21న సాహిత్య అకాడమీ సదస్సు
Published Fri, Aug 19 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
విశాఖ–కల్చరల్ : సాహిత్య అకాడమీ, మొజాయిక్ సాహిత్య సంస్థ సంయుక్త నిర్వహణలో ఈనెల 21న ‘తెలుగు సాహిత్యం అనువాదం, ధోరణలు–నైపుణ్యాలు’ అంశంపై సదస్సు ఏర్పాటు చేసినట్లు ప్రముఖ కవి, సాహిత్య విమర్శకుడు రామతీర్థ తెలిపారు. ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో ఆ రోజు ఉదయం పది గంటల నుంచి జరిగే ఈ సదస్సుకు సాహితీప్రియులంతా ఆహ్వానితులేనని పేర్కొన్నారు. సాహిత్య అకాడమీ ప్రాంతీయ కార్యదర్శి ఎస్.పి.మహాలింగేశ్వర్, దక్షిణ ప్రాంతీయ కార్యదర్శి డాక్టర్ ఎన్.గోపి, ప్రముఖ తెలుగు రచయిత, అనువాదకులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాల్గొంటారని చెప్పారు. బహుభాషా కోవిదుడు ఎల్.ఆర్.స్వామి కీలక ఉపన్యసాన్ని అందిస్తారని పేర్కొన్నారు. ఉదయం డాక్టర్ ఏ.శేషారత్నం(హిందీ) అధ్యక్షతన మహీధర్‌రాశాస్త్రి(ఒడియా), అబ్దుల్ వాహేద్(ఉర్దూ) అనువాదాలు ఉంటాయన్నారు. మధ్యాహ్నం కవియిత్రి జగద్ధాత్రి(తెలుగు నుంచి ఇంగ్లిష్) అధ్యక్షతన రామతీర్థ(బెంగాలీ), శాఖమూరు రాంగోపాల్(కన్నడ), మాటూరి శ్రీనివాస్(ఇంగ్లిష్ నుంచి తెలుగు) అనువాదాల పత్ర సమర్పణలు చేస్తారని తెలిపారు. డాక్టర్ చాగంటి తులసి ప్రసంగం అనంతరం చింతకింద శ్రీనివాసరావు కథపై చర్చాగోష్టి ఉంటుందన్నారు.
Advertisement
Advertisement