RTA officer
-
మైనర్.. డ్రైవింగ్ డేంజర్
సాక్షి, హైదరాబాద్: మైనర్ల డ్రైవింగ్‌పై ఆర్టీఏ కొరడా ఝళిపించింది. పద్దెనిమిదేళ్లలోపు పిల్లలు కార్లు, బైక్‌లు నడిపితే తల్లిదండ్రులు లేదా వాహన యజమానులు మూల్యం చెల్లించుకోవాల్సిందే. గ్రేటర్ పరిధిలో తరచుగా ఎక్కడో ఒకచోట మైనర్ల డ్రైవింగ్ బెంబేలెత్తిస్తున్నాయి. పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్ నిబంధనల పట్ల ఎలాంటి అవగాహన లేకుండా వాహనాలు నడిపే మైనర్లు వాహనాలు ఢీకొట్టి ఇతరుల ప్రాణాలను బలిగొంటున్నారు. ఇటీవల కాలంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న ఈ విపత్కర పరిణామంపై రవాణాశాఖ సీరియస్‌గా దృష్టి సారించింది. మైనర్ల డ్రైవింగ్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టింది. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 199ఏ ప్రకారం మైనర్ల తల్లిదండ్రులు లేదా వాహన యజమానులకు గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అలాగే రూ.25,000 వరకు జరిమానా విధించవచ్చు. ఈ దిశగా కార్యాచరణ చేపట్టినట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ సి.రమేష్ తెలిపారు. తల్లిదండ్రులు తమ మైనారిటీ పిల్లలకు వాహనాలను అప్పగించి చిక్కులు కొని తెచ్చుకోవద్దని ఆయన సూచించారు. శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. త్వరలోనే ఈ చట్టాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. హడలెత్తిస్తున్న మైనర్లు.. 👉స్కూల్‌పిల్లలు, మైనారిటీ తీరని ఇంటరీ్మడియట్ స్థాయి పిల్లలు సైతం ఎస్యూవీ వంటి అత్యంత వేగవంతమైన బైక్‌లు, కార్లు నడుపుతున్నారు. పిల్లలకు వాహనాలను ఇవ్వకుండా అడ్డుకోవాల్సిన తల్లిదండ్రులే వారి డ్రైవింగ్ చూసి గర్వంగా భావిస్తున్నారు. కానీ.. ముంచుకొచ్చే ప్రమాదాన్ని గుర్తించడం లేదు. ఇలాంటి వాహనాలను నడుపుతూ పరిమితికి మించిన వేగంతో పరుగులు తీస్తున్నారు. 👉 ఈ ఏడాది జూన్ నెలలో మణికొండ వద్ద ఓ మైనర్ బాలుడు ఎస్యూవీ వాహనం నడుపుతూ పార్క్ చేసిన వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. గతంలోనూ నలుగురు పిల్లలు వారిలోఒకరి పుట్టిన రోజు సందర్భంగా కారు తీసుకొని లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. ఈప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటివరకు సాధారణ శిక్షలతో సరి.. 👉 ప్రతి ఏటా పోలీసులు, ఆర్టీఏ సిబ్బంది తనిఖీల్లో సుమారు 2,500 నుంచి 3,000 మంది పిల్లలు వాహనాలు నడుపుతూ పట్టుబడుతున్నట్లు అంచనా. ఇలాంటి సంఘటనల్లో ఇప్పటి వరకు సాధారణ శిక్షలే అమలవుతున్నాయి. తల్లిదండ్రులను పిలిపించి హెచ్చరించి వదిలేస్తున్నారు. జరిమానాలు విధిస్తున్నారు. కానీ ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం తల్లిదండ్రులు బాధ్యత వహించాల్సివస్తోంది. 👉 రెండేళ్ల క్రితం మైనర్ల డ్రైవింగ్ వల్ల 25 ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. 2023లో 35 ప్రమాదాలు జరిగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 10 ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. ఇలాంటి ప్రమాదాలు వాహనాలు నడిపే డ్రైవర్లు, వారితో కలిసి ప్రయాణం చేసేవారు. ఇతర రోడ్డు వినియోగదారులు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. మైనర్ల డ్రైవింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు ఎంవీ యాక్ట్‌లోని సెక్షన్ 199ఏను సమర్థంగా అమలు కానుంది. 👉 మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు పాల్పడటంతో పాటు బండి నడుపుతూ పట్టుబడినా సరే ఆర్సీ రద్దవుతుంది. ఏడాది పాటు సదరు వాహనం రిజి్రస్టేషన్‌ను రద్దు చేయనున్నారు. దీంతో ఆ వాహనాన్ని వినియోగించేందుకు అవకాశం ఉండదు. పట్టుబడే మైనర్లకు 25 ఏళ్ల వయసు వరకు లెరి్నంగ్, డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయకుండా ఆంక్షలు విధిస్తారు. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 199ఏను సమర్థంగా అమలు చేయాలని కోరుతూ రవాణా కమిషనర్ ఇలంబర్తి ఇటీవల అన్ని జిల్లా, ప్రాంతీయ రవాణా కార్యాలయాల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మైనర్ల డ్రైవింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని తెలిపారు.రహదారి భద్రత ప్రధానం.. రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనల పట్ల ఎలాంటి అవగాహన లేని పిల్లలు వాహనాలను తీసుకొని రోడ్డెక్కితే చాలా నష్టం జరుగుతుంది. ఆ పిల్లల కుటుంబాలే కాకుండా సమాజం కూడా ఆ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. తల్లిదండ్రులు, పెద్దలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకు వాహనాలను ఇవ్వకూడదు. – సి.రమేష్, ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్, హైదరాబాద్ -
నడి రోడ్డు మీద లంచావతారం..
సాక్షి, తాడేపల్లిగూడెం: నడిరోడ్డుపై ఆర్టీఏ ఉద్యోగి లంచావతారం ఎత్తిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో చోటుచేసుకుంది. వాహనాదారుల నుంచి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మృత్యుంజయరాజు డబ్బులు వసూలు చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో సంబంధిత శాఖ ఉన్నతాధికారుల వద్దకు చేరడంతో దీనిపై వెంటనే స్పందించారు. తాడేపల్లి గూడెం బైపాస్ రోడ్డుపై అధికారిక యూనిఫామ్‌లో లేకుండా వాహన డ్రైవర్ల నుండి లంచాలు వసూలు చేస్తున్నా ఎంవీఐ మృత్యుంజయరాజును సస్పెండ్ చేస్తూ రవాణా శాఖ కమిషనర్ సీతా రామాంజనేయులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: (దివ్య హత్య కేసు: దిశా పోలీస్ స్టేషన్‌కు నాగేంద్ర) -
అమ్మాయిలకు డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వలేను
ఏ దేశంలోనైనా రెండే చోట్ల కరెన్సీ ప్రింట్ అవుతుంది. ఒకటి ప్రభుత్వ ముద్రణాలయం. ఇంకొకటి ఆర్టీఏ ఆఫీసు. రోడ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ. ఇక్కడేం ప్రింటింగ్ మిషన్లు ఉండవు. లైసెన్సు కోసం, రిజిస్ట్రేషన్ కోసం వెళ్లిన వాళ్ల నుంచి నోట్లను ‘మింట్’ చేసేస్తారు. గవర్నమెంట్ రూల్స్ ఉండటానికి ఉంటాయి. వాటితో మన బండి నడవదు. కౌంటర్లలో మనిషికో రూల్ ఉంటుంది. ఏ మనిషి దగ్గర ఆ రూల్ పాటించకపోతే ఆడీ కారు ఉన్నా బతుకు జట్కా బండే. ‘భారతీయుడు’ సినిమాలో శంకర్ శాంపిల్‌గా చూపించాడు. ఇప్పుడొక పాకిస్తానీయురాలి అనుభవం. ఆ అమ్మాయి పేరు శిరీన్. డ్రైవింగ్ లైసెన్సు కోసం ఆర్టీఏ ఆఫీసుకి వెళ్లింది. రిటర్న్ టెస్ట్ పాస్ అయింది. బండి మీద 8 కొట్టింది. ఆఫీసర్ ‘గుడ్’ అన్నాడు. అని కూడా ‘సారీ అమ్మా, అమ్మాయిలకు డ్రైవింగ్ లైసెన్సును నేనైతే ఇవ్వలేను‘ అన్నాడు. ‘ఇవ్వాల్సింది మీరే కదా సర్’ అంది ఆ అమ్మాయి మన దిల్ ఖుష్ దివ్యలా.. సర్ అనే మాటను నొక్కి పలుకుతూ. ‘అయిననూ ఇవ్వలేనమ్మా.. ఆడపిల్లలు బండ్లు పడేస్తారు’ అన్నాడు. ‘డబ్బుల కోసమా సర్ ’ అంటే.. ‘కాదమ్మా.. నీకు దెబ్బలు తగులుతాయని’ అన్నాడు. శిరీన్కి కోపం వచ్చింది. ట్విట్టర్లోకి వెళ్లి ‘ఏం రూల్ ఇది?’ అని నేరుగా ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్‌కి ట్వీట్ కొట్టింది. వెంటనే ఇమ్రాన్ లైన్లోకి వచ్చారు. ఆ ఇమ్రాన్ ఆర్టీఏ ఆఫీసర్. ‘వచ్చి లైసెన్స్ తీసుకెళ్లమ్మా..’ అని ఫోన్ చేశాడు. వెళ్లి లైసెన్స్ తెచ్చుకుని.. ‘థ్యాంక్యూ మిస్టర్ ఇమ్రాన్’ అని ట్వీట్ చేసింది. ఆర్టీఏ ఇమ్రాన్‌కి కాదు, పీఎం ఇమ్రాన్‌కి. ట్విట్టర్ వచ్చాక దేశ ప్రధానులు తప్ప ఎవరూ అందుబాటులో ఉండటం లేదు. మన మోడీనే చూడండి. ‘కువ’ అని పలకరిస్తే చాలు.. ‘కువ కువ’ అని బదులిస్తున్నారు! @ImranKhanPTI Can a woman not ride a bike in Pakistan? I'm being told by the License Office that they do not issue bike riding licenses to women. They said and I quote: "Larkiyo ko bike ka license nahi dete, aap gaari chalaye." Why? What kind of rule is this? Please respond. — Shireen Ferozepurwalla (@SFerozepurwalla) September 14, 2020 -
డ్రైవర్లకు ఆంక్షలు.. మహిళలతో మాటలు వద్దు
సాక్షి, చెన్నై : డ్రైవర్లకు రవాణా సంస్థ ఆంక్షలు విధించింది. ముందు సీట్లో మహిళలు కూర్చుంటే వారితో మాట్లాడ కూడదని, బ్యానెట్‌పై ఎవ్వర్నీ కూర్చోబెట్టకూడదన్న ఆంక్షల చిట్టాను విడుదల చేసింది. రాష్ట్రంలో చెన్నై, మదురై, తిరునల్వేలి, తిరుచ్చి, కోయంబత్తూరు, విల్లుపురం, తిరునల్వేలి, కుంభకోణం డివిజన్లుగా రవాణా సంస్థ బస్సుల సేవలు సాగుతున్నాయి. 22 వేల మేరకు బస్సులు నిత్యం రోడ్డుపై పరుగులు తీస్తున్నాయి. ప్రధానంగా బస్సుల్ని నడిపే సమయంలో డ్రైవర్లు అత్యధికంగా సెల్ఫోన్లను ఉపయోగిస్తున్నట్టుగా వీడియో ఆధారాలు సైతం వెలుగులోకి వచ్చాయి. దీంతో సెల్ఫోన్ల వాడకంకు తగ్గ ఆంక్షలు విధించినా, అమలు చేసే డ్రైవర్లు అరుదే. అలాగే, ముందు సీట్ల మహిళలు కూర్చుంటే, వారితో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం లేదా బ్యానెట్‌పై మహిళలను కూర్చొబెట్టి మాట్లాడడం వంటి చర్యలకు అనేక మంది డ్రైవర్లు పాల్పడుతున్నట్టుగా ఫిర్యాదులు రవాణా సంస్థకు వచ్చి చేరాయి. ఈ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నట్టు పరిశీలనలో తేలింది. దీంతో డ్రైవర్లకు ఆంక్షల చిట్టాను రవాణా సంస్థ ప్రకటించింది. సెల్ వాడకానికి విధించిన ఆంక్షలను కఠినత్వం చేస్తూ, ఇక, మీదట ముందు సీట్లో› మహిళలు కూర్చున్న పక్షంలో వారితో మాట్లాడకూడదని, ప్రధానంగా ఇంజిన్ బ్యానెట్‌పై మహిళలను కూర్చోబెట్టకూడదన్న ఆంక్షలు ఈ జాబితాల ఉన్నాయి. అయితే, వీటిని డ్రైవర్లు అనుసరించేనా అన్నది వేచి చూడాల్సిందే. -
ఆర్టీఏలో 'మోనార్క్'
రోడ్డు రవాణా శాఖలో ఓ ఉన్నతాధికారి మోనార్క్ పాలన సాగిస్తున్నాడు. కాసుల కోసం చేయి తిరిగిన సిబ్బందికి దగ్గరలోనే విధులు కేటాయించడం, నిక్కచ్చిగా ఉన్న వారిని దూరప్రాంతాలకు పంపడం పరిపాటిగా మారుతోంది. చిరుద్యోగులతో అనధికారిక విధులు చేయిస్తుండడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. మొత్తం ఈ వ్యవహారం వెనుక ఓ కానిస్టేబుల్ తతంగం నడిపిస్తుండడం గమనార్హం. అనంతపురం సెంట్రల్: రోడ్డు రవాణాశాఖలో అవినీతి అక్రమాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అధికారి దారితప్పిన ఓ ఉద్యోగిని చేరదీశాడు. దీని వెనుక అసలు కథ చాలానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సదరు అధికారి అవసరాలన్నీ ఆ కానిస్టేబులే చూసుకుంటున్నాడు. గతంలో ఇతని ఉచ్చులో పడిన అధికారులు బలి పశువులయ్యారు. ఓ షోరూంలో పనిచేసే మహిళతో అక్రమ వ్యవహారంలో పడి ఓ అధికారి విలవిలలాడిపోయారు. రూ. లక్షలు చెల్లించి కేసు రాజీ చేసుకోవాల్సి వచ్చింది. తాజాగా బదిలీ వేటు పడిన అధికారి గానా బజానా ఏర్పాటు చేయడం.. దానికి ఓ షోరూం నిర్వాహకుడు ఫైనాన్స్ చేయడం వెనుక సదరు కానిస్టేబుల్ ఉన్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం పెద్ద దూమారం రేగి రాష్ట్ర అధికారుల వరకు వెళ్లింది. దీంతో ఉన్నతాధికారిపై బదిలీ వేటు పడింది. ఇంట్లో పనిమనిషిగా సెక్యూరిటీ గార్డు సదరు అధికారి ఇంట్లో పనిమనిషిగా ఓ సెక్యూరిటీ గార్డు ఏడెనిమిది నెలలుగా పనిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సోము అనే సెక్యూరిటీ గార్డు కార్యాలయానికి రావడమే మానేశాడు. ఉదయం పాల ప్యాకెట్లు తెచ్చే దగ్గర నుంచి అన్ని పనులూ అతనే చూసుకుంటున్నట్లు సమాచారం. ఆయన విధులు మాత్రం మిగతా సెక్యూరిటీ గార్డు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు పనిభారం అవుతోందని చిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉంటే హోంగార్డుల అత్యాశను సదరు అధికారి అలుసుగా తీసుకొని ఉన్నతాధికారుల వద్ద మార్కులు కొట్టేసే పనిలో పడ్డారు. ఆర్టీఏలో పని చేసే ప్రతి ఒక్కరూ చెక్‌పోస్టులో పనిచేయాలని కోరుకుంటారు. రోజూ రూ.లక్షల్లో అక్రమ ఆదాయం ఉంటుంది. అక్కడ పనిచేస్తే అందులో అందరికీ సమానంగా వాటాలు వస్తాయి. అక్కడికిపోవాలని కోరుకునే సిబ్బందికి ముందుగా విజయవాడ టర్న్ డ్యూటీకి వెళ్లాల్సి ఉంటుందని మెలిక పెట్టారు. దీంతో కొంతమంది వేలకు వేలు ఖర్చు పెట్టుకొని విజయవాడలో అధికారుల వద్ద పనిచేసి వస్తున్నారు. ఇలా అనేక విషయాల్లో అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. ♦ తాజాగా సదరు కానిస్టేబుల్ అంతా తానై ఆర్టీఏను నడిపిస్తున్నాడు. ఆర్టీఏలో ఏ అధికారిని ఎక్కడ పెట్టాలి... జిల్లా కేంద్రంలో ఎవరుండాలి... తదితర అంశాలపై ఆ కానిస్టేబుల్ సలహా తీసుకునే అధికారి నడుచుకుంటున్నారు. గతంలో అనేక ఏళ్లుగా ఇక్కడే తిష్టవేసి పనిచేస్తుండడంతో గతంలో సాక్షిలో కథనం రావడంతో అప్పటి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాడు. నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకోసారి జిల్లాలోనే ఇతర ఆర్టీఏ కార్యాలయాల వెళ్లాల్సి ఉంది. కాగా ఇటీవల మళ్లీ చక్రం తిప్పడం మొదలుపెట్టాడు. ఇటీవల అనంతపురం నుంచి తాడిపత్రికి వెళ్లాడు. ఇప్పుడు తిరిగి అనంతపురానికి వచ్చాడు. తొలుత ఓ ఎంవీఐకి అటాచ్ చేశారు. అక్కడ ఎక్కువ ఆదాయం ఉండదనుకున్నాడో ఏమో రెండు రోజుల్లో అక్కడే మరో ఎంవీఐకి ఆగమేఘాలపై బదిలీ చేయించుకున్నాడు. మిగిలిన వారికి మాత్రం గుంతకల్లు, హిందూపురం, కదిరి ప్రాంతాలకు తప్పనిసరిగా బదిలీ చేస్తున్నారు. అవినీతిపరుడిగా ముద్రపడిన ఇతడికి ఇటీవల ఉత్తమ అధికారిగా సత్కారం చేయడం గమనార్హం. -
జేసీ ట్రావెల్స్‌కు ఆర్టీఏ షాక్
-
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ కొరడా
కృష్ణాజిల్లా : పండగ వేళ తీవ్ర రద్దీగా ఉన్న సమయంలో.. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు. మంగళవారం రాత్రి ఆర్టీఏ అధికారి ఎంవీఐ ప్రవీణ్ అధ్వర్యంలో ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద విజయవాడ జాతీయ రహదారిపై స్పెషల్‌డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 36 బస్సులను గుర్తించి.. కేసులు నమోదు చేశారు. మార్నింగ్ స్టార్, ఎస్వీఆర్, ఆరెంజ్, కావేరి ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్, విజయవాడ వైపు వెళ్తున్న 80కి పైగా బస్సులును తనిఖీ చేసిన అధికారులు ప్రయాణికుల వద్ద అధిక డబ్బులు వసూలు చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై కేసులు నమోదు చేశారు. -
బస్సులపై ఆర్టీఏ కొరడా
-
సారూ.. అధికలోడ్ లారీలను అరికట్టరూ!
సాక్షి, సిటీబ్యూరో: రహదారులను పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తున్న ఓవర్‌లోడ్ లారీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నగరానికి చెందిన ఓ కార్పొరేటర్ ఇబ్రహీంపట్నం ఆర్టీఏ అధికారులను వేడుకున్న తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెద్ద అంబర్పేట్ వద్ద సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తున్న మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ సాయిబాబా కాళ్లపైన పడి అభ్యర్ధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పరిమితికి మించిన బరువుతో ప్రతిరోజూ వందలకొద్దీ లారీలు ఔటర్‌రింగ్ రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయని, దీంతో రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమవుతున్నాయని హయత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పలుమార్లు ఇబ్రహీంపట్నం ఆర్టీఏ అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. సోమవారం కంకర, డస్ట్ లారీల అసోసియేషన్లతో కలిసి పెద్ద అంబర్పేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో ఆ రహదారిపై అధికలోడ్‌తో లారీలు వెళ్తున్నాయని ఆర్టీఏ అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో ఎంవీఐ సాయిబాబా ఆధ్వర్యంలో ఆర్టీఏ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఓవర్‌లోడ్ లారీలు రాకపోకలు సాగిస్తున్నాయని, వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కార్పొరేటర్ అధికారులను నిలదీశారు. అనేకసార్లు అధికారులను కలిశామని, ఇప్పటికైనా వాటిని అడ్డుకోవాలని కోరుతూ ఎంవీఐ సాయిబాబా కాళ్లపై పడ్డారు. ఇదంతా వీడియోలో రికార్డు చేసి వాట్సప్, ఫేస్బుక్లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఓవర్‌లోడ్ వాహనాలపైన త్వరలోనే మంత్రులు కేటీఆర్, మహేందర్రెడ్డిలను సైతం సంప్రదించనున్నట్లు ఈ సందర్భంగా కార్పొరేటర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. తాము ఓవర్‌లోడ్ వాహనాలను ఏ మాత్రం ఉపేక్షించడం లేదని, ఇప్పటి వరకు 300కుపైగా వాహనాలపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నామని ఇబ్రహీంపట్నం ప్రాంతీయ రవాణా అధికారి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. -
రవాణా శాఖ ఏవో ఇంటిపై ఏసీబీ దాడులు
సాక్షి, నెల్లూరు : నెల్లూరు రవాణా శాఖ కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న బొల్లాపల్లి శేషాద్రి కృష్ణకిశోర్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలు రావడంతో శేషాద్రి కృష్ణకిశోర్ ఇంట్లోనేగాక ఆయన బంధువులు, స్నేహితులకు చెందిన ఇళ్లల్లో ఏడుచోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఒంగోలు, నరసరావుపేట, పిడుగురాళ్ల, విశాఖ, గుంటూరులోని కృష్ణకిశోర్ కుటుంబసభ్యుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అంతేగాక విజయవాడ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ కార్యాలయంలోని కృష్ణకిశోర్ ఆఫీసులోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
‘మొదటి’కే మోసం...
♦ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌లో గందరగోళం ♦ పేర్ల నమోదులో లోపించిన శాస్త్రీయత ♦ ఏ రెండు పేర్లు కలిసినా తప్పని ఇబ్బందులు ♦ ముప్పుతిప్పలు పెడుతున్న ఆర్టీఏ అధికారులు ♦ ‘సాంకేతిక వైఫల్యం’ సాకు.. సాక్షి,సిటీబ్యూరో : రాంనగర్‌కు చెందిన కల్లూరి వసంత... తాను కొత్తగా కొనుగోలు చేసిన మారుతి స్విఫ్ట్ డిజైర్ రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లారు. అప్పటికే ఆమె పేరిట ఒక ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ అయి ఉందని, తాజాగా రెండో వాహనం (కారు) రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రెండు శాతం జీవితకాల పన్ను అదనంగా చెల్లించాలని అధికారులు సెలవిచ్చారు. దాంతో ఆమె విస్మయానికి గురయ్యారు. ఇప్పటి వరకు ఎలాంటి వాహనాలు కొనుగోలు చేయలేదని, ఇదే మొట్టమొదటి వాహనమని చెప్పారు. కానీ ఆర్టీఏ అధికారులు అంగీకరించలేదు. గతంలో తనకు ఎలాంటి వాహనాలు లేవని స్వతహాగా నిరూపించుకొంటే తప్ప అదనపు పన్ను రద్దు చేయబోమన్నారు. ఇంకేముంది. 2 నెలల పాటు నగరంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో వడపోసి బహదూర్‌పురాకు చెందిన తన లాంటి పేరే ఉన్న మరో మహిళ కు హోండా యాక్టివా ఉన్నట్లు నిరూపించారు. అలా ఆమె ఎంతో సంతోషంగా కొనుక్కొన్న కారు రిజిస్ట్రేషన్ కావడానికి ఏకంగా 2 నెలలు పట్టింది. ఇది ఒక్క వసంత సమస్య కాదు. నగరంలోని వేలాది మంది ఎదుర్కొంటున్న సమస్య.కంఫ్యూటర్లో వాహనదారుల వివరాలను నమోదు చేయడంలోని అశాస్త్రీయత, అసమగ్రత, సాంకేతిక లోపాల కారణంగా ఒకే తరహా ఇంటిపేర్లు, వ్యక్తుల పేర్లు ఉన్న వాహనదారుల పాలిట ‘ సెకెండ్ వెహికిల్’ ఒక వేధింపుగా మారింది. ఎందుకిలా... మోటారు వాహన చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ వాహనాలను కలిగి ఉంటే రెండో వాహనం ఖరీదులో ద్విచక్రవాహనం అయితే 5 శాతం, కారు అయితే 2 శాతం చొప్పున జీవితకాలపన్ను చెల్లించాలి. కానీ కొంతమందికి మొదటి వెహికిల్ లేకపోయినప్పటికీ కొత్తగా కొనుగోలు చేసిన దాన్ని సెకెండ్ వెిహ కిల్‌గా పరిగణించి పన్ను చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇందుకు ఆర్టీఏ అధికారులు ఆన్లైన్లో నమోదైన వివరాలను ఆధారంగా చూపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి రోజు సుమారు 1500 వాహనాలు రిజిస్ట్రేషన్ అయితే, వాటిలో 25 శాతం వాహనాలపై వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. 2009 నుంచి 2013 వరకు దశలవారీగా ప్రవేశపెట్టిన త్రీటైర్ సాంకేతిక పరిజ్ఞానం కారణంగా తలెత్తిన దుష్ఫలితం ఇది. టూటైర్ సాంకేతిక పరిజ్ఞానం నుంచి టూటైర్లోకి మారుతున్న దశలో వాహనాల వివరాలను శాస్త్రీయంగా న మోదు చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో ఒకే పేరు ఉన్న ఇద్దరు వ్యక్తులు వాహనాల రిజిస్ట్రేషన్‌కు వెళ్లినప్పుడు ఇలాంటి సమస్యను ఎదుర్కోవలసి వస్తోంది. ఆనంద్‌నగర్‌కు చెందిన ఒక వాహనదారుడు కొత్తగా కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్‌కు వెళ్లాడు. అప్పటికే ఒక వాహనం అతని పేరిట ఉన్నట్లు అధికారులు యదావిధిగా చెప్పారు. నల్గొండలోని రామన్నపేటకు చెందిన తన ఇంటిపేరే కలిగిన మరో వ్యక్తి వివరాలను సేకరించి తెస్తే తప్ప అధికారులు అతని వాహనం రిజిస్ట్రేషన్ చేయలేదు. ఏజెంట్లు, దళారులను ఆశ్రయించి వచ్చే వారికి మాత్రం మినహాయింపు లభించడం కొసమెరుపు... -
ఆర్టీఏ అధికారిపై ట్రావెల్స్ యజమాని దాడి
కర్నూలు: ప్రైవేటు ట్రావెల్ యజమానుల ఆగడాలకు హద్దులేకుండా పోతోంది. తనిఖీలు చేస్తున్న ట్రాన్స్పోర్ట్ అధికారులపై దాడులకు కూడా వెనుకాడటంలేదు. పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద తనిఖీ చేస్తున్న ఆర్టీఏ అధికారి శివరామకృష్ణపై ప్రొద్దుటూరుకు చెందిన శ్రీలక్ష్మీ ట్రావెల్స్ యజమాని దాడి చేశాడు. ఆర్టీఏ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రైవేటు బస్సుల యజమానులు ఇటీవల కాలంలో అక్రమంగా బస్సులను తిప్పడం ఎక్కువైపోయింది. బస్సు ప్రమాదాలు కూడా ఎక్కువయ్యాయి. దాంతో ఆర్టీఏ అధికారులు ముమ్మరంగా దాడులు చేస్తున్నారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అయితే ప్రైవేటు బస్సుల యజమానులు, డ్రైవర్లు కూడా ఆర్టీఏ అధికారులు, సిబ్బందిపై దాడులకు తెగబడుతున్నారు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు బస్సు డ్రైవర్ ఆర్టీఏ ఉద్యోగి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అతనిని గాయపరిచాడు.