సిద్దవటం కోటలో ధ్వంసమైన నందీశ్వరుని విగ్రహం
కడప కల్చరల్: ముందుతరం పెద్దలు అయాచితంగా మనకు ఎంతో గొప్ప వారసత్వ సంపదను అందించారు. వాటిని పరిక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఎక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యేటా ఏప్రిల్ 18న ప్రపంచ వ్యాప్తంగా వారసత్వ దినోత్సవాన్ని నిర్వహించకుంటూ వారసత్వ సంపద పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి జరుగుతోంది.
వారసత్వ సంపద పరిస్థితి గురించి ప్రత్యేక కథనం. ప్రపంచంలోని ఘనమైన వారసత్వ సంపదలో మనజిల్లాలోని గండికోట కూడా ముందు వరుసలో నిలుస్తుంది. జిల్లాలోని సిద్దవటం కోట కూడా నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచి ఉంది. సిద్దవటం కోటలో బురుజులు, గోడ కూలుతున్నాయి. వాటికి కూడా తక్షణ మరమ్మతులు అవసరం. ప్రజలకు ఈ సంపదను రక్షించుకోవాల్సిన అవసరం, బాధ్యత గురించి వివరించాల్సిన బాధ్యత గల వారు పర్యాటకులను నిబంధనల పేరిట ఇబ్బందులు పెడుతుండడంతో క్రమంగా సందర్శకుల సంఖ్యతోపాటు ఆదాయం తగ్గుతోంది.
Comments
Please login to add a commentAdd a comment