togo
-
భారత్ 4 టోగో 0
న్యూఢిల్లీ: డేవిస్‌కప్ టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టు వరల్డ్ గ్రూప్–1లోనే కొనసాగనుంది. టోగో జట్టుతో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 4–0తో విజయం సాధించింది. తొలి రోజు శనివారం జరిగిన రెండు సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు శశికుమార్ ముకుంద్, రామ్‌కుమార్ రామనాథన్ గెలుపొందగా... రెండో రోజు ఆదివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–శ్రీరామ్ బాలాజీ జంట 6–2, 6–1తో ఎంలాపా అకోమోలో–ఇసాక్ పాడియో (టోగో) ద్వయంపై నెగ్గింది. దాంతో భారత్ 3–0తో విజయాన్ని ఖరారు చేసుకుంది. ఫలితం తేలిపోయినా ప్రాక్టీస్ కోసం భారత జట్టు నాలుగో మ్యాచ్‌ను ఆడేందుకు సిద్ధమైంది. నాలుగో మ్యాచ్‌లో కరణ్ సింగ్ 6–2, 6–3తో పాడియోను ఓడించాడు. నామమాత్రమైన ఐదో మ్యాచ్‌ను ఆడకూడదని రెండు జట్లు నిర్ణయం తీసుకున్నాయి. డబుల్స్ మ్యాచ్ ద్వారా హైదరాబాద్ ప్లేయర్ రితి్వక్ చౌదరీ డేవిస్‌కప్‌లో అరంగేట్రం చేశాడు. -
భారత్ X టోగో
న్యూఢిల్లీ: డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్–1 ప్లే ఆఫ్స్‌లో భారత టెన్నిస్ జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ ఈవెంట్లో టోగో జట్టుతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. శనివారం జరగనున్న పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ల్లో శశికుమార్ ముకుంద్, రామ్‌కుమార్ రామనాథన్ బరిలోకి దిగనుండగా... ఆదివారం జరగనున్న రెండు డబుల్స్ మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ–రిత్విక్ బొల్లిపల్లి, రివర్స్ సింగిల్స్‌లో శశికుమార్ ముకుంద్, రామ్‌కుమార్ రామ్‌నాథన్ ఆడనున్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే... భారత జట్టు సెప్టెంబర్‌లో జరగనున్న వరల్డ్ గ్రూప్–1లో పోటీ పడనుంది. చాన్నాళ్ల తర్వాత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శశికుమార్ ముకుంద్ మెరుగైన ప్రదర్శన చేయాలని చూస్తుండగా... ఇటీవల తన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ బరిలోకి దిగిన తెలుగు కుర్రాడు బొల్లిపల్లి రిత్విక్ చౌదరి జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయనున్నాడు.శ్రీరామ్ బాలాజీతో కలిసి అతడు డబుల్స్ మ్యాచ్ ఆడనున్నాడు. ఇటీవలి కాలంలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న రిత్విక్ చౌదరి మాట్లాడుతూ... ‘కల నిజమైనట్లు ఉంది. జాతీయ జట్టు తరఫున మంచి ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా’ అని అన్నాడు. రిత్విక్తో కలిసి ఆడటం ఆనందంగా ఉందని ఇద్దరి మధ్య చక్కటి అవగాహన ఉందని... పరిస్థితులను త్వరగా ఆకలింపు చేసుకోవడం రిత్విక్‌కు అలవాటు అని బాలాజీ పేర్కొన్నాడు. శనివారం జరగనున్న తొలి సింగిల్స్ మ్యాచ్‌లో లివో అజావోన్ (టోగో)తో శశికుమార్ ముకుంద్, థామస్ సెటోజీ (టోగో)తో రామ్‌కుమార్ రామనాథన్ తలపడనున్నారు. -
మండే భాస్వరం!
టోగో పశ్చిమ ఆఫ్రికాలోని చిన్న దేశం టోగో. ‘టోగో’ అంటే ఎవ్ భాషలో ‘నీటి మీద ఉన్న ఇల్లు’ అని అర్థం. ఈ దేశానికి పశ్చిమాన ఘనా, తూర్పులో బెనిన్, ఉత్తరాన బర్కిన ఫాసో దేశాలు ఉన్నాయి. పదకొండు, పదహారవ శతాబ్దాల మధ్యలో రకరకాల తెగల ప్రజలు టోగో భూభాగంలోకి ప్రవేశించారు. 18వ శతాబ్దంలో బానిసల కొనుగోలు వ్యాపారానికి టోగో అతి పెద్ద వ్యాపార కేంద్రంగా ఉండేది. 1884లో టోగోల్యాండ్ను తన అధీనంలోకి తెచ్చుకుంది జర్మనీ. ఎన్నో తెగల ప్రజలు నివసించే టోగోలో జనాభా పరంగా ‘ఎవ్’ తెగ ఆధిక్యత ఎక్కువ. దేశంలో 70 శాతం మందికి వ్యవసాయమే ప్రధాన ఆధారం. జర్మనీ అధీనంలో ఉన్న టోగోల్యాండ్ ను ఫ్రెంచ్, బ్రిటిష్ దళాలు 1914లో ఆక్రమించుకున్నాయి. మూడింట ఒక వంతు బ్రిటిష్ వారి అధీనంలో, రెండు వంతులు ఫ్రాన్సు అధీనంలో ఉండిపోయింది టోగోల్యాండ్. ఫ్రాన్సు నుంచి 1960లో స్వాతంత్య్రం పొందింది టోగోల్యాండ్. పరిపాలన పరంగా టోగోను 5 విభాగాలుగా విభజించారు. 1. సవనెస్ 2. కర 3. సెంట్రల్ 4. ప్లెటక్స్ 5. మారిటైమ్. ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందిన టోగోల్యాండ్కు తొలి అధ్యక్షుడు సిల్వెనస్ ఒలింపియో. 1963లో జరిగిన సైనిక తిరుగుబాటులో సిల్వెనస్ హత్యకు గురయ్యాడు. సాయుధ దళాల నాయకుడిగా గాసింబే అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో దేశంలో నియంతృత్వ పాలన మొదలైంది. రాజకీయ పార్టీలన్నీ నిషేధించబడ్డాయి. మూడు దశాబ్దాలకు పైగా తన నియంతృత్వంతో టోగోను పాలించాడు గాసింబే. ఈ నియంత మరణించిన తరువాత కొడుకు ఫారే గాసింబే దేశ అధ్యక్ష పదవిని చేపట్టాడు. రాజకీయ పార్టీల మీద ఉన్న నిషేధాన్ని తొలగించడం, ప్రజాస్వామ్య అనుకూల రాజ్యాంగాన్ని ఆమోదించడంలాంటి చర్యలు చేపట్టినా... దేశంలో నియంతృత్వం మాత్రం పోలేదు. మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో టోగో నియంతృత్వ పాలకులపై అంతర్జాతీయంగా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీలతో టోగోకు బలమైన చారిత్రక, సాంస్కృతిక బంధాలు ఉన్నాయి. సాంస్కృతిక, చారిత్రక విలువల మాట ఎలా ఉన్నా... రాజకీయ అశాంతి కారణంగా అభివృద్ధికి దూరంగా జరిగి... ఆఫ్రికాలోని ఒక పేదదేశంగా మాత్రమే ఉండిపోయింది టోగో. టాప్ 10 1. టోగోలో ఎన్నో చిన్న సరస్సులు ఉన్నాయి. వీటిలో పెద్ద సరస్సు పేరు టోగో. 2. జాతీయ జెండాలోని పచ్చటి భాగాలు ఆశ, వ్యవసాయానికి ప్రతీకలు. 3. {ఫెంచ్ అధీనంలోని ‘టోగోల్యాండ్’ 1960లో ‘టోగో’గా మారింది. 4. దేశం నుంచి ఎగుమతి అయ్యే ప్రధాన ఉత్పత్తులు ఫాస్ఫేట్, కోకో, పత్తి. 5. రాజధాని లోమ్లో పెద్ద వూడూ మార్కెట్ ఉంది. 6. ఫాస్ఫేట్ ఉత్పత్తిలో టోగో ప్రపంచంలో నాలుగవ స్థానంలో ఉంది. 7. దేశంలో ప్రసిద్ధ ఆట ఫుట్‌బాల్. 8. యునెటైడ్ నేషన్స్, ఆఫ్రికన్ యూనియన్. ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికా... మొదలైన వాటిలో టోగోకు సభ్యత్వం ఉంది. 9. అధికార భాష ఫ్రెంచ్‌తో పాటు ఎవ్, మిన, డగోంబ... మొదలైన ఆఫ్రికన్ భాషలు కూడా దేశంలో మాట్లాడతారు. 10. పశ్చిమ ఆఫ్రికాలోని ఇతర దేశాలతో పోల్చితే టోగో పర్యాటకరంగంలో ముందంజలో ఉంది. -
అది బినామీ కంపెనీయే: పనామా పత్రాలు
పనామా పత్రాలు బయటకొచ్చినప్పడే.. ఈ వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం నిర్వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్‌లో డైరెక్టర్ అయిన మోటపర్తి శివరామ వరప్రసాద్(67)కు సంబంధించిన టోగోలోని వాసెం కంపెనీ గురించిన విస్తృత కథనాలు బయటకొచ్చాయి. వాసెమ్ కంపెనీలో బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న కెన్లెమ్ లిమిటెడ్‌కు 40 శాతం వాటా ఉన్నట్లు పనామా పత్రాలు వెల్లడించాయి. అయితే కెన్లెమ్ లిమిటెడ్ కంపెనీలో 24 శాతం షేర్లు మోటపర్తి శివరామ ప్రసాద్వే ఉండటం ఇక్కడ గమనించాల్సిన విషయం. అయితే ఈ కెన్లెమ్ కంపెనీ యజమానులు వేరే ఉన్నారని పనామా పత్రాలు అనుమానం వ్యక్తం చేశాయి. దాంతో ఇది బినామీ పేర్ల మీద నడుస్తున్న కంపెనీ అని, దీని అసలు యజమానులు వేరే ఉన్నారని పనామా పత్రాలు వెల్లడించాయి. టోగోలో ఉన్న వాసెం సిమెంటు కంపెనీలో 89 శాతం షేర్లు విదేశీయులవే అని, ఈ షేర్ హోల్డర్లలో ఒకరు మోటపర్తి శివరామ ప్రసాద్ అని పనామా పత్రాలు వెల్లడించాయి. నామమాత్రపు కంపెనీ పేరు మీద పన్నులు ఎగ్గొట్టారన్న ఆరోపణలు దీనిపై ఉన్నాయి. ప్రస్తుతం మోటపర్తి ఘనాలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆర్థిక వ్యవహారాల నిబంధనలను ఉల్లంఘించి పన్ను ఎగ్గొట్టే లక్ష్యంతోనే బినామీల పేర్లమీద ఈ కంపెనీని ఏర్పాటు చేసినట్లు పనామా పత్రాలు పేర్కొన్నాయి. అయితే అక్కడ ఉన్న కంపెనీలలో 61 శాతం షేర్ హోల్డర్లు ఎవరనే విషయం టోగో వారికి తెలియదని పనామా పత్రాలు తెలిపాయి.