Business Centre
-
‘దళితబంధు’.. పుట్నాల్లా పంచేది కాదు
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకం పుట్నాలు, బఠానీల మాదిరిగా పంచేది కాదని, సంపదను పునరుత్పత్తి చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(డిక్కి) ఆధ్వర్యంలో సైఫాబాద్‌లో ఏర్పాటు చేసిన బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్, మోడల్ కెరీర్ సెంటర్‌ను బుధవారం కేటీఆర్ ప్రారంభించారు. తెలంగాణలో పరిశ్రమలు స్థాపించే వారి కోసం టీఎస్ ఐపాస్ నుంచి 15 రోజుల్లోనే అన్ని అనుమతులు జారీ చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఇలా అందరి ముందు ఉన్నటువంటి అతిపెద్ద సవాల్ ఉపాధికల్పన, నిరుద్యోగం అన్నారు. ‘దేవుడు అందరినీ సమానంగానే పుట్టించి ఒకటే రక్తం, ఒకటే బుర్రను ఇచ్చినా అవకాశాలను మాత్రం సమానంగా ఇవ్వలేదు, మనుషులు కులం, మతం పేరిట విభజించబడి డబ్బున్నవారు, లేనివారిగా సమాజం అవతరించింది’అని పేర్కొన్నారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. రాష్ట్రంలో అనుకూల వాతావరణం దేశంలో ఎక్కడాలేనివిధంగా ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనుకూల వాతావరణం తెలంగాణలో ఉందని డిక్కి జాతీయ అధ్యక్షుడు నర్రా రవికుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విధానాలకు డిక్కి నమూనా ఆదర్శ చాప్టర్‌గా తయారైందని డిక్కి వ్యవస్థాపక అధ్యక్షుడు మిళింద్ తుంబ్లే అన్నారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా తెలంగాణ పాలసీని ప్రస్తావిస్తున్నామని, ఇతర రాష్ట్రాలు కూడా ఈ తరహా పాలసీ కోసం ప్రయత్నిస్తున్నాయన్నారు. సమావేశంలో టీఎస్ఐఐసీ ౖచైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
మండే భాస్వరం!
టోగో పశ్చిమ ఆఫ్రికాలోని చిన్న దేశం టోగో. ‘టోగో’ అంటే ఎవ్ భాషలో ‘నీటి మీద ఉన్న ఇల్లు’ అని అర్థం. ఈ దేశానికి పశ్చిమాన ఘనా, తూర్పులో బెనిన్, ఉత్తరాన బర్కిన ఫాసో దేశాలు ఉన్నాయి. పదకొండు, పదహారవ శతాబ్దాల మధ్యలో రకరకాల తెగల ప్రజలు టోగో భూభాగంలోకి ప్రవేశించారు. 18వ శతాబ్దంలో బానిసల కొనుగోలు వ్యాపారానికి టోగో అతి పెద్ద వ్యాపార కేంద్రంగా ఉండేది. 1884లో టోగోల్యాండ్ను తన అధీనంలోకి తెచ్చుకుంది జర్మనీ. ఎన్నో తెగల ప్రజలు నివసించే టోగోలో జనాభా పరంగా ‘ఎవ్’ తెగ ఆధిక్యత ఎక్కువ. దేశంలో 70 శాతం మందికి వ్యవసాయమే ప్రధాన ఆధారం. జర్మనీ అధీనంలో ఉన్న టోగోల్యాండ్ ను ఫ్రెంచ్, బ్రిటిష్ దళాలు 1914లో ఆక్రమించుకున్నాయి. మూడింట ఒక వంతు బ్రిటిష్ వారి అధీనంలో, రెండు వంతులు ఫ్రాన్సు అధీనంలో ఉండిపోయింది టోగోల్యాండ్. ఫ్రాన్సు నుంచి 1960లో స్వాతంత్య్రం పొందింది టోగోల్యాండ్. పరిపాలన పరంగా టోగోను 5 విభాగాలుగా విభజించారు. 1. సవనెస్ 2. కర 3. సెంట్రల్ 4. ప్లెటక్స్ 5. మారిటైమ్. ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందిన టోగోల్యాండ్కు తొలి అధ్యక్షుడు సిల్వెనస్ ఒలింపియో. 1963లో జరిగిన సైనిక తిరుగుబాటులో సిల్వెనస్ హత్యకు గురయ్యాడు. సాయుధ దళాల నాయకుడిగా గాసింబే అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో దేశంలో నియంతృత్వ పాలన మొదలైంది. రాజకీయ పార్టీలన్నీ నిషేధించబడ్డాయి. మూడు దశాబ్దాలకు పైగా తన నియంతృత్వంతో టోగోను పాలించాడు గాసింబే. ఈ నియంత మరణించిన తరువాత కొడుకు ఫారే గాసింబే దేశ అధ్యక్ష పదవిని చేపట్టాడు. రాజకీయ పార్టీల మీద ఉన్న నిషేధాన్ని తొలగించడం, ప్రజాస్వామ్య అనుకూల రాజ్యాంగాన్ని ఆమోదించడంలాంటి చర్యలు చేపట్టినా... దేశంలో నియంతృత్వం మాత్రం పోలేదు. మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో టోగో నియంతృత్వ పాలకులపై అంతర్జాతీయంగా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీలతో టోగోకు బలమైన చారిత్రక, సాంస్కృతిక బంధాలు ఉన్నాయి. సాంస్కృతిక, చారిత్రక విలువల మాట ఎలా ఉన్నా... రాజకీయ అశాంతి కారణంగా అభివృద్ధికి దూరంగా జరిగి... ఆఫ్రికాలోని ఒక పేదదేశంగా మాత్రమే ఉండిపోయింది టోగో. టాప్ 10 1. టోగోలో ఎన్నో చిన్న సరస్సులు ఉన్నాయి. వీటిలో పెద్ద సరస్సు పేరు టోగో. 2. జాతీయ జెండాలోని పచ్చటి భాగాలు ఆశ, వ్యవసాయానికి ప్రతీకలు. 3. {ఫెంచ్ అధీనంలోని ‘టోగోల్యాండ్’ 1960లో ‘టోగో’గా మారింది. 4. దేశం నుంచి ఎగుమతి అయ్యే ప్రధాన ఉత్పత్తులు ఫాస్ఫేట్, కోకో, పత్తి. 5. రాజధాని లోమ్లో పెద్ద వూడూ మార్కెట్ ఉంది. 6. ఫాస్ఫేట్ ఉత్పత్తిలో టోగో ప్రపంచంలో నాలుగవ స్థానంలో ఉంది. 7. దేశంలో ప్రసిద్ధ ఆట ఫుట్‌బాల్. 8. యునెటైడ్ నేషన్స్, ఆఫ్రికన్ యూనియన్. ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికా... మొదలైన వాటిలో టోగోకు సభ్యత్వం ఉంది. 9. అధికార భాష ఫ్రెంచ్‌తో పాటు ఎవ్, మిన, డగోంబ... మొదలైన ఆఫ్రికన్ భాషలు కూడా దేశంలో మాట్లాడతారు. 10. పశ్చిమ ఆఫ్రికాలోని ఇతర దేశాలతో పోల్చితే టోగో పర్యాటకరంగంలో ముందంజలో ఉంది.