ఇస్కాన్ పోటీలకు స్పందన
ఇస్కాన్ పోటీలకు స్పందన
Published Sun, Aug 21 2016 10:30 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
సాగర్‌నగర్
శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను పురస్కరించుకొని ఇస్కాన్ విశాఖనగర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఇస్కాన్ సాగర్‌నగర్ ప్రాంగణంలో విద్యార్థులకు నిర్వహించిన సాంస్కృతిక పోటీలకు విశేష స్పందన లభించింది. ఇస్కాన్ మాతాజీ నితాయి సేవిని పర్యవేక్షిణలో నిర్వహించిన పోటీల్లో నగర నలుమూలల నుంచి విచ్చేసిన ఆయా పాఠశాల విద్యార్థునీ, విద్యార్థులు ఎంతో ఉత్సహంతో పాల్గొన్నారు. ఈ పోటీలను ఇస్కాన్ నగరశాఖ అధ్యక్షుడు సాంబాదాస్ ప్రభుజీ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1999 నుంచి విశాఖలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను క్రమం తప్పకుండా ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఏటా నగర పాఠశాల విద్యార్థులను వివిధ కళారంగాల్లో ప్రోత్సహించేందుకు పెయింటింగ్, సాంస్కృతిక,నృత్యకార్యక్రమాలు, వ్యాసరచన పోటీలు, ఇతర సామాజిక అంశాలపై పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు ప్రొత్సాహకాలతోపాటు బహుమతులు అందజేస్తున్నట్టు తెలిపారు. ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన పోటీల్లో కృష్ణా టెస్ట్‌కు 1200మంది విద్యార్థులు, పాట్‌మేకింగ్ 1370మంది, వ్యాసరచన పోటీలకు 560మంది, పోస్టర్ మేకింగ్ 450, పెన్సిల్ స్కెటింగ్‌కు 350మంది, గీతా శ్లోక పోటీలకు 540మంది విద్యార్థులు, చిత్రలేఖనంలోను కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పోటీల్లో నెగ్గిన విజేతలకు ఈనెల 25న ఇస్కాన్ హారేకష్ణ ప్రాంగణంలో కృష్ణాష్టమి రోజున ప్రముఖల ద్వారా బహుమతులు, ప్రశంసపత్రాలను అందజేయడం జరగుతోందన్నారు.
Advertisement