్‌దీప్ లక్రా (23వ, 51వ ని.) రెండేసి గోల్స్ సాధించారు. విష్ణుకాంత్ (42వ ని.), రాజిందర్ (42వ ని.), కుష్వాహ సౌరభ్ ఆనంద్ (51వ ని.), ఉత్తమ్ సింగ్ (58వ ని.) తలా ఒక గోల్ చేశారు. కెనడా తరఫున నమోదైన ఏకైక గోల్‌ను జూడ్ నికోల్సన్ 20వ నిమిషంలో చేశాడు. మంగళవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో భారత్... పూల్ ‘డి’ విజేత నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. -
క్వార్టర్ ఫైనల్లో రష్మిక
మహిళల ప్రపంచ టెన్నిస్ టూర్ టోర్నిలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మికసింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి... డబుల్స్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బెంగళూరులో జరుగుతున్న ఈ టోర్నిలో గురువారం జరిగిన సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 21 ఏళ్ల రష్మిక4–6, 7–5, 7–5తో నాలుగో సీడ్ వైదేహి (గుజరాత్)ను ఓడించింది. 2 గంటల 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మికనాలుగు ఏస్‌లు సంధించింది. ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన రష్మికతన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రష్మిక–వైదేహి (భారత్) జోడీ 6–0, 6–3తో కశిష్ భాటియా–వన్షిత (భారత్) జంటపై నెగ్గింది. హైదరాబాద్‌కే చెందిన యడ్లపల్లి ప్రాంజల పోరాటం ఈ టోర్నిలో ముగిసింది. సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రాంజల 4–6, 3–6తో రుతుజా భోస్లే (భారత్) చేతిలో ఓడిపోయింది. -
క్వార్టర్ ఫైనల్లో సింధు
వాంటా (ఫిన్లాండ్): ఆర్క్టిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత స్టార్ పీవీ సింధు మరో అలవోక విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 21–11, 21–10తో ప్రపంచ 22వ ర్యాంకర్ వెన్ చి సు (చైనీస్ తైపీ)పై గెలుపొందింది. ఈ ఏడాది వెన్ చి సుపై సింధుకిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్‌షిప్‌లో వెన్ చి సుపై సింధు వరుస గేముల్లో నెగ్గింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 26వ ర్యాంకర్ థయ్ లిన్ ఎన్గుయెన్ (వియత్నాం)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 1–0తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. కిడాంబి శ్రీకాంత్, కిరణ్ జార్జి ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఓడిపోయారు. శ్రీకాంత్ 15–21, 12–21తో కాంటా సునెయామ (జపాన్) చేతిలో... కిరణ్ జార్జి (భారత్) 10–21, 20–22తో లు గ్వాంగ్ జు (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు. -
రష్మిక శుభారంభం
అంతర్జాతీయ మహిళల టెన్నిస్ (ఐటీఎఫ్) టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మిక శుభారంభం చేసింది. సింగిల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన ఆమె, డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పెర్త్‌లో జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో రష్మిక 6–3, 6–3తో జెస్సీ కులే (ఆస్ట్రేలియా)పై గెలిచింది. డబుల్స్ తొలి రౌండ్లో రష్మిక (భారత్)–మోనిక్ బ్యారీ (న్యూజిలాండ్) ద్వయం 6–4, 7–6 (7/5)తో ఎలీనా మిసిచ్ (ఆ్రస్టేలియా)–మిచికా ఒజెకి (జపాన్) జంటను ఓడించింది. -
క్వార్టర్ ఫైనల్లో హారిక
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక క్వార్టర్ ఫైనల్ చేరుకోగా... కోనేరు హంపి ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. ఎలైన్ రోబర్స్తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో హారిక 2.5–1.5తో గెలిచింది. నిర్ణీత రెండు క్లాసికల్ గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో శుక్రవారం ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్‌ను నిర్వహించారు. తొలి గేమ్‌ను హారిక 61 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... రెండో గేమ్‌లో హారిక 73 ఎత్తుల్లో నెగ్గి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. బెలా ఖొటెనాష్ లి (జార్జియా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో హంపి 1–3తో ఓడిపోయింది. ర్యాపిడ్ ఫార్మాట్ టైబ్రేక్ తొలి గేమ్‌లో హంపి 54 ఎత్తుల్లో... రెండో గేమ్‌లో 43 ఎత్తుల్లో పరాజయం పాలైంది. గుకేశ్ ముందంజ... ఓపెన్ విభాగంలో 18 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద పెను సంచలనం సృష్టించాడు. టైటిల్ ఫేవరెట్, ప్రపంచ రెండో ర్యాంకర్ హికారు నకముర (అమెరికా)పై ప్రజ్ఞానంద గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. ర్యాపిడ్ ఫార్మాట్లోని రెండు గేముల్లో 2787 ఎలో రేటింగ్ ఉన్న నకమురను 2690 రేటింగ్ కలిగిన ప్రజ్ఞానంద ఓడించడం విశేషం. తమిళనాడుకు చెందిన ప్రజ్ఞానంద తొలి గేమ్‌లో 33 ఎత్తుల్లో, రెండో గేమ్‌లో 41 ఎత్తుల్లో విజయం సాధించాడు. తమిళనాడుకే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ 2.5–1.5తో ఆండ్రీ ఎసిపెంకో (రష్యా)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... నిహాల్ సరీన్ 1–3తో నెపోమ్నిశి (రష్యా) చేతిలో ఓడిపోయాడు. -
39 నిమిషాల్లో సింధు కథ ముగిసే.. క్వార్టర్స్‌లో ఓటమి
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత టాప్ మహిళా షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. ఈ సీజన్లో నాలుగోసారి సెమీస్‌లో అడుగుపెట్టాలనుకున్న సింధు ఆశలకు బీవెన్ జాంగ్ బ్రేక్ వేసింది. శుక్రవారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అమెరికాకు చెందిన బీవెన్ జాంగ్ చేతిలో 21-12, 21-17తో ఓటమిపాలైంది. కేవలం 39 నిమిషాల్లోనే సింధు తన గేమ్‌ను ప్రత్యర్థి చేతిలో పెట్టి ఓటమిని అంగీకరించింది. గతంలో జాంగ్‌తో జరిగిన 10 మ్యాచుల్లో ఆరు సార్లు సింధునే గెలిచింది. కానీ శుక్రవారం నాటి మ్యాచ్‌లో 33 ఏళ్ల చైనా అమెరికన్ ప్లేయర్ చేతిలో పరాభవం తప్పలేదు. 2019 వరల్డ్ చాంపియన్ అయిన సింధు.. ఇటీవల గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగింది. అయితే ఈ ఏడాది జరిగిన 12 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టోర్నీల్లో ఏడింటిలో ఆమె ఒక్కదాంట్లో కూడా ఫైనల్‌కు చేరలేదు. పీవీ సింధు ప్రస్తుతం 17వ ర్యాంక్‌లో ఉంది. ఆగస్టు 21 నుంచి డెన్మార్క్‌లోని కోపెన్హెగన్లో వరల్డ్ చాంపియన్‌షిప్ నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీకి ముందు సింధు ఇలా పేలవ ప్రదర్శన ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. 2003లో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ అయిన మహమ్మద్ హఫీజ్ హసీమ్ వద్ద ప్రస్తుతం సింధు శిక్షణ తీసుకుంటోంది. Pusarla V. Sindhu 🇮🇳 and Beiwen Zhang 🇺🇸 take to the court in Sydney.#BWFWorldTour #AustralianOpen2023 pic.twitter.com/8y5zAWagGU — BWF (@bwfmedia) August 4, 2023 Well played champ 🙌 📸: @badmintonphoto #AustraliaOpen2023#Badminton pic.twitter.com/zxOi6wOs8e — BAI Media (@BAI_Media) August 4, 2023 చదవండి: Yuzvendra Chahal: 'నిన్నెవరు వెళ్లమన్నారు.. వెనక్కి వచ్చేయ్'.. రూల్స్ ఒప్పుకోవు Lionel Messi: ఏ ముహూర్తంలో జాయిన్ అయ్యాడో కానీ అంతా శుభమే.. -
క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన జ్యోతి సురేఖ
బెర్లిన్ (జర్మనీ): గురి తప్పని ప్రదర్శనతో భారత స్టార్ ఆర్చర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. క్వాలిఫయింగ్‌లో రెండో ర్యాంక్‌లో నిలిచిన జ్యోతి సురేఖకు నేరుగా మూడో రౌండ్‌కు ‘బై’ కేటాయించారు. మూడో రౌండ్ మ్యాచ్‌లో జ్యోతి సురేఖ 139–136తో లికోఅరెలో (అమెరికా)పై, నాలుగో రౌండ్లో 148–145తో ఓ యూహున్ (దక్షిణ కొరియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ధీరజ్ పరాజయం పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–6తో రికార్డో సాటో (చిలీ) చేతిలో పరాజయం చవిచూశాడు. -
హర్మన్ ఆడేది... ఫైనల్ చేరితేనే!
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆసియా క్రీడల్లో బరిలోకి దిగాలంటే టీమిండియా ఫైనల్ చేరాలి. ఎందుకంటే చైనా ఆతిథ్యమిచ్చే ఈ ఈవెంట్లో భారత్‌కు నేరుగా క్వార్టర్ ఫైనల్ ఎంట్రీ లభించింది. కెప్టెన్ హర్మన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం ఉన్న నేపథ్యంలో క్వార్టర్స్, సెమీఫైనల్ గెలిచి భారత్ తుదిపోరుకు అర్హత సాధిస్తే తప్ప ఆమె ఆసియా క్రీడల ఆట ఉండదు. చైనాలోని హాంగ్జౌలో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు ఆసియా క్రీడలు జరుగనున్నాయి. ఇందులో మహిళల క్రికెట్ ఈవెంట్లో 14 జట్లు, పురుషుల ఈవెంట్లో 18 జట్లు బరిలోకి దిగుతాయి. అయితే ఈ రెండు విభాగాల్లోనూ భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు నేరుగా క్వార్టర్స్ ఫైనల్స్ ఎంట్రీ లభించింది. -
సాత్విక్–చిరాగ్ జోడీ ముందుకు...
యోసు (కొరియా): కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంక్ ద్వయం సాత్విక్–చిరాగ్ 21–17, 21–15తో ప్రపంచ 16వ ర్యాంక్ జోడీ హి జి టింగ్–జౌ హావో డాంగ్ (చైనా)పై గెలిచింది. 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్, చిరాగ్‌లకు తొలి గేమ్‌లో ప్రతిఘటన ఎదురైంది. పలుమార్లు ఆధిక్యం దోబూచులాడింది. 11–12తో వెనుకబడిన దశలో భారత జంట వరుసగా మూడు పాయింట్లు గెలిచి 14–12తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తొలి గేమ్ దక్కించుకుంది. రెండో గేమ్‌లో సాత్విక్, చిరాగ్ ఆరంభంలోనే వరుసగా మూడు పాయింట్లు నెగ్గి శుభారంభం చేసింది. స్కోరు 10–8 వద్ద భారత జోడీ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 14–8తో ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం 11–21, 14–21తో రెండో సీడ్ బేక్ హా నా–లీ సో హీ (దక్షిణ కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 15–21, 12–21తో ఫెంగ్ యాన్ జె–హువాంగ్ డాంగ్ పింగ్ (చైనా) జంట చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారుల కథ ముగిసింది. భారత నంబర్‌వన్ హెచ్ఎస్ ప్రణయ్, ప్రపంచ 32వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్ ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. ప్రపంచ పదో ర్యాంకర్ ప్రణయ్ 15–21, 21–19, 18–21తో ప్రపంచ 18వ ర్యాంకర్ లీ చెయుక్ యిక్ (హాంకాంగ్) చేతిలో... ప్రియాన్షు 14–21, 21–18, 17–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయారు. -
క్వార్టర్ ఫైనల్లో సాకేత్ జోడీ
‘హాల్ ఆఫ్ ఫేమ్’ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ శుభారంభం చేసింది. అమెరికాలోని న్యూపోర్ట్‌లో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–యూకీ ద్వయం 3–6, 6–1, 10–8తో టామీ పాల్–స్పిజిరి (అమెరికా) జంటను ఓడించింది. హైదరాబాద్‌కు చెందిన అనిరుధ్ చంద్రశేఖర్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జంట కూడా క్వార్టర్ ఫైనల్ చేరింది. అనిరుధ్–ప్రశాంత్ 6–4, 6–3తో జూలియన్ క్యాష్ (బ్రిటన్)–మాక్సిమి క్రెసీ (అమెరికా)లపై గెలిచారు. -
నాపై మానసికంగా ప్రభావం పడింది: సింధు
న్యూఢిల్లీ: రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఈ ఏడాది కలిసి రావడంలేదు. 2023లో సింధు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోగా, మాడ్రిడ్ మాస్టర్స్ టోరీ్నలో రన్నరప్‌గా నిలవడం ఆమె అత్యుత్తమ ప్రదర్శన. తాజాగా యూఎస్ ఓపెన్‌లో సింధు క్వార్టర్ ఫైనల్లోనే ఓటమి పాలైంది. దాంతో ఆమె తీవ్ర నిరాశ చెందింది. ఈ ఓటమి అనంతరం సోషల్ మీడియాలో స్పందించింది. ఆశ్చర్యకరంగా గతంలో ఎన్నడూలేని రీతిలో తన భావోద్వేగాలను ప్రదర్శించింది. ‘ఈ ఓటమి మానసికంగా నాపై తీవ్ర ప్రభావం చూపించింది. ముఖ్యంగా అన్ని ప్రతికూలతలు ఎదురవుతున్న ఈ ఏడాదిలో ఇలాంటి ఫలితం రావడం బాగా నిరాశపర్చింది. తాజా పరాజయంతో నేను చాలా బాధపడ్డాను. నా ఈ భావోద్వేగాలను సరైన రీతిలో మలచుకొని నా ఆట ను మరింత మెరుగుపర్చుకొనేందుకు, ఎక్కువగా సాధన చేసేందుకు వాడుకుంటా. రాబోయే కొరియా, జపాన్ టోరీ్నల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. మీ అభిమానమే నాకు సర్వస్వం. దానికి కృతజ్ఞురాలిని’ అని సింధు పోస్ట్ చేసింది. -
సంచలనం.. నెంబర్ వన్ స్వియాటెకు షాకిచ్చిన స్వితోలినా
లండన్: గత ఏడాది అక్టోబర్‌లో పాపకు జన్మనిచ్చి... ఏప్రిల్‌లో మళ్లీ రాకెట్ పట్టిన ఉక్రెయిన్ టెన్నిస్ స్టార్ ఎలీనా స్వితోలినా వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పెను సంచలనం సృష్టించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో స్వితోలినా 7–5, 6–7 (5/7), 6–2తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)ను బోల్తా కొట్టించింది. 2019 తర్వాత మళ్లీ వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన స్వితోలినాకు వింబుల్డన్ నిర్వాహకులు ‘వైల్డ్ కార్డు’ కేటాయించారు. స్వియాటెక్‌తో 2 గంటల 51 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో స్వితోలినా ఐదు ఏస్‌లు సంధించింది. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పో యి, స్వియాటెక్ సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 14 సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు నెగ్గిన స్వితోలినా 25 విన్నర్స్ కొట్టింది. నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గి, తొలిసారి వింబుల్డన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరిన స్వియాటెక్ 41 అనవసర తప్పిదాలు చేసింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 76వ స్థానంలో ఉన్న స్వితోలినా సెమీఫైనల్ చేరిన క్రమంలో నలుగురు గ్రాండ్‌స్లామ్ చాంపియన్స్‌ను ఓడించడం విశేషం. తొలి రౌండ్లో వీనస్ విలియమ్స్ (అమెరికా)పై, రెండో రౌండ్లో సోఫియా కెనిన్ (అమెరికా)పై, నాలుగో రౌండ్లో విక్టోరియా అజరెంకా (బెలారస్)లపై స్వితోలినా గెలిచింది. సెమీఫైనల్లో చెక్ రిపబ్లిక్కు చెందిన మర్కెటా వొండ్రుసోవాతో స్వితోలినా తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో 42వ ర్యాంకర్ వొండ్రుసోవా 6–4, 2–6, 6–4తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, నాలుగో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)పై సంచలన విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న జోడీ పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయం 7–5, 4–6, 7–6 (10/7) తో డేవిడ్ పెల్ (నెదర్లాండ్స్)–రీస్ స్టాడ్లెర్ (అమెరికా) జంటను ఓడించింది. జూనియర్ బాలుర సింగిల్స్ రెండో రౌండ్లో మానస్ ధామ్నె (భారత్) 1–6, 4–6తో సియర్లీ (బ్రిటన్) చేతిలో ఓడిపోయాడు. A five-star performance 🌟@ElinaSvitolina defeats the world No.1 Iga Swiatek 7-5, 6-7(5), 6-2 to reach the semi-finals at #Wimbledon once again pic.twitter.com/l6nUu17KHj — Wimbledon (@Wimbledon) July 11, 2023 -
జొకోవిచ్‌దే పైచేయి, 14వసారి క్వార్టర్ ఫైనల్లోకి డిఫెండింగ్ చాంపియన్
లండన్: కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించే దిశగా సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో అడుగు వేశాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోరీ్నలో ఈ సెర్బియా స్టార్ 14వసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి మూడు రౌండ్ మ్యాచ్‌ల్లో రెండున్నర గంటల్లోపే విజయాన్ని అందుకున్న జొకోవిచ్‌కు ప్రిక్వార్టర్ ఫైనల్లో మాత్రం అంత సులువుగా గెలుపు దక్కలేదు. 2021 సెమీఫైనలిస్ట్, ప్రపంచ 18వ ర్యాంకర్ హుబెర్ట్ హుర్కాజ్ (పోలాండ్)తో జరిగిన మ్యాచ్‌లో రెండో సీడ్ జొకోవిచ్ 7–6 (8/6), 7–6 (8/6), 5–7, 6–4తో నెగ్గి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. 3 గంటల 7 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 18 ఏస్‌లు సంధించగా, హుర్కాజ్ 33 ఏస్‌లతో అదరగొట్టాడు. తొలి సెట్లో జొకోవిచ్ మూడుసార్లు సెట్ పాయింట్లను, రెండో సెట్లో రెండుసార్లు సెట్ పాయింట్లను కాపాడుకోవడం గమనార్హం. ఈ మ్యాచ్ ఆదివారం, సోమవారం రెండు రోజులపాటు జరిగింది. టోర్నీ నిబంధనల ప్రకారం రాత్రి 11 గంటల వరకే ఆటను కొనసాగించాలి. ఆదివారం రెండు సెట్లు ముగిసిన తర్వాత మ్యాచ్‌ను సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం ఆటను కొనసాగించగా... మూడో సెట్‌ను హుర్కాజ్ గెల్చుకున్నాడు. అయితే నాలుగో సెట్లో జొకోవిచ్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. ఏడో గేమ్‌లో హుర్కాజ్ సర్విస్‌ను బ్రేక్ చేసి ఎనిమిదో గేమ్‌లో తన సర్విస్‌ను కాపాడుకొని 5–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం పదో గేమ్‌లో జొకోవిచ్ తన సర్విస్‌ను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. వింబుల్డన్ టోర్నీ చరిత్రలో జొకోవిచ్‌కిది 90వ విజయం కావడం విశేషం. మరోవైపు ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) కథ ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అమెరికా ప్లేయర్ క్రిస్టోఫర్ యుబ్యాంక్స్ 3–6, 7–6 (7/4), 3–6, 6–4, 6–4తో సిట్సిపాస్‌ను ఓడించి తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరాడు. జిరీ లెహెస్కా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6–4, 6–2తో తొలి రెండు సెట్లు గెల్చుకున్నాడు. అనంతరం లెహెస్కా గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలడంతో మెద్వెదెవ్కు క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కింది. మూడో రౌండ్లో బోపన్న జోడీ పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం 7–5, 6–3తో జేకబ్ ఫియరెన్లీ–జోనస్ మండే (బ్రిటన్) జోడీపై నెగ్గి మూడో రౌండ్‌కు చేరుకుంది. ఓటమి అంచుల నుంచి... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) ఓటమి అంచుల నుంచి గట్టెక్కి తొలిసారి ఈ టోరీ్నలో క్వార్టర్ ఫైనల్ చేరింది. 14వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ 6–7 (4/7), 7–6 (7/2), 6–3తో గెలిచింది. రెండో సెట్లో స్కోరు 5–6 వద్ద స్వియాటెక్ తన సర్విస్‌లో రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని స్కోరును 6–6తో సమం చేసింది. టైబ్రేక్‌లో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచిన ఆమె మూడో సెట్లోని నాలుగో గేమ్‌లో బెన్‌చిచ్ సర్విస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని గెలిచింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో స్వితోలినా (ఉక్రెయిన్) 2–6, 6–4, 7–6 (11/9)తో మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్)పై, రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–4, 6–0తో ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా)పై, ఆరో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునిíÙయా) 6–0, 6–3తో రెండుసార్లు చాంపియన్ క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై, మాడిసన్ కీస్ 3–6, 7–6 (7/4), 6–2తో మిరా ఆండ్రీవా (రష్యా)పై గెలిచారు. డిఫెండింగ్ చాంపియన్ రిబాకినా (కజకిస్తాన్) తొలి సెట్లో 4–1తో ఆధిక్యంలో ఉన్నపుడు ఆమె ప్రత్యర్థి బీట్రిజ్ హదద్ మయా (బ్రెజిల్) గాయం కారణంగా వైదొలిగింది. -
క్వార్టర్ ఫైనల్లో రుబ్లెవ్
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) తన కెరీర్లో తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రుబ్లెవ్ 7–5, 6–3, 6–7 (6/8), 6–7 (5/7), 6–4తో అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. 3 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రుబ్లెవ్ 21 ఏస్‌లు, బుబ్లిక్ 39 ఏస్‌లు సంధించడం విశేషం. మూడో సెట్ టైబ్రేక్‌లో మ్యాచ్ పాయింట్ చేజార్చుకున్న రుబ్లెవ్ చివరకు ఐదో సెట్లో విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో 26వ సీడ్ షపోవలోవ్ (కెనడా) 6–3, 3–6, 1–6, 3–6తో సఫీయులిన్ (రష్యా) చేతిలో ఓడిపోగా... ఎనిమిదో సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ) 7–6 (7/4), 6–4, 6–3తో గలాన్ (కొలంబియా)పై గెలిచాడు. మూడో రౌండ్లో పదో సీడ్ టియాఫో (అమెరికా) 2–6, 3–6, 2–6తో దిమిత్రోవ్ (బల్గేరియా) చేతిలో ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో నాలుగో సీడ్ పెగూలా (అమెరికా) 6–1, 6–3తో సురెంకో (ఉక్రెయిన్)పై, వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 2–6, 6–4, 6–3తో బుజ్కోవా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మూడో రౌండ్లో మిరా ఆండ్రీవా (రష్యా) 6–2, 7–5తో పొటపోవా (రష్యా)పై నెగ్గింది. పోరాడి ఓడిన సాకేత్–యూకీ జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్), జీవన్ నెడుంజెళియన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీలు తొలి రౌండ్లోనే నిష్క్రమించాయి. సాకేత్–యూకీ ద్వయం 4–6, 6–4, 4–6తో ఫొకినా (స్పెయిన్)–మనారినో (ఫ్రాన్స్) జంట చేతిలో... బాలాజీ–జీవన్ జోడీ 6–7 (5/7), 4–6తో డోడిగ్ (క్రొయేషియా)–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) ద్వయం చేతిలో పరాజయం పాలయ్యాయి. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న (భారత్)–డబ్రౌస్కీ (కెనడా) జోడీ 7–6 (7/5), 3–6, 4–6తో డోడిగ్ (క్రొయేషియా)–లతీషా చాన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడింది. -
శ్రీకాంత్, ప్రణయ్ జోరు
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోరీ్నలో భారత స్టార్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–17, 22–20తో ప్రపంచ 20వ ర్యాంకర్, భారత్‌కే చెందిన లక్ష్య సేన్‌ను ఓడించగా... ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 21–18, 21–16తో ప్రపంచ 16వ ర్యాంకర్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై గెలుపొందాడు. గతంలో లక్ష్య సేన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన శ్రీకాంత్‌కు ఈసారి గట్టిపోటీనే లభించింది. ప్రతి పాయింట్‌కు ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. అయితే కీలకదశలో శ్రీకాంత్ సంయమనంతో ఆడి పైచేయి సాధించాడు. తొలి గేమ్‌లో స్కోరు 17–17తో సమంగా ఉన్నదశలో శ్రీకాంత్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో శ్రీకాంత్ 20–14తో విజయానికి పాయింట్ దూరంగా నిలిచాడు. అయితే లక్ష్య సేన్ వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి స్కోరును 20–20తో సమం చేశాడు. వరుసగా ఆరు పాయింట్లు కోల్పోయినా శ్రీకాంత్ ఏకాగ్రత కోల్పోకుండా ఆడి వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత యువతార ప్రియాన్షు రజావత్ 22–20, 15–21, 15–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ జిన్‌టింగ్ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. మూడో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో జరి గిన మ్యాచ్‌లో 14వ ర్యాంకర్ సింధు 18–21, 16–21తో ఓడిపోయింది. ఓవరాల్‌గా తై జు యింగ్ చేతిలో సింధుకిది 19వ ఓటమికాగా వరుసగా తొమ్మిదో పరాజయం. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చివరిసారి తై జు యింగ్‌ను ఓడించిన సింధు ఆ తర్వాత వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో ఈ చైనీస్ తైపీ ప్లేయర్ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్స్‌లో సాత్విక్ జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–17, 21–15తో హి జి టింగ్–జౌ హావో డాంగ్ (చైనా) జంటపై గెలిచింది. -
జొకోవిచ్ రికార్డు
పారిస్: కెరీర్లో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగిన సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ ఆ దిశగా మరో అడుగు వేశాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో జొకోవిచ్ రికార్డు సృష్టిస్తూ 17వసారి ఈ మెగా టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గతంలో రాఫెల్ నాదల్ అత్యధికంగా 16 సార్లు క్వార్టర్ ఫైనల్ చేరగా... నాదల్‌తో సమంగా ఉన్న జొకోవిచ్ తాజా విజయంతో ఈ స్పెయిన్ దిగ్గజాన్ని దాటి ముందుకు వెళ్లాడు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–2, 6–2తో యువాన్ పాబ్లో వారిలాస్ (పెరూ)పై గెలుపొందాడు. గంటా 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఏడు ఏస్‌లు సంధించాడు. ప్రత్యర్థి సర్విస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. 35 విన్నర్స్ కొట్టిన అతను నెట్ వద్దకు 17 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు గెలిచాడు. ఓవరాల్‌గా గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అత్యధికసార్లు క్వార్టర్ ఫైనల్ చేరిన రికార్డు ఫెడరర్ (స్విట్జర్లాండ్; 58 సార్లు) పేరిట ఉంది. జొకోవిచ్ (55 సార్లు) రెండో స్థానంలో, నాదల్ (47 సార్లు) మూడో స్థానంలో, జిమ్మీ కానర్స్ (41 సార్లు) నాలుగో స్థానంలో, రాయ్ ఎమర్సన్ (37 సార్లు) ఐదో స్థానంలో ఉన్నారు. క్వార్టర్ ఫైనల్లో 11వ సీడ్ ఖచనోవ్ (రష్యా)తో జొకోవిచ్ ఆడతాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఖచనోవ్ 1–6, 6–4, 7–6 (9/7), 6–1తో సొనెగో (ఇటలీ)పై నెగ్గాడు. అల్కరాజ్ అలవోకగా... ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) మరో అలవోక విజయంతో రెండోసారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. అల్కరాజ్ 6–3, 6–2, 6–2తో లొరెంజె ముజెట్టి (ఇటలీ)పై గెలిచాడు. ఆరు ఏస్‌లు సంధించిన అల్కరాజ్, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), సెబాస్టియన్ ఆఫ్నర్ (ఆ్రస్టియా) మధ్య ప్రిక్వార్టర్ ఫైనల్ విజేతతో క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ తలపడతాడు. పావ్లీచెంకోవా ముందంజ... మహిళల సింగిల్స్ విభాగంలో 2021 రన్నరప్ పావ్లీచెంకోవా (రష్యా), ముకోవా (చెక్ రిపబ్లిక్), స్వితోలినా (ఉక్రెయిన్) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో పావ్లీచెంకోవా 3 గంటల 9 నిమిషాల్లో 3–6, 7–6 (7/3), 6–3తో ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)ను ఓడించగా... ముకోవా 6–4, 6–3తో అవనెస్యాన్ (రష్యా)పై గెలిచింది. స్వితోలినా గంటా 56 నిమిషాల్లో 6–4, 7–6 (7/5)తో తొమ్మిదో సీడ్ కసత్కినా (రష్యా)ను బోల్తా కొట్టించింది. కసత్కినా ఓటమితో ప్రస్తుతం మహిళల సింగిల్స్‌లో టాప్–10లో నలుగురు మాత్రమే బరిలో మిగిలారు. 44 ఏళ్ల తర్వాత... బ్రెజిల్‌కు చెందిన 14వ సీడ్ బీత్రిజ్ హదాద్ మాయ మూడో రౌండ్ మ్యాచ్‌లో 5–7, 6–4, 7–5తో ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా)పై నెగ్గి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. అంతేకాకుండా 44 ఏళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన బ్రెజిల్ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. బ్రెజిల్ తరఫున చివరిసారి 1979లో పాట్రిసియా మెద్రాడో ఈ ఘనత సాధించింది. -
సంచలనం.. క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన గాయత్రి–ట్రెసా జోడీ
ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ 2023 ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ సంచలనం కొనసాగుతోంది. గురువారం జరిగిన రెండో రౌండ్లో జపాన్‌కు చెందిన మాజీ వరల్డ్ నెంబర్‌వన్ జోడి.. మాజీ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ఛాంపియన్స్ యుకీ ఫుకుషిమా, సయకా హిరోతా జంటపై 21-14, 24-22 తేడాతో స్టన్నింగ్ విక్టరీ అందుకొని క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. 50 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను తొందరగానే గెలుచుకున్న గాయత్రి-టెస్రా జోడి రెండో గేమ్‌ను గెలవడానికి మాత్రం కాస్త కష్టపడాల్సి వచ్చింది. భారత జోడి 9 పాయింట్లు ఆధిక్యంలో ఉన్న సమయంలో జపాన్ జంట ఫుంజుకున్నారు. అయితే ఆరవ పాయింట్ దగ్గర గాయత్రి-టెస్రాలు సర్వీస్‌ను బ్రేక్ చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. Women on a mission went past WR-9 pair in style 😎🔥 📸: @badmintonphoto #AllEngland2023#IndiaontheRise#Badminton pic.twitter.com/ce4NANZnWN — BAI Media (@BAI_Media) March 16, 2023 ✅ @BAI_Media https://t.co/Iau4RzgK0Y pic.twitter.com/2YlD6gKmKg — 🏆 Yonex All England Badminton Championships 🏆 (@YonexAllEngland) March 16, 2023 -
Thailand Open: పోరాడి ఓడిన సాయిప్రణీత్
థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. భారత్ నుంచి బరిలో మిగిలిన ఏకైక ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. బ్యాంకాక్‌లో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్‌కు చెందిన ప్రపంచ 49వ ర్యాంకర్ సాయిప్రణీత్ 17–21, 23–21, 18–21తో ప్రపంచ 23వ ర్యాంకర్, ఆరో సీడ్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక మూడో గేమ్‌లో సాయిప్రణీత్ స్కోరు 12–12 వద్ద ఉన్నపుడు తడబడి వరుసగా ఆరు పాయింట్లు సమర్పించుకోవడం టర్నింగ్ పాయింట్ అయింది. సాయిప్రణీత్‌కు 1,260 డాలర్ల (రూ. 1 లక్ష 3 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 3,850 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
తొమ్మిదో నంబర్లో వచ్చి సెంచరీతో ఇరగదీసిన సౌరాష్ట్ర బౌలర్
Ranji Trophy 2022-23 2nd Quarter Final: రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ రెండో క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర-పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర.. తొమ్మిదో నంబర్ ఆటగాడు, బౌలింగ్ ఆల్‌రౌండర్ పార్థ్ భట్ (111 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయమైన శతకంతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 303 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ స్నెల్ పటేల్ (70) హాఫ్ సెంచరీతో రాణించాడు. వీరిద్దరు మినహా జట్టు మొత్తం మూకుమ్మడిగా విఫలమైంది. రవీంద్ర జడేజా గైర్హాజరీలో ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్రకు అర్పిత్ వసవద సారధ్యం వహిస్తున్నాడు. పంజాబ్ బౌలర్లలో మార్కండే 4, బల్తేజ్ సింగ్ 2, సిద్ధార్థ్ కౌల్ 2, నమన్ ధిర్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (3), నమన్ ధిర్ (1) క్రీజ్‌లో ఉన్నారు. రికీ భుయ్ సూపర్ సెంచరీ.. పటిష్ట స్థితిలో ఆంధ్ర.. ఇండోర్ వేదికగా మధ్యప్రదేశ్‌తో ఇవాళ (జనవరి 31) ప్రారంభమైన నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ పటిష్ట స్థితికి చేరుకుంది. ప్రస్తుత సీజన్లో వరస విజయాలు నమోదు చేసి క్వార్టర్ ఫైనల్‌కు చేరిన ఆంధ్ర టీమ్.. కీలకమైన మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చి జోరును కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు.. రికీ భుయ్ (115 నాటౌట్) సూపర్ సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. రికీ భుయ్‌కి జతగా కరణ్ షిండే (83 నాటౌట్) రాణించాడు. ఓపెనర్లు జ్ఞానేశ్వర్ (24), అభిషేక్ రెడ్డి (22) తమతమ ఇన్నింగ్స్‌లకు లభించిన శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ హనుమ విహారి (16) రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆంధ్రప్రదేశ్ కోల్పోయిన రెండు వికెట్లు గౌరవ్ యాదవ్ ఖాతాలో చేరాయి. రఫ్ఫాడించిన టీమిండియా పేసర్.. 173 పరుగులకే చాపచుట్టేసిన జార్ఖండ్.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇవాళే (జనవరి 31) ప్రారంభమైన మొదటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్-జార్ఖండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ సిరీస్‌లో టీమిండియా సభ్యుడిగా ఉన్న ముకేశ్ కుమార్ (3/61), ఆకాశ్‌దీప్ (4/46), ఇషాన్ పోరెల్ (1/29), ఆకాశ్ ఘాతక్ (1/28) బంతితో చెలరేగడంతో జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకు ఆలౌటైంది. కుమార్ సూరజ్ (89) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. పంకజ్ కిషోర్ కుమార్ (21), షాబజ్ నదీమ్ (10), ఆశిష్ కుమార్ (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం బెంగాల్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి ఉండగా.. వెలుతురులేమి కారణంగా అంపైర్లు తొలి రోజు ఆటను ముగించారు. రెచ్చిపోయిన కర్ణాటక బౌలర్లు.. రాణించిన మయాంక్ అగర్వాల్.. బెంగళూరులోని చిన్నిస్వామి స్టేడియం వేదికగా కర్ణాటకతో జరుగుతున్న మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఉత్తరఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కర్ణాటక.. మురళీధర వెంకటేశ్ (5/36), విధ్వత్ కావేరప్ప (2/17), కృష్ణప్ప గౌతమ్ (2/22), విజయ్‌కుమార్ విశఖ్ (1/25) చెలరేగడంతో ఉత్తరాఖండ్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసింది. ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్‌లో అవ్నీష్ సుధ (17), కునాల్ చండీలా (31), ఆదిత్య తారే (14), అఖిల్ రావత్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 123 పరుగులు చేసింది. రవికుమార్ సమర్థ్ (54), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (65) క్రీజ్‌లో ఉన్నారు. -
రఫ్ఫాడించిన టీమిండియా పేసర్.. రాణించిన మయాంక్ అగర్వాల్
Ranji Trophy 2022-23 1st Quarter Final: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇవాళ (జనవరి 31) ప్రారంభమైన మొదటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్-జార్ఖండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ సిరీస్‌లో టీమిండియా సభ్యుడిగా ఉన్న ముకేశ్ కుమార్ (3/61), ఆకాశ్‌దీప్ (4/46), ఇషాన్ పోరెల్ (1/29), ఆకాశ్ ఘాతక్ (1/28) బంతితో చెలరేగడంతో జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకు ఆలౌటైంది. కుమార్ సూరజ్ (89) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. పంకజ్ కిషోర్ కుమార్ (21), షాబజ్ నదీమ్ (10), ఆశిష్ కుమార్ (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం బెంగాల్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి ఉండగా.. వెలుతురులేమి కారణంగా అంపైర్లు తొలి రోజు ఆటను ముగించారు. ఇవాళే వివిధ వేదికలపై మరో మూడు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు కూడా మొదలయ్యాయి. బెంగళూరులోని చిన్నిస్వామి స్టేడియం వేదికగా కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఉత్తరఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కర్ణాటక.. మురళీధర వెంకటేశ్ (5/36), విధ్వత్ కావేరప్ప (2/17), కృష్ణప్ప గౌతమ్ (2/22), విజయ్‌కుమార్ విశఖ్ (1/25) చెలరేగడంతో ఉత్తరాఖండ్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసింది. ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్‌లో అవ్నీష్ సుధ (17), కునాల్ చండీలా (31), ఆదిత్య తారే (14), అఖిల్ రావత్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 123 పరుగులు చేసింది. రవికుమార్ సమర్థ్ (54), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (65) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం కర్ణాటక 7 పరుగుల ఆధిక్యంలో ఉంది. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర-పంజాబ్ జట్లు.. ఇండోర్ వేదికగా జరుగుతున్న నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర-మధ్యప్రదేశ్ జట్లు తలపడుతున్నాయి. నాలుగు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో విజేతలు ఫిబ్రవరి 8-12 వరకు జరిగే రెండు సెమీఫైనల్‌లలో అమీతుమీ తేల్చుకుంటాయి. సెమీస్‌లో విజేతలు ఫిబ్రవరి 16-20 వరకే జరిగే అంతిమ సమరంలో ఎదురెదురుపడతాయి. -
'అలా ప్రవర్తించడం తప్పే.. నేను చేసింది నాకే నచ్చలేదు'
అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ తన కెరీర్లో లోటుగా ఉన్న ఫిఫా వరల్డ్‌కప్‌ను గతేడాది అందుకున్న సంగతి తెలిసిందే. నాలుగుసార్లు ఫిఫా వరల్డ్‌కప్‌ను అందుకోవడంలో విఫలమైన మెస్సీ ఐదో ప్రయత్నంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. జట్టును అంతా తానై నడిపించిన మెస్సీ.. కీలకమైన ఫైనల్లో ఫ్రాన్స్‌పై షూటౌట్ ద్వారా విజేతగా నిలిపాడు. ఫైనల్లో మూడు గోల్స్ చేసి విజయంలో కీలకపాత్ర పోషించిన మెస్సీ టోర్నీలో మొత్తంగా ఏడు గోల్స్ కొట్టి గోల్డెన్ బాల్ అవార్డును గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే వరల్డ్ కప్ ముగిసిన 45రోజులు కావొస్తున్న వేళ మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్‌లో జరిగిన ఒక సంఘటనపై స్పందించాడు. అదేంటంటే.. నెదర్లాండ్స్‌తో క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ సందర్భంగా డచ్ బాస్ లూయిస్ వాన్గాల్తో పాటు స్ట్రైకర్ వౌట్ వెగ్రోస్ట్లను హేళన చేస్తున్నట్లుగా తన రెండు చేతులను చెవుల మధ్య పెట్టి కోపంగా చూస్తూ ఫోజివ్వడం సంచలనం కలిగించింది. సౌమ్య హృదయడనుకున్న మెస్సీ నుంచి ఇలాంటి ఎక్స్ప్రెషన్ వస్తుందని ఎవరు ఊహించలేదు. అందుకే మెస్సీని కొంతమంది తప్పుబట్టారు. అప్పుడే దీనిపై స్పందించిన మెస్సీ..''గేమ్‌లో భాగంగా కంట్రోల్ తప్పాను.. ఆ సమయంలో అలా వచ్చేసింది'' అంటూ వివరణ ఇచ్చాడు. తాజాగా మరోసారి ఇదే అంశంపై స్పందిస్తూ మరింత క్లారిటీ ఇచ్చాడు. ''నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో అలా ప్రవర్తించడం తప్పే. నేను చేసింది నాకే నచ్చలేదు. అయితే దానిని మనసులో పెట్టుకొని ముందుకెళ్లడం నాకు సాధ్యం కాదు. అందుకే ఆరోజే ఏదో అనుకోకుండా జరిగిందని వివరణ ఇచ్చకున్నాడు. మ్యాచ్ అన్నాకా హైటెన్షన్ ఉండడం సహాజం. ఆ టెన్షన్లో ఒక్కోసారి మనం సహనం కోల్పోతాం. నాకు కూడా అదే జరిగింది. ఇక నేను అందుకున్న ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీని దిగ్గజం మారడోనా చెంతకు చేర్చాను'' అంటూ వెల్లడించాడు. Lionel Messi on his celebration vs. Netherlands: "It came out naturally. My team mates told me what van Gaal said before the match. I don't like to leave that image, but it just came out. There was a lot of nervousness." Via @urbanaplayfm. 🇦🇷 pic.twitter.com/DT2w3sAo1D — Roy Nemer (@RoyNemer) January 30, 2023 చదవండి: విషాదం: ప్రపంచ ఛాంపియన్.. మంచు కింద సజీవ సమాధి -
Hockey World Cup 2023: భారత్ 9వ స్థానంతో ముగింపు
భువనేశ్వర్: సొంతగడ్డపై జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రపంచకప్ హాకీలో క్వార్టర్ ఫైనల్ కూడా చేరలేక నిరాశపరిచిన భారత జట్టు చివరకు విజయంతో మెగా టోర్నీని ముగించింది. శనివారం 9 నుంచి 12వ స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 5–2తో దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. అయితే మరో మ్యాచ్‌లో అర్జెంటీనా 6–0 స్కోరు తేడాతో వేల్స్‌ను చిత్తు చేయడంతో భారత్, అర్జెంటీనాలు సంయుక్తంగా 9వ స్థానంలో నిలిచాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున అభిషేక్ (4వ ని.), హర్మన్‌ప్రీత్ సింగ్ (11వ ని.), షంషేర్ సింగ్ (44వ ని.), ఆకాశ్‌దీప్ సింగ్ (48వ ని.), సుఖ్జీత్ సింగ్ (58వ ని.) తలా ఒక గోల్ చేశారు. సఫారీ జట్టులో సంకెలొ ఎంవింబి (48వ ని.), ముస్తఫా కాసిమ్ (59వ ని.) చెరో గోల్ చేశారు. ఆట ఆరంభమైన నాలుగో నిమిషంలోనే అభిషేక్ ఫీల్డ్‌గోల్‌తో భారత్‌కు శుభారంభమిచ్చాడు. ఈ క్వార్టర్‌లోనే హర్మన్‌ప్రీత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి 2–0తో ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. ఇదే స్కోరుతో తొలి అర్ధభాగాన్ని (రెండు క్వార్టర్లు) ముగించిన భారత్ ఆఖరి క్వార్టర్లో మరో రెండు ఫీల్డ్ గోల్స్‌ను ఆకాశ్‌దీప్, సుఖ్జీత్ సాధించడంతో విజయం సులువైంది. ► నేడు ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల ఫైనల్ ► జొకోవిచ్ ( సెర్బియా) X సిట్సిపాస్ ( గ్రీస్) ► మ.గం. 2 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం -
Cristiano Ronaldo: కోచ్ కాదు.. నోటి మాటలే శాపంగా మారాయా?
క్రిస్టియానో రొనాల్డో.. ఫుట్‌బాల్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఈ దశాబ్దంలో అత్యున్నత ఆటగాళ్లలో రొనాల్డో ఒకడిగా ఉన్నాడు. మైదానంలో పాదరసంలా కదులుతూ రొనాల్డో చేసే విన్యాసాలు అభిమానులను అలరిస్తుంటాయి. పోర్చుగల్ తరపున 195 మ్యాచ్‌ల్లో 118 గోల్స్ కొట్టిన రొనాల్డోకు ఫిఫా వరల్డ్‌కప్ తీరని కలగా మిగిలిపోయింది. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టి ఆ కోరికను నెరవేర్చుకోవాలనుకున్నాడు. కానీ అది సాధ్యపడలేదు. మొరాకో చేతిలో 2-1 తేడాతో ఓడి క్వార్టర్‌లోనే వెనుదిరిగింది. అంతే చిన్న పిల్లాడిలా మారిపోయిన రొనాల్డో వెక్కివెక్కి ఏడ్చాడు. ప్రస్తుతం రొనాల్డో వయస్సు 37 ఏళ్లు. అంటే ఫిట్నెస్ కాపాడుకుంటే తప్ప వచ్చే ఫిఫా వరల్డ్‌కప్ అతను ఆడడం కష్టమే. అయితే కీలకమైన క్వార్టర్ ఫైనల్లో రొనాల్డోను బెంచ్‌కే పరిమితం చేయడంపై పోర్చుగల్ కోచ్ ఫెర్నాండో శాంటోజ్ను అందరూ తప్పుబడుతున్నారు. ఫెర్నాండో చేసింది తప్పే కావొచ్చు.. ఎందుకంటే రొనాల్డో ఒక సూపర్‌స్టార్. పోర్చుగల్ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. కీలక మ్యాచ్‌లో ఒక స్టార్‌ను పక్కనబెడితే ఆ ప్రభావం జట్టుపై బలంగా ఉంటుంది. ఈ విషయంలో శాంటోజ్ను తప్పుబట్టడం కరెక్టే. నిజానికి రొనాల్డో ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లో పెద్దగా ప్రభావం చూపించింది లేదు. మెగాటోర్నీలో నాలుగు మ్యాచ్‌లాడిన రొనాల్డో కేవలం ఒక్క గోల్‌కే పరిమితమయ్యాడు. రొనాల్డో కొంతమంది అభిమానులు మాత్రం అతని నోటి మాటలే జట్టుకు దూరం చేశాయని.. అదే అతనికి శాపంగా మారిందని పేర్కొనడం ఆసక్తి రేపింది. ఫిఫా వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు పియర్స్ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రొనాల్డో సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాంచెస్టర్ యునైటెడ్ కోచ్‌తో గొడవను బయటపెట్టిన రొనాల్డో.. ఆ తర్వాత వారితో జరిగిన అనుభవాలను వరుసగా చెప్పుకొచ్చాడు. ఇవే అతనికి శాపంగా మారాయి. ఆ తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ రొనాల్డోతో బంధం ముగిసిందంటూ లేఖ విడుదల చేయడం.. అప్పటికి తగ్గని రొనాల్డో విమర్శలు చేస్తూ పోవడం అతనికి నెగిటివిటిని తెచ్చిపెట్టింది. ఒకవైపు తన సమకాలీకుడు అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ.. ఆటలో దూసుకుపోతుంటే.. రొనాల్డో మాత్రం వివాదాలతో కాలక్షేపం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో పరిస్థితులు అతనికి విలన్‌గా మారాయి.. ఎంతలా అంటే స్విట్జర్లాండ్‌తో కీలకమైన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో రొనాల్డోను బెంచ్‌కే పరిమితం చేశారు. అప్పుడు కోచ్ ఫెర్నాండో శాంటెజ్ తన నిర్ణయాన్ని తప్పుబట్టలేదు. రొనాల్డో పక్కనబెట్టడంపై తానేం బాధపడపడడం లేదని చెప్పుకొచ్చాడు. తాజాగా మొరాకోతో మ్యాచ్‌లోనూ మొదట రొనాల్డో బెంచ్‌కే పరిమితమయ్యాడు. తొలి అర్థభాగం ఆటకు దూరంగా ఉన్న రొనాల్డో.. రెండో అర్థభాగంలో వచ్చినప్పటికి పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా మొరాకో చేతిలో ఓడాలని రాసిపెట్టుంటే రొనాల్డో మాత్రం అద్భుతాలు ఏం చేయగలడు. ఏమో రొనాల్డో వ్యాఖ్యలను మనసులో పెట్టుకొని పోర్చుగల్ జట్టు మేనేజ్మెంట్ కావాలనే అతన్ని కీలక మ్యాచ్‌లో తప్పించిందేమోనన్న అనుమానం కలగక మానదు. ఇక మొరాకోతో మ్యాచ్ ఓటమి అనంతరం రొనాల్డో ఇన్స్టాగ్రామ్ ద్వారా తన సమాధానం రాసుకొచ్చాడు. ''మొరాకోతో మ్యాచ్ మాకు ఒక పీడకల. వరల్డ్‌కప్ గెలవాలనే డ్రీమ్‌తో ఖతర్‌లో అడుగుపెట్టా. కానీ ఆ కల నెరవేరకుండానే ఇలా పోర్చుగల్ వెళ్లిపోతానని ఊహించలేదు. కీలక సమయంలో మొరాకో జట్టు బాగా ఆడింది. వారి డిఫెన్స్ పటిష్టంగా ఉంది. కోచ్ శాంటోజ్తో నాకు ఎలాంటి వివాదాలు లేవు. నా అవసరం జట్టుకు లేదు అన్నప్పుడు పక్కనబెట్టడం నాకు బాధ కలిగించలేదు. అయితే ఫిఫా వరల్డ్‌కప్‌ను తీసుకురావాలన్న దేశ ప్రజల కోరికను నెరవేర్చనందుకు బాధగా ఉంది. థాంక్యూ ఖతర్.. ఇక్కడి అభిమానాన్ని ఎప్పటికి మరిచిపోనూ.. థాంక్యూ పోర్చుగల్'' అంటూ పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Cristiano Ronaldo (@cristiano) చదవండి: పోర్చుగల్ ఓటమిని సెలబ్రేట్ చేసుకున్న అడల్ట్ స్టార్ Harry Kane: హీరో అనుకుంటే జీరో అయ్యాడు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పోర్చుగల్ ఓటమిని సెలబ్రేట్ చేసుకున్న అడల్ట్ స్టార్
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో పోర్చుగల్ కథ క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. ఈసారి కచ్చితంగా కప్ కొడుతుందనుకున్న రొనాల్డో సేన అనూహ్యంగా మొరాకో చేతిలో ఓటమి పాలవడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇక రొనాల్డో అయితే తనకిదే చివరి మ్యాచ్ అన్నట్లుగా వెక్కివెక్కి ఏడ్చాడు. మరోవైపు ఆఫ్రికా దేశమైన మొరాకో ఫిఫా వరల్డ్‌కప్‌లో తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. పోర్చుగల్ ఓటమితో అభిమానులు నిరాశలో ఉంటే.. మాజీ పోర్న్ స్టార్, మోడల్ మియా ఖలీఫా మాత్రం సంబరాల్లో మునిగిపోయింది. రొనాల్డో సేన క్వార్టర్స్‌లో ఇంటిబాట పట్టిన సందర్భంగా మొరాకోకు కంగ్రాట్స్ చెబుతూ ఆసక్తికర ట్వీట్ చేసింది. మొరాకో జెండాను పెట్టిన పక్కన ఆశ్చర్యార్థకం గుర్తులను పెట్టింది. ఆమె చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ప్రపంచ 9వ ర్యాంకర్ పోర్చుగల్ జట్టుతో శనివారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో మొరాకో 1–0 గోల్ తేడాతో గెలిచింది.ఆట 42వ నిమిషంలో ఎడమ వైపు నుంచి అతియత్ అలా అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో యూసుఫ్ ఎన్ నెసిరి అమాంతం గాల్లోకి ఎగురుతూ ‘హెడర్’ షాట్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. దాంతో మొరాకో తొలి అర్ధభాగాన్ని 1–0తో ముగించింది. రెండో అర్థభాగం చివరి 10 నిమిషాల్లో పోర్చుగల్‌కు గోల్ చేసేందుకు రెండుసార్లు అవకాశం వచ్చినా మొరాకో గోల్‌కీపర్ యాసిన్ బోనో వాటిని అడ్డుకున్నాడు. 90+1వ నిమిషంలో రొనాల్డో కొట్టిన షాట్‌ను యాసిన్ అద్భుతంగా నిలువరించాడు. ఇంజ్యూరీ టైమ్‌గా మ్యాచ్‌ను ఎనిమిది నిమిషాలు పొడిగించినా మొరాకో పట్టుదలతో ఆడి పోర్చుగల్‌కు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. తన కెరీర్లో లోటుగా ఉన్న ప్రపంచకప్‌ను ఈసారైనా అందుకోవాలని ఆశించిన రొనాల్డో చివరకు కన్నీళ్లపర్యంతమవుతూ భారంగా మైదానాన్ని వీడాడు. 🇲🇦!!!!! — Mia K. (@miakhalifa) December 10, 2022 చదవండి: FIFA: ఏ టైటిళ్లు, ట్రోఫీలు అక్కర్లేదు.. దేవుడు మాకిచ్చిన వరం.. కోహ్లి భావోద్వేగం FIFA WC 2022: 'ఆ ఎక్స్ప్రెషన్ ఏంటయ్యా.. పిల్లలు జడుసుకుంటారు' -
Harry Kane: హీరో అనుకుంటే జీరో అయ్యాడు
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ కథ క్వార్టర్స్‌లోనే ముగిసింది. ఫ్రాన్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2-1 తేడాతో ఓటమి పాలైంది. తద్వారా ఫిఫా వరల్డ్‌కప్‌లో ఏడుసార్లు క్వార్టర్స్‌లోనే వెనుదిరిగిన జట్టుగా ఇంగ్లండ్ చెత్త రికార్డు నమోదు చేసింది. అయితే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు లభించిన ఒక్క గోల్ ఆ జట్టు కెప్టెన్.. స్టార్ ఆటగాడు హ్యారీ కేన్ నుంచి వచ్చిందే. అలా తొలి పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి హీరో అయిన కేన్ చివర్లో జీరో అయ్యాడు. రెండో అర్థభాగంలో చివర్లో వచ్చిన రెండు పెనాల్టీ కిక్‌లను ఆటగాళ్లు గోల్ పోస్ట్‌లోకి పంపడంలో విఫలం కావడం ఇంగ్లండ్ కొంపముంచింది. ఆట 84వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను హ్యారీ కేన్ బంతిని గోల్పోస్టుపైకి తన్నాడు. ఇక ఆ తర్వాత అదనపు సమయం చివర్లో వచ్చిన మరో పెనాల్టీని ఈసారి రష్‌ఫోర్డ్ గోల్‌పోస్టు పైకి షాట్ కొట్టాడు. అంతే ఇంగ్లండ్ బాధలో మునిగిపోతే.. ఫ్రాన్స్ మాత్రం విజయ సంబరాల్లో మునిగిపోయింది. వాస్తవానికి మ్యాచ్‌లో ఫ్రాన్స్ కంటే ఇంగ్లండ్ స్పష్టమైన ఆధిక్యం చూపించింది. తొలి హాఫ్, రెండో హాఫ్ కలిపి ఇంగ్లండ్ ఆటగాళ్లు 503 సార్లు పాస్‌లు ఇచ్చుకుంటే.. ఫ్రాన్స్ మాత్రం 377 సార్లు మాత్రమే పాస్‌లు ఇచ్చుకుంది. బంతిని ఎక్కువగా ఆధీనంలో ఉంచుకుంది కూడా ఇంగ్లండ్ జట్టే. మరి ఇన్ని చేసి కూడా 1966 విజేత అయిన ఇంగ్లండ్ మరోసారి తమ పోరును క్వార్టర్స్‌తోనే ముగించడం బాధాకరం. Oh Harry, what have you done? 🫣 How costly was this miss for @England in #ENGFRA?#Qatar2022 #FIFAWorldCup #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/uI5IlBN5vg — JioCinema (@JioCinema) December 10, 2022 FIFA WC: ఎదురులేని ఫ్రాన్స్.. వరుసగా రెండోసారి సెమీస్‌కు -
Lionel Messi: 'ఏంటి చూస్తున్నావ్.. నీ పని చూసుకో స్టుపిడ్'
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో శుక్రవారం అర్జెంటీనా, నెదర్లాండ్స్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ రేపింది. ఆటలో ఉత్కంఠ అనుకుంటే పొరపాటే.. ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య భావోద్వేగాలు తారాస్థాయికి వెళ్లాయి. మ్యాచ్‌లో స్పెయిన్ రిఫరీ ఆంటోనియో మిగ్యుల్ మాటే లాహోజ్ అందరికంటే ఎక్కువ బిజీగా కనిపించాడు. ఎందుకంటే మ్యాచ్‌లో ఆటగాళ్లకు 13 సార్లు ఎల్లో కార్డులు, ఏడుసార్లు రెడ్‌కార్డులు జారీ చేశాడు. తొలి హాఫ్‌లో పెద్దగా ఏం జరగలేదు.. కానీ రెండో అర్థభాగంలో మాత్రం ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరినొకరు దూషించుకుంటూ గేమ్‌ను కొనసాగించారు. ఇక మ్యాచ్‌లో మెస్సీ పెనాల్టీని గోల్‌గా మలిచి అర్జెంటీనాను 2-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత రెండో అర్థభాగంలో నెదర్లాండ్స్ స్టార్ వౌట్ వెఘోర్స్ట్ రెండు గోల్స్ కొట్టి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు మరో గోల్ కొట్టకపోవడంతో 2-2తో మ్యాచ్ డ్రాగా ముగియడం.. పెనాల్టీ షూటౌట్లో అర్జెంటీనా 4-3 తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన మెస్సీ పోస్ట్‌మ్యాచ్ ఇంటర్య్వు ఇస్తూ నెదర్లాండ్ స్ట్రైకర్ వౌట్ వెఘోర్స్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంటర్య్వూ ఇచ్చేటప్పుడు వౌట్ మెస్సీకి ఎదురుగా వచ్చాడు. దీంతో కోపంతో..'' ఏం చూస్తున్నావ్.. నీ పని చూసుకో స్టుపిడ్'' అంటూ స్పానిష్ భాషలో పేర్కొన్నాడు. మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఆటగాళ్లతో జరిగిన ఇబ్బందిని మనసులో పెట్టుకొని మెస్సీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు డచ్ మేనేజర్.. కోచ్ లుయిస్ వాన్ గాల్తోనూ మెస్సీ గొడవపడ్డాడు. అతనికి కూడా మెస్సీ కౌంటర్ ఇచ్చాడు. ''ఈరోజు మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఆటతీరు చూశాకా వారికి గౌరవం ఇవ్వాలనిపించలేదు. ముఖ్యంగా లుయిస్ వాన్ గాల్ తీరు అస్సలు నచ్చలేదు. కోచ్ పాత్రలో ఉండి ఆయన నడుచుకున్న తీరు చిరాకు తెప్పించింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక డిసెంబర్ 14న జరగనున్న తొలి సెమీఫైనల్లో క్రొయేషియాతో అర్జెంటీనా అమితుమీ తేల్చుకోనుంది. ఈ వరల్డ్‌కప్ మెస్సీకి ఆఖరుదని వార్తలు వస్తున్న నేపథ్యంలో అర్జెంటీనాను విజేతగా నిలపాలని జట్టు సహచరులు భావిస్తున్నారు. ఇక బ్రెజిల్‌తో జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ పోరులో క్రొయేషియా 4-2తో(పెనాల్టీ షూటౌట్) ద్వారా విజయం సాధించింది. నిర్ణీత సమయంలోగా 1-1తో సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. QUE MIRAS BOBO JAJAJAJAJAJAJAA BASADO MI CAPITÁN pic.twitter.com/yoFUNu9eCO — La Scaloneta 🇦🇷 (@LaScaloneta) December 9, 2022 Messi had to show Louis van Gaal his place! 🗣️ pic.twitter.com/j7ri3s07ij — Leo Messi 🔟 (@WeAreMessi) December 10, 2022 చదవండి: వెక్కి వెక్కి ఏడ్చిన నెయ్మర్.. కథ ముగిసినట్లే! -
వెక్కి వెక్కి ఏడ్చిన నెయ్మర్.. కథ ముగిసినట్లే!
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో శుక్రవారం ఫుట్‌బాల్ అభిమానుల గుండెలు బరువెక్కాయి. టైటిల్ ఫెవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన బ్రెజిల్ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయం 1-1తో డ్రాగా ముగిసింది. దీంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్లో క్రొయేషియా 4-3 తేడాతో బ్రెజిల్‌ను ఓడించింది. అంతే అంతవరకు నెయ్మర్.. నెయ్మర్ అంటూ మారుమోగిన స్టేడియం ఒక్కసారిగా నిశబ్దంగా మారిపోయింది. ఒకపక్క క్రొయేషియా సంబరాలు జరుపుకుంటుంటే.. బ్రెజిల్ ఆటగాళ్లు మాత్రం నిరాశలో మునిగిపోయారు. బ్రెజిల్ గుండెబలం అయిన నెయ్మర్ ఓటమి బాధతో ఒక్కక్షణం చిన్నపిల్లాడిలా మారిపోయాడు. మ్యాచ్ ఓటమితో మైదానంలోనే కూలబడిన నెయ్మర్ వెక్కి వెక్కి ఏడుస్తుంటే.. స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులు కూడా కంటతడి పెట్టారు. తమ అభిమాన ఆటగాడు అలా ఏడుస్తుంటే ఎవరు మాత్రం తట్టుకుంటారు చెప్పండి. పీలే, రొనాల్డో, రొనాల్డినో తర్వాత బ్రెజిల్ ఫుట్‌బాల్‌లో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన నెయ్మర్ ఈ మ్యాచ్‌లో గోల్ కొట్టడం ద్వారా దిగ్గజం పీలే రికార్డును సమం చేశాడు. ఇప్పటివరకు నెయ్మర్ బ్రెజిల్ తరపున 77 గోల్స్ చేశాడు. ఈ ఆనందం అతనికి ఎక్కువసేపు కూడా నిలవకుండా పోయింది. మరి నెయ్మర్ వెక్కి వెక్కి ఏడ్వడం వెనుక ఒక కారణం ఉంది. ప్రస్తుతం అతని వయస్సు 30 ఏళ్లు. మరో ఫిఫా వరల్డ్‌కప్ ఆడే అవకాశం ఉన్నప్పటికి అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. ఇప్పటికే తరచూ గాయాల బారిన పడుతూ ఆటకు దూరమవుతున్న నెయ్మర్ మరో నాలుగేళ్లు ఇదే ఫిట్నెస్తో ఉంటాడా అంటే చెప్పలేం. ఇక గాయం కారణంగా 2014 ఫిఫా వరల్డ్‌కప్‌కు నెయ్మర్ పూర్తిగా దూరమయ్యాడు. ఆ తర్వాత 2015లో కోపా అమెరికా కప్ ఆడకుండా నిషేధం, 2018లో సెమీస్‌లో ఇంటిబాట పట్టడం, 2019 కోపా అమెరికా కప్‌ను బ్రెజిల్ తృటిలో మిస్ చేసుకుంది. తాజాగా తొలి మ్యాచ్‌లో గాయపడిన నెయ్మర్.. రౌండ్ ఆఫ్ 16 ద్వారా రీఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. అతని ఆటతీరు చూసి బ్రెజిల్ మరోసారి ఛాంపియన్ అవుతుందని అంతా భావించారు. ఇక క్వార్టర్ ఫైనల్లోనూ నెయ్మర్ అదే దూకుడు కనబరిచాడు. కానీ దురదృష్టం అతన్ని వెంటాడింది. పెనాల్టీ షూటౌట్లో బ్రెజిల్‌కు ఓటమి తప్పలేదు. ఇప్పుడున్న గాయాలతో చాలా ఇబ్బంది పడుతున్న నెయ్మర్ వచ్చే వరల్డ్‌కప్ ఆడుతానో లేదో అన్న సందేహం అతనిలో ఉంది. అందుకే చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. ఇక నెయ్మర్ కథ దాదాపు ముగిసినట్లే. ఫుట్‌బాల్ చరిత్రలో ఐదుసార్లు ఛాంపియన్ అయిన బ్రెజిల్ 2002లో చివరిసారి ఫిఫా వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. అప్పటినుంచి ఒక్కసారి కూడా ఛాంపియన్ కాలేకపోయింది. 2014లో సెమీఫైనల్లో ఇంటిబాట పట్టిన బ్రెజిల్.. మిగతా మూడుసార్లు క్వార్టర్స్‌కే పరిమితమైంది. Million heart brokes neymar crying 💔💔 #FIFAWorldCup #Neymar pic.twitter.com/ENHlraFJJG — Henry 🇧🇩 (@shoaibA21211051) December 9, 2022 -
మెస్సీ అరుదైన రికార్డు.. మరొక గోల్ కొడితే చరిత్రే
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ మరో ఘనత సాధించాడు. ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అర్జెంటీనా తరపున అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా గాబ్రియేల్ బాటిస్టుటాతో మెస్సీ సమంగా నిలిచాడు. ఫిఫా వరల్డ్‌కప్‌లో శుక్రవారం అర్థరాత్రి నెదర్లాండ్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మెస్సీ ఈ రికార్డు అందుకున్నాడు. డచ్తో మ్యాచ్ సందర్భంగా ఆట 73వ నిమిషంలో తనకు అచ్చొచ్చిన పెనాల్టీ ద్వారా మెస్సీ అర్జెంటీనాకు గోల్ అందించాడు. A Legend Messi...What A Penalty Shoot... Stunned.#LionelMessi #Messi #ARG#Qatar #NetherlandsArgentina pic.twitter.com/fBl8EoKMNe — Swapnil (@musaleswapnil) December 9, 2022 ఈ వరల్డ్‌కప్‌లో మెస్సీకి ఇది నాలుగో గోల్ కాగా.. ఓవరాల్‌గా 10వ గోల్ కావడం విశేషం. ఇక అర్జెంటీనా దిగ్గజం గాబ్రియేల్ బాటిస్టుటా 1994-2002 మధ్య 12 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో మొత్తంగా 10 గోల్స్ చేశాడు. ఈ క్రమంలోనే తాజాగా మెస్సీ 10వ గోల్ సాధించి గాబ్రియేల్‌ను 24 మ్యాచ్‌ల్లో సమం చేశాడు. కాగా ఇదే వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా స్టార్ మెస్సీ సౌదీ అరేబియా, మెక్సికో, ఆస్ట్రేలియాపై ఒక్కో గోల్ చేశాడు. దీంతో మెస్సీ అర్జెంటీనా తరపున 170 మ్యాచ్‌ల్లో 95 గోల్స్ నమోదు చేశాడు. -
FIFA WC: ఏం గుండెరా నీది.. చచ్చేంత సమస్య ఉన్నా దేశం కోసం
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో శుక్రవారం అర్జెంటీనా, నెదర్లాండ్స్ మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు చేరుతుంది. ఇక గ్రూప్ దశలో ఓటమి ఎరుగని నెదర్లాండ్స్‌ను మెస్సీ సేన ఏ విధంగా ఎదుర్కొంటుందనేది ఆసక్తికంగా మారింది. అయితే 2014 ఫిఫా వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్లో ఈ రెండుజట్లు ఎదురుపడ్డాయి. అప్పటి మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్లో అర్జెంటీనా.. డచ్ జట్టుపై విజయాన్ని అందుకుంది. ఈ విషయం పక్కనబెడితే.. నెదర్లాండ్స్ సీనియర్ స్టార్ ఆటగాడు డేలీ బ్లైండ్ గురించి ఒక ఆసక్తికర విషయం బయటకొచ్చింది. గుండె సమస్యతో బాధపడుతూ కూడా ధైర్యంగా మైదానంలో ఫుట్‌బాల్ ఆడడం అతనికే చెల్లింది. డేలీ బ్లైండ్ కొంతకాలంగా గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడు. ఎక్కువగా పరిగెడితే వచ్చే ఆయాసంతో బ్లైండ్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీంతో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే డేలీ బ్లైండ్ ఏ మ్యాచ్‌లో బరిలోకి దిగినా తనవెంట డిఫిబ్రిలేషన్(Defibrillation) మెషిన్ ఉంటుంది. డీఫిబ్రిలేషన్ అనేది ప్రాణాంతక కార్డియాక్ అరిథ్మియాలకు చికిత్సగా పనిచేస్తుంది. వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ (V-Fib), నాన్-పెర్ఫ్యూజింగ్ వెంట్రిక్యులర్ టాచీకార్డియా (V-Tach)లకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. డీఫిబ్రిలేటర్ ద్వారా గుండెకు కరెంట్‌షాక్ ఇచ్చి ఊపిరి ఆగిపోకుండా ఉంచుతారు.(దీనినే వైద్య భాషలో కౌంటర్-షాక్ అని పిలుస్తారు). డిఫిబ్రిలేటర్(Defibrillator) మరి ఇంత సమస్య పెట్టుకొని డేలీ బ్లైండ్‌ను ఆడించడం అవసరమా అనే డౌట్ రావొచ్చు. కానీ అతను జట్టుకు కీలక ఆటగాడు. ఫిఫా వరల్డ్‌కప్‌లో అమెరికాతో జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో గోల్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అందుకే అతన్ని జట్టు నుంచి తప్పించడం పెద్ద సాహసమే అవుతుందని జట్టు మేనేజర్ పేర్కొన్నాడు. అయితే ఇదివరకే డేలీ బ్లైండ్ డిఫిబ్రిలేషన్ను ఉపయోగించారు. 2019లో చాంపియన్స్ లీగ్ సందర్భంగా ఒక మ్యాచ్‌లో బ్లైండ్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి డిఫిబ్రిలేషన్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే అప్పుడే ఫుట్‌బాల్ ఆటను మానుకోవాలని బ్లైండ్‌ను హెచ్చరించారు. కానీ బ్లైండ్ వారి మాటను లెక్కచేయలేదు. ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో ఎలాగైనా పాల్గొనాలని ధ్యేయంగా పెట్టుకున్న డేలీ బ్లైండ్ తన వెంట డిఫిబ్రిలేషన్ మిషన్‌ను తెచ్చుకున్నాడు. చనిపోయేంత సమస్య ఉన్నప్పటికి భయపడకుండా దేశం కోసం బరిలోకి దిగిన అతని గుండె ధైర్యాన్ని అందరు మెచ్చుకుంటున్నారు. నెదర్లాండ్స్ కప్ గెలుస్తుందో లేదో తెలియదు కానీ డేలీ బ్లైండ్ మాత్రం అభిమానుల మనసులను గెలిచేశాడు. 🟠MATCH PREVIEW🤩 🇳🇱 Netherlands v Argentina 🇦🇷 #NEDARG Prepare for a tasty World Cup quarter final with @EredivisieMike speaking with @sebaongarelli! WATCH: 📺https://t.co/2IDySVyqTa pic.twitter.com/6bPweVEiZJ — Dutch Football 🇳🇱 (@FootballOranje_) December 6, 2022 చదవండి: 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధన.. బీసీసీఐ షాకింగ్ ట్విస్ట్! ఖతర్‌లో వరల్డ్‌కప్.. ప్రపంచానికి తెలియని మరణాలు! -
FIFA WC: యువ సంచలనం.. రొనాల్డోను తప్పించి జట్టులోకి తీసుకువస్తే! ఏకంగా 3 గోల్స్
FIFA World Cup 2022 Portugal Vs Switzerland: స్విట్జర్లాండ్‌తో కీలక మ్యాచ్‌లో పోర్చుగల్ ఫుట్‌బాలర్ గొంకాలో రామోస్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిసి ఫిఫా వరల్డ్‌కప్-2022 టోర్నీలో ఇప్పటి వరకు ఈ ఫీట్ నమోదు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. తద్వారా బుధవారం నాటి మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌ను చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. రొనాల్డోను తప్పించి.. 21 ఏళ్ల రామోస్ మూడు గోల్స్(17, 51, 67వ నిమిషంలో) సాధించి జట్టును గెలిపించాడు. తద్వారా పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను బెంచ్‌కు పరిమితం చేసి.. అతడి స్థానంలో తనను తీసుకువచ్చిన కోచ్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక రామోస్‌కు తోడు.. కెప్టెన్ పీప్, రాఫేల్ గెరీరో, రాఫేల్ లియో రామోస్ గోల్స్ చేయడంతో పోర్చుగల్ స్విస్‌ను 6-1తో చిత్తుగా ఓడించి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ముచ్చటగా మూడోసారి స్విస్ ఆటగాళ్లలో మాన్యూల్ అకంజీ ఒక గోల్ సాధించాడు. కాగా ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో పోర్చుగల్ క్వార్టర్స్‌కు చేరడం ఇది మూడో సారి. గతంలో 1966, 2006లో ఈ ఫీట్ సాధించింది. ఇక క్వార్టర్స్ ఫైనల్లో పోర్చుగల్.. మొరాకోతో తలపడనుంది. రొనాల్డో ఫ్యాన్స్ ఆగ్రహం ఈ మ్యాచ్ సెకండాఫ్‌లో (74వ నిమిషంలో) రొనాల్డో మైదానంలోకి వచ్చాడు. జొయావో ఫెలిక్స్‌కు సబ్‌స్టిట్యూట్‌గా రొనాల్డోను తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో రొనాల్డో అభిమానులు కోచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Steps into Ronaldo's shoes & raises the roof 📈 Watch how #Portugal's hat-trick hero Goncalo Ramos 🔥 up the Lusail Stadium in #PORSUI 🙌 Stay tuned to #JioCinema & #Sports18 for all the LIVE action from #FIFAWorldCup 📊#Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/H9TaLmy7gh — JioCinema (@JioCinema) December 6, 2022 -
సాత్విక్ జోడీ ముందంజ
సార్‌బ్రుక్‌కెన్ (జర్మనీ): హైలో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 22–24, 21–15, 21–11తో రోరీ ఈస్టన్–జాక్ రస్ (ఇంగ్లండ్) జోడీపై గెలిచింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం 21–18, 21–19తో జిలీ దెబోరా–చెర్లీ సీనెన్ (నెదర్లాండ్స్) జోడీని ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ (భారత్) 15–21, 21–14, 21–13 తో లూ గ్వాంగ్ జు (చైనా)పై కష్టపడి గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో భారత ప్లేయర్ మాళవిక క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. క్రిస్టీ గిల్మోర్ (స్కాట్లాండ్)తో జరిగిన మ్యాచ్‌లో మాళవిక తొలి గేమ్‌ను 24–22తో సొంతం చేసుకొని, రెండో గేమ్‌లో 19–7తో ఆధిక్యంలో ఉన్నదశలో గిల్మోర్ గాయం కారణంగా వైదొలిగింది. చదవండి: T20 WC 2022: భారత్‌ను భయపెట్టాడు.. లిటన్ దాస్‌కు కోహ్లి అదిరిపోయే గిఫ్ట్ -
Asian Boxing Championships 2022: క్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా ఎలైట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన 57 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ 3–2తో మునార్బెక్ (కిర్గిస్తాన్)పై గెలుపొందాడు. ఇటీవల బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన హుసాముద్దీన్ క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్ బాక్సర్ ఇలియాస్ హుస్సేన్‌తో తలపడతాడు. క్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ గెలిస్తే కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంటాడు. మరోవైపు 80 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన లక్ష్య చహర్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య చహర్ 5–0తో షబ్బోస్ నెగ్మత్ (తజికిస్తాన్)పై గెలుపొందాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో స్పర్శ్ కుమార్ (51 కేజీలు) 1–4తో ప్రపంచ చాంపియన్ సాకెన్ బిబోసినోవ్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. ఈ మెగా టోర్నీలో 27 దేశాల నుంచి 267 మంది బాక్సర్లు పోటీపడుతున్నారు. చదవండి: Hylo Open Badminton: తొలి రౌండ్లోనే లక్ష్య సేన్ ఓటమి -
క్వార్టర్స్‌లో బోపన్న జోడీ
న్యూఢిల్లీ: టెల్ అవీవ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ శుభారంభం చేసింది. బుధవారం ఇజ్రాయెల్‌లో జరిగిన తొలి రౌండ్లో టాప్ సీడ్ బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం 4–6, 7–6 (7/4), 10–6తో వైషయ్ ఒలియెల్ (ఇజ్రాయెల్)–మెద్జెదోవిచ్ (సెర్బియా) జోడీ పై గెలిచింది. గంటా 28 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో బోపన్న ద్వయం ఐదు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. చదవండి: Vietnam Open Badminton: ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ జోడీ -
క్వార్టర్ ఫైనల్లో సానియా జంట
రోత్సె క్లాసిక్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో మూడో సీడ్ సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జంట శుభారంభం చేసింది. బర్మింగ్హమ్లో సోమవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా–లూసీ హర్డెస్కా ద్వయం 7–5, 6–2తో అలీసియా బార్నెట్–ఒలీవియా నికోల్స్ (బ్రిటన్) జోడీపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. చదవండి: World Youth Weightlifting Championship: భళా గురు... -
రంజీ చరిత్రలో ముంబై అతిపెద్ద విజయం.. ప్రపంచ రికార్డు బద్దలు
రంజీ ట్రోఫీ చరిత్రలో ముంబై అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఉత్తరాఖండ్‌తో జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్లో 725 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ముంబై సెమీఫైనల్లో అడుగుపెట్టింది. 795 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఉత్తరాఖండ్ ముంబై బౌలర్ల దాటికి 69 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఫస్ట్‌క్లాస్ చరిత్రలోనే అతి పెద్ద విజయం సాధించిన జట్టుగా ముంబై ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇంతకముందు 92 ఏళ్ల క్రితం.. 1929-30లో షఫీల్డ్‌షీల్డ్ క్రికెట్లో న్యూ సౌత్‌వేల్స్ క్వీన్స్‌ల్యాండ్‌పై 685 పరుగుల తేడాతో విజయం సాధించడం ఇప్పటివరకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రికార్డుగా ఉంది. తాజగా ముంబై ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్‌లో శివమ్ ఖురానా 25 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. ముంబై బౌలర్లలో ధావల్ కులకర్ణి, షామ్స్ ములాని, తనుష్ కొటెన్ తలా మూడు వికెట్ తీయగా.. మోహిత్ అవస్తి ఒక వికెట్ పడగొట్టాడు. అంతకముందు ముంబై రెండో ఇన్నింగ్స్‌ను 3 వికెట్ల నష్టానికి 261 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. యశస్వి జైశ్వాల్ 103, పృథ్వీ షా 72 పరుగులు చేశారు. ఇక తొలి ఇన్నింగ్స్‌ను ముంబై సువేద్ పార్కర్ డబుల్ సెంచరీతో 647 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా.. ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 114 పరుగులకే కుప్పకూలింది. చదవండి: Ranji Trophy 2022: ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్.. బెంగాల్ జట్టు ప్రపంచ రికార్డు 🚨 RECORD-BREAKING WIN 🚨 Mumbai march into the #RanjiTrophy semifinals by securing a 725-run victory - the highest margin of win (by runs) - in the history of First-Class cricket. 👏 👏 #Paytm | #MUMvCAU | #QF2 | @MumbaiCricAssoc Scorecard ▶️ https://t.co/9IGODq4LND pic.twitter.com/Qw47aSLR7v — BCCI Domestic (@BCCIdomestic) June 9, 2022 -
World Cup 2022: 64 ఏళ్ల తర్వాత... ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు వేల్స్ జట్టు అర్హత
కార్డిఫ్: ఎప్పుడో 1958లో... వేల్స్ ఫుట్‌బాల్ జట్టు ప్రపంచకప్‌లో చక్కటి ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్ వరకు చేరింది. అయితే ఆ మ్యాచ్‌లో అప్పుడు 17 ఏళ్ల వయసు ఉన్న ఆల్‌టైమ్ గ్రేట్ పీలే (బ్రెజిల్) చేసిన ఏకైక గోల్‌తో వేల్స్ పరాజయం పాలైంది. ఆ తర్వాత మరో 15 ప్రపంచకప్‌లు జరిగినా... ఒక్కసారి కూడా వేల్స్ అర్హత సాధించలేకపోయింది. ఇప్పుడు మరోసారి ఆ టీమ్‌కు విశ్వవేదికపై తలపడే అవకాశం వచ్చింది. ఈ ఏడాది ఖతర్‌లో జరిగే ‘ఫిఫా’ వరల్డ్ కప్‌కు వేల్స్ అర్హత పొందింది. క్వాలిఫయర్స్ పోరులో వేల్స్ 1–0 తేడాతో ఉక్రెయిన్‌పై విజయం సాధించింది. ఉక్రెయిన్ ఆటగాడు ఆండ్రీ యర్మొలెంకో 34వ నిమిషంలో చేసిన ‘సెల్ఫ్ గోల్’తో వేల్స్‌కు అదృష్టం కలిసొచ్చింది. వేల్స్ స్టార్ ఆటగాడు, ఐదుసార్లు చాంపియన్స్ లీగ్ టైటిల్ విజయాల్లో భాగమైన గారెత్ బేల్ ఈ విజయాన్ని ‘తమ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమ ఫలితం’గా అభివర్ణించాడు. బేల్ కొట్టిన ఫ్రీకిక్‌ను హెడర్‌తో దిశ మళ్లించే ప్రయత్నంలోనే విఫలమై యర్మొలెంకో బంతిని తమ గోల్‌పోస్ట్‌లోకే పంపించాడు. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, అమెరికా, ఇరాన్ ఉన్న గ్రూప్ ‘బి’లో వేల్స్ పోటీ పడనుంది. -
సూపర్ టైమింగ్.. ఎవరికి సాధ్యం కాని ఫీట్ అందుకున్నాడు
మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భాగంగా గురువారం నార్వేకు చెందిన కాస్పర్ రాడ్, జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కాస్పర్ రాడ్.. జ్వెరెవ్‌ను (6-3,1-6,6-3)తో ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లాడు. మూడు సెట్లలోనే మ్యాచ్‌ను ముగించిన కాస్పర్ రాడ్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే తన ట్రిక్‌తో ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు. విషయంలోకి వెళితే.. మ్యాచ్ మధ్యలో రాడ్ సర్వీస్ చేయాల్సి ఉంది. జ్వెరెవ్ కోర్టు బయటకు వెళ్లి బంతిని రాడ్వైపు విసిరాడు. సాధారణంగా చేతితో అందుకుంటే సరిపోయేది..కానీ కాస్పర్ రాడ్ బంతి కచ్చితంగా తన జేబులో పడేలా ట్రిక్ చేయడం ఆసక్తి కలిగించింది. అతని టైమింగ్ ఎంతలా అంటే.. అతను తన జేబును ఓపెన్ చేయడం..బంతి వెళ్లి అతని పాకెట్లో పడడం జరిగిపోయింది. ఇది చూసిన అభిమానులు అతని ట్రిక్స్‌కు మంత్రముగ్దులై లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు. దీనికి సంబంధించిన వీడియోను టెన్నిస్ టీవీ తన ట్విటర్లో షేర్ చేసింది. చదవండి: పుట్‌బాల్ ప్రపంచకప్‌కు పోర్చుగల్ Ruud-iculous skills 😍@CasperRuud98 #MiamiOpen pic.twitter.com/3NZCRN3p2b — Tennis TV (@TennisTV) March 31, 2022 -
ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన శ్రీవల్లి రష్మిక
నాగ్‌పూర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్లు శ్రీవల్లి రష్మిక, సామ సాత్విక... ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రేయ తటవర్తి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో రష్మిక 6–4, 6–3తో షర్మదా బాలు (భారత్)పై, సాత్విక 7–5, 6–2తో అదితి (భారత్)పై, శ్రేయ 6–3, 5–7, 6–3తో జగ్మీత్ కౌర్ గ్రెవాల్ (భారత్)పై గెలిచారు. చెస్ ఒలింపియాడ్ ఆతిథ్యానికి భారత్ బిడ్ అఖిల భారత చెస్ సమాఖ్య ఈ ఏడాది చెస్ ఒలింపియాడ్ ఆతిథ్య హక్కుల కోసం బిడ్ వేయనుంది. ఇందులో భాగంగా గ్యారంటీ మనీ కోటి డాలర్లను (రూ. 74 కోట్లు) అంతర్జాతీయ చెస్ సమాఖ్యకు డిపాజిట్ చేసింది. నిజానికి ఈ చెస్ మెగా టోర్నీ ఈ జూలై 26 నుంచి ఆగస్టు 8 వరకు రష్యాలో జరగాల్సింది. అయితే ఆ దేశం ఉక్రెయిన్‌పై అకారణంగా యుద్ధం చేస్తుండటంతో అక్కడ ఈవెంట్‌ను రద్దు చేసి తాజాగా బిడ్లను ఆహ్వానించారు. చదవండి: Ranji Trophy 2022: తొమ్మిదేళ్ల తర్వాత తొలి వికెట్ పడగొట్టాడు.. ఒక్కసారిగా ఏం చేశాడంటే..! -
గోల్ కొట్టిన తర్వాత బూట్ పాలిష్.. దీని కథేంటి!
ఆట ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకోవడం సహజం. అయితే ఆ సెలబ్రేషన్స్ కాస్త కొత్తగా అనిపిస్తే వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా ఈజిప్ట్ స్టార్ ఫుట్‌బాలర్ మహ్మద్ సాలా.. సహచర ఆటగాడు ట్రెజెగ్యుట్ మధ్య జరిగిన సెలబ్రేషన్ మూమెంట్ నిమిషాల వ్యవధిలో వైరల్ అయింది. సాధారణంగా సాకర్ గేమ్ చూసేవారికి షూ పాలిష్ సెలబ్రేషన్ తెలిసే ఉంటుంది. ఇలాంటివి ఎక్కువగా ఫిఫా వరల్డ్‌కప్‌లో ఎక్కువగా చూస్తుంటాం. తాజాగా ఆఫ్రికన్ కప్ ఆఫ్ నేషన్స్‌లో(ఆఫ్కాన్) అలాంటి సెలబ్రేషన్స్‌తో మెరిశారు.. మహ్మద్ సాలా, ట్రెజెగ్యుట్. చదవండి: Mason Greenwood: ఫుట్‌బాల్ ఆటగాడి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. ఇక కష్టమే ఆఫ్కాన్ లీగ్‌లో భాగంగా ఈజిప్ట్, మొరాకొల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే మ్యాచ్ నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరుజట్లు 1-1తో సమానంగా నిలిచాయి. దీంతో అంపైర్లు ఎక్స్ట్రా టైమ్‌కు(30 నిమిషషాలు) అవకాశం ఇచ్చారు. ఫెనాల్టీ షూటౌట్లో మహ్మద్ సాలా మెరుపువేగంతో బంతిని పాస్ చేయగా.. ట్రెజెగ్యుట్ దానిని సూపర్ గోల్‌గా మలిచాడు. ఇంకేముంది 2-1 ఆధిక్యంతో ఈజిప్ట్ సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈజిప్ట్ విజయంలో కీలకపాత్ర పోషించిన మహ్మద్ సాలా, ట్రెజెగ్యుట్లు ఒకరినొకరు అభినందించుకున్నారు. ఆ తర్వాత ట్రెజెగ్యుట్ మొకాళ్లపై నిలబడి.. సాలా షూ పాలిష్ చేస్తున్నట్లుగా స్టిల్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోపై లుక్కేయండి. ఇక అంతకముందు మొరాకో తరపున ఆట 7వ నిమిషంలో సోఫియాన్ బౌఫాల్ గోల్‌తో మెరిసి జట్టుకు శుభారంభం అందించాడు. అయితే ఫస్ట్ ఆఫ్‌లో గోల్ చేయడంలో విఫలమైన ఈజిప్ట్.. రెండో అర్థభాగంలో మెరిసింది. ఆట 53వ నిమిషంలో మహ్మద్ సాలా గోల్‌తో మెరవడంతో స్కోరు 1-1తో సమమైంది. ఆ తర్వాత నిర్ణీత సమయంలో రెండు జట్లు గోల్ కొట్టకపోవంతో ఎక్స్ట్రా టైమ్ ఇచ్చారు. దీనికి ఈజిప్ట్ చక్కగా వినియోగించుకుంది. ఇక సెమీస్‌లో అడుగుపెట్టిన ఈజిప్ట్‌తో కామెరున్తో ఫిబ్రవరి 4న అమితుమీ తేల్చుకోనుంది. మరో సెమీస్‌లో బుర్కినా ఫాసో, సెనెగల్లు తలపడనున్నాయి. చదవండి: Andre Russell: ప్రాక్టీస్ సమయంలో వింత అనుభవం.. మళ్లీ బుక్కైన రసెల్ pic.twitter.com/LEp6X59UwX — . (@dontinterac) January 31, 2022 -
క్వార్టర్ ఫైనల్లో సింధు..
Syed Modi International 300 Tournament: సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ పీవీ సింధు, తెలంగాణ అమ్మాయి సామియా ఇమాద్ ఫారూఖీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి సింధు 33 నిమిషాల్లో 21–16, 21–13తో లారెన్ లామ్ (అమెరికా)పై... సామియా 27 నిమిషాల్లో 21–6, 21–15తో కనిక (భారత్)పై గెలిచారు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు 9–21, 6–21తో ఆకర్షి కశ్యప్ (భారత్) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణ ప్రసాద్ జోడీ 15–21, 21–17, 21–8తో అయూబ్–లిమ్ కిమ్ వా (మలేసియా) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి గోపీచంద్–త్రిషా జాలీ ద్వయం 21–12, 21–7తో సిమ్రన్– రితికా జంటపై నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరింది. చదవండి: Australian Open 2022: యూఎస్ ఓపెన్ చాంపియన్ ఎమ్మా రాడుకానుకు దిమ్మతిరిగే షాక్ -
క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి
స్పెయిన్‌లోని హుఎల్వా వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2021 క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి చెందింది. తైవాన్‌కు చెందిన వరల్డ్ నెం1 తైజుయింగ్ చేతిలో 21-17,13-21 ఓటమి చెందింది. 42 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తైజుయింగ్.. సింధుపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. దీంతో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఆరో పతకాన్ని చేజార్చుకుంది. ఇక చైనా స్టార్ షట్లర్ జాంగ్ నింగ్‌తో ఐదు పతకాలతో సింధు సమంగా నిలిచింది. చదవండి: IND Vs SA: అతడిని కచ్చితంగా భారత జట్టులోకి తీసుకోవాలి.. ఎందుకంటే! -
క్వార్టర్స్‌లో యువ భారత్..
భువనేశ్వర్: జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. శనివారం గ్రూప్ ‘బి’లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8–2తో పోలాండ్‌పై ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున సంజయ్ (4, 58వ నిమిషాల్లో), అరైజీత్ సింగ్ (8, 60వ నిమిషాల్లో), సుదీప్ (24, 40వ నిమిషాల్లో) తలా రెండు గోల్స్ చేశారు. ఉత్తమ్ సింగ్ (34వ నిమిషంలో), శర్దానంద్ తివారి (38వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. ఈ విజయంతో భారత్ గ్రూప్ ‘బి’లో రెండో స్థానంలో నిలిచింది. డిసెంబర్ 1న జరిగే క్వార్టర్ ఫైనల్లో బెల్జియంతో భారత్ ఆడనుంది. చదవండి: Ind Vs Nz 1st Test 2021: గిల్ ఓపెనర్‌గా కాకుండా ఆ స్ధానంలో బ్యాటింగ్‌కు రావాలి -
క్వార్టర్స్‌లో సింధు, సాయిప్రణీత్
బాలి: ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాయిప్రణీత్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధు 21–12, 21–18తో వైవోన్ లీ (జర్మనీ)పై అలవోక విజయం సాధించింది. 37 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో టోర్నీ మూడో సీడ్ సింధు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వరుస గేమ్‌ల్లో మ్యాచ్‌ను ముగించి టోర్నీలో ముందంజ వేసింది. నేడు జరిగే క్వార్టర్స్ పోరులో సిమ్ యుజిన్ (కొరియా)తో సింధు ఆడనుంది. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్ 21–17, 14–21, 21–19తో క్రిస్టో పోపొవ్ (ఫ్రాన్స్)పై పోరాడి గెలిచాడు. అయితే మరో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు మాత్రం ప్రిక్వార్టర్స్‌లో నిరాశ ఎదురైంది. శ్రీకాంత్ 14–21, 18–21తో టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–15, 19–21, 23–21తో కంగ్ మిన్‌హ్యూక్– సియో సెంగ్‌జే (కొరియా) జంటపై నెగ్గి ముందంజ వేసింది. చదవండి: IND Vs NZ: మొదటి రోజు దుమ్ములేపిన భారత బ్యాటర్లు.. తొలి మ్యాచ్‌లోనే అయ్యర్ అర్ధ సెంచరీ -
PV Sindhu: 37 నిమిషాల్లో ఓడించి క్వార్టర్స్‌కు
PV Sindhu Enters Quarterfinals Indonesia Open Super 1000.. ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగుతేజం పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. టోర్నీలో మూడోసీడ్‌గా బరిలోకి దిగిన సింధు గురువారం జరిగిన రెండో రౌండ్లో జర్మనీకి చెందిన బాలిలో వైవోన్ లీని 21-12, 21-18తో వరుస సెట్లలో ఓడించింది. రెండుసార్లు ఒలింపిక్ విజేత అయిన సింధు వైవోన్ లీని కేవలం 37 నిమిషాల్లోనే మట్టికరిపించి క్వార్టర్స్‌కు చేరుకుంది. ఇక క్వార్టర్స్‌లో స్పెయిన్‌కు చెందిన 55వ సీడ్ బీట్రిజ్ కొర్రల్స్, కొరియాకు చెందిన 54వ సీడ్ సిమ్ యుజిన్ మధ్య విజేతతో తలపడనుంది. -
ఒలింపిక్ ఛాంపియన్‌కు షాకిచ్చిన భారత షట్లర్
బాలీ: ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. టోర్నీ రెండో సీడ్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)పై అద్భుత విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 14–21, 21–19, 21–16తో విక్టర్ అక్సెల్సన్పై గెలుపొందాడు. 71 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయిన ప్రణయ్... రెండో గేమ్ నుంచి పుంజుకున్నాడు. అద్భుతమైన స్మాష్ షాట్లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. రెండు, మూడు గేమ్‌ల్లో నెగ్గి విజయాన్ని అందుకున్నాడు. విక్టర్ అక్సెల్సన్పై ప్రణయ్‌కిదే తొలి విజయం. గతంలో అతడితో ఆడిన ఐదు సార్లు కూడా ప్రణయ్ ఓడిపోయాడు. మరో మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్ 13–21, 21–18, 21–15తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై నెగ్గగా... లక్ష్యసేన్ 13–21, 19–21తో ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడాడు. మహిళల పిక్వ్రార్టర్స్‌లో పీవీ సింధు 17–21, 21–7, 21–12 క్లారా అజుర్మెండి (స్పెయిన్)పై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో ప్రపంచ ఐదో ర్యాంక్ జంటను ఓడించిన సిక్కి రెడ్డి–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం పోరాటం ప్రిక్వార్టర్స్‌లో ముగిసింది. సిక్కి రెడ్డి–ధ్రువ్ జంట 15–21, 23–21, 18–21తో జోమ్కో–సుపిసార (థాయ్‌లాండ్) జోడీ చేతిలో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కి రెడ్డి (భారత్) జోడీ 18–21, 12–21తో కిటిట్‌హరకుల్–రవిండ ప్రజోంగ్జ (థాయలాండ్) జంట చేతిలో ఓడింది. -
ఆఖరి బంతికి ఊహించని ట్విస్ట్.. సూపర్ ఓవర్ ద్వారా సెమీస్‌కు
Karnataka Beats Bengal In Super Over Enter Semis.. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో భాగంగా కర్ణాటక, బెంగాల్ మధ్య గురువారం క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆఖరి ఓవర్‌దాకా ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో అద్భుత విజయం సాధించిన కర్ణాటక సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరగులు చేసింది. కరుణ్ నాయర్ 55 పరుగులు నాటౌట్.. టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ రోహన్ కడమ్ 30, కెప్టెన్ మనీష్ పాండే 29 పరుగులు చేశారు. చదవండి: Ind Vs Nz 1st T20: సిరాజ్‌ను ‘కొట్టిన’ రోహిత్ శర్మ.. ‘ఏంటి భయ్యా ఇది’.. వీడియో వైరల్! అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగాల్ 19 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో బెంగాల్ విజయానికి 20 పరుగులు కావాలి. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను విద్యాదర్ పాటిల్ వేశాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న రిత్విక్ చౌదరీ తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలచడంతో.. నాలుగు బంతుల్లో 8 పరుగులుగా సమీకరణాలు మారాయి. మూడో బంతికి ఒక పరుగు రాగా.. నాలుగో బంతికి ఆకాశ్ దీప్ బౌండరీ బాదడంతో రెండు బంతుల్లో మూడు పరుగులు కావాలి. ఐదో బంతికి ఆకాశ్ దీప్ రెండు పరుగులు తీశాడు. చివరి బంతికి ఒక్క పరుగు చేస్తే బెంగాల్ విజయం సాధిస్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. పాటిల్ వేసిన బంతిని ఆకాశ్ దీప్ డీప్‌మిడ్‌వికెట్ దిశగా షాట్ ఆడాడు. అయితే అక్కడే ఉన్న కెప్టెన్ మనీష్ పాండే డైరెక్ట్ హిట్ చేయడంతో ఆకాశ్ దీప్ రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఇక సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ నాలుగు బంతుల్లో 5 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది.ఇక 6 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటకను మనీష్ పాండే రెండు బంతుల్లోనే 8 పరుగులు కొట్టి విజయం అందించి జట్టును సెమీఫైనల్ చేర్చాడు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో మిగిలిన క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్‌ల్లో కేరళపై తమిళనాడు, గుజరాత్‌పై హైదరాబాద్, రాజస్తాన్‌పై విదర్భలు విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నాయి. ఇక సెమీస్‌లో తమిళనాడుతో హైదరాబాద్.. కర్ణాటకతో విదర్భ అమీతుమీ తేల్చుకోనున్నాయి. చదవండి: Ricky Ponting: హెడ్‌కోచ్‌గా ఆఫర్.. ద్రవిడ్‌ను ఎంపికచేయడం ఆశ్చర్యపరిచింది 🎯 #KARvBEN pic.twitter.com/pFdOtIkB5Y — Rohan (@itzz_Rohan) November 18, 2021 Manish pandey hits the winning six in the super over helped Karnataka to qualify for semis.#SyedMushtaqAliTrophy#SyedMushtaqAliT20pic.twitter.com/cjPAigDFLC — CRICKET VIDEOS 🏏 (@AbdullahNeaz) November 18, 2021 -
World Archery championship 2021: క్వార్టర్ ఫైనల్లో అంకిత
యాంక్టన్ (అమెరికా): ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్ మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్ అంకిత భకత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. కోల్‌కతాకు చెందిన 23 ఏళ్ల అంకిత ప్రిక్వార్టర్ ఫైనల్లో 6–4తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కాంగ్ చె యంగ్ (దక్షిణ కొరియా)పై సంచలన విజయం సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన కొరియా జట్టులో కాంగ్ చె యంగ్ సభ్యురాలిగా ఉంది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన అంకిత రెండో రౌండ్లో 7–3తో జిండ్రిస్కా వనెస్కోవా (చెక్ రిపబ్లిక్)పై, మూడో రౌండ్లో 7–1తో అలెగ్జాండ్రా మిర్కా (మాల్డోవా)పై విజయం సాధించింది. భారత్‌కే చెందిన కోమలికా బారి మూడో రౌండ్లో 2–6తో కాంగ్ చె యంగ్ చేతిలో, రిధి 4–6తో సుగిమోటో తొమోమి (జపాన్) చేతిలో ఓడిపోయారు. చదవండి: Ostrava Open: సెమీఫైనల్లో సానియా మీర్జా జోడీ -
Tokyo Olympics: పురుషుల హాకీలో సెమీస్ చేరిన భారత్
పురుషుల హాకీలో సెమీస్ చేరిన భారత్ టోక్యో ఒలింపిక్స్:లో భారత పురుషుల హాకీ జట్టు సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఈరోజు(ఆదివారం) జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3-1 తేడాతో బ్రిటన్‌పై విజయం సాధించి సెమీస్‌కు చేరింది. తద్వారా 41 ఏళ్ల తర్వాత భారత్ ఒలింపిక్స్‌లో సెమీస్‌కు చేరినట్లయ్యింది. సెమీస్‌లో బెల్జియంతో భారత్ తలపడనుంది. టోక్యో ఒలింపిక్స్: కాంస్య పతక పోరులో సింధు విజయం మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో భాగంగా కాంస్య పతకం కోసం జరిగిన పోరు పీవీ సింధు విజయం సాధించింది. సింధు 21-13, 21-15 తేడాతో చైనా క్రీడాకారిణి బింగ్ జియావోపై గెలుపొందింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో విజృంచి ఆడిన సింధు.. కాంస్య పతకంతో మెరిసింది. తొలి గేమ్‌లో సింధు విజృంభణ టోక్యో ఒలింపిక్స్.. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో భాగంగా కాంస్య పతకం కోసం జరుగుతున్న పోరులో పీవీ సింధు తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. విజృంభించి ఆడిన సింధు 21-13 తేడాతో బింగ్ జియావోపై ఆధిపత్యం చెలాయించింది. రెండో గేమ్‌లో సింధు విజయం సాధిస్తే కాంస్య పతకం సొంతమవుతుంది. పీవీ సింధు-బింగ్ జియావోల కాంస్య పతక పోరు ప్రారంభం ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో పీవీ సింధు-బింగ్ జియావోల మధ్య కాంస్య పతక పోరు ప్రారంభమైంది. మూడో స్థానం కోసం వీరిద్దరి మధ్య పోరు జరుగుతోంది. సింధు, బింగ్ జియావో మధ్య ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు జరగ్గా... సింధు 6 సార్లు, జియావో 9 సార్లు నెగ్గారు. బాక్సర్ సతీశ్ కుమార్ ఓటమి ►టోక్యో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ సతీశ్ కుమార్ పోరు ముగిసింది. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జలోలోప్‌తో జరిగిన మ్యాచ్‌లో 5-0 తేడాతో పరాజయం పాలయ్యాడు. మూడు బౌట్లలోనూ కనీస పోటీ ఇవ్వని సతీశ్ కుమార్ మొత్తంగా 27 పాయింట్లు సాధించగా.. ప్రత్యర్థి జలోలోప్ మాత్రం 30 పాయింట్లతో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఒలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్: పురుషుల హాకీ : భారత్ * బ్రిటన్(క్వార్టర్ ఫైనల్) సాయంత్రం గం. 5:30 నుంచి బ్యాడ్మింటన్ : మహిళల సింగిల్స్ కాంస్య పతకం మ్యాచ్: పీవీ సింధు * హి బింగ్ జియావో సాయంత్రం గం. 5 నుంచి ఈక్వెస్ట్రియన్ : ఈవెంటింగ్ క్రాస్ కంట్రీ టీమ్ అండ్ ఇండివిడ్యుయల్: ఫౌద్ మీర్జా ఉదయం గం. 4:15 నుంచి గోల్ఫ్: పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్–4: అనిర్బన్ లాహిరి, ఉదయన్ మానె (ఉదయం గం. 4 నుంచి) బాక్సింగ్ : పురుషుల +91 కేజీల క్వార్టర్ ఫైనల్: సతీశ్ కుమార్ * జలోలోవ్ (ఉజ్బెకిస్తాన్); ఉదయం గం 9:36 నుంచి టోక్యో: భారత పురుషుల హాకీ జట్టు ఆదివారం అసలు సిసలు పరీక్ష ఎదుర్కోనుంది. సెమీఫైనల్లో స్థానం కోసం టీమిండియా నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో బ్రిటన్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే మన్‌ప్రీత్ సింగ్ బృందం పతకం రేసులోకి వస్తుంది. లేదంటే రిక్తహస్తాలతో ఇంటిముఖం పడుతుంది. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ భారత జట్టు క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. భారత పురుషుల హాకీ జట్టు చివరిసారి 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఆ తర్వాత ఎనిమిదిసార్లు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్నా టీమిండియా ఒక్కసారీ కూడా సెమీఫైనల్ దశకు అర్హత సాధించలేకపోయింది -
భారత మహిళల హాకీ జట్టు విజయం; ఐర్లాండ్ ఓడిపోతేనే
టోక్యో: ఒలింపిక్స్‌లో భాగంగా భారత మహిళల హాకీ జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 4-3 తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగడం విశేషం. తొలి రెండు క్వార్టర్లలో వందన కటరియా రెండు గోల్స్ చేయడంతో 2-1తో భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే మూడో క్వార్టర్లో మాత్రం కాస్త తడబడింది. దీంతో సౌతాఫ్రికా మూడో క్వార్టర్లో రెండు గోల్స్ నమోదు చేసి 3-3తో స్కోరును సమం చేసింది. కీలకమైన నాలుగో క్వార్టర్లో వందన కటారియా మరో గోల్‌తో మెరవడంతో భారత్ 4-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆట ముగిసేలోపూ భారత ఢిపెన్స్ టీమ్ సౌతాప్రికాను మరో గోల్ చేయకుండా నిలువరించడంతో విజయాన్ని అందుకుంది. కాగా భారత్ ఈ విజయంతో లీగ్ దశలో ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు.. మూడు ఓటములతో కలిపి 6 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్ క్వార్టర్స్ చేరాలంటే ఐర్లాండ్- గ్రేట్ బ్రిటన్ల మధ్య జరగనున్న మ్యాచ్‌లో ఐర్లాండ్ ఓడిపోవాలి. అలా కాకుంటే మ్యాచ్ డ్రా అయినా భారత్ క్వార్టర్స్‌కు క్వాలిఫై అవుతుంది. ఒకవేళ ఐర్లాండ్ గెలిస్తే మాత్రం భారత మహిళల జట్టు ఇంటిముఖం పడుతుంది. -
Tokyo Olympics: క్వార్టర్స్‌లో భారత్ ప్రత్యర్థి గ్రేట్ బ్రిటన్
టోక్యో: భారత పురుషుల హాకీ జట్టు ‘టోక్యో’లో చెలరేగుతోంది. ఆతిథ్య జట్టు జపాన్‌పై అదిరే విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–3 గోల్స్ తేడాతో జపాన్‌పై జయభేరి మోగించింది. నాలుగు విజయాలు సాధించిన భారత్ పూల్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచింది. ఆగస్టు 1న జరిగే క్వార్టర్ ఫైనల్లో బ్రిటన్ జట్టుతో టీమిండియా తలపడుతుంది. జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున స్ట్రయికర్ గుర్జంత్ సింగ్ (17వ, 56వ ని.) రెండు గోల్స్ సాధించగా, హర్మన్‌ప్రీత్ సింగ్ (13వ ని.), శంషెర్ సింగ్ (34వ ని.), నీలకంఠ శర్మ (51వ ని.) తలా ఒక గోల్ చేశారు. జపాన్ జట్టులో కెంట తనక (19వ ని.), కొట వతనబె (33వ ని.), కజుమా మురట (59వ ని.) ఒక్కో గోల్ చేశారు. పూల్ ‘ఎ’ నుంచి ఆ్రస్టేలియా, భారత్, అర్జెంటీనా, స్పెయిన్ జట్లు... పూల్ ‘బి’ నుంచి బెల్జియం, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్ జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి. -
జపాన్ ప్లేయర్ యమగుచి తో సింధు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్
-
క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన బాక్సర్ సతీష్ కుమార్
-
French Open: సోఫియాకు షాక్...
పారిస్: ఈసారి సీడెడ్ క్రీడాకారిణులకు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ కలసి రావడంలేదు. తాజాగా మహిళల సింగిల్స్‌లో గత ఏడాది రన్నరప్, నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) కూడా ఇంటిముఖం పట్టింది. దాంతో క్వార్టర్ ఫైనల్ బరిలో టాప్–20లో కేవలం ఇద్దరు మాత్రమే బరిలో మిగిలారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ మరియా సాకరి (గ్రీస్) 6–1, 6–3తో ప్రపంచ ఐదో ర్యాంకర్ సోఫియా కెనిన్‌పై సంచలన విజయం సాధించింది. ఈ గెలుపుతో సాకరి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. అంతేకాకుండా ఈ ఘనత సాధించిన తొలి గ్రీస్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 68 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకరి నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు కెనిన్ సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. 2020లో ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన సోఫియా కెనిన్ ఏకంగా తొమ్మిది డబుల్ ఫాల్ట్‌లు, 32 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. 53 నిమిషాల్లోనే... మరోవైపు అమెరికా టీనేజ్ స్టార్ కోకో గాఫ్ కూడా తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. 17 ఏళ్ల గాఫ్ కేవలం 53 నిమిషాల్లో 6–3, 6–1తో 25వ సీడ్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా)ను చిత్తుగా ఓడించింది. తద్వారా 2006 తర్వాత (నికోల్ వైదిసోవా; చెక్ రిపబ్లిక్–ఫ్రెంచ్ ఓపెన్) ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్స్ చేరిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. జబర్‌తో మ్యాచ్‌లో గాఫ్ నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసింది. తన సర్వీస్‌లో ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–0తో 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్, 2018 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై గెలిచి తన కెరీర్లో తొలి సారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో గాఫ్‌తో క్రిచికోవా ఆడుతుంది. నాదల్ 15వసారి... మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 15వ సారి ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో నాదల్ 7–5, 6–3, 6–0తో జానిక్ సినెర్ (ఇటలీ)పై గెలుపొందాడు. రెండు గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ నాలుగు ఏస్‌లు సంధించాడు. తన ప్రత్యర్థి సర్వీస్‌ను తొమ్మిదిసార్లు బ్రేక్ చేశాడు. 13 సార్లు నెట్‌వద్దకు వచ్చి 12 సార్లు పాయింట్లు గెలిచాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో బెరెటిని (ఇటలీ)తో జొకోవిచ్; ష్వార్ట్‌జ్‌మన్‌తో నాదల్; జ్వెరెవ్‌తో ఫొకినా; ఐదో సీడ్ సిట్సిపాస్‌తో రెండో సీడ్ మెద్వెదెవ్ తలపడతారు. గట్టెక్కిన జొకోవిచ్... పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) 15వసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న 19 ఏళ్ల ఇటలీ టీనేజర్ లొరెంజో ముజెత్తితో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–7 (7/9), 6–7 (2/7), 6–1, 6–0, 4–0తో విజయం సాధించాడు. 3 గంటల 27 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ తొలి రెండు సెట్లను కోల్పోయాడు. ఆ తర్వాత అతను అనూహ్యంగా తేరుకొని వరుసగా రెండు సెట్లు గెలిచాడు. నిర్ణాయక చివరి సెట్లో సెర్బియా స్టార్ 4–0తో ఆధిక్యంలో ఉన్న దశలో లొరెంజో వెన్నునొప్పితో మ్యాచ్ నుంచి వైదొలి గాడు. దాంతో జొకోవిచ్ విజయం ఖాయైమంది. తొలి రెండు సెట్లు కోల్పోయాక గ్రాండ్‌స్లామ్ టోర్నీ మ్యాచ్‌లో జొకోవిచ్ గెలుపొందడం ఇది ఐదో సారి మాత్రమే. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 6–1, 6–1 తో నిషికోరి (జపాన్)పై... ఫొకినా (స్పెయిన్) 6–4, 6–4, 4–6, 6–4తో డెల్బోనిస్ (అర్జెంటీనా)పై... పదో సీడ్ ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 7–6 (11/9), 6–4, 7–5తో లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. -
French Open 2021: టోర్నీ క్వార్టర్ ఫైనల్లో జిదాన్సెక్, బదోస, రిబాకినా
అందరి అంచనాలను తారుమారు చేస్తూ... తమ అద్భుత ఆటతీరుతో అదరగొడుతూ... తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ప్రత్యర్థులను చిత్తు చేస్తూ... అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అంతర్జాతీయ టెన్నిస్‌లో అంతగా పేరొందని ముగ్గురు క్రీడాకారిణులు తామర జిదాన్సెక్, పౌలా బదోస, ఇలెనా రిబాకినా ఫ్రెంచ్ ఓపెన్‌లో ఘన విజయాలతో తమ కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకోగా... 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురిపెట్టిన అమెరికా దిగ్గజం సెరెనా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనాల పర్వం కొనసాగుతోంది. టైటిల్ ఫేవరెట్స్‌గా ఉన్న అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్), 2019 రన్నరప్ మర్కెత వొంద్రుసొవా (చెక్ రిపబ్లిక్) ప్రిక్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోయారు. మరోవైపు ప్రపంచ 85వ ర్యాంకర్ తామర జిదాన్సెక్ (స్లొవేనియా)... ప్రపంచ 35వ ర్యాంకర్ పౌలా బదోస (స్పెయిన్)... ప్రపంచ 22వ ర్యాంకర్ ఇలెనా రిబాకినా (కజకిస్తాన్) తమ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... పదేళ్ల తర్వాత ప్రపంచ 32వ ర్యాంకర్ అనస్తాసియా పావ్లుచెంకోవా (రష్యా) ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్ విభాగంలో ఆదివారం జరిగిన నాలుగు ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఊహించని ఫలితాలు వచ్చాయి. ఇలెనా రిబాకినా 6–3, 7–5తో అమెరికా స్టార్, ఏడో సీడ్ సెరెనా విలియమ్స్‌ను బోల్తా కొట్టించగా... పౌలా బదోస 6–4, 3–6, 6–2తో 20వ సీడ్, 2019 రన్నరప్ వొంద్రుసొవను ఇంటిముఖం పట్టించింది. తామర జిదాన్సెక్ 7–6 (7/4), 6–1తో 54వ ర్యాంకర్ సొరానా కిర్‌స్టియా (రొమేనియా)పై గెలుపొంది ఏదైనా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరిన తొలి స్లొవేనియా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. మరో మ్యాచ్‌లో 31వ సీడ్ పావ్లుచెంకోవా 5–7, 6–3, 6–2తో 15వ సీడ్, రెండుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన అజరెంకాను ఓడించింది. సెరెనాతో 77 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో రిబాకినా తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నెట్‌వద్దకు ఏడుసార్లు దూసుకొచ్చి ఆరుసార్లు పాయింట్లు సాధించింది. మెద్వెదేవ్ మొదటిసారి... పురుషుల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో మెద్వెదేవ్ (రష్యా) 6–2, 6–1, 7–5తో 22వ సీడ్ గారిన్ (చిలీ)పై గెలిచి తొలిసారి ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6–3, 6–2, 7–5తో 12వ సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్)పై నెగ్గాడు. క్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో మార్సెలో అరెవాలో (ఎల్‌సాల్వడార్)–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ నుంచి రోహన్ బోపన్న (భారత్)–స్కుగోర్ (క్రొయేషియా) జంటకు వాకోవర్ లభించింది. దాంతో బోపన్న జంట క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. -
పృథ్వీ షా మెరుపులు
న్యూఢిల్లీ: తన అద్వితీయ ఫామ్‌ను కొనసాగిస్తూ ముంబై జట్టు ఓపెనర్ పృథ్వీ షా మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్రతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అతను ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సూపర్ సెంచరీతో (123 బంతుల్లో 185 నాటౌట్; 21 ఫోర్లు, 7 సిక్స్‌లు) కదంతొక్కాడు. దాంతో ముంబై 9 వికెట్ల తేడాతో సౌరాష్ట్రను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తాజా ప్రదర్శనతో లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత క్రికెటర్‌గా పృథ్వీ షా ఘనత వహించాడు. గతంలో ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని (183 నాటౌట్; శ్రీలంకపై 2005లో) పేరిట ఉండేది. తొలుత సౌరాష్ట్ర 50 ఓవర్లలో 5 వికెట్లకు 284 పరుగులు చేసింది. సమర్థ్ వ్యాస్ (90 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), చిరాగ్ జానీ (53 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) రాణించారు. అనంతరం ముంబై 41.5 ఓవర్లలో వికెట్ నష్టపోయి 285 పరుగులు చేసి గెలుపొందింది. టోర్నీలో అద్భుత ఫామ్‌లో ఉన్న షా ఈ మ్యాచ్‌లోనూ ప్రత్యర్థి బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. అతడికి యశస్వి జైస్వాల్ (104 బంతుల్లో 75; 10 ఫోర్లు, సిక్స్) తోడవ్వడంతో ముంబై ఛేదన సాఫీగా సాగింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 238 పరుగులు జోడించారు. అనంతరం జైస్వాల్ అవుటైనా క్రీజులోకి వచ్చిన ఆదిత్య తారే (20 నాటౌట్; 2 ఫోర్లు)తో కలిసి పృథ్వీ లాంఛనం పూర్తి చేశాడు. ఈ టోర్నీలో షాకిది మూడో సెంచరీ. మరో క్వార్టర్ ఫైనల్లో ఢిల్లీపై ఉత్తరప్రదేశ్ 46 పరుగుల ఆధిక్యంతో నెగ్గింది. తొలుత ఉత్తరప్రదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 280 పరుగులు చేసింది. ఉపేంద్ర యాదవ్ (112; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. కరణ్ శర్మ (83; 11 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. అనంతరం ఢిల్లీ 48.1 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. గురువారం జరిగే సెమీఫైనల్స్‌లో గుజరాత్‌తో ఉత్తరప్రదేశ్; కర్ణాటకతో ముంబై తలపడతాయి. -
ఆంధ్ర అదరహో
ఇండోర్: ఇతర సమీకరణాలపై ఆధారపడకుండా ఆంధ్ర క్రికెట్ జట్టు దర్జాగా విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. జార్ఖండ్‌తో ఆదివారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో గాదె హనుమ విహారి నాయకత్వంలోని ఆంధ్ర జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. జార్ఖండ్ నిర్దేశించిన 140 పరుగుల విజయలక్ష్యాన్ని ఆంధ్ర జట్టు కేవలం 9.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించడం విశేషం. ఓపెనర్లు అశ్విన్ హెబ్బర్ (18 బంతుల్లో 44; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), రికీ భుయ్ (27 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) తొలి బంతి నుంచే జార్ఖండ్ బౌలర్ల భరతం పట్టారు. దాంతో 5.5 ఓవర్లలో తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించాక అశ్విన్ అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విహారి (2 బంతుల్లో 4; ఫోర్), నితీశ్ కుమార్ రెడ్డి (5 బంతుల్లో 15; 2 సిక్స్‌లు), నరేన్‌రెడ్డి (7 బంతుల్లో 16 నాటౌట్; ఫోర్, 2 సిక్స్‌లు) కూడా ఏమాత్రం దూకుడు తగ్గించకుండా ఆడటంతో ఆంధ్ర లక్ష్యం దిశగా బుల్లెట్ వేగంతో దూసుకుపోయింది. జార్ఖండ్ జట్టులోని భారత బౌలర్లు వరుణ్ ఆరోన్ 2 ఓవర్లలో 30 పరుగులు... షాబాజ్ నదీమ్ 2 ఓవర్లలో 26 పరుగులు సమర్పించుకున్నారు. అంతకుముందు జార్ఖండ్ జట్టు 46.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లు హరిశంకర్ రెడ్డి (4/30), షోయబ్ మొహమ్మద్ ఖాన్ (2/30), కార్తీక్ రామన్ (2/38) జార్ఖండ్ పతనాన్ని శాసించారు. ప్రణాళిక ప్రకారం... ఈ మ్యాచ్‌కు ముందు ఆంధ్ర ఎనిమిది పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. క్వార్టర్ ఫైనల్ బెర్త్ నేరుగా దక్కాలంటే గ్రూప్ ‘టాపర్’గా నిలవాలి. ఈ నేపథ్యంలో రన్‌రేట్ మెరుగు పర్చుకోవడానికి ఆంధ్ర జట్టు టాస్ నెగ్గగానే ఛేజింగ్ చేయడానికే మొగ్గు చూపింది. జార్ఖండ్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత ఆఫ్ స్పిన్నర్ షోయబ్ మొహమ్మద్ ఖాన్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో ఓపెనర్ ఉత్కర్ష్ సింగ్ (19; 3 ఫోర్లు)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత జార్ఖండ్ 11 పరుగుల తేడాలో మరో మూడు వికెట్లను కోల్పోయింది. దాంతో 54 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి జార్ఖండ్ కష్టాల్లో పడింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (38; 3 ఫోర్లు) నిలదొక్కుకుంటున్న దశలో షోయబ్ అతడిని అవుట్ చేయడంతో జార్ఖండ్ కోలుకోలేకపోయింది. అనంతరం మీడియం పేసర్లు హరిశంకర్ రెడ్డి, కార్తీక్ రామన్ విజృంభించడంతో జార్ఖండ్ ఇన్నింగ్స్ 139 పరుగులవద్ద ముగిసింది. లక్ష్యం చిన్నది కావడంతో ఆంధ్ర బ్యాట్స్‌మెన్ ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగారు. పది ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదించి రన్‌రేట్‌ను మెరుగుపర్చుకున్నారు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆరు జట్లున్న గ్రూప్ ‘బి’లో ఆంధ్ర, తమిళనాడు, జార్ఖండ్, మధ్యప్రదేశ్ జట్లు 12 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా ఆంధ్ర జట్టు (0.73) ‘టాప్’ ర్యాంక్‌లో నిలిచింది. తమిళనాడు (0.65), జార్ఖండ్ (0.29), మధ్యప్రదేశ్ (–0.46) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. గ్రూప్ ‘ఎ’ నుంచి గుజరాత్... గ్రూప్ ‘సి’ నుంచి కర్ణాటక క్వార్టర్ ఫైనల్ చేరాయి. గ్రూప్ ‘డి’ నుంచి ముంబై, ఢిల్లీ... గ్రూప్ ‘ఇ’ నుంచి సౌరాష్ట్ర, చండీగఢ్ క్వార్టర్ ఫైనల్ రేసులో ఉన్నాయి. వెంకటేశ్ అయ్యర్ 198 పంజాబ్‌తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ 105 పరుగుల తేడాతో గెలిచింది. మధ్యప్రదేశ్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (146 బంతుల్లో 198; 20 ఫోర్లు, 7 సిక్స్‌లు) రెండు పరుగుల తేడాతో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. మధ్యప్రదేశ్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 402 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ 42.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. పంజాబ్ ఓపెనర్ అభిషేక్ శర్మ (49 బంతుల్లో 104; 8 ఫోర్లు, 9 సిక్స్‌లు) మెరుపు సెంచరీ చేశాడు. తన్మయ్, తిలక్ వర్మ సెంచరీలు సూరత్: విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు విజయంతో లీగ్ దశను ముగించినా నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయింది. గోవా తో జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ రెండు పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా హైదరాబాద్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 345 పరుగులు సాధించింది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (150; 19 ఫోర్లు, సిక్స్), తిలక్ వర్మ (128, 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 264 పరుగులు జతచేయడం విశేషం. లిస్ట్–ఎ క్రికెట్లో హైదరాబాద్ తరఫున తొలి వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. 2002లో గోవాపై అంబటి రాయుడు, వినయ్ కుమార్ తొలి వికెట్‌కు 196 పరుగులు జతచేశారు. 346 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గోవా జట్టు 50 ఓవర్లలో 5 వికెట్లకు 343 పరుగులు సాధించి ఓడిపోయింది. ఓపెనర్ ఏక్నాథ్ కేర్కర్ (169 నాటౌట్; 19 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్నేహల్ (112 బంతుల్లో 116; 15 ఫోర్లు) రెండో వికెట్‌కు 225 పరుగులు జోడించారు. ఏక్నాథ్ చివరిదాకా అజేయంగా ఉన్నా గోవాను గెలిపించలేకపోయాడు. 12 పాయింట్లతో గ్రూప్ ‘ఎ’లో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. ‘శత’క్కొట్టిన దేవ్‌దత్, సమర్థ్ రైల్వేస్‌తో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో కర్ణాటక 10 వికెట్ల తేడాతో నెగ్గింది. 285 పరుగుల లక్ష్యాన్ని కర్ణాటక 40.3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. లిస్ట్–ఎ క్రికెట్ లో భారత గడ్డపై ఇదే అత్యధిక ఛేదన. దేవ్‌దత్ పడిక్కల్ (145 నాటౌట్; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు), సమర్థ్ (130 నాటౌట్; 17 ఫోర్లు) అజేయ శతకాలు సాధించారు. అంతకుముందు ప్రథమ్ సింగ్ (129; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ చేయడం తో రైల్వేస్ 9 వికెట్లకు 284 పరుగులు చేసింది. ఢిల్లీలో 7 నుంచి నాకౌట్ మ్యాచ్‌లు విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లు ఈనెల 7 నుంచి ఢిల్లీలో జరగనున్నాయి. మొత్తం ఐదు ఎలైట్ గ్రూప్‌ల్లో ‘టాప్’లో నిలిచిన ఐదు జట్లు... ఆ తర్వాత రెండో స్థానంలో నిలిచిన రెండు అత్యుత్తమ జట్లు క్వార్టర్ ఫైనల్ చేరుకుంటాయి. చివరిదైన ఎనిమిదో బెర్త్ కోసం ఓవరాల్ ఎలైట్ గ్రూప్‌ల్లో ఎనిమిదో స్థానంలో నిలిచిన జట్టు, ప్లేట్ గ్రూప్ విజేత జట్టుతో 7న ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు చివరి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. ఈనెల 8, 9 తేదీల్లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు... 11న సెమీఫైనల్స్... 14న ఫైనల్ జరుగుతాయి. -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. టాప్ సీడ్ ఆష్లే బార్టీ క్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. 25వ సీడ్ కరోలినా ముచోవా చేతిలో 6-1,3-6,2-6 తేడాతో ఓడి బార్టీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి సెట్లో 6-1తో వెనుకబడిన ముచోవా.. రెండో సెట్లో ఫుంజుకొని 3-6తో సెట్‌ను గెలుచుకుంది. కీలకమైన మూడోసెట్‌లోనూ ముచోవా అదే జోరు కొనసాగించి 2-6తో సెట్‌ను కైవసం చేసుకోవడంతో పాటు మ్యాచ్‌ను గెలుచుకొని సెమీస్‌కు ప్రవేశించింది. 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీ, అన్‌సీడెడ్ జెస్సికా పెగులా మధ్య జరిగే మ్యాచ్ విజేతతో ముచోవా సెమీస్‌లో తలపడనుంది. కాగా మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో పదో సీడ్ సెరెనా 6–3, 6–3తో రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై గెలుపొంది సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో నయామి ఒసాకాతో సెరెనా తలపడనుంది. -
ఫేవరెట్ భారత్
పోష్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): డిఫెండింగ్ చాంపియన్ భారత్ అండర్–19 ప్రపంచకప్‌లో కీలక పోరుకు సన్నద్ధమైంది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా నేడు జరిగే క్వార్టర్ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఫామ్, బలా బలాలపరంగా చూస్తే ఈ నాకౌట్ మ్యాచ్‌లోనూ భారత్‌దే పైచేయిగా కనిపిస్తోంది. కంగారూలపై భారత కుర్రాళ్ల గత రికార్డు కూడా అద్భుతంగా ఉంది. 2013 నుంచి అండర్–19 ప్రపంచ కప్‌లో ఆసీస్‌తో భారత్ ఐదు సార్లు తలపడగా నాలుగు సార్లు విజయం సాధించింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇప్పటి వరకు భారత బ్యాట్స్‌మెన్‌లో యశస్వి జైస్వాల్ రెండు అర్ధ సెంచరీలు సాధించగా, దివ్యాంశ్ సక్సేనా, కెప్టెన్ ప్రియమ్ గార్గ్ కూడా ఆకట్టుకున్నారు. హైదరాబాదీ ఠాకూర్ తిలక్ వర్మ కూడా చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడాడు. బౌలింగ్ విభాగంలో పేసర్ కార్తీక్ త్యాగి నిలకడైన ప్రదర్శన కనబర్చగా, లెఫ్టార్మ్ సీమర్ ఆకాశ్ సింగ్, లెఫ్టార్మ్ స్పిన్నర్ అథర్వ కూడా టోర్నీలో ప్రభావం చూపించారు. ఆస్ట్రేలియా బృందంలో కెప్టెన్ మెకెంజీ హార్వీ ప్రధాన బ్యాట్స్‌మన్ కాగా ఆల్‌రౌండర్ కానర్ సలీ ప్రదర్శనపై జట్టు ఆశలు పెట్టుకుంది. అయితే రెండు జట్లలో ప్రధాన పోలికను చూస్తే లెగ్‌స్పిన్నర్లు కీలకంగా మారారు. భారత్ తరఫున సత్తా చాటుతున్న రవి బిష్ణోయ్ 3 మ్యాచ్‌లలో కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. మరో వైపు ఆసీస్ ఆటగాడు తన్వీర్ సంఘా కూడా 10 వికెట్లు తీశాడు. వీరిద్దరిలో ఎవరు రాణిస్తారనేది ఆయా జట్టు విజయావకాశాలను ప్రభావితం చేయవచ్చు. -
శ్రీకాంత్‌కు నిరాశ
లక్నో: భారత స్టార్ షట్లర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ 2019 సీజన్‌ను ఒక్క టైటిల్ నెగ్గకుండానే ముగించాడు. ఈ ఏడాది చివరి వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్ సయ్యద్ మోదీ ఓపెన్‌లో శ్రీకాంత్ పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ శ్రీకాంత్ 18–21, 19–21తో ప్రపంచ 43వ ర్యాంకర్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయాడు. సన్ వాన్ హోతో 11 సార్లు తలపడిన శ్రీకాంత్ ఏడుసార్లు ఓడిపోవడం గమనార్హం. మరోవైపు జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో సౌరభ్ 21–19, 21–16తో గతంలో మూడుసార్లు ప్రపంచ జూనియర్ చాంపియన్‌గా నిలిచిన కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)పై గెలిచాడు. మహిళల సింగిల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి రితూపర్ణ దాస్ 24–26, 21–10, 21–19తో భారత్‌కే చెందిన శ్రుతి ముందాడపై గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో ఫిట్టాయపోర్న్ చైవాన్ (థాయ్‌లాండ్)తో రితూపర్ణ దాస్; హివో క్వాంగ్ హీ (దక్షిణ కొరియా)తో సౌరభ్ వర్మ తలపడతారు. -
సింధు జోరుకు బ్రేక్
చాంగ్జౌ (చైనా): ప్రపంచ చాంపియన్ హోదాలో... మరో ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టైటిల్ లక్ష్యంగా చైనా ఓపెన్‌లో అడుగుపెట్టిన పీవీ సింధు ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ర్యాంకింగ్స్‌లో తన కంటే కింది స్థానంలో ఉన్న పొర్న్‌పవీ చొచువోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడి నిరాశ పరిచింది. గురువారం జరిగిన వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో సింధు 21–12, 13–21, 19–21తో ప్రపంచ 15వ ర్యాంక్ షట్లర్ చొచువోంగ్ చేతిలో కంగుతింది. ఆధిక్యం ప్రదర్శించినా... ప్రస్తుత ఫామ్ దృష్ట్యా చొచువోంగ్పై సింధు విజయం ఖాయం అని అందరూ అనుకున్నారు. దీనికి తగ్గట్లే చక్కటి స్మాష్‌లతో విరుచుకుపడ్డ సింధు... వరుసగా పాయింట్లు సాధించి 21–12తో తొలి గేమ్‌ను గెల్చుకుంది. రెండో గేమ్ నుంచి మాత్రం సీన్ రివర్స్ అయింది. అనూహ్యంగా గాడి తప్పిన సింధు ఆట ప్రత్యర్థికి వరంలా మారింది. వరుసగా 5 పాయింట్లు సాధించిన చొచువోంగ్ 5–1తో, ఆ తర్వాత మరోసారి వరుసగా ఆరు పాయింట్లు కొల్లగొట్టి 15–7తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ పట్టును నిలుపుకున్న థాయ్‌లాండ్ షట్లర్ రెండో గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇది ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో తొలి 12 పాయింట్ల తర్వాత ఇద్దరూ సమంగా నిలిచారు. ఈ దశలో సింధు వరుసగా పాయింట్లు సాధిస్తూ 19–15తో ఆధిక్యంలో నిలిచింది. విజయానికి కేవలం రెండు పాయింట్ల దూరంలో ఉన్న సమయంలో థాయ్ అమ్మాయి అనూహ్యంగా పుంజుకుంది. చొచువోంగ్ వరుసగా 6 పాయింట్లు సాధించి సింధు కళ్ల ముందే మ్యాచ్‌ను లాగేసుకుంది. క్వార్టర్స్‌లో సాయి ప్రణీత్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్ 21–19, 21–19తో లూ గాంగ్ జూ (చైనా)పై విజయం సాధించి క్వార్టర్స్‌లో ప్రవేశించాడు. మరో భారత అటగాడు పారుపల్లి కశ్యప్ 21–23, 21–15, 12–21తో ఆంథోని సింసుక గింటింగ్ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడాడు. డబుల్స్‌లోనూ నిరాశే.. డబుల్స్ విభాగాల్లో పోటీ పడుతున్న భారత జోడీలు రెండో రౌండ్లో ఓడి నిరాశ పరిచాయి. పరుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి (భారత్) 19–21, 8–21తో తకెషి కముర– కిగో సొనొడ (జపాన్) చేతిలో వరుస గేమ్‌లలో చిత్తయ్యారు. అనంతరం జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లోనూ సాత్విక్ సాయిరాజ్– అశ్విని పొన్నప్ప ద్వయం 11–21, 21–16, 12–21తో ప్రపంచ నాలుగో ర్యాంక్ యూకి కనెకొ– మిసాకి మట్సుటొమొ (జపాన్) జంట చేతిలో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి– అశ్విని పొన్నప్ప జోడి 12–21, 17–21తో మిసాకి మట్సుటొ మొ– అయక తకహాషి (జపాన్) చేతిలో ఓడింది. -
సింధు ఔట్.. సెమీస్‌లో ప్రణీత్
జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ పోరాటం ఒక్కడి చేతుల్లోనే మిగిలుంది. తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్ అలవోక విజయంతో సెమీఫైనల్ చేరగా... స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు ఆట క్వార్టర్స్‌లోనే ముగిసింది. టోక్యో: ఈ సీజన్లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు మళ్లీ టైటిల్ వేటకు దూరమైంది. జపాన్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నమెంట్ కూడా ఆమెకు అందని ద్రాక్షగా ముగిసింది. ఈ టోర్నీ మహిళల ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ స్టార్ సింధు క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. మరో వైపు ఈ టోర్నీలో అసాధారణ ఆటతీరుతో ముందడుగు వేస్తున్న సాయి ప్రణీత్ టైటిల్‌కు రెండడుగుల దూరంలో నిలిచాడు. పురుషుల సింగిల్స్‌లో ఈ అన్‌సీడెడ్ ఆటగాడు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీకి నిరాశే ఎదురైంది. అలవోక విజయంతో... పురుషుల సింగిల్స్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాయిప్రణీత్ వరుస గేముల్లో అలవోక విజయం సాధించాడు. అతను 21–12, 21–15తో ఇండోనేసియాకు చెందిన టామి సుగియార్తోను ఇంటిదారి పట్టించాడు. కేవలం 36 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించాడు. తొలి గేమ్‌లో సుగియార్తోనే ఖాతా తెరిచినా... జోరు మాత్రం ప్రణీత్‌దే! ఇండోనేసియా ఆటగాడు ఒక పాయింట్ చేయగానే... సాయిప్రణీత్ వరుసగా 5 పాయింట్లు సాధించాడు. అక్కడి నుంచి మొదలైన జోరుకు ఏ దశలోనూ సుగియార్తో ఎదురు నిలువలేకపోయాడు. ప్రత్యర్థి 10 పాయింట్లు సాధించేలోపే 19 పాయింట్లతో తెలుగు షట్లర్ గెలుపు తీరం చేరాడు. రెండో గేమ్ కూడా ఇందుకు భిన్నంగా ఏమీ జరగలేదు. ఆరంభం నుంచే సాయిప్రణీత్ కోర్టులో చురుగ్గా కదంతొక్కడంతో పాయింట్ల చకచకా వచ్చేశాయి. రెండు సార్లు 5–4, 12–10 స్కోరు వద్ద ప్రణీత్‌కు చేరువైనప్పటికీ... సుగియార్తోను ఓడించేందుకు భారత ఆటగాడికి ఎంతోసేపు పట్టలేదు. సింధు మరోసారి... మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ షట్లర్ ఐదో సీడ్ సింధు 18–21, 15–21తో నాలుగో సీడ్ యామగుచి (జపాన్) చేతిలో పరాజయం చవిచూసింది. తొలి గేమ్‌లో చక్కని పోరాటపటిమ కనబరిచిన సింధు... రెండో గేమ్‌లో ఆ ఆటతీరు కొనసాగించలేకపోయింది. చివరకు 50 నిమిషాల్లో ప్రత్యర్థి ధాటికి ఇంటిదారి పట్టింది. ఈ సీజన్లో సింధు ఒకే ఒక్క టోర్నీ (ఇండోనేసియా ఓపెన్)లో ఫైనల్ చేరింది. అంతిమ పోరులో యామగుచి... సింధును ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది. తాజాగా ప్రతీకారం తీర్చుకునే అవకాశం సింధుకు వచ్చింది. కానీ తెలుగుతేజం కసితీరా ఆడలేకపోయింది. పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో సాత్విక్–చిరాగ్ షెట్టి ద్వయం 19–21, 18–21తో రెండో సీడ్ తకెషి కముర– కెయిగొ సొనొద (జపాన్) జంట చేతిలో ఓడింది. -
క్వార్టర్స్‌లో నిఖత్
న్యూఢిల్లీ: థాయ్‌లాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్, మొహమ్మద్ హుసాముద్దీన్ (56 కేజీలు) శుభారంభం చేశారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల 51 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరగా... హుసాముద్దీన్ రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్లో ‘బై’ పొందిన నిఖత్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 5–0తో తస్మీన్ బెన్నీ (న్యూజిలాండ్)పై గెలిచింది. హుసాముద్దీన్ తొలి రౌండ్లో 4–1తో యుతాపోంగ్ థోంగ్డి (థాయ్‌లాండ్)ను ఓడించాడు. -
బార్టీ ఆట ముగిసింది
లండన్: ఎర్ర మట్టి కోర్టులపై చెలరేగి ఫ్రెంచ్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచిన యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) పచ్చిక కోర్టులపై మాత్రం తడబడింది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ హోదాలో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో బరిలోకి దిగిన యాష్లే బార్టీ ప్రస్థానం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. యాష్లే బార్టీతోపాటు మూడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), ఆరో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) కూడా ప్రిక్వార్టర్స్ దాటకుండానే ఇంటిముఖం పట్టారు. 15 ఏళ్ల అమెరికా రైజింగ్ స్టార్ కోరి గాఫ్ సంచలన ప్రదర్శనకు ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) అడ్డుకట్ట వేసింది. హలెప్తోపాటు ఎనిమిదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఏడుసార్లు చాంపియన్ సెరెనా విలియమ్స్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గతేడాది వింబుల్డన్‌లో మూడో రౌండ్లో ఓడిన బార్టీ ఈ ఏడాది ఒక అడుగు ముందుకేసింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 23 ఏళ్ల బార్టీ 6–3, 2–6, 3–6తో అన్‌సీడెడ్ అలీసన్ రిస్కీ (అమెరికా) చేతిలో కంగుతింది. తొలి సెట్లో ప్రభావం చూపించిన ఈ ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ తర్వాత రెండు సెట్లలోనూ నిరాశపరిచింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో హలెప్ 6–3, 6–3తో కోరి గాఫ్‌పై అలవోక విజయం సాధించింది. అమెరికా టెన్నిస్ దిగ్గజం, 11వ సీడ్ సెరెనా 6–2, 6–2తో వరుస సెట్లలో కార్లా స్వారెజ్ నవారో (స్పెయిన్)పై, స్వితోలినా 6–4, 6–2తో పెట్రా మార్టిక్ (క్రొయేషియా)పై గెలుపొందారు. మూడో సీడ్ ప్లిస్కోవా 6–4, 5–7, 11–13తో కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్) చేతిలో... ఆరో సీడ్ క్విటోవా 6–4, 2–6, 4–6తో 19వ సీడ్ జొహనా కొంటా (బ్రిటన్) చేతిలో కంగుతింది. సీడెడ్ ఆటగాళ్ల జోరు... పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా)తోపాటు మాజీ చాంపియన్స్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జొకోవిచ్ 6–3, 6–2, 6–3తో ఉగో హంబర్ట్ (ఫ్రాన్స్)పై, మూడో సీడ్ నాదల్ 6–2, 6–2, 6–2తో జొవో సొసా (పోర్చుగల్)పై, రెండో సీడ్ ఫెడరర్ 6–1, 6–2, 6–2తో బెరెటిని (ఇటలీ)పై సునాయాస విజయం సాధించారు. ఇతర మ్యాచ్‌ల్లో 21వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 7–6 (11/9), 2–6, 6–3, 6–4తో ఫెర్నాండో వెర్డాస్కో (స్పెయిన్)పై, 23వ సీడ్ బాటిస్ట అగుట్ (స్పెయిన్) 6–3, 7–5, 6–2తో బెనొయిట్ పెయిర్ (ఫ్రాన్స్)పై నెగ్గారు. పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో దివిజ్ శరణ్ (భారత్)–మార్సెలో డెమోలైనర్ (బ్రెజిల్) జంట 5–7, 7–6 (8/6), 6–7 (3/7), 3–6తో టాప్ సీడ్ కుబోట్ (పోలాండ్)–మార్సెలో మెలో (బ్రెజిల్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
జొకోవిచ్ కొత్త చరిత్ర
పారిస్: ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఓపెన్ శకంలో వరుసగా పదేళ్లు ఈ టోర్నీలో కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–2, 6–2తో జాన్ లెనార్డ్ స్ట్రాఫ్ (జర్మనీ)పై అలవోకగా గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. 2005 నుంచి క్రమం తప్పకుండా ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న జొకోవిచ్ 2010 నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు క్వార్టర్ ఫైనల్‌కు, రెండుసార్లు సెమీఫైనల్‌కు, నాలుగుసార్లు ఫైనల్‌కు చేరుకున్నాడు. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో జొకోవిచ్ ఆడతాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జ్వెరెవ్ 3–6, 6–2, 6–2, 7–6 (7/5)తో తొమ్మిదో సీడ్ ఫాగ్నిని (ఇటలీ)పై... ఏడో సీడ్ నిషికోరి (జపాన్) 6–2, 6–7 (8/10), 6–2, 6–7 (8/10), 7–5తో బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్)పై, నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–4, 6–4, 6–2తో మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై గెలుపొంది క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పెయిర్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణాయక ఐదో సెట్లో నిషికోరి 1–4, 3–5తో వెనుకబడినప్పటికీ పుంజుకొని నెగ్గడం విశేషం. క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్‌తో నిషికోరి తలపడతాడు. క్వార్టర్స్‌లో హలెప్, కీస్ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సిమోనా హలెప్ (రొమేనియా), ఎనిమిదో సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), 14వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా), అన్‌సీడెడ్ అనిసిమోవా (అమెరికా) క్వార్టర్ ఫైనల్లోకి చేరారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో హలెప్ 6–1, 6–0తో స్వియాటెక్ (పోలాండ్)పై, యాష్లే బార్టీ 6–3, 3–6, 6–0తో సోఫియా కెనిన్ (అమెరికా)పై, కీస్ 6–2, 6–4తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై, 17 ఏళ్ల అనిసిమోవా 6–3, 6–0తో క్వాలిఫయర్ అలియోనా బొల్సోవా (స్పెయిన్)పై విజయం సాధించారు. మూడో రౌండ్లో టాప్ సీడ్ నయోమి ఒసాకా (జపాన్)పై నెగ్గిన సినియకోవా, అమెరికా దిగ్గజం సెరెనాను ఓడించిన సోఫియా కెనిన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మాత్రం తడబడ్డారు. -
క్వార్టర్స్‌లో దివిజ్–బోపన్న జంట
పుణే: టాటా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో టాప్ సీడ్ దివిజ్ శరణ్–రోహన్ బోపన్న (భారత్) జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో దివిజ్–బోపన్న ద్వయం 6–1, 6–2తో రాడూ అల్బోట్ (మాల్డోవా)–మాలిక్ జజిరీ (ట్యూని షియా) జోడీపై విజయం సాధించింది. 50 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జంట నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి జంట సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరో మ్యాచ్‌లో లియాండర్ పేస్ (భారత్)–మిగుయెల్ వరేలా (మెక్సికో) ద్వయం 6–3, 6–4తో మరేరో (స్పెయిన్)–కాస్టిలో (చిలీ) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లో దివిజ్–బోపన్న జోడీతో పోరుకు సిద్ధమైంది. సింగిల్స్ విభాగంలో భారత ఆటగాళ్లు రామ్‌కుమార్ రామనాథన్ ముందంజ వేయగా... అర్జున్ ఖడే నిష్క్రమించాడు. తొలి రౌండ్లో రామ్‌కుమార్ 4–6, 6–4, 6–3తో మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్)పై నెగ్గగా... అర్జున్ ఖడే 5–7, 6–7 (6/8)తో లాస్లో జెరీ (సెర్బియా) చేతిలో ఓడిపోయాడు. క్వాలిఫయింగ్ నుంచి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించిన ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని కాలి గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. -
వరల్డ్ చాంపియన్‌షిప్: సైనా కథ ముగిసింది!
నాన్జింగ్ (చైనా): బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పదో సీడ్ భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కథ ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో వరల్డ్ నంబర్ 8 క్రీడాకారిణి ఒలింపిక్ విజేత కరోలినా మారిన్(స్పెయిన్) చేతిలో సైనా చిత్తుగా ఓడింది. అద్భుత ప్రదర్శనతో మారిన్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పటిదాకా ఈ మెగా టోర్నీలో ఓ సారి రజతం (2015), మరో సారి కాంస్యం (2017) సాధించిన సైనా మారిన్‌కు ఏ మాత్రం పోటీనివ్వలేకపోయింది. ఆద్యంతం దూకుడుగా ఆడిన మారిన్ వరుస సెట్లలో ఆధిపత్యం ప్రదర్శించి 21-6, 21-11 తేడాతో విజయం సొంతం చేసుకుంది. మారిన్ దెబ్బకు కేవలం 31 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. కోర్టులో చిరుతలా కదిలిన మారిన్ మెరుపు షాట్లకు సైనా సమాధానం ఇవ్వలేకపోయింది. 2015లో వీరిద్దరూ ఈ చాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడగా అప్పుడు కూడా కరోలినాదే పైచేయి సాధించింది. కోర్టులో మారిన్ అత్యంత వేగంగా కదిలిందని, అద్బుతమైన ప్రదర్శన చేసిందని మ్యాచ్ అనంతరం సైనా కొనియాడింది. ఆమె వేగంతో ఏం చేయాలో తనకు అర్థం కాలేదని, ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదని సైనా చెప్పుకొచ్చింది. మిక్స్డ్ డబుల్స్‌లో నిరాశే.. మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–సాత్విక్ సాయిరాజ్ జోడీ సైతం పరాజయం పాలైంది. టాప్ సీడ్ జెంగ్ సివే– హుయంగ్ యకిఒంగ్ (చైనా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 21-17, 21-10 తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
సైనా, సింధు క్వార్టర్స్‌కు...
నాన్జింగ్ (చైనా): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ దూసుకెళ్తున్నారు. పతకం వేటలో ఉన్న వీళ్లిద్దరు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని–సాత్విక్ జోడీ కూడా క్వార్టర్స్ చేరింది. అయితే పురుషుల సింగిల్స్‌లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సాయిప్రణీత్ ముందంజ వేయగా, కిడాంబి శ్రీకాంత్ ఆట ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. రచనోక్‌కు సైనా చెక్... ఇప్పటిదాకా ఈ మెగా టోర్నీలో ఓ సారి రజతం (2015), మరో సారి కాంస్యం (2017) సాధించిన భారత వెటరన్ షట్లర్, పదో సీడ్ సైనా నెహ్వాల్ మాజీ చాంపియన్ రచనోక్ ఇంతనోన్ (థాయ్‌లాండ్)ను వరుస గేముల్లో కంగుతినిపించింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆమె 21–16, 21–19తో రచనోక్‌ను ఇంటిదారి పట్టించింది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ సింధు 21–10, 21–18తో 9వ సీడ్ సంగ్ జి హ్యూన్ (కొరియా)పై విజయం సాధించింది. క్వార్టర్స్‌లో సైనా... ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో, సింధు... 8వ సీడ్ నొజొమి ఒకుహర (జపాన్)తో తలపడతారు. శ్రీకాంత్ కథ ముగిసె... పురుషుల సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్, ఐదో సీడ్ కిడాంబి శ్రీకాంత్ కథ ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. మలేసియా అన్‌సీడెడ్ ఆటగాడు డారెన్ ల్యూ 21–18, 21–18తో వరుస గేముల్లో శ్రీకాంత్‌ను కంగుతినిపించాడు. మరో మ్యాచ్‌లో సాయిప్రణీత్ 21–13, 21–11తో హన్స్ క్రిస్టియాన్ సోల్బెర్గ్ (డెన్మార్క్)పై అలవోక విజయం సాధించాడు. మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–సాత్విక్ సాయిరాజ్ జోడీ 20–22, 21–14, 21–6తో ఏడో సీడ్ గొ సూన్ హూత్ – షెవొన్ జెమీ లాయ్ (మలేసియా) జంటపై గెలిచింది. క్వార్టర్స్‌లో ప్రణీత్‌కు కెంటో మొమొట (జపాన్) రూపంలో క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురవగా, అశ్విని–సాత్విక్ జంట... టాప్ సీడ్ జెంగ్ సివే– హుయంగ్ యకిఒంగ్ (చైనా) ద్వయాన్ని ఎదుర్కొంటుంది. -
టెన్నిస్ బంతితో క్రికెట్ తరహా ఢిఫెన్స్
-
పెను సంచలనం.. బ్రెజిల్ అవుట్
ఫిఫా వరల్డ్‌కప్ 2018లో మరో పెను సంచలనం చోటు చేసుకుంది. హాట్ ఫెవరేట్ బ్రెజిల్ ఘోర ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. కజస్ ఏరెనా వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో బెల్జియం చేతిలో 2-1 తేడాతో సాంబా జట్టు ఘోర పరాభవం చవిచూసింది. దీంతో టోర్నీలో బ్రెజిల్ కథ ముగియగా, బెల్జియం సెమీస్‌కు చేరుకుంది. మంగళవారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగే సెమీస్‌లో ఫ్రాన్స్‌తో బెల్జియం తలపడనుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
క్వార్టర్స్‌లో కశ్యప్ ఓటమి
ఫ్రాన్స్: ఓర్లీన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ పోరాటం క్వార్టర్స్‌లో ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఐదో సీడ్ కశ్యప్ 18–21, 14–21తో మూడో సీడ్ రస్మస్ గెమ్కే (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. -
నాకౌట్ దశకు ఆంధ్ర
చెన్నై: విజయ్ హజారే టోర్నీలో ఆంధ్ర క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తూ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. గుజరాత్‌తో సోమవారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర తొమ్మిది వికెట్లతో గెలిచింది. ఈ టోర్నీలో వరుసగా ఐదో విజయం నమోదు చేసిన ఆంధ్ర 20 పాయింట్లతో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. ముంబై 16 పాయింట్లతో ఇదే గ్రూప్ నుంచి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 251 పరుగుల లక్ష్యాన్ని కేవలం వికెట్ నష్టపోయి 45.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ శ్రీకర్ భరత్ (132 బంతుల్లో 106 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేయగా... మరో ఓపెనర్ అశ్విన్ హెబర్ (108 బంతుల్లో 99; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) కేవలం పరుగు తేడాతో శతకాన్ని చేజార్చుకున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 192 పరుగులు జోడించడం విశేషం. అశ్విన్ ఔటయ్యాక కెప్టెన్ విహారి (35 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి భరత్ ఆంధ్ర విజయాన్ని ఖాయం చేశాడు. అంతకుముందు గుజరాత్ సరిగ్గా 50 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. పార్థివ్ పటేల్ (39; 7 ఫోర్లు), రిజుల్ భట్ (74; 2 ఫోర్లు), పియూష్ చావ్లా (56; 6 ఫోర్లు, ఒక సిక్స్) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో కార్తీక్ రామన్ (4/32), బండారు అయ్యప్ప (2/68), నరేన్ రెడ్డి (2/35) ఆకట్టుకున్నారు. -
అండర్–19 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లోకి భారత్
మౌంట్ మాంగనీ: వరుసగా రెండో విజయంతో భారత జట్టు అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పసికూన పపువా న్యూ గినియాతో మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత కెప్టెన్ పృథ్వీ షా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన పపువా న్యూ గినియా జట్టు భారత బౌలర్ల ధాటికి 21.5 ఓవర్లలో కేవలం 64 పరుగులకే కుప్పకూలింది. ఒవియా సామ్ (15), సిమోన్ అతాయ్ (13), సినక అరువా (12) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్ అయ్యారు. భారత స్పిన్నర్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అనుకూల్ రాయ్ 14 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం భారత్ 8 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 67 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ పృథ్వీ షా (36 బంతుల్లో 57 నాటౌట్; 12 ఫోర్లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ చేయగా... మన్‌జ్యోత్ కాల్రా (9 నాటౌట్) అతనికి అండగా నిలిచాడు. భారత్ తమ తదుపరి మ్యాచ్ ఈనెల 19న జింబాబ్వేతో ఆడుతుంది. -
ఉత్కంఠంగా ఖోఖో క్వార్టర్స్ ఫైనల్స్
తుని : స్థానిక శ్రీప్రకాష్‌లో జరుగుతున్న సీబీఎస్ఈ క్లస్టర్–7 అంతర్రాష్ట్రlఖోఖో పోటీలు ఉత్కంఠంగా జరుగుతన్నాయి. తెలంగాణా, ఆంధ్రాలకు చెందిన 350 మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. మంగళవారం క్వార్టర్ ఫైనల్స్ నువ్వా నేనా అన్న రీతిలో జరిగాయి. క్వార్టర్స్‌లో విజ్ఞాస్ హైదరాబాద్, హార్వస్ట్ స్కూల్ ఖమ్మం , శ్రీ వివేకానంద స్కూల్ తెనాలి, బ్లూమింగ్ మైండ్స్ ఖమ్మం, కార్మెల్ స్కూల్ మంచిర్యాల, చిన్మయి స్కూల్ హైదరాబాదు, శుభ నికేతన కాకినాడ, శ్రీ ప్రకాష్ విద్యానికేతిన్ పాయకరావు పేట మధ్య పోటీ రసవత్తరంగా జరిగింది. సెమీ ఫైనల్స్‌కు శ్రీ ప్రకాష్ విద్యానికేతిన్, పాయకరావుపేట, హార్వస్ట్ స్కూల్ ఖమ్మం, కార్మెల్ స్కూల్ మంచిర్యాల, శ్రీవివేకానంద స్కూల్ తెనాలి జట్లు చేరుకున్నాయని ప్రిన్సిపాల్ ఎంవీఎస్ఎస్ మూర్తి తెలిపారు. ఫైనల్స్‌కు చేరిన జట్లు జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధిస్తాయని కన్వీనర్ పరేష్ కుమార్దాస్ తెలిపారు. స్పోర్ట్ప్ ఆథారిటీ పర్యవేక్షులు ఎం.వేంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని మూర్తి వివరించారు. -
గెలుపే లక్ష్యంగా ...
సాగిన క్వార్టర్ ఫైనల్స్ సెమీస్‌కు చేరిన రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు కొత్తపేట : రాష్ట్రస్థాయి అండర్–19 షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ –2016 పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన వారు జాతీయ పోటీలకు ఎంపిక కానుండడంతో క్రీడాకారులు గెలుపే లక్ష్యంగా తలపడుతున్నారు. కొత్తపేట రెడ్డి అనసూయమ్మ మెమోరియల్ ఇండోర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు తుది దశకు చేరాయి. శనివారం సెమీఫైనల్, ఫైనల్ పోటీలు జరగనున్నాయి. శుక్రవారం క్వార్టర్ ఫైనల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన పలువురు సెమీస్‌కు అర్హత సాధించారు. బాలికల సింగిల్స్ విభాగంలో అక్షిత(తూర్పుగోదావరి), సబీనా బేగమ్ (కర్నూలు), ప్రీతికా(విజయనగరం), నిషితా వర్మ (విశాఖపట్నం), బాలుర విభాగంలో జశ్వంత్ (చిత్తూరు), దత్తాత్రేయ రెడ్డి(కడప), ప్రణయ్(వైజాగ్), వేదవ్యాస్ (ప్రకాశం) సెమీ ఫైనల్స్‌కు చేరారు. డబుల్స్ విభాగంలో.. బాలికల డబుల్స్ విభాగంలో అక్షిత(తూర్పుగోదావరి), ప్రీతి (విజయనగరం) జంట, నివేదిత, లక్ష్మి (విశాఖపట్నం) జంట, నవ్యసరూప, శన్విత (తూర్పు గోదావరి), అసియా, షబ్నాబేగం (కర్నూలు)జోడీ సెమీస్‌కు చేరింది. బాలుర డబుల్స్ విభాగంలో డి.నితిన్ (తూర్పు గోదావరి), డి.హరికృష్ణ (పశ్చిమ గోదావరి) జంట, బషీర్, గౌస్ (నెల్లూరు), సాయికిషోర్ (పశ్చిమ గోదావరి), సాయి కిరణ్ (విశాఖపట్నం) జంటలు సెమీస్‌కు చేరాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో సత్తా.. క్వార్టర్ ఫైనల్స్‌లో పలువురు తమ ప్రతిభ చాటారు. ముఖ్యంగా బాలుర సింగిల్స్ విభాగంలో ఆర్.ప్రణవ్, పి.చంద్రపట్నాయక్ (విశాఖపట్నం)పై విజయం సాధించాడు. బాలుర డబుల్స్ విభాగంలో సాయికిషోర్ (పశ్చిమ గోదావరి), సాయి కిరణ్ (విశాఖపట్నం)జోడీ కేఆర్కే షరీఫ్, ప్రవీణ్ (విశాఖపట్నం)లు 21–16, 25–23 తేడాతో విజయం సాధించారు. ఈ రెండు మ్యాచ్‌లు ఉత్కంఠ భరితంగా సాగాయి. ఈ పోటీలు గ్రామీణ క్రీడాకారులకు స్ఫూర్తి గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి టోర్నమెంట్స్ ఈ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించినట్టు ఉం టుంది. ఇక్కడికి వచ్చే స్టేట్, నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ప్రతిభను తిలకించి తామూ వారిలా తయారు కావాలనే కోరిక కలుగుతుం ది. అంతే కాక ఈ ప్రాంతానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. – ఎస్ సూరిబాబు, రిఫరీ, ఏపీబీటీఓ ప్రెసిడెంట్, శ్రీకాకుళం జాతీయ స్థాయిలో టోర్నీ ఏర్పాట్లు ఇంతవరకూ ఎక్కడా లేని విధంగా జాతీయ స్థాయిలో పోటీలకు ఏర్పాట్లు చేశారు. నిర్వాహకులు క్రీడాకారులు, కోచ్‌లను మర్యాద పూర్వకంగా చూసుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి ఈ టోర్నమెంట్ వేదిక. దీనిని కొత్తపేటలో నిర్వహించడం ఈ ప్రాంతానికే గర్వకారణం. డాక్టర్ కె రమేష్, రిఫరీ, ఏపీబీటీఓ సెక్రటరీ, ప్రకాశం జిల్లా ఒలింపిక్స్ విన్నర్ కావడమే లక్ష్యం గోపీచంద్ అకాడమీలో మూడున్నరేళ్లుగా శిక్షణ పొందుతూ గత ఏడాది అండర్ 17,19 స్టేట్ విన్నర్‌గా నిలిచాను. షటిల్ బ్యాడ్మిం టన్లో ఇండియా తరఫున అంతర్జాతీయ పోటీ ల్లో పాల్గొన్న మొదటి ఉమెన్, గోపీచంద్ సతీమణి పీవీ లక్ష్మి స్ఫూర్తితో ఆడుతున్నా. ఒలింపిక్స్ విన్నర్ కావాలన్నదే నా లక్ష్యం. ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఎ అక్షిత, క్రీడాకారిణి, రాజమహేంద్రవరం ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తా.. గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతూ రెండు సార్లు నేషనల్స్ విన్నర్‌గా నిలిచాను. షటిల్ బ్యాడ్మింటన్ అంతర్జాతీయ క్రీడాకారుడు కె శ్రీకాంత్ స్ఫూర్తితో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సా ధిస్తాననే నమ్మకంతో ఆడుతున్నా. నేషనల్ స్థాయి లో ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దండు యశ్వంత్, క్రీడాకారుడు, చిత్తూరు జిల్లా -
క్వార్టర్స్ లో భారత్
♦ అండర్-19 ప్రపంచకప్ ♦ న్యూజిలాండ్‌పై విజయం మిర్పూర్: అండర్-19 ప్రపంచకప్‌లో దూసుకెళుతున్న యువ భారత్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. సమష్టి కృషితో రాణించిన కుర్రాళ్లు శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. మొదట సర్ఫరాజ్ ఖాన్ (80 బంతుల్లో 74; 9 ఫోర్లు), రిషబ్ పంత్ (83 బంతుల్లో 57; 7 ఫోర్లు; 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగగా బౌలింగ్‌లో మహిపాల్ లొమ్రోర్ (5/47), మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవేశ్ ఖాన్ (4/32) కివీస్ ఇన్నింగ్స్‌ను పేకమేడలా కూల్చారు. దీంతో భారత్‌కు 120 పరుగుల తేడాతో భారీ విజయం దక్కింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 258 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (4) మరోసారి విఫలం కావడంతో పాటు 19 పరుగులకే జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సర్ఫరాజ్ ఖాన్.. రిషబ్‌తో కలిసి మూడో వికెట్‌కు 89 పరుగులు, అర్మాన్ జాఫర్ (49 బంతుల్లో 46; 2 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 48 పరుగులు జోడించాడు. చివర్లో లొమ్రోర్ (42 బంతుల్లో 45; 3 ఫోర్లు; 1 సిక్స్) వేగంగా ఆడాడు. గిబ్సన్‌కు మూడు.. స్మిత్, రచిన్ రవీంద్రలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ను భారత్ బౌలర్లు బెంబేలెత్తించడంతో 31.3 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. 16 పరుగులకే తొలి నాలుగు వికెట్లను కూల్చిన అవేశ్ కివీస్‌ను చావుదెబ్బ తీశాడు. ఆ తర్వాత మిగతా బ్యాట్స్‌మెన్ పని లొమ్రోర్ చూసుకోడంతో కివీస్ కోలుకోలేకపోయింది. లియోపార్డ్ (40 బంతుల్లో 40; 3 ఫోర్లు; 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. వరుసగా రెండు విజయాలతో భారత్ క్వార్టర్స్‌కు చేరింది. లీగ్‌లో ఆఖరి మ్యాచ్‌లో సోమవారం నేపాల్‌తో తలపడుతుంది. క్వార్టర్స్‌లో నేపాల్, పాక్, లంక సంచలన ఆటతీరుతో జోరు చూపిస్తున్న నేపాల్ జట్టు అండర్-19 ప్రపంచకప్‌లో క్వార్టర్స్‌కు చేరింది. శనివారం ఐర్లాండ్‌పై ఈ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గింది. నేపాల్ బౌలర్ సందీప్ లమిచ్చానే టోర్నీలో తొలి హ్యాట్రిక్ నమోదు చేయడంతో పాటు మొత్తం ఐదు వికెట్లు తీశాడు. శ్రీలంక జట్టు 33 పరుగుల తేడాతో అఫ్ఘాన్‌పై.. పాక్ ఏడు వికెట్ల తేడాతో కెనడాపై గెలిచి క్వార్టర్స్‌కు చేరాయి. -
విజయవాడ కాలేజ్‌లో స్పెల్‌బీ క్వార్టర్ ఫైనల్
-
క్వార్టర్స్‌లో సాకేత్-సనమ్ జోడీ
ఏటీపీ చాలెంజర్ టోర్నీ పుణే: మరో డబుల్స్ టైటిల్‌పై గురి పెట్టిన సాకేత్ మైనేని-సనమ్ సింగ్ (భారత్) జంట పుణే ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సాకేత్-సనమ్ ద్వయం 6-1, 6-1తో తెముర్ ఇస్మయిలోవ్ (ఉజ్బెకిస్తాన్)-అర్పిత్ శర్మ (భారత్) జంటపై గెలిచింది. అయితే సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ తొలి రౌండ్లోనే నిష్ర్కమించాడు. రెండు గంటల మూడు నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఐదో సీడ్ సాకేత్ 7-5, 4-6, 2-6తో ఇల్యా ఇవష్కా (బెలారస్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఈ టోర్నీతో సాకేత్ ఈ సీజన్‌ను ముగిస్తున్నాడు. ఈ ఒక్క నెలలోనే సాకేత్ మూడు టోర్నీల్లో బరిలోకి దిగి ఏకంగా 25 మ్యాచ్‌ల్లో (14 సింగిల్స్, 11 డబుల్స్) పాల్గొన్నాడు. మరోవైపు భారత్‌కే చెందిన సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, సనమ్ సింగ్, విజయ్ సుందర్ ప్రశాంత్‌లు సింగిల్స్‌లో రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. తొలి రౌండ్లో సోమ్‌దేవ్ 6-4, 7-5తో మాక్సిమ్ జాన్వీర్ (ఫ్రాన్స్)పై, సనమ్ సింగ్ 6-4, 6-1తో అలెజాంద్రో బెగా (ఇటలీ)పై, ప్రశాంత్ 6-4, 6-4తో ఆర్థర్ డీ గ్రీఫ్ (బెల్జియం)పై గెలిచారు. -
భళా.. బంగ్లా
16 ఏళ్ల తర్వాత పాక్‌పై విజయం తమీమ్, ముష్ఫికర్ సెంచరీలు మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్‌కు 1-0 ఆధిక్యం మిర్పూర్: ఏదో అదృష్టవశాత్తు ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌కు చేరలేదని, తమ దగ్గర పెద్ద జట్లను ఓడించే సత్తా ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మరోసారి నిరూపించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 79 పరుగులతో ఘన విజయం సాధించింది. షేరేబంగ్లా స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 329 పరుగుల భారీస్కోరు సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో బంగ్లాకు ఇదే అత్యధిక స్కోరు. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (135 బంతుల్లో 132; 15 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేశాడు. ముష్ఫికర్ రహీమ్ (77 బంతుల్లో 106; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడి శతకం సాధించాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 178 పరుగులు జోడించడం విశేషం. వన్డేల్లో బంగ్లాకు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. షకీబ్ (31) రాణించాడు. వహబ్ రియాజ్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేసిన అజ్మల్ 10 ఓవర్లలో 74 పరుగులు ఇచ్చాడు. పాకిస్తాన్ జట్టు 45.2 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటయింది. అజహర్ అలీ (72), హారిస్ సోహైల్ (51), రిజ్వాన్ (67) అర్ధసెంచరీలు సాధించినా ఫలితం లేకపోయింది. బంగ్లా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఏ దశలోనూ పాక్ లక్ష్యం దిశగా సాగలేదు. టాస్కిన్, అరాఫత్ సన్నీ మూడేసి వికెట్లు సాధించారు. బంగ్లాదేశ్ జట్టు పాక్‌పై ఏ ఫార్మాట్లోనైనా గెలవడం ఇది రెండోసారి. 1999 ప్రపంచకప్ తర్వాత మళ్లీ 16 ఏళ్లకు తమ ప్రియమైన శత్రువుపై బంగ్లాదేశ్ విజయం సాధించింది. -
భారత్ ‘హ్యాట్రిక్’
మహిళల హాకీ వరల్డ్ లీగ్ న్యూఢిల్లీ: సొంతగడ్డపై తమ విజయపరంపర కొనసాగిస్తూ భారత మహిళల జట్టు హాకీ వరల్డ్ లీగ్ రౌండ్-2లో వరుసగా మూడో విజయాన్ని సాధించింది. థాయ్‌లాండ్‌తో మంగళవారం జరిగిన చివరిదైన మూడో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 6-0 గోల్స్ తేడాతో గెలిచింది. తద్వారా గ్రూప్ ‘ఎ’లో తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకొని క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత్ తరఫున అమన్‌దీప్ కౌర్ (25వ ని.లో), వందన కటారియా (45వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... రాణి రాంపాల్ (40, 60వ ని.లో), జస్ప్రీత్ కౌర్ (38, 60వ ని.లో), రెండేసి గోల్స్ సాధించారు. గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్లో సింగపూర్‌తో భారత్ తలపడుతుంది. -
ఫ్రెంచ్ ఓపెన్‌లో షరపోవా జోరు
-
క్వార్టర్ ఫైనల్లో సానియా జోడి
ఒయిరస్ (పోర్చుగల్): భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పోర్చుగల్ ఓపెన్ టోర్నీ మహిళల డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన సానియా.. బుధవారం జరిగిన తొలిరౌండ్లో 4-6, 6-2, 10-5 తేడాతో ఇరినా కామెలియా బేగు (రొమేనియా)-మరియా ఇరిజోయెన్ (అర్జెంటీనా) జంటపై గెలుపొందింది. ఇక పురుషుల డబుల్స్‌లో భారత జోడి దివిజ్ శరణ్-పురవ్ రాజాలకు తొలిరౌండ్లో వాకోవర్ లభించింది. క్వార్టర్స్‌లో ఈ జంట టాప్‌సీడ్ పాబ్లో క్వెవాస్-డేవిడ్ మారెరో జోడితో తలపడే అవకాశముంది. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ కూడా టాప్‌సీడ్ థామస్ బెర్డిచ్ను ఎదుర్కొననున్నాడు. -
క్వార్టర్ ఫైనల్లో ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ ఆసియా బి1 చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సత్తాచాటింది. సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన ఆమె డబుల్స్‌లో ఓజస్విని సింగ్‌తో కలిసి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. న్యూఢిల్లీలోని ఆర్.కె.ఖన్నా టెన్నిస్ స్టేడియంలో బుధవారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ప్రాంజల 6-2, 6-3తో ఏపీ సహచర క్రీడాకారిణి స్నేహ పడమటపై గెలుపొందింది. బాలికల డబుల్స్‌లో రెండో సీడ్ ప్రాంజల-ఓజస్వినీ జోడి 6-4, 6-1తో భారత్‌కే చెందిన దేవాన్షి భీంజియాని- జీల్ దేశాయ్ ద్వయంపై విజయం సాధించింది. మరో డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో నిధి సురపనేని- జెన్నిఫర్ లూకమ్ (భారత్) జంట 3-6, 3-6తో మూడో సీడ్ తమచన్ మొంకూంతోడ్- ప్లోబ్రంగ్ ప్లిప్యూచ్ (థాయ్‌లాండ్) జోడి చేతిలో పరాజయం చవిచూసింది. గురువారం జరిగే సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రాంజల థాయ్‌లాండ్‌కు చెందిన ఐదో సీడ్ తమచన్తో, డబుల్స్‌లో ప్రాంజల జోడి వసంతి షిండే-ధ్రుతి (భారత్) జంటతో తలపడుతుంది. -
క్వార్టర్ ఫైనల్లో సోమ్‌దేవ్
న్యూఢిల్లీ: భారత నంబర్‌వన్ టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇక్కడి ఆర్కే ఖన్నా స్టేడియంలో బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత ఆటగాడు వరుస సెట్లలో డి వూ (చైనా)పై విజయం సాధించాడు. ప్రపంచ 96వ ర్యాంకర్ అయిన సోమ్‌దేవ్ 6-2, 6-2తో ప్రపంచ 212 ర్యాంకర్ డి వూపై అలవోక విజయం సాధించాడు. 62 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించాడు. ఇద్దరి మధ్య ఇదే తొలి పోరు కాగా... రెండు సెట్లలోనూ భారత స్టార్ విజృంభించడంతో చైనా ఆటగాడు చేతులెత్తేశాడు. తన ఆటతీరుపై సోమ్‌దేవ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘వూ అషామాషీ ప్రత్యర్థి కాదు. కానీ మ్యాచ్‌లో మాత్రం గట్టిపోటీ ఎదురవలేదు. మొత్తం మీద సునాయాసంగా ముందంజ వేయడం ఆనందంగా ఉంది. కోర్టు కూడా నా ఆటతీరుకు బాగా సరిపోయింది. ఇంకా మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాను’ అని సోమ్‌దేవ్ పేర్కొన్నాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్-జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) జోడి 6-3, 5-7, 11-9తో మూడో సీడ్ యూకీ బాంబ్రీ (భారత్)-మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంటను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. -
క్వార్టర్స్‌లో శ్రీకాంత్
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ బ్యాడ్మిం టన్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల విభాగంలో స్టార్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, సింధు రెండో రౌండ్లో ఓటమి పాలయ్యారు. అయితే పురుషుల విభాగంలో మాత్రం శ్రీకాంత్ సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. కశ్యప్ కూడా రెండో రౌండ్లోనే ఓడాడు. ఆంధ్రప్రదేశ్ రైజింగ్ స్టార్ కె.శ్రీకాంత్... మలేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో సత్తా చాటాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో అతను 11-21, 21-19, 21-19తో ప్రపంచ 17వ ర్యాంకర్ వాన్ హో సన్ (కొరియా)పై విజయం సాధించి క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గంటా 9 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా... శ్రీకాంత్ చివరి రెండు గేమ్‌ల్లో అమోఘమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. సుదీర్ఘ ర్యాలీలతో వాన్‌కు గట్టిపోటీ ఇచ్చాడు. తొలి గేమ్‌లో సునాయాసంగా గెలిచాడు. రెండో గేమ్‌లో ఓ దశలో శ్రీకాంత్ వెనకబడ్డా... పుంజుకుని వరుసగా 9 పాయింట్లు సాధించాడు. నిర్ణయాత్మక మూడో గేమ్ మరింత కఠినంగా సాగింది. ఆటగాళ్లిద్దరూ ఒక్కో పాయింట్ గెలవడంతో స్కోరు 3-3, 14-14, 15-15, 16-16తో స్కోరు సమమైంది. ఈ దశలో ఏపీ కుర్రాడు నాణ్యమైన ఆటతీరుతో రాణించి మ్యాచ్ గెలిచాడు. కశ్యప్ అవుట్! పారుపల్లి కశ్యప్ రెండో రౌండ్ మ్యాచ్‌లో జాన్ జుర్గెన్సన్ (డెన్మార్క్) చేతిలో 18-21, 15-21తో ఓడిపోయాడు. కేవలం 43 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. సైనాకు షాక్ మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఎనిమిదోసీడ్ సైనా 21-16, 10-21, 19-21తో ప్రపంచ 28వ ర్యాంకర్ యావో జూ (చైనా) చేతిలో కంగుతింది. 56 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్ గెలిచిన ఏపీ అమ్మాయి ఊపుమీద కనిపించింది. అయితే రెండో గేమ్‌లో యావో ఆధిపత్యమే నడవడంతో సైనా ఒక్కసారి కూడా స్కోరును సమం చేయలేకపోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో హైదరాబాదీ ఆధిక్యంలోకి వెళ్లినా నిలబెట్టుకోలేక పోయింది. పోరాడి ఓడిన సింధు మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో పి.వి.సింధు 16-21, 19-21తో ఆరోసీడ్ యియాన్ జూ బే (కొరియా) చేతిలో ఓడింది. తొలి గేమ్‌లో పేలవ ఆటతీరు, అనవసర తప్పిదాలతో సింధు తడబడింది. రెండో గేమ్‌లో పుంజుకుని 19-15తో ఆధిక్యంలోకి వచ్చింది. ఈ దశలో జూ బే తన అనుభాన్నంతా ఉపయోగించి వరుసగా ఆరు పాయింట్లు సాధించి సింధు ఆశలపై నీళ్లు జల్లింది. -
సెమీఫైనల్లో నిధి, సౌజన్య
ఔరంగాబాద్: ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు నిధి చిలుముల, సౌజన్య భవిశెట్టి ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి ప్రవేశించారు. వీరితో పాటు జాతీయ చాంపియన్ ప్రేరణ బాంబ్రీ, రెండో సీడ్ ప్రార్థన తొంబరే సెమీస్ పోరుకు అర్హత సంపాదించారు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ నిధి వరుస సెట్లలో మూడో సీడ్ రిషిక సుంకరకు షాకిచ్చింది. గంటా 45 నిమిషాల్లో ముగిసిన ఈ పోటీలో ఆమె 6-3, 6-3తో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున ఏపీ అమ్మాయి రిషికను కంగుతినిపించింది. సౌజన్య 6-4, 7-5తో రుతూజా భోంస్లేపై చెమటోడ్చి నెగ్గింది. ప్రేరణ బాంబ్రీ 4-6, 6-2, 6-3తో అంకిత రైనాపై, ప్రార్థన 6-2, 6-7 (4/7), 6-0తో నటాషా పల్హాపై గెలిచారు. సౌజన్య డబుల్స్‌లోనూ సెమీస్ఫైనల్లోకి అడుగుపెట్టింది. సౌజన్య-శర్మదా బాలు జోడి 6-0, 6-0తో ఎమి ముతగుచి-చిహిరో న్యునోమ్ జంటపై గెలుపొందగా, రిషిక-శ్వేతా రాణా ద్వయం 6-4, 6-1తో తీర్థ అక్షర-ఇస్కా (ఏపీ) జోడీని ఓడించింది. అనుష్క భార్గవ (ఏపీ)- ఈతీ మెహతా జంట 2-6, 5-7తో అంకిత రైనా-ప్రార్థన తొంబరే జోడి చేతిలో పరాజయం చవిచూసింది. -
క్వార్టర్స్‌లో యూకీ
చెన్నై: భారత యువ కెరటం యూకీ బాంబ్రీ... చెన్నై ఓపెన్ టోర్నీలో సత్తా చాటుకున్నాడు. తన కెరీర్లో పెద్ద విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 16వ ర్యాంకర్ ఫ్యాబియో ఫోగ్నిని (ఇటలీ)తో జరిగిన మ్యాచ్‌లో... 195వ ర్యాంకర్ యూకీ 6-1, 5-5 ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి కాలి గాయం కారణంగా తప్పుకున్నాడు. దీంతో చెన్నై ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్ చేరిన మూడో భారత ఆటగాడిగా యూకీ రికార్డులకెక్కాడు. 2009 టోర్నీలో సోమ్‌దేవ్ రన్నరప్‌గా నిలవగా, 1998 ఈవెంట్లో లియాండర్ పేస్ సెమీస్ దాకా వెళ్లాడు. గంటా ఆరు నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... తొలిసెట్ నాలుగో గేమ్‌లో ఫోగ్నిని సర్వీస్ బ్రేక్ చేసిన యూకీ 3-1 ఆధిక్యంలో నిలిచాడు. అయితే తర్వాతి గేమ్‌లో రెండు బ్రేక్ పాయింట్ల కోసం హోరాహోరీగా తలపడి నెగ్గాడు. ఏడో గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకుని సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్ ఐదో గేమ్‌లో బ్రేక్ పాయింట్ సాధించినా... తర్వాతి గేమ్‌ను చేజార్చుకోవడంతో స్కోరు 5-5తో సమమైంది. క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన 19 ఏళ్ల రామ్ కుమార్ రామనాథన్ 2-6, 4-6తో గ్రానోలెర్స్ (స్పెయిన్) చేతిలో ఓడాడు. మరో మ్యాచ్‌లో పెయిరీ (ఫ్రాన్స్) 6-1, 6-4తో లోపెజ్ (స్పెయిన్)పై గెలిచాడు. డబుల్స్ క్వార్టర్స్‌లో పురవ్ రాజా- సీలా (ఇజ్రాయెల్) 4-6, 4-6తో స్టామ్ (స్వీడన్)-నీల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడారు. -
ఒక విజయం... ఏడు డ్రాలు
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల క్రితం రంజీ ట్రోఫీ ‘ప్లేట్’ డివిజన్లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుని హైదరాబాద్ జట్టు భవిష్యత్తుపై ఆశలు రేపింది. క్వార్టర్ ఫైనల్ చేరుకొని మంచి సంకేతాలిచ్చింది. అయితే గత సీజన్లో పటిష్ట జట్లతో తలపడి గ్రూప్ ‘ఎ’లో చిట్టచివరన నిలవడంతో మళ్లీ వెనక్కి పడిపోయింది. ఈ సారైనా కాస్త మెరుగ్గా ఆడి ముందుకు వెళతారనుకుంటే ఎక్కడ వేసిన...అన్న చందంగా జట్టు పరిస్థితి తయారైంది. తాజాగా ముగిసిన 2013-14 సీజన్లో 9 జట్లు ఉన్న గ్రూప్ ‘సి’లో ఆరో స్థానంతో సరి పెట్టుకుంది. దేశవాళీ క్రికెట్లో గతమెంతో ఘనంగా ఉన్న హైదరాబాద్...సోదిలో కూడా లేని త్రిపురను కూడా ఓడించలేక ఆపసోపాలు పడింది. కనీసం సొంతగడ్డపై ఆడిన అనుకూలతను కూడా నాలుగు మ్యాచుల్లో ఉపయోగించుకోలేకపోయింది. ఫలితంగా వచ్చే సీజన్ కోసం కూడా గ్రూప్ ‘సి’కే పరిమితమై పెద్ద జట్లతో ఆడే అవకాశాన్ని కోల్పోయింది. ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడమే కాస్త కంటితుడుపుగా చెప్పవచ్చు. దక్కింది ఒక్కటే... ఈ సీజన్లో హైదరాబాద్ నాలుగు మ్యాచ్‌లను సొంత మైదానం ఉప్పల్‌లో, మరో నాలుగు మ్యాచ్‌లను ప్రత్యర్థి గడ్డపై ఆడింది. ఇందులో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 185 పరుగుల తేడాతో భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది జట్టుకు లభించిన ఏకైక విజయమిదే. గువహటిలో జరిగిన మ్యాచ్‌లో బలహీనమైన అసోంకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయింది. గోవా, జమ్మూ కాశ్మీర్లతో జరిగిన మ్యాచుల్లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించినా...ఏ దశలోనూ విజయానికి చేరువ కాలేదు. ఇక ఉప్పల్ స్టేడియంలో సహజంగా ఉండే అనుకూలతను ఏ మాత్రం ఉపయోగించుకోలేకపోయింది. ఇక్కడ కనీసం రెండు మ్యాచ్‌లు నెగ్గినా ఫలితం మరోలా ఉండేది. ఆంధ్రపై మాత్రమే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కగా...కేరళతో ఆధిక్యమూ కోల్పోయింది. జీవం లేని పిచ్‌పై జరిగిన మరో రెండు మ్యాచుల్లో కనీసం ఒక్కో ఇన్నింగ్స్ కూడా పూర్తి కాలేదు. ఈ గ్రూప్‌లో మహారాష్ట్రను బలమైనా జట్టుగా భావించినా...చివరకు త్రిపుర కూడా హైదరాబాద్‌కు తలవంచలేదు. ఫలితంగా ఈ రెండు మ్యాచుల్లో ఒక్కో పాయింట్‌తోనే సరి పెట్టుకోవాల్సి వచ్చింది. వ్యక్తిగత ప్రదర్శనలతో సరి... మరో వైపు ఈ సీజన్లో ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలు కొంత వరకు హైదరాబాద్‌కు సంతృప్తినిచ్చాయి. ముఖ్యంగా అండర్-19తో గుర్తింపు తెచ్చుకున్న హనుమ విహారి (11 ఇన్నింగ్స్‌లలో 841 పరుగులు) ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే సత్తా తనలో ఉందని నిరూపించాడు. ఎనిమిది మ్యాచుల్లో అతను ‘డబుల్’ సహా 3 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు సాధించడం విశేషం. అయితే గణాంకాలపరంగా గొప్పగా ఉన్నా ఇవన్నీ చిన్న జట్లపై చేసినవి కావడంతో కెరీర్లో ఇవి విహారిలాంటి ఆటగాడికి పెద్దగా మేలు చేయకపోవచ్చు. ఇతర ఆటగాళ్లలో సీనియర్ రవితేజ (694) నిలకడగా ఆడగా... ఆరంభంలో విఫలమైనా... కెప్టెన్ అక్షత్ రెడ్డి (536) ఆ తర్వాత తన గత రెండు సీజన్ల ఫామ్‌ను కొనసాగించాడు. ఖాద్రీ (355), సుమన్ (356) ఓకే అనిపించారే తప్ప చెప్పుకోదగ్గ విధంగా రాణించలేదు. ఈ సీజన్లో జట్టు వైఫల్యానికి బౌలింగే ప్రధాన కారణమని చెప్పవచ్చు. సీజన్లో వెలుగులోకి వచ్చిన ఆటగాడిగా పేసర్ రవికిరణ్ (25.26 సగటుతో 30 వికెట్లు) గురించి ప్రత్యేకంగా చెప్పవచ్చు. అతనికి మరే బౌలర్‌నుంచి సహకారం దక్కకపోవడంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ చెలరేగారు. కేరళతో ఆఖరి మ్యాచ్ డ్రా ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, కేరళ మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ గురువారం డ్రాగా ముగిసింది. 367 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ ఆట ముగిసే సరికి 47 ఓవర్లలో 2 వికెట్లకు 146 పరుగులు చేసింది. జగదీశ్ (57 నాటౌట్), సురేంద్రన్ (57) రాణించారు. అంతకు ముందు హైదరాబాద్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 429 పరుగులకు ఆలౌటైంది. షిండే (91), ఆశిష్ రెడ్డి (50) అర్ధ సెంచరీలు చేశారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కేరళకు 3 పాయింట్లు, హైదరాబాద్‌కు 1 పాయింట్ దక్కింది. భవిష్యత్ ఏమిటి... ఈ యేడు ప్రదర్శనతో జట్టులో చాలా మంది ఆటగాళ్లు వచ్చే సీజన్ కోసం తమ స్థానాలు నిలబెట్టుకున్నట్లే! కాబట్టి పెద్దగా మార్పులు లేకుండా ఇదే జట్టు కొనసాగవచ్చు. ఇలాంటి టీమ్‌ను గెలిచే విధంగా తయారు చేయడం హెచ్‌సీఏ బాధ్యత. కేవలం బీసీసీఐ నుంచి నిర్వహణపరమైన ప్రశంసలతో మనుగడ సాగిస్తున్న హైదరాబాద్ ఆటలో మాత్రం వెనుకబడిపోతోంది. ఎన్ని సౌకర్యాలు ఉన్నా ఫలితాలు మాత్రం దక్కడం లేదు. భారత మాజీ క్రికెటర్ సునీల్ జోషి 2011-12 సీజన్లో జట్టుకు కోచ్‌గా రాగానే టీమ్ క్వార్టర్స్‌కు వెళ్లడంతో అతనిపై ప్రశంసలు కురిశాయి. ఆ తర్వాతి రెండు సీజన్ల పరాభవంతో ఇకపై జోషిని కొనసాగించకపోవచ్చు. కొత్త కోచ్, ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళితేనే హైదరాబాద్ భవిష్యత్తులో దేశవాళీలో మళ్లీ గుర్తింపు తెచ్చుకోగలుగుతుంది. -
సౌరవ్ ఘోశల్ రికార్డు
మాంచెస్టర్: భారత స్క్వాష్ ఆటగాడు సౌరవ్ ఘోశల్ ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించాడు. ఈ మెగా ఈవెంట్లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి భారత ఆటగాడిగా ఘోశల్ రికార్డులకెక్కాడు. హోరాహోరీగా జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 17వ ర్యాంకర్ ఘోశల్ 3-2 తేడాతో అన్‌సీడెడ్ హెన్రిక్ ముస్టోనెన్పై నెగ్గాడు. తొలి రెండు గేమ్‌లను 5-11, 8-11తో ఓడినప్పటికీ 27 ఏళ్ల ఘోశల్ పట్టు వీడలేదు. వరుసగా మూడు గేమ్‌ల్లో బంతిపై పూర్తి పట్టు సాధిస్తూ 11-8, 11-4, 11-2 తేడాతో రెచ్చిపోయాడు. ‘నా దృష్టిలో ఇది పెద్ద ఘనత. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలిసారిగా క్వార్టర్స్ చేరుకున్నాను. ప్రపంచ అత్యుత్తమ ఎనిమిది మంది ఆటగాళ్లతో కలిసి బరిలో ఉండడం సంతోషాన్నిస్తోంది. ఒక్కో మ్యాచ్‌పై దృష్టి పెడుతూ ఈ దశకు చేరాను. ఈ టైటిల్ గెలవాలని ప్రతీ స్క్వాష్ ఆటగాడు భావిస్తాడు. నా విజయాలు భారత్‌లో ఈ ఆటకు ఆదరణ తేవాలని కోరుకుంటున్నాను’ అని కోల్‌కతాకు చెందిన ఈ ఆటగాడు అన్నాడు. అయితే సెమీస్‌లో తనకు గట్టి పోటీ ఎదురుకానుంది. డిఫెండింగ్ చాంపియన్ ర్యామీ అషౌర్ (ఈజిప్టు)ను ఢీకొనబోతున్నాడు. -
నేటినుంచి రంజీ సీజన్ షురూ
ముంబై: భారత క్రికెట్‌కు మూలస్థంభంలాంటి ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ ‘రంజీ ట్రోఫీ’కి నగారా మోగింది. 2013-14 సీజన్ మ్యాచ్‌లు ఆదివారంనుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకు నాలుగు రోజుల పాటు జరిగే తొలి రౌండ్లో భాగంగా మొత్తం 12 మ్యాచ్‌లు జరుగుతాయి. గత ఏడాదిలాగే ఈ సారి కూడా మొత్తం 27 జట్లను ‘ఎ’, ‘బి’, ‘సి’ పేర్లతో మూడు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో జట్టు తన గ్రూప్‌లోని ఇతర జట్లతో ఎనిమిదేసి లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది. ‘ఎ’, ‘బి’లనుంచి చెరో 3 జట్లు, గ్రూప్ ‘సి’ నుంచి 2 జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. లీగ్ దశలో ‘ఎ’, బి’ గ్రూప్‌లలో చివరి స్థానాల్లో నిలిచిన జట్లు వచ్చే సీజన్‌కి గ్రూప్ ‘సి’ కి పడిపోతాయి. గ్రూప్ ‘సి’ లో తొలి రెండు స్థానాలు సాధించిన జట్లు గ్రూప్ ‘ఎ’, ‘బి’ లలో ఆడేందుకు ప్రమోషన్ దక్కించుకుంటాయి. ఇప్పటి వరకు ముంబై అత్యధికంగా 40 సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగే గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్, ఆంధ్ర జట్లు తలపడనున్నాయి. గ్రూప్ ‘సి’లో ఈ రెండు జట్లతో పాటు మహారాష్ట్ర, అస్సాం, కేరళ, గోవా, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, త్రిపుర ఉన్నాయి. -
పోరాడి నెగ్గిన షేక్ అబ్దుల్లా
చెన్నై: తొలి సెట్ కోల్పోయినా... వెంటనే తేరుకున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు షేక్ అబ్దుల్లా జాతీయ జూనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన జూనియర్ బాలుర సింగిల్స్ మూడో రౌండ్లో టాప్ సీడ్ అబ్దుల్లా 1-6, 6-4, 7-5తో 13వ సీడ్ బాసిల్ ఖుమా (మిజోరం)పై శ్రమించి గెలిచాడు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో అడవెల్లి పార్థసారథి (ఆంధ్రప్రదేశ్) 6-3, 6-2తో మహ్మద్ ఫహాద్ (తమిళనాడు)పై నెగ్గగా... వెంకట జ్ఞానభాస్కర్ (ఆంధ్రప్రదేశ్) 3-6, 6-4, 1-6తో నితిన్ కుమార్ సిన్హా (పశ్చిమ బెంగాల్) చేతిలో ఓడిపోయాడు. బాలికల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నయనిక రెడ్డి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మూడో రౌండ్లో నయనిక 6-2, 6-0తో గాయత్రి (చండీగఢ్)పై గెలుపొందింది.