వరల్డ్‌గ్రూప్–1లోనే ఉండనున్న టీమిండియా
న్యూఢిల్లీ: డేవిస్‌కప్ టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టు వరల్డ్ గ్రూప్–1లోనే కొనసాగనుంది. టోగో జట్టుతో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 4–0తో విజయం సాధించింది. తొలి రోజు శనివారం జరిగిన రెండు సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు శశికుమార్ ముకుంద్, రామ్‌కుమార్ రామనాథన్ గెలుపొందగా... రెండో రోజు ఆదివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–శ్రీరామ్ బాలాజీ జంట 6–2, 6–1తో ఎంలాపా అకోమోలో–ఇసాక్ పాడియో (టోగో) ద్వయంపై నెగ్గింది. దాంతో భారత్ 3–0తో విజయాన్ని ఖరారు చేసుకుంది.
ఫలితం తేలిపోయినా ప్రాక్టీస్ కోసం భారత జట్టు నాలుగో మ్యాచ్‌ను ఆడేందుకు సిద్ధమైంది. నాలుగో మ్యాచ్‌లో కరణ్ సింగ్ 6–2, 6–3తో పాడియోను ఓడించాడు. నామమాత్రమైన ఐదో మ్యాచ్‌ను ఆడకూడదని రెండు జట్లు నిర్ణయం తీసుకున్నాయి. డబుల్స్ మ్యాచ్ ద్వారా హైదరాబాద్ ప్లేయర్ రితి్వక్ చౌదరీ డేవిస్‌కప్‌లో అరంగేట్రం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment