మండే భాస్వరం! | Phosphorus burns! | Sakshi
Sakshi News home page

మండే భాస్వరం!

Published Sun, Jun 12 2016 3:06 AM | Last Updated on Mon, Sep 4 2017 2:15 AM

మండే భాస్వరం!

మండే భాస్వరం!

టోగో
పశ్చిమ ఆఫ్రికాలోని చిన్న దేశం టోగో. ‘టోగో’ అంటే ఎవ్ భాషలో ‘నీటి మీద ఉన్న ఇల్లు’ అని అర్థం. ఈ దేశానికి పశ్చిమాన ఘనా, తూర్పులో బెనిన్, ఉత్తరాన బర్కిన ఫాసో దేశాలు ఉన్నాయి. పదకొండు, పదహారవ శతాబ్దాల మధ్యలో రకరకాల తెగల ప్రజలు టోగో భూభాగంలోకి ప్రవేశించారు. 18వ శతాబ్దంలో బానిసల కొనుగోలు వ్యాపారానికి టోగో అతి పెద్ద వ్యాపార కేంద్రంగా ఉండేది. 1884లో టోగోల్యాండ్‌ను తన అధీనంలోకి తెచ్చుకుంది జర్మనీ.
 
ఎన్నో తెగల ప్రజలు నివసించే టోగోలో జనాభా పరంగా ‘ఎవ్’ తెగ ఆధిక్యత ఎక్కువ. దేశంలో 70 శాతం మందికి వ్యవసాయమే ప్రధాన ఆధారం.
 
జర్మనీ అధీనంలో ఉన్న టోగోల్యాండ్ ను  ఫ్రెంచ్, బ్రిటిష్ దళాలు 1914లో  ఆక్రమించుకున్నాయి. మూడింట ఒక వంతు బ్రిటిష్ వారి అధీనంలో, రెండు వంతులు ఫ్రాన్సు అధీనంలో ఉండిపోయింది టోగోల్యాండ్. ఫ్రాన్సు నుంచి 1960లో స్వాతంత్య్రం పొందింది టోగోల్యాండ్.
 
పరిపాలన పరంగా టోగోను 5 విభాగాలుగా విభజించారు.
 1. సవనెస్ 2. కర 3. సెంట్రల్ 4. ప్లెటక్స్  5. మారిటైమ్.
 ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందిన టోగోల్యాండ్‌కు తొలి అధ్యక్షుడు సిల్వెనస్ ఒలింపియో. 1963లో జరిగిన సైనిక తిరుగుబాటులో సిల్వెనస్ హత్యకు గురయ్యాడు. సాయుధ దళాల నాయకుడిగా గాసింబే అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో దేశంలో నియంతృత్వ పాలన మొదలైంది. రాజకీయ పార్టీలన్నీ నిషేధించబడ్డాయి.
 
మూడు దశాబ్దాలకు పైగా తన నియంతృత్వంతో టోగోను పాలించాడు గాసింబే. ఈ నియంత మరణించిన తరువాత కొడుకు ఫారే గాసింబే దేశ అధ్యక్ష పదవిని చేపట్టాడు. రాజకీయ పార్టీల మీద ఉన్న నిషేధాన్ని తొలగించడం, ప్రజాస్వామ్య అనుకూల రాజ్యాంగాన్ని ఆమోదించడంలాంటి చర్యలు చేపట్టినా... దేశంలో నియంతృత్వం మాత్రం పోలేదు. మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో టోగో నియంతృత్వ పాలకులపై అంతర్జాతీయంగా అనేక ఆరోపణలు ఉన్నాయి.
 
ఫ్రాన్స్, జర్మనీలతో టోగోకు బలమైన చారిత్రక, సాంస్కృతిక బంధాలు ఉన్నాయి. సాంస్కృతిక, చారిత్రక విలువల మాట ఎలా ఉన్నా... రాజకీయ అశాంతి కారణంగా అభివృద్ధికి దూరంగా జరిగి... ఆఫ్రికాలోని ఒక పేదదేశంగా మాత్రమే ఉండిపోయింది టోగో.
 
టాప్ 10
 1.    టోగోలో ఎన్నో చిన్న సరస్సులు ఉన్నాయి. వీటిలో పెద్ద సరస్సు పేరు టోగో.
 2.    జాతీయ జెండాలోని పచ్చటి భాగాలు ఆశ, వ్యవసాయానికి ప్రతీకలు.
 3.    {ఫెంచ్ అధీనంలోని ‘టోగోల్యాండ్’ 1960లో ‘టోగో’గా మారింది.
 4.    దేశం నుంచి ఎగుమతి అయ్యే ప్రధాన ఉత్పత్తులు ఫాస్ఫేట్, కోకో, పత్తి.
 5.    రాజధాని లోమ్‌లో పెద్ద వూడూ మార్కెట్ ఉంది.
 6.    ఫాస్ఫేట్  ఉత్పత్తిలో టోగో ప్రపంచంలో నాలుగవ స్థానంలో ఉంది.
 7.    దేశంలో ప్రసిద్ధ ఆట ఫుట్‌బాల్.
 8.    యునెటైడ్ నేషన్స్, ఆఫ్రికన్ యూనియన్.  ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికా... మొదలైన వాటిలో టోగోకు సభ్యత్వం ఉంది.
 9.    అధికార భాష ఫ్రెంచ్‌తో పాటు ఎవ్, మిన, డగోంబ... మొదలైన ఆఫ్రికన్ భాషలు కూడా దేశంలో మాట్లాడతారు.
 10. పశ్చిమ ఆఫ్రికాలోని  ఇతర దేశాలతో పోల్చితే  టోగో పర్యాటకరంగంలో ముందంజలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement