హరే కృష్ణ! | Nagarjuna about Om Namo Venkatesaya movie | Sakshi
Sakshi News home page

హరే కృష్ణ!

Published Wed, Jan 11 2017 11:35 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

హరే కృష్ణ! - Sakshi

హరే కృష్ణ!

సైకిల్‌ చైన్‌ పట్టుకుని విలన్లను రఫ్ఫాడించిన హీరో.. ‘హలో గురూ ప్రేమ కోసమేనోయ్‌ జీవితం..’ అని రొమాంటిక్‌ పాట పాడిన హీరో... భక్తుడిగా కనిపిస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారా? పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తే అంగీకరించేస్తారు. అందుకు ఉదాహరణ ‘అన్నమయ్య’. అప్పటివరకూ చేసిన ‘శివ’, ‘నిర్ణయం’, ‘గీతాంజలి’ చిత్రాల ద్వారా తనలో మంచి మాస్‌ హీరో, రొమాంటిక్‌ హీరో ఉన్న విషయాన్ని నాగ్‌ నిరూపించుకున్నారు. ఈ చిత్రాలకు పూర్తి వ్యత్యాసంగా ఉండే ‘అన్నమయ్య’లో  నాగ్‌ అభినయం కేక. ఆ తర్వాత చేసిన ‘శ్రీరామదాసు’, ‘శిరిడీ సాయి’ కూడా నాగ్‌ భక్తి చిత్రాలకు పనికొస్తారని బలంగా చెప్పాయి. ఇప్పుడు ‘నమో వేంకటేశాయ’లో వెంకన్న భక్తుడు హాథీరామ్‌ బాబాగా నటించారు. ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదల కానుంది.

భవిష్యత్తులో నాగార్జున నుంచి మరో భక్తిరసాత్మక చిత్రం ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చని చెప్పొచ్చు. ‘అన్నమయ్య’, ‘శిరిడీ సాయి’, ‘నమో వేంకటేశాయ’ చిత్రాలకు రచయితగా వ్యవహరించిన జేకే భారవి ప్రస్తుతం మరో భక్తి కథ సిద్ధం చేసే పని మీద ఉన్నారు. ఆధ్యాత్మిక గురువు, ‘ఇస్కాన్‌’ (అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం) ఫౌండర్‌ అయిన స్వామి ప్రభుపాద జీవితం ఆధారంగా ఆయన ఈ కథ తయారు చేస్తున్నారట. కృష్ణుడి భక్తుని జీవితంతో సినిమా కాబట్టి, దీన్ని ‘ఇస్కాన్‌’ ఫౌండేషన్‌ నిర్మించడానికి ఆసక్తిగా ఉందని సమాచారం. ఈ చిత్రకథను క్లుప్తంగా నాగ్‌కి భారవి వినిపించారట. ఇక గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడమే ఆలస్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement