
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవడానికి వెళ్లారు. ఆయన ఆర్టీఏ కార్యాలయంలో ఫోటోలు దిగి, సంతకం చేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఆర్టీఏ సిబ్బందితో ఆయన సెల్ఫీలు దిగి వారితో కొంత సమయం పాటు సరదాగ మాట్లాడి వెళ్లిపోయారు.. నాగ్ వస్తున్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు కూడా ఆర్టీఏ కార్యాలయానికి చేరుకున్నారు. వారితో కూడా అయన ఫోటోలు దిగారు. తన డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిందని అందుకే రెన్యువల్ కోసం వచ్చానని ఆయన చెప్పారు.
నాగార్జున సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కుబేర' సినిమాలో ఆయన చాలా కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్- లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ సినిమా 'కూలీ'లో కూడా నాగ్ చాలా ప్రాముఖ్యత ఉన్న రోల్‌లో కనిపించనున్నారు.