డేవిస్ కప్ లో రాణించడం కష్టమే: విజయ్ అమృత్ రాజ్
సరైన సింగిల్స్ ప్లేయర్ లేకుండా డెవిస్ కప్ లో రాణించడం కష్టమే నని ప్రఖ్యాత టెన్సిస్ ప్లేయర్ విజయ్ అమృత్ రాజ్ అన్నారు. ఈనెలాఖరులో చెక్ రిపబ్లిక్ తో జరగనున్న ప్లేఆఫ్ టోర్నీలో మన అవకాశాలు అంతంత మాత్రమే అని అన్నాడు. సోమ్ దేవ్ దేవ్ బర్మన్ కెప్టెన్సీలో టీమిండియా బరిలోదిగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీలో లియాండ్ పేస్ కూడా ఆడనున్నాడు.
దీనిపై స్పందించిన విజయ్ అమృత్ రాజ్.. లియాండ్ పేస్ రావడం వల్ల కూడా మన అవకాశాలు పెద్దగా మెరుగయ్యే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డాడు. మన టీమ్ లో కావాల్సినంత మంది డబుల్స్ ప్లేయర్స్ ఉన్నారని.. ప్రపంచ గ్రూప్ లోకి అడుగు పెట్టాలంటే.. సింగిల్స్ ప్లేయర్స్ అవసరమని చెప్పాడు. కనీసం టీమ్ లో టాప్ 50 రాంక్ సింగిల్స్ ప్లేయర్ ఉన్నా ఛాన్స్ లు ఉంటాయని.. కేవలం అత్యున్నత డబుల్స్ ప్లేయర్స్ తో డేవీస్ కప్ ప్లే ఆఫ్ లపై ఆశలు పెట్టుకోవడం అనవసరమని చెప్పాడు.
డేవిస్ కప్ లో కనీసం నాలుగు సింగిల్స్ మ్యాచ్ లు ఆడాలి.. వీటిలో కనీసం ఒక్కటైనా గెలవందే.. ముందుకు వెళ్లడం అసాధ్యం. గతంలో మనం గెలిచిన డేవిస్ కప్ మ్యాచ్ ల్లో విజయాలు కేవలం కాకతాళీయమేనని చెప్పాడు.
మరో వైపు రాజీవ్ ఖేల్ రత్న సానియా మీర్జా గురించి మాట్లాడుతూ.. సానియా టెన్నిస్ లో ఈ స్థాయికి చేరడానికి ఎంత కృషి చేసిందో తనకు తెలుసన్నాడు. సానియా మరింత కాలం సింగిల్స్ ఆడిఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.