cultural
-
ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్‌కు పిలుపు..
ఘనం.. వారిరువురూ వృత్తి రిత్యా నగిషీ కళాకారులు.. వారసత్వంగా వచ్చిన వృత్తిపై మామకారాన్ని పెంచుకున్నారు. అంతటితో ఆగకుండా తమ వృత్తికి కళాత్మకతను జోడించి వివిధ కళారూపాలను తీర్చిదిద్దారు. తమ కళతో అందరినీ మెప్పించి అనేకమందిని ఆకర్షించారు. తమలోని భిన్నమైన కళతో ప్రముఖుల నుంచి శభాష్ అనిపించుకుంటున్నారు. వారే హైదరాబాద్‌లోని అంబర్‌పేట డీడీ కాలనీలో నివసించే కృష్ణాచారి, గౌరిదేవి దంపతులు.. గత 30 ఏళ్లుగా వెండితో ఫిలిగ్రీ కళారూపాలను తయారు చేస్తూ తమదైన ముద్ర వేసుకున్నారు. వీరి కళను గుర్తించి కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను అందించి అభినందించింది. వీరి ఫిలిగ్రీ కళలో చేస్తున్న కృషికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటిప్పుడు గుర్తించి పలు అవార్డులను అందించి సత్కరిస్తున్నాయి. గణతంత్ర వేడుకలకు.. ఫిలిగ్రీ కళలో వీరి ప్రతిభను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకలకు వీరిని ఆహా్వనించింది. 2025 జనవరి 26న జరిగే వేడుకల్లో పాల్గొనాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే కబురు అందింది. ఈ నెల 23న ఢిల్లీకి చేరుకోవాల్సిందిగా కోరింది. దీంతో కృష్ణాచారి, గౌరిదేవి దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశ గణతంత్ర వేడుకలకు తమను ప్రత్యేకంగా ఆహ్వానించడంతో ఎంతో గర్వంగా ఉందన్నారు. ఢిల్లీ వెళ్లడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నామని వారు సాక్షితో వెల్లడించారు. వివిధ కళారూపాలు.. వెండితో గత 30 ఏళ్లుగా వివిధ కళారూపాలను రూపొందిస్తున్నామన్నారు. ప్రజలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో అతిథుల జ్ఞాపికలు అందించేందుకు తమను సంప్రదించి ప్రత్యేక కళారూపాలను తయారు చేయించుకుని వెళ్తారన్నారు. వెండితో చార్మినార్, హైటెక్ సిటీ, చారిత్రాత్మక గుర్తులు, వీణ, రాట్నం, వెండి బుట్టలు వంటి కళారూపాలను రూపొందించామన్నారు. అవసరమైన వారికి తాము చెప్పిన రీతిలో అందిస్తామంటున్నారు. కళను గుర్తించి.. కృష్ణాచారి శ్రమ, కళను గుర్తించి 2006 అప్పటి రాష్ట్రపతి ప్రతిభపాటిల్ జాతీయ అవార్డు అందజేశారు. తన సతీమణ గౌరిదేవికి 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ అవార్డు అందజేశారు. వీటితో పాటు రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులను ఈ దంపతులు అందుకున్నారు. ఫిలిగ్రీ కళ తరపున రాష్ట్ర, దేశ బృందాల్లో వీరు చోటు సంపాదించుకుని తమదైన ముద్ర వేస్తున్నారు. మహేశ్వరం బీసీ హాస్టల్ విద్యార్థి గొల్ల అక్షయ్ మహేశ్వరం : దేశ రాజధాని ఢిల్లీలో జరిగే కర్తవ్య ఫరేడ్ విక్షించడానికి ప్రధాన మంత్రి యశస్వి పథకం కింద తెలంగాణ నుండి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం బీసీ హస్టల్లో తొమ్మిదో తరగతి చదివే విద్యార్థి గొల్ల అక్షయ్ ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రదర్శన కారులు, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆదర్శంగా నిలిచన వారిని, ఇలా తెలంగాణ రాష్ట్రం నుండి 31 మందిని ఎంపిక చేశారు. ఇందులో మహేశ్వరం బీసీ హస్టల్లో ఉంటూ స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్న గొల్ల అక్షయ్‌ని ఎంపిక చేశారు. అక్షయ్ స్వగ్రామం కొల్పూరు, మండలం మగనూర్, నారాయణపేట్ జిల్లా. నీరుపేద కుటుంబానికి చెందిన అక్షయ్ తల్లి చిన్న తనంలో మరణించడంతో గొర్లకాపరి అయిన తండ్రి రంగప్ప కులవృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన ఇద్దరి పిల్లలనూ 2021లో మహేశ్వరం బీసీ హస్టల్లో చేర్పించారు. అక్షయ్ చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనభరుస్తున్నాడు. హస్టల్ వార్డెన్ కృష్ణ ప్రోత్సాహంతో ఓబీసీ, ఈబీసీ విద్యార్థులకు ప్రధాన మంత్రి యశస్వి పథకం కింద ఆర్థిక సాయాన్ని సంవత్సరానికి రూ.2 లక్షల ఉపకారవేతనం ప్రత్యేకంగా అందిస్తోంది. అక్షయ్ ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మొయినాబాద్ నుంచి బాత్కు అశ్విని.. మొయినాబాద్ రూరల్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నుంచి బాత్కు అశ్విని ముఖ్య అతిథిగా ఆహా్వనితులయ్యారు. ఈ మేరకు ఢిల్లీ హోంశాఖ విడుదల చేసిన స్పెషల్ కేటగిరి తెలంగాణ జాబితాలో 31 మంది ప్రత్యేక అతిథుల పేర్లల్లో అశ్విని ఆహా్వనం పొందారు. వివిధ రంగాలు, ప్రభుత్వ పతకాల వినియోగదారుల జాబితాలో మొయినాబాద్ మాడల్ మండల సమైక్యకు చెందిన బాత్కు అశ్విని ఆహా్వనం పొందడంతో ఆమె హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
TCSS ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్(TCSS)ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు సంబవాంగ్ పార్క్‌లో అక్టోబర్ 5న(శనివారం) ఎంతో కన్నుల పండుగగా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరు సాంప్రదాయ పాటలు ఆటలతో ఎంతో హుషారుగా గడిపారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సింగపూర్ బతుకమ్మ ఉయ్యాలో పాటలతో ఈ వేడుకలు మిన్నంటాయి. ఈ సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు ఎంతో మంది ఎన్నారైలు సుమారు 4000 నుండి 5000 వరకు పాల్గొని బతుకమ్మ ఆడారు. సింగపూర్ లో నివసిస్తున్న తెలుగు వారందరికీ , స్థానికులకు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తు దశాబ్దానికి పైగా సింగపూర్‌లో బతుకమ్మ పండుగకు విశేష ఆదరణ కలుగజేయడం ద్వారా టీసీఎస్ఎస్ చరిత్రలో నిలిచిపోయిందని సొసైటీ సభ్యులు అన్నారు. ఈ సంబురాల్లో అందంగా ముస్తాబైన బతుకమ్మలకు, ప్రత్యేక సాంప్రదాయ, ఉత్తమ వస్త్రధారణలో మహిళలకు గృహ ప్రవేశ్, సౌజన్య డెకార్స్, ఎల్ఐఎస్ జువెల్స్ , బీఎస్కే కలెక్షన్స్ వారు ప్రత్యేక బహుమతులు అందజేశారు.ఇరు తెలుగు రాష్ట్రాల తెలుగువారు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ వైభవాన్ని చాటి చెప్పడం ఎంతో సంతోషకరమని, బరాలు విజయవంతంగా జరుగుటకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ టీసీఎస్ఎస్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. టీసీఎస్ఎస్తో ప్రేరణ పొంది ఇతర సంస్థలు కూడా బతుకమ్మ నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు.ఈ వేడుకల్లో టీసీఎస్ఎస్ ప్రత్యేకంగా తయారు చేయించిన బతుకమ్మ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా విడుదల చేసిన సింగపూర్ బతుకమ్మ ప్రోమో పాట "సింగపూర్ కొచ్చే శివుని పెండ్లాము.. సిరులెన్నో తీసుకొచ్చే మా పువ్వుల కోసము.." యూట్యూబ్‌లో విడుదల చేసినప్పటి నుంచి వేల వీక్షణాలతో దూసుకుపోతుందని తెలిపారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికీ సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి , కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు రోజా రమణి, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.వీరితో పాటు సొసైటీ మహిళా విభాగ సభ్యులు రోజా రమణి, గడప స్వాతి, బసిక అనిత రెడ్డి, జూలూరు పద్మజ, సునీత రెడ్డి, హేమ లత, దీప నల్ల,కాసర్ల వందన, బొందుగుల ఉమా రాణి, నంగునూరు సౌజన్య, నడికట్ల కళ్యాణి, హరిత విజాపుర్, ఆవుల సుష్మ, పులిగిల్ల హరిత, సౌజన్య మాదారపు, ఎర్రమ రెడ్డి దీప్తి, సృజన వెంగళ, హర్షిణి మామిడాల, సుధా రాణి పెసరు ఈ బతుకమ్మ పండుగ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. సింగపూర్ వేడుకలను సొసైటీ ఫేస్బుక్ ,యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.ఈ వేడుకలకు సహకారం అందించిన సంపంగి రియాలిటి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, మై స్క్వేర్ ఫీట్ (గృహప్రవేశ్) ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో, సరిగమ గ్రాండ్ రెస్టారెంట్ అండ్ బిస్ట్రో, జి.ఆర్.టి జ్యూవెల్లర్స్, మై హోమ్ గ్రూప్ కంస్ట్రక్షన్స్, అభిరామి జ్యూవెల్లర్స్, వీర ఫ్లేవర్స్ ఇండియన్ రెస్టారెంట్, ప్రద్ ఈవెంట్ మేనేజ్ మెంట్, జి.ఆర్.టి ఆర్ట్లాండ్, జోయాలుక్కాస్ జ్యూవెల్లర్స్, ఏ.ఎస్.బి.ఎల్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్, ఎస్.వి.ఎస్ (శ్రీవసుధ) ట్రూ వెల్త్ ఇండియా, ది ఆంధ్ర కర్రీ క్లాసిక్ ఇండియన్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్, కుమార్ ప్రాప్ నెక్స్ , గారెంటో అకాడమీ, ఎస్ పి సిస్నెట్ సొల్యూషన్ దట్స్ పర్ఫెక్ట్ , సౌజన్య హోమ్ డెకార్స్ , ఎల్.వై.ఎస్ జెవెల్స్ మరియు బి.ఎస్.కె కలెక్షన్స్, లాలంగర్ వేణుగోపాల్, రాకేష్ రెడ్డి రజిది, సతీష్ శివనాథుని, కవిత ఆనంద్ అండ్ సంతోష్ ఆమద్యల, హేమ సుభాష్ రెడ్డి దుంతుల, మల్లేష్ బారేపటి, శ్రీధర్ కొల్లూరి,చంద్ర శేఖర్ రెడ్డి కోమటిరెడ్డి, విజయ రామ రావు పొలినేని , సునీల్ కేతమక్క ,రంజిత్ రెడ్డి మండల, నాగేశ్వర్ రావు టేకూరి , బండారు శ్రీధర్ మరియు పార్క్ యాజమాన్యానికి సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ వేడుకలకు సహకారం అందజేసిన కల్వ రాజు, సుగుణాకర్ రెడ్డి రావుల, మల్లేశ్ బరపతి, చల్లా కృష్ణ, మల్లవేని సంతోష్ కుమార్, మల్లారెడ్డి కళ్లెం, బాదం నవీన్, భాను ప్రకాష్ , సాయికృష్ణ కొమాకుల , ముక్కా కిశోర్‌కు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కీ.శే. గోనె నరేందర్ రెడ్డి గారు సొసైటీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. -
రష్యా కళాకారులపై మోదీ ప్రశంసలు : అక్కడి ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని భారతీయులను కలిశారు. వారినుఉద్దేశించి ప్రసంగించారు. ప్రవాస భారతీయులతో పలు ప్రశ్నలడిగి, వారితో ఉత్సాహంగా ముచ్చటించారు. తనకు స్వాగతం పలికేందుకు ప్రదర్శించిన రష్యన్ కల్చరల్ ట్రూప్ కళాకారులతో ప్రధాని మోదీ సంభాషించారు.మాస్కోలో భారతీయ కమ్యూనిటీని ఉద్దేశించి చేసే ప్రసంగానికి ముందు త్రివర్ణ పతాకాన్ని చేబూనిన భారతీయులు చప్పట్లు, "మోదీ మోదీ" నినాదాలతో హోరెత్తించారు. అనంతరం తన ప్రసంగంలో మోదీ ఒక శుభవార్తను పంచుకున్నారు. రష్యాలో కొత్త కాన్సులేట్లను ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. కజాన్, యెకటెరిన్‌బర్గ్‌లలో భారత కాన్సులేట్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇది పర్యాటకం, వ్యాపార వాణిజ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు.ఎన్నాళ్లనుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నారని అని కళాకారులను ప్రధాని మోదీ ప్రశ్నించారు. కొంతమంది పదేళ్లు, మరికొంతమంది 30 ఏళ్లు సమాధానమిచ్చారు. కొంతమంది భారతదేశంతో, మోదీతో తమకున్న అనుభవాన్ని పంచుకున్నారు. ఇస్కాన్ మాస్కో ప్రెసిడెంట్, సాధు ప్రియా దాస్, రామ్ కృష్ణ మిషన్ నుండి స్వామి ఆత్మలోకానంద తదితరులు మాట్లాడారు.కాగా సోమవారం సాయంత్రం రష్యాలోని మాస్కోకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తన పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా ఉప ప్రధాని డెనిస్ మంత్రోవ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన ఇంటికి వచ్చిన మోదీకి పుతిన్ ఘన స్వాగతం పలికారు మోదీపై పుతిన్ ప్రశంసల్లో ముంచెత్తిన సంగతి తెలిసిందే.#WATCH | Prime Minister Narendra Modi meets artists of the Russian Cultural Troupe who performed to welcome PM Modi during his address to the Indian community in Moscow, Russia(Souce: PMO) pic.twitter.com/qUWMVkVk3K— ANI (@ANI) July 9, 2024 -
శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం!
'శ్రీ సాంస్కృతిక కళాసారథి - సింగపూర్' ఆధ్వర్యంలో పవిత్ర మతత్రయ ఏకాదశి పర్వదిన సందర్భంగా, అంతర్జాల మాధ్యమంగా ప్రత్యేక ప్రవచన కార్యక్రమము ఏర్పాటు చేశారు. పంచమహాసహస్రావధాని అవధాన సమ్రాట్ డా మేడసాని మోహన్ గారు "శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం" అనే అంశంపై రెండు గంటలపాటు ప్రవచనాన్ని అందించారు.యోగిని ఏకాదశి, మతత్రయ ఏకాదశి కలిసిన రోజు విశిష్టతను వివరించి, ఏకాదశి వ్రతమహిమను తెలియజేశారు. అనంతరం కురుక్షేత్ర సంగ్రామం ముందు పాండవులు ఆచరించిన ఏకాదశి వ్రత కథను తెలియజేశారు.కురుక్షేత్ర సంగ్రామానికి ముందు జరిగిన రాయబార ఘట్టాలనుండి సంగ్రామ సమాప్తి వరకు జరిగిన సన్నివేశాలన్నింటినీ కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తూ, తిక్కన భారతంలోని పద్యాలను ఉదహరిస్తూ, వాటిలోని సాహితీ విశిష్టతను తెలియజేస్తూ, శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధాన్ని నడిపించిన తీరు అంతా అద్భుతంగా వివరించారు. తానే కర్త, కర్మ, క్రియ అయ్యి, ధర్మసంస్థాపన మూల లక్ష్యంగా యుద్ధ సారథ్యం చేయడంలో, వివిధ సందర్భాలలో కృష్ణ భగవానుడు ప్రదర్శించిన లీలల వెనక ఉద్దేశాలను చక్కగా వర్ణించి చెప్పడం అందరినీ ఆకట్టుకుంది.శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ "డా మేడసాని మోహన్ గారు ఎంతో అభిమానంగా తమ సంస్థను ప్రోత్సహించే సహృదయులని, గతంలో కూడా వారి ప్రవచనాలను సింగపూర్ తెలుగు ప్రజలు ఆదరించారని, మతత్రయ ఏకాదశి పర్వదిన సందర్భంగా వారు ఈ ప్రత్యేక ప్రవచనం అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.సింగపూర్ నుండి కాకతీయ సాంస్కృతిక పరివారం అధ్యక్షులు పాతూరి రాంబాబు, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధి కాసర్ల శ్రీనివాస్ ఆంధ్ర కళావేదిక ఖతార్ అధ్యక్షులు వెంకప్ప భాగవతుల, ప్రతినిధి సాహిత్య జ్యోత్స్న, యూఏఈ నుంచి దినేష్, బహరేన్ తెలుగు కళా సమితి అధ్యక్షులు జగదీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.సంస్థ ప్రధాన కార్యవర్గ సభ్యురాలు రాధిక మంగిపూడి సభను నిర్వహించగా, రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక నిర్వహణలో యూట్యూబ్, ఫేస్బుక్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయగా, వెయ్యి మందికి పైగా ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్ చూసారని నిర్వాహుకులు తెలియచేసారు. -
సాగర తీరంలో ఆకట్టుకుంటున్న మొగ దారమ్మ ఆలయ శిల్ప సౌందర్యం
భారతదేశ సంస్కృతి... ప్రకృతి సౌందర్యం...ఆధ్యాత్మిక శోభ ఉట్టి పడుతూ నిర్మితమైన ఆలయంఒకవైపు పచ్చని కొండలు మరోవైపు నీలి సముద్రం... మధ్య ప్రశాంత వాతావరణంలో ఆలయం. కేవలం ఆధ్యాత్మిక చింతన మాత్రమే కాక ఆలయంలో అడుగు పెడితే మానవ జీవనశైలి... హైందవ ధర్మం... కాలచక్రం అన్ని స్పష్టంగా కనిపిస్తాయి. వందల ఏళ్లుగా పూజలు అందుకుంటున్న ఎండాడ గ్రామ దేవత ఆలయం ఇప్పుడు కొత్తగా ఆకర్షణీయంగా నిర్మితమైంది. ఆలయ చరిత్ర..ఒకప్పుడు విశాఖ నగర శివారు ప్రాంతమైన గొల్లల ఎండాడ ..ముసలయ్య పేట... సాగర్ నగర్ పరిసర ప్రాంత ప్రజలకు మొగ దారమ్మ తల్లి గ్రామ దేవతగా కొనసాగారు. అప్పట్లో పరిసర దాదాపు పది గ్రామాల ప్రజలు ఏ కష్టసుఖాల్లోనైనా అమ్మవారిని తొలి గా పూజించేవారు. ఆ రోజుల్లో అమ్మవారు ప్రతికగా ఓ చలువ పందిరి కింద పూజలు చేశారు. అయితే 1988 ప్రాంతంలో సత్య ప్రసాద్ అనే వ్యక్తి సాగర్ నగర్ పరిసరాల్లో రియల్ వ్యాపారం నిర్వహించారు. ఆతనకు కొంత కలిసి వచ్చింది. దీంతో స్థానికులు అతన్ని అక్కడ ఆలయం అభివృద్ధి చేయాలని కోరారు. ఆమేరకు ఆయన ఆలయ నిర్మాణం చేపట్టారు. అయితే ఆలయాన్ని మొక్కుబడిగా కాక ఆధ్యాత్మిక త ఉట్టిపడే రీతిన నిర్మాణం చేపట్టారు దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన శిల్పుల సహకారంతో ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో అడుగడుగునా సంస్కృతి సాంప్రదాయం కనిపిస్తుంది.వైకాశన విధానంలో ఆలయ నిర్మాణంఇక్కడ శ్రీమత్ వైకాసన విధానంలో ఆలయ నిర్మాణం జరిగింది.. ఆలయం ప్రాంగణంలో మొగ ధారమ్మ ప్రధాన దేవత ఆలయం నిర్మించారు. కుడి ఎడమల వైపు దుర్గాలమ్మ ..నూకాలమ్మ అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేశారు.ఆలయంలో ఎటు చూసినా ఆధ్యాత్మికత తో పాటు శిల్పకళా సౌందర్యం కనిపిస్తుంది. మానవ జీవితంపై ప్రభావం చూపించే గ్రహాలు వాటి అధిపతుల శిల్పాలను కూడా ఇక్కడ పొందుపరిచారు. నవ గ్రహాలు . వాటి అధిపతుల తో పాటు భారతదేశంలోని మొత్తం 12 జీవనదుల దేవతల విగ్రహాలను కూడా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. శ్రావ్యమైన సంగీతానికి అద్దం పట్టే డోలు డమరుకం..వివిధ రకాల ఫలాలను కూడా శిల్ప కలలో పొందుపరిచారు. ముఖ్యంగా 16 నాలుగు స్తంభాలపై నాలుగు రకాల వృక్షాలను చిత్రీ కరించారు.ఇక్కడ స్తంభాలపై చెక్కిన శిల్పాలు ఒక్కో రకమైన ఆలోచన స్పూర్తింపజేస్తాయి. కేరళ కర్ణాటక తమిళనాడు ప్రాంతాల్లో మాదిరిగా ఆలయాలపై ఏనుగుల దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అందులో ఇక్కడ ఆలయం వద్ద వుండే పెంపుడు ఏనుగులు.. అడవి ఏనుగులు... రాజుల కోటల వద్ద ఉండే ఏనుగుల శిల్పాలు చిత్రీకరించారు.ఏనుగు తొండం పై మానవ జీవన విధానంఆలయ ప్రధాన ద్వారానికి అటు ఇటుగా కనిపించే రెండు ఏనుగు తొండాలు పై మానవ జీవన విధానంలో మార్పులు గోచరిస్తున్నాయి. రాతి యుగంలో మానవుడు.. ఆధునిక యుగంలో మానవుడు.. గ్రామాల్లో దశలవారీగా మారిన మానవ మనుగడ పనిముట్లు తదితర అంశాలన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా పురాతన మానవ జీవితం అడవి సంపద అన్ని రకాల ప్రాణుల చిత్రాలను కూడా శిల్పాల్లో పొందుపరిచారు.ఆది దైవంగా విశ్వక్సేనుడుఆది దైవంగా గణేష్ విగ్రహానికి బదులు విశ్వక్సేనుడు విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది. ఆలయ ప్రకారం ప్రాకారం స్వస్తిక్.. కమలం... కలశం గోడలపై స్పష్టంగా కనిపిస్తాయి.సంతాన దేవతలు విగ్రహాలపై శ్రీకృష్ణుడు బ్రహ్మ జంటగా ఇక్కడ శిల్పాలను చిత్రీకరించారు. ధర్మార్థ కామ్య మోక్షాలకు ప్రతీక గా శేషశయన మూర్తి... దశావతారాలు వటపత్ర సాయి విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రధాన ఆలయం ఒకరకంగా కనిపిస్తే ఉప ఆలయాలు కోణార్క్ దేవాలయం తరహాలో రథచక్రాలతో కనిపిస్తున్నాయి.మహాలక్ష్మి దుర్గాదేవి సరస్వతి రూపాల్లో గ్రామదేవతలుఇక్కడ ప్రధాన దేవత మోగ ధారమ్మ ను మహాలక్ష్మి దేవిగా... దుర్గా దేవిని దుర్గి దేవిగా .. నూకాలమ్మను సరస్వతి దేవిగా పూజలు చేస్తుంటారు. ఇంత అందమైన ఆలయాన్ని సాగర తీరాన కొత్తగా నిర్మించడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ శిల్ప కళా సౌందర్యం తో పాటు ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది అని భక్తులు అంటున్నారు.ఆలయం చూసేందుకు వస్తున్న పాత తరం జనం..వాస్తవానికి మొగధారమ్మ పరిసర గ్రామాలకు గ్రామ దేవతగా కొనసాగారు. ఈ దశలో చిన్నతనంలో ఏమాత్రం మౌలిక సదుపాయాలు లేని స్థితిలో ఉన్న ఆలయం సమూలంగా మారడంతో చాలామంది భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాన్ని అత్యంత అద్భుతంగా నిర్మించిన వ్యక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ కొత్త శిల్ప సౌందర్యంతో ఆలయాన్ని చూసేందుకు పాతతరం జనం వస్తున్నారు ప్రధానంగా వృద్ధులు ఒక్కసారిగా ఆలయం మారిన తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.విశాఖ నుంచి ఋషికొండ వెళ్లే మార్గంలో సాగర్ నగర్ వద్ద ఉన్న ఈ ఆలయం పర్యాటకులను కూడా ఆకట్టుకుంటుంది. నిత్యం ప్రసాదంతో పాటు ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. ఈ పురాతన గ్రామదేవత ఆలయం ఇప్పుడు ఈ ప్రాంతానికి మరింత ప్రాధాన్యత పెంచిందని ఈ వార్డు కార్పొరేటర్ లోడగల అప్పారావు పేర్కొన్నారు.ఆలయ దర్శన వేళలుఉదయం 5:30 నుంచి 10:30 సాయంత్రం 5:30 నుంచి 8 గంటల మధ్య అమ్మవార్ల దర్శనాలు లభిస్తున్నాయి.విశాఖ నుంచి భీమిలి వెళ్లే మార్గంలో సాగర్ నగర్ పక్కన ఈ ఆలయం ఉంటుంది. ఈ మార్గంలో 24 గంటలు వాహనాలతో పాటు బస్సులు అందుబాటులో ఉంటాయి.-రావులవలస రామచంద్ర రావు, సాక్షి -
ఏపీలో కళాకారులకు గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)
-
దేశ సమైక్యతకు చిహ్నం ఆ భాష! జాతీయ భాషగా నీరాజనాలు అందుకుంటోంది
భాషతో బంధంజాతి నిర్మాణంలో భాష పాత్ర చాలా గొప్పది. అనేక విషయాలను అధ్యయనం చేయడం, విజ్ఞాన సాంకేతిక తదితర ఉన్నత రంగాల్లో ప్రావీణ్యత పొందడం ఒక భాష ద్వారానే సాధ్యపడుతుంది. ఒక వ్యక్తి సమగ్ర వికాసానికి భాష ఆయువుపట్టు. అదే భాష దేశాన్ని ఒకే తాటిపై నిలబడేలా, జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించినప్పుడు ఆ భాష ‘జాతీయ భాష’గా నీరాజనాలు అందుకుంటుంది. ఆ పాత్రను అక్షరాలా ‘హిందీ’ భాష నిర్వర్తించింది, నిర్వర్తిస్తోంది కూడా. భారత స్వాతంత్య్ర సమరంలో ప్రజలను జాగృత పరచడంలో క్రియాశీల పాత్ర పోషించి, ప్రపంచంలోనే అత్యధికులు మాట్లాడే రెండవ భాషగా వికసించిన భాష హిందీని కొందరు ఇంకా పరాయి భాషగా భావించడం దురదృష్టకరం. హిందీ ఒక భాష మాత్రమే కాదు, మన దేశ సమైక్యతా చిహ్నం కూడా! దేశంలో హిందీ మాట్లాడేవారు, అర్థం చేసుకునే వారు అధికంగా ఉండడం చేత కేంద్ర ప్రభుత్వము హిందీని అధికార భాషగా ప్రకటించింది. ప్రస్తుతం పదికి పైగా రాష్ట్రాలలో ప్రథమ భాషగా, మిగతా రాష్ట్రాల్లో ద్వితీయ భాషగా హిందీ ప్రచలనములో ఉన్నప్పటికీ, ఆంగ్ల భాషపై మోజుతో హిందీని నిర్లక్ష్యం చేస్తున్నారు. గాంధీజీ స్వయంగా దక్షిణ భారతదేశంలో ఈ భాష ప్రచార కార్యక్రమా నికి ‘దక్షిణ భారత హిందీ ప్రచార సభ’ స్థాపనతో శ్రీకారం చుట్టారు. ఆ మహాత్ముని ఆశయాలను అనుసరిస్తున్న మనం ఆయన విస్తరింపచేసిన భాషను తగిన విధంగా ఆదరించలేక పోవడం విచారకరం. వివిధ దేశాల్లో ఎన్నో విశ్వవిద్యాలయాల్లో హిందీని పాఠ్యాంశంగా బోధించడం గమనార్హం. కానీ, మన దేశంలో మాత్రం అంతగా హిందీకి ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. ‘త్రిభాషా సూత్రా’న్ని అనుసరించి మాతృ భాష ప్రథమ భాషగా ద్వితీయ భాషగా హిందీని, తృతీయ భాషగా ఆంగ్లం. పాఠశాల విద్యార్థులకు బోధించాలని కేంద్రం నిర్దేశించింది. కానీ కొన్ని రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు లాంటి దక్షిణాది రాష్ట్రాలు ఈ సూత్రాన్ని వ్యతిరేకిస్తున్నాయి. పరాయి భాషలు అవసరానికి ఎన్ని నేర్చుకున్నా, మన మాతృ భాష, అధికార భాషలను నిర్లక్ష్యం చేయరాదు. – భైతి దుర్గయ్య, హిందీ ఉపాధ్యాయుడు (చదవండి: మాట తప్పిన ఆత్రేయ! ముచ్చటపడ్డా.. ఆ కోరిక నెరవేరకుండానే..) -
కల్చరల్ కారిడార్ ఇన్ జీ20 కాన్ఫరెన్స్
-
సాంస్కృతిక ఏకీకరణతో సుస్థిరాభివృద్ధి
వారణాసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సాంస్కృతిక ఏకీకరణ ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకుంటూనే, ప్రపంచంలోని భిన్న సంస్కృతులను కాపాడుకునే దిశగా జీ 20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశం కాశీ కల్చరల్ పాత్వేకు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. కాశీలో మూడు రోజులపాటు జరిగిన జీ20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశాలు శనివారంతో ముగిశాయి. ప్రపంచంలోని వైవిధ్యమైన సంస్కృతి మనందరినీ కలుపుతుందని సమావేశంలోని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తన సహచర దేశాల మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ...అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే శక్తి సంస్కృతి, సంప్రదాయాలకే ఉందన్నారు. ‘కల్చర్ యునైట్స్ ఆల్’అని వ్యాఖ్యానించారు. భిన్న ప్రాంతాల్లో భిన్న సంస్కృతుల నిలయమైన భారతదేశం ‘భిన్నత్వంలో ఏకత్వాన్ని’ప్రదర్శిస్తున్నట్లే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వైవిధ్యత అన్ని దేశాలను ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు, ఒకరినొకరు సంస్కృతి, సంప్రదాయాలను మరొకరు గౌరవించుకునేందుకు వీలవుతుందన్నారు. యావత్ మానవాళిని ఏకం చేసే విషయంలో సంస్కృతి కీలకపాత్ర పోషిస్తోందని, విలువలు, భాషలు, కళలు మొదలైనవి దేశాలు, ప్రజల మధ్య సత్సంబంధాలకు బాటలు వేస్తాయని మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి ఒకరోజు ముందు జరిగిన నాలుగో వర్కింగ్ గ్రూప్ సమావేశంలోనూ ఈ అంశాలపై మరింత విస్తృతమైన చర్చ జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశాల్లో చర్చించిన అంశాల ఆధారంగా ‘కాశీ కల్చరల్ పాత్వే’కు రూపకల్పన జరిగిందని ఆయన వెల్లడించారు. రోమ్ డిక్లరేషన్, బాలి డిక్లరేషన్లలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు అంశాలు, సభ్యుల అభిప్రాయాల ఆధారంగానే ‘కాశీ కల్చరల్ పాత్వే’ను రూపొందించినట్లు కిషన్ రెడ్డి వివరించారు. ‘కాశీ కల్చరల్ పాత్వే’లోని కొన్ని ముఖ్యాంశాలు సాంస్కృతిక ఆస్తులకు పునర్వైభవాన్ని కల్పించడం, వాటిని ఆయా దేశాలకు తిరిగి అప్పగించడం ద్వారా సామాజిక న్యాయంతోపాటు నైతిక విలువలకు పట్టం గట్టాలని నిర్ణయించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు సంస్కృతి, సంప్రదాయాలకు ఉన్న శక్తి, సామర్థ్యాలను గుర్తెరిగి సరైన ప్రాధాన్యత కల్పించాలి. సంస్కృతికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తిస్తూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు సరైన పరిష్కారాలను కనుగొనడం. అన్ని సభ్యదేశాల మధ్య సమయానుగుణంగా చర్చలు జరుపుతూ.. అందరినీ భాగస్వాములను చేస్తూ ముందుకెళ్లడం. ఈ సమావేశంలో పాల్గొన్న సాంస్కృతిక శాఖ మంత్రులు.. ఆయా దేశాలకు ప్రతినిధులుగానే కాకుండా.. ఆయా దేశాలలో సాంస్కృతిక సంరక్షకులుగా ప్రపంచ సాంస్కృతిక పరిరక్షణకు ఏకతాటిపైకి వచ్చి పని చేయాలి. రోమ్, బాలి డిక్లరేషన్లు ఈ దిశగా వేసిన బలమైన పునాదుల ఆధారంగా మరింత స్పష్టమైన విధానాలతో ముందుకెళ్లాలి. -
సాంస్కృతిక సంబంధాల మెరుగుతోనే ఆర్థిక వృద్ధి
(వారణాసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) సాంస్కృతిక సంబంధాలు మెరుగుపడటం ద్వారా దేశాల మధ్య ఆర్థిక, దౌత్యపరమైన పురోభివృద్ధి సాధ్యమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. భారత్ నుంచి ఎన్నో విలువైన పురాతన విగ్రహాలు, వెలకట్టలేని అతి పురాతన విగ్రహాలు దేశం దాటి వెళ్లాయని, వాటిని తిరిగి భారత్‌కు తేవడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వారణాసిలో జరుగుతున్న జీ20 సాంస్కృతిక శాఖల మంత్రులు, అధికారుల సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. 2014 ముందు ప్రభుత్వాలు విదేశాల నుంచి కేవలం 13 పురాతన విగ్రహాలను దేశానికి తిరిగి రప్పిస్తే, మోదీ అధికారంలోకి వచ్చాక దాదాపు 400 పురాతన విగ్రహాలను రప్పించి ఆయా రాష్ట్రాలకు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. జీ20 సభ్య దేశాలు, ఆహ్వనిత దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు ఈ సదస్సులో పాల్గొన్నాయని, అందరి సమ్మతితో శనివారం వారణాసి జీ20 డిక్లరేషన్ ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం అధికారుల స్థాయిలో జరిగిన చర్చల్లో సానుకూల స్పందన వచ్చిందన్నారు. విలేకరుల సమావేశంలో ఆ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖీ, ఆ శాఖ కార్యదర్శి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. యూత్ టూరిజం క్లబ్స్దే కీలకపాత్ర విద్యార్థుల్లో వివేకం పెంపొందించేందుకు యూత్ టూరిజం క్లబ్స్ కీలకపాత్ర పోషిస్తాయని కిషన్‌రెడ్డి అన్నారు. ‘సాంస్కృతిక విరాసత్ స్పర్ధ –2023’లో భాగంగా యువ టూరిజం క్లబ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారత భవిష్యత్తు అంతా విద్యార్థులదేనని, అందుకు అధ్యాపకులు, ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో అందిస్తున్న కృషి ఎనలేనిదన్నారు. 99 శాతం విద్యపై దృష్టి పెడితే.. కనీసం ఒక్క శాతమైనా పాఠ్యేతర అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. స్పోర్ట్స్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో గానీ, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో గానీ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో సేవా తత్పరతతోపాటు దేశం పట్ల అవగాహన పెంచే లక్ష్యంతోనే ‘యువ టూరిజం క్లబ్స్’ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతీ ఇంట్లో కుటుంబసమేతంగా పర్యాటక క్షేత్రాలను సందర్శించాలంటే.. ఎక్కడకు వెళ్లాలో నిర్ణయించేది ఆ కుటుంబంలోని చిన్నారులు, విద్యార్థులేనని అన్నారు. అందుకే వారికి దేశంలోని, సమీపంలోని పర్యాటక క్షేత్రాలపై, ప్లాస్టిక్ రహిత పర్యాటకాన్ని ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. -
పర్యాటక శాఖతో ఎయిర్‌బీఎన్‌బీ ఎంవోయూ
న్యూఢిల్లీ: సాంస్కృతిక వారసత్వ పర్యాటక ప్రాంతాలకు మరింత ప్రాచుర్యం తెచ్చే దిశగా కేంద్ర టూరిజం శాఖతో ఎయిర్‌బీఎన్‌బీ జట్టు కట్టింది. తాము చేపట్టిన ’విజిట్ ఇండియా 2023’ కార్యక్రమంలో భాగంగా కేంద్రంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు సంస్థ తెలిపింది. భారతదేశ సుసంపన్న సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే దిశగా ఈ ఎంవోయూ కింద ’సోల్ ఆఫ్ ఇండియా’ పేరిట ప్రత్యేక మైక్రోసైట్‌ను ఆవిష్కరించనున్నట్లు వివరించింది. టూరిస్టులకు పెద్దగా తెలియని పర్యాటకప్రాంతాల్లో ఆతిథ్యం కలి్పంచేవారికి అవసరమైన తోడ్పా టు అందించడం, హోమ్‌స్టేలకు ప్రాచుర్యం కలి్పంచడం వంటి సేవలు అందించనుంది. విదేశీ పర్యాటకులను భారత్ వైపు ఆకర్షించేందుకు, స్థానికంగా ఉపాధి అవకాశాలు కలి్పంచేందుకు, అంతర్జాతీయ టూరిజం మ్యాప్‌లో భారత్ మరింత విశిష్ట స్థానం దక్కించుకునేందుకు ఈ ఎంవోయూ ఉపయోగపడగలదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. -
మన సంస్కృతితో యువత బంధం బలీయం: ప్రధాని
న్యూఢిల్లీ: మన దేశ అద్భుతమైన వారసత్వాన్ని పునరుజ్జీవింపజేయడం, గౌరవించడం కోసం కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా చేపట్టిన అనేక చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. ఘనమైన మన సాంస్కృతిక వారసత్వ సంపద మనకు గర్వకారణమన్నారు. తమ ప్రభుత్వం సాగించిన ప్రయత్నాల ఫలితంగానే మన యువతకు సంస్కృతితో బంధం బలపడిందని అన్నారు. శనివారం ఆయన ట్విట్టర్లో ‘9ఇయర్స్ ఆఫ్ ప్రిజర్వింగ్ కల్చర్’పేరుతో హాష్‌ట్యాగ్ చేశారు. మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఆయన పలు ట్వీట్లు చేశారు. దేశ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు. -
ఆకట్టుకుంటున్న నీతా అంబానీ ఆర్ట్ ఎగ్జిబిషన్ (ఫొటోలు)
-
తండ్రిబాటలో నడిచి..చరిత్ర సృష్టించి.. జిన్‌పింగ్ ప్రస్థానమిదే..
చైనా అధినేత షీ జిన్‌పింగ్ 1953 జూన్ 15న శాన్‌షీ ప్రావిన్స్‌లో జన్మించారు. ఆయన తండ్రి షీ షీ ఝాంగ్‌షువాన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా, చైనా ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. జిన్‌పింగ్ బాల్యం ఎక్కువగా యావోడాంగ్ అనే పల్లెటూరిలో గడిచింది. తండ్రి ఆదేశాల మేరకు సాంస్కృతిక విప్లవ సమయంలో రైతులతో కలిసి సాధారణ జీవితం గడిపారు. వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నారు. ప్రాథమిక విద్య అనంతరం సింగువా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ అభ్యసించారు. 1974లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సభ్యుడిగా చేరారు. పార్టీ శాఖ కార్యదర్శిగా రాజకీయ జీవితం ఆరంభించారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1985లో ఫుజియాన్ ప్రావిన్స్‌లోని షియామెన్ నగర ఉప మేయర్‌గా ఎన్నికయ్యారు. 1979లో కే లింగ్లింగ్‌ను వివాహం చేసుకున్నారు. మనస్పర్థల కారణంగా కొద్ది కాలానికే ఆమె నుంచి విడిపోయారు. 1987లో ప్రముఖ జానపద గాయని పెంగ్ లియువాన్‌ను వివాహం చేసుకున్నారు. వారికి కుమార్తె షీ మింగ్జే ఉన్నారు. ఆమె అమెరికాలో చదువుకుంటున్నారు. జిన్‌పింగ్ 1999 నుంచి 2002 దాకా ఫుజియాన్ గవర్నర్‌గా, 2002 నుంమచి 2007 దాకా ఝెజియాంగ్ గవర్నర్‌గా వ్యవహరించారు. 2007లో కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ(పీఎస్సీ)లో చేరారు. 2008 నుంచి 2013 దాకా చైనా ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. తొలిసారిగా 2012లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రధాన కార్యదర్శిగా, 2013లో చైనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పొగడ్తలు, తెగడ్తలు... 1949 అక్టోబర్ 1న పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆవిర్భవించింది. ఆ తర్వాత జన్మించిన తొలి సీపీసీ ప్రధాన కార్యదర్శి జిన్‌పింగే. పార్టీలో ఎన్నో సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టారు. క్రమశిక్షణకు, అంతర్గతంగా ఐక్యతకు పెద్దపీట వేశారు. అవినీతిపై ఉక్కుపాదం మోపారు. సొంత పార్టీ మాజీ నేతలకు కూడా శిక్షలు విధించారు. ఇది చైనాలో ప్రశంసలందుకుంది. కానీ ఆయన విదేశాంగ విధానంపై భిన్న స్వరాలు వినిపించాయి. పదేళ్ల జిన్‌పింగ్ పాలనలో అమెరికాతో చైనా సంబంధాలు క్షీణించాయి. భారత్‌తో సరిహద్దు వివాదాలు పెచ్చరిల్లాయి. తైవాన్ విషయంలో జిన్‌పింగ్ దూకుడు విమర్శలపాలవుతోంది. హాంకాంగ్‌లో నేషనల్ సెక్యూరిటీ చట్టం విషయంలోనూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. కరోనా పుట్టుకకు చైనాయే కారణమన్న నిందను మోయాల్సి వచ్చింది. జీరో–కోవిడ్ పాలసీ వల్ల చైనా ఆర్థిక వ్యవస్థ దిగజారుతోందన్న వాదనలున్నాయి. జిన్‌పింగ్ తయారీ రంగాన్ని ప్రోత్సహించారు. ఫలితంగా చైనా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఎదిగింది. -
అనువాదాలు అవసరమైన సామాజిక సందర్భాలు
సృజన సాహిత్యానికి ఉన్నట్లు అనువాదానికి ఒక సామాజిక సాంస్కృతిక సందర్భం ఉంటుందా? ఉంటుంది అనే చరిత్ర చెబుతున్నది. బౌద్ధ జైన మత సంస్కృతులను అభావం చేస్తూ ‘వర్ణాశ్రమ ధర్మ పరి రక్షణ’, ‘మను మార్గ వర్తన’ ప్రధానంగా గల వైదిక మత స్థాపన నాటి మత సాంస్కృతిక అవసరంగా ముందుకు వచ్చినపుడు తెలుగు సమాజానికి సంస్కృతం నుండి మహాభారత అనుసృజన అవసరమైంది. జాతీయోద్యమ నిర్మాణానికి భారతదేశపు భిన్న ప్రాంతాల, భాషల ప్రజా సమూహాల మధ్య ఐక్యతా భావాన్ని అభివృద్ధి చెయ్య వలసిన సందర్భం నుండి అనువాదం ప్రాధాన్యం లోకి వచ్చింది. దేశాల సరిహద్దులతో నిమిత్తం లేకుండా మానవ సమూహమంతా ఉన్నవాళ్లు, లేనివాళ్లు అని రెండు వర్గాలుగా విడిపోయివుందనీ, బ్రిటన్‌లోని పారిశ్రామికాభివృద్ధి నేపథ్యంలో పెట్టు బడిదారీ సమాజం అభివృద్ధి చెందిన విధానాన్ని గుర్తించి, కార్మికవర్గ అంతర్జాతీయ ఐక్యతను సంభావించిన మార్క్స్, ఎంగెల్స్ విశ్వమానవుల మధ్య సంభాషణకు తలుపులు తెరిస్తే సాహిత్య రంగంలో అది అనువాదాలకు దారితీసింది. 1917 రష్యా విప్లవ విజయం తరువాత భారత దేశంలోని కార్మిక కర్షక పోరాటాలకు స్ఫూర్తి ఇవ్వటానికి ‘అమ్మ’ (మాక్సిమ్ గోర్కీ) వంటి నవలలు తెలుగులోకి అనువాదం కావడం గమ నించవచ్చు. 1930వ దశకంలో ప్రారంభమై 1950ల వరకు సాగిన అభ్యుదయ సాహిత్యోద్యమం... ప్రపంచంలో భూస్వామ్య పెట్టుబడిదారీ ఆధిపత్యాల మీద జరిగిన తిరుగుబాట్ల చరిత్రను భిన్న దేశాల సాహిత్యం నుంచి అనువాదం చేసుకొన్నది. మరొక వైపు దేశంలోనే భిన్న ప్రాంతాలలో భూస్వామ్య పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలు వస్తువుగా వచ్చిన సాహిత్యాన్ని అనువాదం చేసుకొన్నది. మొత్తంగా ఇవన్నీ దేశం మీద జరుగుతున్న పీడితుల పోరాట చరిత్రకు నైతిక మద్దతు కూడగట్టడంలో కీలకపాత్ర పోషించాయి. అలాగే విప్లవోద్యమ అవసరాల నుండి చైనా విప్లవోద్యమం, లాటిన్ అమెరికా, ఆఫ్రికన్ దేశాలు, అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు సంబం ధించిన కథనాలు అనేకం తెలుగులోకి అనువాదం అయ్యాయి. ఈ రకమైన అనువాద చరిత్రను స్త్రీల కోణం నుండి అధ్యయనం చేయటం స్త్రీల సాహిత్య, సాంస్కృతిక చరిత్ర నిర్మాణం దృష్ట్యా అవసరం. ఇది రెండు రకాలుగా జరగాలి. ఒకటి: స్త్రీల జీవన సమస్యలను, సంఘర్షణలను చిత్రించిన సైద్ధాంతిక సృజన విమర్శన సాహిత్యాన్ని ఎంతగా తెలుగులోకి తెచ్చుకున్నాం? అందువల్ల తెలుగు సమాజ తాత్విక భావధార ఎంత పదునెక్కింది? అన్న ప్రశ్నలతో తరచి చూడటం. రెండు: అనువాదకులుగా తెలుగు స్త్రీల అభిరుచులు, ఆసక్తులు, చైతన్యం ఎటువంటివి? వారు చేసిన అనువాదాల సందర్భశుద్ధి ఎటువంటిది? వంటి ప్రశ్నలతో మదింపు చేయటం. ఇతర భాషలలోని స్త్రీల రచనలు, తెలుగులో స్త్రీలు చేసిన అనువాదాలు తెలుగు సమాజంలో మహిళా సమస్యల గురించిన అవగాహనను పదునెక్కించటంలో నిర్వహించిన పాత్రను ప్రత్యేకంగానూ, సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక సందర్భాలకు అనువాదాల ద్వారా స్త్రీలు సమకూర్చిన శక్తిని మొత్తంగానూ అర్థం చేసుకొనటాన్ని ఉద్దేశించి ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ‘అనువాద సాహిత్యం – స్త్రీ సందర్భం’ అనే అంశంపై ఆరవ మహాసభను జూలై 9, 10 తేదీలలో గుంటూరులో నిర్వహించ తలపెట్టింది. ఈ సదస్సులో పాల్గొనవలసిందిగా అందరినీ ఆహ్వాని స్తున్నది. (క్లిక్: తరతరాలనూ రగిలించే కవి) - కాత్యాయనీ విద్మహే జాతీయ కార్యదర్శి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక -
వారసత్వ రక్షణ బాధ్యత ప్రజలపైనే
కడప కల్చరల్: ముందుతరం పెద్దలు అయాచితంగా మనకు ఎంతో గొప్ప వారసత్వ సంపదను అందించారు. వాటిని పరిక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఎక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యేటా ఏప్రిల్ 18న ప్రపంచ వ్యాప్తంగా వారసత్వ దినోత్సవాన్ని నిర్వహించకుంటూ వారసత్వ సంపద పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి జరుగుతోంది. వారసత్వ సంపద పరిస్థితి గురించి ప్రత్యేక కథనం. ప్రపంచంలోని ఘనమైన వారసత్వ సంపదలో మనజిల్లాలోని గండికోట కూడా ముందు వరుసలో నిలుస్తుంది. జిల్లాలోని సిద్దవటం కోట కూడా నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచి ఉంది. సిద్దవటం కోటలో బురుజులు, గోడ కూలుతున్నాయి. వాటికి కూడా తక్షణ మరమ్మతులు అవసరం. ప్రజలకు ఈ సంపదను రక్షించుకోవాల్సిన అవసరం, బాధ్యత గురించి వివరించాల్సిన బాధ్యత గల వారు పర్యాటకులను నిబంధనల పేరిట ఇబ్బందులు పెడుతుండడంతో క్రమంగా సందర్శకుల సంఖ్యతోపాటు ఆదాయం తగ్గుతోంది. -
అలరించిన నాట్యతోరణం
సాక్షి, మాదాపూర్(హైదరాబాద్): నాట్య తోరణం పేరిట ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మాదాపూర్‌లోని సీసీఆర్టీ (సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్) సెంటర్లో శనివారం అమ్రిత కల్చరల్ అధ్వర్యంలో దేశ సంస్కృతికి ప్రతిరూపంగా నాట్య తోరణం పేరిట పలు నృత్య ప్రదర్శనలను ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ , విదేశీ కామన్వెల్త్ ఆఫీస్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్, విశ్రాంత ఐఎఎస్ అధికారి, డాక్టర్ ఎస్ చెల్లప్ప, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ఆంధ్రనాట్య విద్యాకోవిదులు ఆచార్య కళాకృష్ణ, కూచిపూడి, భరతనాట్య , విశారదుడు పసుమర్తి రామలింగశాస్త్రి, ఒడిస్సీ నాట్య విదుషీమణి నయనతార నందకుమార్, సీసీఆర్టీ ప్రత్యేక అధికారి తాడేపల్లి సత్యనారాయణ శర్మ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కూచిపూడి, కథక్, ఒడిస్సా, భరతనాట్య ప్రదర్శనలు సందర్శకులను అలరించాయి. భార్గవి పగడాల(హైదరాబాద్) కూచిపూడి నృత్య ప్రదర్శన నయన మనోహరంగా సాగింది. మురమళ్ల సురేంద్రనాథ్చే కూచిపూడి నృత్య ప్రదర్శన, నిదగ కరునాథ్చే కథక్, అభయాకారం కృష్ణన్ భరతనాట్య ప్రదర్శన, బిజినచే మోహినియట్టం తదితర నృత్యప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అతిథులను ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజేష్ పగడాల గౌరవ పూర్వకంగా సత్కరించారు. భారతీయ నాట్యతోరణం దేశ సంస్కృతికి ప్రాణం ఆభరణంగా నిలుస్తుందదని పేర్కొన్నారు. దేశంలో శాస్త్రీయ నాట్య రంగాలలో కృషిచేసి ప్రతిభతో పేరు గడిస్తున్న యువ నాట్యాచార్యులకు వేదిక కల్పిస్తూ ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ఇటువంటి ఉత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
కిమ్ కొత్త ఎత్తు.. ఇక కల్చరల్ వార్
పొరుగు దేశం దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కొత్త యుద్ధం చేయబోతున్నాడు. అణు ఆయుధాలు ఉపయోగించకుండా.. కొత్త చట్టాలతో సౌత్ కొరియా ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాలనే ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. ఈ క్రమంలో కొరియా పాప్ కల్చర్‌పై త్వరలో సంపూర్ణ నిషేధం విధించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొరియన్ పాప్ కల్చర్‌ను ‘ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి’గా పోలుస్తూ ఈ మధ్య ఒక సమావేశంలో కిమ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ప్యోంగ్యాంగ్: ‘‘ఉత్తర కొరియా యువతపై పొరుగు దేశపు(దక్షిణ కొరియా) సంస్కృతి, సంప్రదాయాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి, అలాంటి జాడ్యాన్ని అంటగట్టుకునే ప్రయత్నం చేయొద్ద’’ని కిమ్ జోంగ్ ఉన్, అక్కడి యువతను హెచ్చరించినట్లు యోన్హప్ టీవీ ఛానెల్ స్టోరీ టెలికాస్ట్ చేసింది. ఇక ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ.. ‘పాప్ వేషధారణ, హెయిర్‌స్టైల్, ప్రవర్తన.. ప్రతీది ఉత్తర కొరియా సంస్కృతిని నాశనం చేస్తున్నవే’ అని కిమ్ వ్యాఖ్యానించినట్లు ది న్యూయార్క్ టైమ్స్ కూడా ఓ స్టోరీ ప్రచురించింది. ఎందుకీ మార్పు? ఒకప్పుడు కొరియన్ పాప్ కల్చర్‌ను కిమ్ కూడా ఆస్వాదించిన వాడే. 2018లో దక్షిణ కొరియాకు చెందిన రెడ్ వెల్వెట్, చో యాంగ్ పిల్ పాప్ బ్యాండ్లను పిలిపించుకుని తన రాజధాని ప్యోంగ్యాంగ్లో ప్రదర్శలు ఇప్పించుకున్నాడు. డెబ్భై ఏళ్ల కిమ్ ఫ్యామిలీ పాలనలో.. ఇలాంటి వేడుకలకు హాజరైన తొలి వ్యక్తి కూడా ఈ నియంతాధ్యక్షుడే. అయితే గత కొంతకాలంగా కొరియన్ కల్చర్ వల్ల అక్కడి యువతలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో యూత్ మీద పట్టును కోల్పోతాడేమో అనే ఉద్దేశంతోనే కిమ్ ఈ నిర్ణయానికి వచ్చి ఉంటాడని, అదే టైంలో కొరియన్ పాప్ మార్కెట్‌ను దెబ్బతీయొచ్చనే ఆలోచనలో ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. జుట్టు నుంచి మొదలు.. ఉత్తర కొరియాలో ఈమధ్య కొన్ని కొత్త చట్టాలకు అధికారిక ముద్ర వేశాడు కిమ్. వీటి ప్రకారం.. దేశంలో ఎవరూ జుట్టుకు రంగు వేయకూడదు. అంతేకాదు 215 రకాల హెయిర్ స్టైల్స్‌తో ఒక లిస్ట్ తయారు చేసి.. వాటిని మాత్రమే అనుసరించాలని ప్రజలకు సూచించారు. స్పైక్, ముల్లెట్ హెయిర్‌స్టైల్స్‌పై సంఘ వ్యతిరేక ముద్ర వేసి నిషేధించాడు. టైట్ జీన్స్, ప్రింటెడ్ టీషర్టులు వేయడం నిషేధం. ఒకవేళ టీ షర్టులు వేసినా వాటి మీద స్లోగన్లు ఉండకూదు. ముక్కు-పెదాలు కుట్టించుకోవడానికి వీల్లేదు. సౌత్ కొరియా సినిమాలు, సంగీతం, వీడియోలు.. బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శిస్తే కఠినంగా శిక్షిస్తారు. మరణశిక్షకు మార్పు నార్త్ కొరియాలో యాంటీ కె(కొరియా)పాప్ ఉద్యమానికి బీజం పోయినేడాది డిసెంబర్లోనే బీజం పడింది. ఆ టైంలో కిమ్ జోంగ్ ఉన్ ఓకొత్త చట్టం చేశాడు. దాని ప్రకారం.. దక్షిణ కొరియా సినిమాలు, వీడియోలు చూసినా, పాటలు విన్నా సరే (అది రహస్యంగా అయినా).. వాళ్లకు 15 ఏళ్లు కఠిన కారాగార శిక్ష అమలు చేస్తున్నారు. ఒకవేళ చిన్నపిల్లలు ఈ నేరానికి పాల్పడితే.. వాళ్ల తల్లిదండ్రులకు ఆ శిక్ష అమలు చేస్తారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో పదిహేనేళ్ల శిక్షను.. మరణ శిక్షగా మార్చాలనే ఆలోచనలో కిమ్ ఉన్నాడన్న విషయం డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా పార్టీ పత్రాల లీకేజీ వ్యవహారంతో వెలుగులోకి వచ్చింది. కొసమెరుపు: కొరియన్ పాప్ కల్చర్ కంటెంట్ ఉత్తర కొరియా ప్రజలకు నేరుగా చేరేది 30 శాతం మాత్రమే. అది కూడా ఉత్తర కొరియాలోనే కొందరు స్మగ్లర్లు వాటిని ప్రజలకు చేరవేస్తుంటారు. ఇక చైనా నుంచి ఫ్లాష్ లింకుల ద్వారా ఈ అక్రమ వ్యాపారం భారీ లెవల్లో జరుగుతుండడం విశేషం. చదవండి: కిమ్ పాలనలో ఆకలి రోదనలు -
తెరుచుకోనున్న మ్యూజియాలు
న్యూఢిల్లీ: వీక్ ఎండ్ వస్తే చాలు జనాలు సినిమాలకు, జూపార్కలకు, మ్యూజియంకి వెళ్లేవారు. ముఖ్యంగా పురాతన వస్తువులను చూడటానికి పిల్లలు ఎక్కువ ఆసక్తి చూపేవారు. అలాంటిది కోవిడ్-19 కారణంగా గత కొన్ని నెలలుగా ఇళ్లకే పరితమైపోయారు. మ్యూజియంలలో పురాతణ వస్తువులను చూసి ఆనందించాలనుకునే వారు ఎప్పుడు ఇవి తిరిగి ప్రారంభం అవుతాయా అని ఆశగా ఎదురుచూస్తునన్నారు, అలాంటి వారికి కేంద్రం ప్రభుత్వం శుభవార్తచెప్పింది. ఈ నెల 10వ తేదీ నుంచి మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు, ఎగ్జిబిషన్లను తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుతిచ్చింది. కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించడానికి గురువారం ప్రామాణిక మార్గదర్శకాలను జారీ చేసింది. నవంబర్ 10 నుంచి కేంద్ర సాస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు, ఎగ్జిబిషన్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రం, నగర, స్థానిక చట్టాల నియమ నిబంధనలను అనుసరించి మిగతా వారు కూడా వీటిని పునః ప్రారంభించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వీటిని సందర్శించడానికి వచ్చేవారు తప్పనిసరిగా మాస్క ధరించి రావాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. ప్రవేశ ద్వారం దగ్గర ముందుగా టెంపరేచర్ చెక్ చేసి, శానిటైజ్ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తారు. కరోనా విజుృంభిచడంతో కేంద్రం మార్చి నుంచి లాక్డౌన్ విధించింది. ఈ కారణంగా అన్నింటితో పాటు మ్యూజియంలు కూడా మూత పడ్డాయి. ఏడు నెలల తర్వాత వీటిని తిరిగి ప్రారంభించే అవకాశం దక్కింది. -
ప్రోత్సహిస్తూ.. పోరాడుతూ.. మున్ముందుకు..
అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఆవిర్భవించిన సందర్భానికి ఒక బలమైన సాహిత్య నేపథ్యం ఉంది. ఆ నేపథ్యానికి ఆధునిక తాత్విక పునాది ఉంది. నూతన ప్రాపంచ దృక్పథం ఉంది. అందువల్లనే అరసం అనేక విజయాలు సాధించగలిగింది. ప్రజల పక్షాన, ప్రజాకంటక పాలకులను ప్రశ్నించే పక్షాన గళమెత్తుతోంది. ప్రశ్నించే శక్తుల్ని ప్రోత్సహిస్తోంది. స్వయంగా నిలదీస్తోంది. 82 ఏళ్ళనాటి మాట. ‘‘గత సాహితి ఆవేశం ఉన్మాదం లాంటిది. ఫలితం మాత్రం ఇంకొకరిది. కాని మన సాహిత్య ఉద్దేశం వేరు. మన గీటురాయి మీద సాహిత్యానికి మెరుగుపెట్టాలి. ఉన్నత భావాలు, స్వతంత్ర ఆలోచనలు, సౌందర్యారాధన, ఆత్మవికాసం జీవిత యదార్థ ఘటనలు, అందులో ఉంటాయి. అవే మనలో ఉత్తేజాన్ని సంఘర్షణల్ని, ఆదర్శాల్ని సృష్టిస్తాయి. అవి నిద్రపుచ్చడానికి ప్రయత్నించకూడదు. అధిక నిద్ర మృత్యువుతో సమానం కదా?’’ మనుషులపట్ల ప్రేమ, జాతి పట్ల బాధ్యత, రచనల్లో నిబద్ధత ఉన్న ఒక మహా రచయిత సమకాలీన రచయితలకు చేసిన కర్తవ్య బోధ ఇది. సర్వకాలాలకూ వర్తించే అక్షర సత్యాలు ఇవి. 1936 ఏప్రిల్ 9, 10 తేదీల్లో లక్నోలో ఒక మహా సభ జరిగింది. ప్రగతి లేఖక్ సంఘ్ (అభ్యుదయ రచయితల సంఘం) తొలి మహాసభ అది. ఆ సభకు అధ్యక్షులు సుప్రసిద్ధ హిందీ రచయిత ప్రేమ్‌చంద్. ఆ అధ్యక్ష ప్రసంగంలోని అంశాలే పైన పేర్కొన్నవి. యుద్ధోన్మాదానికి, ఫాసిజానికీ వ్యతిరేకంగా అంతర్జాతీయంగా ఏర్పడిన ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్‌తో అరసం సంబంధాలు పెట్టుకుంది. అవే అంశాలపై పనిచేస్తున్న కమ్యూనిస్టులు ఈ రచయితల సంఘానికి మద్దతుగా నిలిచారు. దాని ప్రభావం తెలుగు నాటకూడా పడింది. అప్పటికే శ్రీశ్రీ మరోప్రపంచపు మహాప్రస్థాన సింహ గర్జనలు ప్రారంభం అయ్యాయి. సంప్రదాయ సాహిత్య సంకెళ్ళు, భావకవిత్వ పరిష్వంగనలను జగన్నాథ రథచక్రాలు పటాపంచలు చేశాయి, చెల్లాచెదురు చేశాయి. అంతకు ముందు వీరేశలింగం, గిడుగు, గురజాడల సంఘసంస్కరణ ఉద్యమం, వాడుకభాషా ఉద్యమం, ఆధునిక సాహిత్య ఉద్యమాలు నూతన ఆలోచనాధోరణులకు బాటలు వేశాయి. ఆంధ్రలో అభ్యుదయ సాహిత్యం పురుడుపోసుకోవడానికి అవి దోహదపడ్డాయి. అభ్యుదయ సాహిత్యం సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలన్నింటినీ ప్రభావితం చేసింది. ఉద్యమ రూపం ధరించింది. ‘‘ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం’’గా సంస్థాగత రూపం తీసుకొంది. 1943 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో గుంటూరు జిల్లా తెనాలిలో ప్రథమ మహాసభలు జరిగాయి. ఉపన్యాసాలకే పరిమితం కాకుండా అరసం కార్మికవర్గ అస్తిత్వాన్ని బలంగా ఆవిష్కరించింది. అణగారిన వర్గాల వాణి అయింది. స్వాతంత్య్రోద్యమంలోనే గాక జమీందారీ వ్యతిరేక పోరాటాలకు, నిజాం నిరంకుశ పాలనకు, వ్యతిరేకంగా జరిగిన రైతాంగ సాయుధ పోరాటాలకు ఉద్యమ గేయం అయింది. నిషేధాలు నిర్బంధాలకు గురైంది. తిరగబడింది. తిప్పికొట్టింది. బలహీనపడింది. తిరిగి నిలదొక్కుకుంది. ఇది 75 ఏళ్ల ‘‘అరసం ఘనమైన గతం’’. ఆత్మగౌరవాన్ని పిడికిలెత్తి చాటుకుంటున్న వారి సొంత గొంతుకలే అస్తిత్వవాదాలు అయ్యాయి. స్త్రీవాదం, దళితవాదం వంటి ఉద్యమాల పరిణామాన్ని అరసం నిండుమనస్సుతో ఆహ్వానించింది. తొలినాళ్లలో అందర్నీ తోసిరాజన్న అస్తిత్వవాదులు అభ్యుదయ రచయితలు తమ సహజ మిత్రులని విశ్వసిస్తున్నారు. ప్రజాస్వామ్యం ముసుగులో భావప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టేందుకు ఐక్యఉద్యమాల అనివార్యతను అంగీకరిస్తున్నారు. అందుకోసం సోదర సాహితీ సంస్థలకు అరసం స్నేహ హస్తాన్ని అందిస్తోంది. తిరిగి మరో బలమైన సాహిత్య సాంస్కృతిక ఉద్యమ అవసరాన్ని ఎలుగెత్తి చాటుతోంది. ఒక దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం 18వ రాష్ట్ర మహాసభలు గుంటూరులో డిసెంబర్ 8, 9 తేదీలలో జరగనున్నాయి. ఆ వేదిక నుండే వజ్రోత్సవాలు జరుగుతాయి. ఇవి కేవలం ‘అరసం’ మహాసభలే కాదు, తెలుగువారి సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలు. కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ వ్యాసకర్త, సీనియర్ పాత్రికేయుడు మొబైల్ : 94911 28554 -
నృత్యాంజలి సేవలు ప్రశంసనీయం
కాకినాడ కల్చరల్ : నాట్యరంగానికి నృత్యాంజలి కళానిలయం చేస్తున్న సేవలు ప్రశంసనీయమని జయలక్ష్మి కో- ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ రాయవరపు సీతారామాంజనేయులు అన్నారు. స్థానిక సూర్యకళామందిర్‌లో నృత్యాంజలి కళానిలయం ఆధ్వర్యంలో ‘పద ఝురి–2017’ నాట్య కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముందుగా నటరాజ విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి శాస్త్రీయ, జానపద నాట్య పోటీల్లో విద్యాంజలి నికేతన్ (కాకినాడ), లలిత కళానికేతన్ ( అన్నవరం), మంజీర నృత్యాలయం(కాకినాడ), భగవత్ నృత్యాలయం (విజయనగరం) వారే కాకుండా పలువురు పాల్గొన్నారు. టి. సౌమ్య, బి.వాణిశ్రీ, నటరాజ రామకృష్ణ న్యాయ నిర్ణేతలుగా వ్యహరించారు. తదుపరి నాట్యాచార్యులు డాక్టర్ కృష్ణకుమార్, డాక్టర్ పసుమర్తి శ్రీనివాసశర్మ, డాక్టర్ వేదాంతం వెంకట దుర్గా భవానిలను ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సభలో నృత్యాంజలి కళానిలయం వ్యవస్థాపకుడు హరి లోకేష్ శర్మ మాట్లాడుతూ నాట్య రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తమవంతు కృషి చేస్తున్నామన్నారు. నర్తకీమణులు వి.మోహన్ సత్య, రమణ కుమారి, మధుస్మిత, శర్వాణి, సౌమ్యలకు ‘నృత్యవతంస’ పురస్కారాలను అందజేశారు. నాట్యాచార్య వీఎన్ వరప్రసాద్, శ్రీరామ్ భగవ్ గురుస్వామి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే కూచిపూడి నృత్యం : సబ్ జూనియర్స్ విభాగం ఎన్.నికిత (ప్రథమ), దీపిక (ద్వితీయ). జూనియర్స్ విభాగం ఆరది (ప్రథమ), వర్షిత (ద్వితీయ). సీనియర్స్ విభాగం జి. మేఘన (ప్రథమ), వి.శ్రీను (ద్వితీయ) స్థానాల్లో నిలిచారు. భరత నాట్యం : సబ్ జూనియర్స్ విభాగంలో డి. దివ్య హాసిని (ప్రథమ), గాయిత్రి ఆశ్రిత (ద్వితీయ), జూనియర్స్ విభాగంలో కె. సంజన (ప్రథమ), నాగశ్రీ (ద్వితీయ), సీనియర్స్ విభాగంలో పి.ప్రసజ్ఞ (ప్రథమ), సిరిజా రెడ్డి (ద్వితీయ) బహుమతులు గెలుచుకున్నారు. జానపద నృత్యం : సబ్ జూనియర్స్ విభాగంలో కె.సంస్కృతి (ప్రథమ), వినీల (ద్వితీయ), జూనియర్స్ విభాగంలో జ్ఞాపిక (ప్రథమ), సీనియర్స్ విభాగంలో భ్రమరాంబిక (ప్రథమ) బహుమతులు పొందారు. శాస్త్రీయ నృత్యం : గ్రూపు విభాగం రోషిని గ్రూపు (ప్రథమ), అన్నవరం గ్రూపు (ద్వితీయ) బహుమతులు గెలుచుకున్నారు. జానపద నృత్యం : గ్రూపు విభాగంలో మౌనిక గ్రూపు ప్రథమ బహుమతి, అక్షయ గ్రూపు ద్వితీయ బహుమతి పొందారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. -
సమాజ హితంకోరేదే సాహిత్యం
విజయవాడ కల్చరల్ : సమాజ హితంకోరేది సాహిత్యమని రాష్ట్ర శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ వివరించారు. అనంతపురానికి చెందిన విమలా శాంతి సాహిత్య సాంఘిక సాంస్కృతిక సేవాసమితి దుర్గాపురంలోని ఘంటసాల వేంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో విమలశాంతి సాహిత్య పురస్కార ప్రదానోత్సవ సభను బుధవారం నిర్వహించింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మండలి మాట్లాడుతూ కవి క్రాంతి దర్శిని, సమాజంలో నిత్యం జరుగుతున్న మార్పులను çగమనించాలన్నారు. కవి సమాజంలో వాస్తవ జీవితాన్ని తమ సాహిత్యంలో ప్రతిబింబించాలన్నారు. అనంతపురం జిల్లా భౌతికంగా వెనుకపడినా శాంతినారాయణ లాంటి సాహితీవేత్తలవల్ల మిగితా ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కవులు నోట్లరద్దు అంశంగా తమ కలాలకు పదను పెడుతున్నారని వివరించారు. పురస్కారాల నిర్వాహకులు విమలా శాంతి సాహిత్య సాంఘీక సాంస్కృతిక సేవా సమితి నిర్వాహకులు శాంతి నారాయణ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా శాంతి రజనీకాంత్ స్మారక కవితా పురస్కారలను కథ, కవిత అంశంగా విశేషకృషి చేసిన వారికి పురస్కారాలు అందిస్తున్నామన్నారు. 2016 సంవత్సరానికి గానూ డాక్టర్ ప్రసాదమూర్తి రచించిన పూలండోయ్‌పూలు, బాలసుధాకర్ రచించిన ఎగరాల్సిన సమయం కవితా సంపుటులకు పురస్కారం అందిస్తున్నామన్నారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ డీ.విజయభాస్కర్ మాట్లాడుతూ కళాకారులు, కవులు, ప్రాచీన కళలలు అభివృద్ధిచేయటానికి సాంస్కృతిక శాఖ కృషిచేస్తుందని వివరించారు, కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ప్రసాదమూర్తి బాలసుధాకర్ మౌళీలకు పురస్కారాలను అందించారు. కవితా సంపుటిల పరిచయాన్ని ఆచార్య రాచపాలెం చంద్రశేఖర రెడ్డి, జీ.లక్ష్మీ నరసయ్యలు చేశారు, కార్యక్రమంలో ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు మంజులూరి కృష్ణమూర్తి,ప్రజాసాహితి సంపాదకులు కొత్తపల్లి రవిబాబు,కవులు మందారపు హైమావతి,లబండ్ల మాధవరావు తదితరులు ప్రసంగించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా మద్దాలి సాయిచంద్రిక పలుకూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించింది. -
యువజనోత్సహం
ఆకట్టుకున్న సాంస్కృతిక పోటీలు కర్నూలు(హాస్పిటల్): జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక సి.క్యాంపులోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలు ఆహుతులను ఉర్రూతలూగించాయి. డివిజనల్ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన వారితో ఈ పోటీలు నిర్వహించారు. పోటీలను లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య ప్రారంభించారు. అనంతరం ఇటీవలే మరణించిన గాయకులు మంగళం పల్లి బాల మురళీకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పత్తి ఓబులయ్య మాట్లాడుతూ జిల్లా స్థాయి విజేతలు ప్రావీణ్యతను ఇంకా మెరుగుపరచుకోవాలని సూచించారు. ఇందుకుగాను తమ సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పోటీల అనంతరం సాయంత్రం బహుమతుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సెట్కూరు సీఈఓ మస్తాన్‌వలి, మేనేజర్ పీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన వారు కూచిపూడి నృత్యం 1. ఎస్. మానస, 2, అర్చన, 3. శాంభవి జానపద నృత్యం 1. లక్ష్మి, అనూష గ్రూప్, 2. స్వప్న, జితేష్ గ్రూప్ భరతనాట్యం 1. రాధ వక్తృత్వ పోటీలు 1. సుస్మితారెడ్డి సంప్రదాయ సంగీతం(హిందుస్తానీ) 1. కె. యశ్వంతి, 2. ఎన్. మునివన్నూరమ్మ కర్ణాటక సంగీతం 1.జీఎం చంద్ర లిఖిత క్లాసికల్ ఇన్స్టుమెంట్స్ 1. ఎం. ముని సాయిరామ్(డోలి), 1. ఎం. తిరుమల(తబల), 2. బి. జి. నాగవీణకుమార్(తబల), 1. ఎం. డోనాల్డ్ డిక్(గిటార్), 1. వై. వెంకటేష్ బాబు(వీణ), 1. అశ్వత్ కుమార్(హార్మోనియం) ఫోక్ సాంగ్ గ్రూప్ 1. రాజ్‌కుమార్ అండ్ గ్రూప్, ప్రభుత్వ శారద సంగీత కళాశాల, కర్నూలు ఏకపాత్రభినయం 1. సుశాంత్ ఫిలిప్స్ అండ్ గ్రూప్, సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాల, కర్నూలు. -
అందరికి పర్యాటకం..
– అదే ఈ ఏడాది మన నినాదం – ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో వక్తలు – ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సంరక్షించుకోవడం అందరి బాధ్యతని కేంద్ర పురావస్తుశాఖ కర్నూలు రీజియన్ పరిరక్షకులు కృష్ణచైతన్య అన్నారు. మంగళవారం ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు నగరంలోని లలిత కళాసమితిలో ఘనంగా జరిగాయి. ఏకో టూరిజం, అగ్రీ టూరిజం, హెల్త్ టూరిజం, కల్చరల్ టూరిజం, టెంపుల్ టూరిజం అవకాశాలను, విశిష్టతలను ఈ సందర్భంగా వ్యక్తలు వివరించారు. ఈ సందర్భంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ... ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురష్కరించుకొని ఈ ఏడాది నినాదం అందరికీ పర్యాటకం పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు వివరించారు. జిల్లా పర్యాటక సంస్థ డీవీఎం సుదర్శన్‌రావు మాట్లాడుతూ...రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పర్యాటక ప్రాంతాలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోందని వివరించారు. జిల్లా పర్యాటక అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు పంపుతున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.ఉస్మానియా, కేవీఆర్, టౌన్ మోడల్, హజీర కళాశాలల విద్యార్థులకు పోస్టర్ పెయింటింగ్, క్విజ్ పోటీలు, పేపర్ ప్రజెంటేషన్, ఫొటోగ్రఫీ వంటి వాటిపై పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు కిష్టన్న, నగర ప్రముఖులు చంద్రశేఖర్ కల్కూర, మద్దయ్య, రచయిత సంఘం నేత వేణుగోపాల్ రావు, ప్రోగ్రామ్ కో ఆర్డీనేటర్ ఆదిశేషులు తదితరులు పాల్గొన్నారు. -
జానపద జాతర