వరల్డ్ గ్రూప్ బెర్తు కోసం.. | Davis Cup: India fancies its chances against Korea | Sakshi
Sakshi News home page

వరల్డ్ గ్రూప్ బెర్తు కోసం..

Published Fri, Apr 4 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 5:32 AM

Davis Cup: India fancies its chances against Korea

కొరియాతో భారత్ డేవిస్ కప్ పోరు నేటి నుంచి
 బుసాన్ (కొరియా): వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ బెర్తు దక్కించుకోవడమే లక్ష్యంగా డేవిస్‌కప్‌లో దక్షిణ కొరియాతో అమీ తుమీ తేల్చుకునేందుకు భారత్ సిద్ధమైంది. శుక్రవారం నుంచి జరగనున్న ఈ టోర్నీకి భారత రెండో ర్యాంకు ఆటగాడు యుకి బాంబ్రీ గాయంతో దూరమైన నేపథ్యంలో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌తోపాటు రెండో సింగిల్స్‌లో సనమ్‌సింగ్ ఆడనున్నాడు. డబుల్స్‌లో రోహన్ బోపన్న, సాకేత్ మైనేని జతగా బరిలోకి దిగనున్నారు.
 
 తొలిరోజు జరగనున్న సింగిల్స్‌లో సోమ్‌దేవ్.. చంగ్ హియోన్‌తో తలపడనుండగా, లిమ్‌ను సనమ్‌సింగ్ ఎదుర్కోనున్నాడు. రెండో రోజు బోపన్న-సాకేత్ జోడి లీ హ్యుంగ్ తైక్-సంగ్ వూ నోహ్ జంటతో తలపడనుంది. మూడో రోజు రివర్స్ సింగిల్స్ జరగనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement