Somdev Devvarman
-
సాకేత్ శుభారంభం
వియత్నాం ఓపెన్ టోర్నీ హో చి మిన్ సిటీ: భారత రెండో ర్యాంకర్ సాకేత్ మైనేని వియత్నాం ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. అయితే భారత్‌కే చెందిన సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, సుమీత్ నాగల్, జీవన్ నెదున్‌చెజియాన్ మాత్రం తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 168వ ర్యాంకర్ సాకేత్ 6-4, 7-6 (7/3)తో గెరార్డ్ గ్రానోలెర్స్ (స్పెయిన్)పై గెలిచాడు. గంటా 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ 11 ఏస్‌లు సంధించడంతోపాటు ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయిన అతను ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో సోమ్‌దేవ్ 6-7 (4/7), 6-3, 6-2తో లూక్ సావిల్లె (ఆస్ట్రేలియా) చేతిలో; సుమీత్ 0-6, 7-6 (7/2), 1-6తో అడ్రియన్ మెనెన్‌దెజ్ (స్పెయిన్) చేతిలో; జీవన్ 2-6, 2-6తో హిరోయాసు ఇహరా (జపాన్) చేతిలో ఓడిపోయారు. మరో మ్యాచ్‌లో సనమ్ సింగ్ 1-6, 6-3, 6-4తో జెర్మెన్ (జర్మనీ)పై విజయం సాధించి రెండో రౌండ్లోకి అడుగుపెట్టాడు. -
డేవిస్ కప్ లో సోమ్ దేవ్ విజయం
న్యూఢిల్లీ: డేవిస్ కప్ ప్రపంచ కప్ ప్లే ఆఫ్ మ్యాచ్ లో భారత కెప్టెన్ సోమ్ దేవ్ దేవ్ బర్మన్ ఘనవిజయం సాధించాడు. ఈ రోజ జరిగిన మ్యాచ్ లో సోమ్ దేవ్ 7-6, 6-4, 6-3 తేడాతో చెక్ రిపబ్లిక్ ఆటగాడు జిరీ వెస్లీని ఓడించాడు. అంతకుముందు జరిగిన మ్యాచ్ లో యూకీ బాంబ్రీ ఓటమి చెందడంతో భారత్ కాస్త ఆందోళనకు గురైంది. కాగా, అనంతరం జరిగిన మ్యాచ్ లో సోమ్ దేవ్ దేవ్ బర్మన్ తన దైన శైలిలో రెచ్చిపోయాడు. ప్రపంచ 40 వ ర్యాంక్ ఆటగాడు వెస్లీని వరుస సెట్లలో మట్టికరిపించి స్కోరును 1-1 గా సమం చేశాడు. ఈ మ్యాచ్ లో ఘన విజయం సాధించడం పట్ల సోమ్ దేవ్ హర్షం వ్యక్తం చేశాడు. 'నేను అత్యుత్తమ సర్వీసులతో ఆకట్టుకున్నా. నా కెరీయర్ లో చేసిన ఉత్తమ సర్వీసుల్లో ఇది కూడా ఒకటి. నా ఆటతీరుకు నిబంధనలు కూడా బాగా అనుకూలించాయి. తొలుత కాస్త అలసటకు గురైనా.. తరువాత బాగా ఆడి మ్యాచ్ ను గెలుచుకున్నా. నా విజయంలో 75 శాతం పాయింట్లు సర్వీసుల ద్వారానే రావడం నిజంగా సంతోషంగా ఉంది' అని సోమ్ దేవ్ తెలిపాడు. -
డేవిస్ కప్ లో రాణించడం కష్టమే: విజయ్ అమృత్ రాజ్
సరైన సింగిల్స్ ప్లేయర్ లేకుండా డెవిస్ కప్ లో రాణించడం కష్టమే నని ప్రఖ్యాత టెన్సిస్ ప్లేయర్ విజయ్ అమృత్ రాజ్ అన్నారు. ఈనెలాఖరులో చెక్ రిపబ్లిక్ తో జరగనున్న ప్లేఆఫ్ టోర్నీలో మన అవకాశాలు అంతంత మాత్రమే అని అన్నాడు. సోమ్ దేవ్ దేవ్ బర్మన్ కెప్టెన్సీలో టీమిండియా బరిలోదిగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీలో లియాండ్ పేస్ కూడా ఆడనున్నాడు. దీనిపై స్పందించిన విజయ్ అమృత్ రాజ్.. లియాండ్ పేస్ రావడం వల్ల కూడా మన అవకాశాలు పెద్దగా మెరుగయ్యే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డాడు. మన టీమ్ లో కావాల్సినంత మంది డబుల్స్ ప్లేయర్స్ ఉన్నారని.. ప్రపంచ గ్రూప్ లోకి అడుగు పెట్టాలంటే.. సింగిల్స్ ప్లేయర్స్ అవసరమని చెప్పాడు. కనీసం టీమ్ లో టాప్ 50 రాంక్ సింగిల్స్ ప్లేయర్ ఉన్నా ఛాన్స్ లు ఉంటాయని.. కేవలం అత్యున్నత డబుల్స్ ప్లేయర్స్ తో డేవీస్ కప్ ప్లే ఆఫ్ లపై ఆశలు పెట్టుకోవడం అనవసరమని చెప్పాడు. డేవిస్ కప్ లో కనీసం నాలుగు సింగిల్స్ మ్యాచ్ లు ఆడాలి.. వీటిలో కనీసం ఒక్కటైనా గెలవందే.. ముందుకు వెళ్లడం అసాధ్యం. గతంలో మనం గెలిచిన డేవిస్ కప్ మ్యాచ్ ల్లో విజయాలు కేవలం కాకతాళీయమేనని చెప్పాడు. మరో వైపు రాజీవ్ ఖేల్ రత్న సానియా మీర్జా గురించి మాట్లాడుతూ.. సానియా టెన్నిస్ లో ఈ స్థాయికి చేరడానికి ఎంత కృషి చేసిందో తనకు తెలుసన్నాడు. సానియా మరింత కాలం సింగిల్స్ ఆడిఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. -
సోమ్‌దేవ్‌కు నిరాశ
న్యూఢిల్లీ: వాషింగ్టన్ ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్లో భారత టెన్నిస్ నంబర్‌వన్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌కు నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ విభాగం తొలి రౌండ్లోనే అతను నిష్ర్కమించాడు. ప్రపంచ 202వ ర్యాంకర్ డారియన్ కింగ్ (బార్బడోస్)తో జరిగిన మొదటి రౌండ్లో సోమ్‌దేవ్ 2-6, 7-5, 2-6తో ఓటమి పాలయ్యాడు. -
సోమ్‌దేవ్ విజయం
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్నడేవిస్ కప్ ఆసియా ఒషియానియాలో ఆదివారం జరిగే రివర్స్ సింగిల్స్‌లో భారత ఆటగాడు సోమ్‌దేవ్ విజయం సాధించాడు. వరుస సెట్లలో జోస్ స్థాతమ్ ను ఓడించాడు. 2 గంటల 18 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో మార్కస్ డానియల్ పై 6-4 6-4 6-4 గెలుపొందాడు. సోమ్ దేవ్ విజయంతో సిరీస్ 2-2తో సమం చేసింది. మరో మ్యాచ్ లో మైకేల్ వీనస్‌తో యూకీ బాంబ్రీ తలపడుతున్నాడు. -
సోమ్‌దేవ్ ‘ఫైనల్’ రికార్డు
వినెట్కా (అమెరికా): భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ కొత్త రికార్డు సృష్టించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ టూర్ సర్క్యూట్లో సుదీర్ఘ ఫైనల్ ఆడి గెలిచిన క్రీడాకారుడిగా సోమ్‌దేవ్ గుర్తింపు పొందాడు. వినెట్కాలో జరిగిన నీల్సన్ ప్రో టెన్నిస్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఏడో సీడ్ సోమ్‌దేవ్ 7-5, 4-6, 7-6 (7/5)తో డానియల్ ఎన్గుయెన్ (అమెరికా)పై గెలిచి విజేతగా నిలిచాడు. 3 గంటల 31 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్... ఏటీపీ చాలెంజర్ సర్క్యూట్లో సుదీర్ఘ సమయంపాటు జరిగిన ఫైనల్‌గా గుర్తింపు పొందింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ ఓపెన్ టైటిల్ గెలిచాక 13 టోర్నమెంట్లలో పాల్గొన్న సోమ్‌దేవ్ రెండో రౌండ్‌ను దాటి ముందుకెళ్లలేదు. కెరీర్లో ఐదో టైటిల్‌ను సొంతం చేసుకున్న అతను తాజా ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ విజయంతో సోమ్‌దేవ్ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 25 స్థానాలు ఎగబాకి 148వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. -
ఫైనల్ రౌండ్‌కు సోమ్‌దేవ్
హూస్టన్ (అమెరికా) : యూఎస్ పురుషుల క్లే కోర్టు టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్‌కు చేరుకున్నాడు. రాబీ జినెప్రి (అమెరికా)తో జరిగిన రెండో రౌండ్లో సోమ్‌దేవ్ 7-6 (8/6), 6-3తో విజయం సాధించాడు. తన సర్వీస్‌లో పదిసార్లు బ్రేక్ పాయింట్ అవకాశాలను కాపాడుకున్న సోమ్‌దేవ్ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. గిలెర్మి క్లెజార్ (బ్రెజిల్)తో జరిగే ఫైనల్ రౌండ్లో గెలిస్తే సోమ్‌దేవ్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు. -
సోమ్‌దేవ్ జంటకు డబుల్స్ టైటిల్
ఏటీపీ చాలెంజర్ టోర్నీ కోల్‌కతా: సింగిల్స్‌లో విఫలమైనప్పటికీ... డబుల్స్‌లో రాణించిన భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ కోల్‌కతా ఓపెన్‌లో టైటిల్ సాధించాడు. భారత్‌కే చెందిన తన భాగస్వామి జీవన్ నెదున్చెజియాన్తో జతకట్టిన సోమ్‌దేవ్‌కు ఫైనల్లో ఆడాల్సిన అవసరం రాలేదు. భారత జోడీతో తలపడాల్సిన జేమ్స్ డక్‌వర్త్-ల్యూక్ సావిల్లె (ఆస్ట్రేలియా) ద్వయం గాయం కారణంగా ‘వాకోవర్’ ఇచ్చింది. విజేతగా నిలిచిన సోమ్‌దేవ్ జంటకు 3,100 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. లక్షా 91 వేలు) లభించింది. అంతకుముందు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రాడూ అల్బోట్ (మాల్దొవా) 7-6 (7/0), 6-1తో జేమ్స్ డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)పై గెలిచి టైటిల్ దక్కించుకున్నాడు. -
సోమ్దేవ్కే టైటిల్
న్యూఢిల్లీ: ఏడాది కాలంగా ఆశించిన స్థాయిలో ఆడలేకపోతున్న భారత టెన్నిస్ అగ్రశ్రేణి క్రీడాకారుడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో విజేతగా నిలిచి టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సోమ్‌దేవ్ 3-6, 6-4, 6-0తో భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీని ఓడించాడు. గతేడాది ఢిల్లీ ఓపెన్‌ను గెల్చుకున్నాక సోమ్‌దేవ్ ఖాతాలో మరో టైటిల్ చేరలేదు. ఏడాది తర్వాత ఢిల్లీ ఓపెన్లోనే అతను చాంపియన్‌గా నిలువడం విశేషం. -
సోమ్‌దేవ్ ఓటమి
చెన్నై: చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లోనే భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ 3-6, 4-6తో ఆరో సీడ్ యెన్ సున్ లూ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. సోమ్దేవ్తోపాటు రామ్‌కుమార్ రామనాథన్, విజయ్ సుందర్ ప్రశాంత్ కూడా తొలి రౌండ్లోనే నిష్ర్కమించారు. రామ్‌కుమార్ 3-6, 3-6తో ఇటో తత్సుమా (జపాన్) చేతిలో; ప్రశాంత్ 2-6, 1-6తో జిరీ వెసిలి (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓటమి చవిచూశారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో పేస్ (భారత్)-క్లాసెన్ (దక్షిణాఫ్రికా) జంట 6-4, 6-4తో ఆండ్రియా హైదర్ (ఆస్ట్రియా)-లుకాస్ లాకో (స్లొవేకియా) జోడీపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
సోమ్‌దేవ్, యుకీ శుభారంభం
పుణె: ఏటీపీ పుణె చాలెంజర్‌లో భారత ఆటగాళ్లు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, యుకీ భాంబ్రీ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సోమ్‌దేవ్, యుకీ తమ ప్రత్యర్థులపై విజయం సాధించారు. కాగా వర్ధమాన ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్ తొలి రౌండ్లో ఓటమి చవిచూశాడు. సోమ్‌దేవ్ తొలిరౌండ్లో 6-1, 6-3 స్కోరుతో అర్జున్ ఖడేపై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో యుకీ 6-3 6-0 స్కోరుతో చైనీస్ తైపీ ఆటగాడు లియంగ్-చి హాంగ్‌ను నెగ్గాడు. ఇతర మ్యాచ్‌ల్లో సాకేత్ మైనేని, సనమ్ సింగ్ గెలుపొందారు. -
సూపర్ సోమ్‌దేవ్
బెంగళూరు: వరుసగా రెండు సింగిల్స్ మ్యాచ్‌లు ఓడి ఒత్తిడి నెలకొన్న దశలోనూ వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్- బోపన్న తమ డబుల్స్ మ్యాచ్‌లో చూపిన పోరాట పటిమ... యువ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్వర్మన్లో స్ఫూర్తిని నింపింది. ఇదే జోరుతో ముందుకెళ్లి తనకన్నా ఎంతో మెరుగైన ఆటగాడిని చిత్తు చేసి వారి శ్రమను వృథాగా పోనీయలేదు. ఫలితంగా డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలో భాగంగా ఆదివారం జరిగిన తొలి రివర్స్ సింగిల్స్‌లో సోమ్‌దేవ్ 1-6, 6-4, 4-6, 6-4, 6-3 తేడాతో ప్రపంచ 61వ ర్యాంకర్ డూసాన్ లజోవిక్‌ను మట్టికరిపించాడు. 3 గంటల 37 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో అందిన విజయంతో భారత్ 2-2తో సెర్బియా ఆధిక్యాన్ని సమం చేసింది. యూకీ బాంబ్రీ, క్రాజినోవిచ్ మధ్య నిర్ణాయక మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచింది. వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి క్రాజినోవిచ్ తొలి సెట్‌ను 6-3తో నెగ్గగా... రెండో సెట్లో స్కోరు 4-4తో సమంగా ఉంది. ఇదే స్కోరు నుంచి ఈ మ్యాచ్‌ను సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి నిర్వహిస్తారు. లజోవిక్తో తొలి సెట్‌ను 29 నిమిషాల్లోనే చిత్తుగా ఓడిన తర్వాత సోమ్‌దేవ్ అనూహ్యంగా పుంజుకున్నాడు. చురుకైన కదలికలతో పాటు చక్కటి వ్యూహం ప్రకారం రెండో సెట్‌ను ఆడి ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్‌కు చేరిన లజోవిక్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ సెట్లో తను ఎనిమిది బ్రేక్పాయింట్లను కాపాడుకున్నాడు. కీలక సమయాల్లో సర్వ్, వ్యాలీ షాట్లతో ప్రత్యర్థిని కోలుకోనీయలేదు. ఈ సెట్ అనంతరం కోర్టులో జారిపడిన లజోవిక్ తన ఎడమ కాలికి చికిత్స తీసుకున్నాడు. దీంతో అతడి ఆటతీరులో వేగం తగ్గింది. ఈ అవకాశాన్ని సోమ్‌దేవ్ సొమ్ము చేసుకోలేకపోయాడు. మూడో సెట్ ఆరో గేమ్‌లో లజోవిక్ సర్వీస్‌ను బ్రేక్ చేసే అవకాశం మూడు సార్లు వచ్చినా సోమ్‌దేవ్ సద్వినియోగం చేసుకోలేదు. తొమ్మిదో గేమ్‌లోనూ ఒక అవకాశాన్ని జారవిడుచుకున్నాడు. తద్వారా 4-1 ఆధిక్యం నుంచి సెట్‌ను కోల్పోవడంతో ప్రేక్షకులు నిరాశపడ్డారు. సోమ్‌దేవ్ జోష్ నాలుగో సెట్లో సోమ్‌దేవ్ ఆట అభిమానుల్లో జోష్‌ను నింపింది. ఈ సెట్ నాలుగో గేమ్‌లో ఇరు ఆటగాళ్ల నుంచి వారు అద్వితీయ ఆటను తిలకించారు. గేమ్‌ను దక్కించుకునేందుకు పట్టువిడవకుండా ఆడడంతో ఆరు సార్లు డ్యూస్‌కు వెళ్లింది. అయితే లజోవిక్ తన బ్రేక్ పాయింట్‌ను కాపాడుకుని సర్వీస్‌ను నిలబెట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత మాత్రం సోమ్‌దేవ్ కసి కొద్దీ ఆడాడు. సర్వీస్‌తో పాటు రిటర్న్ షాట్లతో అలరించాడు. సోమ్‌దేవ్ బ్యాక్‌హ్యాండ్ షాట్లకు లజోవిక్ నుంచి సమాధానం కరువైంది. ఫలితంగా 3-1 ఆధిక్యంలోకి వెళ్లి సెట్‌ను దక్కించుకున్నాడు. ఇక చివరి సెట్లోనూ మూడు, ఏడో గేమ్‌లో సర్వీస్‌ను బ్రేక్ చేసి తనదైన శైలిలో మ్యాచ్‌ను ముగించాడు. -
ఆసియా క్రీడలకు సోమ్‌దేవ్ దూరం
నిర్ణయం సరికాదన్న ‘ఐటా’ న్యూఢిల్లీ: ఆసియా క్రీడల ప్రారంభానికి ముందే భారత పతకావకాశాలకు దెబ్బపడింది. భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఈనెల 19 నుంచి అక్టోబరు 4 వరకు దక్షిణ కొరియాలోని ఇంచియోన్‌లో జరగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనరాదని నిర్ణయించుకున్నాడు. ఈసారి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 143వ స్థానంలో ఉన్న సోమ్‌దేవ్.. తన ర్యాంకును మెరుగుపరచుకునేందుకు ఏటీపీ టూర్ టోర్నీల్లో ఆడాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. 2010 గ్వాంగ్జూ ఆసియా క్రీడల్లో సోమ్‌దేవ్ భారత్‌కు సింగిల్స్‌లో, డబుల్స్‌లో స్వర్ణ పతకాలు అందించాడు. అయితే సోమ్‌దేవ్ నిర్ణయాన్ని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) తీవ్రంగా తప్పుబట్టింది. ఆసియా క్రీడల్లో ఆడాల్సిందిగా తననెవరూ సంప్రదించలేదన్న సోమ్‌దేవ్ వ్యాఖ్యల్నీ ఖండించింది. ‘దేశం తరపున నంబర్‌వన్ ఆటగాడిగా ఆసియా క్రీడలకు అతడు అందుబాటులో ఉంటాడనే భావించాం. కనీసం టీమ్ ఈవెంట్లోనైనా ఆడాల్సిందిగా కోరాం. అతనికి విజ్ఞప్తి చేయగలమే తప్ప ఒత్తిడి చేయలేం’ అని ఐటా కార్యదర్శి భరత్ ఓజా అన్నారు. అయినా టెన్నిస్ అనేది వ్యక్తిగత క్రీడ అని, ఏటీపీ టూర్ టోర్నీలు ఆడితేనే వారికి జీవనోపాధి ఉన్నందున చేయగలిగేదేమీ లేదని ఓజా పేర్కొన్నారు. సోమ్దేవ్పై ఎటువంటి క్రమశిక్షణ చర్య తీసుకోలేమని, కానీ డేవిస్‌కప్ జట్టు ఎంపిక మాత్రం తమ చేతిలోనే ఉంటుందని అన్నారు. సోమ్‌దేవ్ గైర్హాజరీతో అతని స్థానంలో దివిజ్ శరణ్‌ను ఎంపిక చేసినట్లు ఓజా తెలిపారు. -
యూకీ, సనమ్ ఓటమి
యూఎస్ ఓపెన్ క్వాలిఫయర్స్ న్యూయార్క్: ఈ ఏడాది యూఎస్ ఓపెన్ సింగిల్స్ విభాగంలో ఒక్క భారత ఆటగాడు కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడిన ముగ్గురు ఆటగాళ్లు కూడా పరాజయాలతో వెనుదిరిగారు. గాయం కారణంగా ఐదు నెలల పాటు టెన్నిస్‌కు దూరంగా ఉన ్న యూకీ బాంబ్రీ రెండో రౌండ్లో 7-5, 2-6, 5-7 తేడాతో జేమ్స్ మెక్‌గీ (ఐర్లాండ్) చేతిలో ఓడాడు. 13 బ్రేక్ పాయింట్లు అవకాశం వచ్చినా యూకీ మూడింటిని మాత్రమే సద్వినియోగం చేసుకోగలిగాడు. మరో మ్యాచ్‌లో సనమ్ సింగ్ 7-5, 6-7(3), 3-6తో జర్మనీకి చెందిన ఆండెరాస్ బెక్ చేతిలో మట్టికరిచాడు. భారత టాప్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ అంతకుముందే తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. -
‘ఖేల్ రత్న’కు ఆరు నామినేషన్లు
జాబితాలో పి.వి.సింధు అర్జున అవార్డుకు మళ్లీ మహేశ్వరి పేరు న్యూఢిల్లీ: హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ‘ఖేల్ రత్న’ అవార్డుకు నామినేట్ అయింది. ఈ ఏడాదికిగాను ఖేల్త్న్రకు ఆరుగురు క్రీడాకారుల పేర్లు నామినేట్ కాగా, వారిలో సింధుతోపాటు టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, గోల్ఫ్ ఆటగాడు జీవ్ మిల్కాసింగ్, అథ్లెటిక్స్ నుంచి కృష్ణ పూనియా, వికాస్ గౌడ, పారా అథ్లెట్ దేవేంద్ర ఝఝారియాలు ఉన్నారు. సింధు గత ఏడాదే అర్జున అవార్డు అందుకోగా, కృష్ణ పూనియా చివరి నిమిషం దాకా ఖేల్త్న్ర రేసులో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక అర్జున అవార్డుల కోసం పిస్టల్ షూటర్లు హీనా సిద్ధు, గురుప్రీత్ సింగ్, బ్యాడ్మింటన్ ఆటగాడు అరవింద్ భట్, క్రికెటర్ ఆర్.అశ్విన్ నామినేట్ అయ్యారు. మహేశ్వరిని మళ్లీ నామినేట్ చేసిన ఏఎఫ్ఐ ట్రిపుల్ జంపర్ రంజిత్ మహేశ్వరి పేరును అర్జున అవార్డు కోసం భారత అథ్లెటిక్ సమాఖ్య (ఏఎఫ్ఐ) మళ్లీ ప్రతిపాదించింది. గత ఏడాది మహేశ్వరిని అర్జున అవార్డుకు ఎంపిక చేసినా గతంలో డోప్ టెస్టులో పట్టుబడిన చరిత్ర వల్ల ప్రభుత్వం అతనికి అవార్డును నిరాకరించింది. అయితే 2008లో మహేశ్వరికి శాంపిల్స్‌ను పరీక్షించిన లేబొరేటరీకి అప్పట్లో గుర్తింపు లేదని, 2009లో మాత్రమే గుర్తింపు పొందిందని ఏఎఫ్ఐ అధికారి ఒకరు చెప్పారు. -
క్వార్టర్ ఫైనల్లో సానియా జోడి
ఒయిరస్ (పోర్చుగల్): భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పోర్చుగల్ ఓపెన్ టోర్నీ మహిళల డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన సానియా.. బుధవారం జరిగిన తొలిరౌండ్లో 4-6, 6-2, 10-5 తేడాతో ఇరినా కామెలియా బేగు (రొమేనియా)-మరియా ఇరిజోయెన్ (అర్జెంటీనా) జంటపై గెలుపొందింది. ఇక పురుషుల డబుల్స్‌లో భారత జోడి దివిజ్ శరణ్-పురవ్ రాజాలకు తొలిరౌండ్లో వాకోవర్ లభించింది. క్వార్టర్స్‌లో ఈ జంట టాప్‌సీడ్ పాబ్లో క్వెవాస్-డేవిడ్ మారెరో జోడితో తలపడే అవకాశముంది. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ కూడా టాప్‌సీడ్ థామస్ బెర్డిచ్ను ఎదుర్కొననున్నాడు. -
ఎట్టకేలకో విజయం
మూడు నెలల తర్వాత సింగిల్స్ మ్యాచ్ గెలిచిన సోమ్‌దేవ్ ఏటీపీ పోర్చుగల్ ఓపెన్ ఒయిరస్ (పోర్చుగల్): భారత నంబర్‌వన్ సింగిల్స్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఎట్టకేలకు తొలిరౌండ్ అడ్డంకిని అధిగమించాడు. ఏటీపీ పోర్చుగల్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ప్రపంచ 102వ ర్యాంకర్ సోమ్‌దేవ్ మూడు నెలల తర్వాత తొలి రౌండ్లో గెలుపొందడం గమనార్హం. వరుసగా ఐదు టోర్నీల్లో మొదటి రౌండ్ మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యాడు. తాజా టోర్నీలో భారత ఆటగాడు 6-2, 6-3తో ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్పై విజయం సాధించాడు. గంటా 13 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో సోమ్‌దేవ్ వరుస సెట్లలో తనకన్నా మెరుగైన 64వ ర్యాంకర్‌ను కంగుతినిపించి పరాజయాల పరంపరకు బ్రేక్ వేశాడు. -
తొలిరౌండ్లోనే ఓడిన సోమ్‌దేవ్
బార్సిలోనా: భారత స్టార్ టెన్నిస్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో టోర్నీలో తొలి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టాడు. తాజాగా బార్సిలోనా ఓపెన్‌లో మార్టిన్ క్లిజన్ (స్లొవేకియా) చేతిలో సోమ్‌దేవ్ 2-6, 4-6 తేడాతో ఓడిపోయాడు. ఢిల్లీ ఓపెన్ చాలెంజర్ టోర్నీ గె లిచిన అనంతరం సోమ్‌దేవ్ దుబాయ్ ఈవెంట్లో డెల్ పొట్రోపై మాత్రమే నెగ్గాడు. అది కూడా ప్రత్యర్థి గాయం కారణంగా తప్పుకోవడంతో సాధ్యమైంది. డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న, ఐజమ్ ఉల్ హక్ ఖురేషి జోడి వరుస సెట్లలో గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ అన్‌సీడెడ్ జంట 6-1, 6-4 తేడాతో ట్రీట్ హుయే (ఫిలిప్పైన్స్), డొమినిక్ ఇన్‌గ్లాట్ (బ్రిటన్)ను ఓడించింది. -
తొలి రోజు సమం
భారత్, కొరియా 1-1 సోమ్‌దేవ్ గెలుపు, సనమ్ ఓటమి బుసాన్ (కొరియా): డేవిస్‌కప్ ఆసియా ఓషియానియా గ్రూప్-1 రెండో రౌండ్లో తొలి రోజు భారత్, కొరియా జట్లు 1-1తో సమంగా నిలిచాయి. శుక్రవారం మొదలైన రెండో రౌండ్లో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన కొరియా... భారత్‌కు తొలి రోజే గట్టిపోటీనిచ్చింది. తొలి సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌ను అతనికంటే తక్కువ ర్యాంక్ ఉన్న హేయాన్ చుంగ్ ఓడించినంత పనిచేశాడు. మూడున్నర గంటల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సోమ్‌దేవ్ 7-6 (7/4), 7-6 (7/3), 6-4తో చుంగ్‌పై పోరాడి గెలిచాడు. మొదటి సెట్లో 1-4తో, రెండో సెట్లో 2-5తో వెనుకబడి ఉన్న సమయంలో అద్భుతమైన ఆటతీరుతో సోమ్‌దేవ్ పుంజుకున్నాడు. మూడో సెట్లో మరో అవకాశం ఇవ్వకుండా ఆడి భారత్‌కు శుభారంభాన్ని అందించాడు. అయితే రెండో సింగిల్స్‌లో సనమ్‌సింగ్ నిరాశపరిచాడు. గాయం కారణంగా యూకీ బాంబ్రీ డేవిస్‌కప్‌కు దూరం కావడంతో సింగిల్స్ ఆడే అవకాశాన్ని దక్కించుకున్న సనమ్‌సింగ్ 6-7 (5/7), 4-6, 4-6తో కొరియా టాప్ ప్లేయర్ లామ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇరు జట్లు సమంగా నిలవడంతో శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్ భారత్‌కు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో హ్యుంగ్ తైక్ లీ-సంగ్ వు నో ద్వయంతో రోహన్ బోపన్న-సాకేత్ మైనేని జోడి తలపడనుంది. -
వరల్డ్ గ్రూప్ బెర్తు కోసం..
కొరియాతో భారత్ డేవిస్ కప్ పోరు నేటి నుంచి బుసాన్ (కొరియా): వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ బెర్తు దక్కించుకోవడమే లక్ష్యంగా డేవిస్‌కప్‌లో దక్షిణ కొరియాతో అమీ తుమీ తేల్చుకునేందుకు భారత్ సిద్ధమైంది. శుక్రవారం నుంచి జరగనున్న ఈ టోర్నీకి భారత రెండో ర్యాంకు ఆటగాడు యుకి బాంబ్రీ గాయంతో దూరమైన నేపథ్యంలో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌తోపాటు రెండో సింగిల్స్‌లో సనమ్‌సింగ్ ఆడనున్నాడు. డబుల్స్‌లో రోహన్ బోపన్న, సాకేత్ మైనేని జతగా బరిలోకి దిగనున్నారు. తొలిరోజు జరగనున్న సింగిల్స్‌లో సోమ్‌దేవ్.. చంగ్ హియోన్‌తో తలపడనుండగా, లిమ్‌ను సనమ్‌సింగ్ ఎదుర్కోనున్నాడు. రెండో రోజు బోపన్న-సాకేత్ జోడి లీ హ్యుంగ్ తైక్-సంగ్ వూ నోహ్ జంటతో తలపడనుంది. మూడో రోజు రివర్స్ సింగిల్స్ జరగనున్నాయి. -
సోమ్‌దేవ్ సంచలనం
ఐదో ర్యాంకర్ డెల్‌పొట్రోపై విజయం దుబాయ్ ఓపెన్ దుబాయ్: భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయం సాధించాడు. తొలిసారి ప్రపంచ టాప్-5 ర్యాంకింగ్స్‌లో ఉన్న క్రీడాకారుడిపై గెలిచాడు. దుబాయ్ ఓపెన్ టోర్నీ తొలి రౌండ్లో ప్రపంచ 78వ ర్యాంకర్ సోమ్‌దేవ్ 7-6 (7/3)తో ప్రపంచ ఐదో ర్యాంకర్, రెండో సీడ్, యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ యువాన్ మార్టిన్ డెల్‌పొట్రో (అర్జెంటీనా)పై గెలిచాడు. తొలి సెట్‌ను కోల్పోయాక గాయం కారణంగా డెల్‌పొట్రో వైదొలగడంతో సోమ్‌దేవ్‌ను విజేతగా ప్రకటించారు. 67 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్లో సోమ్‌దేవ్ ఐదు ఏస్‌లు సంధించాడు. ఇద్దరూ ఒక్కోసారి తమ సర్వీస్‌ను కోల్పోయారు. అయితే స్కోరు 5-6తో ఉన్నదశలో సోమ్‌దేవ్ తన సర్వీస్‌లో 0-40తో వెనుకబడ్డా తేరుకొని మూడు సెట్ పాయింట్లు కాపాడుకున్నాడు. సర్వీస్‌ను నిలబెట్టుకొని స్కోరును సమం చేశాడు. టైబ్రేక్‌లో పైచేయి సాధించి తొలి సెట్‌ను నెగ్గాడు. క్వార్టర్స్‌లో బోపన్న జంట పురుషుల డబుల్స్‌లో బోపన్న (భారత్)- ఖురేషీ (పాకిస్థాన్) జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో ఈ ఇండో-పాక్ ద్వయం 6-1, 5-7, 10-8తో డెవిడెంకో (రష్యా)- హనెస్కూ (రుమేనియా) పై నెగ్గింది. -
సోమ్‌దేవ్‌కు టైటిల్
న్యూఢిల్లీ: నాలుగేళ్ల విరామం తర్వాత భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ ఫైనల్లో సోమ్‌దేవ్ టాప్ సీడ్ అలెగ్జాండర్ నెదోవ్‌యెసోవ్ (కజకిస్థాన్)ను ఓడించాడు. 59 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సోమ్‌దేవ్ 6-3, 6-1తో నెదోవ్యెసోవ్పై గెలిచాడు. ఫైనల్ చేరే క్రమంలో ఒక్క సెట్ కూడా కోల్పోని అతను అంతిమపోరులోనూ అదే జోరు కొనసాగించాడు. మూడు ఏస్‌లు సంధించిన ఈ భారత నంబర్‌వన్... తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. విజేతగా నిలిచిన సోమ్‌దేవ్‌కు 14,400 డాలర్ల (రూ. 8 లక్షల 93 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా సోమ్దేవ్కిది మూడో ఏటీపీ టైటిల్. -
సోమ్‌దేవ్ శుభారంభం
కోల్‌కతా: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ ప్లేయర్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సోమ్‌దేవ్ 6-4, 6-4తో మహ్మద్ సఫ్వత్ (ఈజిప్ట్)పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో భారత్‌కే చెందిన సనమ్ సింగ్ 6-1, 5-7, 4-6తో డానియల్ కాక్స్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయాడు. క్వార్టర్స్‌లో సాకేత్ జోడి డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాకేత్ మైనేని తన భాగస్వామి సనమ్ సింగ్‌తో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. తొలి రౌండ్లో సాకేత్-సనమ్ సింగ్ ద్వయం 6-2, 4-6, 10-8తో రామ్‌కుమార్ రామనాథన్-కరుణోదయ్ సింగ్ (భారత్) జోడిపై గెలిచింది. మంగళవారం జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో తీ చెన్ (చైనీస్ తైపీ)తో విష్ణువర్ధన్; ఎవగెని డాన్స్కాయ్ (రష్యా)తో సాకేత్ మైనేని; లియాంగ్ హువాంగ్ (చైనీస్ తైపీ)తో యూకీ బాంబ్రీ తలపడతారు. -
యూకీ సంచలనం
చెన్నై : ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో టాప్‌సీడ్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌కు యూకీ బాంబ్రీ షాకిచ్చాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఏడోసీడ్ యూకీ 6-2, 6-4 తేడాతో సోమ్దేవ్పై అలవోకగా విజయం సాధించాడు. ఫైనల్లో యూకీ, రష్యాకు చెందిన అన్‌సీడెడ్ అలెగ్జాండర్ కుద్రయవ్త్సేవ్తో తలపడనున్నాడు. సింగిల్స్‌లో సత్తా చాటిన యూకీ డబుల్స్‌లోనూ చెలరేగిపోయాడు. మైకేల్ వీనస్ (న్యూజిలాండ్)తో కలిసి డబుల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. యూకీ-మైకేల్ జోడి 6-2, 6-1తో రూబెన్-ఆర్టెమ్పై అలవోకగా గెలిచింది. -
సోమ్ దేవ్ కు షాకిచ్చిన యూకీ బాంబ్రీ
చెన్నై: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ సోమ్ దేవ్ వర్మన్ కు యూకీ బాంబ్రీ షాకిచ్చాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో యూకీ 6-2, 6-4 తేడాతో సోమ్ దేవ్ పై అలవోకగా విజయం సాధించాడు. ఫైనల్లో యూకీ బాంబ్రీ, రష్యాకు చెందిన అన్ సీడెడ్ అలెగ్జాండర్ కుద్రయవ్త్సేవ్ తో తలపడనున్నాడు. సింగిల్స్ లో చెలరేగిన యూకీ, డబుల్స్ కూడా చెలరేగిపోయాడు. మైఖేల్ వీనస్ తో కలిసి ఫైనల్స్ కు దూసుకెళ్లాడు. యూకీ-మైఖేల్ జోడి 6-2, 6-1 తేడాతో రూబెన్-ఆర్టెన్ లపై విజయం సాధించారు.