Vijay Amritraj
-
‘హాల్ ఆఫ్ ఫేమ్’లో పేస్, విజయ్ అమృత్‌రాజ్
న్యూపోర్ట్ (అమెరికా): భారత దిగ్గజ టెన్నిస్ క్రీడాకారులు లియాండర్ పేస్, విజయ్ అమృత్‌రాజ్‌లకు గొప్ప గౌరవం లభించింది. ఈ ఇద్దరికీ అంతర్జాతీయ టెన్నిస్ ‘హాఫ్ ఆఫ్ ఫేమ్’లో చోటు కల్పించారు. ఆసియా నుంచి ఈ గౌరవం పొందిన టెన్నిస్ క్రీడాకారులు వీరిద్దరే కావడం విశేషం. 51 ఏళ్ల పేస్ వరుసగా ఏడు ఒలింపిక్స్ క్రీడల్లో (1992 బార్సిలోనా నుంచి 2016 రియో వరకు) పోటీపడ్డ ఏకైక టెన్నిస్ క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పాడు.1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో వ్యక్తిగత సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం నెగ్గిన పేస్ డేవిస్‌కప్‌లో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. తన సుదీర్ఘ కెరీర్లో పురుషుల డబుల్స్‌లో 8 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో 10 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను గెల్చుకున్న పేస్‌కు ‘ప్లేయర్ కేటగిరీ’లో హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ఎంపిక చేశారు.ఆదివారం జరిగిన కార్యక్రమంలో మహిళా దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ మార్టినా నవ్రతిలోవా చేతుల మీదుగా పేస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ పతకాన్ని అందుకున్నాడు. మరోవైపు 70 ఏళ్ల విజయ్ అమృత్‌రాజ్ 1974, 1987లలో భారత జట్టు డేవిస్‌కప్ ఫైనల్‌కు చేరుకోవడంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పటి వరకు 28 దేశాల నుంచి 267 మంది టెన్నిస్ ప్లేయర్లకు ‘హాఫ్ ఆఫ్ ఫేమ్’లో స్థానాన్ని కల్పించారు. -
’ఇండియా టెన్నిస్ బేషుగ్గా ఉంది’
-
డేవిస్ కప్ లో రాణించడం కష్టమే: విజయ్ అమృత్ రాజ్
సరైన సింగిల్స్ ప్లేయర్ లేకుండా డెవిస్ కప్ లో రాణించడం కష్టమే నని ప్రఖ్యాత టెన్సిస్ ప్లేయర్ విజయ్ అమృత్ రాజ్ అన్నారు. ఈనెలాఖరులో చెక్ రిపబ్లిక్ తో జరగనున్న ప్లేఆఫ్ టోర్నీలో మన అవకాశాలు అంతంత మాత్రమే అని అన్నాడు. సోమ్ దేవ్ దేవ్ బర్మన్ కెప్టెన్సీలో టీమిండియా బరిలోదిగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీలో లియాండ్ పేస్ కూడా ఆడనున్నాడు. దీనిపై స్పందించిన విజయ్ అమృత్ రాజ్.. లియాండ్ పేస్ రావడం వల్ల కూడా మన అవకాశాలు పెద్దగా మెరుగయ్యే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డాడు. మన టీమ్ లో కావాల్సినంత మంది డబుల్స్ ప్లేయర్స్ ఉన్నారని.. ప్రపంచ గ్రూప్ లోకి అడుగు పెట్టాలంటే.. సింగిల్స్ ప్లేయర్స్ అవసరమని చెప్పాడు. కనీసం టీమ్ లో టాప్ 50 రాంక్ సింగిల్స్ ప్లేయర్ ఉన్నా ఛాన్స్ లు ఉంటాయని.. కేవలం అత్యున్నత డబుల్స్ ప్లేయర్స్ తో డేవీస్ కప్ ప్లే ఆఫ్ లపై ఆశలు పెట్టుకోవడం అనవసరమని చెప్పాడు. డేవిస్ కప్ లో కనీసం నాలుగు సింగిల్స్ మ్యాచ్ లు ఆడాలి.. వీటిలో కనీసం ఒక్కటైనా గెలవందే.. ముందుకు వెళ్లడం అసాధ్యం. గతంలో మనం గెలిచిన డేవిస్ కప్ మ్యాచ్ ల్లో విజయాలు కేవలం కాకతాళీయమేనని చెప్పాడు. మరో వైపు రాజీవ్ ఖేల్ రత్న సానియా మీర్జా గురించి మాట్లాడుతూ.. సానియా టెన్నిస్ లో ఈ స్థాయికి చేరడానికి ఎంత కృషి చేసిందో తనకు తెలుసన్నాడు. సానియా మరింత కాలం సింగిల్స్ ఆడిఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.