క్వార్టర్ ఫైనల్లో సానియా జోడి | sania mirza team entered in quarter finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్ ఫైనల్లో సానియా జోడి

Published Thu, May 1 2014 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 AM

క్వార్టర్ ఫైనల్లో సానియా జోడి

క్వార్టర్ ఫైనల్లో సానియా జోడి

ఒయిరస్ (పోర్చుగల్): భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పోర్చుగల్ ఓపెన్ టోర్నీ మహిళల డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన సానియా.. బుధవారం జరిగిన తొలిరౌండ్‌లో 4-6, 6-2, 10-5 తేడాతో ఇరినా కామెలియా బేగు (రొమేనియా)-మరియా ఇరిజోయెన్ (అర్జెంటీనా) జంటపై గెలుపొందింది.
 
 ఇక పురుషుల డబుల్స్‌లో భారత జోడి దివిజ్ శరణ్-పురవ్ రాజాలకు తొలిరౌండ్‌లో వాకోవర్ లభించింది. క్వార్టర్స్‌లో ఈ జంట టాప్‌సీడ్ పాబ్లో క్వెవాస్-డేవిడ్ మారెరో జోడితో తలపడే అవకాశముంది. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ కూడా టాప్‌సీడ్ థామస్ బెర్డిచ్‌ను ఎదుర్కొననున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement