ISKCON
-
ఇస్కాన్ కేంద్రానికి నిప్పు
కోల్‌కతా: బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని ఢాకాలోని ఓ ఇస్కాన్ కేంద్రానికి శనివారం వేకువజామున గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. ధౌర్ గ్రామంలోని నమ్హట్టా ప్రాంతంలో ఉన్న శ్రీ రాధా కృష్ణ ఆలయం, శ్రీ మహాభాగ్య లక్ష్మీ నారాయణ ఆలయాలపై ఈ దాడి జరిగిందని ఇస్కాన్ కోల్‌కతా ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ ‘ఎక్స్’లో వెల్లడించారు. పెట్రోల్ పోసి నిప్పంటించడంతో శ్రీ లక్ష్మీ నారాయణ విగ్రహంతోపాటు అన్ని వస్తువులు పూర్తిగా కాలిపోయాయన్నారు. హిందూమత పెద్ద చిన్మయ్ కృష్ణ దాస్ బెయిలివ్వకుండా జైలులో ఉంచారంటూ...ఆయన భద్రతపై రాధారమణ్ దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇస్కాన్ అనుయాయులు బయట తిరిగేటప్పుడు ముందు జాగ్రత్తగా నుదుటన తిలకం ధరించవద్దని కోరారు. మైనారిటీలకు భద్రత కల్పిస్తామని యూనస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎక్కడా అమలు కావడం లేదని రాధారమణ్ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. -
Bangladesh: జనవరి 2 వరకూ జైల్లోనే చిన్మయ్ దాస్
ఢాకా: బంగ్లాదేశ్‌లోని హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ కేసులో ఆయన తరపున వాదించేందుకు చిట్టగాంగ్ కోర్టులో న్యాయవాది ఎవరూ లేరు. ఈ నేపధ్యంలోనే విచారణ జనవరి 2కు వాయిదా పడింది. బంగ్లాదేశ్‌లోని హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభు తరపు న్యాయవాది రమణ్ రాయ్‌పై దాడి జరిగిందని ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి రాధారమణ్ దాస్ తెలిపారు. ఆయన ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారని, చిన్మయ్ ప్రభు తరపున వాదించడమే ఆయన చేసిన తప్పులా ఉందని దాస్ పేర్కొన్నారు.ఐసీయూలో ఉన్న రాయ్ ఫోటోను ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి దాస్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. న్యాయవాది రమణ్ రాయ్ కోసం ప్రార్థించాలని ఆయన హిందువులను కోరారు. ఇస్లామిక్ ఛాందసవాదులు అతని ఇంటిని ధ్వంసం చేసి, అతనిపై దాడి చేశారని దాస్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ సమిత సనాతనీ జాగరణ్ జోట్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభును ఢాకాలోని హజ్రత్ షాజాలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ కోర్టు అతనికి బెయిల్ మంజూరును నిరాకరించి, జైలుకు తరలించింది.ఇది కూడా చదవండి: సీఎం పదవిపై వీడని ఉత్కంఠ.. వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేతలు -
బంగ్లాదేశ్‌లో దాడుల సూత్రధారి యూనస్ ప్రభుత్వమే: షేక్ హసీనా
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు కారణం ప్రధాని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానిదేనని ఆరోపించారు ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై లక్ష్యంగా చేసుకొని బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. న్యూయార్క్‌లో జరిగిన అవామీ లీగ్ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న షేక్ హసీనా ప్రసంగిస్తూ.. బంగ్లాలో హిందూ దేవాలయాలు, చర్చీలు, ఇస్కాన్‌పై వరుస దాడుల నేపథ్యంలో యూనస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.‘నాపై సామూహిక హత్యల ఆరోపణలు వచ్చాయి. కేసులు కూడా నమోదు చ ఏశారు కానీ వాస్తవానికి విద్యార్ధి సంఘాలతో కలిసి పక్కా ప్రాణాళికతో సామూహిక హత్యలకు పాల్పడింది మహమ్మద యూనస్. వారే సూత్రధారులు.. దేశంలో ఇలాగే మరణాలు కొనసాగితే ప్రభుత్వం మనుగడ సాగదని లండన్‌లో ఉన్న తారిక్ రెహమాన్(బీఎన్పీ నాయకుడు, ఖలీదాజియా కుమారుడు) కూడా చెప్పాడు. దేశంలో మైనారిటీలు, ఉపాధ్యాయులు, పోలీసులు అందరిపై దాడి చేసి చంపేస్తున్నారు. హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. చర్చిలు, అనేక దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. వీటన్నింటికీ మాస్టర్‌మైండ్ యూనసే. బంగ్లాదేశ్‌లో మైనారిటీలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు’ షేక్ హసీనా ప్రశ్నించారు. ఈసందర్భంగా తాను దేశాన్ని ఎందుకు వీడాల్సివచ్చిందో ఆమె మరోసారి వివరించారు. ‘‘నా తండ్రిలాగే నన్నూ హత్య చేసేందుకు కుట్రలు జరిగాయి. వాటిని ఎదుర్కోవడం నాకు 25-30 నిమిషాలు పట్టదు. నా భద్రతా సిబ్బంది కాల్పులు జరిపి ఉంటే.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేవారు. కానీ, ఊచకోతను నేను కోరుకోలేదు. నేను అధికారం కోసం అక్కడే ఉంటే మారణహోమం జరిగేది. ప్రజలను విచక్షణారహితంగా చంపేస్తుండటంతోనే దేశం విడిచివెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా. అందుకే ఆందోళనకారులపై కాల్పులు జరపొద్దని నా భద్రతా సిబ్బందికి చెప్పా’’ అని తెలిపారు. బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు అధికమయ్యాయి. దీనిని నిరసిస్తూ హిందువులు శాంతియుత నిరసనలు చేపట్టారు. అయితే ఇటీవల ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ఠ్తో ఈ ఆందోళనలు మరింత తీవ్రతరమయ్యాయి.అక్టోబరు 25న బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న కృష్ణదాస్.. ఆ దేశ జెండాను అగౌరవపరిచారన్న ఆరోపణలతో అదే నెల 30న కృష్ణదాస్‌తో పాటు 18 మందిపై కేసు నమోదు చేశారు. ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో కృష్ణదాస్‌ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు ఇస్కాన్‌తో సంబంధమున్న మరో 17మందికి బ్యాంకు ఖాతాల లావాదేవీలను నెల రోజుల పాటు నిలిపివేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై జరుగుతోన్న దాడులకు వ్యతిరేకంగా పలు సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. కాగా బంగ్లాదేశ్ పరధానిగా ఉన్న షేక్ హసీనా గత ఆగస్టులో తిరుగుబాటు, కుట్ర కారణంగా దేశం వీడి భారత్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అనంతరం ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం దేశ బాధ్యతలను చేపట్టింది. తిరుగుబాటు సమయంలో జరిగిన మరణాలకు సంబంధించిన నేరాభియోగాలపై విచారణ నిమిత్తం హసీనాను అప్పగించాలని బంగ్లా డిమాండ్ చేస్తోంది. అమె అరెస్టుకు ఇంటర్ పోల్ సాయమూ కోరింది. -
ఇద్దరు పూజారుల అరెస్టు
ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువుల నిర్బంధం, అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. ముస్లిం అతివాదులు మైనారిటీలు, ముఖ్యంగా హిందువులు లక్ష్యంగా దాడులకు పాల్పడుతుండటం తెలిసిందే. ఇప్పటికే హిందూ మత పెద్ద చిన్మయ్ కృష్ణ దాస్‌ను దేశ ద్రోహం నేరం మోపి జైలులో పెట్టిన బంగ్లా మధ్యంతర ప్రభుత్వం తాజాగా ఆయన శిష్యులిద్దరినీ అరెస్ట్ చేసింది. ఇస్కాన్ కార్యాలయంపై శనివారం గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. చిట్టోగ్రామ్‌లోని జైలులో ఉన్న చిన్మయ్ దాస్‌కు గురువారం ఆహారం ఇచ్చేందుకు వెళ్లిన ఆయన శిష్యులు రుద్రకోటి కేశబ్ దాస్, రంగనాథ్ శ్యామ సుందర్ దాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కుండలినీ ధామ్ మఠానికి చెందిన ప్రొఫెసర్ కుశాల్ బరుణ్ చక్రవర్తి తెలిపారు. ఈ విషయాన్ని కోల్‌కతా ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారాం దాస్ ‘ఎక్స్’లో వెల్లడించారు. ముందుగా ఎటువంటి హెచ్చరికలు లేకుండానే వీరిని నిర్బంధంలోకి తీసుకున్నారని వివరించారు. అదేవిధంగా, ఢాకాలోని కిశోర్‌గంజ్ జిల్లా భైరబ్‌లో ఉన్న ఇస్కాన్ కార్యాలయంపై దుండుగులు దాడి చేసిన దృశ్యాలను కూడా ఆయన పోస్ట్ చేశారు. బంగ్లాదేశీయులకు ఆస్పత్రుల్లో నో ఎంట్రీకోల్కతా/అగర్తలా: బంగ్లాదేశీయులకు తాము వైద్యం చేయబోమని కోల్‌కతాలోని జేఎన్ రే హాస్పిటల్, త్రిపుర రాజధాని అగర్తలాలో ఉన్న ఐఎల్ఎస్ ఆస్పత్రి ప్రకటించాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, భారత జాతీయ పతాకాన్ని అవమానించిన ఘటనలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. తదుపరి నిర్ణయం ప్రకటించే వరకు బంగ్లాదేశ్ పౌరులను చేర్చుకోబోమని శుక్రవారం స్పష్టం చేశాయి. అఘాయిత్యాలను అడ్డుకోండి: ఆర్ఎస్ఎస్ న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతు న్న అఘాయిత్యాలపై రా్రïÙ్టయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులపై దాడులను అరికట్టేందుకు చర్యలు తీ సుకోవాలని అక్కడి మధ్యంతర ప్రభుత్వాన్ని కోరింది. అదేవిధంగా, హిందూ మత పెద్ద చిన్మయ్ కృష్ణ దాస్‌ను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలంది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబళె శనివారం ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. -
బంగ్లాదేశ్‌లో ఆలయాలు, దుకాణాలపై దాడులు
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో శుక్రవారం హిందువుల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చే పలు ఆందోళనకర పరిణామాలు సంభవించాయి. హిందూ ఆలయాలపై దుండగులు దాడులు చేశారు. హిందువులపై దాడి చేయడంతోపాటు వారి దుకాణాల్లో లూటీకి పాల్పడ్డారు. ఆపైన ఇస్కాన్‌పై నిషేధం విధించాలంటూ ర్యాలీ చేపట్టారు. హిందువులు అత్యధికంగా నివసించే కొత్వాలి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ప్రార్థనల అనంతరం చోటుచేసుకున్న ఘటనలివి. జమాతె ఇస్లామీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ)కి చెందినట్లుగా భావిస్తున్న కొందరు చిట్టగాంగ్‌లోని రాధా గోవింద, సంతానేశ్వరి మాత్రి ఆలయాలపై దాడులకు పాల్పడ్డారు. మైనారిటీ వర్గం ప్రజలపై దాడులు చేశారు. హిందువులు నిర్వహించే దుకాణాలను ధ్వసం చేశారు. భయాందోళనలకు గురైన బాధితులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారు. అనంతరం దుండగులు ఇస్కాన్‌ను నిషేధించాలంటూ ర్యాలీ చేపట్టారు. ఇన్ని జరుగుతున్నా స్థానిక పోలీస్, ఆర్మీ అధికారులు వారిని తమను కాపాడేందుకు ఏమాత్రం ప్రయతి్నంచకుండా ప్రేక్షకపాత్ర వహించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగిపోయాయి. చిన్మయ్ దాస్ అరెస్ట్‌పై హిందువులు నిరసనలు తెలపడంతో దాడులు మరింతగా పెరిగాయి. చిన్మయ్ దాస్ బ్యాంక్ అకౌంట్ నిలిపివేత హిందూ మత పెద్ద చిన్మయ్ దాస్‌కు చెందిన వివిధ బ్యాంకు అకౌంట్లను బంగ్లాదేశ్ ఆర్థిక విభాగం స్తంభింపజేసింది. రాజద్రోహం నేరం కింద ఈ నెల 25న పోలీసులు చిన్మయ్ దాస్‌ను అరెస్ట్ చేయడం తెలిసిందే. దాస్తోపాటు ఇస్కాన్ సంబంధిత వ్యక్తులకు చెందిన మరో 17 అకౌంట్లను కూడా నెల రోజుల పాటు సీజ్ చేస్తున్నట్లు యంత్రాంగం తెలిపింది. ఈ బ్యాంకు అకౌంట్ల లావాదేవీలన్నిటినీ నిలిపివేయాలని, ఇప్పటి వరకు జరిగిన లావాదేవీల వివరాల్ని అందజేయాలని ఆదేశించినట్లు పేర్కొంది. హిందువుల రక్షణకు చర్యలు తీసుకోండి:భారత్ హిందువుల పెరిగిపోయిన దాడులు, బెదిరింపులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. మైనారిటీలకు భద్రత కల్పించాలన్న బాధ్యతను నెరవేర్చాలని బంగ్లా ప్రభుత్వాన్ని గట్టిగా కోరింది. మైనారిటీలపై దాడులను మీడియా ఎక్కువ చేసి చూపుతోందంటూ కొట్టిపారేయవద్దని విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీర్ జైశ్వాల్ బంగ్లా ప్రభుత్వానికి స్పష్టం చేశారు. హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులు ఆందోళనకరమని బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నామన్నారు. హిందూ మత పెద్ద చిన్మయ్ దాస్‌పై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు.మైనారిటీల భద్రత బాధ్యత బంగ్లా ప్రభుత్వానిదే: జై శంకర్ బంగ్లాదేశ్‌లోని మైనారిటీల రక్షణ కల్పించాల్సిన ప్రాథమిక బాధ్యత అక్కడి ప్రభుత్వానిదేనని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ శుక్రవారం లోక్‌సభలో అన్నారు. హిందువుల ఆలయాలు, దుకాణాలు, నివాసాలపై పెరిగిపోయిన దాడులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాలంటూ అక్కడి ఆపద్ధర్మ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని కూడా చెప్పారు. దుర్గా పూజ సమయంలో మంటపాలపై దాడులు జరుగుతున్న విషయాన్ని అక్కడి ప్రభుత్వానికి తెలపగా రక్షణ కల్పిస్తామని హామీ ఇచి్చందని గుర్తు చేశారు. కోల్‌కతాలో ఇస్కాన్ ర్యాలీ చిన్మయ్ కృష్ణ దాస్నను బంగ్లాదేశ్ అధికారులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కోల్‌కతాలోని అల్బర్ట్ రోడ్లో వరుసగా రెండో రోజు శుక్రవారం ఇస్కాన్‌కు చెందిన పలువురు ప్లకార్డులు చేబూని ‘కీర్తన్’నిర్వహించారు. దాస్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
అది తప్పుడు ప్రచారం..‘చిన్మయ్’కి అండంగా ఉంటాం: ఇస్కాన్
ఢాకా:బంగ్లాదేశ్‌లో చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. చిన్మయ్ అరెస్టుతో సంబంధం లేదని తాము ప్రకటించినట్లు వస్తున్న వార్తలను ఇస్కాన్ తాజాగా ఖండించింది. చిన్మయ్ కృష్ణదాస్‌కు ఎప్పటిలాగానే తాము అండగా ఉంటామని పేర్కొంది. బంగ్లాదేశ్‌లోని హిందువుల హక్కులను కాపాడడానికి ఇస్కాన్ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేసింది.హిందువులను,వారి ప్రార్థనా స్థలాలను రక్షించాలని శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన చిన్మయ్ కృష్ణదాస్‌కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందనిన ఇస్కాన్ తెలిపింది. చిన్మయ్‌ను వెంటనే విడుదల చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఇస్కాన్ డిమాండ్ చేసింది.బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్‌ను లక్ష్యంగా చేసుకొని కొందరు కల్పిత ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించింది. తమ సంస్థను అప్రతిష్ఠపాలు చేయడానికి ఈ ప్రచారాలు చేస్తున్నట్లుందని సంస్థ ప్రధాన కార్యదర్శి చారు చంద్రదాస్ తెలిపారు. కాగా,చిన్మయ్ కృష్ణదాస్ ప్రవర్తన కారణంగా ఇస్కాన్‌లోని అన్ని బాధ్యతల నుంచి అతడిని తొలగించామని ఆయన చేసే నిరసనలతో తమకు ఎటువంటి సంబంధం లేదని చారు చంద్రదాస్ ప్రకటించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసకు నిరసనగా అక్టోబర్‌లో చిట్టగాంగ్‌లో నిర్వహించిన ర్యాలీలో చిన్మయ్ కృష్ణదాస్ జాతీయజెండాను అగౌరవపరిచారనే ఆరోపణలపై ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ను నిషేధించాలని ఓ న్యాయవాది అక్కడి కోర్టులో పిటిషన్ వేశారు. కాగా ఈ పిటిషన్‌ను బంగ్లాదేశ్ హైకోర్టు కొట్టివేసింది.ఇదీ చదవండి: ‘చిన్మయ్’ అరెస్టుపై స్పందించిన షేక్‌హసీనా -
ఇస్కాన్‌పై నిషేధానికి బంగ్లాదేశ్ హైకోర్టు నో
ఢాకా: బంగ్లాదేశ్‌లోని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ నిషేధం కోరుతూ దాఖలైన పిటిషన్‌ను బంగ్లాదేశ్ హైకోర్టు గురువారం కొట్టేసింది. దేశద్రోహం ఆరోపణలపై హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్ట్, తదనంతర పరిణామాలపై వార్తపత్రికల్లో వచ్చిన కథనాలను సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాది మొహమ్మద్ మునీరుద్దీన్ సమరి్పంచిన్పటికీ హైకోర్టు ఇస్కాన్‌పై నిషేధానికి నిరాకరించింది. సుప్రీంకోర్టు న్యాయవాది మొనియుజ్జమాన్ తదితరులు దాఖలుచేసిన పిటిషన్‌ను జస్టిస్ ఫరా మొహబూబ్, జస్టిస్ దెబాశిష్ రాయ్ చౌదరీల హైకోర్టు ధర్మాసనం విచారించింది. కృష్ణదాస్‌ను కోర్టులో హాజరుపరిచేందుకు తరలిస్తున్న సమయంలో ఛట్టోగ్రామ్లో జరిగిన ఘర్షణలు, గాయపడిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) సైఫుల్ ఇస్లాం మరణం తదితరాలను ప్రభుత్వ లాయర్లు ప్రస్తావించారు. ఇస్కాన్ మద్దతుదారులు, పోలీసుల మధ్య ఘర్షణలు, వేర్వేరు ప్రాంతాల్లో మైనారిటీ హిందువులపై దాడులకు సంబంధించిన నివేదికను అటార్నీ జనరల్ మొహమ్మద్ అసదుజ్జమాన్ హైకోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించిన కోర్టు ఇస్కాన్‌పై నిషేధం అక్కర్లేదని తేల్చిచెప్పింది. ‘‘ఉద్రిక్తతలను సద్దుమణిగేలా చేస్తూ ప్రభుత్వం తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ అంశంలో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు’’అని జడ్జి మహబూబ్ అన్నారు. పీపీ హత్య, ఇస్కాన్ ఆగడాలలతో 33 మందిని అరెస్ట్చేశామని, ఈ నేపథ్యంలో ఇస్కాన్‌పై నిషేధం విధించాలంటూ అదనపు అటార్నీ జనరల్ అనీక్ ఆర్ హఖ్, డిప్యూటీ అటార్నీ జనరల్ అసదుద్దీన్ చేసిన వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. ‘‘శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణగా నిలబడాలి’అని కోర్టు ఆదేశించింది. తీర్పును ఇస్కాన్ బంగ్లాదేశ్ స్వాగతించింది. ‘‘మత, సంక్షోభానికి దారితీసే ఎలాంటి కార్యకలాపాల్లో ఇస్కాన్ బంగ్లాదేశ్ భాగస్వామిగా లేదు. ఐక్యత, మత సామరస్యం గురించి మాత్రమే ఇస్కాన్ ప్రభోదిస్తుంది. తాజా ఘటనలతో ఇస్కాన్‌కు ముడిపెడుతూ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. మా సంస్థ ప్రతిష్టను దిగజార్చేందుకు ఇతరులు చేస్తున్న కుట్ర ఇది’’అని ఇస్కాన్ బంగ్లాదేశ్ అధ్యక్షుడు సత్యరంజన్ బారోయీ, ప్రధాన కార్యదర్శి చారుచంద్ర దాస్ బ్రహ్మచారి మీడియా సమావేశంలో అన్నారు. మరోవైపు కృష్ణదాస్‌ను వెంటనే విడుదలచేయాలని ఢిల్లీలో ప్రవాసజీవితం గడుపుతున్న బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా డిమాండ్‌చేశారు. తీర్పును నిరసిస్తూ మాజీ ప్రధాని ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లాయర్ల విభాగమైన జాతీయతాబాది అయిన్జిబీ ఫోరమ్ సభ్యులు గురువారం సుప్రీంకోర్టు బార్ వద్ద ఆందోళనకు దిగారు. -
ఇస్కాన్‌పై నిషేధం దిశగా..
ఢాకా/కోల్‌కతా: బంగ్లాదేశ్‌లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) మాజీ సభ్యుడు, సమ్మిళిత సనాతని జాగరణ్ జోత్ సంఘం సాధువు చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిను బంగ్లాదేశ్‌లో అరెస్ట్ చేసిన వేళ అక్కడ మరో కీలక పరిణామం సంభవించింది. ఇస్కాన్‌ను బంగ్లాదేశ్‌లో నిషేధించాలంటూ అక్కడి హైకోర్టులో బుధవారం రిట్ పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించగా ఇస్కాన్ మతసంబంధ సంస్థేనని బంగ్లాదేశ్ ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ మొహమ్మద్ అసదుజ్జమాల్ కోర్టుకు తెలిపారు. కృష్ణదాస్ అరెస్ట్, ఇస్కాన్, హిందూ ఆలయాలకు వ్యతిరేకంగా అతివాద ముస్లిం సంఘాల సభ్యుల ఆందోళనలు, మైనారిటీలపై దాడుల నడుమ ప్రభుత్వం తన స్పందన తెలియజేయడం గమనార్హం. ఘర్షణ ఘటనలో 30 మంది అరెస్ట్ కృష్ణదాస్ అరెస్ట్‌ను నిరసిస్తూ మైనారిటీ హిందువులు, కృష్ణదాస్ మద్దతుదారులు వేర్వేరు చోట్ల చేపట్టిన ర్యాలీలను బంగ్లాదేశ్ పోలీసులు అడ్డుకోవడంతో చిట్టోగ్రామ్లో జరిగిన ఘర్షణ ఘటనలో 30 మందిని అరెస్ట్‌చేశారు. మంగళవారం జరిగిన ఈ ఘర్షణల్లో తీవ్రంగా గాయపడిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైఫుల్ ఇస్లామ్ మరణించిన విషయం తెల్సిందే. అయితే కృష్ణదాస్‌ను అన్యాయంగా అరెస్ట్ చేశారని, వెంటనే విడుదలచేయాలని బంగ్లాదేశ్ హిందూ బుద్ధి్దస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ డిమాండ్చేసింది. ఐరాస జోక్యం చేసుకోవాలి 17 కోట్ల బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు కేవలం 8 శాతం మంది ఉన్నారు. ఆగస్ట్ ఐదున షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయాక 50కిపైగా జిల్లాల్లో మైనారిటీలపై 200కుపైగా దాడుల ఘటనలు జరిగాయి. తాజాగా కృష్ణదాస్ అరెస్ట్ తర్వాత మళ్లీ మైనారిటీలపై దాడులు పెరగడంతో ఈ అంశంలో ఐక్యరాజ్యసమితి జోక్యంచేసుకోవాలని భారత కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కోరారు. ‘‘ అతివాదుల కనుసన్నల్లో అపద్ధర్మ ప్రభుత్వం నడుస్తోంది. మానవత్వానికి మచ్చతెచ్చే రీతిలో హిందువులపై దాడులు చేస్తున్నారు. ఈ అంశంలో ఐరాస కలుగజేసుకుని సమస్యకు పరిష్కారం కనుగొనాలి’’ అని గిరిరాజ్ బుధవారం ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో అన్నారు. ఇస్కాన్, హిందువులపై దాడులు ఆగేలా బంగ్లాదేశ్‌పై భారత్ ఒత్తిడి పెంచాలని ఇస్కాన్ కోల్‌కతా ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ భారత విదేశాంగ శాఖను కోరారు. హిందువుల పరిరక్షణ కోసం ప్రభుత్వమే పాటుపడాలని ఇస్కాన్ బంగ్లాదేశ్ ప్రధాన కార్యదర్శి చారుచంద్రదాస్ బ్రహ్మచారి వేడుకున్నారు. భారత్ పట్ల వ్యతిరేకత, హిందువులపై ముస్లిం అతివాదుల ఆగడాలు, ఉగ్రదాడులతో తమ దేశం వేగంగా అరాచకత్వం వైపు పయనిస్తోందని బంగ్లాదేశ్ మాజీ విదేశాంగ మంత్రి హసన్ మహ్మూద్ ఆందోళన వ్యక్తంచేశారు. -
ఇస్కాన్ సేవలు అభినందనీయం
మేడ్చల్: ఇస్కాన్ దేశ విదేశాల్లో అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర గవర్నర్ తమిళి సై పేర్కొన్నారు. మండలంలోని డబీల్‌పూర్ ఇస్కాన్ ఆలయంలో ఆదివారం నిర్వహించిన మహాసుదర్శన నారసింహ హోమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొనేందుకు గవర్నర్ గా కాకుండా సామాన్య భక్తురాలిగా వచ్చానని మేడ్చల్ ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అనందంగా ఉందన్నారు. ఇస్కాన్ సంస్థ ప్రజల కోసం ధార్మిక కార్యక్రమాలతో పాటు ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. మంత్రి మల్లారెడ్డి పూజలు.. కార్యక్రమంలో మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొ ని పూజలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ మధ్య ప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్‌రావు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, కాంగ్రెస్ నాయకుడు హరివర్ధన్‌రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వాటిని రాజకీయాలతో పోల్చొద్దు: జహాన్
కోల్‌కతా: పార్లమెంట్లో తృణముల్ కాంగ్రెస్ ఎంపీగా నుస్రత్ జహాన్ సింధూరం, మంగళసూత్రంతోనే ప్రమాణం చేయడం ముస్లిం మత వర్గానికి ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా పశ్చిమబెంగాల్లో ఇస్కాన్ సంస్థ నిర్వహించిన వార్షిక రథయాత్రకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి నుస్రత్ జహాన్ అదే వస్త్రధారణతో హాజరవడం చర్చనీయాంశమైంది. ఇదే విషయమై నుస్రత్ మీడియాతో మాట్లాడుతూ.. 'నేను పుట్టుకతోనే ముస్లింనని, నాకు నా మతమేంటో తెలుసని, ఇలాంటి చిన్న చిన్న విషయాలను నేను పట్టించుకోనని' ఘాటుగానే స్పందించారు. తాను ఒక ఎంపీగా ఈ కార్యక్రమానికి హాజరయ్యానని, మతాన్ని రాజకీయంతో పోల్చడం తగదని ఆమె పేర్కొన్నారు. మరోవైపు నుస్రత్ జహాన్ చేసిన వాఖ్యలపై ఇస్కాన్ ప్రతినిధి రాధా రామ్‌దాస్ ట్విటర్లో స్పందించారు. 'రథయాత్ర వేడుకకు వచ్చినందుకు ముందుగా అభినందనలు. మీరు చేసిన వాఖ్యలు మాకు ఆనందాన్ని కలిగించాయి. మీ మతాన్ని గౌరవిస్తూనే ఇతర వేడుకలకు హాజరవడం మత సామరస్యాన్ని పెంపొందించింది. దీన్ని మీరు ఇలాగే కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం' అని ట్వీట్ చేశారు. ఇంతకుముందు సీఎన్ఎన్-న్యూస్ 18 చానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో నుస్రత్ జహాన్ తన పెళ్లి విషయమై మాట్లాడుతూ... ‘నేను ఒక హిందువును పెళ్లాడిన సంగతి మీకు తెలిసిందే. నా నుదుటి మీద బొట్టును చూసి కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ సంప్రదాయానికి అణుగుణంగానే నడుచుకుంటున్నా. ప్రతి వ్యక్తికి సొంతంగా నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది. నేను ముస్లిం మతాన్ని, మావారు హిందూ మతాలను గౌరవిస్తాం. ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికుంటాయ’ని ఆమె పేర్కొన్నారు. -
‘రథయాత్ర’కుఎంపీ నుస్రత్ జహాన్!
కోల్‌కతా : ఇటీవల వరుస వివాదాలతో సంచలనంగా మారిన నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. కోల్‌కతాలోని ప్రముఖ ఇస్కాన్ దేవాలయంలో గురువారం వైభవంగా జరిగే రథయాత్ర ప్రారంభోత్సవాలకు ఆమె హాజరుకానున్నారు. దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు భర్తతో సహా అక్కడికి వెళ్లనున్నారు. కాగా తమ అభ్యర్థనను మన్నించినందుకు ఇస్కాస్ దేవాలయ అధికార ప్రతినిధి రాధరామన్ దాస్.. నుస్రత్ జహాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం ఇటువంటి ఉత్సవాలకు హాజరవుతూ.. సమ్మిళిత భారతం వైపు అడుగులు వేయటం గొప్ప పరిణామమని ప్రశంసించారు. నుస్రత్ వ్యవహరించే తీరు మెరుగైన సమాజం వైపు దారి చూపుతోందన్నారు. కాగా ముస్లిం మతస్తురాలైన నుస్రత్ జహాన్ ఇటీవలే ఓ వ్యాపారవేత్తను పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే. వివాహానంతరం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె.. నుదుట సింధూరం, చీర ధరించి హిందూ సంప్రదాయ పద్ధతిలో పార్లమెంట్‌కు హాజరయ్యారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆమెపై ట్రోలింగ్ జరిగింది. వాటికి అంతే దీటుగా ఆమె కూడా ట్విటర్ ద్వారా కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాను సమ్మిళిత భారత్‌ను సూచించేలా సింధూరాన్ని ధరించానని జవాబిచ్చారు. సింధూరం కుల, మత, వివక్షలకు అతీతమైనదని అన్నారు. హింసను, పగను రెచ్చగొట్టే ఉన్మాదుల కామెంట్లను తాను పట్టించుకోన్నారు. తాను ముస్లింగానే ఉంటానని, కానీ అన్ని మతాలను గౌరవిస్తానని స్పష్టంచేశారు. తానేం ధరించాలో తన ఇష్టమని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో ఇస్కాన్ రథయాత్ర ప్రారంభోత్సవాలకు నుస్రత్ హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
ఇస్కాన్ సభ్యులను కొడుతున్న పోలిసులు మళ్లీ వీడియో వైరల్
-
మరో నకిలీ వీడియో హల్చల్!
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భగవద్గీత పంచుతున్న ఇస్కాన్ సభ్యులను కొడుతున్న పోలీసులంటూ ఓ వీడియో ఆన్లైన్ గత రెండు రోజులుగా వైరల్ అవుతోంది. ఆ వీడియోను ‘వియ్ సపోర్ట్ నరేంద్ర మోదీ’ గ్రూప్ ఫేస్బుక్లో, ట్విట్టర్లో షేర్ చేస్తోంది. ఇదే వీడియో ఇంతకుముందు 2018, ఏప్రిల్ నెలలో వైరల్ అయింది. గోవాలో ఇస్కాన్ సభ్యులపై క్రైస్తవులు దాడి చేసినప్పటి వీడియో అంటూ నాడు ప్రచారం అయింది. వాస్తవానికి ఈ వీడియో 2008, నవంబర్ 26వ తేదీన ‘హెరాల్డ్గోవా డాట్ ఇన్’ వచ్చిన వార్తకు సంబంధించినది. వెబ్‌సైట్‌ను పునరుద్ధరించినందున ఆ సైట్లో వీడియో దొరకలేదుగానీ ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించిన వార్త, దానికి సంబంధించిన ఫొటో వెలుగు చూసింది. ఆన్లైన్లో నకిలీ వార్తలను ఎప్పటికప్పుడు వెతికి పట్టుకునే ‘ఆల్ట్ న్యూస్’ దీన్నీ వెతికి పట్టుకుంది. కాషాయ వస్త్రాలు ధరించిన ఓ రష్యా బృందం పెద్ద పెట్టున డోలక్, హార్మోనియంను వాయిస్తూ హరేరామా, హరేకృష్ణ అని పాడుకుంటూ వెళుతుండగా, చాలా సేపు ట్రాఫిక్ స్తంభించి పోయింది. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వచ్చి త్వరత్వరగా రోడ్డు పక్కగా వెళ్లాల్సిందిగా ఆ రష్యా బృందాన్ని ఆదేశించారు. దాంతో ఆ బృందం సభ్యులు పోలీసులతో కొట్లాటకు దిగారు. దానికి సంబంధించిన వీడియోనే. ఆ వీడియోలో కనిపిస్తున్నది నల్లగా ఉండే అచ్చమైన గోవా పోలీసులని స్పష్టంగా తెలుస్తోంది. అలా తెలియకుండా ఉండేందుకు పోలీసుల ముఖాలను కాస్త మార్ఫింగ్ చేశారు. పశ్చిమ బెంగాల్లో మే 12, మే 19న జరగనున్న మరో రెండు విడతల పోలింగ్‌లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఎవరో ఈ వీడియోను పోస్ట్ చేసినట్లున్నారు. నాడు ఈ సంఘటన జరిగినప్పుడు గోవాలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. -
మెట్రోలో ప్రయాణించిన మోదీ
న్యూఢిల్లీ : ఉగ్రస్థావరాలపై వైమానిక దాడులకు అనుమతిచ్చి జాతి మొత్తాన్ని ఆశ్చర్యపరిచిన మోదీ.. మరో సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇస్కాన్ మందిరంలో నిర్వహిస్తున్న గీతా ఆరాధన కార్యక్రమంలో పాల్గొనేందుకు మోదీ మెట్రోలో ప్రయాణించారు. ఇస్కాన్ అధ్వర్యంలో నిర్వహించిన భారీ భగవద్గీత ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం మోదీ ఇలా మెట్రోలో ప్రయాణించి అందరిని ఆశ్చర్యపరిచారు. 670 పేజీలు, 800 కిలోల బరువైన అతి భారీ భగవద్గీతను మోదీ ఆవిష్కరించారు. ప్రస్తుతం మోదీ మెట్రో జర్నీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వయొలెట్ లైన్ లోని ఖాన్ మార్కెట్ మెట్రో స్టేషన్లో ప్రధాని మోదీ మెట్రో రైలు ఎక్కారు. అనంతరం కోచ్‌లో ఉన్న ప్రయాణికులతో మాట కలిపారు. అయితే మోదీ పక్కన అందరూ ముస్లిం కూర్చుని ఉండటం గమనార్హం. మోదీని చూసిన ఆనందంలో ప్రయాణికులు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. తర్వాత ప్రధాని నెహ్రూ ప్లేస్ మెట్రో స్టేషన్లో దిగారు. ప్రధాని మెట్రో ప్రయాణం దృష్ట్యా ఆ మార్గం అంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెప్పారు. Let this video speak for itself! 👍 pic.twitter.com/dNHOoEs4cr — Aman Sharma (@AmanKayamHai_ET) February 26, 2019 -
ఒక్కటైన తెలుగు అబ్బాయి.. ఫ్రాన్స్ అమ్మాయి
సాక్షి, అనంతపురం కల్చరల్: ‘నువ్వా దరిని నేనీ దరిని ఇస్కాన్ కలిపింది ఇద్దరిని..’ అంటూ ఆనంద సాగరంలో మునిగిపోయారు ఆ ఖండాంతర ప్రేమికులు. ఫ్రాన్స్‌కు చెందిన అమ్మాయి.. అనంతపురానికి చెందిన అబ్బాయి హైందవ సంప్రదాయం ప్రకారం శుక్రవారం జిల్లా కేంద్రం అనంతపురంలోని ఇస్కాన్ మందిరంలో ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. హిందూపురానికి చెందిన గోవిందప్ప, లక్ష్మీదేవమ్మ దంపతుల కుమారుడు లోచనదాసు(లోకేష్‌బాబు) హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసి ఉద్యోగనిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడి నుంచి కంపెనీ పనులపై ఫ్రాన్స్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఇస్కాన్ మందిరాన్ని నిర్వహిస్తున్న లోయ్సన్ జోయల్, సోనియా దంపతుల కుమార్తె గాంధర్వికా రాయ్(గంగ)ని చూడగానే ప్రేమలో పడ్డాడు. పాశ్చాత్య దేశాల్లో హైందవ పద్ధతులను భక్తిశ్రద్ధలతో పాటిస్తున్న తీరు నచ్చి ఇద్దరూ దగ్గరయ్యారు. ఇద్దరూ ఇస్కాన్ భక్తులు కావడంతో పెద్దలు వివాహానికి అంగీకరించారు. కార్తీక శుక్రవారం నగరంలోని ఇస్కాన్ మందిరంలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా మేళతాళాలు, వేదమంత్రాల నడుమ ఘనంగా వీరి వివాహం జరిగింది. కార్యక్రమంలో ఇస్కాన్ మందిరాల నిర్వాహకులు దామోదర గౌరంగదాసు, టీటీడీ ధర్మప్రచార మండలి జిల్లా అధ్యక్షుడు శ్రీపాద వేణు తదితరులు పాల్గొన్నారు. -
జగమే రామమయం..
ఇస్కాన్‌కు చేరిన విదేశీ భక్తులు l నేడు రామాయణ నృత్యరూపకం ప్రదర్శన l వారే ప్రధాన పాత్రధారులు ‘యావత్ స్ధాశ్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి’ – ‘ఈ భూమండలం మీద పర్వతాలు, నదులు ఉన్నంత కాలం రామాయణ గాథ సమస్త లోకాల్లో కీర్తింపబడుతుంది.’ ఇది వాల్మీకి మహర్షికి బ్రహ్మదేవుడు చెప్పిన మాట. ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నారు విదేశాలకు చెందిన పలువురు భక్తులు.ఇస్కాన్ మందిరం ఆధ్వర్యాన స్థానిక ఆనం కళాకేంద్రంలో శుక్రవారం రామాయణ నృత్యరూపకాన్ని వారు ప్రదర్శించనున్నారు. ఇందులో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచీ 35 మంది కళాకారులు గురువారం ఇస్కాన్ మందిరానికి చేరుకున్నారు. అదే రోజున జరగనున్న జగన్నాథ రథయాత్రలో వారు పాల్గొంటారు. అనంతరం ఆనం కళాకేంద్రంలో రామాయణ నృత్యరూపకం ప్రదర్శిస్తారు. దీనిని తిలకించడానికి ఇప్పటికే సుమారు 200 మంది విదేశీ భక్తులు కూడా నల్లనయ్య మందిరానికి అతిథులుగా వచ్చారు. శ్రీరామకథ తమ అంతరంగాలను, ఆలోచనలను ప్రభావితం చేసిందని ఈ సందర్భంగా వారు చెప్పారు. ఆ విశేషాలు వారి మాటల్లోనే.. – రాజమహేంద్రవరం కల్చరల్ తోడు వచ్చే దివ్యకథామృతం రామకథ నన్ను సమ్మోహనపరుస్తోంది. ఇస్కాన్ వ్యవస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల రచనలు చదివి, నేను రామాయణంపట్ల ఆకర్షితురాలినయ్యాను. వాల్మీకి రామాయణాన్ని తెలుసుకున్నాను. దాని ఆధారంగా ఆంగ్లంలో నృత్యరూపకం రచించి, స్వరకల్పన చేశాను. ఇందులో సంభాషణలుండవు. హిందీలో కొన్ని కీర్తనలున్నాయి. నాకు వెన్నంటి తోడు వచ్చే దివ్యకథామృతం రామాయణం. – మాధుర్య కదంబిని (అసలు పేరు : మరియ), రష్యా గాత్రధారణ నాదే రామాయణం నృత్యరూపకంలో కీర్తనలకు గాత్రధారణ నాదే. ఇది అదృష్టంగా భావిస్తున్నా. ఈ నృత్యరూపకంలో నేను గానం చేసిన ‘హే రామ్! హే రామ్! తుహి మాతా, తుహి పితా హై’ పాట నిరంతరం నాలో మార్మోగుతూనే ఉంటుంది. శ్రీరాముడిని జగత్తుకే ఆదర్శ పురుషునిగా భావిస్తాను. – శ్రీరామప్రసాదందాస్ (అసలు పేరు : లిత్వీనియా), యూరోప్ మర్యాదా పురుషోత్తముడు శ్రీరామ పాత్ర నన్ను అమితంగా ఆకట్టుకున్నది. ఎందుకంటే ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా రాముడు ధర్మం తప్పలేదు. నేడు, ఏనాడూ పాలకులకు, ప్రజలకు ఆయన ఆదర్శపురుషుడు. మర్యాదా పురుషోత్తముడు. ఈ పాత్రను ధరించడం ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. – శచీప్రాణ్ గౌరంగదాస్, రష్యా రాక్షస పీడను తొలగించింది శూర్పణఖే.. రామాయణాన్ని స్త్రీ పాత్రలే మలుపుతిప్పాయి. మంధర లేకపోతే రామ వనవాసం లేదు. శూర్పణఖ లేకపోతే, రావణాది దుష్టరాక్షస సంహారం జరిగి ఉండేది కాదు. నేను నృత్యరూపకంలో ధరిస్తున్న శూర్పణఖ పాత్ర ప్రాధాన్యాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నాను. – శ్యామనాథ్ రాణి, రష్యా రష్యాలో అనేక ప్రదర్శనలు జరిగాయి సుమారు 45 నిమిషాలు సాగే ఈ నృత్యరూపకంలో 35 పాత్రలుంటాయి. రష్యాలో అనేక పర్యాయాలు ప్రదర్శించాం. అక్కడి ప్రేక్షకుల అభినందనలు అందుకున్న రూపకం ఇది. తరతరాలుగా ప్రజలను అలరిస్తున్న ఈ నృత్యరూపకాన్ని గోదావరి తీరాన ప్రదర్శించడం సుకృతంగా భావిస్తున్నాను. – మరీచీదాస్ (అసలు పేరు : మార్సిలో లిబియో), అర్జంటీనా -
హరే కృష్ణ!
సైకిల్ చైన్ పట్టుకుని విలన్లను రఫ్ఫాడించిన హీరో.. ‘హలో గురూ ప్రేమ కోసమేనోయ్ జీవితం..’ అని రొమాంటిక్ పాట పాడిన హీరో... భక్తుడిగా కనిపిస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారా? పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తే అంగీకరించేస్తారు. అందుకు ఉదాహరణ ‘అన్నమయ్య’. అప్పటివరకూ చేసిన ‘శివ’, ‘నిర్ణయం’, ‘గీతాంజలి’ చిత్రాల ద్వారా తనలో మంచి మాస్ హీరో, రొమాంటిక్ హీరో ఉన్న విషయాన్ని నాగ్ నిరూపించుకున్నారు. ఈ చిత్రాలకు పూర్తి వ్యత్యాసంగా ఉండే ‘అన్నమయ్య’లో నాగ్ అభినయం కేక. ఆ తర్వాత చేసిన ‘శ్రీరామదాసు’, ‘శిరిడీ సాయి’ కూడా నాగ్ భక్తి చిత్రాలకు పనికొస్తారని బలంగా చెప్పాయి. ఇప్పుడు ‘నమో వేంకటేశాయ’లో వెంకన్న భక్తుడు హాథీరామ్ బాబాగా నటించారు. ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదల కానుంది. భవిష్యత్తులో నాగార్జున నుంచి మరో భక్తిరసాత్మక చిత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చని చెప్పొచ్చు. ‘అన్నమయ్య’, ‘శిరిడీ సాయి’, ‘నమో వేంకటేశాయ’ చిత్రాలకు రచయితగా వ్యవహరించిన జేకే భారవి ప్రస్తుతం మరో భక్తి కథ సిద్ధం చేసే పని మీద ఉన్నారు. ఆధ్యాత్మిక గురువు, ‘ఇస్కాన్’ (అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం) ఫౌండర్ అయిన స్వామి ప్రభుపాద జీవితం ఆధారంగా ఆయన ఈ కథ తయారు చేస్తున్నారట. కృష్ణుడి భక్తుని జీవితంతో సినిమా కాబట్టి, దీన్ని ‘ఇస్కాన్’ ఫౌండేషన్ నిర్మించడానికి ఆసక్తిగా ఉందని సమాచారం. ఈ చిత్రకథను క్లుప్తంగా నాగ్‌కి భారవి వినిపించారట. ఇక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం. -
ఇస్కాన్‌లో ఘనంగా రాధాష్టమి
నెల్లూరు(బృందావనం): మినీబైపాస్‌రోడ్డులోని ఇస్కాన్ మందిరంలో శుక్రవారం రాత్రి రాధాష్టమి వేడుకలను నిర్వహించారు. మందిరం సంకీర్తనలు, భజనలు, గీతాలతో పులకించిపోయింది. భక్తులు రాధాకృష్ణులకు స్వయంగా అభిషేకాలు చేసి తన్మయత్వంతో పొంగిపోయారు. మందిరాధ్యక్షుడు డాక్టర్ సుఖదేవస్వామి ఉపన్యసించారు. -
నేటి నుంచి ‘ఇస్కాన్’జూబ్లీ ఉత్సవాలు
– ‘మహా సంబరం’గా శ్రీకృష్ణ జన్మాష్టమి – తిరుపతి, ముంబయి, ఢిల్లీ, బృందావనం, బెంగళూరుల్లో భారీ ఏర్పాట్లు – 25న అన్ని చోట్లా మహా శంఖాభిషేకం, ఉట్టి ఉత్సవాలు – దేశమంతటా కోటి మంది భక్తులకు అన్నదానం సాక్షి ప్రతినిధి, తిరుపతి : అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను జూబ్లీ మహోత్సవాలుగా నిర్వహించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఈ ఏడాది మహా సంబరాలుగా నిర్వహించేందుకు ఇస్కాన్ నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి దేశ విదేశాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. తిరుపతి, ముంబయి, ఢిల్లీ, బెంగళూర్, బృందావనం ఆలయాల్లో ఈ సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక, అన్నప్రసాద వితరణ, మహాశంఖాభిషేకాలను కూడా నిర్వహించేందుకు సమాయత్తమైంది. అన్నిచోట్లా సుమారు కోటి మంది భక్తులకు అన్నప్రసాద వితరణకు సిద్ధమైంది. దేశ, విదే«శాల్లోని ఇస్కాన్ ఆలయాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఏటా అత్యంత భారీగా నిర్వహిస్తుంటారు. ఇందుకోసం అంతర్జాతీయ కృష్ణ చైతన్యం సంఘం కోట్లల్లో నిధులు వెచ్చిస్తుంది. ఏటా కృష్ణ జన్మాష్టమి పర్వదినాన మనదేశంలోని ఇస్కాన్ ఆలయాలకు సుమారు కోటి మందికి పైగా భక్తులు హాజరై స్వామివారిని దర్శిస్తుంటారు. ఈ ఏడాది దేశ విదేశాల్లో ఉన్న 400 పైగా ఇస్కాన్ మందిరాల్లో కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. అయితే ఉత్సవ నిర్వహణ కమిటీ మాత్రం ప్రధాన ఆలయాలైన తిరుపతి, ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, బృందావనం ఆలయాలపై దృష్టి పెట్టింది. ఈ ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగే వీలున్నందున వారం రోజుల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. దేశ విదేశాల నుంచి కోటి మందికి పైగా కృష్ణభక్తులు స్వామివారిని దర్శించే అవకాశముందని అంచనాకు వచ్చిన నిర్వాహకులు దర్శనం, ప్రసాద వితరణ, అన్నదానం వంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శ్రీకృష్ణుడి జన్మస్థలమైన బృందావనంలో జరిగే వేడుకలను తిలకించేందుకు 12 దేశాల నుంచి భక్తులు విచ్చేయనున్నారు. ఇక్కడ జరిగే వేడుకలను జర్మనీకి చెందిన సనక్ సనాతన్దాస్ పర్యవేక్షిస్తున్నారు. ముంబయిలోని జుహూ ప్రాంతంలో ఉన్న ఇస్కాన్ ఆలయానికి ఒక్కరోజే 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని నిర్వాహకుల అంచనా. ఇక్కడ జరిగే వేడుకలను ఇస్కాన్ ప్రతినిధి బ్రిజ బిహారీదాస్ పర్యవేక్షిస్తున్నారు. ఇకపోతే ఢిల్లీలోని ఈస్ట్ కైలాస్ ప్రాంతంలో ఉన్న ఇస్కాన్ మందిరంలో 3 రోజుల పాటు గోపాలకృష్ణుడి వేడుకలు జరగనున్నాయి. గోపాలకృష్ణ ప్రభు ఆధ్వర్యంలో ఆలయ ఉత్సవాల ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తిరుపతిలో జరిగే వేడుకలను ఇస్కాన్ చైర్మన్ రేవతీ రమణదాస్, వైస్ చైర్మన్ రూపేష్ప్రభులు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది సుమారు రెండు లక్షల మంది భక్తులు ఆలయానికి విచ్చేసే వీలుందని రూపేష్ప్రభు పేర్కొన్నారు. బెంగళూరులోని హరేకృష్ణ హిల్స్ దగ్గరున్న ఇస్కాన్ ఆలయంలో మధుపల్లి దాస్ ప్రభు పర్యవేక్షణలో మూడు రోజుల పాటు బ్రహ్మాత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా తిరుపతి, ముంబయి, ఢిల్లీ, బెంగళూర్, బృందావనం ఆలయాలను రంగు రంగుల విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కోటి మందికి సరిపడా 18 టన్నుల స్వీట్ పొంగల్‌ను తయారు చేయిస్తున్నారు. ఆలయాల్లోని స్వామి వారి విగ్రహాలను 108 రకాల ఫలఫుష్పాలతో అలంకరిస్తున్నారు. 25న సాయంత్రం 3 గంటలకు ఉట్టికొట్టే వేడుకలను సంప్రదాయబద్దంగా నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి ఆలయ మండపాల్లో పెద్ద ఎత్తున మహా శంఖాభిషేక మహోత్సవాలను నిర్వహించనున్నారు. -
ఇస్కాన్ పోటీలకు స్పందన
సాగర్‌నగర్ శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను పురస్కరించుకొని ఇస్కాన్ విశాఖనగర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఇస్కాన్ సాగర్‌నగర్ ప్రాంగణంలో విద్యార్థులకు నిర్వహించిన సాంస్కృతిక పోటీలకు విశేష స్పందన లభించింది. ఇస్కాన్ మాతాజీ నితాయి సేవిని పర్యవేక్షిణలో నిర్వహించిన పోటీల్లో నగర నలుమూలల నుంచి విచ్చేసిన ఆయా పాఠశాల విద్యార్థునీ, విద్యార్థులు ఎంతో ఉత్సహంతో పాల్గొన్నారు. ఈ పోటీలను ఇస్కాన్ నగరశాఖ అధ్యక్షుడు సాంబాదాస్ ప్రభుజీ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1999 నుంచి విశాఖలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను క్రమం తప్పకుండా ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఏటా నగర పాఠశాల విద్యార్థులను వివిధ కళారంగాల్లో ప్రోత్సహించేందుకు పెయింటింగ్, సాంస్కృతిక,నృత్యకార్యక్రమాలు, వ్యాసరచన పోటీలు, ఇతర సామాజిక అంశాలపై పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు ప్రొత్సాహకాలతోపాటు బహుమతులు అందజేస్తున్నట్టు తెలిపారు. ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన పోటీల్లో కృష్ణా టెస్ట్‌కు 1200మంది విద్యార్థులు, పాట్మేకింగ్ 1370మంది, వ్యాసరచన పోటీలకు 560మంది, పోస్టర్ మేకింగ్ 450, పెన్సిల్ స్కెటింగ్కు 350మంది, గీతా శ్లోక పోటీలకు 540మంది విద్యార్థులు, చిత్రలేఖనంలోను కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పోటీల్లో నెగ్గిన విజేతలకు ఈనెల 25న ఇస్కాన్ హారేకష్ణ ప్రాంగణంలో కృష్ణాష్టమి రోజున ప్రముఖల ద్వారా బహుమతులు, ప్రశంసపత్రాలను అందజేయడం జరగుతోందన్నారు. -
రూ. 150 కోట్లతో బంగారు ఆలయం
బాలకృష్ణుడికి రూ.150 కోట్లతో బంగారు ఆలయాన్ని నిర్మించనున్నారు. గుంటూరు జిల్లా కొండవీడు ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించాలని ఇస్కాన్ నిర్ణయించింది. దసరా రోజున ఈ ఆలయానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఇస్కాన్ తెలిపింది. విజయదశమినాడు స్వర్ణమందిరం ఏర్పాటు పనుల ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రానున్నట్లు సమాచారం. మొత్తం 150 ఎకరాల్లో నిర్మించనున్న ఈ ఆలయ ప్రాంతానికి ఇస్కాన్ కొండవీడుగా నామకరణం చేసింది. చారిత్రక వెన్నముద్దల వేణుగోపాస్వామికి ఈ ప్రతిష్టాత్మక ఆలయాన్ని నిర్మిస్తున్నారు. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం చెంఘీజ్‌ఖాన్‌పేటలోని వెన్నముద్దల వేణుగోపాలస్వామి విగ్రహం ప్రపంచంలోనే అతి అరుదైనదని వేదపండితులు చెబుతున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం 60 ఎకరాలు కేటాయించింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఇస్కాన్ ఆధ్వర్యంలో గోశాల నిర్వహిస్తున్నారు. స్వర్ణమందిరం చుట్టూ మహాభారత, రామాయణాలపై పురాణ గాథలను వివరిస్తూ వినూత్నరీతిలో మ్యూజియం, రోబోలు, ఆడియో, వీడియో విజువల్ ప్రదర్శనల ద్వారా ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేలా ఉంటాయి. ఇంకా వేద పాఠశాల, అండర్ వాటర్ మెడిటేషన్ హాలు, ప్రాచీన శాస్త్రాలను సైన్స్ పరంగా చూపే థియేటర్లు, శ్రీకృష్ణుని లీలలను భావితరాలకు తెలిపే ధీం పార్కులు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టుకు రూ.150 కోట్లతో అంచనాలు రూపొందించామని ఇస్కాన్ దక్షిణ భారత ఛైర్మన్ సత్యగోపీనాథ్ దాస్ వివరించారు. -
ఉప్పల్ డీసీపై ‘సమ్మె’ట వేటు!
* ప్రభుత్వానికి సరెండర్ చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ * బీజేపీ ఎమ్మెల్యే దీక్షకు ‘ఇస్కాన్’ నుంచి భోజనం అందించారని ఆరోపణ సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల సమ్మె పరిష్కారం విషయంలో పంథాలు ఓ అధికారి కుర్చీకే ఎసరు పెట్టాయి! సమ్మె పట్ల కఠినంగా వ్యవహరించలేదనే ఆరోపణలపై ఉప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్(డీసీ)పై జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ వేటు వేయడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేసినందుకు సమ్మెలో పాల్గొన్న 1,300 మంది కార్మికులను జీహెచ్ఎంసీ తొలగించిన విషయం తెలిసిందే. కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కార్మిక సంఘాలు, వామపక్షాలతో పాటు బీజేపీ సైతం ఆందోళనలు చేస్తోంది. ఇదే కోవలో ఉప్పల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గత 24 నుంచి 31 వరకు ఉప్పల్ సర్కిల్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేశారు. వారం పాటు కొనసాగించినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆందోళను విరమించారు. ధర్నాలో పాల్గొన్న వారికి ఒకరోజు ‘హరే రామ హరే కృష్ణ’ మఠం నిర్వాహకులు ఉచితంగా భోజనాన్ని సరఫరా చేశారు. జీహెచ్ఎంసీ రాయితీతో ‘హరే రామ హేరే కృష్ణ’ మఠం రూ.5కే భోజనం పథకాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న వారికి ఈ పథకం కింద భోజనం వడ్డించారని ఉన్నతాధికారులు భావించారు. ఈ అంశంపై జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ శనివారం డిప్యూటీ కమిషనర్ పి.విశ్వనాథ్‌ను వివరణ కోరారు. ఇందులో తన ప్రమేయం లేదని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. అయితే విశ్వనాథ్‌ను ఉప్పల్ సర్కిల్ బాధ్యతల నుంచి తప్పించడంతో పాటు ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రసాదం పంపాలని కోరా.. దీనిపై ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ వివరణ ఇస్తూ.. ధర్నాలో పాల్గొన్న వారికి తన కోరిక మేరకే ఇస్కాన్ మఠం వాళ్లు ప్రసాదం పంపించారని చెప్పారు. ‘ఏకాదశి నాడు చాలా మంది ఉపవాస దీక్ష చేశారు. ఆ మరుసటి రోజు ధర్నా చేయడంతో మఠం నుంచి ప్రసాదాన్ని తెప్పించాను. రూ.5కే భోజనం పథకంతో ఈ ప్రసాదానికి ఎలాంటి సంబంధం లేదు.’ అని తెలిపారు. -
ఇస్కాన్ ఆధ్వర్యంలో వేసవి శిబిరం
కవాడిగూడ (హైదరాబాద్) : ఇస్కాన్ కూకట్పల్లి బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు గీతా సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు డెరైక్టర్ మహా శృంగదాస గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎనిమిదిరోజులపాటు 8 నుండి 20 ఏళ్ల వయసు వారి కోసం భగవద్గీతపై వేసవి శిక్షణ శిబిరం ఉంటుందన్నారు. శిబిరం ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు కొనసాగుతుందన్నారు. పిల్లలకు వ్యక్తిత్వ వికాసంతో పాటు తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, తోబుట్టువులతో ఎలా ప్రవర్తించాలి, విద్యా విధానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, సంస్కృత శ్లోక పఠనం, వైధిక కథలు, డ్రామాలు, డ్యాన్స్, ఆటలు, భగవద్గీత యధాతథం తదితర విషయాలను అత్యంత సరళంగా నేర్పిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు 8008924201, 9866340588 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. -
‘మధ్యాహ్న భోజనాన్ని’ ఇస్కాన్‌కు ఇవ్వొద్దు
కర్నూలు(జిల్లా పరిషత్): ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో కొనసాగుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్కాన్ సంస్థకు అప్పగించాలని చూస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మి హెచ్చరించారు. ఇస్కాన్ సంస్థకు మధ్యాహ్న బోజన పథకం బాధ్యతను అప్పగించొద్దంటూ ఆ పథకం వర్కర్స్ యూనియన్( ఏఐటీయుసి) ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వంట ఏజెన్సీలు, వంట చేసే మహిళలు పెద్ద ఎత్తున కర్నూలు తరలివచ్చారు. అంబేద్కర్ భవన్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌కు వినతి పత్రం అందజేశారు. పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మి, జిల్లా అధ్యక్షులు పి. మురళీధర్ మాట్లాడుతూ ఒకవైపు బిల్లులు రాకున్నా, అప్పులు చేసి పథకాన్ని కొనసాగిస్తుంటే మరోవైపు ఇస్కాన్‌కు పథకాన్ని అప్పగించాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. ఆ సంస్థకు ఇస్తే విద్యార్థులకు గుడ్డు ఇవ్వరని, మత విశ్వాసాలను విద్యార్థులకు నూరిపోస్తారని ఆరోపించారు. ఈ సంస్థకు వ్యతిరేకంగా కమిషన్ నివేదిక ఇచ్చినా ప్రభుత్వం వారికే పథకం బాధ్యతలు ఇవ్వాలని చూడటం దారుణమన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎన్. మనోహర్‌మాణిక్యం, జిల్లా అధ్యక్షులు సుంకయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్. మునెప్ప మాట్లాడుతూ ప్రొఫెసర్ ఉమాదేవి నివేదిక ప్రకారం మధ్యాహ్న బోజన పథకంలో ఇస్కాన్ సంస్థ అవకతవకలకు పాల్పడుతున్నట్లు స్పష్టం చేసిందన్నారు. ఆరు నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నా పథకాన్ని కొనసాగిస్తున్న వారిని కాదని ఇస్కాన్‌కు అప్పగిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ధర్నాకు బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోజెస్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు శేషఫణి, డీటీఎఫ్ జిల్లా ప్రదాన కార్యదర్శి కాంతారావు, ఎయిడెడ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు విక్టర్ ఇమ్మానియేల్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి జి. రంగన్న, మహిళా సమాఖ్య నాయకులు గిడ్డమ్మ, కోటమ్మ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ, శివ, నగర కార్యదర్శి పి. రామకృష్ణారెడ్డి, వెంకటేష్, ఈశ్వర్, పథకం వర్కర్స్ యూనియన్ నాయకులు బాలకృష్ణ, రమేష్, విజయలక్ష్మి, రాజేశ్వరి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. -
టీబీ రోగులకు పౌష్టికాహారం
సాక్షి, ముంబై: టీబీ రోగులకు త్వరలో పౌష్టిక ఆహారం అందనుంది. ఇకమీదట ఇస్కాన్ వారు వీరికి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించనున్నారు. శివ్డీలోని కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే టీబీ ఆస్పత్రిలోని రోగులకు ఇస్కాన్ సంస్థ ఈ ఆహారాన్ని అందించనుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కాగా జీటీబీ ఆస్పత్రిలో ఆహారం సరిగ్గా ఉండడం లేదంటూ కొన్ని రోజులు గా కార్పొరేషన్‌కు ఫిర్యాదులందుతున్నాయి. టీబీ రోగులకు మరిన్ని పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాల్సి ఉంటుంది. వీరు ఉపయోగించే ఔషధాలకు మంచి ఆహారం తీసుకుంటేనే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఓ వైద్యుడు తెలిపారు. ఈ ఆస్పత్రిలోనే ఓ వంట గదిని ఏర్పాటు చేయనున్నట్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వైద్య విభాగం కార్యనిర్వాహక అధికారి పద్మజ కేస్కర్ పేర్కొన్నారు. ప్రస్తుతం జీటీబీ ఆస్పత్రి రోజుకు 800 మంది రోగులకు వైద్యసేవలు అందిస్తోంది. వీరికి ఉదయం బ్రెడ్, మధ్యాహ్నం భోజ నంలోకి బ్రెడ్, పప్పు లేదా కూరగాయలను అందజేస్తున్నారు. ఇక విలేపార్లేలోని కూపర్ ఆస్పత్రి రోగులకు కూడా మరిన్ని పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఇస్కాన్ సంస్థ అందజేసేందు కు వీలుగా కార్పొరేషన్ అవసరమైన చర్య లు తీసుకోనుంది. ఈ విషయమై పరిపాలనా విభాగం సలహాదారుడు రాధాకృష్ణ దాస్ మాట్లాడుతూ వైద్యులు సూచించిన మేరకు రోగులకు భోజనాన్ని అందజేస్తామన్నారు. గదిని కేటాయించగానే వెంటనే వంటకు సంబంధించిన యంత్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.